tremors
-
దక్షిణ కొరియాలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు
దక్షిణ కొరియాలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు బువాన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. ఈ వివరాలను వాతావరణ శాఖ మీడియాకు తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైనట్లు పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ దక్షిణ కొరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే. అయితే ఈ భూకంపం కారణంగా నష్టం వాటిల్లినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదు. నార్త్ జియోల్లా ప్రావిన్స్‌లోని అగ్నిమాపక శాఖ అధికారి జో హే-జిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపానికి సంబంధించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి సుమారు 80 కాల్స్ వచ్చాయన్నారు. ఈ భూకంపం కారణంగా బువాన్లో ఓ ఇంటి గోడ కూలిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.భూకంపాలను వాటి తీవ్రత పరంగా వివిధ వర్గాలుగా విభజిస్తారు. 2.5 నుండి 5.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు మైనర్ కేటగిరీలో ఉంటాయి. 5.5 నుండి 6 తీవ్రతతో వచ్చే భూకంపం స్వల్ప స్థాయిలో ప్రమాదకరమైన భూకంపంగా పరిగణిస్తారు. 6 నుండి 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లయితే, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 7 నుండి 7.9 తీవ్రతతో సంభవించే భూకంపాలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. -
Earthquake: ఢిల్లీలో భారీ భూప్రకంపనలు
ఢిల్లీ: పొరుగు దేశం చైనాలో భారీ భూకంపంతో.. మన దేశ రాజధాని ప్రాంతం వణికిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు చోటు చేసుకోగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. చైనా దక్షిణ ప్రాంతం జిన్జియాంగ్లో రిక్టర్ స్కేల్‌పై 80 కిలోమీటర్ల లోతున 7.2 తీవ్రతతో భూమి కంపించింది. ఆ ప్రభావం ఢిల్లీతో పాటు ఎన్సీఆర్(National Capital Region)లోనూ కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. Earthquake of Magnitude:7.2, Occurred on 22-01-2024, 23:39:11 IST, Lat: 40.96 & Long: 78.30, Depth: 80 Km ,Location: Southern Xinjiang, China for more information Download the BhooKamp App https://t.co/FYt0ly86HX@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/E184snmSyH — National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2024 ఇదిలా ఉంటే.. చైనా భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. అక్కడ వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 🔺#Breaking :A 7.1-magnitude #earthquake jolted Wushi County in Aksu Prefecture in northwest China's #Xinjiang Uygur Autonomous Region at 2:09 a.m. on Jan 23 (Beijing Time), according to the China Earthquake Networks Center. Stay Safe‼️ pic.twitter.com/GE9vkkMuCh — Record GBA (@RecordGBA) January 23, 2024 మరోవైపు.. దేశ రాజధాని ప్రాంతం తరచూ భూ ప్రకంపనలకు కేంద్రంగా ఉంటోంది. పొరుగు దేశాల్లో ఎక్కడ భూమి కంపించినా .. ఏ స్థాయిలో ప్రకంపనలు సంభవించినా.. ఆ ప్రభావం ఢిల్లీ రీజియన్‌లో కనిపిస్తోంది. జనవరి 11వ తేదీన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో 6.1 తీవ్రతతో అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. పాకిస్థాన్‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అంతకు ముందు నేపాల్ భూకంప ప్రభావమూ కనిపించింది. -
లఢక్‌లో భూకంపం.. ఉత్తరభారతంలో ప్రకంపనలు
