
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 37 గా నమోదైంది. మంగళవారం తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా భూకంపం సంభవించినట్లు తెలిపింది నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ.
భూమి ఉపరితలానికి 5 కి.మీ లోతున భూకంపం సంభవించిందని వారు తెలిపారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్టుగా అనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు చెబుతున్నారు స్థానికులు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఎంపీగా లోక్‌సభలోకి రాహుల్