![Earthquake of Seven Magnitude hits Russia](/styles/webp/s3/article_images/2024/08/18/russia.jpg.webp?itok=i49SCG6L)
రష్యాలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఇది చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడుగా నమోదైంది. భూకంప కేంద్రం తూర్పు కంచట్కా ద్వీపకల్ప తీరంలో ఉందని వెల్లడయ్యింది. ఈ భూకంపం దరిమిలా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు.
భూకంపం అంటే భూమిలోని క్రస్ట్ పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు ప్రకంపనలు పుట్టించే తరంగాలు విడుదలవుతాయి. క్రస్ట్‌లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు అది బలహీన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా భూకంపాలు ఏర్పడుతాయి. అయితే భూకంప తీవ్రత అధికంగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకూ విస్తరిస్తాయి.
Magnitude 7.0 earthquake strikes off #Russia, tsunami warning issued: #US monitors. https://t.co/eLyx1YCU4L pic.twitter.com/wWvMMnmKZb
— Arab News (@arabnews) August 17, 2024
![](/sites/default/files/inline-images/18_11.png)
Comments
Please login to add a commentAdd a comment