లఢక్: లఢక్‌లోని కార్గిల్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కార్గిల్‌లో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. An earthquake of magnitude 5.5 on the Richter Scale hit Kargil, Ladakh at around 3:48 pm today: National Center for Seismology pic.twitter.com/Z5bBYur7y4 — ANI (@ANI) December 18, 2023 రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నెలకొని ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. ఈరోజు తెల్లవారుజామున పాకిస్థాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదీ చదవండి: వర్ష బీభత్సం.. గంటల వ్యవధిలోనే రికార్డ్ వర్షపాతం -
ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు
ఢిల్లీ: దేశ రాజధానితో సహా ఉత్తర భారతంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం సాయంత్రం 4:18 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. నేపాల్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతంలో భూమి వణికింది. Earthquake tremors felt in Delhi. Details awaited. pic.twitter.com/nRMLKZ9DdK — ANI (@ANI) October 15, 2023 గత నాలుగు రోజుల్లో వరుసగా మూడో సారి భూమి కంపించింది. ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో సామాగ్రి కిందపడిపోయిందని స్థానికులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు తెలిపారు. Earthquake measuring 5.6 on the Richter scale struck Nepal at 1616 hours today, says National Center for Seismology (NCS). — ANI (@ANI) November 6, 2023 ఇదీ చదవండి: మహిళా అధికారి హత్య కేసులో మాజీ డ్రైవర్ అరెస్టు -
ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ భారీగా భూప్రకంపనలు
ఢిల్లీ: నేపాల్‌లో 6.4 తీవ్రతతో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం.. అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఉత్తర భారతం వణికిపోయింది. నేపాల్‌లో భూకంప నమోదు ప్రాంతానికి 500 కి.మీపైగా దూరంలో ఉన్న ఉత్తర భారత దేశంలోనూ ఈ ప్రభావం కనిపించింది. ఢిల్లీతో పాటు యూపీ, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. సుమారు 20 సెకన్ల పాటు భారీగానే భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌తో పాటు యూపీ ప్రయాగ్‌రాజ్, ఫరీదాబాద్, గురుగ్రామ్, భాగ్‌పట్, వారాణాసి, సుల్తాన్పూర్, కుషీనగర్, గోరఖ్‌పూర్, మీర్జాపూర్‌లోనూ ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. North India including bihar patna , delhi ncr , Gurgaon , haryana and Nepal hit by a scary earthquake.#earthquake #Delhi #Nepal #DelhiNCR #Noida #Tremors #भूकंप #Bihar #Patna #lucknow pic.twitter.com/TK72oCKfOV — Dr. Shivam dubey (@ShivamdubeYspn) November 4, 2023 #WATCH | Bihar: People come out of their homes as tremors felt in Patna pic.twitter.com/PoINrMXIA1 — ANI (@ANI) November 3, 2023 -
నేపాల్ భారీ భూకంపం: 140కి చేరిన మృతుల సంఖ్య
ఖాట్మాండు: నేపాల్ పెను భూకంపం (Nepal earthquake).. పలువురిని పొట్టనబెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటిదాకా 140 మృతదేహాల్ని వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. గాఢనిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో.. ప్రాణాల కోసం పరుగులు తీసేందుకు అవకాశం కూడా లేకపోయింది. రుకమ్, జజర్‌కోట్‌లో ఇళ్లు వందల సంఖ్యలో నేలమట్టం అయ్యాయి. శిథిలాలు తొలగిస్తోన్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. గాయపడిన వాళ్ల సంఖ్య వందల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదీ చదవండి: భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం? నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. రాత్రి దాటాక సంభవించిన భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. జనం రాత్రంతా రోడ్లపైనే గడిపారు. పైగా అర్ధరాత్రి కావడంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు. ఉదయం నుంచి సహాయక చర్యలు తీవ్రతరం చేశారు. నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగగా.. భూకంప బాధిత ప్రాంతాలల్లో ప్రధాని పుష్ప కమల్ పర్యటించనున్నట్లు సమాచారం. క్షతగ్రాతుల రోదనలతో ఆస్పత్రుల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. More then 128 people died and above 500 were injured after a strong 6.4 magnitude earthquake in Nepal... #Nepal #NepalEarthquake #earthquakenepal #earthquake #BREAKING_NEWS #latestnews #NepalNews #Jajarkot #Kathmandu pic.twitter.com/6c4MILmvaY — Vikas Bailwal (@VikasBailwal4) November 4, 2023 Tragedy strikes again in #Nepal . A powerful 6.4-magnitude earthquake claims 129 lives, above 500 reported injured shaking northwestern districts. Prayers for #Nepal 🙏🙏 #NepalEarthquake #earthquake pic.twitter.com/6rjl3A3vm3 — Stranger (@amarDgreat) November 4, 2023 नेपाल के जजरकोट में कल रात आए भूकंप से के कारण काफी नुकसान हुआ। तबाही की तस्वीरें...#earthquakes #NepalEarthquake pic.twitter.com/lKWK5nxg7x — Kuldeep Raghav 🇮🇳 (@ImKuldeepRaghav) November 4, 2023 రుకమ్ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ.. మృతదేహాలు అక్కడ మరిన్ని బయటపడుతున్నాయి. నిన్న రాత్రి భూకంపం సంభవించడంతో సహాయ చర్యలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ భూకంపాలు సహజమే! భూకంపాల జోన్లో ఉన్న హిమాలయా దేశం నేపాల్‌లో ప్రకంపనలు సర్వసాధారణమే. తక్కువ తీవ్రతతో ప్రకంపనలు సంభవించినప్పటికీ.. ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంటాయి అక్కడ. ఇక్కడ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్లోకి నెట్టి హిమాలయాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల భూకంపాలు సంభవించడం సర్వ సాధారణంగా మారింది. గత నెలవ్యవధిలోనే మూడు భూకంపాలు(పెద్దగా నష్టం వాటిల్లలేదు) సంభవించాయక్కడ. అక్టోబర్ 3వ తేదీన రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంపైనా ప్రభావం చూపించింది. ఇక కిందటి ఏడాది నవంబర్‌లో దోతీ జిల్లాలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆరుగురిని బలిగొంది. అయితే.. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం మాత్రం నేపాల్ చరిత్రలోనే పెను విషాదాన్నే మిగిల్చింది. నాటి భూకంపంలో 12 వేల మందికి పైగా మరణించగా.. పదిలక్షల భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇదీ చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే.. భారత ప్రధాని దిగ్భ్రాంతి నేపాల్ భారీ భూకంపం, భారీగా ప్రాణ నష్టం సంభవించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది అని ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నేపాల్‌లో భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి బాధగా ఉంది. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు యావత్ భారతదేశం సంఘీభావం ప్రకటిస్తోంది. సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారాయన. అలాగే మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించిన ప్రధాని మోదీ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. Deeply saddened by loss of lives and damage due to the earthquake in Nepal. India stands in solidarity with the people of Nepal and is ready to extend all possible assistance. Our thoughts are with the bereaved families and we wish the injured a quick recovery. @cmprachanda — Narendra Modi (@narendramodi) November 4, 2023 ఇవీ కూడా చదవండి: నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక! నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే.. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏమిటి? -
Earthquake: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి..
పెరు, ఈక్వెడార్‌లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా మచాలా, క్యుయెన్సా నగరాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. భూప్రకంపనల ధాటికి జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా మొత్తం 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈక్వెడార్ అధ్యక్షుడు గ్విల్లెర్మో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మచాలాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇతర నగరాలను కూడా సందర్శిస్తానని చెప్పారు. చదవండి: కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది -
Turkey–Syria Earthquakes 2023: ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు
భారీ భూకంపాలు. ఊగిపోతూ పేక మేడల్లా కూలిన భారీ భవనాలు. వాటి కింద చిధ్రమైన బతుకులు.. విగతజీవుల్ని చూసి మిన్నంటుతున్న అయినవాళ్ల రోదనలు. సాయం కోసం శిథిలాల కిందే ఆర్తనాదాలతో ఎదురుచూపులు. ఈలోపు గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు. వెరసి.. సోమవారం సంభవించిన విలయం రెండు దేశాల్లో 4 వేలకు పైనే ప్రాణాలను బలిగొంది. 7.8, 7.6, 6.0 రిక్టర్ స్కేల్‌పై నమోదు అయిన భూకంప తీవ్రత. 20 సార్లు శక్తివంతమైన ప్రకంపనలు. ఊరు, పట్టణాలనే తేడా లేకుండా మరు భూములుగా మారిపోయాయి. టర్కీ, సిరియాలో ధరిత్రీ ప్రకోపానికి భారీగా ప్రాణ-ఆస్తి నష్టమే వాటిల్లింది. బిల్డింగ్‌ల శిథిలాల కింద నలిగిపోయిన బతుకులు.. గాయపడి సాయం కోసం కొందరు పెడుతున్న కేకలు.. తమ వాళ్లు ఏమైపోయారో అనే ఆందోళనతో మరికొందరు చేస్తున్న ఆర్తనాదాలు.. ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. టర్కీలో.. రోడ్లు దెబ్బతినడం, కరెంట్-ఇంటర్నెట్ సేవలకు అంతరాయంతో పాటు చాలాచోట్ల మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడడంతో.. రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రకృతి విలయం చేసిన గాయంతో.. వారం పాటు సంతాప దినాలు ప్రకటించుకుంది టర్కీ. పాశ్చాత్య, అగ్ర దేశాలతో పాటు భారత్ సహా మొత్తం పన్నెండు దేశాలు టర్కీకి తక్షణ సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే రిలీఫ్ మెటీరియల్‌ను టర్కీకి పంపించాయి కూడా. వేల మంది ఇంకా శిథిలా కిందే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) టర్కీలో.. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ దేశాల్లో ప్రకంపనల ప్రభావం కనిపించిందంటే.. టర్కీ, సిరియాల్లో సంభవించిన విలయం ఎంతటి శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు దేశాల్లోనూ శిథిలాల చిక్కుకున్న వాళ్లను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో.. ఇప్పటిదాకా 4వేలకు పైగా మృతదేహాలను వెలికి తీశారు. టర్కీ చరిత్రలోనే ఇది భారీ భూకంపంగా నమోదు కాగా.. అధికంగా మృతుల సంఖ్య కూడా ఇక్కడే నమోదు అయ్యిందని తెలుస్తోంది. భారీ ప్రకంపనల ధాటికి సెకన్ల వ్యవధిలోనే వందల సంఖ్యలో భవన సముదాయాలు కుప్పకూలడం ఒక ఎత్తయితే.. అర్ధరాత్రి అంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. సిరియాలో.. ఇదిలా ఉంటే.. 8వేల మందిని శిథిలాల నుంచి సురక్షితంగా రక్షించినట్లు అత్యవసర విభాగపు అధికారులు ప్రకటించుకున్నారు. సోమవారం నాటి భూకంపం ధాటికి 14వేల పైనే గాయపడగా.. వీళ్లలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిరియాలోనూ క్షతగాత్రులు నాలుగు వేల మందికి పైనే ఉండొచ్చని అనధికార లెక్కలు చెప్తున్నాయి. సిరియాలో.. టర్కీ ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప జోన్లలో ఒకటి. భూగర్భంలోని వైవిధ్యతే అందుకు కారణం!. అందుకే భవన నిర్మాణాల విషయంలో ప్రామాణికత పాటించాలని అక్కడి నిపుణులు సూచిస్తుంటారు. 1939లో తూర్పు ఎర్జింకన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించి.. 33,000 మంది మరణించారు. డజ్సే ప్రాంతంలో 1999లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 17,000 మందికి పైగా మరణించారు. ముఖ్యంగా ఇస్తాంబుల్‌లో 16 మిలియన్ల జనాభాతో.. ఇరుకు ఇరుకు ఇళ్లతో ఉంటుంది. భారీ భూకంపాలు వస్తే.. ఇస్తాంబుల్ సర్వనాశనం అవుతుందని నిపుణులు ఎన్నో ఏళ్ల నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ, అక్కడి జనం, అధికార యంత్రాంగం ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా భారీ భారీ బిల్డింగ్లు కడుతూ వస్తున్నారు. In a world where HUMANITY actually mattered, #Turkey would’ve invested in #earthquake resistant construction in #Kurdish areas, but alas—the death of 1000s of Kurds is a gift 2the Turkish govt & nationalists who have made it their life mission to eradicate the Kurdish population pic.twitter.com/CFodWAFd6p — Samira Ghaderi (@Samira_Ghaderi) February 6, 2023 ఇక సిరియా సైతం భూకంప ప్రభావిత ప్రాంతమే. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రాంతాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. పైగా విషాదానికి ముందే అలెప్పోలోని(రష్యా యుద్ధ స్థావర కేంద్రం కూడా) భవనాలు కొన్ని కూలిపోతూ వస్తున్నాయి. అయినా అధికారులు ముందు జాగ్రత్త పడలేదు. అయితే ఇళ్ల నుంచి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు చాలామంది. ఇక సహజ వాయువు నిక్షేపాల ప్రాంతం కావడంతో.. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాయువుల సేకరణను, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో.. మరింత నష్టం జరగకుండా మాత్రం నిలువరించగలిగారు. శవాల దిబ్బలుగా టర్కీ, సిరియా (ఫొటోలు) -
టర్కీ, సిరియా భూకంపం: 2600 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీ(తుర్కియే), సిరియా భూకంపం విపత్తు స్థితిని ఏర్పరిచింది. భారీ భూకంపం దాటికి 2600 మందిదాకా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వేల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2200కు పైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్లు కూలిపోవడం, అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ప్రజలు ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. స్వల్ప వ్యవధిలో భారీగా రెండుసార్లు భూమి కంపించడం.. ఆ ప్రభావంతో రెప్పపాటులో పలు బహుళంతస్థుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చారిత్రాత్మకంగా.. కేంద్రం చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపమని టర్కీ నేషనల్ భూకంప కేంద్రం చీఫ్ రాయిద్ అహ్మద్ రేడియో ద్వారా ప్రకటించారు. టర్కీ, సిరియాలో ఎంతెంత మంది మరణించారనే సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది. సిరియాలో 300 మంది దాకా మృతి చెందినట్లు ఒక అనధికార ప్రకటన వెలువడింది. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో.. చాలామంది శిథిలాల కిందే సమాధి అయినట్లు భావిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ ఝామున రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోగ్రాఫికల్ సర్వీస్ వెల్లడించింది. ఆపై పావుగంటకు 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. తుర్కియే గజియాన్టెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. సిరియాకు సరిహద్దుగా ఉండే గజియాన్టెప్ ప్రాంతం.. తుర్కియేకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రం కూడా. భూకంపం ప్రభావంతో.. లెబనాన్, ఈజిప్ట్, సైప్రస్‌లోనూ ప్రకంపలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ మూడు చోట్ల నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక భూకంపం తర్వాత తుర్కియేలోని కహ్రామన్మరాస్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023 Thousands feared dead after a massive 7.8 magnitude #earthquake strikes #Turkey pic.twitter.com/1yLAP22jhI — Narrative Pakistan (@narrativepk_) February 6, 2023 Huge fire raging in the city of Kahramanmaraş, Turkey following the 7.8 MAG earthquake overnight. pic.twitter.com/3PWZ4Tx35N — Citizen Free Press (@CitizenFreePres) February 6, 2023 మృతులు, క్షతగాత్రులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తుర్కియే(పూర్వపు టర్కీ).. తరచూ భూకంపాల భారీన పడుతుంది. 1999లో.. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి 17వేల మంది దుర్మరణం పాలయ్యారు. Rescue teams pulling children from the under the rubble of #collapsed buildings in northwestern #Syria At least 50 people killed, 500+ injured, 140+ buildings destroyed in southern Malatya province as 7.8 #earthquake hits #Türkiye.#deprem #DepremiOldu #Turkey pic.twitter.com/vKnEnG3N2k — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 Another Video- First video is emerging after a M7.8 earthquake in central Turkey.#earthquake in #Şanlıurfa#Turkey #Earthquake pic.twitter.com/mVxNorZ0j0 — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 ఇక 2020 జనవరిలో ఎలజిగ్‌లో 40 మందిని, అదే ఏడాది అయిజీన్ సీప్రాంతంలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం 114 మందిని పొట్టబెట్టుకున్నాయి. భద్రతా ప్రమాణాలను పాటించకుండా.. అడ్డగోలుగా భవనాలు నిర్మించడమే అందుకు కారణమని అక్కడి నిపుణులు చెప్తున్నారు. Entire buildings collapsed in S. #Turkey the epicenter of 7.8 magnitude earthquake in last hour, that also sent shockwaves to Syria, Lebanon, Iraq, Israel, Palestine, Cyprus. We don’t know death toll yet: pic.twitter.com/A7fomc3AXT — Joyce Karam (@Joyce_Karam) February 6, 2023 People are stuck under rubble while sending out live streams or videos requesting help. #earthquake #Turkey pic.twitter.com/SxTzPzFAmn — Nerdy 🅰🅳🅳🅸🅲🆃 (@Nerdy_Addict) February 6, 2023 -
ఢిల్లీలో భారీగా భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భూకంపం చోటు చేసుకుంది. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో బయటకు పరుగులు తీశారు జనాలు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్ ప్రాంతంలో భూకంప కేంద్ర నమోదు అయ్యింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 గం. ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. జనం బయటకు పరుగులు తీయగా, మరికొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. #earthquake captured in camera.#delhi pic.twitter.com/wW3ikxFZCc — Knowledge ABC (@AbcKnowledge) January 24, 2023 Strong #earthquake tremors felt in #Delhi pic.twitter.com/4vjVVbY0xj — JK CHANNEL (@jkchanneltv) January 24, 2023 It's an earthquake again. Tremors felt are pretty scary.#Delhi#earthquake#delhincr #delhiearthquake #NoidaEarthquKe #Noida pic.twitter.com/FN3md3t7qQ — Aakash Biswas (@aami_aakash) January 24, 2023 -
ఢిల్లీలో భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో శుక్రవారం సాయంత్రం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం హరియాణాలోని గుర్గావ్కు నైరుతి దిశగా 63 కిలోమీటర్ల దూరంలో ఉందని జాతీయ భూప్రకంపనల కేంద్రం తెలిపింది. భూకంప ప్రభావంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. కాగా భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన వివరాలూ ఇంతవరకూ వెల్లడికాలేదు. గత రెండు నెలల్లో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో భూమి కంపించడం ఇది 17వసారి కావడం గమనార్హం. ఢిల్లీలో జూన్ 8న చివరిసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.1గా నమోదైంది. వరుసగా తేలికపాటి భూప్రకంపనలు చోటుచేసుకోవడం జాతీయ రాజధాని ప్రాంతంలో భారీ భూకంపం సంభవించేందుకు సంకేతాలనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రకంపనలు భారీ భూకంపానికి సంకేతాలుగా భావించలేమని, వీటి ఆధారంగా సన్నద్ధతకు సిద్ధం కావచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర ప్రకృతి వైపరీత్యాల మాదిరిగా భూకంప తీవ్రతను నిర్ధిష్టంగా ఊహించలేమని అన్నారు. చదవండి : డాక్టర్ గుప్తా కుటుంబానికి రూ. కోటి పరిహారం -
ఢిల్లీలో భూ ప్రకంపనలు!
-
ఢిల్లీలో భూ ప్రకంపనలు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ-ఎన్ఆర్సీ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూ ప్రకంపనలు 3.5గా నమోదు అయ్యాయి. భూ ప్రకంపనలతో జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
-
నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో సంభవించిన భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చేజర్ల, ఆదూరుపల్లి, పుట్టుపల్లి, దాచూరు, కొల్లపనాయుడుపల్లిలలో భూప్రకంపనలు సంభవించినట్టు సమాచారం. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. తెల్లవారుజాము వరకు ప్రకంపనలు కొనసాగినట్టు పల్లెవాసులు వెల్లడించారు. దాదాపు 8 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లల్లో పైన ఉన్న వస్తువులు, వంట పాత్రలు కిందపడిపోయినట్టు తెలిపారు. ప్రాణ భయంతో పిల్లాపాపలతో కలిసి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని చెప్పారు. మంచాల మీద పడుకున్న వారు కిందకు పడిపోయినట్టు స్థానికుడొకరు వెల్లడించారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించారు. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో ఇలాంటివి సహజమని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసాయిచ్చారు. శాస్త్రవేత్తలతో భూకంపన తీవ్రతను అంచనా వేయిస్తామన్నారు. భవిష్యత్తులో భూకంపం వచ్చే ప్రమాదం ఉందా, లేదా అనే దానిపై సమగ్ర పరిశీలన జరుపుతామన్నారు. అయితే ప్రజలు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. -
ఈశాన్య భారత్‌లో భూ ప్రకంపనలు
న్యూఢిల్లీ : ఈశాన్య భారత్‌లో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, అసోంలో కొద్ది సమయంపాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూ ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదైంది. అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇంట్లోనుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇటా నగర్‌కు 180కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. నేపాల్‌లోని కాట్మాండులో సైతం భూమి కంపించింది. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. -
అనంతపురం జిల్లాలో భూ ప్రకంపనలు
సాక్షి, ఉరవకొండ రూరల్: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల, రాకెట్ల, చిన్నముస్టూరు, పెద్దముస్టూరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి భూమి కంపించింది. పెద్ద శబ్దాలు రావడం, ఇళ్లలోని సామాగ్రి కదిలినట్లు అనిపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మూడు గ్రామాల్లోనూ ప్రజలు రాత్రంతా జాగరణ చేశారు. భూకంపం వల్ల పాత ఇళ్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. -
పిడుగురాళ్లలో భూప్రకంపనలు..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్లలో శనివారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఒక్కసారిగా భూప్రకంపనలు సంభవించడంతో బెంబేలెత్తిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు ఏం జరుగుతుందో స్థానికులకు అర్థం కాలేదు. స్వల్పంగా భూమి కంపించిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కాసేపు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
ఢిల్లీలో భూ ప్రకంపనలు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆదివారం భూ ప్రకంపనలు అలజడి రేకెత్తించాయి. మధ్యాహ్నం 3.37 గంటల ప్రాంతంలో భూమి పలుమార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూ కంప తీవ్రత 4.0గా నమోదైంది. హర్యానాలోని సోనిపట్ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిసేపు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంత వాసులు ట్వీట్ల వర్షం కురిపించారు. భూ కంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు. -
ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉత్తర భారతంపైనా ప్రభావం చూపించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో.. ఆ రాష్ట్రాల ప్రజలు భీతిల్లారు. ఈ భూకంప కేంద్రం అఫ్గానిస్థాన్‌లోని హిందుకుష్ పర్వతశ్రేణిలో ఉంది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ప్రభావం ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలపై పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో కొద్దిసేపు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
చిత్తూరులో భూ ప్రకంపనలు: భయాందోళనలో ప్రజలు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇరవై రోజులుగా భూ ప్రకంపనలు వస్తుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. చాలామంది గ్రామాలను వదలిపెట్టి పోతుండగా ఉన్నవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. చిత్తూరుకు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి 34 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉండడంతో మూడు మండలాల్లోని అటవీ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బంగారిపాళ్యం మండలంలోని వెలుతురుచేను, సీజీఎఫ్‌ఎస్ కాలనీల్లో తాజాగా ప్రకంపనలు వచ్చాయి. భూమి లోపలి నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. శబ్దం వచ్చిన ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు.. ఈ విషయమై భూకంప పరిశోధన కేంద్రంతో సంప్రదించారు. ప్రకంపనల విషయంలో ప్రజలు భయపడాల్సిందేమీ లేదని భరోసా ఇచ్చారు. అయినా కాళ్ళ కింద షాక్ లాగా వస్తుండటంతో రైతులు క్రమంగా పొలాల వద్దకు వెళ్లడం మానుకున్నారు. ఇక్కడ ప్రకంపనలు కొనసాగుతుండగానే యాదమర్రి మండలం మాదిరెడ్డిపల్లి పరిసరాల్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రత నమోదైందని శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం అదే మండలంలో సిఆర్ కండ్రిగలో ప్రకంపనలు రావడంతోపాటు గతంలో వచ్చిన ప్రదేశాల్లో ప్రకంపనలు వస్తూనే ఉండడంతో ప్రజల్లో ఆందోళన ఏమాత్రం తగ్గడంలేదు. ఆర్డీవో తదితర అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం లేదని అంటున్నారు. -
ఉలిక్కిపడ్డ గన్నవరం
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. భారీ శబ్దంతో భూమి రెండు నుంచి మూడు సెకన్లపాటు కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భూప్రకంపనలు రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 10న భూమి వరుసగా మూడు, నాలుగుసార్లు స్వల్పంగా కంపించింది. ఈ ఘటన మరువక ముందే గురువారం మధ్యాహ్నం 2.59 నిమిషాల సమయంలో భారీ శబ్దంతో భూమి కంపించింది. గన్నవరంతో పాటు కేసరపల్లి, అప్పా రావుపేట, బుద్ధవరం, దావాజిగూడెం, అల్లాపురం, తెంపల్లి, చిన్నఆవుటపల్లి, కొత్తగూడెం, చిక్కవరం, గొల్లనపల్లి, ముస్తాబాద పలు మెట్ట ప్రాంత గ్రామా ల్లో ప్రకంపనల ప్రభావం కనిపించింది. వీటి ప్రభావంతో ఇళ్లలోని మంచాలు, కుర్చీలు, వస్తువులు కదిలి పోయినట్లు సమాచారం. బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న వారికి ఈ ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. రేకులతో నిర్మించిన కొన్ని భవనాల గోడలు స్వల్పంగా నెర్రలిచ్చాయి. ఈ భూప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 1.5 పాయింట్లుగా నమోదైన్నట్లు రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో మట్టి, మైనింగ్ తవ్వకాలు అధికంగా జరుగుతున్న కారణంగా ద్రవ్యరాశిలో హెచ్చుతగ్గులు ఏర్పడి ప్రకంపనలు సంభవిస్తున్నాయని భౌతిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. -
జమ్మూకశ్మీర్‌లో భూకంపం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3: 49 గంటల ప్రాంతంలో సంభవించిన స్వల్ప భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదు కాలేదు. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 3.2 పాయింట్లుగా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలో ఉందని అధికారులు వెల్లడించారు. ఎప్రిల్ 18న కశ్మీర్‌లోని కష్త్వర్ జిల్లాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.0 పాయింట్లుగా నమోదైంది. -
శ్రీకాకుళంలో భూ ప్రకంపనలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలు రావడంతో.. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు. జిల్లాలోని ఎచ్చర్ల, పొందూరు, అరసవెల్లి పరిసర ప్రాంతాల్లో మూడు సెకన్ల పాటు కంపించింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. -
ఒకే ప్రాంతంలో మూడుసార్లు భూకంపం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ప్రాంతంలో ఒకే రోజున మూడు సార్లు భూమి కంపించింది. కుల్లు జిల్లాలో శనివారం ఉదయం 6.45 ప్రాంతంలో తొలుత స్వల్పంగా భూమి కంపించిన కొన్ని గంటలకూ అదే ప్రాంతంలో మరో రెండుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తొలిసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 గా నమోదు కాగా, రెండోసారి ఉదయం 7.05 గంటల ప్రాంతంలో 4.3గానూ, మూడోసారి 9.08 గంటల ప్రాంతంలో 4.2 గా నమోదు అయినట్టు స్థానిక వాతావరణ కార్యాలయ డైరెక్టర్ మన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. కుల్లు పరిసర ప్రాంతాల్లో వరుసగా భూమి పలుమార్లు కంపించడంతో అక్కడి ప్రాంత ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు.