strong earthquake
-
సునామీ @20 ఏళ్లు: అలా జరిగి ఉంటే పెను విధ్వంసం తప్పేది!
ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. హహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదురైన జనం.. రెప్పపాటులో వాళ్లను ముంచేసిన రాకాసి అలలు.. నేలకూలిన భవనాలు-ముక్కలైన జీవనాధారాలు.. వెతికేకొద్దీ బయటపడ్డ శవాలు.. వెరసి ఎటుచూసినా కన్నీళ్లే!. సరిగ్గా.. 20 ఏళ్ల క్రితం సునామీ(Tsunami) సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా భావించిన తీర ప్రాంత ప్రజలు.. ఘోర విపత్తును చూసింది మాత్రం అదే తొలిసారి!. ఇంతకీ ఆరోజు అసలేం జరిగింది? వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే విలయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు, అధికారుల అంచనాలు ఎక్కడ తప్పాయి?.డిసెంబర్ 26, 2004.. సమయం ఉదయం 7.58నిమిషాలు. ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర వైపున్న సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’(పసిఫిక్ మహాసముద్రం) ప్రాంతమది. దీంతో అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు షరామాములుగా మారిందక్కడ. ఆ పూట సంభవించిన వాటిని కూడా తేలికపాటి ప్రకంపనలుగానే అధికారులు భావించి తేలికగా తీసుకున్నారు. కానీ, ఆ ప్రకంపనలు ఒక ప్రళయాన్నే తీసుకొచ్చాయి. 🌊తీవ్ర భూకంప ప్రభావంతో.. సముద్రంలో 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు. ఆ అలలు తీర ప్రాంతం నుంచి ఐదు కి.మీ పాటు భూభాగంలోకి చొచ్చుకొచ్చేశాయి.ఇండోనేషియా.. అచె ప్రాంతంలోనే లక్షా యాభై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.శ్రీలంక.. సుమత్రాకు 1,700 కిలోమీటర్ల దూరంలోని శ్రీలంక తీర ప్రాంతాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది. వివిధ తీర ప్రాంతాల్లో రాకాసి అలల ధాటికి 35 వేల మంది మరణించారు.భారత్.. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లోనూ నష్టం జరిగింది. కేరళకు స్వల్ప నష్టం వాటిల్లింది. మొత్తంగా 16, 389 మంది మరణించారు.థాయ్‌లాండ్.. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖావో లాక్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. 8 వేలమంది మరణించారు. వీళ్లలో క్రిస్మస్, న్యూఇయర్ సెలవులకు వచ్చిన టూరిస్టులే అధికంగా ఉన్నారు.🌊2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా.. మొత్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లాచెదురైనవాళ్లు లెక్కలేనంత మంది. నిరాశ్రయులైనవాళ్లు ఇంకొందరైతే.. జీవనాధారాలను కోల్పోయారు మరికొందరు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆయా దేశాల పర్యాటక రంగం కుదేలు కావడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపెట్టింది. ఏకంగా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. మానవతా ధృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అందించిన సాయం.. చరిత్రలోనే అతిపెద్ద సాయంగా నిలిచిపోయింది. అయినప్పటికీ.. తీర ప్రాంతాలు, మానసికంగా అక్కడి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది.10 నిమిషాల భూకంపం!రిక్టర్ స్కేల్‌పై 9.1-9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి పది నిమిషాలపాటు కంపిస్తూనే ఉంది. ఆ కారణంతోనే సముద్రపు అలలు రాకాసి రూపం సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణాల్లో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్‌లాండ్, మాల్దీవులు.. ఇలా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడో 9వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్టేట్ ఓక్లాహామాలోనూ దీని ప్రభావం కనిపించిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సునామీ అనే పేరు మనవాళ్లు విన్నది అప్పుడే తొలిసారి!.ఆసియాలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపంప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన భూకంపాల్లో మూడో శక్తివంతమైందిఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం!2004 సునామీ 21వ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుగా చరిత్రకెక్కింది*భూకంపాల కొలమానం.. సిస్మోగ్రఫీ అనేది 1900 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. చదవండి: ఆధునిక చరిత్రలోనే అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?. 🌊సునామీ.. మనిషి నిలువరించలేని ఓ ప్రకృతి విపత్తు!. తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే సునామీని ముందుగానే గుర్తించగలిగే గ్లోబల్ వార్నింగ్ వ్యవస్థ మాత్రం ఒకటి ఉంది. సముద్ర భూగర్భంలో చెలరేగే అలజడులు.. అలల తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇందుకోసం ‘సునామీ వార్నింగ్ సిస్టమ్’(TWS) పని చేస్తుంది. 🌊ప్రపంచంలోనే తొలి సునామీ హెచ్చరికల వ్యవస్థ.. 1920లో హవాయ్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంభవించిన విపత్తుల ఆధారంగా దానిని ఆధునీకరించుకుంటూ వచ్చారు. ఫసిఫిక్ సముద్రం, నార్త్ అమెరికా సంబంధిత వ్యవస్థలు తర్వాతి కాలంలో ఏర్పాటయ్యాయి. కానీ.. 2004 దాకా హిందూ మహాసముద్రంలో సునామీల హెచ్చరికలకు సంబంధించి ఇలాంటి వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేకపోవడం.. ఇంతటి విషాదానికి కారణమైందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది.🌊2004 బాక్సింగ్ డే సునామీ తర్వాత.. ఆ మరుసటి ఏడాది IOTWMSను యునెస్కో ఏర్పాటు చేసింది. భారత్ తరఫున Indian Tsunami Early Warning Centre (ITEWC), ఈ IOTWMSతో సమన్వయం జరుపుతోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో ITEWCను 2007లో ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో చోటు చేసుకునే మార్పులు, సునామీల మీద అధ్యయనాలు.. పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ. 🌊ప్రపంచంలో.. దాదాపు అన్ని సముద్ర రీజియన్లలో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి వ్యవస్థలు కచ్చితత్వం విషయంలోనూ కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో విపత్తులకు తగ్గట్లుగా మార్పులు చేస్తూ వస్తున్నారు. 2018 డిసెంబర్లో అగ్నిపర్వతం బద్ధలై సునామీ ముంచెత్తింది. దీంతో.. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి సముద్ర మట్టం స్థాయికి సెన్సార్లను ఏర్పాటు చేశారు. అలా.. అప్పటినుంచి సునామీ హెచ్చరికలు తరచూ జారీ అవుతుండడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వ్యవస్థ 20 ఏళ్ల కిందట ఉండి ఉంటే.. ఆనాడు అంతటి విధ్వంసం తప్పేది ఏమో!.🌊సునామీ అంటే?.. Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా.. భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సాధారణంగా సునామీలు అలల లాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు చాలా తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. ఈ రాకాసి అలలు కలిగించే నష్టం కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి.. 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల వాటిల్లిన విధ్వంసమే ఇందుకు ఉదాహరణ.:::సాక్షి వెబ్‌డెస్క్ -
Earthquake: ఢిల్లీలో భారీ భూప్రకంపనలు
ఢిల్లీ: పొరుగు దేశం చైనాలో భారీ భూకంపంతో.. మన దేశ రాజధాని ప్రాంతం వణికిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు చోటు చేసుకోగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. చైనా దక్షిణ ప్రాంతం జిన్జియాంగ్లో రిక్టర్ స్కేల్‌పై 80 కిలోమీటర్ల లోతున 7.2 తీవ్రతతో భూమి కంపించింది. ఆ ప్రభావం ఢిల్లీతో పాటు ఎన్సీఆర్(National Capital Region)లోనూ కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. Earthquake of Magnitude:7.2, Occurred on 22-01-2024, 23:39:11 IST, Lat: 40.96 & Long: 78.30, Depth: 80 Km ,Location: Southern Xinjiang, China for more information Download the BhooKamp App https://t.co/FYt0ly86HX@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/E184snmSyH — National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2024 ఇదిలా ఉంటే.. చైనా భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. అక్కడ వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 🔺#Breaking :A 7.1-magnitude #earthquake jolted Wushi County in Aksu Prefecture in northwest China's #Xinjiang Uygur Autonomous Region at 2:09 a.m. on Jan 23 (Beijing Time), according to the China Earthquake Networks Center. Stay Safe‼️ pic.twitter.com/GE9vkkMuCh — Record GBA (@RecordGBA) January 23, 2024 మరోవైపు.. దేశ రాజధాని ప్రాంతం తరచూ భూ ప్రకంపనలకు కేంద్రంగా ఉంటోంది. పొరుగు దేశాల్లో ఎక్కడ భూమి కంపించినా .. ఏ స్థాయిలో ప్రకంపనలు సంభవించినా.. ఆ ప్రభావం ఢిల్లీ రీజియన్‌లో కనిపిస్తోంది. జనవరి 11వ తేదీన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో 6.1 తీవ్రతతో అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. పాకిస్థాన్‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అంతకు ముందు నేపాల్ భూకంప ప్రభావమూ కనిపించింది. -
Morocco: భూకంప విలయం.. 1000 మంది మృతి
రాబత్: ప్రకృతి విలయంతో ఆఫ్రికా దేశం మొరాకో తల్లడిల్లిపోయింది. శుక్రవారం రాత్రి సమయంలో మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 1000 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎటు చూసినా భవనాలు కుప్పకూలిపోయి.. అయిన వాళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 11.11 సమయంలో మధ్య మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 7.2 త్రీవతతో భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్డుల వెంట ఉన్న జనం.. ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే గడిపారు. భూకంపం ధాటికి.. వందల సంఖ్యలో మరణించి ఉంటారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. మరో 300 మందిదాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వం చెబుతోంది. Moment when powerful 6.8 magnitude #earthquake rocked #Morocco atleast 296 dead #moroccoearthquake #moroccosismo #Sismo #viral #BREAKING pic.twitter.com/2fyjtgEC2O — Utkarsh Singh (@utkarshs88) September 9, 2023 మొరాకో భూకంపం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్(ట్విటర్)లో ఆయన సంతాప సందేశం ఉంచారు. Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to… — Narendra Modi (@narendramodi) September 9, 2023 యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.11 గం. ప్రాంతంలో కొన్ని సెకండ్ల పాటు భారీగా భూమి కంపించింది. భూమి ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఆ తర్వాత.. 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు వెల్లడించింది. అయితే మొరాకో నేషనల్ సెయిస్మిక్ మానిటరింగ్ అండ్ అలర్ట్ నెట్వర్క్ మాత్రం.. తీవ్రత 7గా ఉన్నట్లు చెబుతోంది. అలాగే.. కేవలం 8 కిలోమీటర్ల లోతునే ప్రకంపనల కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది. Earthquake Morocco Richter 6.8#marrakech #agadir #casablanca #fes#مراكش #فاس #أغادير #الدار_البيضاء#moroccoearthquake #morocco #earthquakemorocco #earthquake#زلزال_المغرب #هزة_أرضية pic.twitter.com/EXBcv4rw17 — Jalal (@jalaloni) September 8, 2023 Scenes from Morocco's earthquake aftermath Understandably, people don't want to go back indoors because fearing aftershocks#earthquake #Maroc #moroccoearthquake #Morocco #earthquakemorocco #pray #hope #god #Marrakesh pic.twitter.com/cKg1bq0maq — Kinetik (@KinetikNews) September 9, 2023 మొరాకోలో స్వల్పతీవ్రతతో సంభవించే భూకంపాలకు సైతం తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. 1960లో రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. వేల మందిని బలిగొనడం గమన్హార్హం. ఇదిలా ఉంటే.. పోర్చుగల్, అల్జీరియాలోనూ భూకంపం సంభవించినా.. అవి స్వల్ఫ ప్రకంపనలే అని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని సమాచారం. -
మళ్లీ అదే తేదీ.. ఊగిపోయి కుప్పకూలిన బిల్డింగులు
మెక్సికో సిటీ: దక్షిణ అమెరికా దేశం మెక్సికో అతిభారీ ప్రకంపనలతో చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో అక్కడ భారీ భూకంపం సంభవించింది. మరోవైపు మూడు నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు సముద్ర అలలు ఎగిసిపడడంతో.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది యూఎస్-ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో పశ్చిమ మెక్సికో ప్రాంతంలో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయి. శక్తివంతమైన ప్రకంపనల ధాటిగా చెట్లు, భవనాలు కూలి విధ్వంసం చోటు చేసుకుంది. అయితే.. అదృష్టవశాత్తూ తక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. కాకపోతే భారీగా భవనాలు కూలిపోగా.. దారిపొడవునా చెట్లు వేళ్లతో సహా రోడ్ల మీద కుప్పకూలాయి. En varias partes de nuestro pais estuvo bastante fuerte el #temblor #sismo #mexico #19septiembre pic.twitter.com/ga7LeMRWRn — Tapatio Tradi (@tapatiotrad) September 19, 2022 విశేషం ఏంటంటే.. సెప్టెంబర్ 19వ తేదీ మెక్సికో చరిత్రలో పెనువిషాదాలను నింపిన రోజు కావడం. 1985 సెప్టెంబర్ 19వ తేదీన రిక్టర్‌స్కేల్‌పై 8.0 తీవ్రతతో భూకంపం, పది అడుగుల ఎత్తు అలలతో సునామీ సంభవించగా.. ఐదువేల మందికిపైగా మరణించారు. ఇక.. 2017 సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికో మున్సిపాలిటీ పరిధిలోని ప్యూబ్లాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ దాటికి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరు వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే తాజా భూకంపంలో.. మాత్రం కేవలం ఒకే ఒక్క ప్రాణం పోయింది. మాంజానిలో లోని ఓ డిపార్ట్మెంట్స్టోర్ పైకప్పు కూలి ఒక వ్యక్తి మరణించాడు. గ్లాస్ పడి మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. కాకపోతే భారీ ప్రకంపనల ధాటికి భవనాలు, చెట్లు ఊగిపోయాయి. జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రులు, ప్రయాణాల్లో ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. మొత్తానికి సెప్టెంబర్ 19 భూకంపం సెంటిమెంట్ మెక్సికోను వణికిపోయేలా చేసింది. సునామీ హెచ్చరికలను ఇంకా ఉపసంహరించాల్సి ఉంది అక్కడ. ఇదీ చదవండి: కంటికి కనిపించని అద్భుతాలను ‘ఆ’ కంటితో చూడొచ్చు.. -
పపువా న్యూ గునియాలో భారీ భూకంపం
టరోన్: పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. పపువాలోని టరోన్కు తూర్పున 46 కిలో మీటర్ల దూరంలో, 103 కిలో మీటర్ల లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. పపువా న్యూ గునియా సమీప ప్రాంతాల్లో సునామీ రావచ్చని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
ఈక్వెడార్‌లో శక్తిమంతమైన భూకంపం
క్విటో: ఈక్వెడార్‌లో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాపిషియాకు 41 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 6.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వీస్ అధికారులు తెలిపారు. భూగర్భంలో 35 కిలో మీటర్ల లోతున ఈ భూప్రకంనలు మొదలయ్యాయని అధికారులు చెప్పారు. ఈ ప్రకంపనల కారణంగా ఈక్వెడార్ రాజధాని క్విటోలో కూడా వణికిపోయిందట. అయితే నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. -
ఇండోనేసియాలో భూకంపం
జకార్తా : ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు అయిందని ఇండోనేసియా ఉన్నతాధికారి వెల్లడించారు. భూకంపం సంభవించగానే నివాసాల నుంచి ప్రజుల బయటకు పరుగులు తీశారని చెప్పారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం ఇప్పటి వరకు అందలేదని చెప్పారు. అలోర్ ద్వీపంలోని తూర్పు నుష్టంగ్గర్ ప్రావిన్స్‌లోని భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వివరించింది. సునామీ వచ్చే అవకాశాలు కూడా లేవని పేర్కొంది. -
ఇండోనేసియాలో మరో భారీ భూకంపం
ఇండోనేసియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. ఇండోనేసియాతో పాటు పశ్చిమ పపువా ప్రాంతంపై కూడా భూకంప ప్రభావం ఉంది. అయితే, సునామీ ముప్పు మాత్రం లేదని తెలిసింది. ఈ విషయాన్ని మెట్రాలజీ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. సొరోంగ్ పట్టణానికి ఈశాన్యంగా 31కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉంది. 'ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' అని పిలిచే ప్రాంతంలో ఉండటంతో ఇండోనేసియాలో తరచు భూకంపాలు సంభవిస్తుంటాయి. సాల్మన్ దీవుల్లోనూ సాల్మన్ దీవుల్లో కూడా భూకంపం వచ్చినట్లు అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. ఇక్కడ కూడా సునామీ ముప్పు ఏమీ లేదనే చెప్పారు. రాజధాని హొనియారాకు ఆగ్నేయంగా 98 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించింది. 2013లో సాల్మన్ దీవుల్లో 8.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాంతో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి.