‘నేను ఉద్యోగం మానేస్తా.. మానేస్తా..’ అని మీరు చేస్తున్న ఉద్యోగమే కష్టమైందని అనుకుంటున్న వారంతా ఇక్కడ ఓ లుక్ వేయండి. జీవనోసాధి కోసం కొందరు ప్రాణాలనే పణంగా పెట్టి, ఆపదతో కూడిన ఉద్యోగాలెన్నో చేస్తుంటారు. అలాంటి వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన, ప్రమాదకరమైన ఉద్యోగం ఒకటి ఉందని ప్రముఖ యూట్యూబర్ దారా తహ్ చెప్పాడు.
‘ఇండోనేషియాలోని మౌంట్ ఇజెన్ అగ్ని పర్వతం దగ్గర పనిచేసే గని కార్మికులు అగ్నిపర్వతం నుంచి వెలువడే విష వాయువులతో రోజూ పోరాడాల్సి ఉంటుంది. ఆ వాయువుల్లో కొన్ని తక్షణమే చంపగలవు. అక్కడి వాయు మేఘాలు ఒక్కసారిగా కమ్ముకొచ్చి, ఊపిరి తీసే ప్రమాదం ఉంది. అక్కడి గంధకం గనికి వెళ్లే మార్గంలో ఒక యాసిడ్ సరస్సు ఉంది.
ఇది చూడటానికి చక్కగా స్నానానికి అనువుగా అనిపిస్తుంది కాని, ప్రపంచంలోనే ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న సరస్సుల్లో ఇదీ ఒకటి. ప్రతిరోజూ వివిధ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల కోసం ఉపయోగించే సల్ఫర్‌ను ఇలాంటి ప్రదేశాల నుంచే సేకరిస్తారు.
‘ఇక్కడ ఒక అరగంట కూడా నేను ఉండలేకున్నా, నా జీవితంలో చూసిన అత్యంత ప్రమాదకర ఉద్యోగం ఇదే’ అంటూ తన యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment