ఇండోనేసియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. ఇండోనేసియాతో పాటు పశ్చిమ పపువా ప్రాంతంపై కూడా భూకంప ప్రభావం ఉంది. అయితే, సునామీ ముప్పు మాత్రం లేదని తెలిసింది. ఈ విషయాన్ని మెట్రాలజీ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. సొరోంగ్ పట్టణానికి ఈశాన్యంగా 31కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉంది. 'ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' అని పిలిచే ప్రాంతంలో ఉండటంతో ఇండోనేసియాలో తరచు భూకంపాలు సంభవిస్తుంటాయి.
సాల్మన్ దీవుల్లోనూ
సాల్మన్ దీవుల్లో కూడా భూకంపం వచ్చినట్లు అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. ఇక్కడ కూడా సునామీ ముప్పు ఏమీ లేదనే చెప్పారు. రాజధాని హొనియారాకు ఆగ్నేయంగా 98 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించింది. 2013లో సాల్మన్ దీవుల్లో 8.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాంతో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి.
ఇండోనేసియాలో మరో భారీ భూకంపం
Published Fri, Sep 25 2015 7:51 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM
Advertisement
Advertisement