ఢిల్లీ: పొరుగు దేశం చైనాలో భారీ భూకంపంతో.. మన దేశ రాజధాని ప్రాంతం వణికిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు చోటు చేసుకోగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు.
చైనా దక్షిణ ప్రాంతం జిన్‌జియాంగ్‌లో రిక్టర్ స్కేల్‌పై 80 కిలోమీటర్ల లోతున 7.2 తీవ్రతతో భూమి కంపించింది. ఆ ప్రభావం ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్(National Capital Region)లోనూ కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
Earthquake of Magnitude:7.2, Occurred on 22-01-2024, 23:39:11 IST, Lat: 40.96 & Long: 78.30, Depth: 80 Km ,Location: Southern Xinjiang, China for more information Download the BhooKamp App https://t.co/FYt0ly86HX@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/E184snmSyH
— National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2024
ఇదిలా ఉంటే.. చైనా భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. అక్కడ వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
🔺#Breaking :A 7.1-magnitude #earthquake jolted Wushi County in Aksu Prefecture in northwest China's #Xinjiang Uygur Autonomous Region at 2:09 a.m. on Jan 23 (Beijing Time), according to the China Earthquake Networks Center.
— Record GBA (@RecordGBA) January 23, 2024
Stay Safe‼️ pic.twitter.com/GE9vkkMuCh
మరోవైపు.. దేశ రాజధాని ప్రాంతం తరచూ భూ ప్రకంపనలకు కేంద్రంగా ఉంటోంది. పొరుగు దేశాల్లో ఎక్కడ భూమి కంపించినా .. ఏ స్థాయిలో ప్రకంపనలు సంభవించినా.. ఆ ప్రభావం ఢిల్లీ రీజియన్‌లో కనిపిస్తోంది. జనవరి 11వ తేదీన ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో 6.1 తీవ్రతతో అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. పాకిస్థాన్‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అంతకు ముందు నేపాల్ భూకంప ప్రభావమూ కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment