అమెరికాలోని కాలిఫోర్నియాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. లాస్ ఏంజెల్స్‌లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం బార్‌స్టో సమీపంలో ఉంది. కాలిఫోర్నియాలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విపత్తు కారణంగా చోటుచేసుకున్న ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
యూఎస్ టుడే అందించిన వివరాల ప్రకారం శాన్ బెర్నార్డిగో కౌంటీతో పాటు, లాస్ ఏంజిల్స్, కెర్న్, రివర్‌సైడ్, ఆరెంజ్ కౌంటీలలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. కాలిఫోర్నియాలోని ప్రజలు భూకంపానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే వారి అనుభవాలను తెలియజేశారు.
భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని బార్‌స్టో ఫైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్ బెటాలియన్ చీఫ్ ట్రావిస్ ఎస్పినోజా తెలిపారు. లాంగ్ బీచ్ మేయర్ రెక్స్ తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటివరకు నగరంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment