ఈక్వెడార్లో శక్తిమంతమైన భూకంపం
క్విటో: ఈక్వెడార్లో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాపిషియాకు 41 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 6.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వీస్ అధికారులు తెలిపారు.
భూగర్భంలో 35 కిలో మీటర్ల లోతున ఈ భూప్రకంనలు మొదలయ్యాయని అధికారులు చెప్పారు. ఈ ప్రకంపనల కారణంగా ఈక్వెడార్ రాజధాని క్విటోలో కూడా వణికిపోయిందట. అయితే నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.