లఢక్‌లో భూకంపం.. ఉత్తరభారతంలో ప్రకంపనలు | Earthquake Of Magnitude 5.5 In Ladakh Kargil | Sakshi
Sakshi News home page

లఢక్‌లో భూకంపం.. ఉత్తరభారతంలో ప్రకంపనలు

Published Mon, Dec 18 2023 5:01 PM | Last Updated on Mon, Dec 18 2023 5:20 PM

Earthquake Of Magnitude 5.5 In Ladakh Kargil - Sakshi

లఢక్: లఢక్‌లోని కార్గిల్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కార్గిల్‌లో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి.

రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నెలకొని ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి.
ఈరోజు తెల్లవారుజామున పాకిస్థాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఇదీ చదవండి: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement