Mining
-
కీలక ఖనిజాలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: కీలక ఖనిజాల(మినరల్స్)తోకూడిన ఆస్తుల మైనింగ్‌కు ఆసక్తిగా ఉన్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతా రావు పేర్కొన్నారు. కాంగో, జాంబియా, టాంజానియా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాబిల్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో దేశీ కంపెనీల కోసం కాంగో, టాంజానియా తదితర కొన్ని దేశాలలో కీలక ఖనిజ ఆస్తులను వెలికి తీసేందుకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితరాలను అత్యంత ప్రాధాన్యతగల ముడిసరుకులుగా పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న శుద్ధ ఇంధన టెక్నాలజీలకు ఇవి బూస్ట్నివ్వగలని పేర్కొన్నారు. గాలి మరలు(విండ్ టర్బయిన్లు), ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీల తయారీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్ తదితరాలలో వీటి వినియోగం విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ తదితర పీఎస్‌యూ దిగ్గజాలు కాబిల్తో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఆస్ట్రేలియాలో కీలక మినరల్ బ్లాకులను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. జాంబియా గ్రీన్ సిగ్నల్ కోబాల్ట్, కాపర్ అన్వేషణకు జాంబియా ప్రభుత్వం 9,000 చదరపు కిలోమీటర్ల క్షేత్రాల(గ్రీన్‌ఫీల్డ్)ను భారత్‌కు ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించినట్లు రావు తెలియజేశారు. రెండు, మూడేళ్లలో ఖనిజాన్వేషణ చేపట్టనున్నట్లు, తద్వారా మైనింగ్ హక్కులను సైతం పొందనున్నట్లు పేర్కొన్నారు. దేశీ జియలాజికల్ సర్వే(జీఎస్ఐ).. భారీ డిమాండుగల లిథియం బ్లాకులను జమ్ము, కాశీ్మర్(జేఅండ్‌కే), చత్తీస్‌గఢ్‌లలో గుర్తించినట్లు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వెరసి జేఅండ్కేలో లిథియం బ్లాకుల అన్వేషణకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు జీఎస్ఐ నిర్ణయించినట్లు తెలియజేశారు. ఏప్రిల్, మే నెలకల్లా వీటిపై స్పష్టత రానున్నట్లు వెల్లడించారు. -
క్రిటికల్ మినరల్‌పై సింగరేణి ఆసక్తి
గోదావరిఖని: క్రిటికల్ మినరల్స్‌పై సింగరేణి ఆసక్తి చూపుతోంది. కీలక ఖనిజాలు, మైనింగ్ రంగంలో సింగరేణికి సహకరించేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్తో అవగాహన కుదుర్చుకుంది. బొగ్గు వెలికితీతతో పాటు థర్మల్, సౌర విద్యుదుత్పత్తి చేస్తూ సింగరేణి అపార అనుభవం గడించింది. కొద్దిరోజుల్లో పవన, జల విద్యుదుత్పత్తి సాధించనుంది. ఇతర రంగాల్లోనూ వివిధ సంస్థలకు శిక్షణ ఇస్తోంది. ఈనెల 24న హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ఉపాధి శిక్షణ మంత్రి రోస్బేట్స్తో సింగరేణి ప్రతినిధులు భేటీ అయ్యారు. వివిధ పలు అంశాలపై పరస్పర అవగాహనకు వచ్చారు. దేశంలో విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టంలకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. క్రిటికల్ మినరల్స్‌కు మంచి భవిష్యత్ ఏర్పడింది. ఈ రంగానికి అవసరమైన వనడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం వంటి 11 రకాల కీలక ఖనిజాలకు ప్రా«ధాన్యం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ కీలక ఖనిజాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుండగా, ఇక్కడే తయారు చేయడమా లేక ముడిసరుకు దిగుమతి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించడమా? అనే ఆలోచనలో సింగరేణి ఉంది. కీలక ఖనిజాల లభ్యత క్వీన్స్‌లాండ్‌లో అధికంగా ఉంది. వీటి ఉత్పత్తి, విక్రయానికి పరస్పర లబ్ధి చేకూరే వ్యాపార ఒప్పందంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. 2029–30 నాటికి తెలంగాణ రాష్ట్రం 20 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తెలంగాణ – క్వీన్స్లాండ్ మధ్య సంయుక్త మైనింగ్, మినరల్ వ్యాపారానికి సింగరేణి ఒక నోడల్ ఏజెన్సీగా ఐఐటీ సంస్థతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.క్వీన్స్‌లాండ్స్‌తో వ్యాపార బంధంసింగరేణి ఇప్పటికే క్వీన్స్‌లాండ్స్‌తో రక్షణకు సంబంధించి పలు యంత్రాలు, విడిభాగాల కొనుగోలుపై ఒప్పందం చేసుకుంది. సరఫరా కూడా చేస్తోంది. సిమ్టార్స్ సంస్థతో మైనింగ్, టెక్నాలజీకి, సీఎస్ఐ, ఆర్వో తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకొంది. ప్రస్తుతం క్వీన్స్లాండ్ మంత్రి సమక్షంలో కీలక ఖనిజాల వెలికితీత, భారీఖనిజ ఉత్పత్తి యంత్రాలు సాంకేతికత, రక్షణ పెంపు, వెంటిలేషన్ మెరుగుదల, ఎక్కువ లోతులో ఉన్న బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించి ఆధునిక సాంకేతికత అంశాలపై ముందుకు సాగుతోంది.త్వరలో క్వీన్స్‌లాండ్‌కు సింగరేణి బృందంక్రిటికల్ మినరల్స్‌పై లోతుగా అధ్యయనం, అవగాహన కోసం సింగరేణి బృందాన్ని క్వీన్స్‌లాండ్‌కు పంపుతున్నారు. సింగరేణితో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి క్వీన్స్లాండ్ మంత్రి ఆసక్తి కనబరిచారు. కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్) కోబాల్ట్, టైటానియం, గ్రాఫైట్, క్రోమియం, టంగ్ స్టన్, యాంటీమోనీ, రీనియం, ఇండియంతో పాటు రేర్ఎర్త్ మినరల్స్ వంటి కీలక ఖనిజాలను తమతో కలిసి ఉత్పత్తి చేయడానికి ఉమ్మడి భాగస్వామ్యంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. సౌర విద్యుత్, పవన విద్యుత్ రంగాల్లో పూర్తి సహకారానికి ఉభయులూ అంగీకరించారు.సదస్సుకు ఆహ్వానంఈఏడాది మార్చిలో క్వీన్స్‌లాండ్‌లో పెద్దఎత్తున నిర్వహించే వ్యాపార సదస్సుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వీన్స్లాండ్ మంత్రి ఆహ్వానించారు. ఈ క్రమంలో వ్యాపార అనుబంధం మరింత పెరిగే అవకాశాలున్నాయి. -
కొండలను పిండి చేస్తున్న మైనింగ్ మాఫియా
-
కూటమి పెద్దల సిలికా ‘స్కెచ్’
సాక్షి టాస్క్ఫోర్సు: తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని వందల ఎకరాల్లో ఉన్న సిలికా నిక్షేపాలను కొల్లగొట్టేందుకు కూటమి పెద్దలు పెద్ద స్కెచ్ వేశారు. ఇప్పటికే కూటమి నేతలు ఇక్కడి ఇసుక, క్వార్ట్ ్జను అక్రమ మార్గాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు సిలికా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. తొలుత సిలికా మైన్స్‌ను మూడు బడా సంస్థలకు కట్టబెట్టాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆ సంస్థల ప్రతినిధులు స్థానిక లీజుదారులను లొంగదీసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ బడా సంస్థ ప్రతినిధులు కొద్ది రోజులుగా చిల్లకూరు ప్రాంతంలోని ఓ హోటల్లో మకాం వేసి ఇక్కడి లీజుదారులను పిలిపించి తమకే సిలికా మైన్లను ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.గతంలో పరిశ్రమల పేరుతో తీర ప్రాంతంలో సిలికా ఉన్న భూములు దక్కించుకున్న ఈ సంస్థ మైనర్ మినరల్ పేరుతో జీవో తెప్పించుకుంది. అధికంగా సిలికా భూములు తమ దగ్గరే ఉన్నాయి కాబట్టి సిలికా తవ్వకాలను పూర్తిగా తమకే అప్పగించాలని ఇతర లీజుదారులపై ఒత్తిడి తెస్తోంది. నలుగురు ప్రజాప్రతినిధులను అన్నీ తానై నడిపించే మరో సంస్థకు చెందిన బడా బాబు లీజుదారులను చెన్నైకి పిలిపించి గనులు ఆయనకు అప్పగించాలని తెగేసి చెబుతున్నారు.తాజాగా అధిష్ఠానం ఓ మెలిక పెట్టింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సిలికా వ్యాపారం చేసిన సంస్థకే అన్ని గనులు అప్పగించి, మిగిలిన రెండు సంస్థల వారిని కలుపుకొని పోయేలా చూడాలని చెబుతున్నట్లు సమాచారం. ఈ మూడు సంస్థలో ఒక దానికి గతంలో వ్యాపారం చేసిన అనుభవం ఉంది. మరో సంస్థ చేతిలో అధిక శాతం సిలికా ఉన్న భూములున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులకు పెద్ద ఇంకొకరు. ఈ మూడు సంస్థలకు అప్పజెబితే ఏ ఇబ్బందీ లేకుండా సిలికా తరలించేయొచ్చన్నది కూటమి పెద్దల ప్రణాళికగా చెబుతున్నారు.ప్రజాప్రతినిధి టోకెన్ ఇచ్చినవారికే డీలర్షిప్టమి పెద్దలు సిలికా వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకొనే ప్రయత్నాలు చేస్తుండటంతో దాని ప్రభావం డీలర్లపైనా పడింది. ఏడు నెలలుగా వారికి వ్యాపారమే సాగడంలేదు. పది రోజుల క్రితం గనుల శాఖాధికారి 50 మంది డీలర్లకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు సగం మందికి కూడా అనుమతులు ఇవ్వలేదని సమాచారం. పైకి సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారు. అన్ని షరతులకు తలొగ్గి, స్థానిక ప్రజాప్రతినిధి దగ్గర టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే గనుల శాఖాధికారులు పిలిచి అనుమతులు జారీచేస్తున్నట్లు తెలుస్తోంది.పేదల భూముల పైనా కన్ను తీర ప్రాంతంలో బల్లవోలు గ్రామ పేదలకు 40 ఏళ్ల క్రితం పంపిణీ చేసిన భూములపైనా సిలికా లీజుదారుల కన్ను పడింది. గత ప్రభుత్వం ఈ భూముల్లోకి లీజుదారులు రాకుండా అడ్డుకొంది. పేదలు కూడా కోర్టును ఆశ్రయించి సాగు భూముల్లో తవ్వకాలు చేపట్టకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే లీజులు పొందిన ఓ మహిళ తాజాగా నెల్లూరు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ పెద్దల ద్వారా జాయింట్ ఇన్స్పెక్షన్ పేరుతో ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం గనుల శాఖ, రెవెన్యూ శాఖలోని పలువురికి పెద్ద మొత్తంలో ముడుపులివ్వడం, కూటమి పెద్దల అండ కూడా ఉండటంతో వారు కూడా సహకారం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలకు కప్పం కడితేనే మైనింగ్... రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన గనుల తవ్వకాలు
-
కప్పం కడితేనే మైనింగ్
రాష్ట్రంలోని గనులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ‘ముఖ్య’ నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు. పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే.. లేదంటే గనులను బంద్ చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నీకింత.. నాకింత.. అని పంపకాలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం గురించి పైనుంచి కింది దాకా పట్టించుకునే నాథుడే లేడు. సగానికి సగం గనుల ఆదాయం పడిపోయిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయినా సరే తమ ఆదాయం మాత్రం బాగుండాలనే కూటమి పెద్దల తీరుతో రాష్ట్రంలో మైనింగ్ రంగం అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని జిల్లాల్లోనూ గనుల తవ్వకాలు స్తంభించిపోయాయి. తమకు కప్పం కట్టిన వారికి మాత్రమే మైనింగ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కప్పం కట్టని గనుల యజమానులపై పది రెట్లకు పైగా జరిమానాలు విధిస్తుండడంతో వారు విలవిల్లాడిపోతున్నారు. దీంతో మైనింగ్ ఆదాయం సగానికి సగం పడిపోయింది. మరోవైపు కూటమి నేతలు మాత్రం ఎక్కడికక్కడ గనులను స్వాధీనం చేసుకుని అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇదంతా కూటమి ముఖ్య నేత, ఆయన కుమారుడి నేతృత్వంలోనే జరుగుతుండడం గమనార్హం. ఎనిమిది నెలలుగా కూటమి నేతలు జిల్లాల వారీగా క్వార్ట్జ్, సిలికా శాండ్, గ్రానైట్, రోడ్ మెటల్, బీచ్ శాండ్, లేటరైట్, బెరైటీస్ వంటి అన్ని ఖనిజాలను తమ బినామీల పరం చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. దీనివల్ల ఇప్పటికే రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో అత్యంత డిమాండ్ ఉన్న క్వార్ట్జ్, మైకా తవ్వకాలను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన నాయకుడికి అప్పగించారు. ఆ నేత ప్రతి నెలా రూ.50 కోట్లు చొప్పున ఏటా రూ.600 కోట్లు ‘ముఖ్య’ నేతకు కప్పం కట్టాలనే ఒప్పందంతో మొత్తం క్వార్ట్జ్ మైనింగ్ అంతా ఆయన చేతిలో పెట్టారు. ఆయన నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమలను పరిశీలించి, అదే తరహాలో తిరుపతి జిల్లా సైదాపురంలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ‘ముఖ్య’ నేతకు 50 శాతం వాటా ఇచ్చేందుకు చీకటి ఒప్పందం జరిగినట్లు తెలిసింది.రూ.50 వేల ఖనిజాన్ని రూ.10 వేలకివ్వాలట!ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో దాదాపు 140 ఓపెన్ కాస్ట్, 7 అండర్ గ్రౌండ్ క్వార్ట్జ్ గనులు ఉన్నాయి. వాటిలో తవ్వే ఖనిజాన్ని ఎంపీ చెప్పిన మనుషులకు.. అది కూడా వారు నిర్ణయించిన రేటుకు విక్రయిస్తేనే లీజులను కొనసాగిస్తామంటూ ప్రభుత్వ ‘ముఖ్య’ నేత స్పష్టం చేయడంతో వారు అంగీకరించలేదు. దీంతో తవ్వకాలు నిలిచిపోయి ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అయినా సరే ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు ఖనిజాన్ని విక్రయించే వారికి మాత్రమే అనుమతులు జారీ చేస్తూ, మిగిలిన క్వారీలను నిలిపివేశారు. రూ.వేల కోట్ల ఆదాయం సమకూరే క్వార్ట్జ్ గనులను చేజిక్కించుకునేందుకు కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలతో మైనింగ్ వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కువగా చైనాకు ఎగుమతి అయ్యే ఈ ఖనిజానికి టన్నుకు కేవలం రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తానని ఆ ఎంపీ చెబుతుండటంతో మైనింగ్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఖనిజాన్ని చైనాలో టన్ను రూ.50 వేలకు విక్రయించుకుంటూ, తమకు మాత్రం కనీసం మైనింగ్ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని రేటును ఇస్తున్నారంటూ పలువురు మైనింగ్ వ్యాపారులు వాపోతున్నారు.కోర్టు ఉత్తర్వులూ బేఖాతరురాజకీయ దురుద్దేశంతో మైనింగ్ అనుమతులు నిలిపి వేయడంపై రాష్ట్రంలోని ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్ ఇండస్ట్రీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను సమర్థించిన కోర్టు నెల రోజుల్లో అన్ని అనుమతులు ఉన్న క్వారీలకు రవాణా ఫారాలను జారీ చేయాలని, పోర్టర్స్‌ను అన్ బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గత నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్య నేత సూచనలతో మైనింగ్ ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు.రెండు పోర్టుల నుంచి అక్రమంగా ఖనిజ రవాణామరోవైపు లీజులను నిలిపి వేయడంతో క్వార్ట్జ్, మైకా, సిలికా శాండ్‌కు డిమాండ్ పెరగడంతో కూటమి నేతలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే తవ్విన ఖనిజాన్ని క్వారీ నిర్వాహకులతో మాట్లాడుకుని రాత్రి సమయాల్లో అక్రమంగా తరలిస్తున్నారు. గట్టిగా ప్రశ్నించిన క్వారీ నిర్వాహకులపై అక్రమ మైనింగ్ చేశారని పది రెట్లు జరిమానాలు విధిస్తామని బెదిరిస్తున్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు నిత్యం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో క్వార్ట్జ్, మైకా, సిలికా శాండ్ లారీలు పెద్ద ఎత్తున అక్రమ ఖనిజాన్ని చేరవేస్తున్నాయి. చీమకుర్తి తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్‌ను నిబంధనలకు విరుద్ధంగా పోర్టులకు తరలిస్తున్నారు. అద్దంకి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేల కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు, మైనింగ్ అధికారులు ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. ఇందులో ముఖ్య నేత తనయుడి పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. వీటి వైపు కన్నెత్తి చూడకూడదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు అందడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు.నిఘా నిర్వీర్యం.. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడంతో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. చెక్‌పోస్ట్‌ల వద్ద అక్రమ మైనింగ్ రవాణాను అడ్డుకుంటున్న దాఖలాలే లేవు. విజిలెన్స్ బృందాలను తమ బినామీలకు ఖనిజాన్ని కారుచౌకగా ఇచ్చేందుకు నిరాకరించే వారి పని పట్టడానికే ఉపయోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన క్వారీ యజమానులపై తప్పుడు కేసులు పెట్టడం, పది రెట్లు అధికంగా జరిమానాలు విధించడానికే ఈ బృందాలను వాడుకుంటున్నారు. రోడ్ మెటల్, గ్రావెల్, గ్రానైట్, బాల్ క్లే తదితర ఖనిజాల రవాణాపై ఎన్ని ఫిర్యాదులు అందినా.. ఏ మాత్రం పట్టించుకోవద్దని జిల్లాల్లోని అధికారులకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతలే అక్రమ మైనింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ సంపాదన విషయంలో పార్టీ నేతల మధ్యే విభేదాలు వచ్చి, బజారునపడి రచ్చ చేసుకుంటున్నారు. నూజివీడులో మైనింగ్ దందాపై తెలుగుదేశం పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా మంత్రి కొలుసు పార్థసారథిపై ఆరోపణలు చేశారు.వైఎస్ జగన్ హయాంలో పెరిగిన ఆదాయంవైఎస్ జగన్ హయాంలో గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడంతో ఆదాయం భారీగా పెరిగింది. పారదర్శక విధానాలు, లీజుల జారీలో జాప్యాన్ని నివారించడంతో పాటు ఔత్సాహికులు మైనింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో మొదట వచ్చిన వారికే మొదటి అవకాశం (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్) విధానం ద్వారా మైనింగ్ లీజులు జారీ చేసేవారు. దీనివల్ల దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండడంతో లీజులున్నా, మైనింగ్ చేయకుండా జాప్యం చేసేవారు. గతంలో 4,988 లీజుల్లో 2,826కు మాత్రమే వర్కింగ్ లీజులుండేవి. ఆ విధానాన్ని రద్దు చేసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించడంతో అదనంగా 1,700 లీజులు వర్కింగ్‌లోకి వచ్చాయి. దీంతో మైనింగ్ ఆదాయం బాగా పెరిగింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అన్ని లీజులను అనధికారికంగా నిలిపి వేయడంతోపాటు మళ్లీ పాత విధానాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తుండడంతో మైనింగ్ రంగం కుదేలైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ ఆదాయం రూ.1,950 కోట్లు ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణల వల్ల 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆది రూ.4,800 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3 వేల కోట్లు రావడమే గగనంగా మారింది.టెక్కలిలో కక్ష సాధింపుగా అడ్డగోలు దాడులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నాయకుడి సోదరుడు గ్రానైట్ క్వారీలపై లేని పోని ఆంక్షలు విధించాడు. అది తట్టుకోలేక టెక్కలి సమీపంలో ఓ గ్రానైట్ క్వారీని మూసి వేశారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఇదే క్వారీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులతో పాటు యజమాని సైతం రోడ్డున పడ్డాడు. ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతుండడంతో క్వారీ నిర్వహణ పూర్తిగా నిలిపివేశారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు అధికారులను ఉసిగొలిపి అడ్డగోలుగా విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారు. దీంతో టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో గ్రానైట్ క్రషర్లను నిలిపివేశారు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అది తట్టుకోలేక పలువురు క్రషర్లను నిలిపివేశారు. అయితే టీడీపీకి చెందిన కొన్ని క్రషర్లు ఎలాంటి నిబంధనలు పాటించక పోయినప్పటికీ వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం.. రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల గనుల యజమానులు, కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా వేధిస్తున్నారు. ఒకరిద్దరు కూటమి నేతల కన్నుసన్నల్లోనే అనధికారికంగా గనుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల తీరువల్ల అందరికీ ఇబ్బందులెదురవుతున్నాయి. ఇది చాలా అన్యాయం.– ప్రవీణ్ కుమార్, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లాపర్మిట్లు బ్లాక్ చేశారుమైకా గనులను దక్కించుకునేందుకు ఎనిమిది నెలలుగా కూటమి నేతలు పడారని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని గనులకు అనుమతులను మంజూరు చేసినప్పటికీ, నేటికీ పర్మిట్లు ఇవ్వలేదు. దీంతో రోజు రోజుకూ మైనింగ్ పరిశ్రమ కుదేలవుతోంది. కార్మికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.– నాగార్జున, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లాఎంతగా సర్దుకుపోతున్నా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రచారం చేసిన వ్యక్తి క్వారీని నిలిపివేశారు. క్వారీలో ఎలాంటి అవకతవకలు లేకపోయినా ఎందుకు నిలిపివేశారని మైన్స్ అధికారులను అడిగితే దయచేసి తమను ఏమీ అడగొద్దని, పైనుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. దీంతో గ్రానైట్ క్వారీలకు సంబంధించిన డంపింగ్లను అధికార పార్టీ నాయకులు బలవంతంగా లాక్కున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఎంతగా సర్దుకుపోతున్నా ఇక్కట్లు తప్పడం లేదు. – క్వారీ యజమానులు, ప్రకాశం జిల్లా -
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఉద్యోగం ఇదే..!
‘నేను ఉద్యోగం మానేస్తా.. మానేస్తా..’ అని మీరు చేస్తున్న ఉద్యోగమే కష్టమైందని అనుకుంటున్న వారంతా ఇక్కడ ఓ లుక్ వేయండి. జీవనోసాధి కోసం కొందరు ప్రాణాలనే పణంగా పెట్టి, ఆపదతో కూడిన ఉద్యోగాలెన్నో చేస్తుంటారు. అలాంటి వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన, ప్రమాదకరమైన ఉద్యోగం ఒకటి ఉందని ప్రముఖ యూట్యూబర్ దారా తహ్ చెప్పాడు. ‘ఇండోనేషియాలోని మౌంట్ ఇజెన్ అగ్ని పర్వతం దగ్గర పనిచేసే గని కార్మికులు అగ్నిపర్వతం నుంచి వెలువడే విష వాయువులతో రోజూ పోరాడాల్సి ఉంటుంది. ఆ వాయువుల్లో కొన్ని తక్షణమే చంపగలవు. అక్కడి వాయు మేఘాలు ఒక్కసారిగా కమ్ముకొచ్చి, ఊపిరి తీసే ప్రమాదం ఉంది. అక్కడి గంధకం గనికి వెళ్లే మార్గంలో ఒక యాసిడ్ సరస్సు ఉంది. ఇది చూడటానికి చక్కగా స్నానానికి అనువుగా అనిపిస్తుంది కాని, ప్రపంచంలోనే ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న సరస్సుల్లో ఇదీ ఒకటి. ప్రతిరోజూ వివిధ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల కోసం ఉపయోగించే సల్ఫర్‌ను ఇలాంటి ప్రదేశాల నుంచే సేకరిస్తారు. ‘ఇక్కడ ఒక అరగంట కూడా నేను ఉండలేకున్నా, నా జీవితంలో చూసిన అత్యంత ప్రమాదకర ఉద్యోగం ఇదే’ అంటూ తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. (చదవండి: నాటి బాలకార్మికురాలు..ఇవాళ లీడ్ స్టార్!) -
మైలారంలో ఉద్రిక్తత.. పోలీసులు రాకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: బల్మూర్ మండలం మైలారం(Mylaram) గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ వెలికితీతను నిలిపివేయాలంటూ గత మూడు నెలలుగా ఆ గ్రామ రైతులు(Farmers), ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. దీంతో మహిళలను, రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామానికి పోలీసులు రాకూడదని.. గ్రామ ప్రధాన రహదారిపై ముళ్ళ కంచె వేసి పెద్ద ఎత్తున పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రైతు ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికైనా సిద్ధమంటూ మందు డబ్బులతో రైతులు, మహిళలు రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు -
భారమైన జీవనాన్ని పరుగులు తీయిస్తోంది
జీవితం ప్రతి దశలోనూ ఒక అడ్డంకిని సృష్టిస్తుంది. ఆ అడ్డంకిని ఎదుర్కొనే విధానంలోనే విజయమో, అపజయమో ప్రాప్తిస్తుంది. విజయాన్ని సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది మూడు పదుల వయసున్న సంతోషి దేవ్ జీవన పోరాటం. హర్యానా వాసి సంతోషి దేవ్ ఒడిశాలోని కొయిడా మైనింగ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే వోల్వో ట్రక్కు నడుపుతోంది. ఈ రంగంలో పురుషులదే ప్రధాన పాత్ర. మరి సంతోషి మైనింగ్‌లో ట్రక్కు డ్రైవర్‌గా ఎలా నియమితురాలైంది?! ముందు ఆమె జీవనం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. మలుపు తిప్పిన గృహహింస...పదహారేళ్ల వయసులో సంతోషి దేవ్‌ని ఒడిశాలోని హడిబంగా పంచాయతీ, బాదముని గ్రామంలోని ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. నిత్యం వరకట్న వేధింపులు, గృహహింసతో బాధాకరంగా రోజులు గడిచేవి. కన్నీటితోనే తన పరిస్థితులను తట్టుకుంటూ కొన్నాళ్లు గడిపింది. అందుకు కారణం తల్లిదండ్రులకు తొమ్మిదిమంది సంతానంలో తను ఆరవ బిడ్డ. ఎంతటి కష్టాన్నైనా సహనంతో సర్దుకుపొమ్మని పుట్టింటి నుంచి సలహాలు. కొన్నాళ్లు భరించినా, కఠినమైన ఆ పరిస్థితులకు తల వంచడానికి నిరాకరించి, పోరాడాలనే నిర్ణయించుకుంది. తిరిగి పుట్టింటికి వచ్చింది. కానీ, అక్కున చేర్చుకోవాల్సిన కన్నవారి నుంచి అవమానాల్ని ఎదుర్కొంది. అధైర్యపడకుండా, తన సొంత మార్గాన్ని ఎంచుకోవాలనుకుంది. స్కూల్ వయసులోనే డ్రాపౌట్ స్టూడెంట్. తెలిసినవారి ద్వారా స్పిన్నింగ్ మిల్లులో పని చేయడానికి జీవనోపాధి కోసం తమిళనాడుకు వలస వచ్చింది.కుదిపేసిన పరిస్థితుల నుంచి...భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందింది. 2021లో క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్్సపోర్ట్ (సిఆర్యుటి) నిర్వహిస్తున్న సిటీ బస్ సర్వీస్ అయిన ‘మో’ బస్‌కు డ్రైవర్‌గా నియమితురాలైంది. ఒడిశాలో ఒంటరి మహిళా బస్సు డ్రైవర్‌గా మహిళా సాధికారతని చాటింది. అయితే ఆశ్చర్యకరంగా, ఆమె విజయగాథ అక్కడి నుంచి తొలగింపుతో ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ‘తొలి మహిళా బస్సు డ్రైవర్ కావడంతో స్థానిక మీడియా నన్ను హైలైట్ చేసింది. ఒక నెల తరువాత, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. నా తప్పు ఏమిటో అర్థం కాలేదు. కానీ, మళ్ళీ జీవితం నన్ను పరీక్షించిందని అర్ధమైంది. దీంతో బతకడానికి మళ్లీ ఆటో రిక్షా డ్రైవింగ్‌కు వచ్చేశాను’ అని తన జీవిత ప్రస్థానాన్ని వివరించింది సంతోషి. ఆరు నెలల క్రితం ఓ మైనింగ్ కంపెనీ సంతోషి పట్టుదల, ధైర్యాన్ని గుర్తించింది. వోల్వో ట్రక్కును నడపడానికి ఆఫర్ చేసింది. ‘ఏ కల కూడా సాధించలేనంత పెద్దది కాదు. ఆరు నెలల నుంచి నెలకు రూ.22,000 జీతం పొందుతున్నాను’ అని గర్వంగా చెబుతోంది ఈ పోరాట యోధురాలు. జీవనోపాధిని వెతుక్కుంటూ...‘‘మా అత్తింటిని విడిచిపెట్టిన నాటికే గర్భవతిని. కొన్ని రోజులకు తమిళనాడులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడే 2012లో కూతురు పుట్టింది. మూడేళ్లు నా తోటి వారి సాయం తీసుకుంటూ, కూతురిని పెంచాను. ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతి పైసా పొదుపు చేశాను. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చెన్నైలో ఆటో రిక్షా నడుపుతున్న ఓ మహిళను చూశాను. ‘ఆమెలా డ్రైవింగ్ చేయలేనా?‘ అని ఆలోచించాను. నా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తం, చిన్న రుణంతో ఆటో రిక్షా కొనుక్కుని ఒడిశాలోని కియోంజర్కి వచ్చేశాను. నా కూతురుకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆమెను హాస్టల్ వసతి ఉన్న స్కూల్లో చేర్పించాను. ఒడిశాలోని అనేక మంది ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నాను’ అని వివరించే సంతోషి ఆశయాలు అక్కడితో ఆగలేదు. -
‘సరే’నంటేనే సై..
సాక్షి ట్కాస్‌ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం మైనింగ్ గనుల లీజు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ముఖ్య నేత ఆదేశాలు తమ పొట్టకొడుతున్నాయని గనుల యజమానులు లబోదిబోమంటున్నారు. వారిని దారికి తెచ్చుకునేందుకు ఆరు నెలలుగా అనుమతులు నిలిపి వేసిందే కాక ఎంపీ వేమిరెడ్డి చెప్పినట్లు వినాలనడంపై మండిపడుతున్నారు. గనుల్లో దొరికే మైకా క్వార్ట్జ్, క్వార్ట్జ్ ఖనిజం తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకున్న గనులకు మాత్రమే అనుమతులిస్తూ.. మిగతా వాటికి అనుమతులు నిలిపివేస్తుండడమే ఈ పరిస్థితికి కారణం. పైగా.. వెంకటగిరి రాజా కుటుంబానికి చెందిన గనులకు సైతం అనుమతులివ్వకపోవడంతో ఎప్పుడు గడపదాటని ఆ కుటుంబం సైతం మైనింగ్ కార్యాలయం వద్ద పడిగాపులు కాసేలా చేయడంతోపాటు సదరు అధికారి వద్ద ఘోర అవమానం పొందేలా ప్రభుత్వ పెద్దలు పరిస్థితి కల్పించారు. దీంతో.. ఆ కుటుంబంపై గౌరవం ఉన్న ప్రతిఒక్కరూ వారికి జరిగిన అవమానంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తే దీనంతటికీ కారణమని వారు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. పైగా.. పోలీసుల సాయంతో స్థానిక ప్రజాప్రతినిధి సైదాపురంలో అనధికార వ్యాపారం చేసుకుని రూ.కోట్లు దండుకున్నారు.ఎంపీ వేమిరెడ్డి వైపే ప్రభుత్వ పెద్దల మొగ్గు..ఈ పరిస్థితుల్లో.. మైనింగ్ వ్యాపారంలో ఆరితేరిన ఎంపీ వేమిరెడ్డికి సైదాపురం గనులపై కన్నుపడింది. అంతే.. ప్రభుత్వ పెద్దలతో నెలవారీగా రూ.30 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని జిల్లాలో ఉన్న మైకా క్వార్ట్జ్ను కొనుగోలు చేసి విదేశాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలూ వ్యతిరేకించారు. మరోవైపు.. తిరుపతి జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉంటూ ఆ పార్టీ అధినేత సామాజికవర్గానికి చెందిన ఓ నేత ఆ గనులను దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలందరినీ కూటమి కట్టినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు చేయని ప్రయత్నంలేదు. కానీ, వేమిరెడ్డి వైపే ప్రభుత్వ పెద్దలు మొగ్గుచూపడంతో ఎమ్మెల్యేలు వర్సస్ ఎంపీగా సీన్ మారిపోయింది.వారు చెప్పిన వాటికే అనుమతులు..ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో ఏడు భూగర్భ గనులు, 140 ఓపెన్ క్వార్ట్›జ్ గనులున్నాయి. వీటికి విడతల వారీగా అనుమతులిస్తున్నారు. ఇప్పటివరకు 24 గనులకు లైన్‌క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో.. ఉన్నతాధికారుల బృందం ఇటీవల సైదాపురం గనులను ప్రత్యేకంగా పరిశీలించి 80 గనులకు అనుమతులు మంజూరుచెయ్యొచ్చని డీఎంజీకి సిఫార్సుచేసింది. కానీ, వేమిరెడ్డి డిమాండ్లను ఒప్పుకున్న యజమానులకు సంబంధించిన గనులకు మాత్రమే అనుమతులు మంజూరుచేస్తున్నారు. మొదటి విడతగా నాలుగు గనులను పునరుద్ధరించగా జోగిపల్లి గ్రామానికి చెందిన పీబీజే కంపెనీకి రెండింటి అనుమతులు మంజూరుచేశారు. రెండో విడతలో.. సైదాపురం మండల టీడీపీ అధ్యక్షుడు జి కృష్ణమరాజుకు చెందిన మూడు గనులు.. అలాగే, సాధన మినరల్స్ అధినేత సురేష్‌రెడ్డికి చెందిన మరో ఆరు గనులకు అనుమతులు మంజూరు చేశారు. రెండ్రోజుల క్రితమే కేపీఆర్ మినరల్స్ కంపెనీకి చెందిన రెండు గనులు.. మరోసారి పీబీజే కంపెనీకి చెందిన మరో మూడు గనులు.. అమృతేష్ మైనింగ్ కంపెనీ, పి. సుశీలమ్మ, ఒగ్గు కృష్ణయ్య, రాహుల్ సేన్, జాన్వా ఇన్ఫ్రా, నాగేంద్ర మైన్స్‌కు చెందిన 11 గనులకు అనుమతులిచ్చారు. కానీ, కోట్లాది రూపాయల డెడ్ రెంట్ చెల్లిస్తూ లీజులు పొందిన యజమానులకు మాత్రం అనుమతులివ్వడంలో జాప్యంచేస్తున్నారు.పెనాల్టీలు, కేసులు అంటూ బెదిరింపులు..మరోవైపు.. వెంకటగిరి రాజాలకు సైదాపురం మండలంలో మైనింగ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమపై వందలాది మంది జీవనం పొందుతున్నారు. అలాగే, రాధాకృష్ణ మైనింగ్ కంపెనీలో కూడా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రెండు గనులకు మాత్రం అనుమతులివ్వలేదు. ఎందుకంటే వారు వేమిరెడ్డికి విక్రయించే విధానాన్ని వ్యతిరేకించారు. అన్ని అనుమతులు ఉండి తామే విదేశాలకు ఎగుమతులు చేసుకుంటామని నిక్కచ్చిగా చెప్పడంతో వారి గనులకు అనుమతులివ్వలేదు. వాటిపై పెనాల్టీలు వేస్తామని, కేసులు నమోదుచేయిస్తామని భయపెట్టినా వారు లొంగకపోవడంతో వారిని వేధిస్తున్నారు. దీంతో.. ఇటీవల గూడూరులో పలువురు గనుల యజమానులు సమావేశమై ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలతోనే వ్యవహారం తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు.వెంకటగిరి రాజాకు అవమానంఇదిలా ఉంటే.. అనుమతుల విషయంలో ఇబ్బందిపెడుతున్న నెల్లూరు మైనింగ్ డీడీని కలిసేందుకు వెళ్లిన వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమార యాచేంద్రకు ఘోర అవమానం జరిగింది. తనతోపాటు అనుమతులు రాని యజమానులతో కలిసి వెళ్లిన రాజాను బయటకెళ్లాలని సదరు అధికారి చెప్పడంపై ఆయన అవమానంగా భావించారు. అన్ని సక్రమంగా ఉన్న తమకెందుకు అనుమతులివ్వలేదని నిలదీశారు. రెండ్రోజుల్లో అనుమతులివ్వకుంటే ప్రభుత్వం వద్దే తేల్చుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
వేమిరెడ్డికి గనుల యజమానుల షాక్
-
ఎంపీ వేమిరెడ్డి ఆగడాలు..గనుల యజమానుల రహస్య భేటీ..!
సాక్షి,నెల్లూరు:టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా నెల్లూరు(Nellore)జిల్లా మైనింగ్ కంపెనీల యజమానులు సమావేశమయ్యారు. జిల్లాలో క్వార్జ్ మైనింగ్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సైదాపురంలో ఉన్న తెల్లరాయి తవ్వకం,రవాణాకు అనుమతులు దక్కించుకుని వందల కోట్ల మైనింగ్‌ను ఎంపీ వేమమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakarreddy) తన గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన ధరకే క్వార్ట్జ్ అమ్మాలంటూ గనుల యజమానులపై వేమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా గూడూరులోని ఓ హోటల్లో గనుల యజమానులు రహస్య సమావేశం నిర్వహించారు. వేమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు మైనింగ్ యజమానులు ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: పోలీసుల ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు -
వేమిరెడ్డికే క్వార్ట్ జ్ గనులు.. ఎంపీ వెనుక కీలక నేత !
-
‘ఉక్కు’ మహిళలు!
ప్రముఖ స్టీల్ తయారీ కంపెనీ టాటా స్టీల్ మైనింగ్ కార్యకాలాపాలను పూర్తిగా మహిళలతోనే నిర్వహించి రికార్డు నెలకొల్పింది. పురుషులకు ధీటుగా మైనింగ్ పనుల్లో పూర్తి మహిళలతో స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశంలో మొట్టమొదటిసారి ఇలా మహిళలతో మైనింగ్ పనులు చేయిస్తున్న కంపెనీగా టాటా గుర్తింపు పొందింది.ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని నోముండి ఇనుప గనిలో టాటా స్టీల్ మహిళాషిఫ్ట్ను ప్రారంభించింది. భారీ మెషినరీ, పారలు, లోడర్లు, డ్రిల్స్, డోజర్లు, షిఫ్ట్ పర్యవేక్షణతో సహా అన్ని మైనింగ్ కార్యకలాపాలను మహిళా ఉద్యోగులతోనే నిర్వహిస్తోంది. మహిళలు దేనిలో తక్కువకాదని చెప్పడంతోపాటు వారు సమాజంలో మరింత ధీమాగా ఉండేలా కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడంలో స్థానికులను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేకంగా ‘తేజస్విని’ పేరుతో నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
మైనింగ్‌పై కూటమి పిడుగు
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమపై మళ్లీ కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. పెండింగ్‌లో ఉన్న కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని లీజుదారులకు ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం మైనింగ్ యజమానులు బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్‌పోస్టు వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆన్లైన్లో ఆదేశించడంతో మైనింగ్ యజమానులు షాక్ గురయ్యారు. ఒక్కో లీజుదారుడు రూ.20 లక్షలు మొదలుకొని రూ.60 లక్షల వరకు చెల్లించాలని ఆన్లైన్లో చూపిస్తుండటంతో కంగుతిన్నారు. గతంలో రాయల్టీలు (పర్మిట్లు) తీసుకున్న వారంతా బల్క్‌గా కేటాయించిన అమౌంట్‌ను 2025 జనవరి 10వ తేదీలోగా చెల్లించాలని డెడ్‌లైన్ విధించారు. లేదంటే పర్మిట్లు రద్దవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కన్సిడరేషన్ మొత్తాన్ని బల్క్‌గా కాకుండా ప్రతి పర్మిట్‌పై వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది.మైనింగ్ లీజుదారులు ఆన్లైన్లో రాయల్టీ పొందాలంటే డీఎంఎఫ్తో కలిసి రూ.482 చెల్లించేవారు. ఇకపై ప్రతి రాయల్టీపై కన్సిడరేషన్ మొత్తాన్ని సైతం చెల్లించాల్సి వస్తోంది. అంటే రాయల్టీపై యజమానులకు అదనపు భారం పడనుంది. లక్షలాది రూపాయలు జరిమానా రూపంలో డెడ్‌లైన్ విధించి మరీ చెల్లించాలనడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు 1,150 హెక్టార్లలో మైనింగ్ జరుగుతుండగా.. 600 మందికిపై లీజుదారులు ఉన్నారు. ఈసీ, మైనింగ్ ప్లానింగ్ తదితర రికార్డులు ఉన్న లీజుదారులకు మాత్రమే రాయల్టీలు వస్తున్నాయి. మిగిలిన లీజుదారులకు కూటమి ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి ఆన్లైన్ రాయల్టీలు విడుదల చేయకపోవడంతో చాలామంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆందోళనతో స్తంభించిన రవాణారాయల్టీ చెక్‌పోస్టు వద్ద మైనింగ్ యజమానులు ఆందోళనతో నాపరాళ్లను రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు రాయల్టీ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని మైనింగ్ యజమానులతో చర్చించి నిలిచిపోయిన వాహనాలను పంపించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొసమెరుపు. -
గుంటూరు టీడీపీలో మైనింగ్ రగడ
ప్రత్తిపాడు: గుంటూరు టీడీపీలో మైనింగ్ రగడ రచ్చకెక్కింది. నియోజకవర్గ టీడీపీ నేత తమను మట్టి తవ్వకాలు చేసుకోమన్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన ఓ వర్గం... టీడీపీ జిల్లా నేత తమనే తవ్వుకోమన్నారంటూ మరో వర్గం తన్నులాడుకుంటున్నాయి. చివరకు ఈ పంచాయితీ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రెండు వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం నడింపాలెం జాతీయ రహదారి సమీపంలోని సర్వే నంబర్ 149లో ఉన్న సుమారు 4 ఎకరాలను ఎన్.రత్తయ్య అనే వ్యక్తి ప్రత్తిపాడుకు చెందిన ఓ వ్యాపారి బంధువులకు విక్రయించాడు.అతడు నియోజకవర్గ కీలక నేతకు చెందిన ప్రత్తిపాడు మండల నాయకులకు మైనింగ్‌కు లీజుకిచ్చాడు. అదే భూమిని ఆయన కుమారుడు సునీల్ గుంటూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత వర్గీయులు అయిన గుంటూరు రూరల్ మండలం నాయకులకు లీజుకిచ్చాడు. దీంతో ఇరువర్గాలు ఆ భూమిలో మైనింగ్ పనులు మొదలుపెట్టి పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు మధ్య వార్ నడుస్తోంది. ఒక వర్గంపై మరో వర్గం ఆధిపత్యం కోసం పరస్పరం ప్రయత్నాలు చేస్తున్నాయి. మా మండలం వచ్చి మట్టి తోలడానికి మీరెవరంటూ ఒక వర్గం... మీ మండలం అయితే రాకూడదా.. తవ్వకూడదా.. అంటూ మరో వర్గం భీషి్మంచాయి. దీంతో భూముల యజమానులు అధికారులకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లోనూ తెగని పంచాయితీ గుంటూరు రూరల్ మండలానికి చెందిన వర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైతో మాట్లాడింది. తమ స్థలంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, కేసు నమోదు చేయాలని కోరింది. ఎస్సై స్పందించకపోవడంతో ఆ వర్గం సీఐ వద్దకు వెళ్లగా.. ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. ఆ వర్గం తిరిగి ఎస్సై వద్దకు వచ్చింది. ‘ఫిర్యాదు ఇస్తారా.. మీరేం ఇస్తారో ఇవ్వండి. నేనూ చూస్తా’ అని ఎస్సై అనడంతో ఏం చేయాలో అర్థంకాక ఫిర్యాదు చేసేందుకు వచి్చన వాళ్లు వెనుకడుగువేశారు. అనంతరం శనివారం రాత్రి ఇరువర్గాలకు చెందిన సుమారు యాభై మంది స్టేషన్‌కు వెళ్లగా.. ఆ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. ఇరువర్గాలు తగ్గకపోవడంతో పోలీసులు ‘ఏం చేయాలో మీరే తేల్చుకోండి. అప్పటివరకూ మైనింగ్ ఆపేయండి’ అని సలహా ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరకు ఇది శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొత్తగా బొగ్గు గనుల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం మూడు కంపెనీలకు బొగ్గు గనులకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్‌జెడ్కోలకు గనులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల 40,560 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌కు ఒడిశాలోని ముచ్చకట, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టాన్జెడ్కో కంపెనీలకు వరుగా ఒడిశాలోని అంగుల్ జిల్లా పరిధిలోని కుదనాలి లూబ్రి, సఖిగోపాల్-బి కకుర్హి బొగ్గు గనులను కేంద్రం కేటాయించింది. ఈ మూడు బొగ్గు గనుల సంచిత పీక్ రేటెడ్ కెపాసిటీ (పీఆర్సీ) 30 ఎంటీపీఏ(మిలియన్ టన్స్ పర్ యానమ్)గా నిర్ణయించారు. అయితే ఈ గనుల మొత్తం కెపాసిటీ 2,194.10 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. వీటి ద్వారా వార్షిక ఆదాయం రూ.2,991.20 కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కంపెనీలకు కేటాయించిన పీఆర్సీ ఆధారంగా రూ.4,500 కోట్ల పెట్టుబడి సమకూరే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,560 మందికి ఉపాధి లభిస్తుందని వివరించింది.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..ఇటీవల జారీ అయిన బొగ్గు గనుల కేటాయింపు ఉత్తర్వులతో కలిపి మొత్తం 95 గనుల నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. వాటి మొత్తం పీఆర్సీ సామర్థ్యం 202.50 ఎంటీపీఏగా ఉంది. దీనివల్ల రూ.29,516.84 కోట్ల వార్షిక ఆదాయం సమకూరుతుంది. ఈ గనుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,73,773 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. -
AP: గనులపై ముడుపుల కత్తి
సాక్షి, అమరావతి: ముడుపుల కోసం అధికార కూటమి నేతల ఒత్తిడితో గత రెండున్నర నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ స్థంభించింది. పలు ఖనిజ వనరుల తవ్వకాలు, వాటి అనుబంధ పరిశ్రమలు మూతపడ్డాయి. ముఖ్యంగా బెరైటీస్, క్వార్జ్, సిలికా, గ్రానైట్ క్వారీల మూసివేతలో ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. మైనింగ్ స్తంభించిన కారణంగా ఈ రెండున్నర నెలల్లో గనుల ద్వారా రావాల్సిన రూ.500 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. మరోపక్క గనులు, క్వారీలు, వాటి అనుబంధ పరిశ్రమలు, రవాణా రంగానికి సంబంధించి వేలాది కార్మికుల కుటుంబాలు పనుల్లేక రోడ్డున పడ్డాయి.జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా క్వారీలపై విరుచుకుపడి మూసివేయించారు. తమ వాటాల సంగతి తేల్చి, అడ్వాన్సు ఇచ్చాకే క్వారీలు తెరవాలని స్పష్టం చేయడంతో మైనింగ్ పరిశ్రమ మొత్తం కుదేలైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారపార్టీ పెద్దల ఆశీస్సులతో జిల్లాలవారీగా కూటమి నేతలు మైనింగ్ పరిశ్రమలను పంచుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ మొత్తాన్ని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకి అప్పగించారు. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకి బాధ్యతలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల్లో పెద్ద తలకాయలకు బాధ్యతలు అప్పగించారు. వారు గనులు, క్వారీల యజమానులతో బేరాలు సాగిస్తున్నారు. వారు కోరినంత కప్పం కట్టలేక గనుల యజమానులు మైనింగ్ నిలిపివేశారు.క్వారీల యజమానులు, అసోసియేషన్లు మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శిని కలిసినా వారు తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేసినట్లు సమాచారం. కొందరు ప్రభుత్వంలోని ముఖ్యులను సంప్రదించినా కప్పం కట్టక తప్పదని తేల్చడంతో క్వారీలు తెరిచేందుకు యజమానులు జంకుతున్నారు. కోరినంత ముట్టజెప్పకపోవడంతో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సిలికా శాండ్, క్వార్జ్ క్వారీలను సైతం మూసివేయించారు. శ్రీకాకుళం జిల్లాలో పలు గ్రానైట్ క్వారీలపైనా అధికార పార్టీ నేతలు ఉక్కుపాదం మోపారు.మరోపక్క ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ కొత్త లీజులు మంజూరు చేయకపోగా, కొనసాగుతున్న లీజులను కూడా స్థంభింపజేసింది. దీంతో బెరైటీస్, క్వార్జ్, సిలికా శాండ్ క్వారీలు పూర్తిగా మూతపడ్డాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప తదితర జిల్లాల్లో సీనరేజీ వసూళ్లను గత ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ వసూళ్లలో తేడాలున్నాయంటూ ఆ కంపెనీలను వేధించడంతో అవి కూడా కార్యకలాపాలను నిలిపివేశాయి.స్థంభించిన బెరైటీస్.. ఓఎన్జీసీకి కష్టాలువైఎస్సార్ కడప జిల్లా మంగంపేటలో అత్యంత కీలకమైన బెరైటీస్ లీజులను స్థంభింపచేశారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ఆధ్వర్యంలో జరిగే తవ్వకాలను కూడా నిలిపివేయడంతో బెరైటీస్ ఎగుమతులు ఆగిపోయాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఈ ఖనిజం దొరక్క దానిపై ఆధారపడ్డ పరిశ్రమలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. బెరైటీస్ లేక ఓఎన్జీసీ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఉత్పత్తికి కూడా విఘాతం ఏర్పడింది. వెంటనే బెరైటీస్ సరఫరా చేయాలని, లేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని ఓఎన్జీసీ ఉన్నతాధికారులు ఏపీఎండీసీకి నెల క్రితమే లేఖ రాశారు. అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు.తవ్వేసి.. తరలించేస్తున్నారుఇటు ఇసుక..ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో ఇసుక మాఫియా ఎనీ్టఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలోని కృష్ణా నది, మునేరు ఇసుకను ఇష్టారీతిన దోపిడీ చేస్తోంది. ఈ ఇసుకకు తెలంగాణలో అత్యధిక డిమాండ్ ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తవ్వేసి తరలించేస్తున్నారు. ఖమ్మంలో లారీ ఇసుక రూ.75 వేలకు, హైదరాబాద్‌లో రూ. లక్షకు అమ్ముకొంటున్నారు. ఇక్కడ తవ్వేస్తున్న ఇసుక, క్యూ కట్టిన లారీలు ఇలా అక్రమంగా తరలించడానికే. ఇటీవల పోలీసులు ఇటువంటి లారీలను పట్టుకొన్నా, ప్రభుత్వంలోని ముఖ్య నేతల అండతో మళ్లీ దందా మొదలెట్టారు. – సాక్షి ప్రతినిధి, విజయవాడఅటు గ్రావెల్..టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా బరితెగించింది. డి.పోలవరం శివారు అశోక్‌నగర్ గండి సమీపంలో ఎ.నాయుడికి చెందిన 1.15 ఎకరాల డి పట్టా భూమిలో అనుమతుల్లేకుండా భారీ మొత్తంలో గ్రావెల్ తవ్వేసి తరలించేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో స్థానిక టీడీపీ నేత పీఎస్ రావు రూ. కోటికి పైగా విలువ చేసే గ్రావెల్‌ను ఇక్కడి నుంచి తరలించేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి సమీపంలో తుని రూరల్ మండలం రాజులకొత్తూరులోనూ జిరాయితీ భూమి చదును పేరుతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్, మండల స్థాయి నాయకుడు గ్రావెల్‌ను అక్రమంగా తరలించేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడ -
ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు
భారత ప్రభుత్వం అరుదైన ఖనిజాలను వెలికితీసి అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలని యోచిస్తోంది. ‘నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్’పై ఇటీవల జరిగిన బడ్జెట్ సెమినార్లో కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి వీణా కుమారి మాట్లాడారు. అరుదైన ఖనిజాలను వెలికితీసే సంస్థలు రుణాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ఈ సందర్భంగా వీణా మాట్లాడుతూ..‘లిథియం వంటి కీలకమైన ఖనిజాలను వెలికితీసి అభివృద్ధి చేయాలి. అందుకోసం ప్రభుత్వం సహకారం అందిస్తుంది. సంస్థలు రుణాలు పొందేలా ఏర్పాటు చేస్తాం. మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మైనింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం సంస్థలకు కొన్ని రాయితీలు ఇవ్వాలనే చర్చలు సాగుతున్నాయి. గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారంపై భారత్ దృష్టి సారిస్తుంది. వెలికితీసిన ఖనిజాల తరలింపునకు గనుల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే బలమైన బ్యాంకులుప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ వాడకం పెరుగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, బ్యాటరీలు, మధర్‌బోర్డులు, ప్రాసెసర్లు, ఇతర వస్తువుల తయారీలో లిథియం వంటి అరుదైన ఖనిజాలను వాడుతున్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఖర్చుతోపాటు, రవాణా క్లిష్టంగా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. అయితే వాటిని వెలికితీసి అభివృద్ధి చేయడం సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా ఖనిజాల అన్వేషణ, మైనింగ్, శుద్ధీకరణ, ప్రాసెసింగ్, రీసైక్లింగ్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ప్రభుత్వం కోరుతోంది. -
సుప్రీం కోర్టు తీర్పు.. రూ.2 లక్షల కోట్లు నష్టం
ఖనిజాలు, గనులు కలిగిన భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా మైనింగ్ కంపెనీలపై రూ.1.8 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు భారం పడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని అంచనా.భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) సుప్రీం తీర్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని ఫిమి పేర్కొంది.ఈ సందర్భంగా ఫిమి అడిషనల్ సెక్రటరీ జనరల్ బీకే భాటియా మాట్లాడుతూ..‘మైనింగ్ కంపెనీలు ఏప్రిల్ 1, 2005 నుంచి పొందిన రాయల్టీలను తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతోపాటు మైనింగ్ భూమిపై పన్ను విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పింది. దాంతో కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గనులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా మైనింగ్ కంపెనీలు భారీగా పన్నులు చెల్లిస్తున్నాయి. సుప్రీం తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్లు కాదు..వీరి గురించి తెలుసా..ఇదిలాఉండగా, ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కంపెనీలు గత 12 ఏళ్ల నుంచి రాయల్డీ బకాయిలు చెల్లించడం భారం అవుతుంది. ఇప్పటికే చాలా ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. దీనికితోడు సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనా. ఖనిజాలను ముడిసరుకుగా ఉపయోగించుకుని తయారయ్యే ప్రతి వస్తువుపై దీని ప్రభావం ఉంటుంది. కోర్టు తీర్పు పాటించాలంటే కంపెనీలు తన జేబులో నుంచి డబ్బులు వెచ్చించవు. తిరిగి వినియోగదారులపైనే ఆ భారాన్ని మోపుతాయి. దానివల్ల సామాన్యుడికే నష్టమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. -
Supreme Court: ఆ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: ఖనిజ సంపన్న రాష్ట్రాలకు శుభవార్త. గనులకు సంబంధించిన రాయల్టీ, పన్నుల తాలూకు బకాయిలను కేంద్రం నుంచి వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2005 ఏప్రిల్ 1 నుంచీ బకాయిలను వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. బకాయిలను 12 ఏళ్లలోపు చెల్లించాలని కేంద్రాన్ని, వాటిపై పెనాలీ్టల వంటివేమీ విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది.ధర్మాసనం తరఫున సీజేఐ తీర్పు రాశారు. ఖనిజాలు, నిక్షేపాలున్న భూములపై రాయల్టీ వసూలు అధికారం కేంద్రానిదేనన్న 1989 నాటి సుప్రీంకోర్టు తీర్పును పలు రాష్ట్రాలు సవాలు చేశాయి. గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందంటూ 8:1 మెజారిటీతో జూలై 25న ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని 1989 నుంచీ వర్తింపయాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు ఒప్పుకుంటే సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రాలకు రూ.70 వేల కోట్ల మేరకు చెల్లించాల్సి రావచ్చని తెలిపింది. కనుక తీర్పును జూలై 25 నుంచే వర్తింపజేయాలని అభ్యర్థించింది. దీన్ని ధర్మాసనం తాజాగా తోసిపుచి్చంది. -
ఓఎంసీ ఓర్ ఊడ్చేస్తున్నారు
రాయదుర్గం: ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ సీజ్ చేసిన విలువైన ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం)ను పచ్చముఠాలు చీకటి మాటున తరలించేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో తవ్వకాలు నిలిపివేసి సుమారు 8లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని 2011లో సీబీఐ సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కన్నేసిన టీడీపీ నాయకులు నాలుగైదు రోజులుగా ఓఎంసీలోకి చొరబడి లారీల్లో ఇనుప ఖనిజాన్ని చీకటి పడగానే సమీప స్టీల్ ఫ్యాక్టరీల్లోకి తరలిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కొండ ప్రాంతాల్లో లారీల సంచారం, లైట్లను గమనించిన స్థానికులు ఓఎంసీలో దొంగలు పడ్డారని చర్చించుకుంటున్నారు. రోజుకు సుమారు 4 వేల టన్నులు మాయం అవుతున్నట్లు సమాచారం. నాణ్యతను బట్టి టన్ను రూ.4 వేల వరకు విక్రయిస్తుండడంతో భారీగా లూటీ చేసినట్లు అంచనా. ఓఎంసీలో లభ్యమయ్యే ఇనుప ఖనిజం నాణ్యతకు పేరు పొందింది. దీన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు పథకం ప్రకారం వ్యవహరించారు. ఇందులో భాగంగా ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించారు. సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం గత ప్రభుత్వ హయాంలోనే తరలి పోయిందంటూ తప్పుడు కథనాలను వండి వార్చారు. నిస్సహాయంగా పోలీసులు.. ఓఎంసీలో ఇనుప ఖనిజం తరలిపోతున్నా పోలీసులు కళ్లప్పగించి చూడటం మినహా చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. లాఠీ ఝుళిపిస్తే బదిలీ తప్పదనే భయం వారిని వెంటాడుతోంది. ఇనుప ఖనిజాన్ని టీడీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఇటీవల బహిర్గతం చేశారు. గత ప్రభుత్వంలో దోచేసినట్టు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. దోపిడీ అంశాన్ని సీబీఐ డైరెక్టర్‌తో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెస్తామన్నారు. ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టంఓఎంసీలో సీజ్ చేసిన ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టేది లేదు. సత్వరం ఓ బృందాన్ని అక్కడికి పంపి దర్యాప్తు చేయిస్తాం. సీబీఐ పరిధిలో ఉన్న వ్యవహారంలో తల దూర్చితే తీవ్ర పరిణామాలు తప్పవు. లారీ యజమానులు ఆలోచించి బాడుగకు వెళ్లాలి. ఏమాత్రం పట్టుబడినా అక్కడే సీజ్ చేస్తాం. అంగుళం కూడా కదలనివ్వం. నిల్వ ఉంచిన ఖనిజం బాగున్నా, పాడైనా బయట వ్యక్తులు ఎవరూ తాకటానికి వీల్లేదు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలను అప్రమత్తం చేసి అడ్డుకట్ట వేస్తాం. – నాగయ్య, మైనింగ్ డీడీ, అనంతపురం -
చిరుద్యోగిని సస్పెండ్ చేసి.. అక్రమాలపై ‘మట్టి’ కప్పి..
సాక్షి, విశాఖపట్నం: ఎర్రమట్టి దిబ్బల్ని టీడీపీ నేతలు ధ్వంసం చేసిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం విచారణను మమ అనిపించేసింది. ఓ చిరుద్యోగిని బలి చేసి, అసలు పాత్రధారులు, సూత్రధారులైన కూటమి నేతల్ని పక్కకి తప్పించేసింది. భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల్ని పరిరక్షించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బఫర్ జోన్‌ని దాటి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న దారుణాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘మట్టి దిబ్బలు మటాష్.!’ శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడింది. అధికార కూటమి నేతలే ఎర్రమట్టి దిబ్బల్ని హరిస్తుండటంతో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు నాటకమాడింది. ప్రభుత్వ ఆదేశంతో జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) మయూర్ అశోక్, రెవెన్యూ, గనులశాఖ అధికారులు బుధవారం ఆ ప్రాంతాన్ని మొక్కుబడిగా పరిశీలించారు. అక్రమ తవ్వకాలపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా చేస్తున్న పనులను వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణకు ఆదేశించారు. స్థానిక అధికారులదే తప్పని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ హడావుడి చేశారు. ఈ ప్రాంతాన్ని సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించారు. ఎంత విస్తీర్ణంలో తవ్వేశారో గనుల శాఖ అధికారులు కూడా లెక్కలు వేస్తున్నారు. వెంటనే ఇక్కడ తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.చిరుద్యోగిపై చర్యఎర్రమట్టి దిబ్బలు నిడిగడ్డు సచివాలయం పరిధిలో ఉండటంతో ఆ సచివాలయం ఇన్చార్జి ప్లానింగ్ సెక్రటరీ కాగిత అజయ్‌కుమార్ సరిగా స్పందించలేదని ఆయన్ని సస్పెండ్ చేశారు. వాస్తవానికి అజయ్‌కుమార్ భీమిలి తోట వీధి సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ. నిడిగడ్డుకు ఇన్చార్జిగా వచ్చారు. తుది విచారణలోనూ ఉద్యోగుల్నే బలి చేయాలని, నేతల పేర్లు బయటికి తేవద్దంటూ ఇప్పటికే జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బఫర్ జోన్‌కు బయట 70, 80 ఏళ్లుగా జీడి తోటలు వేసుకొన్న రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ చేసిన వ్యవహారంపై బాబు, పవన్ పెద్ద రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చిన నెలలోనే టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై బఫర్‌జోన్ దాటి తవ్వకాలు జరిపి మట్టి తరలించేస్తున్నారు. దీనిపై సాక్షి కథనంతో ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ ఇప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉండి స్పందించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.ప్రభుత్వ పెద్దల సహకారంతోనే తవ్వకాలుకొమ్మాది: ప్రభుత్వ పెద్దల సహకారంతో, స్థానిక కూటమి నేతల మద్దతుతోనే ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం తవ్వకాల వద్ద సెల్ఫీ తీసుకుని ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాబు కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లో భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇదంటూ పోస్టు చేశారు. -
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు.
-
అగ్నివీర్లకు పోలీస్, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పదవికాలం ముగిసిన అగ్నివీర్లకు (హర్యానాకు చెందిన వారు) పోలీసు, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తన్నట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ప్రకటించారు. అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని సీఎం మండిపడ్డారు. నైపుణ్యం కలిగిన యువతకు ఇది మంచి అవకాశమని ప్రధాని నరేంద్ర మోదీనే పేర్కొన్నారని చెప్పారు. కాగా హర్యానాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా అగ్నిపథ్ పథకంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొన్న సంగతి తెలిసిందే.అగ్నిపథ్ పథకాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ 2022 సెప్టెంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. వీరి ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకంలో పాత విధానంలో ఉన్న దీర్ఘకాలిక పదవీకాలం, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు ఉండవు.ఈ పథకంపై దేశంలో నిరసనలూ చెలరేగాయి. దేశం లోని పలు ప్రాంతాల్లో ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. కొత్త పథకంతో కోపంగా ఉన్న ఆర్మీ ఆశావహులు దీనిని వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చారు. బస్సులు, రైళ్లతో సహా ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. ఈ పథకాన్ని ప్రస్తుతానికి నిలిపివేసి, పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి. -
ఎర్రమట్టి దిబ్బలను ఎత్తుకెళ్తున్న పచ్చ మూకలు
-
బండరాళ్ల కింద ముగ్గురు సజీవ సమాధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కంచికచర్ల/జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ శివారులోని ఓ క్వారీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు సోమవారం ఉదయం డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు దొర్లిపడటంతో వాటికింద చిక్కుకుపోయి దుర్మరణం పాలయ్యారు. మృతుల్ని బత్తుల దుర్గారావు (19), సున్నా బీబీనాయక్ (40), బాగేల్ రాందేవ్ (36)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ నాయకుడు చింతల రామ్మోహనరావుకు చెందిన పవన్ గ్రానైట్ మెటల్ వర్క్స్ రాతి క్వారీలో ఒడిశాకు చెందిన బీబీ నాయక్, బాగేల్ రాందేవ్, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బత్తుల దుర్గారావు బ్లాస్టింగ్ చేసిన బండరాళ్లను తొలగించేందుకు కొండపైకి ఎక్కారు.ఒడిశాకు చెందిన కుమారి బోలీ దిగువన ఉన్న బండరాళ్లను పగులకొట్టేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైన ఉన్న రాళ్లను తొలగించే క్రమంలో ఒక్కసారిగా భారీ బండరాళ్లు ముగ్గురిపైనా పడటంతో విగతజీవులుగా పడి ఉన్నారు. బోలీ అనే యువకుడు సురక్షితంగానే ఉన్నాడు. మృతదేహాలను 5 గంటలపాటు శ్రమించి జేసీబీల సాయంతో వెలికితీశారు. క్వారీ యజమాని చింతల రామ్మోహనరావు నిర్లక్ష్యమే కార్మికుల పాటి మృత్యుపాశంగా మారింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఆపకుండా పని చేయించటం ముగ్గురు కార్మికులను మృత్యు ఒడికి చేర్చాయి.ఘటనా స్ధలాన్ని జిల్లా మైనింగ్ ఏడీ వీరాస్వామి, నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ బి.రవికిరణ్, నందిగామ ఆర్డీఓ ఎ.రవీంద్రరావు, నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్, ఇంటెలిజెన్స్ సీఐ యువకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు పీవీఎస్ సుబ్రహ్మణ్యం, హేమలత, తహసీల్దార్ సుస్వాగతం పరిశీలించారు.సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలుప్రమాదం జరిగిన క్వారీలో మైనింగ్ సేఫ్టీ నిబంధనల్ని క్వారీ యజమాని తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా మైనింగ్ చేయడంతోనే అక్కడ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలో ప్రతి 6 మీటర్లకు బెంచ్ ఫార్మేషన్ చేసుకుని ఎప్పటికప్పుడు లూజును తీసివేయాల్సి ఉండగా.. అక్కడ బెంచ్ ఫార్మేషన్ చేయలేదని గుర్తించారు. మైనింగ్ సేఫ్టీకి సంబంధించి క్వారీలో ఓ మేనేజర్‌ను నియమించాల్సి ఉన్నా అలా చేయలేదు.రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో కొండ చరియలు విరగటంతోపాటు, అక్కడ ఉన్న లూజు జారి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా బోల్డర్లను డ్రిల్లింగ్ చేయటమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. కాగా.. క్వారీలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 801 సర్వే నంబరులో 99 లీజులు ఉన్నప్పటికీ ఏ క్వారీ యజమాని నిబంధనలు పాటించటం లేదు. క్వారీ యజమానులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోపాటు, అధికారులు సైతం మామూళ్లు తీసుకొని, నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండాపోయింది.మూడు కుటుంబాల్లో విషాదంమృతుల్లో ఒకరైన బీబీ నాయక్ 15 సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి వలస వచ్చి జి.కొండూరు మండలం చెవుటూరు బాపూజీ కాలనీలో భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. బాగేల్ రాందేవ్ సైతం ఒడిశా నుంచి 20 ఏళ్ల క్రితం వలస వచ్చి భార్య, కుమార్తెతో చెవు టూరు శివారులోని క్వారీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పొట్ట కూటి కోసం క్వారీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రమాదంలో మృతి చెందిన బత్తుల దుర్గారావు చిన్న వయసులోనే మృత్యువాత పడడంతో చెరువు మాధవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.క్వారీ యజమానిపై కేసు నమోదుక్వారీ యజమాని చింతల రామ్మోహనరావుపై కేసు నమోదు చేసినట్టు నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్ తెలిపారు. మృతుడు దుర్గారావు తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.8.50 లక్షల చొప్పున క్వారీ యజమాని అందజేశారు.నా కళ్లెదుటే మరణించారుబీబీ నాయక్, రాందేవ్, దుర్గారావు కొండపైకి వెళ్లి రాళ్లను తొలగించే క్రమంలో పైనుంచి భారీ బండరాళ్లు వారిపై పడ్డాయి. దీంతో రాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. నా కళ్లెదుటే ముగ్గురూ మరణించారు. – కుమారి బోలీ, సహ కార్మికుడుభద్రతా చర్యలు చేపట్టకపోవడమే కారణంసర్వే నంబర్ 801లో రెండు హెక్టార్ల రాతి క్వారీని చింతల రామ్మోహనరావు పదేళ్లపాటు లీజుకు పొందారు. మైనింగ్ ప్లాన్, సేప్టీ మెజర్మెంట్స్ లేకపోవటం, బెంచీలు ఏర్పాటు చేయకపోవటం, సిస్టమాటిక్ మెజర్మెంట్స్ లేకపోవటం వల్లే ప్రమాదం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.– వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్ -
ఏపీ–కర్ణాటక సరిహద్దుల్లో గనుల సర్వే
రాయదుర్గం: ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని కర్ణాటక భూభాగంలో ఉండే ఏడు గనుల మైనింగ్ లీజుల విభజన ప్రక్రియపై గురువారం సీఈసీ కమిటీ సభ్యులు సర్వే నిర్వహించారు. 2009లోనే ఈ ఏడు గనుల్లో కంపెనీల కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. సీపీ గోయల్, ఎన్‌హెచ్ సునీల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మైనింగ్, రెవెన్యూ, అటవీ, ల్యాండ్ రికార్డు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే కొనసాగింది. కర్ణాటకలోని సండూరు తాలుకా తుమిటి, విఠలాపురం నుంచి ఏపీ సరిహద్దులోని అనంతపురం జిల్లా డి హీరేహాళ్ మండలం మలపనగుడి గ్రామ సరిహద్దులోని మోహబుల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (ఎంబీటీ) గని వరకు సర్వే చేపట్టారు. హింద్ ట్రేడర్స్ (హెచ్‌టీ), టి.నారాయణరెడ్డి (టీఎన్ఆర్) తదితర గనుల లీజ్‌దారులు సర్వేలో పాల్గొని లీజు అగ్రిమెంట్లు అధికారులకు సమర్పించారు. వాటి ఆధారంగా పునఃపరిశీలన జరిపారు. సరిహద్దు ప్రాంతాలను జీపీఎస్ రీడింగ్‌తో సర్వేచేశారు. గుర్తించిన రీడింగ్, పాయింట్లను రెవెన్యూ శాఖ హద్దులతో పోల్చి చూశారు. ఆ వివరాలను కేంద్ర ఉన్నతాధికారి సమితి (సీఈసీ)కి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి ఆధారంగా ఈనెల 5న శుక్రవారం డోనమలై (ఎన్ఎండీసీ) ప్రాంతంలో ఇరు రాష్ట్రాల అధికారుల ఆధ్వర్యంలో లీజుదారులతో సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి మైనింగ్ ఏడీ నాగయ్య, డీఎఫ్ఓ వినీత్‌కుమార్, ల్యాండ్ సర్వే ఏడీ రూప్లానాయక్, కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణిసుస్మిత, ఫారెస్ట్ రేంజర్ పి.మధుబాబు, డీ.హీరేహాళ్ తహసీల్దార్ ఈశ్వరరెడ్డి, కర్ణాటక రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. -
క్వారీలపై కూటమి నేతల జులుం
సాక్షి, అమరావతి: అధికార టీడీపీ కూటమి నేతల దౌర్జన్యపూరిత విధానాలతో రెండు వారాలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్వారీల్లో మైనింగ్ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయం నిల్చిపోవడంతో పాటు పలు పరిశ్రమలు, రవాణా రంగం ఇబ్బందుల్లో పడ్డాయి. ఇంకోపక్క టీడీపీ నేతలు పలు క్వారీల్లో అక్రమంగా మైనింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించే డైరెక్టరేట్ కార్యాలయాన్నే 14 రోజులుగా మూసివేశారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సైతం తెరవకుండా సీజ్ చేశారు. ఏదో జరిగిపోయిందనే అనుమానంతో మైనింగ్ జరుగుతున్న క్వారీలను స్తంభింపజేయడంతోపాటు మైనింగ్ కార్యాలయాలను సైతం మూసివేసి అక్కడి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు చెప్పినట్లు వినాలని అన్ని జిల్లాల మైనింగ్ డీడీలు, ఏడీలకు ఉన్నత స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇంకో పక్క కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు రకరకాల కారణాలతో క్వారీలపై విరుచుకుపడ్డారు. వారు క్వారీల వద్దకు వెళ్లి తవ్వకాలు నిలిపివేశారు. తాము చెప్పే వరకు క్వారీయింగ్ చేయకూడదని, క్వారీలు పని చేయాలంటే ముందుగా తమ సంగతి తేల్చాలని స్పష్టం చేశారు. దీంతో పక్కాగా అనుమతులు ఉన్న క్వారీల్లోనూ మైనింగ్ నిలిచిపోయింది. గ్రానైట్, రోడ్ మెటల్, క్వార్జ్, సున్నపురాయి వంటి అనేక క్వారీల్లో తవ్వకాలు నిలిచిపోయాయి.శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్‌పై దెబ్బ శ్రీకాకుళం జిల్లా కీలక మంత్రి ఆదేశంతో గ్రానైట్ మైనింగ్ ఆగిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆ జిల్లాలో వందకు పైగా ఉన్న గ్రానైట్ క్వారీలను అప్పటికప్పుడే స్తంభింపజేశారు. మైనింగ్ ఏడీ ద్వారానే తమ లెక్క తేలే వరకూ వాటిలో మైనింగ్ జరగక్కూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోవడంతో పాలిషింగ్ యూనిట్లకు ముడి సరుకు దొరక్క, అవి కూడా మూతపడుతున్నాయి. ఫలితంగా దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చే కోట్ల రూపాయల రాయల్టీ కూడా ఆగిపోయింది. క్వారీలకు అనుబంధంగా పనిచేసే ట్రక్కులు, లారీలు, లాజిస్టిక్ వ్యాపారాలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి. రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. వాటిల్లో పనిచేసే వేలాది మందికి కొద్ది రోజులుగా పని లేకుండాపోయింది. విశాఖ పోర్టు నుండి రోజుకు వంద నుండి రెండు వందల లారీల్లో గ్రానైట్ బ్లాక్స్, పాలిషింగ్ పలకలు ఎగుమతయ్యేవి. అవన్నీ ఇప్పుడు నిలిచిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ స్థానికంగా ఉన్న క్వారీల యజమానులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. స్థానిక నేతలు, ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెబుతున్నారు. తమ వాటాల సంగతి తేలిన తర్వాతే క్వారీయింగ్ జరగనిస్తామని చెప్పడంతో భయపడిన క్వారీల యజమానులు పనులు ఆపేశారు. మైనింగ్ అధికారులు కూడా తాము ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఎక్కడైనా అధికారులు జోక్యం చేసుకుంటే వారిని కూడా బెదిరిస్తున్నారు. అనుమతి ఉన్న క్వారీల్లో తవ్వకాలు నిలిపివేయడం సరికాదని చెబుతున్నా వినడంలేదు.నిమ్మకూరులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలుపలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు యధేచ్చగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల వచ్చిన మరుసటి రోజు నుంచే ఎక్కడెక్కడ మైనింగ్‌కు అవకాశం ఉందో చూసి వెంటనే తవ్వకాలు మొదలుపెట్టేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో వారం రోజులుగా ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ దత్తత గ్రామం. నిమ్మకూరులో కొందరు రైతుల నుంచి ముగ్గురు టీడీపీ నేతలు 10 ఎకరాలను కొనుగోలు చేసి తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్వోసీ, మైనింగ్ అనుమతి వంటివి ఏవీ లేకుండానే పగలు, రాత్రి మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు సుమారు 500 లారీల్లో మట్టిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. 20 టన్నుల లారీలో 30 నుంచి 35 టన్నుల మట్టిని నింపి ఏకంగా జాతీయ రహదారిపైనే తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. -
షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా గుర్రాలచింతలపల్లెకు వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను స్థానికులు అడ్డుకున్నారు. అనిల్‌కుమార్ స్నేహితుడినంటూ కొండలరావు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండిపడ్డారు. మైనింగ్ వాహనాలు బాడుగకు తీసుకొని.. దాదాపు రూ.4 కోట్ల వరకు బకాయి పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డబ్బుల గురించి కొండలరావును ప్రశ్నిస్తే ‘ఇది షర్మిల కంపెనీ’ అంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. వెంటనే తమ బకాయి డబ్బులివ్వాలని నిలదీశారు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం చాబలి గ్రామంలో బెనిటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట 163 ఎకరాల్లో ఐరన్ ఓర్ లీజు లభించింది.వేణుగోపాల్ డైరెక్టర్‌గా ఉన్న ఆ కంపెనీ 203, ఆదిత్య ఎలెట్, బి.ఎస్.మక్తా, సోమాజిగూడ, హైదరాబాద్ అడ్రస్‌లో ఉంది. ఏపీఆర్ 2278 నంబర్‌తో మంజూరైన లీజు గడువు 2024 నవంబర్ 9వ తేదీ వరకు ఉంది. ఈ ఐరన్ ఓర్ గనుల్లో పదేళ్లుగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను స్థానికంగా కొండలరావు అనే వ్యక్తి చూసేవాడు. అతను షర్మిల భర్త అనిల్‌కుమార్‌కు స్నేహితుడిగా చెప్పుకుంటూ.. స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. ఇక్కడి వారి నుంచి టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు తీసుకొని మొదట్లో నెలవారీ బాడుగలు సక్రమంగా చెల్లించేవాడు. ఆ తర్వాత బకాయిలు పెండింగ్ పెడుతూ వచ్చాడు. అవి కోట్లాది రూపాయలకు చేరుకోవడంతో స్థానికులు డబ్బుల గురించి కొండలరావును అడగడం మొదలుపెట్టారు. అతను పట్టించుకోకపోవడంతో రెండేళ్ల క్రితం మాచునూరు గ్రామస్తులు కంపెనీ ప్రాంగణంలో ధర్నా చేశారు. అప్పట్లో సగం డబ్బులు చెల్లించి.. మిగిలినవి తర్వాత ఇస్తానని చెప్పాడు. అనంతరం ఆ డబ్బుల గురించి నిలదీయగా.. ‘షర్మిల కంపెనీ ఇది. తమాషా చేస్తున్నారా.. డబ్బులిస్తాం. వెయిట్ చేయండి’ అంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచి కొండలరావు కంపెనీ వైపు రావడమే మానేశాడు. ట్రాన్స్పోర్ట్, టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు.. ఇలా బాడుగకు ఇచ్చిన అందరివీ కలిపి దాదాపు రూ.4 కోట్లకు పైబడి ఎగ్గొట్టినట్లు బాధితులు వాపోయారు. మాకు న్యాయం చేయండి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి న షర్మిలను బాధితులు గౌరీశంకర్రెడ్డి, మహేశ్వరరెడ్డి నిలదీశారు. ఆమె స్పందిస్తూ.. తనకు ఆ కంపెనీతో సంబంధం లేదని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. షర్మిల, అనిల్ పేర్లు చెప్పడం వల్లే ఇన్నాళ్లు ఆగాంబెనిటా మైన్స్‌లో టిప్పర్లు, బుల్డోజర్లు, ట్యాంకర్లు బాడుగకు పెట్టుకొని బకాయిలివ్వలేదు. 6 నెలలుగా కొండలరావు ఇక్కడికి రావడం లేదు. వైఎస్ కుటుంబానికి విధేయులమైన మేము షర్మిల, అనిల్ వల్లే ఇంతకాలం కొండలరావు ఏం చెప్పినా భరించాం. అదే విషయాన్ని షర్మిల దృష్టికి తీసుకెళ్లాం. నా ఒక్కడికే రూ.6.5 లక్షలు చెల్లించాల్సి ఉంది.మహేశ్వరరెడ్డితో కలిపి రూ.11 లక్షలు ఇవ్వాలి. మాచునూరు, ఆర్వేటిపల్లె చాబలి, రాజంపేట, ఇతర ట్రాన్సుపోర్టర్లు అందరికీ బకాయి పెట్టారు. దాదాపు రూ.4 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. షర్మిల, అనిల్ పేర్లు చెప్పి బెదిరించారు. లేదంటే మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకొని బకాయిలు రాబట్టుకునేవాళ్లం. – గౌరీశంకర్రెడ్డి, గుర్రాలచింతలపల్లె -
భారీ పెట్టుబడులకు వేదాంతా సై
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ ప్రయివేట్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ వివిధ బిజినెస్‌లలో 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. అల్యూమినియం, జింక్, ముడిఇనుము, స్టీల్, చమురు, గ్యాస్ తదితర విభిన్న విభాగాలపై పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా వార్షికంగా కనీసం 2.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) జత చేసుకోవాలని చూస్తున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ అత్యున్నత అధికారులు వెల్లడించారు. పైప్‌లైన్‌లో 50 యాక్టివ్ ప్రాజెక్టులుసహా విస్తరణ ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇవి కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా 6 బిలియన్ డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24)లో సాధించే వీలున్న 5 బిలియన్ డాలర్ల ఇబిటాను వచ్చే ఏడాది(2024–25) 6 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు అంచనా వేశారు. ఈ బాటలో 2027కల్లా 7.5 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించవచ్చని ఆశిస్తున్నారు. రానున్న 25ఏళ్లలో విభిన్న స్థాయికి కంపెనీ చేరనున్నట్లు వేదాంతా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇన్వెస్టర్లకు తెలియజేశారు. విభిన్న ప్రాజెక్టులపై 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనిల్ సోదరుడు, కంపెనీ వైస్‌చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇది 6 బిలియన్ డాలర్ల అదనపు టర్నోవర్‌కు దారిచూపనున్నట్లు, వార్షికప్రాతిపదికన ఇబిటా 2.5–3 బిలియన్ డాలర్లవరకూ అదనంగా బలపడనున్నట్లు వివరించారు. -
మళ్లీ బీజేపీలోకి గాలి జనార్దనరెడ్డి
సాక్షి, బెంగళూరు: మైనింగ్ వ్యాపారి, కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మళ్లీ కాషాయ పారీ్టలోకి చేరబోతున్నారు. కేఆర్పీపీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆ పారీ్టలో చేరనున్నట్లు ఆదివారం మీడియాకు తెలిపారు. నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానమంత్రిగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. బళ్లారిలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బి.శ్రీరాములుకు మద్దతు తెలిపారు. బీఎస్ యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జనార్దనరెడ్డి, ఆ తర్వాత మైనింగ్ కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. కేఆర్పీపీని సొంతంగా ఏర్పాటు చేసి, 2023 ఎన్నికల్లో పోటీ చేశారు. -
మంగంపేట గనులపై దొంగరాతలా?
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంగా రామోజీరావు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒకలా బురదజల్లి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన చంద్రబాబుకు మేలు చేయాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే మంగంపేట బెరైటీస్ గనుల టెండర్లపైనా అడ్డగోలు రాతలు రాశారు. ‘మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనాన్ని శుక్రవారం ఈనాడులో అచ్చేశారు. నిబంధనల ప్రకారమే అంతా సక్రమంగా జరిగినా అబద్ధాలతో ఆ కథనాన్ని నింపేశారు. అన్నమయ్య జిల్లా మంగంపేటలో గనుల్లో ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్‌ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సగటున 10 లక్షల టన్నులు ‘ఎ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బి’ గ్రేడ్ కాగా, మిగిలిన 17 లక్షల టన్నులు ‘సీ, డీ – డబ్ల్యూ (వేస్ట్)’ గ్రేడ్లుగా ఉంటుంది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ తక్కువగా ఉండటంతో గత కొన్నేళ్లుగా వాటి నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్ నిల్వలు అమ్ముడవకుండా ఉండిపోయింది. దాని విక్రయం, బెనిఫికేషన్ కోసం గతంలో పలుసార్లు టెండర్లు పిలిచినా సరైన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఏపీఎండీసీ ఆ నిల్వల విక్రయానికి టెండర్లు పిలిచింది. సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ ఖనిజానికి టెండర్లు పిలుస్తారు. కానీ కొనుగోలుదారుల నుంచి స్పందన రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున ఐదేళ్లకు ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలిచారు. ఈ వాస్తవం తెలియకుండా అభూత కల్పనలతో ఒకేసారి కోటి మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచారంటూ మతి లేని కథనాన్ని ఈనాడు ప్రచురించింది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి రిజర్వు ధరను తగ్గించారంటూ మరో తప్పుడు ఆరోపణ చేసింది. నిజానికి రిజర్వు ధర నిర్ణయానికి సంబంధించి జీవో 262ను 2017లో చంద్రబాబు హయాంలోనే విడుదల చేశారు. ఆ జీవోలోని నిబంధనలకు అనుగుణంగానే ఇప్పుడు రిజర్వు ధరను నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు తగ్గట్టు రేటును పెట్టారు. ఎంఎస్టీసీ పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియ టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారమే ధరావత్తు ఖరారు చేశారు. 17 రోజుల్లో టెండర్లను పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే. టెండర్ డాక్యుమెంట్ ధరను ఖరారు చేసే క్రమంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ చార్జీలు, ఎంఎస్టీసీ చెల్లింపులకయ్యే మొత్తాన్ని లెక్కించి ధర నిర్ణయించారు. సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే ఈ విధానాన్ని ఈనాడు మాత్రం అక్రమం అంటూ చిత్రీకరించడం విడ్డూరం. న్యాయ సమీక్షకు పంపలేదంటూ అవగాహనారాహిత్యాన్ని ఆ కథనంలో చూపించింది. రూ.100 కోట్లకుపైగా వ్యయం అయ్యే ప్రాజెక్టును నిర్వహించే టెండర్లను మాత్రమే న్యాయ సమీక్షకు పంపుతారు. బెరైటీస్ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం లేకుండా ఆ కథనాన్ని ప్రచురించినట్లు స్పష్టమవుతోంది. దుర్బుద్ధితోనే ఈ కథనం రాసినట్లు తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం నాణ్యమైన బెరైటీస్‌తో పాటు సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ ఖనిజాన్ని ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దోపిడీగా చిత్రీకరించడం దారుణం. ఈ తప్పుడు కథనంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, వీసీ అండ్ ఎండీ, ఏపీఎండీసీ -
పాపాగ్ని నది వెంబడి ఎలాంటి మైనింగ్ జరగడం లేదు
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో పాపాగ్ని నది వెంబడి ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటి వరకు ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు కూడా ఇవ్వలేదని వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని రెవెన్యూ, గనుల శాఖ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పాపాగ్ని నది వెంబడి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, అలా తవ్వి తీసిన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని, అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అన్నమయ్య జిల్లా, పెద్దతిప్ప సముద్రం మండలం, జంబుకాని పల్లి గ్రామానికి చెందిన డి.వెంకటరమణ, మరో ఇద్దరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ నది వెంబడి విచక్షణ రహితంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. వేటి ఆధారంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెబుతున్నారని ప్రశ్నించింది. పత్రికా కథనాల ఆధారంగానని పోసాని చెప్పారు. వాటిని పరిశీలించాలని కోరారు. ఈ వాదనలను ప్రభుత్వ న్యాయవాదులు పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి, కామిరెడ్డి నవీన్‌కుమార్‌లు తోసిపుచ్చారు. పిటిషనర్లు చెబుతున్న విధంగా ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు జరగడం లేదని సుభాష్ చెప్పారు. ఎక్కడో తవ్వి తీసిన ఇసుక తాలుకు ఫొటోలను పాపాగ్ని వెంబడి జరిగినట్టు చూపుతున్నారని చెప్పారు. ఇసుక తవ్వకాలకు గనుల శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని నవీన్ తెలిపారు. -
అసత్యాల తవ్వకం
సాక్షి, అమరావతి: ప్రజల్లో పట్టుకోల్పోయిన టీడీపీని.. జనాలు మర్చిపోయిన చంద్రబాబును జాకీలు పెట్టి లేపేందుకు ఈనాడు రామోజీరావు ఇంత వయస్సులోనూ ఇంకా ప్రయాస పడుతూనే ఉన్నారు. గతంలో తన పార్ట్నర్ ప్రజలకు చేసిందేమీలేదని ఆయనకు బాగా తెలుసు. అలాగే, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదల జీవితాల్లో తీసుకొస్తున్న పెనుమార్పులు కూడా ఆయనకు తెలియంది ఏమీకాదు. అయినా, రామోజీ ఆశ చాలా లావు కదా. సీఎం జగన్‌పైన.. రాష్ట్ర ప్రభుత్వంపైనా ప్రజల్లో ఎలాగోలా విద్వేషాన్ని రగిల్చి తన కార్యం తన బంటు కార్యం తీర్చుకునేందుకు చేయని కుట్రలేదు.. తొక్కని అశుద్ధంలేదు. ఇందులో భాగంగానే తన అసత్యాల గని నుంచి నిత్యం తప్పుడు కథనాలను తవ్వి ఈనాడులో ఎత్తిపోస్తున్నారు. తాజాగా.. గురువారం ‘క్వార్ట్ ్జ కొల్లగొట్టారు’ అంటూ ప్రభుత్వ ప్రతిష్టపై ఎప్పటిలాగే బురదజల్లే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. వాస్తవాలు ఏమిటంటే.. క్వార్ట్ ్జతవ్వకాలకు అనుమతుల్లేవు.. నిజానికి.. రాష్ట్రంలో ఎక్కడా దేవుడి మాన్యంలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు జరగడంలేదు. అసలు మైనింగ్ జరగకుండా ఏకంగా 50 వేల టన్నుల ఖనిజం ఎలా తవ్వారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈనాడు చెబుతున్నట్లు పల్నాడు జిల్లా కారంపూడి మండలం సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల్లో క్వార్ట్ ్జ తవ్వకాలకు మైనింగ్ శాఖ ఎటువంటి అనుమతులు మంజూరుచేయలేదు. 2012లో దేవదాయ శాఖ సింగరుట్ల ఆలయ పరిధిలోని బ్లాక్ 28 ప్రాంతంలో పదెకరాల భూమిని రమాదేవి అనే వ్యక్తికి మైనింగ్ కార్యకలాపాల కోసం లీజుకిచ్చింది. అయితే, 2022లో ఈ మైనింగ్ అనుమతులను గనుల శాఖ రద్దుచేసింది. అలాగే, 2021లో ఇదే దేవాలయానికి చెందిన మరో 25 ఎకరాల భూమిని మైనింగ్ కార్యకలాపాల కోసం దేవదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు పాల్గొని 12.5 ఎకరాల చొప్పున దక్కించుకున్నారు. అయితే.. సదరు వ్యక్తులు క్వార్జ్ తవ్వకాల కోసం మైనింగ్ అధికారులకు ఎలాంటి దరఖాస్తు చేయలేదు. దీంతో గనుల శాఖ ఎటువంటి క్వార్జ్ మైనింగ్ లీజులు ఇవ్వలేదు. మైనింగ్ లేనప్పుడు రాయల్టీ ఎలా వస్తుంది!? పల్నాడుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి క్వార్జ్ మైనింగ్ పేరుతో దోపిడీ చేశారని ‘ఈనాడు’ ఆరోపించడం విడ్డూరం. అసలు జరగని మైనింగ్ నుంచి ఏకంగా 50 వేల టన్నులకు పైగా తవ్వకం జరిగినట్లు, ఎగుమతి కూడా అయిపోయినట్లు కట్టుకథ అల్లేసింది. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వానికి రాయల్టీ దక్కలేదంటూ ఈనాడు పెట్టిన శోకాలు మామూలుగా లేవు. అయినా.. అసలు మైనింగ్ అనుమతులే లేకుండా.. తవ్వకాలు జరపకుండా ప్రభుత్వానికి రాయల్టీ ఎలా వస్తుందో ఆ కిటుకు రామోజీనే చెప్పాలి. మైనింగ్‌పై పటిష్ట నిఘా.. వాస్తవానికి.. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట నిఘా ఏర్పాటుచేసింది. ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్లను నియమించింది. మైనింగ్‌పై ఎక్కడ ఆరోపణలు వచ్చినా ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, అన్నిచోట్లా చెక్‌పోస్ట్‌లను కూడా ఏర్పాటుచేసి మైనింగ్‌ను, అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అంత పెద్దఎత్తున క్వార్జ్ మైనింగ్, అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుంది రామోజీ.. మీ పిచ్చి కాని..! పాత ఫొటోలతో కట్టుకథ.. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ మైనింగ్‌లకు అవకాశమేలేదు. అసలు పల్నాడులో క్వార్జ్ మైనింగ్ చేసిన ఉదంతాలే లేవు. గతంలో ఆ ప్రాంతంలో జరిగిన మైనింగ్ ఫొటోలతో ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించడం దారుణం. కనీసం వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను కూడా సంప్రదించకపోవడం సరికాదు. ఇటువంటి తప్పుడు రాతలపై ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ -
నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెలవారీగా చూస్తే సెపె్టంబర్లో మందగించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.8 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 10.3 శాతంగా ఉంది. గతేడాది సెపె్టంబర్లో ఐఐపీ 3.3 శాతంగా నమోదైంది. తాజాగా తయారీ, మైనింగ్ రంగాలు మెరుగుపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సమీక్షాకాలంలో ఐఐపీ 6 శాతానికి పరిమితమైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం.. ► తయారీ రంగ వృద్ధి 4.5 శాతంగా (గత సెప్టెంబర్‌లో రెండు శాతం) నమోదైంది. ► విద్యుదుత్పత్తి వృద్ధి గత సెపె్టంబర్లో 11.6 %గా ఉండగా ఈసారి 9.9%కి పరిమితమైంది. ► మైనింగ్ ఉత్పత్తి గతేడాది సెపె్టంబర్లో మైనస్ 5.2 శాతంగా ఉండగా ఈ ఏడాది సెపె్టంబర్లో 11.5 శాతం పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ వృద్ధి 7.4 శాతంగా (గత సెపె్టంబర్లో 11.4 శాతం) నమోదైంది. కన్జూమర్ డ్యూరబుల్స్ వృద్ధి గత సెపె్టంబర్లో మైనస్ 5.5 శాతంగా ఉండగా ఈసారి ఒక్క శాతం మేర నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి మైనస్ 5.7 శాతం నుంచి 2.7 శాతానికి చేరింది. ► మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తుల వృద్ధి 7.5% గా ఉంది. గత సెపె్టంబర్లో ఇది 8.2 శాతం. -
‘నిర్మాణ పరికరాల’ ఆదాయం 15 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 14–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మౌలికరంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు దోహదపడనుంది. అలాగే, రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడం కూడా తోడ్పాటు అందించనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనా వేసింది. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో అధిక బేస్ (29 శాతం) ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 14–15 శాతం మేర వృద్ధి చెందవచ్చు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)తో పాటు రహదారులు, మెట్రోలు, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడనుంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. సాధారణంగా నిర్మాణ పరికరాల వినియోగంలో రహదారుల వాటా 40 శాతం వరకు ఉంటుంది. రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం అవుతుండటం పరిశ్రమ వృద్ధికి సహాయకరంగా ఉండనుంది. వంతెనలు.. విమానాశ్రయాలూ.. రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాలతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, మెట్రో కారిడార్లు మొదలైన వాటి కాంట్రాక్టర్ల నుంచి తయారీ సంస్థలకు ఆర్డర్లు బాగా ఉంటున్నాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి పరిశ్రమ స్టేజ్–వీ2 ఉద్గార ప్రమాణాలకు మళ్లనుండటం వల్ల పరికరాల ధరలు పెరగనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పరికరాలను ముందుగానే కొంత కొని పెట్టుకునే ధోరణులు కూడా కనిపించవచ్చని వివరించారు. పరిమాణంపరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా .. ఈ ఆర్థిక సంవత్సరం ఆల్ టైమ్ గరిష్టంగా 1.2 లక్షల యూనిట్ల స్థాయిలో విక్రయాలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాల పరిమాణంలో ఎర్త్‌మూవింగ్ పరికరాల వాటా 70 శాతంగా, కాంక్రీట్ పరికరాల వాటా 22 శాతంగా ఉండగా.. మిగతాది మెటీరియల్ ప్రాసెసింగ్ పరికరాలది ఉన్నట్లు వివరించింది. -
ప్లేన్ క్రాష్.. బిలియనీర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ఒక్కరూ మిగల్లేదు!
జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం భారత్‌కు చెందిన మైనింగ్ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలిసింది. బంగారం, బొగ్గుతోపాటు నికెల్, రాగిని వెలికితీసి శుద్ధి చేసే ‘రియోజిమ్’ అనే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతిచెందినట్లు జింబాబ్వేకు చెందిన ఓ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. తమ వజ్రాల గని వద్దే ప్రమాదం రియోజిమ్ కంపెనీకి చెందిన ‘సెస్నా 206’ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ కంపెనీకి చెందిన చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలోనే ఈ సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోవడం గమనార్హం. ఒక్కరూ మిగల్లేదు.. జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్‌లోకి దూసుకెళ్లే ముందు విమానం సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలుస్తోంది. గాల్లోనే విమానం పేలిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారని మీడియా నివేదిక పేర్కొంది. మృతుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరు జింబాబ్వే దేశీయులు అని పోలీసులను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని దినపత్రిక హెరాల్డ్ పేర్కొంది. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. అయితే రంధావా స్నేహితుడైన పాత్రికేయుడు, చిత్రనిర్మాత హోప్వెల్ చినోనో ఆయన మరణాన్ని ధ్రవీకరించారు. రంధావా 4 బిలియన్ డాలర్ల (రూ.33 వేల కోట్లకు పైగా) ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు. -
అక్రమాలు అరికట్టేందుకు ‘ఈ మొబైల్ మైనింగ్ యాప్’
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ విభాగంలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఈ మొబైల్ మైనింగ్ యాప్’కు రూపకల్పన చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసీ)తో కలసి గనులు, భూగర్భ వనరుల శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌ను శనివారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డీఎం కాత్యాయనిదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖనిజాలు, ఇటుక, ఇసుక తదితరాల రవాణా సమయంలో తనిఖీలు చేసి అనుమతులు ఉన్నాయా లేదా? అనే అంశాన్ని గనుల శాఖ సిబ్బంది తక్షణమే తెలుసుకునేందుకు ఈ యాప్ దోహదం చేస్తుందని మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేయడం, అనుమతులు ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో ఖనిజాల తరలింపు.. తదితరాలకు అడ్డకట్ట వేయడంతో పాటు జరిమానాల విధింపునకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. జరిమానా విధింపు, చెల్లింపు అంశాల్లో పారదర్శకతతో పాటు, ఆన్లైన్లో చెల్లింపులు ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఖనిజ రవాణా సమాచారాన్ని డీలర్లు, లీజు హోల్డర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అనుమతుల నిర్ధారణ కూడా ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ యాప్ ఉపయోగంలోకి వస్తే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్ జియాలజిస్టులు, టెక్నీíÙయన్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లకు విధుల నిర్వహణ సులభతరమవుతుందని మంత్రి వెల్లడించారు. -
రంధ్రాలున్నాయ్ జాగ్రత్త!
సాధారణంగా ఏ ఊరెళ్లినా.. కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త అనో..దొంగలున్నారు జాగ్రత్త అనో బోర్డులు చూస్తుంటాం.కానీ దక్షిణ ఆస్ట్రేలియాలోని కూబర్ పెడీ పట్టణానికి వెళ్తే.. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త అనే బోర్డులు దర్శనమిస్తాయ్. ఇంతకీ అక్కడ రంధ్రాలు ఎందుకు ఉన్నాయ్? లోపల ఏం జరుగుతోంది? ఆ పట్టణ కథాకమామీషు ఏమిటి తెలుసుకోవాలని ఉందా? అయితే చలో కూబర్ పెడీ.. మైనింగ్ నుంచి మొదలై.. కూబర్ పెడీ.. దక్షిణ ఆ్రస్టేలియాలోని ఓ మైనింగ్ క్షేత్రం. ఒపాల్ (రత్నం వంటి విలువైన రాయి) గనులకు నిలయంగా పేరొందిన ఈ ప్రదేశం అడిలైడ్‌కు వాయువ్యంగా 590 మైళ్ల దూరంలో స్టువర్ట్ హైవేపై ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఒపాల్స్లో ఎక్కువ భాగం ఈ గ్రేట్ విక్టోరియా ఎడారి అంచున ఉన్న స్టువర్ట్ శ్రేణిలోని మైనింగ్ సైట్ నుంచే వస్తుంది. అసలు ఇక్కడ ఒపాల్ను కనుక్కోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. 1915లో విల్లీ హచిసన్ అనే బాలుడు తన తండ్రి జేమ్స్‌తో కలిసి గోల్ఫ్ ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. గోల్ఫ్ ఆడే క్రమంలో ఓ చోట ఒపాల్ను చూశాడు. అంతే.. అప్పటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం క్రమంగా పెద్ద పట్టణంగా మారిపోయింది. 1920లో ఈ ప్రాంతానికి కూబర్ పెడీ అని పేరు పెట్టారు. 1960లో దీనిని పట్టణంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇది బాగా అభివృద్ధి చెందింది. స్థానికులు అక్కడే ఉంటూ మైనింగ్ చేసేవారు. వేడి నుంచి తప్పించు కోవడానికి.. ఎడారి ప్రాంతం కావడంతో అక్కడ వేసవికాలం ఉండే నాలుగు నెలల కాలం భగభగా మండిపోయేది. ఆ నాలుగు నెలలు ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి అక్కడివారంతా మైనింగ్ గనుల్లో ఉండేవారు. అనంతరం ఆ భూగర్భంలోనే తాము ఉండటానికి వీలుగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లంటే ఏదో సాదాసీదా నిర్మాణాలనుకుంటే పొరపడినట్టే. కోటలను తలపించేలా విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు. అంతేకాదు.. హోటళ్లు, స్టోర్లు, లైబ్రరీలు, షాపింగ్ సెంటర్లు, క్రీడా ప్రదేశాలు, ఈత కొలనులు, విశాలమైన స్నానపు గదులు, చర్చిలు.. ఇలా ఒకటేమిటి? భూమిపై పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వసతులన్నీ అక్కడ ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం, నీటి వసతి, డ్రైవ్ ఇన్ మూవీ థియేటర్, గడ్డి లేని గోల్ఫ్ కోర్సు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సూర్యకాంతి మినహా సమస్తమూ భూమిపై ఉన్నట్టే ఉంటుంది. కూబర్ పెడీని పై నుంచి చూస్తే.. బోలెడు రంధ్రాలు కనిపిస్తాయి. వీధులన్నీ దుమ్ముతో ఉంటాయ్. రంధ్రాలున్నాయ్ జాగ్రత్త.. అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ ఆ రంధ్రాల లోపల ఓ భూగర్భ స్వర్గం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అక్కడ భూమిపై 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. లోపల 23 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక లోపల కరెంటు అవసరాలను సొంతంగానే తీర్చుకుంటున్నారు. 70 శాతం కరెంటును గాలి, సౌరశక్తి ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ భూగర్భ పట్టణ జనాభా దాదాపు 2500 మంది. నాలుగు మీటర్ల లోతులో.. కూబర్ పెడీలో భూగర్భ భవనాలు తప్పనిసరిగా నాలుగు మీటర్లు (13 అడుగులు) లోతులో ఉండాలి. పైకప్పులు కూలిపోకుండా చూసుకునేందుకే ఈ నాలుగు మీటర్ల నిబంధన విధించారు. ఈ రాతి కింద ఎల్లప్పుడూ 23 డిగ్రీల ఉష్ణోగ్రతతో తేమగా ఉంటుంది. అక్కడ నేలపై వేసవిలో విపరీతమైన వేడి.. శీతాకాలంలో భరించలేని చలి ఉంటుంది. ఒక్కోసారి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కానీ భూగర్భ గృహాలు కచి్చతమైన గది ఉష్ణోగ్రత వద్ద సంవత్సరం పొడవునా ఉంటాయి. పైగా ఇందులో ఇళ్లు చాలా సరసమైన ధరకే లభిస్తాయండోయ్. మూడు పడక గదుల ఇల్లు దాదాపు 26వేల అమెరికా డాలర్లకు వచ్చేస్తుంది. మన రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు రూ.21.62 లక్షలు. అదే సమీపంలోని అడిలైడ్‌లో సగటు ఇంటి ధర 4.57 లక్షల అమెరికా డాలర్లు(దాదాపు రూ.3.80 కోట్లు). చూశారా ఎంత వ్యత్యాసం ఉందో? – సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రయోజనాలివీ.. భూగర్భ పట్టణంలో నివసించడం వల్ల భూకంపాల నుంచి కొంత వరకు రక్షణ లభిస్తుంది. ఈగలు, దోమల, ఇతరత్రా కీటకాల బెడద ఉండదని స్థానిక నివాసి రైట్ వెల్లడించారు.అవి చీకటి, చలిలోకి రావడానికి ఇష్టపడవని వివరించారు. మనం కూడా ప్రస్తుతం అటు వేడితోనూ.. ఇటు దోమలతోనూ చాలా ఇబ్బందులు పడుతున్నాం.. ఇలాంటి భూగర్భ ఇళ్లేవో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో కదా? -
ఎర్రనేలల్లో పసిడి పంట
తుగ్గలి(కర్నూలు): ఎర్ర నేలల్లో బంగారం పండనుంది. దాదాపు 45 ఏళ్లకు పైగా చేసిన సర్వేలు ఎట్టకేలకు ఫలించాయి. బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి–బొల్లవానిపల్లి మధ్య గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి జియో మైసూర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ చార్లెస్ డెవినిష్, మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ నమూనాను విడుదల చేశారు. అనంతరం చార్లెస్ డెవినిష్ మాట్లాడుతూ 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1945 తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి దేశంలో 1945 సంవత్సరం తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి అని చార్లెస్ డెవినిష్ తెలిపారు. రోజుకు 1,000 నుంచి 1,500 టన్నుల వరకు ముడి సరుకును ఈ ప్లాంట్‌లో ప్రాసెసింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ప్రాసెసింగ్ చేస్తున్నామని, వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తామని వివరించారు. ప్లాంట్ ఏర్పాటైన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే కంపెనీలో 100 మందికి ఉపాధి కల్పించామని, మరో 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మానసబిశ్వాల్, హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్ ఏర్పాటుతో తుగ్గలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
విడిగా వివిధ బిజినెస్‌ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్‌లోని బిజినెస్‌లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్‌లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్‌లో అగర్వాల్ బిజినెస్‌ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్‌పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
బలమైన వృద్ధి బాటలో పయనిస్తున్న మైనింగ్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్స్ పరిశ్రమ ఈ ఏడాది కూడా బలమైన వృద్ధి బాటలో పయనిస్తుందని, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల దిశగా పురోగతి సాధిస్తుందని (నెట్ జీరో/ఈఎస్జీ అనుకూల) కేపీఎంజీ ఇంటర్నేషనల్ ‘2023 గ్లోబల్ మైనింగ్ అండ్ మెటల్స్ అవుట్‌లుక్’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మెటల్స్ రంగం టెక్నాలజీలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్నట్టు కేపీఎంజీ ఇంటర్నేషన్ మెటల్స్ హెడ్ ఉగో ప్లటానియా పేర్కొన్నారు. పరిశ్రమకు చెందిన ప్రతి ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో నలుగురు ఉత్పాదకత వృద్ధి, సుస్థిర లక్ష్యాల విషయంలో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఒకరు మాత్రం నిరాశావహంగా ఉన్నారు. అల్యూమినియం, కోబాల్ట్, కాపర్, గ్రాఫైట్, లిథియం, మాంగనీస్, నికెల్ ఉత్పత్తిదారుల్లో సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునే విషయంలో అంతరం కనిపించింది. వేగంగా ఈ మార్గాన్ని చేరుకుంటామని 64 శాతం మందే చెప్పారు. తమ కంపెనీ ఇప్పుడే ఈ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టినట్టు 34 శాతం మంది చెప్పారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం ఖర్చుతో కూడుకున్నది కాకుండా లాభాలకు మార్గమని మెజారిటీ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. దీంతో భవిష్యత్తు పట్ల ఆశావహంగా ఉన్నారు. మైనింగ్‌లో వేగంగా పురోగతి సాధిస్తున్న కంపెనీలు ఇప్పటికే కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా చర్యలు అమలు చేస్తున్నాయి. ఈ దిశగా వస్తున్న సానుకూల ఫలితాలు వాటితో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ సీఈవోలు,బోర్డు డైరెక్టర్లు ఈఎస్జీ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉన్నారు. -
తప్పుడు రాతలెందుకో.. చెప్పవే ‘సిలికా’
సాక్షి, అమరావతి: తప్పుడు కథనాల్లో ఈనాడుది అందె వేసిన చేయి. అదే కోవలో సిలికా శాండ్ విక్రయాలపై మరో కట్టు కథనం ప్రచురించింది. గనుల శాఖకు సంబంధం లేని విషయాలను ఆ శాఖకు ముడిపెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. పరస్పర విరుద్ధ వాదనలతో కథనాన్ని అల్లింది. ఈనాడు కథనమంతా పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని గనుల శాఖ స్పష్టం చేసింది. సిలికా శాండ్ మైనింగ్‌పై అసలు వాస్తవాలను ఆ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వివరించారు. అసత్యాలు, వక్రీకరణలతో ప్రభుత్వంపై బురదచల్లేలా ఈ కథనం ఉందని చెప్పారు. సిలికా శాండ్ మైనింగ్, రవాణా, విక్రయాలు, జీఎస్టీ చెల్లింపులపై ఆ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. గనుల శాఖ నలుగురికే అనుకూలంగా ఉందన్న ఆరోపణా అసత్యమని చెప్పారు. ఆ నలుగురికే అనుకూలంగా ఉంటే ఇటీవల కొత్తగా 11 మందికి ఎలా లీజులు జారీ చేస్తామని ప్రశ్నించారు. ఈ అంశంపై సోమవారం ఆయన మీడియాతో చెప్పిన వివరాలు.. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే.. సిలికా శాండ్ లీజు అనుమతులు, చెల్లింపులు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. సిలికా శాండ్‌కు లీజుదారుల నుంచి సీనరేజీ, డీఎంఎఫ్, మెరిట్, కన్సిడరేషన్ మొత్తాలను గనుల శాఖ ఆన్లైన్లోనే స్వీకరిస్తుంది. అన్ని అనుమతులున్న లీజుదారులకు రవాణా పత్రాలను కూడా ఆన్లైన్లోనే జారీ చేస్తుంది. లీజుదారులు మైనింగ్ చేసిన మెటీరియల్‌ను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా> బహిరంగ మార్కెట్లో ఎవరికైనా అమ్ముకోవచ్చు. లీజుదారులు వారికి అనుకూలమైన సంస్థలకే మినరల్‌ను విక్రయించుకుంటారు. ఇందులో గనుల శాఖ ప్రమేయం ఉండదు. ఒత్తిడి చేసే అవకాశమే ఉండదు. నష్టం వచ్చేలా ఎవరైనా వ్యాపారం చేస్తారా? వ్యాపార రంగంలో విస్తరించి ఉన్న ఈనాడు సంస్థకు ఈ విషయం తెలియదా? ఆసక్తి ఉంటే ఈనాడు యాజమాన్యం కూడా నిబంధనల ప్రకారం సిలికా శాండ్ లీజులు పొందవచ్చు, అలాగే లీజుదారుల నుంచి శాండ్‌ను కొనుక్కోవచ్చు. నిబంధనల ప్రకారం అవసరమైన సహకారాన్ని అందిస్తాం. నిష్పాక్షికతకు నిదర్శనమిది కేవలం నలుగురు డీలర్లకే మేలు చేకూర్చేలా, లీజుదారులు సిలికా శాండ్‌ను వారికి మాత్రమే విక్రయించేలా గనుల శాఖ జరిమానాల పేరుతో వారిపై ఒత్తిడి తెచ్చిందనడం పూర్తిగా నిరాధారం. ఇటీవల గనుల శాఖ కొత్తగా 11 మందికి సిలికా శాండ్ మైనింగ్ లీజులు జారీ చేసింది. నిజంగా ఆ నలుగురికే మేలు చేసే ఉద్దేశం ఉంటే ఈ లీజులు వారే దక్కించుకొని ఉండే వారు. కొత్త వారికి అవకాశం లభించేదా? గనుల శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించబట్టే కొత్త వారికి లీజులు లభించాయి. గనుల శాఖకేం సంబంధం? లీజుదారులు డీలర్లకు విక్రయిస్తున్న సిలికా శాండ్‌కు సగం మొత్తాన్ని ఆన్లైన్లో, మిగిలిన దాన్ని నగదుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గనుల శాఖకు ఎటువంటి బాధ్యత ఉండదు. లీజుదారులు, విక్రయదారుల మధ్య జరిగే లావాదేవీల్లో గనుల శాఖ జోక్యం చేసుకోదు. నిబంధనల ప్రకారమే లీజుదారులు జీఎస్టీ చెల్లింపులు చేస్తున్నారు. ఏడాదికి సగటున 20 లక్షల టన్నులు సిలికా శాండ్ విక్రయిస్తున్నారు. దానిలో సగం మాత్రమే ఆన్లైన్లో స్వీకరిస్తూ, దానికి మాత్రమే జీఎస్టీ చెల్లిస్తున్నారంటూ చేసిన ఆరోపణకు ఆధారాలున్నాయా? పరస్పర విరుద్ధ వాదనలేమిటి? సిలికా శాండ్ మైనింగ్‌లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూనే, మరోవైపు గనుల శాఖ జరిమానాలు విధించిందని, ఆ తర్వాత వాటిని సర్దుబాటు చేసిందని పరస్పరం విరుద్ధంగా రాస్తున్నారు. జిల్లా స్థాయిలో విజిలెన్స్ స్క్వాడ్, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్ట్‌లు, కీలక ప్రాంతాల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా సిలికా శాండ్ మైనింగ్‌లో అక్రమాలను గనుల శాఖ పూర్తి స్థాయిలో నియంత్రిస్తోంది. ఆరోపణలు వచ్చిన చోట తనిఖీలు చేసి, జరిమానాలు విధిస్తున్నాం. ఈ జరిమానాలపై లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇది అన్ని మినరల్స్ మైనింగ్‌లోనూ సర్వసాధారణంగా జరుగుతుంది. అథారిటీ ఆ జరిమానాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు జరిమానాలను సర్దుబాటు చేశారని రాయడం తప్పు. తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని 1150.975 హెక్టార్లలో 73 సిలికా శాండ్ లీజులున్నాయి. శుద్ధి చేయని సిలికా శాండ్‌ను టన్ను రూ.700 కి విక్రయిస్తారు. శుద్ధి చేసిన ఇసుకను దానికి అయిన వ్యయాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. శుద్ధి చేయని ఇసుకకు లీజుదారులు టన్నుకు రూ.100 సీనరేజీ, కన్సిడరేషన్ కింద రూ.212, డీఎంఎఫ్ కింద రూ.30, మెరిట్ కింద రూ.2 కలిపి రూ.346 ప్రభుత్వానికి చెల్లించాలి. కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నాం సిలికా శాండ్ మైనింగ్‌పై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాం. 2019లో 73 లీజులను గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి ఉల్లంఘనలు గుర్తించి 61 లీజులకు జరిమానా విధించారు. వారిలో 52 మంది లీజుదారులు రివిజన్ అథారిటీకి అప్పీల్ చేసుకున్నారు. అథారిటీ వాటిని సమీక్షించి పరిష్కరించింది. సిలికా శాండ్ మైనింగ్, రవాణాపై మూడంచెల నిఘా వ్యవస్థ కొనసాగుతోంది. ఇంటర్నల్ బృందాలు, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ తనిఖీలు, జిల్లా విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. ఆకస్మిక తనిఖీల ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతి జిల్లా మోమిడి, బల్లవోలు, వేల్లపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూముల్లో అక్రమ సిలికా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అవాస్తవం. తిరుపతి జిల్లా తడ మండలం బీవీ పాలెం వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంగా నిఘా బృందాలు ఎప్పటికప్పుడు సిలికా శాండ్ మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. సిలికా శాండ్ మైనింగ్‌లో లీజుదారులది ప్రేక్షక పాత్రని, వందల కోట్ల దందా జరుగుతోందని, కొందరు పెద్దలకు ఈ మొత్తాలు చేరుతున్నాయంటూ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ఈనాడులో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఖండిస్తున్నాం. నిబంధనల ప్రకారమే మైనింగ్, విక్రయాలు, రవాణా జరుగుతుంటే, అక్రమాలు, పెద్దల పాత్రంటూ ఊహాత్మక అంశాలను జోడించి, అసత్య కథనాలు రాయడం మానుకోవాలి. -
రూ. 35 లక్షల కోట్ల విలువైన లిథియం నిక్షేపాల వేలం పాట.. ఎప్పుడంటే?
జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లా సలాల్ హైమనా ప్రాంతంలో లభ్యమైన 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి వేలం వేయనున్నట్లు గనుల మంత్రిత్వ శాఖ సెక్రటరీ వివేక్ భరద్వాజ్ తెలిపారు. ఇటీవల గనుల శాఖకు సంబంధించిన ఓ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. లిథియం వేలంలో సలహాదారు కోసం కేంద్ర గనుల శాఖ జమ్మూ కశ్మీర్ పరిపాలనా విభాగానికి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలో ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ..59 లక్షల టన్నుల లిథియంను కనుగొనడం అదృష్టంగా భావిస్తున్నాం. వాస్తవానికి మేం జమ్మూ కాశ్మీర్లో లభించే సున్నపురాయి కోసం అన్వేషించాం. ఇందులో భాగంగా సున్నపురాయి, బాక్సైట్, లిథియంలను గుర్తించినట్లు చెప్పారు. రూ.35 లక్షల కోట్లకు పైమాటే ఈ ఏడాది ప్రారంభంలో జమ్మూకశ్మీర్‌లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. మార్కెట్ అంచనా ప్రకారం.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించిన ఒక టన్ను లిథియం ఖరీదు రూ. 60 లక్షలు ఉండగా.. వీటి మొత్తం ఖరీదు సుమారు రూ. 35 లక్షల (అంచనా) కోట్లుపై మాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇదే లిథియం నిక్షేపాల్ని వేలం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. -
అనిశ్చితిలోనూ ఎకానమీ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి) నమోదయ్యింది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు వెల్లడించాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతం పెరిగింది. అంటే 2022 ఇదే నెలతో పోల్చితే ఈ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.66 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 15 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. కూరగాయల ధరలు కూల్... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత గణాంకాల ప్రకారం మార్చిలో కూరగాయలు, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. కూరగాయల ధరలు 8.51 శాతం తగ్గాయి (2022 ఇదే నెలతో పోల్చి). ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరలు 7.86 శాతం దిగిరాగా, చేపల ధర 1.42 శాతం దిగివచ్చింది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం భారీగా 18.2 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు–ఉత్పత్తుల ధరలు 15.27 శాతం ఎగశాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.95 శాతం వద్ద ఉంటే, మార్చిలో 4.79 శాతానికి తగ్గింది. 2022 ఇదే నెల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.68 శాతంగా ఉంది. -
‘సుల్యారీ’లో 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
సాక్షి, అమరావతి : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలోని సుల్యారీ బొగ్గు గని నుంచి తొలి ఏడాదిలోనే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది. ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ఇంత బొగ్గు తవ్వడం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎండీసీ జాతీయ స్థాయి మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా మారుతోందనడానికి ఇది నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఏపీఎండీసీ ముందంజలో ఉందని అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గనిలో 2021, ఏప్రిల్ నెలలో బొగ్గు తవ్వకాలను ఏపీఎండీసీ లాంఛనంగా ప్రారంభించింది. స్థానికంగా నెలకొన్న ఇబ్బందులు, కోర్టు కేసులన్నింటినీ పరిష్కరించుకుని 2022, మార్చి నుంచి పూర్తిస్థాయిలో తవ్వకాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది మార్చి నాటికి 1.9 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. దీనిద్వారా రూ.483.5 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనే 8 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,624 కోట్ల రెవెన్యూ సాధించాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తోంది. సుల్యారీ బొగ్గు గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును దాదాపు 22 సంవత్సరాలపాటు వెలికితీసేందుకు అవకాశం ఉంది. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఏపీఎండీసీ ముందుకెళుతోంది. అలాగే ఝార్ఖండ్‌లోని బ్రహ్మదియా గనిలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్‌ను ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం ముందుచూపు నిర్ణయాలే కారణం రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలైన మొదటి ఏడాదే 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఆయన దూరదృష్టం కారణం. ఈ బొగ్గు గని ద్వారా మున్ముందు మంచి ఫలితాలు రానున్నాయి. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాం. సుల్యారీ బొగ్గు గనుల తవ్వకాల ద్వారా ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పరిధిని విస్తరించుకోవడంతోపాటు సత్తా చాటుకుంది. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
కావేరి డెల్టాలో ‘కోల్’ కల్లోలం
ఏడాదికి మూడు పంటలతో కళకళలాడే డెల్టా జిలాల్లో కల్లోలం రేగుతోంది. నిత్యం పచ్చదనంతో ఉండే సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేలబొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించ్చిందనే సమాచారంతో అక్కడి రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు పోరుబాట పట్టాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను పునఃసమీక్షించి వెనక్కి తీసుకోవాలని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. సాక్షి, చైన్నె: కావేరి డెల్టా పరిధిలోని సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేల బొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించిందనే సమాచారంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఆరు చోట్ల నేల బొగ్గు సొరంగాలు, 11 చోట్ల పరిశోధనలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినిస్టరీ ఆఫ్ కోల్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని పీఎంకే నేత అన్భుమణి రాందాసు డిమాండ్ చేశారు. సురక్షిత క్షేత్రంలో కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో పచ్చటి పంట పొలాలతో నిండిన జిల్లాలుగా తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, పెరంబలూరు, అరియలూరు, నాగపట్నం, కడలూరు, తిరుచ్చికి పేరుంది. ఇక్కడ లక్షలాది ఎకరాలల్లో వరి పంట, వేలాది ఎకరాలలో ఇతర పంటలు సాగవుతున్నాయి. అలాగే పెద్దఎత్తున కొబ్బరి సాగవుతోంది. కావేరినది నీటి ఆధారంగానే ఇక్కడ పంటలు పండుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరుణుడి కరుణ, కావేరి పరవళ్లతో ఇక్కడి అన్నదాతల్లో ఆనందం తాండవిస్తోంది. అయితే డెల్టా జిల్లాల్లోని భూగర్భంలో ఉన్న ఇంధనం, హైడ్రో కార్బన్, గ్యాస్, నేల బొగ్గు వంటి నిక్షేపాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతగాలంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కేంద్రం ఇచ్చిన అనేక ఉత్తర్వులకు వ్యతిరేకంగా డెల్టాలో మహోద్యమాలు జరిగాయి. కేంద్రం వ్యూహాలకు చెక్ పేట్టే విధంగా, రైతుల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టే రీతిలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కీలక తీర్మానం చేసింది. డెల్టా జిల్లాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా ప్రకటిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ క్షేత్రంలో వ్యవసాయం మాత్రమే చేపట్టాలని, ఇతర పరిశ్రమలు, తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. అలాగే గతంలో జారీ చేసిన ఇతర పరిశ్రమలకు సంబంధించిన అనుమతులను రద్దు చేశారు. దీంతో డెల్టా సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత.. ప్రస్తుతం కేంద్రం మళ్లీ చాప కింద నీరులా డెల్టాపై కన్నేసి వ్యూహాలకు పదును పెట్టడం మంగళవారం అక్కడి రైతుల్లో ఆందోళన రేకెత్తించింది. నైవేలి తరహాలో.. కడలూరు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆ జిల్లాను పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకునే విధంగా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. నైవేలి పరిసరాల్లో నేల బొగ్గు తవ్వకాల పేరిట గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీనికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే ప్రారంభమైంది. అలాగే వీరాణ్ణం రిజర్వాయర్ పరిధిలో నేల బొగ్గు తవ్వకాలకు పరిశోధనలు చేయడం వెలుగులోకి రావడంతో కల్లెం వేయడానికి ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో డెల్టాలో ప్రధాన జిల్లాగా ఉన్న తంజావూరు ఒరత్తనాడు పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సొరంగాలపై కేంద్రం దృష్టి పెట్టడం వివాదానికి దారి తీసింది. తిరువారూర్– తంజావూరు జిల్లాల పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సంబంధించిన సొరంగాలు, పరిశోధనలకు కేంద్రం అనుమతి ఇవ్వడం వెలుగు చూసింది. ఈ సమాచారం అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. సురక్షిత క్షేత్రాన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించాయి. అడ్డుకట్ట వేసేందుకు.. కావేరి డెల్టాలోని లక్షా 25 వేల ఎకరాల పంట పొలాలను సర్వనాశనం చేయడానికి కేంద్రం సిద్ధమైందని పీఎంకే నేత అన్భుమణి రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వివరించారు. తంజావూరు జిల్లా పరిధిలో 11 చోట్ల పరిశోధనలు, ఆరు చోట్ల సొరంగాల తవ్వకాలకు కేంద్రం కార్యచరణ సిద్ధం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవడం తగదని హితవుపలికారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ తక్షణం స్పందించాలని, అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయాలని పట్టుబట్టారు. బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. సురక్షిత వ్యవసాయం క్షేత్రంలో పరిశోధనలకు కేంద్రం అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా మని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వ్యాఖ్యలు చేశారు. రైతులతో కలిసి పెద్దఎత్తున పోరాటాలకు తాము సిద్ధం అని ప్రకటించారు. ఆందోళన వద్దు.. కేంద్రం అనుమతులు ఇచ్చినంత మాత్రాన అవన్నీ అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థలాల్లో, తమ అనుమతి లేకుండా కేంద్రం ఎలా తవ్వకాలపై దృష్టి పెడుతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తారన్నారు. తిరువారూర్, తంజావూరు పర్యటనలో ఉన్న క్రీడల శాఖమంత్రి ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్రం చర్యలను ఆదిలోనే కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డెల్టాలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. సురక్షిత వ్యవసాయ క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వివరించారు. తక్షణం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. -
‘రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్న మైనింగ్ సంస్కరణలు’
సాక్షి,విజయవాడ: మైనింగ్ రంగంలో ప్రగతి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా రెవెన్యూ లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మైనింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంను తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నామని తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం గనులశాఖ, ఎపిఎండిసి అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1)2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా దానిని అధిగమించి రూ.4692 కోట్లు ఆర్జించడం జరిగిదని అన్నారు. లక్ష్యాన్ని అధిగమించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. మేజర్ మినరల్స్ లో 81 శాతం సాధిస్తే, మైనర్ మినరల్స్ లో ఏకంగా 125 శాతం పురోగతిని సాధించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 2వేల మైనింగ్ ఏరియాలకు ఈ-ఆక్షన్ ఇవ్వాలని నిర్ణయించగా, దానిలో 539 ఏరియాలకు ఈ-ఆక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనిలో 405 ఏరియాలకు ఆక్షన్ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యే దశలో ఉందని, వాటిల్లో 117 ఏరియాలకు ఈ-ఆక్షన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని, మరో 134 ఏరియాలకు ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 2)రాష్ట్రంలో నాన్-వర్కింగ్ లీజులను అన్నింటిలోనూ మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మొత్తం 4222 లీజుల్లో ఇప్పటికే 3142 లీజుల్లో మైనింగ్ జరుగుతోందని తెలిపారు. మరో 1080 లీజుల్లో మైనింగ్ కోసం గనులశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్ని లీజుల్లో మైనింగ్ ప్రారంభమైతే రాష్ట్రానికి అవసరమైన ఖనిజాల లభ్యత, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ లభిస్తాయని తెలిపారు. 3) ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ కలెక్షన్ లను అవుట్ సోర్సింగ్ ద్వారా వసూలు చేసే విధానంను మన రాష్ట్రంలోనూ అమలు చేయడం ద్వారా రెవెన్యూను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 5 జిల్లాల్లో ఇందుకు సంబంధించి టెండర్లను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ ఈ విధానం అమలుకు టెండర్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్ నుంచి సీనరేజీ, కన్సిడరేషన్ మొత్తాల రూపంలో స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. 4)ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎపిఎండిసి గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది తన ఆదాయాన్ని రెట్టింపు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.902 కోట్లు రెవెన్యూ వస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంకు ఏకంగా రూ.1801 కోట్లు సాధించడం జరిగిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంకు గానూ మొత్తం రూ.2137 కోట్లు మేర రెవెన్యూ ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. 5) జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలతో ధీటుగా మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో ఎపిఎండిసి నిర్వహిస్తున్న బొగ్గుగని ద్వారా గత ఏడాది 1.9మిలియన టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి, విక్రయించడం జరిగిందని అన్నారు. గత ఏడాది సుల్యారీ ద్వారా రూ.483.5 కోట్లు రెవెన్యూ ఆర్జించామని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దానిని రూ.1624 కోట్లకు పెంచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంగంపేటలోని బెరైటీస్ గనుల నుంచి ఎపిఎండిసి చరిత్రలోనే మొట్టమొదటి సారి ఏకంగా 3 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసి, రూ.1000 కోట్ల రెవెన్యూ మైలురాయిని అధిగమించడం జరిగిందని అన్నారు. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.1201 కోట్లు బెరైటీస్ ద్వారా రెవెన్యూ సాధించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1369 కోట్లు రెవెన్యూ ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 6) ఝార్ఝండ్ లోని బ్రహ్మదియాలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్ ఈ జూలై నెలలో ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే హెచ్ఎంబిసి, ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ లను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఎపిఎండిసి ముందంజలో ఉందని, దీనిని మరింత మెరుగుపరుచు కోవడం ద్వారా సంస్థను అగ్రగామిగా నిలబెట్టాలని కోరారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి, ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, ఎపిఎండిసి వైస్ ప్రెసిడెంట్ రామ్ నారాయణన్, సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్, గనులశాఖ జెడి రాజబాబు, డిడి రవిచంద్, ఎపిఎండిసి జీఎంలు టి.నతానేయల్, ఎ.నాగేశ్వరరెడ్డి, డిజిఎం సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాటా విక్రయం వదంతే: వేదాంతా నిరాధారమని స్పష్టీకరణ
మైనింగ్ మొఘల్, ప్రమోటర్ అనిల్ అగర్వాల్ కంపెనీలో వాటాను విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని వేదాంతా లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు వెలువడిన వార్తలు కేవలం వదంతులేనని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. చివరి అవకాశంగా వేదాంతాలో 5 శాతంవరకూ వాటా విక్రయించే యోచనలో అనిల్ అగర్వాల్ ఉన్నట్లు ఇటీవల మీడియా పేర్కొన్న నేపథ్యంలో కంపెనీ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. వేదాంతా లిమిటెడ్‌లో మెజారిటీ వాటాదారు అయిన వేదాంతా రిసోర్సెస్ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు చూస్తోంది. ఇందుకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)కు జింక్ ఆస్తులను విక్రయించడం ద్వారా 298.1 కోట్ల డాలర్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కంపెనీలో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. అయితే హెచ్‌జెడ్‌ఎల్‌లో 29.54 శాతం వాటా కలిగిన ప్రభుత్వం ఇందుకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది. కాగా.. రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులకు అవసరమైన వనరులున్నట్లు ఇంతక్రితం వేదాంతా వెల్లడించింది. తద్వారా రుణ చెల్లింపులపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేసింది. సిండికేట్ రుణం, బైలేటరల్ బ్యాంక్ సౌకర్యాల ద్వారా 1.75 బిలియన్ డాలర్లు పొందే ఒప్పందం తుది దశలో ఉన్నట్లు వేదాంతా తెలియజేసింది. 2023 మార్చివరకూ అన్ని రకాల రుణ చెల్లింపులనూ పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గత 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. జూన్‌కల్లా చేపట్టవలసిన చెల్లింపులకూ తగిన లిక్విడిటీని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. బార్క్లేస్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల నుంచి తీసుకున్న 25 కోట్ల డాలర్ల రుణాలను పూర్తిగా చెల్లించినట్లు ఇటీవలే కంపెనీ పేర్కొంది. -
సీనరేజీపై మరోసారి ఈనాడు తప్పుడు కథనం
-
సీనరేజి వసూళ్లపై వక్రభాష్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురదచల్లే ఉద్దేశంతోనే ‘ఖనిజాల సీనరేజి వసూళ్లు ప్రైవేటుపరం’ అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచేలా పూర్తి అవాస్తవాలతో అందులోని రాతలు ఉన్నాయంటూ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవినీతి, అలసత్వాన్ని పూర్తిగా తొలగించాలనే మంచి ఉద్దేశంతో పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గనుల శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలతో రాష్ట్రంలో మైనింగ్ కార్యక్రమాలు పెరిగాయన్నారు. తద్వారా అటు ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ, ఇటు పరిశ్రమలకు అవసరమైన ఖనిజాల లభ్యత, పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఆ ప్రకటనలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. అధ్యయనం తరువాతే.. ఇతర రాష్ట్రాలు చిన్నతరహా ఖనిజాల సీనరేజి వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా మైనింగ్ రెవెన్యూలో స్థిరత్వం, పురోగతి సాధిస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఇచి్చన ఆదేశాలతో గనుల శాఖకు చెందిన మైనింగ్ అధికారులు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఈ విధానాన్ని అధ్యయనం చేశారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని నివేదించడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీనరేజి వసూళ్ల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువమంది టెండర్లలో పాల్గొనేలా నిబంధనలను సరళతరం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని మైనింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్–2017కు అనుగుణంగానే ప్రభుత్వం రిజర్వు ధర, సరళమైన నిబంధనలను అమలులోకి తెస్తూ టెండర్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనలతో నిర్వహించిన టెండర్లలో 5 జిల్లాలకు టెండర్లు ఖరారయ్యాయి. మొదట సాంకేతిక బిడ్‌ను పరిశీలించి అందులో అర్హులైన వారిని మాత్రమే ఫైనాన్షియల్ బిడ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నాం. కోట్ చేసిన వాటిలో అధిక మొత్తం నుంచి ఆక్షన్ ప్రారంభమవుతుంది. అంతకంటే ఎక్కువ ఎవరైతే కోట్ చేస్తారో వారికే టెండర్ దక్కుతుంది. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తుంటే ‘ఈనాడు’ పనిగట్టుకుని అబద్ధాలతో ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టెండర్లలో ‘ఈనాడు’ పాల్గొనవచ్చు టెండర్లలో బిడ్లు దాఖలు చేసిన సంస్థల అర్హతలను మాత్రమే గనుల శాఖ పరిశీలిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈనాడు పత్రికకు కనీసం ఈ విషయం తెలియకపోవడం బాధాకరం. ఆసక్తి ఉంటే ఈ టెండర్లలో ఈనాడు సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొనవచ్చు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం . రాష్ట్రంలో ఖనిజాలను రవాణా చేసే వాహనాలను ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పర్యవేక్షిస్తూ సీనరేజి వసూళ్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ పెరుగుతుంది. మైనింగ్‌పై పటిష్ట పర్యవేక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ బృందాన్ని నియమించేలా ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇంత మంచి విధానాన్ని అమలు చేస్తుంటే అవగాహన లేకుండా ఈనాడు పత్రిక వక్రీకరణ కథనాలను ప్రచురించడం సరికాదు. -
'బంగారు' బాటలో.. కర్నూలు జిల్లా చిప్పగిరిలో మొదలైన పుత్తడి వెలికితీత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బంగారు గనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా గనుల్లో తవ్వకాలు ప్రారంభించి ఆదాయాన్ని సమకూర్చుకునేలా అడుగులు వేస్తోంది. కొత్త బంగారు గనులకు టెండర్లు పిలిచి ఖరారు చేయడంతోపాటు గతంలో తవ్వకాలు నిలిచిపోయిన గనులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. బంగారు గనుల ద్వారా రూ.10 వేల కోట్ల రాబడి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది. చిప్పగిరిలో మైనింగ్ ప్రారంభం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత కర్నూలు జిల్లా చిప్పగిరి బంగారు గనిలో ఇటీవలే తవ్వకాలు మొదలై ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. 2002లో ఇక్కడ తవ్వకాలకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి లీజు మంజూరు కాగా పలు కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. 20 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న ఈ గనుల్లో తవ్వకాలను సీఎం జగన్ ప్రభుత్వం పట్టుదలతో ఓ కొలిక్కి తెచ్చింది. ఆ కంపెనీతో పలుదఫాలు సంప్రదింపులు జరిపి మైనింగ్ ఆపరేషన్స్ మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంది. చేసింది. కంపెనీ ఇటీవల ప్రభుత్వానికి రూ.2 కోట్ల రాయల్టీ చెల్లించింది. బంగారాన్ని ప్రాసెస్ చేసే మినీ స్మెల్టర్ని గనిలో సొంతంగా ఏర్పాటు చేసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో బంగారం వెలికితీత ప్రారంభం కానుంది. చిగురుకుంట, బిసనాతంలో లైన్ క్లియర్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 118 హెక్టార్లలో ఉన్న చిగురుగుంట, బిసనాతం బ్లాకుల్లో మైనింగ్ ఆపరేషన్స్ త్వరలో మొదలు కానున్నాయి. ఈ గనిని గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కి చెందిన భారత్ గోల్డ్ మైన్స్ లీజుకు తీసుకుంది. అయితే వివిధ కారణాల వల్ల లీజు రద్దయింది. 2018లో మళ్లీ నిర్వహించిన వేలంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) దీన్ని దక్కించుకుంది. ఇటీవలే స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేయడంతో ఎన్ఎండీసీకి లైన్ క్లియర్ అయింది. వచ్చే ఏడాది ఈ గనిలో కూడా బంగారం ఉత్పత్తి మొదలుకానుంది. 10 గనులపై ఫోకస్ కొత్త గనులపైనా దృష్టి సారించిన ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 బంగారు గనులకు (ఏరియాలు) కాంపోజిట్ లైసెన్సులు ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత నూతన గనుల చట్టం ప్రకారం (ఎంఎండీఆర్ చట్టం) వేలం ద్వారా కాంపోజిట్ మైనింగ్ లైసెన్సులు (అన్వేషణ, ఆ తర్వాత మైనింగ్ లీజు) ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. రామగిరి నార్త్, రామగిరి సౌత్, బొక్కసంపల్లి నార్త్, బొక్కసంపల్లి సౌత్ ఏరియాలకుగాను మూడు లీజులు ముంబై కేంద్రంగా ఉన్న ఆంధ్రా మైనింగ్ కంపెనీకి దక్కాయి. దేశంలోనే అత్యధికంగా మినరల్ వాల్యూలో 20 శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఈ బిడ్లు ఖరారయ్యాయి. మరో లీజు మంజూరు ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా జవుకులలో 57 చదరపు కిలోమీటర్లను ఆరు బ్లాకులుగా విభజించి టెండర్లు పిలిచారు. మొదటిసారి సరైన స్పందన రాకపోవడంతో ఇటీవల మళ్లీ టెండర్లు ఆహ్వానించారు. ఫిబ్రవరిలో వాటికి వేలం జరగనుంది. మారిన పరిస్థితుల్లో ఆ బిడ్లు ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుచూపుతో ప్రణాళిక.. మైనింగ్ రంగంలో ఉన్న విస్తారమైన అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేలా సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన కార్యాచరణ ఇచ్చారు. అందులో భాగంగానే బంగారు గనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. రానున్న రోజుల్లో వీటి ద్వారా రాష్ట్రానికి ఊహించనంత ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో రూపొందించిన ప్రణాళిక విజయవంతమైంది. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ చదవండి: అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి -
‘హరిత’ వాహనాలపై బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో డీజిల్ ఆధారిత మైనింగ్ వాహనాలను బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలుగా మార్చుకునేందుకు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,270 కోట్లు) పైగా వెచ్చించనున్నట్లు, పూర్తి స్థాయిలో హరిత ఇంధనాల వైపు మళ్లనున్నట్లు హిందుస్తాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా తెలిపారు. తమకు 900 మైనింగ్ వాహనాలు ఉండగా ఇప్పటికే నాలుగింటిని ప్రయోగాత్మకంగా బ్యాటరీలతో నడిపిస్తున్నట్లు ఆయన వివరించారు. 2050 నాటికి పూర్తి కర్బన ఉద్గారాల రహిత సంస్థగా ఎదిగే దిశగా 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు ఇటీవలే సెరెంటికా సంస్థతో పాతికేళ్ల పవర్ పర్చేజ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిశ్రా చెప్పారు. దీనితో 1.2 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలను నివారించవచ్చన్నారు. 2024 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగాన్ని 40 శాతం మేర, 2027 పూర్తిగా తగ్గించుకోవాలని ప్రణాళికలు ఉన్నట్లు మిశ్రా వివరించారు. అలాగే రాజస్థాన్‌లోని చందేరియాలో రూ. 2,500 కోట్లతో 0.5 మిలియన్ టన్నుల డీఏపీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వేదాంత గ్రూప్ సంస్థ అయిన హెచ్‌జెడ్‌ఎల్‌లో ప్రభుత్వానికి 29 శాతం వాటాలు, ముగ్గురు బోర్డు సభ్యులు ఉన్నారు. ఈ వాటాలను ప్రభుత్వం త్వరలోనే పూర్తిగా విక్రయించనుందని, అయితే నిర్దిష్ట కాలవ్యవధేమీ లేదని మిశ్రా వివరించారు. దీనిపై ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసినట్లు ఆయన చెప్పారు. జింక్ తయారీలో హెచ్‌జెడ్‌ఎల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దేశీయంగా వెండిని తయారు చేసే ఏకైక సంస్థగాను, జింకు..సీసం అత్యధికంగా తయారు చేసే కంపెనీగాను కార్యకలాపాలు సాగిస్తోంది. -
మంత్రి గుంగుల ఇంటికి సీబీఐ బృందం.. ఢిల్లీకి రావాలని సమన్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, న్యూఢిల్లీ: ‘నకిలీ సీబీఐ అధికారి’ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో గురువారం ఢిల్లీలో అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తాను సీబీఐ అధికారినంటూ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యా ప్తంగా పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన కొవి రెడ్డి శ్రీనివాసరావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్న విషయం తెలిసిందే. అతడికి తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మంత్రి గంగుల, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలతో పరిచయం ఉందని గుర్తించడంతో విచారణకు రావాలని ఆదేశించింది. బుధవారం ఉదయం ఇద్దరు సీబీఐ అధికారులు కరీంనగర్‌లోని గంగుల నివాసానికి వచ్చి సమన్లు అందించారు. రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 51 జారీ చేసిన నేపథ్యంలో.. సీబీఐ అధికారులు రాష్ట్రంలో ప్రముఖులకు సమన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కులం పేరుతో కుచ్చుటోపీ! విశాఖపట్టణంలోని చినవాల్తేరు కిర్లంపూడికి చెందిన కొవిరెడ్డి తాను ఐపీఎస్ అధికారినని, సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొంటూ తిరిగేవాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో కులం పేరు చెప్పుకుని పరి చయం పెంచుకున్నాడు. తమ కులంవ్యక్తి కావడం, అతడి పటాటోపం చూసి ఒకరి వెనుక మరొకరు నమ్మేశారు. అందులో ఎంపీలు, మంత్రులు, ఎమ్మె ల్యేలూ ఉన్నారు. అయితే శ్రీనివాసరావు ఢిల్లీలో వ్యాపారాలు, ఇతర అవసరాలున్న వారిని ఎంచుకునేవాడు. ఢిల్లీలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని.. కొలువులు, పర్మిట్లు ఇప్పిస్తానని, కేసులు మాఫీ చేయిస్తానని నమ్మించేవాడు. ‘పని’ కావాలంటే ఖర్చవుతుందని చెప్పి విలువైన కాను కలు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో పోర్టర్ అనే కంపెనీకి చెందిన దాదాపు 2వేల వాహనాలకు ఢిల్లీలో ‘నో ఎంట్రీ’ నిబంధనలు లేకుండా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కేసులోనే శ్రీనివాసరావును ఢిల్లీలోని తమిళనాడు భవన్లో సీబీఐ అరెస్టు చేసింది. రాష్ట్ర నేతల పరిచయాలతో.. తెలుగు రాష్ట్రాల్లో ఓ కులానికి సంబంధించిన నేత లను బాగా నమ్మింపజేసిన శ్రీనివాసరావు.. వారిలో కొందరు ప్రముఖుల నుంచి భారీగా బంగారం, నగదు తీసుకున్నట్టు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో అతడి ఫోన్లో వద్దిరాజు రవిచంద్ర, ఆయనకు బంధువైన మంత్రి గంగుల కమలాకర్‌లతో కలిసి తీసుకున్న ఫొటోలు లభించినట్టు సమాచారం. దీనికితోడు గతంలో ఈడీ అధికారిని అంటూ మంత్రి గంగుల కమలాకర్‌ను ఓ అజ్ఞాత వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో ఏవైనా లావాదేవీలు నడిచాయా అని సీబీఐ అనుమానిస్తోందని సమాచారం. శ్రీనివాసరావుతో నాకేం సంబంధం లేదు ఇటీవల కొన్ని వేదికలపై శ్రీనివాసరావు కలిశాడే తప్ప అతడితో తనకేం సంబంధం లేదని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సదరు శ్రీనివాసరావు తాను ఐపీఎస్ అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడని వివరించారు. ఢిల్లీ వెళ్లి ఇదే విషయాన్ని సీబీఐ ఆఫీసర్లకు చెబుతానన్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణలో నందు పొంతనలేని సమాధానాలు -
మైనింగ్‌కు ప్రభుత్వ మద్దతు కావాలి
కోల్‌కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్‌పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్‌కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు. కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్‌దేబ్ పేర్కొన్నారు. -
మైనింగ్ సంస్కరణలతో మరింత పారిశ్రామికాభివృద్ధి
సాక్షి, అమరావతి/చెన్నై: గనుల లీజుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడితే మరింత పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఇండియా సిమెంట్స్ ఏర్పాటై 75 ఏళ్లుపూర్తయిన సందర్భంగా చెన్నైలో శనివారం నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మంత్రి బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నపురాయి వంటి కీలక ఖనిజాల లీజులకు సంబంధించి కేంద్ర ఎంఎండీఆర్ పాలసీలో కొద్దిపాటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 1946లో 1.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలైన ఇండియా సిమెంట్స్ ప్రస్థానం... ఇప్పుడు 6 మిలియన్ టన్నులకు చేరిందని, దృఢమైన భారతజాతి నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామిగా నిలిచిందని అన్నారు. ఇండియా సిమెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్‌కు పటిష్టమైన బంధం ఉందని, రాష్ట్రంలో సిమెంట్ పరిశ్రమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్‌లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్‌లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
Andhra Pradesh: పన్ను చెల్లింపు సులభతరం
మద్యం అక్రమ తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులోకి తీసుకు రావాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అవసరమయ్యే సేవలు ఏమిటి? వాటివల్ల ఎలాంటి హక్కులు ఉంటాయి? దాని వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం? అనే విషయాలపై అవగాహన కల్పించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయం తీసుకుంటూ నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలి. సాక్షి, అమరావతి: పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పన్నుల్లో ఎక్కడా లీకేజీలు (ఎగవేతలు, ఆదాయాన్ని తక్కువ చేసి చూపడం, తప్పుడు లెక్కలు) లేకుండా చూసుకోవాలని, వాటిని అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ల సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మద్యం అక్రమ తయారీ, విక్రయాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని చెప్పారు. గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతి రోజూ నివేదికలు తీసుకుంటూ, వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాణిజ్య, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, అటవీ, రవాణా శాఖల కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చాలని ఆదేశించారు. రవాణా శాఖలో ఆదాయం పెంపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని, జీఎస్టీ వసూళ్లు బాగున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం ► ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలి. భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోతగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలి. ► మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందిన వారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలి. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. ఆపరేషన్‌లో లేని వాటిపై దృష్టి పెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి నెలా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలి. లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. ► రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. పక్క రాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు రాష్ట్రంలో తగిన సానుకూల పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి డీలర్లు డబ్బు తీసుకుని, వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగు చూశాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లక్ష్యం దిశగా ఆదాయం ► ‘గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబర్ వరకు రూ.1,174 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా 19 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 43 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశాం’ అని అధికారులు సీఎంకు తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీఎస్టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. 2022 సెప్టెంబర్ వరకు లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ.25,928 కోట్ల ఆదాయం వచ్చింది. 94.47% లక్ష్యం చేరుకున్నాం’ అని చెప్పారు. ► లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంను అభివృద్ధి పరిచామని, హెచ్ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేసి.. సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. -
ఖనిజ లీజులకు దశల వారీగా ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి గనులను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం దశల వారీగా నిర్వహిస్తున్న ఈ–వేలం ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది. తొలి దశలో గ్రానైట్ మినహా మిగిలిన చిన్న తరహా ఖనిజాల లీజులకు మంచి స్పందన లభించింది. 35 లీజులకు నిర్వహించిన ఈ–వేలంలో రూ. 16 కోట్ల ఆదాయం లభించింది. రెండో దశలో 27 లీజులకు ఈ–వేలం ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటి వరకు 20 లీజులకు వేలం పూర్తయింది. వారం రోజుల్లో మిగిలిన 7 లీజులకు ఈ–వేలం పూర్తి చేస్తామని మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లీజు పొంది పని చేయకుండా ఉన్న 2,724 చిన్న తరహా గనులను ఆపరేషన్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ–వేలం విధానాన్ని ప్రారంభించారు. సీఎం చొరవతో ఈ–వేలానికి సుమారు 700 గనులు ఆపరేషన్ చేయడం ప్రారంభించాయి. ఈ లీజుల్లో ఎక్కువ క్వార్ట్జ్, బ్లాక్ గ్రానైట్, బెరైటీస్, సిలికాశాండ్, ప్రొఫలైట్ ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి. మిగిలిన వాటికి ఈ–వేలం నిర్వహించి తవ్వకాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న మైనింగ్ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేయడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతిచ్చిన ఈ లీజుల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం నిలిచిపోవడంతో పాటు, మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. సద్వినియోగం చేసుకోని లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. దశల వారీగా 6 నెలల్లో వెయ్యి లీజుల్లో తవ్వకాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ. 500 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని గనుల శాఖ అంచనా వేస్తోంది. -
మైనింగ్ పేరుతో టోకరా!
పంజగుట్ట: మైనింగ్‌లో లాభాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మాజీ మంత్రి సీనియర్ కాగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏకే ఖాన్‌పై న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. టౌలీచౌకీకి చెందిన వ్యాపారి మహ్మద్ అబ్దుల్ వాహబ్కు జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి మోహ్సిన్ ఖాన్ పరిచయం ఉంది. మోహ్సిన్ ఖాన్ తనకు బంజారాహిల్స్‌లో సన్‌లిట్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రిజిస్టర్ సంస్థ ఉందని దానికి తానే ఎండీనని చెప్పాడు. తపస్వీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఖమ్మ జిల్లా, రామానుజవరంలో 46 ఎకరాల్లో ఇసుక మైనింగ్ టెండర్ దొరికిందని, ఆ సంస్థతో తమ సంస్థ 25 శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. 25 శాతం వాటాలో సుమారు రూ.6.5 కోట్లు లాభం వస్తుందని అబ్ధుల్ వాహబ్‌ను నమ్మించాడు. రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు నకిలీ పత్రాలు చూపించాడు. తనతో చేతులు కలిపితే నీకు 50 శాతం వాటా ఇస్తానని అందుకుగాను రూ.90 లక్షలు చెల్లించాలని కోరాడు. మోహ్సిన్ ఖాన్ చెప్పిన మాటలు అబ్థుల్ వాహబ్ నమ్మక పోవడంతో తన మామ జూబ్లీహిల్స్‌కు చెందిన రాజకీయ నాయకుడు మొహ్మద్ అలీ షబ్బీర్‌ను (షబ్బీర్ అలీ)ని పరిచయం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా చేయడంతో బాధితుడు అబ్థుల్ వాహబ్ అతడిని గుర్తుపట్టాడు. కుందన్‌బాగ్‌లో ఉంటున్న మాజీ పోలీస్ ఉన్నతాధికారి అబ్థుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్)ను కూడా అతడికి పరిచయం చేశాడు. దీంతో అబ్థుల్ వాహబ్ అతడి మాటలు నమ్మి 2016లో బ్యాంకు ద్వారా, నగదు ద్వారా రూ.90 లక్షలు చెల్లించాడు. సంవత్సరాలు గడుస్తున్నా లాభం ఇవ్వకపోగా మొహం చేయడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మోహ్సిన్ ఖాన్ బాధితుడిని బెదిరించడం, తప్పించుకుని తిరగడం చేస్తుండడంతో బాధితుడు నాంపల్లి కోర్టును ఆదేశించారు. కోర్టు ఆదేశాలమేరకు పంజగుట్ట పోలీసులు మోహ్సిన్ ఖాన్, మొహ్మద్ అలీ షబ్బీర్, అబ్థుల్ ఖయ్యూం ఖాన్‌లపై 465, 420, 406, ఐపీసీ రెండ్‌విత్ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (చదవండి: సెల్‌ఫోన్ వాడడు..సీసీ కెమెరాకు చిక్కడు..శ్మశానంలోనే తిండి నిద్ర) -
జార్ఖండ్ సీఎం సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు
-
జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు
రాంఛీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఎం సోరెన్‌కు సంబంధాలున్నట్లు తేలినందున ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్‌కు సూచించింది.ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దయినా.. సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది. చదవండి: ఆజాద్ డీఎన్ఏ 'మోడీ-ఫై' అయింది: జైరాం రమేశ్ -
ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ!
శాంటియాగో: భారీగా, ఎంతలా అంటే ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా ఆ గొయ్యి.. అంతకంతకు పెరుగుతూ చిలీ దేశాన్ని.. అక్కడి నుంచి ప్రపంచాన్నే వణికించింది. ఏదో వినాశనం తప్పదంటూ ప్రచారమూ ఊపందుకుంది. ఈ ఊదరగొట్టుడు హెడ్‌లైన్స్ వెనుక అతిశయోక్తి మాత్రమే ఉందని చెబుతూ.. అసలు విషయాన్ని వెల్లడించారు అధికారులు. చిలీ రాజధాని శాంటియాగోకు 800 కిలోమీటర్ల దూరంలోని, అటకామా రీజియన్‌లో టియెర్రా అమరిల్లా దగ్గర ఈ నెల మొదట్లో ఈ భారీ గుంత ఏర్పడి.. క్రమక్రమంగా పెరుగుకుంటూ పోతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెడల్పు అంతకు అంతకు పెరుగుతూ.. సుమారు 200 మీటర్ల లోతైన ఈ గుంత.. మన శాట్చ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని(198 మీటర్లు) మింగేసేంత సామర్థ్యం ఉంటుందన్న మాట. అయితే.. ప్రాథమిక దర్యాప్తులో ఈ భారీ గొయ్యి ఎలా ఏర్పడిందన్న దానిపై ఎలాంటి అంచనాకు రాలేకపోయారు అక్కడి అధికారులు.. ఇప్పుడు ఆ మిస్టరీని దాదాపుగా చేధించారు. మానవ కార్యకలాపాల వల్లే ఆ భారీ గొయ్యి ఏర్పడిందని నిర్ధారణకు వచ్చేశారు. ఆ ప్రాంతంలో భారీ మైనింగ్ కార్యకలాపాల వల్ల ఆ గుంత ఏర్పడి ఉంటుందని అంచనాకి వచ్చి.. దానిని పూడ్చేసే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు. Tierra Amarilla.. ప్రపంచంలోనే ఎక్కువగా కాపర్‌ను ఉత్పత్తి చేసే హబ్. కెనడాకు చెందిన ఓ కంపెనీ కార్యకలాపాల వల్లే ఈ భారీ గొయ్యి ఏర్పడి ఉంటుందని ఒక అంచనాకి వచ్చారు అక్కడి అధికారులు. ఈ విషయంపై మైనింగ్ మినిస్టర్ మార్సెలా హెర్నాండో స్పందిస్తూ.. మితిమీరిన మైనింగ్ కార్యకలాపాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ భారీ గొయ్యి ఏర్పడిన సమీప ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. -
గాలి రాతలైతేనే అచ్చేస్తాం! రామోజీ పచ్చ రాతలు.. నిజాలకు పాతరేస్తూ..
ఏదో ఒకరకంగా బురద జల్లటమే తప్ప వాస్తవాలతో పనిలేని ‘ఈనాడు’... బుధవారం కూడా ఇలానే బోడిగుండూ... మోకాలూ ఒకటేనని చెప్పే ప్రయత్నం చేసింది. గాలి జనార్థన్‌రెడ్డికి ఓబుళాపురం గనులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందని, తమకేమాత్రం అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టుకే చెప్పిందని అబద్ధాలను పోగేసి వండివార్చింది. ఓబుళాపురం గనులకు సంబంధించి జరగనివన్నిటినీ జరిగినట్లుగా ఊహించుకుంటూ రామోజీ తన మార్కు పాత్రికేయానికి మరోసారి పదునుపెట్టారు.‘గాలి అడిగితే కాదంటామా?’ అనే శీర్షికతో గాలి వార్తను అచ్చేశారు. అక్షరం కూడా వాస్తవం లేని ఈ కథనంలో అసలు నిజాలేంటో ఒకసారి చూద్దాం... ఓబుళాపురం ప్రాంతంలోని మూడు ఇనుప ఖనిజం గనులకు ఉన్న 50 సంవత్సరాల లీజు కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి కాలపరిమితి ముగిసిన గనులకు 1957 గనుల చట్టం ప్రకారం ఈ–ఆక్షన్ ద్వారా తిరిగి లీజులు కేటాయించాలి. కాకపోతే ఇప్పటికే ఈ గనులకు సంబంధించిన అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం కోర్టు విచారణలో ఉంది. గతంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా క్షేత్ర స్థాయిలో సర్వే చేసి నిర్దేశించిన మేరకు ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రాళ్ళను ఏర్పాటు చేసింది. సరిహద్దుల నిర్ధారణ కూడా పూర్తయిన నేపథ్యంలో... కోర్టులో ఉన్న కేసును పరిష్కరించడం కోసం త్వరగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌ను కోరింది. ఎందుకంటే ఈ వివాదం పరిష్కారమైతే సదరు మూడు గనులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మళ్లీ ఈ–ఆక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే వాటి ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. నిజానికి అక్కడ తవ్వకాలకు అనుమతివ్వాలా? వద్దా? అనేది సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే దుష్ప్రచారమే ఎజెండాగా చెలరేగిపోతున్న ‘ఈనాడు’కు ఈ వాస్తవాలేవీ కనిపించ లేదు. గాలి జనార్థన్‌రెడ్డి వ్యవహారానికి దీంతో లింకు పెట్టి యథేచ్చగా తప్పుడు కథనాలు రాసిపారేసింది. ఇది ‘గాలి’ వార్త కాదా రామోజీ? వాస్తవానికి ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలు జరిగితే అది ఆ ప్రాంతానికి ఉపయోగకరమే. అక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం లభ్యమవుతుంది కూడా. అందుకే కోర్టులో ఉన్న గనుల కేసు కొలిక్కి వస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. మరి ఇది గాలి జనార్థన్‌రెడ్డికి ప్రయోజనం చేకూర్చడం ఎలా అవుతుంది రామోజీరావు గారూ?. సరిహద్దు వివాదం ముగిసిందని, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్దేశించినట్లు సరిహద్దులు నిర్ధారించామని మాత్రమే కదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది!!. దానర్థం గాలి జనార్ధనరెడ్డికి అనుమతి ఇచ్చేయమనా? కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లకు సైతం ఇలా వక్రభాష్యాలు చెప్పటం ఏ స్థాయి జర్నలిజం? ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ గనుల వేలానికి అవకాశం ఏర్పడితే... ఎవరైనా దాన్లో పాల్గొనవచ్చు. దక్కించుకున్న వారు ఎవరైనా వాటిని తవ్వుకోవచ్చు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇదంతా మీకు తెలియదా... లేక తెలిసినా మీ ఉద్దేశం వేరు కాబట్టి తెలియనట్లు నటిస్తున్నారా? రాష్ట్రానికి ఆదాయం రాకూడదన్నదే మీ ఎజెండా కాబట్టి ఈ రాతలకు దిగుతున్నారా? ‘బాబు’ స్కాములపై అసలు పెన్నెత్తలేదేం? చంద్రబాబు హయాంలో ఎన్ని కుంభకోణాలు వెలుగుచూసినా రామోజీరావు వాటి గురించి ఏనాడు పట్టించుకోలేదు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు దోచేసినా... చంద్రబాబు తన కరకట్ట ఇంటి వెనక రాత్రింబవళ్లూ ఇసుకను లారీలతో అక్రమంగా తరలించేసుకున్నా రామోజీకి కనపడలేదు. ‘సాక్షి’లో ఫోటోలతో సహా ప్రచురించినా ‘ఈనాడు’ పెన్నెత్తలేదు. ఇప్పుడు అదే ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక రాజధాని ఎక్కడో చెప్పకుండా ముందే అమరావతి ప్రాంతంలో భూములు కొని, లక్షల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినా అది రామోజీకి అభివృద్ధిగానే కనపడింది. రాజధానిలో దళితుల భూములను పైసాకు, పరకకు కొనుగోలు చేసి తర్వాత తీరిగ్గా చంద్రబాబు మనుషులకు అనుకూలంగా క్రమబద్ధీకరించుకున్నా అదో నేరంగా కనిపించలేదు. అమరావతి రింగ్‌రోడ్డును తన అనుయాయులకు అనుకూలంగా ఎన్ని వంపులు తిప్పినా ‘ఈనాడు’కు అది చూడచక్కని గొలుసు డిజైన్‌గానే కనిపించింది. దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) స్కీములో ఎవరి వాటా వారికి అందింది కాబట్టే అప్పట్లో స్కాములన్నీ రామోజీకి అభివృద్ధి వీచికలుగా కనిపించాయి. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏది తలపెట్టినా... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోకాలడ్డుతూనే ఉన్నారు. అందులో భాగమే ఈ... గాలి రాతలు. -
డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు.. ఎన్కౌంటర్లో దిగిన బుల్లెట్!
చండీగఢ్: హర్యానా డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్‌పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్‌ను పోలీసులు గంటల్లోనే పట్టుక్నునారు. నూహ్‌లో అతడ్ని గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితుడి మోకాలిలోకి బుల్లెట్ దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితుడి పేరు ఇక్కార్ అని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన అతడ్ని చికిత్స కోసం నల్హార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నూహ్‌లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించేందుకు మంగళవారం మధ్యాహ్నం తన టీమ్‌తో వెళ్లారు తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. అక్కడ మైనింగ్ చేస్తున్న డంపింగ్ ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ట్రక్కు డ్రైవర్ మాత్రం డీఎస్పీ ఆపుతున్నా లెక్కచేయకుండా వాహనాన్ని ఆయనపై నుంచే పోనిచ్చాడు. అనంతరం సురేంద్రసింగ్‌ను ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలపాలై ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ట్రక్కును ఆపే సమయంలో డీఎస్పీతో పాటు గన్‌మెన్, డ్రైవర్ ఉన్నారు. కానీ వారు ప్రాణభయంతో ట్రక్కు దగ్గరకురాగానే పక్కకు దూకారు. డీఎస్పీ మాత్రం అలాగే ఉండిపోవడం వల్ల ట్రక్కు ఆయనపై నుంచి వెళ్లి చనిపోయాడు. ఈ ట్రక్కును డ్రైవ్ చేసింది నిందితుడు ఇక్కారే అని పోలీసులు తెలిపారు. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
ESZ: మైనింగ్, పరిశ్రమలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: అడవుల పరిరక్షణ కోసం మైనింగ్, పరిశ్రమల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను నిషేధించింది. దేశవ్యాప్తంగా ఎకో-సెన్సిటివ్ జోన్లు (ESZ పర్యావరణ సున్నిత మండలాలు), చుట్టుపక్కల కార్యకలాపాలను నియంత్రించడంపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఈ మేరకు శుక్రవారం.. బఫర్ జోన్‌కు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఈ జోన్ల వెంబడి జరుగుతున్న తయారీ, తయారీ సంబంధిత కార్యకలాపాలు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతితో మాత్రమే కొనసాగుతాయని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అలాగే ప్రతి రాష్ట్రం తరపున.. చీఫ్ కన్జర్వేటర్ ESZ హోదా కింద వచ్చే నిర్మాణాల జాబితాను సిద్ధం చేసి మూడు నెలల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు ఉండరాదని పేర్కొంది. -
బుద్దుండక్కర్లేదా?.. అంతా మీకేనా!
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో అక్రమ గనులు.. ప్రత్యేకించి రాళ్ల గనులు, కొండలు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయి. డ్రోన్ సర్వే, టాస్క్‌ఫోర్స్ కమిటీ, ప్రత్యేక కార్యచరణ తదితర ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అక్రమ గనుల తవ్వకాలది అదే దారి. ఒక చోట తవ్వకాలకు అనుమతులు తీసుకుని ఇతర ప్రాంతాల్లో గనులు తవ్వేయడం, అధికారులు, రాజకీయ నేతల అండదండలతో విచ్చలవిడిగా గనులు తవ్వుకుని కోట్లాది రూపాయలను వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం చర్యలు నామమాత్రమే అవుతున్నాయని పర్యావరణవాదులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ జిల్లాల్లో అధికం బెంగళూరు రూరల్, రామనగర, కొప్పళ, చిక్కబళ్లాపుర, కోలారు, చామరాజనగర, బీదర్, శివమొగ్గ, మండ్య, మైసూరు, దక్షిణకన్నడ, బళ్లారి, తుమకూరు, విజయపుర తదితర జిల్లాల పరిధిలో చాలా చోట్ల అనుమతులు లేకుండా వేలాది ఎకరాల్లో రాళ్ల గనులు తవ్వుతున్నట్లు గనుల శాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. వీటికి అనుబంధంగా వందలాది జల్లిక్రషర్లను ఏర్పాటుచేసుకుని కంకర, రాతి ఇసుకగా మార్చి అమ్ముకుంటున్నారు. మూడేళ్లలో 13 వేల కేసులు గత మూడేళ్ల వ్యవధిలో సుమారు 13 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. 2019 – 20 సంవత్సరంలో 4,935 కేసులు, 2020 – 21లో 5,584, 2021 – 22లో 2,996 కేసులు నమోదయినట్లు సమాచారం. ఇందులో 70.15 శాతం కేసుల్లో అరకొర జరిమానా విధించారు. కొందరికి మాత్రమే జైలు శిక్ష పడింది. గనుల వెనుక బలమైన వ్యక్తులే ఉండడం వల్ల జరిగేదేమిటో అందరికీ తెలిసిందే. గనులు– ఖనిజాలు –1957 చట్టం ప్రకారం గనులు, తవ్వకాలు, రవాణా అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విషయం. అక్రమ గనుల తవ్వకాలను నియంత్రించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. తరచూ పేలుళ్లు, నేరాలు మండ్యజిల్లాలో ప్రసిద్ధ కేఆర్ఎస్ డ్యాం దెబ్బతినేలా సమీపంలో రాళ్ల గనులను తవ్వుతున్నారని ఆరోపణలు రావడం తెలిసిందే. గతేడాది జనవరిలో శివమొగ్గలో గనుల పేలుడుపదార్థాలు పేలి ఆరుమంది కార్మికులు దుర్మరణం చెందారు. ఆ మరుసటి నెలలోనే చిక్కబళ్లాపురలోనూ ఇదే తరహాలో పేలుళ్లు సంభవించి మరో ఆరుగురు గని కార్మికులు మృత్యువాత పడ్డారు. తరచూ గనుల వద్ద ప్రమాదాలతో ప్రాణనష్టం జరుగుతోంది. అదేరీతిలో కిడ్నాప్‌లు, హత్యలూ చోటుచేసుకోవడం గమనార్హం. చదవండి: వీడియో: అబ్బా..! దళిత స్వామిజీతో ఎమ్మెల్యే ‘ఎంగిలి కూడు’ చేష్టలు వైరల్ -
రాతి గనులు.. మేటి ఘనత
కొలిమిగుండ్ల: బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె మండలాల్లో విస్తరించి ఉన్న నాపరాతి ఖనిజ సంపద వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్దాల నుంచి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వందల కుటుంబాలకు గనులు జీవనోపాధి కల్పిస్తున్నాయి. గనుల్లో పని చేయడం కార్మికులకు ప్రతి రోజు సవాల్‌గా మారుతుంటుంది. పని చేసే సమయంలో చాలా మంది కార్మికులు మృత్యువాత పడటం లేదా తీవ్రగాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 950 హెక్టార్లలో నాపరాతి గనులు విస్తరించి ఉన్నాయి. రోజుకు 400 టన్నులకు పైగానే ఉత్పత్తి జరుగుతుంటుంది. రాయల్టీ, మైనింగ్ లీజు, తదితర వాటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.30 కోట్ల మేర ఆదాయం వస్తోంది. కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె క్రాస్ రోడ్డు సమీపంలో భూగర్బ గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్‌పోస్ట్ ద్వారా ఏడాదికి రూ.6 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. నాపరాతి గనులపై ఆధారపడి నియోజకవర్గంలో 500కు పైగా, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వెయ్యికి పైగా పాలీష్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. గనుల్లో వెలికితీసిన నాపరాళ్లు ప్రతి రోజు ట్రాక్టర్ల ద్వారా ఫ్యాక్టరీలకు చేరవేస్తుంటారు. గనులు, ఫ్యాక్టరీలు. లోడిండ్, అన్లోడింగ్ కార్మికులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు 40 వేల మంది పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. నాపరాయి ఖరీదు తక్కువ వివిధ రకాల ఖనిజాల కంటే నాపరాతి రేటు చాలా తక్కువ. అడుగు ఆరు రూపాయలు మాత్రమే. బేతంచెర్లలోని వైట్‌షీల్, వైట్‌క్లే తదితర రంగురాయి అడుగు రూ.14 నుంచి 25 ధర పలుకుతుంది. గ్రానైట్ తీసుకుంటే సాధారణంగా అడుగు రూ.45 వరకు ఉంటుంది. వాటితో పోలిస్తే నాపరాయి చాలా తక్కువ ధరకు వస్తుంది. ఇటీవల మైనింగ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 రకాల ఖనిజాలను దృష్టిలో పెట్టుకొని నాపరాళ్లపై సెక్యూరిటీ డిపాజిట్, డెడ్‌రెంట్ పెంచడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి బనగానపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వెలికి తీసిన నాపరాళ్లు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు పదుల సంఖ్యలో లారీల్లో ఎగుమతి జరుగుతుంటుంది. ఆ ప్రాంతాల్లో నాపరాళ్లను ఇళ్ల నిర్మాణాలు, కాల్వలు తదితర వాటికి ఉపయోగించే వాళ్లు. ప్రధానంగా ఫ్లోరింగ్ సమయంలో నాపరాయి ఉపయోగించి వాటిపై గ్రానైట్ రాళ్లు వాడుతుంటారు. కాలక్రమేణా నాపరాతి ఎగుమతి సన్నగిల్లుతోంది. ఛత్తీస్‌గడ్‌లో ఇదే తరహాలో బ్లాక్ స్టోన్ మైనింగ్ వెలికి తీయడంతో పాటు ఎక్కువ భాగం గ్రానైట్, టైల్స్, రాజస్థాన్ మార్బుల్స్ వాడకం పెరగడంతో నాపరాయికి డిమాండ్ తగ్గింది. గతంలో కూలీలతో పనులు చేయించేవాళ్లు, కాలక్రమేణా యంత్రాలు రావడంతో పెట్టుబడి పెరిగింది. ఉత్పత్తికి తగ్గట్టుగా ధర, డిమాండ్ లేక పోవడంతో యజమానులకు ఆశించిన లాభాలు రావడం లేదు. నాపరాయిపై అదనపు చార్జీలు తగ్గించాలి ఇతర ఖనిజాలతో పాటు నాపరాళ్లపై విధించిన అదనపు ఛార్జీలు తగ్గించాలి. చాలా తక్కువ ధరతో లభించేది నాపరాయి. అన్ని రకాల మినరల్స్‌తో సమానంగా బ్లాక్ స్టోన్పై అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్, డెడ్‌రెంట్ పెంచడంతో పరిశ్రమ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. నాపరాయి పరిశ్రమకి వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలి. – చంద్రశేఖరరెడ్డి, మైనింగ్ యజమాని, అంకిరెడ్డిపల్లె 30 ఏళ్లుగా గనులపైనే ఆధారం 30 ఏళ్ల నుంచి నాపరాళ్ల గనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కాలక్రమేణా నాపరాయికి మార్కెట్లో డిమాండ్ తగ్గింది. పైగా పెట్టుబడులతో పాటు ఖర్చులు భారీగా పెరిగాయి. నష్టాలు చవి చూస్తే యజమానులు కోలుకోలేని పరిస్థితి ఉంటుంది. – శివరామిరెడ్డి, గని యజమాని, అంకిరెడ్డిపల్లె వందల కుటుంబాలకు ఇదే జీవనం నాపరాతి గనులపై వందల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రధాన వనరులు గనులే కావడంతో ఏరోజు పనికి వెళితే ఆరోజు కుటుంబం గడిచే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గనుల్లో కూలీలు, లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లంతా ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు. ప్రమాదకరమైన పనులు చేసే కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. – సుబ్బరాయుడు, గని కార్మిక సంఘం నాయకుడు, బెలుం -
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు.. త్వరలో క్యాపింగ్ తవ్వకాలు
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్‌లో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టకు బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్ చేయాలంటూ ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అందుకు ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచింది. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు వల్ల తలెత్తుతున్న సమస్యలపై స్థానికులు ఎన్జీటీని ఆశ్రయించడం.. ఇతరత్రా అంశాల నేపథ్యంలో డంపింగ్ యార్డుకు చేసిన క్యాపింగ్‌ను తొలగించి బయోమైనింగ్ చేయాలని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ టెండరు పిలిచింది. తాము శాస్త్రీయంగా చేసిన క్యాపింగ్‌ను వివరిస్తూ జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ వేసినా ఎన్టీటీ జీహెచ్ఎంసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ టెండరు ఆహ్వానించింది. ► ఒకసారి క్యాపింగ్ చేసిన చెత్తగుట్ట బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్‌కు సంబంధించి కేంద్ర కాలుష్యనివారణ మండలి నుంచి జీహెచ్ఎంసీకి మార్గదర్శకాలు సైతం అందలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్న విధానాలు తెలిసిన లేదా కేంద్ర/రాష్ట్ర కాలుష్య నివారణ మండలి మార్గదర్శకాల కనుగుణంగా, శాస్త్రీయంగా క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను బయోమైనింగ్ చేయగల నైపుణ్యం ఉన్న సంస్థల్ని టెండర్లకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం వల్ల ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నం కానున్నాయో అంతుచిక్కడం లేదు. టెండర్ మేరకు ఈ పనులు దక్కించుకునే సంస్థ మూడు సంవత్సరాల్లో పని పూర్తి చేయాల్సి ఉంది. బయోమైనింగ్‌తో వెలువడే వ్యర్థాలను నిల్వ ఉంచే స్థలం కలిగి ఉండాలి. వ్యర్థాలనుంచి వెలువడే కలుషిత ద్రవాలు(లీచెట్)ట్రీట్మెంట్కు ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. చెత్తనుంచి గ్యాస్ ఉత్పత్తికోసం ఏర్పాటు చేసిన గ్యాస్ వెంట్స్ నుంచి సమస్యలు తలెత్తకుండా గ్యాస్ మేనేజ్మెంట్ ఇతరత్రా పనులు సైతం కాంట్రాక్టు సంస్థే చేయాల్సి ఉంటుంది. ► దాదాపు 120 లక్షల మెట్రిక్ టన్నులమేర క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తిరిగి తవ్వి పనులు చేయాల్సి ఉంటుంది. మునిసిపల్ ఘనవ్యర్థాల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంది. ► చెత్తగుట్ట క్యాపింగ్ పనులకు రూ. 140 కోట్లు వెచ్చించారు. ఇందులో 35 శాతం స్వచ్ఛభారత్ మెషిన్ ద్వారా కేంద్రప్రభుత్వం అందజేయగా, మిగతా వ్యయాన్ని జీహెచ్ఎంసీ, డంపింగ్‌యార్డు ట్రీట్మెంట్ కాంట్రాక్టు పొందిన రాంకీ సంస్థలు భరించాయి. క్యాపింగ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాక, తిరిగి ఇప్పుడు దాన్ని తవ్వి బయోరెమిడియేషన్ చేయడం ఎప్పటికి సాధ్యం కానుందో అంతుపట్టడం లేదు. ఈ లోగా కొత్త సమస్యలకు అవకాశముందని ఈ అంశంలో అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఖర్చు చేసిన రూ.140 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందం కానున్నాయి. బయోమైనింగ్ అంటే క్యాపింగ్ చేసిన చెత్తగుట్టను తవ్వడం. బయో రెమిడియేషన్ అంటే వెలువడే చెత్తను మట్టి, కంపోస్టు, ఇతరత్రా సామాగ్రిగా వేరు చేయడం. వీటిల్లో ప్లాస్టిక్, ఇనుము, గాజు, రాళ్లు, కంకర వంటివి ఉంటాయని చెబుతున్నప్పటికీ మట్టి, ఇతరత్రావన్నీ కలిసి రెండు భాగాలుగా మాత్రమే వెలువడనున్నట్లు సమాచారం. ఈ పనులు చేసేందుకు ఎన్జీటీ నిబంధనల మేరకు దాదాపు రూ. 660 కోట్లు ఖర్చు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లో..) -
ఏపీలో సత్ఫలితాలిస్తోన్న మైనింగ్ సంస్కరణలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనింగ్ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో నూతన విధానాలకు రూపకల్పన చేశారు. పారదర్శకతతో అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఖనిజ ఆదాయంలో గనుల శాఖ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చదవండి: ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3765 కోట్ల ఆదాయం వచ్చింది. 60 శాతం వృద్ధి రేటుతో గత ఏడాది కన్నా అదనంగా రూ.1425 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లీజు అనుమతులు మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచ్చింది. తద్వారా లీజులు పొంది.. ఏళ్ల తరబడి క్వారింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేసే విధానానికి స్వస్తి పలికారు. ముఖ్యంగా లీజుల కేటాయింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తుందని గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్పారు. -
భారత్‌లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ!
న్యూఢిల్లీ: బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఈ మెటల్ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత్ బంగారం గనుల ఉత్పత్తి 2020లో 1.6 టన్నులని వెల్లడించింది. అయితే దీర్ఘకాలంలో దేశీయ ఉత్పత్తి వార్షికంగా 20 టన్నులకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇందుకు పలు చర్యలు అవసరమని సూచించింది. భారత్‌లో బంగారం మార్కెట్‌పై జరుపుతున్న అధ్యయనంలో భాగంగా ‘గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా’ అన్న శీర్షికన మండలి ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► భారతదేశానికి బంగారం తవ్వకాలలో గొప్ప వారసత్వం ఉంది. అయితే తక్కువ పెట్టుబడుల కారణంగా దేశీయంగా పరిశ్రమ వృద్ధికి ఆటంకం ఏర్పడింది. భారత్ పసిడి మైనింగ్ మార్కెట్ ఒక చిన్న స్థాయిలో పనిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులతో ప్రవేశించడం అంత సులభం కాదు. ► భారతదేశం ప్రస్తుత వనరులు, ఇతర దేశాలలో ఉత్పత్తి– వనరుల స్థాయిలతో పోల్చితే దీర్ఘకాలంలో సంవత్సరానికి దాదాపు 20 టన్నుల వార్షిక ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ► నియంత్రణ సవాళ్లు, పన్నుల విధానాలు, మౌలిక సదుపాయాలు దేశంలో పసిడి మైనింగ్‌కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. ► బంగారు తవ్వకం భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం బంగారం కోసం అన్వేషణ, మైనింగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడే అంశంగా చెప్పడంలేదు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం సంపద భారత్ సొంతం. ► మైనింగ్ విస్తృతి... ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పన, సంబంధిత పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది. అనుబంధ సేవా పరిశ్రమలు ప్రారంభమవుతాయి. ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమలు సంబంధిత గని కార్యకలాపాల కాలపరిమితికి మించి ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► భారతదేశం తన బంగారు మైనింగ్ ఆస్తులను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తుందనే బలమైన విశ్వాస్వాన్ని పెట్టుబడిదారుకు కల్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయి. ఇదే జరిగితే దేశం బంగారు మైనింగ్ రంగానికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ► ప్రస్తుతం మైనింగ్ రంగం మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మైనింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంది. ఇందులో బహుళ ఏజెన్సీల పాత్ర ఉంటోంది. ఒక్క లైసెన్స్ కోసం 10 నుంచి 15 ఆమోదాలు పొందాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనికితోడు ఆయా ఆమోదాల కోసం తీవ్ర జాప్యం పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా తయారయ్యింది. ప్రధానంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు దూరంగా ఉంటాయి. ఇక మూడవ సమస్య విషయానికి వస్తే, మైనింగ్ పరికరాలపై దిగుమతి పన్ను, ఇతర ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ► ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లో మైనింగ్ పరికరాలను దిగుమతి చేసుకోడానికి ప్రాజెక్ట్ డెవలపర్లు మొగ్గు చూపుతారు. అధిక దిగుమతి పన్నులు మూలధన వ్యయాన్ని పెంచుతాయి. ఈ రంగంలో అభివృద్ధిని నిరోధిస్తాయి. ► అనేక కీలకమైన బంగారు మైనింగ్ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్న రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండడం మరో ప్రతికూల అంశం. ప్రత్యేకించి రహదారి, రైలు లింక్‌లు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాలకు మైనింగ్ పరికరాలు, సంబంధిత సామాగ్రి తరలించడం కష్టతరం, వ్యయ భరితం అవుతుంది. ఫలితంగా, గత 15 సంవత్సరాలుగా బంగారం అన్వేషణలో పరిమిత పెట్టుబడుల పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది. ► అయితే, ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం అత్యంత సమస్యాత్మకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భారతదేశ బంగారు గనుల రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. పలు విధాన మార్పులను ప్రతిపాదించి అమలు చేస్తోంది. ► గనులు– ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 (ఎంఎండీఆర్) సవరణకు 2015 మార్చిలో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడానికి ఇది దోహదపడింది. ప్రధాన మైనింగ్ లీజుల వ్యవధిని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పొడిగించింది. ► మైనింగ్ అన్వేషణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా 2016 జూన్‌లో ప్రభుత్వం జాతీయ ఖనిజ అన్వేషణా విధానం (ఎన్‌ఎంఈపీ)న్ని ఆమోదించింది. మైనింగ్ రంగంలో అడ్డంకులను తొలగించి, అభివృద్దిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని (ఎన్ఎంపీ 2019) అమలు చేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించింది. ఈ విధానం బొగ్గు, ఇతర ఇంధనేతర ఖనిజాలకు వర్తిస్తుందని తెలిపింది. తద్వారా ఏడేళ్ల కాలంలో భారత్ ఖనిజ ఉత్పత్తి విలువలను 200 శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అంశం ఇది. సానుకూల మార్పులు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సమంజసమే. అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం. నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి–నియంత్రణ) చట్టంలో మార్పులు, జాతీయ మినరల్ పాలసీ, జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం ఆవిష్కరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ బంగారం గని ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. అయితే కొత్త విధానాల అమలు, వాటి విజయవంతం, నూతన పెట్టుబడులు రాక వంటి అంశాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) రీజినల్ సీఈఓ -
కడప ఉక్కు ఫ్యాక్టరీకి పూర్తి సహకారం అందించండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు ఫ్యాక్టరీకి పూర్తి సహకారం అందించాలని మైనింగ్ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒడిశాలోని కోణార్క్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్, పరిశ్రమల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం జరిగిన సమావేశానికి ఏపీ తరఫున ఆయన హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గనులు, పరిశ్రమల విషయంలో తీసుకుంటున్న ప్రగతిశీల విధానాలపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో అపారమైన ఇనుప ఖనిజం వనరులు ఉన్నాయని, కడప ఉక్కు రాష్ట్రానికి ఒక వరంగా మారుతుందని చెప్పారు. దేశంలోనే సుమారు 13 శాతం మ్యాగ్నటైట్ ఇనుప ఖనిజ నిల్వలు ఏపీలో ఉన్నాయని తెలిపారు. ఒక్క అనంతపురం జిల్లాలోని 6 మైనింగ్ రిజర్వుల పరిధిలోనే 110 మిలియన్ టన్నుల హైగ్రేడ్ ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయన్నారు. మ్యాగ్నటైట్ ఐరన్ ఓర్ గ్రేడ్లను కూడా బెనిఫికేషన్ చేసి, వాటిని ఉక్కు కర్మాగారానికి ముడి ఖనిజంగా వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలించాలని కోరారు. అనంతపురంలోని ఇనుప ఖనిజం లీజులను ఏపీఎండీసీకి రిజర్వు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఏపీఎండీసీ బలోపేతానికి సహకరించాలని కోరారు. గనులకు అనుమతులు ఇచ్చే సమయంలో కనీసం 5 నుంచి 10 సంవత్సరాల కాలయాపన జరుగుతోందని, ఫలితంగా అనుకున్న లక్ష్యం ప్రకారం మైనింగ్ కార్యక్రమాలు జరగడం లేదని చెప్పారు. ఈ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర గనులు, పర్యావరణ మంత్రులు, రాష్ట్రానికి చెందిన ప్రతినిధులతో ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేసి అనుమతుల జారీలో కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మైనింగ్, విద్యుదుత్పత్తి జోరు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగం వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో దేశీయ సగటు కంటే రాష్ట్రం మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసినట్లు గణాంకాల శాఖ తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్‌తో భారీగా దెబ్బతిన్న మైనింగ్ రంగం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి (ఏప్రిల్ – జూలై) 37.4 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మైనింగ్ రంగంలో 25.3 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ఇక 2020–21 ఏప్రిల్ – జూలైతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రంలో 23.1 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి రేటు 15.2 శాతానికే పరిమితమైంది. నాలుగు నెలల కాలానికి రాష్ట్ర తయారీ రంగంలో 20.7 శాతం వృద్ధి నమోదు కాగా దేశవ్యాప్తంగా 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తిలో 22.8 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ తెలిపింది. పెరుగుతున్న కొనుగోళ్ల శక్తి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో కొనుగోళ్ల శక్తిని పెంచుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో వివిధ రంగాల్లో ప్రజల వినియోగంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. గతేడాది నిర్మాణ రంగంలో నాలుగు నెలల కాలంలో 41.7 శాతం క్షీణత నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 56 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలో 57.8 శాతం, పేస్టులు, సౌందర్య సాధనాలు, ఇంటిని శుభ్రపరచే నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్ వినియోగంలో 156.4 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ పేర్కొంది. గతేడాది కోవిడ్‌తో దెబ్బతిన్న ప్రైమరీ, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ రంగాలు కూడా క్రమంగా వృద్ధి బాట పట్టాయి. -
క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!
క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్ కరెన్సీ. 2009 నుంచి మొదలైన క్రిప్టోకరెన్సీ ఇంతింతై వటూడింతై అన్న చందంగా పలు క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ గణనీయంగా పెరుగుతూనే ఉంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడు బిట్‌కాయిన్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఆయా క్రిప్టోకరెన్నీలు పూర్తిగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను, జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు కచ్చితంగా వాడాలి. కొన్ని రోజుల క్రితం క్రిప్టోకరెన్సీ మైనింగ్ కంప్యూటర్లలో వాడే గ్రాఫిక్స్ కార్డు ధరల్లో మార్పులు వచ్చేలా చేశాయి. అత్యంత బలమైన కంప్యూటర్లతో సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. తాజాగా క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడంపై విస్తుపోయే విషయాలను ఒక నివేదిక వెల్లడించింది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..! పొంచి ఉన్న పెనుముప్పు...! బిట్‌కాయిన్ ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్ చేయడంతో గణనీయమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఒక సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఎలక్ట్రనిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన బిట్‌కాయిన్ మైనింగ్ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం 1.3 సంవత్సరాలు మాత్రమే. డచ్ సెంట్రల్ బ్యాంక్ ఎకనామిస్ట్, రిపోర్ట్ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ మాట్లాడుతూ... ఐఫోన్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పోలీస్తే బిట్‌కాయిన్ మైనింగ్ నుంచి వచ్చే ఎలక్ట్రినిక్ ఉద్గారాల సంఖ్య చాలా తక్కువ. బిట్‌కాయిన్ మైనింగ్ ద్వారా గడిచిన పన్నెండు నెలల్లో ఉత్పత్తి చేయబడిన వ్యర్థాల మొత్తం 30,700 టన్నులు. ఈ మొత్తం నెదర్లాండ్స్ లాంటి దేశాల ఎలక్ట్రనిక్ వ్యర్థాలకు సమానమని తెలియజేశారు. రానున్న రోజుల్లో బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల మార్కెట్ భారీగా పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, స్టోరేజ్ విషయంలో క్రిప్టోకరెన్సీలను మైనింగ్ చేయడం కచ్చితం. దీంతో విపరీతంగా కంప్యూటర్ల వాడకం పెరగడంతో ఎలక్ట్రానిక్స్ ఉద్గారాలు అనులోమనుపాతంలో పెరుగుతాయని రిపోర్ట్ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 53.6 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ ఉద్గారాలు వెలువడ్డాయి. చదవండి: Bitcoin: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! -
Telangana: నిధుల ‘మైనింగ్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో సంస్కరణల ద్వారా ప్రస్తుత ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం మైనింగ్ రంగం ద్వారా రూ. 3,612 కోట్ల ఆదాయం వస్తుండగా సంస్కరణల తర్వాత ఈ ఆదాయం రూ. 7,518 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ఉప సంఘం మైనింగ్ రంగానికి చెందిన వివిధ వర్గాలతో సంప్రదింపుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశముంది. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే మైనింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ. 3,906 కోట్లు సమకూరుతాయి. లేటరైట్, రోడ్ మెటల్, మొరం, మార్బుల్, క్వారŠట్జ్ వంటి మైనర్ మినరల్స్‌ను వేలం వేయడం, సీనరేజి, డెడ్ రెంట్ శాతాన్ని పెంచడం ద్వారా రాబడి పెరుగుతుందనే ప్రధాన సంస్కరణలను కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. వాటితోపాటు పర్యావరణ ప్రభావ (ఈఐ) ఫీజు పెంపు, ఈఐ విస్తీర్ణం తగ్గింపు, ఇసుకపై సీనరేజీ పెంపు, ఇసుక ధర అదనంగా రూ. 100 పెంపు, గ్రావెల్‌కు దరఖాస్తు ధర వంటి ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీ తిరస్కరించింది. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్ర ఖజానాపై రూ. 260 కోట్ల మేర ప్రభావం చూపుతుందని మంత్రివర్గ ఉప సంఘం అంచనా వేసింది. సీనరేజీ ఫీజు పెంపుతో రూ.578 కోట్లు లీజు విస్తీర్ణంలో ఖనిజాల వెలికితీతపై విధించే సీనరేజి పన్నును మూడేళ్లకోసారి సవరించాల్సి ఉండగా 2015 సెప్టెంబర్ నుంచి సవరించలేదు. దీంతో ఇసుకను మినహాయించి ఇతర ఖనిజాల వెలికితీతపై 40–50 శాతం సీనరేజి పెంపు ద్వారా అదనంగా రూ. 578 కోట్లు రాబట్టవచ్చని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం సీనరేజీ ద్వారా రూ. 1,149 కోట్ల ఆదాయం వస్తుండగా పెంపుదలతో రూ. 1,727 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. వెలికితీసిన ఖనిజాల రవాణా అనుమతి కోసం కొత్తగా ‘పర్మిట్ ఫీజు’ను విధించాలని నిర్ణయించగా గ్రానైట్‌కు సీనరేజీలో 0.4 రెట్లు, ఇతర ఖనిజాలకు 0.8 రెట్లు వసూలు చేయడం ద్వారా రూ.1,219 కోట్లు రాబట్టవచ్చని సబ్ కమిటీ ప్రతిపాదించింది. క్వారీలో కార్యకలాపాలు జరగకున్నా మూసి ఉన్న కాలానికి వసూలు చేసే ‘డెడ్ రెంట్’ను గత ఆరేళ్లుగా సవరించలేదు. ఈ నేపథ్యంలో డెడ్ రెంట్‌ను వంద శాతం పెంచడం ద్వారా ఆదాయం రూ.94 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే మైనింగ్ లీజు రెన్యూవల్‌పై కూడా డెడ్‌రెంట్‌కు నాలుగు రెట్లు చార్జీలు వసూలు చేయడం ద్వారా రూ.29 కోట్లు, లీజు హక్కులను బదిలీ చేసేందుకు లీజు ఫీజు కింద రూ.14.48 కోట్లు రాబట్టాలని ప్రతిపాదించింది. లీజు, వేలం దరఖాస్తులకు ఫీజు వసూలు లీజు లేదా వేలం దరఖాస్తు ఫీజు ద్వారా రూ.25 కోట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెండింగులో ఉన్న కేసులను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద పరిష్కారం చేసి రూ. 206 కోట్లు సమకూర్చుకునే అవకాశం ఉందని సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కృత్రిమ ఇసుక తయారీని ప్రోత్సహించడం ద్వారా రూ. 300 కోట్లు, సున్నపురాయి, మాంగనీసు వంటి మేజర్ మినరల్స్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ.565 కోట్లు, మైనర్ మినరల్స్ వేలం ద్వారా రూ.250 కోట్లు, లెటర్ ఆఫ్ ఇంటెంట్ల జారీ, ప్రస్తుత లీజులపై సెక్యూరిటీ డిపాజిట్ల ద్వారా అదనపు ఆదాయం రాబట్టాలని కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదిస్తే నిబంధనలు సవరించి కొత్త మైనింగ్ పాలసీని అమలు చేస్తామని మైనింగ్ విభాగం వర్గాలు వెల్లడించాయి. -
గనుల రంగంలో విప్లవాత్మక సంస్కరణలు!
న్యూఢిల్లీ: గనుల రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మరో వారంలో సంబంధిత వర్గాల సలహాలను ఆహా్వనిస్తుందని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో మైనింగ్ చట్టాలకు కేంద్రం సవరణలు తీసుకువస్తుందని కూడా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 100 జీ4 ఖనిజ క్షేత్రాల బదలాయింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రహ్లాద్ మాట్లాడారు. గనులు, ఖనిజాల అంశాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఖనిజ క్షేత్రాలను వేలానికి తీసుకురావాలని రాష్ట్రాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు 100 ఖనిజ క్షేత్రాల కేటాయింపు వల్ల దేశంలో సంబంధిత సరఫరాలు నిరంతరం పెరుగుతాయని, ఖనిజ క్షేత్రాల వేలం ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తుందని తెలిపారు. -
కొండపల్లి మైనింగ్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: కొండపల్లి మైనింగ్, మేజర్ కాల్వలు పూడికపై దాఖలైన పిటిషన్లపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు. ఇబ్రహీంపట్నంలోని మేజర్ కెనాల్ 19 నుంచి 24 కిలోమీటర్ల వరకు స్టోన్ క్రషర్ కంపెనీలు రోడ్డు వేసుకున్నాయి.. 17 చోట్ల కెనాల్‌ని పూడ్చేశాయి అని తెలిపారు. కెనాల్ పక్కన కొన్ని చోట్ల అక్రమంగా ఇల్లు ఏర్పాటు చేసుకున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. (చదవండి: బెంజ్ సర్కిల్ ‘ఫ్లై ఓవర్ల’ వివాదానికి తెర) స్టోన్ క్రషర్ కంపెనీ పూడ్చేసిన 17 చోట్ల కెనాల్ పూడిక తీశాం. రిజర్వు ఫారెస్ట్‌కి 10 మీటర్లు లోపలే మైనింగ్ జరుగుతుంది. మైనింగ్‌కు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఫొటోలు కూడా ఉన్నాయని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. -
30 రోజుల్లో మైనింగ్ అనుమతులు
సాక్షి, అమరావతి: పెండింగ్‌లో ఉన్న లీజు దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం మోక్షం కలిగించనుంది. కేవలం 30 రోజుల్లో అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర గనుల శాఖ ప్రణాళిక రూపొందించింది. నెలల తరబడి రెవెన్యూ, గనుల శాఖ చుట్టూ తిరిగే పనిలేకుండా నిబంధనల ప్రకారం ఉన్న వాటిని మంజూరు చేయనుంది. ప్రస్తుతం గనుల శాఖలో 18 వేల లీజు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని రద్దుచేసి ఈ–వేలం నిర్వహించాలని తొలుత భావించారు. అయితే.. కోర్టు సమస్యలలో తీవ్ర జాప్యం ఏర్పడే పరిస్థితి ఉండడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఉన్న దరఖాస్తుల్లోనే అన్ని ప్రక్రియలు పూర్తిచేసుకుని నిబంధనల ప్రకారం పక్కాగా ఉన్న లీజులకు 30 రోజుల్లో అనుమతులివ్వాలని నిర్ణయించారు. ఆ లీజుల వార్షిక డెడ్ రెంట్ (లీజుదారుడు సంవత్సరానికి చెల్లించే ఫీజు)పై పదింతల ప్రీమియం కట్టించుకుని అనుమతులు ఇవ్వనున్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో ప్రస్తుతం వెయ్యి దరఖాస్తులు అన్ని ప్రక్రియలు పూర్తయి మంజూరు దశలో ఉన్నాయి. వాటికి ప్రీమియం కట్టించుకుని అనుమతులు ఇస్తామని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ లీజుల ద్వారా ఈ సంవత్సరం సుమారు రూ.500 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతం వచ్చే సంవత్సరం మంజూరు దశకు చేరుకున్నా వాటికీ ప్రీమియం కట్టించుకుని లీజులు ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రతిఏటా రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. -
ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలు: గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అవరావతి: ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలను గనులశాఖ ఖండించింది. నిబంధనల ప్రకారమే ఇసుక మైనింగ్‌కు అనుమతులు ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. '' జేపీ పవర్ వెంచర్స్‌కు మాత్రమే ఓపెన్ రీచ్‌ల్లో ఇసుక మైనింగ్‌కు అనుమతి ఇచ్చాం. టీడీపీ నాయకులు ఫోర్జరీ డాక్యుమెంట్లను విడుదల చేశారు. మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చిందన్నది అవాస్తవం. సుధాకర ఇన్ఫ్రాకు ఇసుక డ్రెడ్జింగ్ అనుమతి ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. సుధాకర ఇన్ఫ్రా పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. అని తెలిపారు. చదవండి: విశాఖకు చంద్రబాబు అనుకూలమా?.. కాదా?: మంత్రి అవంతి -
క్రిప్టోకరెన్సీ.. భారీగా ఉద్యోగావకాశాలు
క్రిప్టోకరెన్సీల లావాదేవీలపై ప్రభుత్వం, నియంత్రణ సంస్థల వైఖరి ఎలా ఉన్నప్పటికీ.. దేశీయంగా వీటి ట్రేడింగ్, మైనింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలు పెద్ద సంఖ్యలో నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. వీటికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం కావడంతో ఎక్కువగా తత్సంబంధ అంశాల్లో పరిజ్ఞానమున్న ఇంజనీర్లకు డిమాండ్ ఉంటోంది. బ్లాక్‌చెయిన్ డెవలపర్, బ్యాక్ఎండ్ డెవలపర్, క్రిప్టో ఇంజినీర్లు మొదలైన వారికోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. వీరితో పాటు ప్రోడక్ట్ డెవలప్మెంట్, మార్కెటింగ్ సిబ్బంది నియామకాలు కూడా మొదలైనట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. సాంప్రదాయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలతో పోలిస్తే క్రిప్టో ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు కనీసం 25–30 శాతం అధికంగా ఉంటుండటంతో.. ఇంజినీర్లు వీటిపై ఆసక్తి చూపుతున్నట్లు వివరించాయి. దేశీయంగా క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు వార్షికంగా రూ. 9.5 లక్షల నుంచి ఉంటున్నాయి. రెండేళ్ల దాకా అనుభవం ఉన్నవారికి దాదాపు రూ. 22 లక్షల దాకా ప్యాకేజీ ఉంటోంది. ఇక సాలిడిటీ వంటి వినూత్న టెక్నాలజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్నవారికైతే ఏకంగా రూ. 45 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీ ఉంటోంది. ఇతర ఉద్యోగాలకు సంబంధించి మార్కెటింగ్, ప్రోడక్ట్ డెవలపర్లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఉదాహరణకు, అమెరికాలో లిస్టయిన కాయిన్‌బేస్ అనే భారీ క్రిప్టో ఎక్సే్చంజీ ప్లాట్‌ఫాం పెద్దయెత్తున నియామకాలు చేపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నట్లు కంపెనీ భారత విభాగ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ గుప్తా ఇటీవల వెల్లడించారు. వచ్చే ఏడాది.. రెండేళ్ల వ్యవధిలో భారత్‌లో పూర్తి స్థాయి హబ్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 2012లో ప్రారంభమైన కాయిన్‌బేస్ ప్లాట్‌ఫాంపై బిట్‌కాయిన్, ఎథీరియం, లైట్‌కాయిన్ వంటి పలు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ జరుగుతోంది. భిన్నమైన నైపుణ్యాలు.. ఇతర టెక్నాలజీ ప్లాట్‌ఫాంలతో పోలిస్తే క్రిప్టో రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు భిన్నంగా ఉంటాయి. ఇవి మార్కెట్లో నేర్చుకోవడానికి అంత సులువుగా లభించవు. క్రిప్టో రంగానికి బ్లాక్‌చెయిన్ సాంకేతికతలో సుశిక్షితులైన ఇంజినీర్లు అవసరమవుతారు. కోడ్‌ను వేగవంతంగా రూపొందించడం, వినియోగంలోకి తేవడంతో పాటు కోడ్ భద్రతపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి వినియోగంలోకి తెచ్చాక సొల్యూషన్స్‌లో మార్పులు చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు కాబట్టి ఏ కాస్త తప్పిదం జరిగినా అటు యూజర్లు, ఇటు ప్లాట్‌ఫాంలు భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కనుక హ్యాకింగ్ దాడులనూ సమర్ధంగా తట్టుకునేలా ప్లాట్‌ఫాంలు సురక్షితంగా ఉండాలి. హ్యాకింగ్ జరిగితే సెకన్లలో కోట్ల డబ్బు తుడిచిపెట్టుకుపోతుంది. దీనికి కోడర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంతటి రిస్కీ వ్యవహారం కాబట్టి కోడర్లకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. సందిగ్ధంలో ఉద్యోగార్థులు.. జీతభత్యాలు ఆకర్షణీయంగా ఉన్నా, క్రిప్టో సంస్థలపై నియంత్రణపరంగా స్పష్టత లేకపోవడంతో వీటిలో చేరడానికి ఉద్యోగార్థులు వెనుకాడుతున్నారు. క్రిప్టో కరెన్సీకి తాను అనుకూలమా లేక ప్రతికూలమా అన్న దానిపై రిజర్వ్ బ్యాంక్ ఇప్పటిదాకా స్పష్టతనివ్వలేదు. ఈ అనిశ్చితితో హైరింగ్‌పైనా ప్రభావం పడుతోంది. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియని క్రిప్టో రంగంలోని సంస్థల్లో చేరడానికి చాలా మంది ఇష్టపడటం లేదని క్రిప్టో ఎక్సే్చంజీ నిర్వాహకులు అంటున్నారు. ఉద్యోగార్థులు చేరాలనుకున్నా వారి కుటుంబాల ఆందోళన వల్ల సదరు అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక కోర్సులు... అర్హులైన ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్న వారు, మైనింగ్ చేస్తున్నవారిని కూడా రిక్రూట్ చేసుకునేందుకు క్రిప్టో సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైతే వారు రిఫ్రెషర్ కోర్సులు నేర్చుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రత్యక్షంగా ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చే అనుభవమనేది ఇతరత్రా విద్యాసంస్థల్లో నేర్చుకున్న దానికి మించి ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. క్రిప్టో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా ప్రత్యేక కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని ఎంఐటీ మీడియా ల్యాబ్ .. క్రిపోకరెన్సీలపై ఆరు వారాల స్వల్పకాలిక ఆన్లైన్ కోర్సు అందిస్తోంది. గెట్స్మార్టర్ అనే డిజిటల్ ఎడ్యుకేషన్ కంపెనీ భాగస్వామ్యంతో అందించే ఈ కోర్సు ఫీజు రూ. 1.93 లక్షలుగా ఉంది. ఇటీవలే సింప్లీలియర్ అనే అంతర్జాతీయ డిజిటల్ నైపుణ్యాల సంస్థ .. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై నాలుగు నెలల ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం అందించేందుకు ఐఐటీ కాన్పూర్‌తో జట్టు కట్టింది. నిపుణుల కొరత... మధ్యవర్తి ప్రమేయం లేకుండా రెండు వర్గాలు క్రిప్టో లావాదేవీలు నిర్వహించడానికి ఉపయోగపడే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను స్మార్ట్ కాంట్రాక్టులుగా వ్యవహరిస్తారు. కొన్ని ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందిన వారికి డిమాండ్ అధికంగా ఉంటోంది. ఉదాహరణకు బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫాంలలో స్మార్ట్ కాంట్రాక్టులను అమలు చేసేందుకు ఉపయోగించే సాలిడిటీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఇది 2014లో తెరపైకి వచ్చింది. ఈ లాంగ్వేజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్న వారు కూడా వార్షికంగా రూ. 45 లక్షల దాకా వేతనం అందుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సుశిక్షితులైన వారి కొరత తీవ్రంగా ఉండటంతో ఎంతైనా ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉంటున్నాయి. బ్లాక్‌చెయిన్ ఇంజినీర్లకు నెలకు రూ. 1.45 లక్షల దాకా వేతనం ఇచ్చి తీసుకునేందుకు యునోకాయిన్ వంటి సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ నిపుణులు దొరకడం లేదు. దీంతో ప్రతిభావంతులైన ఇంజనీర్లను నియమించుకుని, వారికి శిక్షణనిచ్చుకోవాల్సి వస్తోంది. కాయిన్‌బేస్ వంటి పెద్ద సంస్థలు నియామకాలను గానీ చేపడితే.. పరిస్థితులు మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దీనివల్ల మరింత మంది శిక్షణ పొంది, నిపుణుల కొరత కొంత తీరవచ్చని పేర్కొన్నారు. కేవలం ఇంజినీర్లే కాకుండా క్రిప్టో ఎక్సే్చంజీల్లో ఇతరత్రా సిబ్బంది అవసరం కూడా ఉంటోంది. -
ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!
కాబూల్: కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకోవడమేకాదు ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖనిజాల భారీ నిక్షేపాల ప్రాప్యతను నియంత్రించే సామర్థ్యాన్ని కూడా సొంతం చేసుకున్నారు. సంఘర్షణ, అవినీతి, అధికార లోపం కారణంగా గత పదేళ్లుగా దాదాపు పూర్తిగా ఉపయోగంలోకి రాకుండా ఉన్న లిథీయం నిక్షేపాలపై కూడా పట్టు సాధించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి బ్యాటరీలకు ఉపయోగపడే ఈ ఖనిజ వనరులు విరివిగా ఉపయోగంలోకి వస్తాయా, ఈ ఖనిజాల మైనింగ్ ట్రేడింగ్‌ను తాలిబన్లు సమర్ధవంతంగా నిర్వహించగలరా? ఖనిజాలు, విలువైన లోహాల నిధిగా పేరొందిన దేశంలో నల్లమందుకు ప్రత్యామ్నాయంగా ప్రధాన ఆర్థిక వనరుగా మైనింగ్‌ను ఉపయోగించుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ జియాలజిస్టులు దేశంలోని విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కనుగొన్న తరువాత 2010లో "సౌదీ అరేబియా ఆఫ్ లిథియం" గా పిలిచిన లిథియం ఖనిజ సంపదపై కూడా తాలిబన్లు తాజాగా పట్టు సాధించారు. దీని విలువ కనీసం 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అప్పట్లోనే అంచనా వేశారు. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) ఎలక్ట్రిక్ వాహనాల పునరుత్పాదక శక్తి బ్యాటరీలకు ఈ సిల్వర్ మెటల్ ఎంతో అవసరం ఉంది. అయితే ప్రపంచంలోని అగ్రశ్రేణి లిథియం ఉత్పత్తిదారు అయిన చైనా నుండి అమెరికా తన ఇంధన సరఫరా గొలుసులను విడదీయాలని చూస్తున్నందున, అప్గనిస్తాన్ ఖనిజ సంపద తాలిబాన్ నియంత్రణలోకి పోవడం అంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బేనని నిపుణుల అంచనా. తాలిబాన్లు ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన వ్యూహాత్మక ఖనిజాలపై పట్టు సాధించారని వాషింగ్టన్ థింక్ ట్యాంక్, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ రిస్క్‌లో పర్యావరణ భద్రతా కార్యక్రమం అధిపతి రాడ్ స్కూనోవర్ అన్నారు. అయితే తాలిబన్లు వీటిని ఉపయోగించగలరా, ఉపయోగించుకుంటారా అనేది ముఖ్యమైన ప్రశ్న అన్నారు. తాలిబన్లు అఫ్గన్‌ను అక్రమించుకున్న తరువాత దేశం విడిచిపారిపోయిన అధ్యక్షుడు, ప్రపంచ ఆర్థికవేత్త అశ్రఫ్ ఘనీ ఖనిజాలను ఒక శాపంగా పేర్కొనేవారు. ఖనిజాలు అప్గన్‌కు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి. అంతర్జాతీయ పవర్ సంస్థ ప్రకారం, లిథియం కోసం గ్లోబల్ డిమాండ్. 2020 నాటితో పోలిస్తే 2040 నాటికి 40 రెట్లు పెరగనుంది. ఈ ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా తక్కువగా లభ్యమవుతున్న నేపథ్యంలో అప్గనిస్తాన్‌కు గణనీయమైన ఆదాయం లభించే అవకాశం ఉంది. అలాగే గతంలో అఫ్గన్ ప్రభుత్వ అధికారులు దేశంలో అమెరికా సైనిక ఉనికిని విస్తరించేందుకు ప్రలోభ పెట్టి మరీ కొన్ని మైనింగ్ ఒప్పందాలకు ప్రయత్నించినాప్పటికీ వాటిని అడ్డుకున్నారు. అదే సమయంలో, తాలిబాన్లు తిరుగుబాటులో భాగంగా దేశ వార్షిక ఆదాయంలో 300 మిలియన్ డాలర్ల మేర అక్కడి ఖనిజాలను లాపిస్ లాజులి, రత్నం చట్టవిరుద్ధంగా దోచుకున్నారు. ఖనిజ నిక్షేపాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవినీతి హింసను పెంచుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. (Afghanistan crisis: గుండె బద్దలవుతోంది: బాలీవుడ్ హీరోయిన్) ( లిథియం...ఫైల్ ఫోటో) తాలిబన్ నియంత్రణలోఇప్పుడు ఏమి జరుగుతుంది అనేది ప్రధాన చర్చ. అయితే గ్లోబల్ లిథియం ట్రేడ్‌లోకి తాలిబన్లు ఎంట్రీ ఇవ్వలేరని స్కూనోవర్ చెప్పారు. అనేక సంవత్సరాల సంఘర్షణతో దేశంలోని భౌతిక మౌలిక సదుపాయాలు-రోడ్లు, విద్యుత్ ప్లాంట్లు, రైల్వేలు విధ్వంస మయ్యాయి. ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న నగరాల్లో ప్రాథమిక ప్రజా సేవలు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకే కష్టపడాలన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే ఆర్థిక విధానాలను అమలు చేయడం. అంతర్జాతీయ పెట్టుబడి దారులను ఆకర్షించే ఆర్థిక విధానాలు అమల్లో లేవు. తాలిబన్లతో పోటీపడుతున్న ఏ కంపెనీ అయినా మైనింగ్ ఒప్పందాల గురించి చర్చించడం కష్టమే. ఇక ఆన్లైన్లో మైనింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు రుణ స్థాయిని చైనా గ్రూపునకు విస్తరించే అవకాశం ఇప్పట్లో లేదని డెవలప్ మెంట్ ఎకనామిక్స్ రీసెర్చర్ నిక్ క్రాఫోర్డ్ అభిప్రాయ పడ్డారు. అలాగే 2007లో అఫ్గనిస్తాన్‌లో ప్రారంభమైన 3 బిలియన్ డాలర్ల రాగి మైనింగ్ ప్రాజెక్ట్‌లో చైనా పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సందర్భంలో, నీటి కొరత, వాయు కాలుష్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన తీవ్రమైన వాతావరణ విపత్తులతో సహా ఇప్పటికే అఫ్గన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర పర్యావరణ ప్రమాదాలకు మైనింగ్ కూడా తోడయ్యే అవకాశం ఉందని క్రాఫోర్డ్ చెప్పుకొచ్చారు. -
బొగ్గు మైనింగ్‌లో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: సొంతంగా బొగ్గు తవ్వకాలు చేయడం ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కీలకమైన ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గు గనిలోని 1,298 హెక్టార్ల భూమిలో మైనింగ్ కార్యక్రమాలకు సోమవారం భూమి పూజ నిర్వహించింది. ఈ వారంలోనే అక్కడ తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల్లో ఉత్పత్తి మొదలవనుంది. మొదటగా దాదాపు రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ప్రతి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సుల్యారీ గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును లీజు సమయం ఉన్న 22 ఏళ్ల పాటు వెలికితీసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు తవ్వకం వల్ల ఆ ప్రాంతంలో నిర్వాసితులవుతున్న 1,250 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఈ గనుల ద్వారా వెలికితీసే మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రిజర్వు చేయాలని నిర్ణయించారు. మైనింగ్ చేయాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు రాష్ట్ర పురోభివృద్ధి దిశగా సీఎం నిర్ణయాలు.. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం సీఎం జగన్ పరితపిస్తున్నారు. రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలు కావడానికి సీఎం దూరదృష్టే కారణం. రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రాజెక్టులను సత్వరం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుల్యారీ ప్రాజెక్టును త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చిన ఏపీఎండీసీ అధికారులను అభినందిస్తున్నా. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మైనింగ్ అవకాశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొగ్గు తవ్వకాలతో సంస్థ పరిధిని విస్తరిస్తాం బెరైటీస్ మైనింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌ను సృష్టించుకున్న ఏపీఎండీసీ.. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాలకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. సుల్యారీలో బొగ్గు తవ్వకాల ద్వారా సంస్థ పరిధిని మరింతగా విస్తరిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్ సౌత్ బ్లాక్, జార్ఖండ్‌లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌లను ఏపీఎండీసీ దక్కించుకుంది. ఈ ఏడాదిలోనే అక్కడ కూడా ఉత్పత్తిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైట్, సిలికాశాండ్ ఖనిజాల వెలికితీత, మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ : ఆవిధంగా బుక్కయ్యారు
-
Ramappa Temple: మైనింగ్‌తో ముప్పు లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపికైన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని కొన్ని ప్రచార మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని సింగరేణి యాజమాన్యం తెలిపింది. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో ప్రారంభించాలని భావిస్తున్న ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు.. కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని, తాజాగా యునెస్కో రామప్పను వారసత్వ సంపదగా ప్రకటించిన నేపథ్యంలో వెంకటాపురం ప్రాజెక్టుపై మరింత సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుందని యాజమాన్యం వివరించింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణి.. తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి చిన్న నష్టం కూడా చేకూర్చే ఎటువంటి ప్రతిపాదన చేయబోదని, గుడి పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని తెలిపింది. దీనిపై అవాస్తవాలు నమ్మవద్దని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. రామప్ప అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రామప్ప ఆలయ సమీపంలో ఉన్న చరిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని హెరిటేజ్ శాఖ అధికారులను పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. శుక్రవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో రామప్ప ఆలయంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. యునెస్కో సూచించిన గైడ్‌లైన్స్‌పై, డిసెంబర్ 2022లో సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై మంత్రి చర్చించి పలు సూచనలులిచ్చారు. రామప్ప ఆలయంలో కేంద్ర ఆర్కియాలజీ శాఖకు చెందిన స్థలం వాటి సరిహద్దులు గుర్తించాలని, అలాగే ఆలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రామప్ప ఆలయం, చెరువు, కాలు వలకు చట్టబద్ధత కల్పించే విషయంపై యునెస్కో వారికి డిసెంబర్, 2022 లోపల ప్రణాళికలను సమర్పించాలన్నారు. సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్మిత ఎస్ కుమార్, వైఏటీసీ జాయింట్ సెక్రటరీ రమేశ్, హెరిటేజ్ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు పాల్గొన్నారు. -
బాక్సైట్ తవ్వకాలపై టీడీపీ నేతల దుష్ప్రచారం
-
అటవీ భూములు ధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఉన్న రక్షిత అటవీ భూముల్లో మైనింగ్ చేస్తూ, అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కృష్ణా జిల్లా, పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు కొండపల్లి అటవీ భూముల్లో మైనింగ్ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. -
పరిశ్రమలకు ‘లో బేస్’ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తిపై మే నెల్లో ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 29.3 శాతం పురోగమించింది. గణాంకాల ప్రకారం తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి ఫలితాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే సూచీలు మహమ్మారి ముందస్తు స్థాయికన్నా ఇంకా దిగువనే ఉండడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 మే నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 90.2 పాయింట్లకు పడిపోయింది. 2021 మేలో (తాజా సమీక్షా నెల్లో 116.6 పాయింట్లకు ఎగసింది. అంటే పెరుగుదల 29.3 శాతం. ఇక కరోనా ముందు 2019 మే నెల్లో సూచీ 135. 4 పాయింట్లుగా ఉంది. అంటే 2019 మే ఐఐపీతో పోల్చితే 2020 మేలో సూచీ వృద్ధి లేకపోగా 33.5 శాతం క్షీణించిందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన కీలక విభాగాల లెక్కల తీరు క్లుప్తంగా.. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం కలిగిన ఈ విభాగం వృద్ధి 34.5 శాతం. 2020లో 37.8 శాతం క్షీణత నమోదయ్యింది. ► మైనింగ్: వృద్ధి 23.3 శాతం (2020 మేలో 20.4 శాతం క్షీణత) ► విద్యుత్: 2020 మేలో 14.9 శాతం నుంచి తాజా సమీక్షా నెల్లో 7.5 శాతం పురోగతి సాధించింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులు, భారీ యంత్ర సామగ్రి ఉత్పత్తికి సంకేతమైన ఈ విభాగంలో 65.9 శాతం క్షీణత.. 2021 మేలో 85.3 శాతం వృద్ధి టర్న్ తీసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషన్ల వంటి ఈ ఉత్పత్తుల విభాగం 70.3 శాతం క్షీణత నుంచి బయటపడి 98.2 శాతం పురోగమించింది ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, ఫేస్ క్రీమ్స్, పౌడర్ల వంటి ఉత్పత్తులకు సంబంధించిన ఈ ఎఫ్ఎంసీజీ విభాగం 9.7% క్షీణత నుంచి బయటపడి స్వల్పంగా 0.8% పెరిగింది. 2020 మార్చి నుంచీ ఒడిదుడుకులు.. కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (–0.6 శాతం)జారిపోయింది. ధరలు తగ్గినా.. ఆర్బీఐ లక్ష్యానికి ఎగువనే..! జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ముందు నెల మేతో పోల్చితే స్వల్పంగా ఉపశమించింది. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యంకన్నా ఎగువన 6.26 శాతంగా నమోదయ్యింది. మే నెల్లో ఇది 6.3%. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దాని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గణాంకా ప్రకారం వార్షికంగా చూస్తే (2020 జూన్‌తో పోల్చి) ఆహార ద్రవ్యోల్బణం 5.15%గా ఉంది (మేలో 5.01%) ఇక చమురు, వెన్న పదార్థాల ధరలు ఏకంగా 34.78% ఎగశాయి. పండ్ల ధరలు 11.82 శాతం పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 0.7% తగ్గాయి. విద్యుత్, లైట్ విషయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 12.68%. కాగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా 6.16%, 6.37%గా ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఎస్ఓ సిబ్బంది వ్యక్తిగతంగా 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామీణ మండీల నుంచి వారంవారీగా గణాంకాల సేకరించి నెలవారీ ద్రవ్యోల్బణాన్ని మదింపుచేస్తారు. ఆర్బీఐ కీలక పాలసీ రేటు– రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 6 ద్వైమాసిక సమావేశాల నుంచి పరపతి విధాన కమిటీ యథాతథంగా 4%గా కొనసాగిస్తోంది. -
ఏపీలో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగడం లేదు: ద్వివేది
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగడంలేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లేటరైట్‌కు సంబంధించి 5వేల టన్నులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. 2018లో ఇచ్చిన కోర్టు ఉత్తర్వుల మేరకు 2021లో అనుమతిచ్చామని వెల్లడించారు. కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును అనుసరించి ఒక్కచోటే మైనింగ్ జరుగుతోందన్నారు. నిబంధనలు పాటించని లీజుదారులకు జరిమానా విధించామని తెలిపారు. విశాఖపట్నంలో బాక్సయిట్ మైనింగ్ చేసే ఆలోచనే లేదన్నారు. -
మైనింగ్ ఆదాయ లక్ష్యాన్ని సాధించాలి
సాక్షి, అమరావతి: మైనింగ్ ఆదాయ లక్ష్యాలను సాధించాలని అధికారులను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. గనుల శాఖ అధికారులతో విజయవాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. గతేడాది కరోనా సంక్షోభ సమయంలో కూడా అధికారుల కృషి వల్ల రూ.2,917 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 81 శాతం ఆదాయాన్ని సాధించిపెట్టిన అధికారులను అభినందించారు. 2021–22లో రూ.4 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని వారు అంచనా వేశారు. ఈ ఏడాది ఆదాయ లక్ష్యాలను చేరేందుకు తగిన కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఏపీకి వలస వచ్చిన వారు కరోనా భయంతో వెనక్కి వెళ్లిపోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్, అక్రమ రవాణాను అరికట్టాలని స్పష్టం చేశారు. గతేడాది నిర్వహించిన తనిఖీల్లో అక్రమ మైనింగ్, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 10,736 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.42.66 కోట్ల జరిమానాలు విధించినట్టు వివరించారు. మూడంచెల విధానంలో మైనింగ్ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని.. ఇతర జిల్లాల్లో త్వరలో ప్రవేశపెడతామన్నారు. అలాగే శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సీనరేజీ వసూళ్లను ప్రయోగాత్మకంగా అవుట్ సోర్సింగ్ విధానంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. -
అక్కడంతా బంగారుమయమే!
సాక్షి, న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ ముందు వారికో శుభవార్త తెలిసి ఎగిరి గంతులేస్తున్నారు. ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అంతటి ఆనందానికి ఆ శుభవార్త బంగారుమయం అవడమే. వేల్స్‌లోని స్నోడోనియాలో క్లోగావ్– సెయింట్ డేవిడ్ గనుల్లో దాదాపు 6.9 వేల కోట్ల రూపాయలు (700 మిలియన్ పాండ్లు) విలువైన బంగారు గని బయట పడింది. ఈ విషయాన్ని అక్కడ టెస్ట్ డ్రిల్లింగ్ జరిపిన ‘అల్బా మినరల్ రిసోర్సెస్’ కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవానికి 1998లోనే ఈ గనులను మూసివేశారు. ఇటీవలనే ఈ గనులకు అక్కడి ప్రభుత్వం వేల పాటను నిర్వహించగా పలు గనుల తవ్వకాల కంపెనీలు పోటీ పడి బిడ్డింగ్‌లు వేశాయి. వాటిలో ఏడు కంపెనీలకు గని ప్రాంతాలను విభజించి ఇచ్చారు. తమకు కేటాయించిన స్థలంలో దాదాపు ఐదు లక్షల ఔన్సుల బంగారం ఉన్నట్లు టెస్ట్ డ్రిల్లింగ్‌లో బయట పడడంతో అల్బా కంపెనీ వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. మిగతా కంపెనీలకు ఇప్పటి వరకు అలాంటి అదష్టం తగల లేదట. 1862 సంవత్సరం నుంచి 1911 మధ్యకాలంలో ఈ గనుల నుంచి 2.4 బంగారాన్ని వెలికి తీశారు. ఇప్పుడు ఆ తవ్వకాలకు సరిగ్గా 500 మీటర్ల దూరంలో తాజా బంగారం నిల్వలు బయట పడ్డాయి. 1862కు ముందు ఆ గనుల్లో రాగి, సీసం తీశారు. ఆ సంవత్సరం నుంచే బంగారు నిల్వలు బయట పడ్డాయి. బ్రిటన్‌లో ఇప్పటి వరకు బయట పడిన బంగారంలో 90 శాతం సెయింట్ డేవిడ్ గనుల నుంచి వచ్చిందే. పైగా అక్కడి బంగారం అత్యంత స్వచ్చమైనది, విలువైనదని బంగారం నిపుణులు తెలియజేస్తున్నారు. బ్రిటిష్ రాజ వంశమంతా తమ పెళ్లిళ్ల ఉంగరాలను అక్కడి బంగారంతోనే చేయించుకున్నారట. బ్రిటీష్ రాణి ఎలిజబెత్, యువ రాణి డయానా పెళ్లి రింగులు అక్కడి బంగారంతో చేసినవేనట. -
నాపరాతి పరిశ్రమ: రూ.600 కోట్ల వరకు నష్టాలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తాండూరు నాపరాతి పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అన్‌లాక్ ప్రక్రియతో కాస్త ఊరట లభిస్తున్న తరుణంలో భారీ వర్షాలతో పరిస్థితి మొదటికొచ్చింది. క్వారీల్లో చేరిన నీటితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. క్వారీ నుంచి ముడి సరుకు బయటకు రాకపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు సైతం దిక్కులు చూస్తున్నాయి. ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో క్వారీల యజమానులు డోలాయమానంలో పడ్డారు.ఇక పరిశ్రమపై ఆధారపడ్డ 25వేల మంది కార్మికులకు పూటగడవడమే కష్టమైంది. ‘ఉపాధి’ని ముంచేసిన వానలు వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో దాదాపు 300 నాపరాతి క్వారీలున్నాయి. వీటికి అనుబంధంగా 1,250 పాలిషింగ్ యూనిట్లు, ఇతర మార్కెటింగ్ స్టోర్లు కొనసాగుతున్నాయి. వీటిల్లో పనిచేసే వారిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారే. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు సైతం వలస వచ్చి పనిచేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాపరాతి పరిశ్రమ మూతపడటంతో 95 శాతం కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు చివరి నుంచి క్రమంగా యూనిట్లను తెరిచేందుకు యాజమాన్యాలు ఉపక్రమించగా.. సెప్టెంబర్ నెలాఖరు నుంచి కార్మికులు, కూలీలు తిరిగి వచ్చారు. పనులు మొదలవుతున్న తరుణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కాగ్నా నది ఉప్పొంగడంతో క్వారీలన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికీ క్వారీల్లోకి నీళ్లు వస్తున్నాయి. తొలుత కురిసిన వానలు కాస్త తెరపివ్వడంతో భారీ ఖర్చుతో క్వారీ యజమానులు పెద్ద మోటార్లను బిగించి నీటిని బయటకు తోడారు. అంతలోనే మళ్లీ వానల తీవ్రత పెరగడంతో క్వారీలు నిండా మునిగాయి. భూమిలోతులోకి క్వారీలు ఉండడంతో ఇప్పటికీ పలుచోట్ల ఊటగా నీరు వస్తోంది. ఈ నీటిని తోడాలంటే లక్షల్లో వెచ్చించాల్సి రావడంతో క్వారీల యజమానులు ఆ పనులను విరమించారు. దీంతో ఇప్పటికే నెలల తరబడి మూతబడ్డ క్వారీలు.. ఇప్పట్లో గాడినపడేలా లేవు. మరోవైపు క్వారీల నుంచి రాయి ఉత్పత్తి లేకపోవడంతో పాలిషింగ్ యూనిట్లకూ పనిలేకుండా పోయింది. తక్కువ విస్తీర్ణంలో ఉన్న మినీ క్వారీలను ఇప్పుడిప్పుడే తెరుస్తున్నా.. ఆశించిన స్థాయిలో పనిలేదు. ముడిసరుకు సిద్ధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లలో ఒకరిద్దరికే పని దొరుకుతోంది. దిక్కుతోచని స్థితిలో కార్మికులు క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులకు ఇప్పుడు దిక్కుతోచట్లేదు. లాక్డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్తే అక్కడ తగిన ఉపాధి దొరకలేదు. అన్‌లాక్ సమయంలో గంపెడాశతో తిరిగొస్తే.. క్వారీలను వానలు నిండా ముంచేశాయి. రోజువారీ కూలీపై ఆధారపడ్డ వారందరికీ ప్రస్తుతం బతుకు గగనమైంది. చేతిలో డబ్బుల్లేక, అప్పు దొరక్క పస్తులుంటున్నారు. దీనిపై కార్మిక సంఘాల నేతలు యాజమాన్యాలతో చర్చించినా ఫలితం లేదు. అడ్వాన్స్ రూపంలో కొంత మేర డబ్బులు తీసుకున్నప్పటికీ నెలల తరబడి పనిలేకపోవడంతో ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చు కావడంతో మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. తాండూరు, షాబాద్ బండలంటే దక్షిణ భారతమంతా పేరు దక్షిణ భారతదేశంలో తాండూరు నాపరాతికి మంచి పేరుంది. క్వారీల నుంచి రాయిని బయటకు తీయడం.. దానిని పాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయించడం ఇక్కడ ప్రధానంగా జరిగే పని. నాపరాతిని నిర్ణీత రూపంలో కటింగ్ చేసిన తర్వాత నేరుగా వాడుకోవచ్చు. పాలిష్ చేసిన రాక్షీట్లకైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో తాండూర్ బండలు, షాబాద్ బండల పేరుతో వీటిని విక్రయిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఇక్కడి నుంచి భారీగా ఎగుమతులు చేస్తారు. నాపరాతి పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో ఏటా రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇక్కడ ఏటా దాదాపు రూ.2,500 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి. లాక్‌డౌన్‌తో పాటు, ఇటీవలి వర్షాల కారణంగా నాపరాతి పరిశ్రమ దాదాపు రూ.600 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని అంచనా. ఈ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో వివిధ కేటగిరీల్లో పనిచేసే కార్మికులు, కూలీలు 25 వేలకు పైమాటే. నెల వరకు కష్టమే.. క్వారీల్లో భారీగా చేరిన నీటిని తోడాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాలి. పెద్ద మోటార్లతో రోజుల తరబడి పంపింగ్ చేయాలి. మోటార్లకు కిరాయి భారీ మొత్తంలోనే ఉంటుంది. ప్రస్తుతం తాండూరు పరిధిలోని 70 శాతం క్వారీలు నీటితో నిండిపోయాయి. వీటన్నింటి నుంచి నీళ్లు తొలగించి మళ్లీ గాడిన పడటానికి కనీసం నెల పట్టొచ్చు. మమ్మల్ని నమ్ముకున్న కూలీలు, కార్మికులకు కొంత నగదు అడ్వాన్స్ ఇచ్చి పోషిస్తున్నాం. – వెంకటరామిరెడ్డి, క్వారీ యజమాని, తాండూరు 2 నెలలుగా పనిలేదు క్వారీలో పనిచేస్తే రోజుకు రూ.500 కూలి వచ్చేది. ప్రస్తుతం రెండు నెలలుగా పని లేదు. నా దగ్గరున్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో భార్య, పిల్లల పోషణ కష్టంగా మారింది. గతనెల అప్పుచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఇప్పుడిక వేరే పని దొరికినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. – వడ్డే నగేశ్, కార్మికుడు -
పరిశ్రమలు పతనబాటే..!
న్యూఢిల్లీ: కఠిన లాక్డౌన్ ప్రభావం ఆగస్టులోనూ కొనసాగిందని సోమవారం విడుదలైన అధికారిక పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెల్లడించాయి. సమీక్షా నెలలో 8 శాతం క్షీణత (2019 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యింది. అయితే కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న తాజా గణాంకాలను మహమ్మారి వ్యాప్తి ముందు నెలలతో పోల్చి చూడడం తగదని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వరకూ వెయిటేజ్ ఉన్న తయారీసహా విద్యుత్, మైనింగ్ రంగాలు ఆగస్టులో తీవ్ర నిరాశపరిచాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తయారీ రంగంలో 8.6 శాతం క్షీణరేటు నమోదయ్యింది. ► మైనింగ్ రంగంలో ఉత్పత్తి 9.8 శాతం క్షీణించింది. ► విద్యుత్ విషయంలో క్షీణ రేటు 1.8 శాతంగా ఉంది. ► భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, పెట్టుబడులు, డిమాండ్‌కు సంకేతం అయిన క్యాపిటల్ గూడ్స్ కూడా 15.4 శాతం క్షీణతలో ఉంది. ► ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలుసహా కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలోని ఉత్పత్తుల్లో క్షీణ రేటు 10.3 శాతంగా ఉంది. ► ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించిన ఉత్పత్తి సైతం 3.3 శాతం క్షీణతలోనే ఉంది. క్షీణత తగ్గుతూ రావడమే ఊరట... కరోనా కట్టడి లక్ష్యంగా మార్చి 25వ తేదీ నుంచీ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా 57.3 శాతం క్షీణించింది. మేలో ఈ రేటు మైనస్ 33.4 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు మైనస్ 15.8 శాతానికి తగ్గింది. జూలైలో మైనస్ 10.8 శాతానికి దిగివచ్చింది. తాజా సమీక్షా నెల ఆగస్టులో– క్షీణ రేటు మరింత తగ్గి 8 శాతానికి రావడం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి బాటలోకి వచ్చే అవకాశం కూడా ఉందన్న అంచనాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అవుట్‌పుట్ సెప్టెంబర్‌లో క్షీణ బాట నుంచి 54.6కు చేరి వృద్ధి బాటలోకి రావడం ఇక్కడ గమనార్హం. అలాగే సెప్టెంబర్‌లో ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 56.8కి ఎగసింది. లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా తొలగిస్తుండడంతో పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) లాక్డౌన్ జరిగిన సంగతి తెలిసిందే. 2019 ఆగస్టులోనూ క్షీణతే... నిజానికి వాణిజ్య యుద్ధం ప్రభావంతో 2019 ఆగస్టులో సైతం పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా (2018 ఆగస్టులో పోల్చి) 1.4 శాతం క్షీణతలోనే ఉంది. దెబ్బమీద దెబ్బలాగా కరోనా తీవ్రత నేపథ్యంలో ఉత్పత్తి పరిమాణం కనీసం 2018 ఆగస్టునాటి స్థాయికన్నా దిగువకు ప్రస్తుతం పడిపోవడం తీవ్ర ప్రతికూలతకు అద్దంపడుతోంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య 25 శాతం క్షీణత ఏప్రిల్–ఆగస్టు మధ్య పారిశ్రామిక ఉత్పత్తి భారీగా 25% క్షీణించింది. 2019 ఇదే కాలంలో వృద్ధి రేటు 2.5%గా నమోదైంది. -
పరిశ్రమలు మైనస్‌లోనే..
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలోనూ క్షీణతలోనే కొనసాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం జూలైలో మైనస్ 10.4 క్షీణత నమోదయ్యింది. అంటే 2019 జూలైతో పోల్చితే వృద్ధిలేకపోగా, భారీ క్షీణత నమోదయ్యిందన్నమాట. అయితే జూన్‌తో పోల్చితే ( మైనస్ 15.77 శాతం క్షీణత) జూన్ నెలలో క్షీణ రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కీలక విభాగాలూ నేలచూపే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగం మైనస్ 11.1 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. మైనింగ్: భారీగా 13 శాతం క్షీణతను చవిచూసింది. విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి మైనస్ 2.5 శాతం పడిపోయింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, పెట్టుబడులకు సంబంధించిన ఈ విభాగం భారీగా మైనస్ 22.8 శాతం క్షీణించింది. ► డ్యూరబుల్స్ గూడ్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ల వంటి దీర్ఘకాలం వినియోగ వస్తువులకు సంబంధించి ఈ విభాగంలో క్షీణ రేటు 23.6 శాతంగా నమోదయ్యింది. ► నాన్–డ్యూరబుల్స్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించి ఈ విభాగంలో మాత్రం 6.7 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్ ఉత్పత్తిలో క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా సూచీ గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్‌లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. తాజా సమీక్షా నెల– జూలైలో 118.1కి చేరింది. నాలుగు నెలల్లో... కాగా పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో చూస్తే, 29.2 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదయ్యింది. పోల్చిచూడ్డం సరికాదు: గణాంకాల శాఖ సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కోవిడ్–19 ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికీ పలు విభాగాలు సరిగా పనిచేయని పరిస్థితులు, గణాంకాలు తగిన విధంగా అందని వాతావరణం ఉందని శుక్రవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా తెలిపింది. మౌలిక రంగం 9.6 శాతం క్షీణత ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం– మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న మౌలిక పరిశ్రమల గ్రూప్ వరుసగా ఐదవ నెల– జూలైలోనూ అసలు వృద్ధిలేకపోగా 9.6 శాతం క్షీణతనే నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎరువులు (6.9 శాతం వృద్ధి రేటు) మినహా మిగిలిన ఏడు రంగాలు– స్టీల్ (–16.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–13.9 శాతం), సిమెంట్ (–13.5 శాతం), సహజ వాయువు (–10.2 శాతం), బొగ్గు (–5.7 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.9 శాతం), విద్యుత్ (–2.3 శాతం) క్షీణరేటును నమోదుచేసుకున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలాన్ని చూస్తే, ఎనిమిది రంగాల ఉత్పత్తి మైనస్ 20.5 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో ఈ విభాగంలో వృద్ధి రేటు 3.2 శాతం. -
పచ్చ దోపిడీ
-
పగలకపోతే బా'గుండు'!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం నుంచి కూతవేటు దూరంలో ఉన్న ‘నంబర్‌గుండు’ గుట్ట గుల్లవుతోంది. ఓ అక్రమార్కుడి ధనదాహానికి రోజురోజుకు రూపం కోల్పోతోంది. ఆరు నెలల నుంచి రోజుకు కొంత మేర తొలిచివేతకు గురవుతున్న ఆ గుట్ట రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు రాత్రిపూట కొనసాగుతున్న బ్లాస్టింగ్లతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు? ఏ బండ తమ ఇంటికప్పు మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బ్లాస్టింగ్లతో గుట్ట రాళ్లు సమీప పంటపొలాల్లో వచ్చి పడుతుండడంతో ఇటు రైతులూ ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటనీ ప్రశ్నించిన తమకు సదరు అక్రమార్కుడి నుంచి బెదిరింపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తతంగంపై రెవెన్యూ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధిత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన సదరు అక్రమార్కుడు.. అధికారుల అండదండలతో గుట్టను తోడేసే పనిని ముమ్మరం చేశాడు. ♦ మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టమీది తండాలోని సర్వేనంబర్ 23లో 154 ఎకరాల విస్తీర్ణంలో సీలింగ్ భూమి ఉంది. ఇందులో ఆరు ఎకరాలను అధికారులు ఇతరులకు అసైన్డ్ చేశారు. కాగా మిగతా భూమిలో నంబర్‌గుండు గుట్ట ప్రాంతం ఉంది. అయితే ఈ గుట్టపై కన్నేసిన ఓ అక్రమార్కుడు ఆరు నెలల నుంచి గుట్టను తొలుస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి డిటోనెటర్లు పెట్టి రాత్రి పూట పేలుళ్లకు పాల్పడుతున్నాడు. బ్లాస్టింగ్ ధాటికి రాళ్లు వచ్చి తమ ఇళ్లపై పడుతున్నాయని గుట్టమీది తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో ఆగని సదరు అక్రమార్కుడు గుట్టను పగలగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి ప్రత్యేకంగా 20 మంది కూలీలనూ రప్పించడం గమనార్హం. గుట్టను పగలగొట్టడంలో సిద్ధహస్తులైన ఈ కూలీలు స్థానిక కూలీలతో కలిసి పెద్ద మొత్తంలో ప్రకృతి వనరు అయిన గుట్టను గుల్ల చేస్తున్నారు. ఇలా తీసిన రాళ్లను రూ. 24కు ఒకటి చొప్పున మహబూబ్‌నగర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. సదరు అక్రమార్కుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అధికారులూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో అక్రమార్కుడి అక్రమాలపై నోరు మెదిపేందుకూ ఆయా తండావాసుల్లో చాలా మంది సాహసించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నంబర్గుట్టను కాపాడడంతో పాటు సదరు అక్రమార్కుడిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. భయపెట్టిండు.. ఎప్పటి నుంచో నంబర్ గుండు ఉంది. ఆ గుండును పగలగొట్టకూడదని చెబితే, నా చేను పక్కనే ఉంది. నేను కొట్టుకుంటా. అడగటానికి నీవెవరు. నీ యబ్బ జగీరా.. అని భయపెట్టిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుండ్లను పూసలు పెట్టి పేలుస్తున్నారు. ఆ రాళ్లు తండాలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో మేం భయాందోళనకు గురవుతున్నాం. ఈ అక్రమంపై వీఆర్ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. – లక్ష్మణ్‌నాయక్, గుట్టమీదితండా బాధ్యులపై చర్య తీసుకుంటాం గుట్టమీది తండా సమీపంలో రాళ్లగుట్టను బ్లాస్టింగ్ చేస్తున్నారనే ఫిర్యాదు ఇది వరకే వచ్చింది.వెంటనే వీఆర్ఓను పంపి.. రాళ్లను పగులగొట్టడాన్ని నిలిపివేయించా. ఒకవేళ అలాగే గుట్టలో బ్లాస్టింగ్‌కు పాల్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.– ఎస్.కిషన్, తహసీల్దార్, మహబూబ్‌నగర్ రూరల్ -
లాక్డౌన్ తర్వాత వ్యూహం ఏంటి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు వారాలుగా కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 3తో ముగియనుండగా.. తదుపరి అనుసరించాల్సిన మార్గాలపై ప్రధాని నరేంద్ర మోదీ.. హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, రైల్వే శాఖల మంత్రి పీయూష్‌గోయల్‌తో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశ వివరాలపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. గత కొన్ని రోజులుగా ప్రధాని అనేక అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రభు త్వ వర్గాలు పేర్కొన్నాయి. 3వ తేదీ తర్వాత పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ ప్రాంతాలకే పరిమితం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించడం, ఆర్థిక రంగ వృద్ధి ప్రేరణ కోసం అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ప్రధాని గురువారం కూడా ఒక సమావేశం నిర్వహించడం గమనార్హం. రక్షణ రంగం, మైనింగ్, మినరల్స్ శాఖపైనా ఆయన సమీక్షలు జరిపారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు కేంద్రం తొలి విడతగా రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, వివిధ రంగాలకు ప్రోత్సాహకాలతో మరో ప్యాకేజీని త్వరలో ప్రకటించనుందని తెలుస్తోంది. పౌర విమానయాన రంగం పటిష్టతపై దృష్టి దేశీయంగా పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగానూ ప్రధాని మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత గగనతలాన్ని మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవాలని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ఇది ఎయిర్‌లైన్స్ సంస్థల వ్యయాలను తగ్గించేందుకు తోడ్పడనుంది. సైనిక వ్యవహారాల విభాగంతో కలసి సన్నిహిత సహకారం ద్వారా దీన్ని చేపట్టనున్నట్టు అధికారిక ప్రకటన ద్వారా ప్రభుత్వం తెలిపింది. మరింత ఆదాయం రాబట్టడం, విమానాశ్రయాల్లో సమర్థతను తీసుకొచ్చే లక్ష్యంతో.. పౌర విమానాయాన శాఖ 3 నెలల్లో మరో 6 విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో అప్పగించేం దుకు టెండర్ ప్రక్రియ ఆరంభించాలని కోరింది. బ్యాంకర్లతో నేడు ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక రంగ స్థితిగతులు తెలుసుకునేందుకు, పరిశ్రమకు ఊతమిచ్చే చర్యలపై చర్చించేందుకు బ్యాంకుల చీఫ్‌లతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం సమావేశం కానున్నారు. వడ్డీ రేట్ల కోత ప్రయోజనాల బదలాయింపు, పరిశ్రమకు నిధులపరమైన తోడ్పాటు అందించడం సహా రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించిన పలు చర్యల అమలుపై కూడా చర్చించవచ్చని సమాచారం. అలాగే, చిన్న, మధ్యతరహా సంస్థలు.. గ్రామీణ రంగం కోసం ప్రకటించిన విధానాలను సమీక్షించనున్నారు. ఎకానమీపై ఒత్తిడి తగ్గించేందుకు తీసుకోతగిన చర్యల గురించి బ్యాంకర్లు కూడా ఈ సమావేశంలో తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రులతో మోదీ భేటీ -
వేదాంత డైరెక్టర్‌గా అనిల్ అగర్వాల్
న్యూఢిల్లీ: మైనింగ్ మ్యాగ్నెట్ అనిల్ అగర్వాల్.. వేదాంత కంపెనీలో తొలిసారిగా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రిసోర్సెస్‌కు అధినేతగా అనిల్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. అనిల్ అగర్వాల్(66)ను నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించామని వేదాంత లిమిటెడ్ తెలిపింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నవీన్ వ్యవహరిస్తారని పేర్కొంది. కంపెనీ సీఈఓ ఎస్. వెంకటకృష్ణన్ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది. మరోపక్క, హిందుస్తాన్ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్ దుగ్గల్‌ను వేదాంత సీఈఓగా నియమించామని తెలిపింది. -
యరపతినేని పై 18కేసులు నమోదు
-
పరిశ్రమలు మళ్లీ మైనస్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –3.8 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలకన్నా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన తయారీరంగంసహా విద్యుత్, మైనింగ్ వంటి కీలక రంగాలన్నింటిలో క్షీణరేటే నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో పారిశ్రామిక ఉత్పత్తి 8.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. గురువారం విడుదలైన గణాంకాల్లో కీలక విభాగాలను చూస్తే... తయారీ రంగం: సూచీలో దాదాపు 60 శాతంపైగా వెయిటేజ్ ఉన్న ఈ రంగంలో –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో ఈ విభాగం 8.2 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఆరి్థక సంవత్సరం (ఏప్రిల్ నుంచి)లో అక్టోబర్ వరకూ చూస్తే, వృద్ధి రేటు 5.8% నుంచి 0.5%కి పడింది. విద్యుత్: ఈ విభాగం కూడా 10.8 శాతం వృద్ధి బాట నుంచి (2018 అక్టోబర్‌లో) –12.2 శాతం క్షీణతలోకి జారింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో వృద్ధి 6.8 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. మైనింగ్: ఈ విభాగంలో 7.3 శాతం వృద్ధి రేటు – 8 శాతం క్షీణత (2019 అక్టోబర్)లోకి పడింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ తీసుకున్నా ఈ విభాగం 3.9 శాతం వృద్ధిబాట నుంచి –0.4 శాతం క్షీణతలోకి జారింది. క్యాపిటల్ గూడ్స్: ఇక భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ రంగంలో భారీగా –21.9% క్షీణించింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగం భారీగా 16.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. రసాయనాలు: 31.8% వృద్ధి నమోదయ్యింది. ఏడు నెలల్లో... ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదయ్యింది. అదుపు తప్పిన ధరలు ►నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతం ►మూడేళ్ల గరిష్ట స్థాయి ఇది... న్యూఢిల్లీ: రిటైల్ ధరలు అదుపుతప్పాయి. ఈ సూచీ నవంబర్‌లో మూడేళ్ల గరిష్టం 5.54 శాతానికి చేరింది. అంటే 2018 నవంబర్‌తో పోలి్చచూస్తే, 2019 నవంబర్‌లో నిత్యావసరాల వినియోగ వస్తువుల బాస్కెట్ ధర మొత్తంగా 5.54 శాతం పెరిగిందన్నమాట. 2016 జూలై (6.07 శాతం) తరువాత ధరల పెరుగుదల తీవ్రత ఇంత స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 2.33 శాతం. అక్టోబర్‌లో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 4.62 శాతం నమోదయ్యింది. -
వామ్మో.. కాసిపేట గని
సాక్షి, కాసిపేట(ఆదిలాబాద్) : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో మంగళవారం ఉదయం షిప్టులో పైకప్పు కూలింది. ఇలా పైకప్పు కూలడం.. ఐ దురోజుల్లో రెండోసారి. గనిలోని 1వ సీం, 10డీప్, 25 లెవెల్లో పనులు నడుస్తున్నాయి. ఎస్‌డీయల్ యంత్రంతో ఆపరేటర్ బొగ్గు తీసుకొ చ్చేందుకు గనిలోకి వెళ్లాడు. అదే సమయంలో జంక్షన్లో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పుషర్ కార్మికులు ఇద్దరు అక్కడి నుంచి పరుగెత్తడంతో ప్రాణా లు కాపాడుకున్నట్లయ్యింది. ఎస్‌డీయల్ ఆపరేటర్ లోనికి వెళ్లకున్నా.. ఇద్దరు కార్మికులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా.. ప్రాణనష్టం సభవించేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. 1 వ సీంలో ప్రమాదపు అంచున పనిచేస్తున్నట్లు కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఐదురోజుల్లో రెండుసార్లు కూలిన పైకప్పు గనిలో 1సీంలో పనులపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న 1వ సీం 7 డిప్ అఫ్ 25 లెవెల్ జంక్షన్లో పెద్దమొత్తంలో పైకప్పు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అది జరిగిన ఐదు రోజులకే తిరిగి 10 డిప్లో ప్రమాదం జరగడంతో రక్షణ చర్యలు, అధికారులు, యూనియన్ నాయకుల తీరుపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7డిప్లో కూలినట్లు కూలితే తమ ప్రాణాలు దక్కేవి కావని, తక్కువ పరిమాణంలో కూలడంతో బతికిపోయామని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన ప్రమాదాలను బయటకు రాకుండా సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచడం మినహా రక్షణచర్యలు, కార్మికుల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మొదటిసారి జరిగిన ప్రమాదంపై రెండురోజుల క్రితం గనిని సందర్శించిన ఉన్నతాధికారులు.. 1సీం పనులపై ఆగ్రహం వ్యక్తం చేవారు. అయినా గని అధికారుల్లో స్పందన లేకుండాపోయింది. దీంతో మరోసారి పైకప్పు కూలడం చర్చనీయాంశంగా మారింది. బొగ్గును టాప్కు వదలడమే సమస్య? గనిలో రూఫ్బోల్ట్ వేసేక్రమంలో బొగ్గును సైతం టాప్కు వదలడమే సమస్య అనే ఆరోపణలున్నాయి. గతంలో రూఫ్‌టాప్ బండకు వేసేవారు. దీంతో రూఫ్ నుంచి నీరు లీకేజీ అవుతుండడంతో పనిస్థలాల్లో ఎస్‌డీయల్ యంత్రాలు నడవడం కష్టమవుతుందని అధికారులు బొగ్గును టాప్కు వదిలి రూఫ్ వేస్తున్నారు. రూఫ్ టచ్ కావలంటే 10 ఫీట్లు అవసరం కాగా.. గనిలో కేవలం ఆరుఫీట్లు మాత్రమే ఉండటంతో బోల్టు మధ్యలో ఉంటున్నట్లు కార్మికులు చెబుతున్నారు. దీంతో రూఫ్‌కు బొగ్గుకు మధ్యలో ఉండే క్లే కు నీరు వచ్చి తడిసి పైకప్పు కూలుతున్నట్లు తెలుస్తోంది. జంక్షన్లో సక్రమంగా రూఫ్‌బోల్టు వేయడం.. బొగ్గును వదిలి బండకు రూఫ్‌బోల్టు వేస్తెనే కూలకుండా ఉంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి 1సీంలో ఐదుసార్లు పైకప్పు కూలినప్పటికీ అధికారుల చర్యల్లో మాత్రం మార్పు రావడంలేదు. ప్రస్తుతం జరిగే ప్రమాదాలు పెద్దవి అయినప్పటికీ ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయాందోళన మధ్య విధులు నిర్వర్తిస్తున్నామని, ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం తప్పదని, వెంటనె చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. -
కొత్త మైనింగ్ కంపెనీలకు వర్తించదు
న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్నుల భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి గురువారం పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన ట్యాక్సేషన్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2019కు పార్లమెంటు ఓకే చెప్పింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించే అంశంపై స్పష్టతనిచ్చారు. మైనింగ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, బుక్ ప్రింటర్లకు కొత్త తయారీ కంపెనీలకు వర్తించే ‘కనిష్ట 15 శాతం పన్ను రేటు’ వర్తించబోదని ఉద్ఘాటించారు. నెగిటివ్ జాబితా రూపకల్పన... కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20న ఈ మేరకు ఆర్థికమంత్రి ఒక ప్రకటన చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ తరువాత ప్రారంభించి 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే కొత్త తయారీ రంగ కంపెనీలకు కనిష్టంగా 15 శాతం రేటును వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి వెంటనే ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన బిల్లుకు ఈ వారం మొదట్లోనే లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పెద్దల సభ కూడా బిల్లులో ఎటువంటి మార్పూ చేయకుండా వెనక్కు పంపడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడినట్లయ్యింది. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ప్రకారం– ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019 ప్రకారం కొన్ని సంస్థలను నెగిటివ్ జాబితా ఉంచారు. ఈ జాబితాలో ఉంచిన సంస్థలు తయారీ రంగం పరిధిలోనికి రావని, వీటికి కనిష్ట 15 శాతం బేస్ రేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. ఇందులో మైనింగ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, బుక్ ప్రింటర్లు ఉన్నట్లు వివరణ ఇచ్చారు. వీటితోపాటు స్లాబ్స్‌లో వినియోగించే మార్బుల్ బ్లాక్స్, సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్, సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్ ఉత్పత్తి కూడా నెగిటివ్ లిస్ట్‌లో ఉన్నాయి. ఆర్థిక వృద్ధి లక్ష్యంగా... ఆర్థికవృద్ధే లక్ష్యంగా కార్పొరేట్ పన్నులను తగ్గించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగ ంలో అలసత్వ నిరోధం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వంటి పలు చర్యలు ఈ దిశలో ఉన్నాయన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపువల్ల పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ దేశంగా అవతరిస్తోందని వివరించారు. ఆర్థికరంగం పునరుత్తేజమే ధ్యేయంగా కేంద్రం తన చర్యలను కొనసాగిస్తుందని తెలిపారు. -
ఏసీబీ వలలో మైనింగ్ ఏడీ
సాక్షి, నాగర్‌కర్నూల్: అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొంతమంది అధికారులు ప్రభుత్వ వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు. వేలకువేలు జీతాలు వస్తున్నా అక్రమ సంపాదనపై మోజుతో అత్యాశకు పోయి ఇరుక్కుంటున్నారు. మంగళవారం తాజాగా గనులు, భూగర్భశాఖ అధికారి పి.శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల మొదటి రోజే అధికారి పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. డబ్బులు డిమాండ్ చేసి.. స్టోన్ అండ్ మెటల్ క్వారీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తినుంచి డబ్బులు డిమాండ్ చేయగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడించారు. వెల్దండ మండలం శంకర్కొండతండాలోని 303 సర్వే నెంబర్లో 18 ఎకరాల భూమిలో స్టోన్ అండ్ క్రషర్ క్వారీ ఏర్పాటుకు నారాయణ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. మీ సేవా కేంద్రంలో నవంబర్ 10న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా నవంబర్ 13న మైనింగ్‌శాఖ కార్యాలయంలో ఫైల్‌ను సమర్పించారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్ వద్దకు గత 18 రోజులుగా అనుమతి కోసం తిరుగుతున్నాడు. నవంబర్ 28న మరోసారి ఏడీని కలిస్తే మొత్తం పని కావాలంటే రూ.లక్ష ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఎంత బతిమిలాడినా వినలేదు. విసుగుచెందిన నారాయణ ఏసీబీని ఆశ్రయించాడు. పట్టుబడ్డారిలా.. ఏసీబీ అధికారుల సూచన మేరకు నారాయణ మొదటి విడతగా మంగళవారం రూ.15వేలను మైనింగ్ ఏడీ శ్రీనివాస్‌కు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్టుగానే కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా వలపన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఏసీబీ కోర్టుకు హాజరుపర్చి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి డబ్బులు డిమాండ్ చేసినా ప్రజలు నిర్భయంగా ఏసీబీని ఆశ్రయించాలని, వారిపేరును గోప్యంగా ఉంచి అవినీతి పరుల పనిపడతామని ఈ సందర్భంగా విలేకరులతో తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. పెరిగిన అవినీతిపరుల ఆగడాలు జిల్లాలో అవినీతి అధికారుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల ఏసీబీ అధికారుల దాడులు పెరిగినా అధికారుల్లో మార్పు రావడంలేదు. జిల్లాలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా పట్టుబడిన మైనింగ్ ఏడీ శ్రీనివాస్‌పై ఎన్నో ఆరోపణలున్నాయి. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుండటంతో ప్రభుత్వ పనుల పేరుతో పర్మిట్లు పొంది బయట అమ్ముకుంటున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమ ఇసుక రవాణాకు పర్మిట్లు ఇష్టారాజ్యంగా ఇచ్చాడనే ఆరోపణలు లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతిలేని క్వారీలు జిల్లాలో అనేక కొనసాగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఒక్కశాఖలోనే కాదు వివిధ శాఖల్లోనూ అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. -
మరిన్ని సంస్కరణలకు రెడీ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కోసం, పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు ఆమె గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత్ – స్వీడన్ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. ‘‘భారత ప్రభుత్వం తదుపరి సంస్కరణలను బ్యాంకింగ్, మైనింగ్, బీమా తదితర రంగాల్లో తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను’’ అని ఈ సందర్భంగా చెప్పారు. ఆ సంస్కరణలు ఏంటన్న వివరాలను మాత్రం పేర్కొనలేదు. భారతీయ పరిశ్రమలే కాకుండా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించే పనిలో ఉందని చెప్పారు. ‘‘బడ్జెట్ తర్వాత నుంచి పరిశ్రమలను నిరంతరం సంప్రదిస్తూ, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుంటున్నాను. బడ్జెట్ తర్వాత నుంచి మరుసటి బడ్జెట్ 2020 ఫిబ్రవరి వరకు వేచి చూడకుండానే, కార్పొరేట్ పన్ను తగ్గింపు రూపంలో భారీ సంస్కరణ చర్య తీసుకున్నాం. ప్రభుత్వం సంస్కరణలను ఏ విధంగా విశ్వసిస్తుందన్నది ఈ ఒక్క చర్య తెలియజేస్తుంది. మేము మరిన్ని చర్యలు తీసుకోనున్నామని ఈ రోజు నేను స్పష్టం చేస్తున్నాను’’ అంటూ ప్రభుత్వ ఆలోచనలను ఈ సదస్సు వేదికగా మంత్రి సీరారామన్ ఆవిష్కరించారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ గత సెపె్టంబర్లో కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. గడిచిన 28 ఏళ్లలో పన్నుల పరంగా ఇది అతిపెద్ద సంస్కరణ. తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా కార్పొరేట్ పన్నును ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నది. స్వీడన్ కంపెనీలకు ఆహ్వానం భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలంటూ స్వీడన్‌కు చెందిన కంపెనీలను ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ఆహా్వనించారు. రానున్న ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ చేయాలన్న భారత్ ప్రణాళికల గురించి తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్ పది భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించి ఈ నెల 15 నాటికి నివేదికను అందజేయనున్నట్టు చెప్పారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక కార్యాచరణ బృందాన్ని (టాస్‌్కఫోర్స్) గత సెపె్టంబర్లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2019–20 నుంచి 2024–25 మధ్య కాలంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళికను అనుసరించి ప్రాధాన్య క్రమంలో జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల జాబితాను ఈ టాస్క్ ఫోర్స్ రూపొందించాల్సి ఉంటుంది. రూ.100 కోట్లకు పైగా వ్యయంతో కూడిన గ్రీన్‌ఫీల్డ్ (ముందస్తు పని అవసరం లేనివి), బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులను (ప్రాజెక్టు ఆరంభానికి ముందు పనితో కూడుకున్నవి) ఇది తన నివేదికలో భాగంగా పొందుపరచాల్సి ఉంటుంది. భారత్ కేవలం పెద్ద మార్కెట్‌గానే కాకుండా, కొనుగోలు శక్తి, ఆకాంక్షలతో కూడిన మధ్య తరగతి జనాభా అధికంగా కలిగి ఉండడం ఎన్నో అవకాశాలకు వేదికగా మంత్రి పేర్కొన్నారు. ‘‘స్పష్టమైన నిబంధనలతో, మరింత పారదర్శకత మార్గంలో ఈ దేశం నడుస్తోంది. తమకు బాగా తెలిసిన, తమకు ఎంతో ఆమోదనీయమైన వాతావరణం కోసం అంతర్జాతీయ ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు అయితే.. అందుకు భారత్ సరిగ్గా సరితూగుతుంది’’ అని మంత్రి సీతారామన్ వివరించారు. -
వేదాంత లాభం రూ. 2,158 కోట్లు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం పెరగడం తోడయిందని, అందుకే నికర లాభం ఈ క్యూ2లో ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ పేర్కొన్నారు. ఆదాయం మాత్రం రూ.23,279 కోట్ల నుంచి రూ.22,814 కోట్లకు తగ్గిందన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాలు రూ.1,891 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.574 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం ఈ క్యూ2లో రూ. 856 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో రూ.3,279 కోట్ల మేర స్థూల రుణ భారం తగ్గింది. ఇక నికర రుణ భారం రూ.8,322 కోట్ల మేర తగ్గింది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.35,817 కోట్లుగా ఉన్నాయి. బీఎస్ఈలో వేదాంత షేర్ 3 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. -
ఖనిజాల కాణాచి కడప జిల్లా
అంగళ్ల రతనాలు అమ్మినారట... సాక్షి, కడప: రాయలసీమను రత్నగర్బగా పేర్కొంటారు. ఒకప్పుడు మన జిల్లాతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలోని పెన్నా పరివాహక ప్రాంతాల్లో వజ్రాలు లభించేవని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో నేటికీ వజ్రాలు లభిస్తున్నాయి. మన జిల్లాలో కూడా ఒకప్పుడు వజ్రాలు లభించేవన్నది చారిత్రక సత్యం. మాన్యువల్ ప్రకారం జిల్లాలోని గండికోట నాడు వజ్రాల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. సీమ జిల్లాలలో లభించే వజ్రాలను గండికోటకు చేర్చి అక్కడి నుంచి హంపికి తరలించి అక్కడ విదేశీ వ్యాపారులకు బహిరంగంగా విక్రయించేవారని తెలుస్తోంది. మన జిల్లాలో పెన్నా పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు, ఖాదరబాద్, చెన్నూరు, కొండపేట, కలసపాడు, సంజీవరాయునిపేట, కొండ సుంకేసుల ప్రాంతాలలో వజ్రాలు విరివిగా లభించేవి. పెన్నాతోపాటు కుందూ నది తీరాలలో కూడా వజ్రాలు లభించేవని సమాచారం. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్, గండికోటను ముట్టడించిన మీర్‌జుమ్లా వజ్రాల వ్యాపారం కోసం ఈ ప్రాంతానికి వచ్చిన వారే. చెన్నూరు కొండపేటల్లోని గనుల్లో నుంచి బ్రిటీషర్లు వజ్రాలను వెలికి తీసేవారని 1839లో ఓలంపల్లెలో ఒక జాతి వజ్రం లభించిందని మ్యానువల్ ద్వారా తెలుస్తోంది. అప్పట్లోనే దానిని రూ. 1450లకు విక్రయించారని సమాచారం. బెరైటీస్‌కు పుట్టినిల్లు బెరైటీస్ ఖనిజానికి పర్యాయపదం మన జిల్లా. ఇక్కడ గ్రే, వైట్ రెండు రకాల బెరైటీస్ లభిస్తోంది. ఓబులవారిపల్లె మండలం అనంతరాజుపేట, మంగంపేటలలో గ్రే బెరైటీస్ ఖనిజం సుమారు 74 మిలియన్ టన్నులు ఉన్నట్లు నిపుణుల అంచనా. అందులోని అధిక గురుత్వ శక్తి కారణంగా ఈ పౌడర్‌ను చమురు బావుల డ్రిల్లింగ్‌లో వాడతారు. ఇక్కడ లభించే గ్రే బెరైటీస్‌ను సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. ప్రపంచంలో లభించే ఖనిజాలలో 28 శాతం మన దేశంలోనే లభిస్తుండగా, అందులో 97 శాతం ఖనిజం మన జిల్లాలోనే నిక్షిప్తమై ఉందని ఈ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. వైట్ బెరైటీస్ జిల్లాలోని వేముల, కొత్తపల్లె, రాజుపాలెం, ఇప్పట్ల ప్రాంతాలలో విరివిగా లభిస్తోంది. జిల్లాలో ఈ రకం 0.7 మిలియన్ టన్నులు నిక్షిప్తమై ఉందని అంచనా. దీనిని పెయింట్లు, పేపరు, నూలు తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. లక్షల టన్నుల నిక్షేపాలు.. ఆస్బెస్టాస్ ఆస్బెస్టాస్..ఈ ఖనిజం రాళ్ల రూపంలో ఉంటుంది. వాటిని అరగదీస్తే మెత్తని దూది లాంటి, దారం లాంటి పదార్థం వస్తుంది. దీనికి ఉష్ణ నిరోధకశక్తి అధికం. పులివెందుల ప్రాంతంలోని బ్రాహ్మణపల్లె, లోపట్నూతల, లింగాల, రామనూతలపల్లె ప్రాంతాల్లో ఈ ఖనిజం విరివిగా లభిస్తోంది. బ్రాహ్మణపల్లెలో లభించే క్రోసోటైల్ రకం అస్బెస్టాస్ ఎంతో మేలైనదిగా చెబుతారు. జిల్లాలో సుమారు 2.50 లక్షల టన్నుల నిక్షేపాలు ఉన్నాయని నిపుణుల అంచనా. ఇళ్లు, షెడ్లు, కర్మాగారాలు, ఇతర భవనాలకు పైకప్పుగా వాడే సిమెంటు రేకుల తయారీలోనూ, యంత్రాల విడిభాగాలు, విద్యుత్ ఉష్ణ నిరోధక సాధనాల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. పులివెందుల బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి లోపటన్నూతల గ్రామం వరకు 15 కిలోమీటర్ల పొడవున ఈ ఖనిజ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ 200 మీటర్ల లోతు వరకు ఈ ఖనిజ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయని తెలుస్తోంది. సిరులు కురిపించే సున్నపురాయి సిమెంటు పరిశ్రమకు ప్రధానమైనది సున్నపురాయి. జిల్లాలోని ఎర్రగుంట్ల, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఇది విరివిగా లభిస్తోంది. ఇందులో ఉన్నత శ్రేణి సున్నపురాయి నిక్షేపాలు ఉండడం విశేషం. జిల్లాలో దాదాపు 100 మిలియన్ టన్నుల సున్నపురాయి నిల్వలు ఉన్నట్లు అంచనా. మేలురకం సున్నపురాయిని పేపరు తయారీ, క్రిమిసంహారకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. సున్నపురాయి ఆధారంగానే జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం, మైలవరం ప్రాంతాల్లో సిమెంటు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వీటినే పెద్ద పరిశ్రమలుగా చెప్పవచ్చు. నిర్మాణ రంగంలో సిమెంటు ప్రధానం కావడంతో దీనికి మంచి డిమాండ్ ఉంది. జిల్లాకు ఈ పరిశ్రమ ఆర్థిక బలాని్నచేకూరుస్తోంది. జిల్లాలో సిమెంటు పరిశ్రమలకు 200 సంవత్సరాలకు సరిపడ సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. దీన్ని ఆధారంగా ఎర్రగుంట్లలో జువారి, ఐసీఎల్ సిమెంటు ఫ్యాక్టరీలు ఉండగా, కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో భారతీసిమెంట్స్, మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల వద్ద దాల్మియా సిమెంటు కర్మాగారం ఏర్పాటయ్యాయి. సిమెంటు ఫ్యాక్టరీల ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. –కడప కల్చరల్ -
గుండెల్లో రాయి
సాక్షి, అమరావతి/గుంటూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో పల్నాడు ప్రాంతంలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గురజాల నియోజకవర్గంలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకున్నారు. వందల కోట్ల రూపాయలను దండుకున్నారు. మైనింగ్ మాఫియాలో ప్రధాన నిందితుడుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతోపాటుగా మరి కొందరిని బాధ్యులుగా చేస్తూ గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగించారు. టీడీపీ అండదండలతో యరపతినేని అప్పట్లో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో హైకోర్టు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో సీబీఐ అధికారులు అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించిన దర్యాప్తు నివేదికలను సీఐడీ అధికారుల నుంచి స్వాధీనం చేసుకోనున్నారు. వెలుగు చూసిందిలా.. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ వ్యవహారంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదిలో అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టింది. అయితే అప్పట్లో అధికార పార్టీ ఆదేశాలతో మైనింగ్ మాఫియాకు పాల్పడిన వారిని సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టలేదు. అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు ఆదేశంతో విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌పై 17 కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్లు, కూలీలు, మిల్లర్లు, ఇతర వ్యక్తులను సీఐడీ అధికారులు విచారించారు. సుమారు 700 మందిని విచారించి వారి నుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఆయా కేసుల్లో కీలకమైన సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచి సెక్షన్ 164 ప్రకారం మొత్తం 24 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు పరిధిలో ఉన్న కేసులను సీఐడీ అధికారులు ఉపసంహరించుకున్నారు. రోజుల వ్యవధిలో... నెల రోజుల క్రితం సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం సీఐడీ అధికారులు అయా కేసుల వారీగా వారు జరిపిన దర్యాప్తు పత్రాలను సిద్ధం చేశారు. ఎప్పుడు సీఐడీ అధికారులు వచ్చినా అన్ని పత్రాలను అందచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారం రోజుల్లో సీఐడీ అధికారులు వచ్చి కేసుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అక్రమార్కుల గుండెల్లో వణుకు కేసు సీఐడీ అధికారులకు వెళుతున్న విషయం తెలుసుకున్నప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపాటు అక్రమ మైనింగ్‌లో భాగస్వాములైన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ హయాంలో బినామీల పేరిట దాచుకున్న సొత్తునంతా కక్కిస్తారని భయపడుతున్నారు. ఎప్పుడు తమను విచారణకు పిలుస్తారోనని వణికిపోతున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన వందల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్‌కు వెళతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. -
పరిశ్రమలు.. కకావికలం!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఐఐపీ –1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత తాజా సమీక్షా నెల (2019 ఆగస్టు)లో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను రంగాల వారీగా చూస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాలేదు. –1.2 శాతం క్షీణత నెలకొంది. ఈ కీలక విభాగంలో ఇలాంటి ఫలితం చూడ్డం ఐదేళ్ల తరువాత (2014 అక్టోబర్‌లో –1.8 శాతం క్షీణత) తొలిసారి. 2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ► విద్యుత్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా –21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా –9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా/నిర్మాణం: పేలవ పనితనాన్ని ప్రదర్శించిన రంగాల్లో ఇది ఒకటి. ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు –4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. ► ఐదు నెలల్లోనూ డౌన్: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్–ఆగస్టు మధ్య 2.4%గా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతం. రెండవ త్రైమాసికంపై నీలినీడలు... ‘ఏప్రిల్–జూన్ క్వార్టర్లో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5%కి పyì ంది. రెండో క్వార్టర్లో వృద్ధి మెరుగుపడకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి’ అని ఆర్థికవేత్త అదితి నయ్యర్ పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాలను నిలిపేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం పులులకు నివాస యోగ్యమైందని, చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు పర్యావరణాన్ని నాశనం చేసే తవ్వకాల అనుమతులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ తవ్వవకాలతో వేలాది మంది చెంచుల కుంటుబాలు అటవీ ప్రాంతం వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాల వల్ల ఏర్పడే వాయు కాలుష్యంతో కేన్సర్ వ్యాధులు సోకడంతోపాటు జంతు జాతులు నాశనమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. మన్ననూర్, పదిర, దేవరకొండ, నాగార్జునసాగర్ ప్రాంతంలోని లంబాపూర్‌లో తవ్వకాలకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఉందని వివరించారు. యురేనియం తవ్వకాలకు సంబంధించిన అనుమతులను వెంటనే రద్దు చేసి ఆయా ప్రాంతాల్లో నివసించే అటవీ జాతులను, పర్యావరణాన్ని కాపాడాలని లేఖలో కోరారు. -
తయారీ, మైనింగ్ పేలవం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మెరుగుపడ్డం లేదు. జూన్‌లో కేవలం 2 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూన్‌తో (అప్పట్లో వృద్ధి రేటు 7 శాతం) పోల్చితే 2019 జూన్‌లో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువస్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► మైనింగ్, తయారీ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. ► దేశంలో పారిశ్రామికరంగం వృద్ది రేటు మందగమనంలో కొనసాగుతోంది. ఫిబ్రవరిలో కేవలం 0.2 శాతం వృద్ధి నమోదయ్యింది. మార్చిలో 2.7 శాతంగా ఉంది. ఏప్రిల్ (4.3 శాతం), మే నెలల్లో (4.6 శాతం) కొంత బాగుందనిపించినా, మళ్లీ జూన్ వచ్చే సరికి భారీగా జారిపోయింది. ► తయారీ: 2018 జూన్‌లో 6.9 శాతంగా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు 2019 జూన్‌లో కేవలం 1.2 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 8 మాత్రమే సానుకూల వృద్ధిరేటును నమోదు చేసుకున్నాయి. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి 9.7 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. ► మైనింగ్: మైనింగ్‌లో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి 8.5 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –5.5 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: కాస్మొటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, దుస్తులు వంటి ఫాస్ట్ మూ వింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికమూ మందగమనమే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ త్రైమాసిక కాలాన్ని చూసినా, పారిశ్రామిక వృద్ధి మందగమనంలోనే ఉంది. ఈ కాలంలో వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది. -
మైనింగ్ కోసం దేవుళ్లు కూడా మాయం!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఉండేవారంతా ఆదివాసులే. వారు అక్కడి పర్వత శ్రేణిని నందరాజ్ కొండలు అని పిలుచుకుంటారు. నందరాజ్, ఆయన భార్య పితోర్మేట ఆదివాసీల దేవుళ్లు. అక్కడి 84 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు పితోర్మేటను ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఆమె పేరిట పలు ఉత్సవాలు నిర్వహిస్తారు. గోంచా, హరియేలి, కోరా, నవఖని, చెర్తా ప్రధానంగా అక్కడి ఆదివాసీలు నిర్వహించే ఉత్సవాలు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం అక్కడి ఆదివాసీలకు ఎలాంటి ఉత్సవాలు లేవు. వారికంటూ ఓ ప్రత్యేక సంస్కతి కూడా లేదు. డాక్యుమెంట్ల ప్రకారం పితోర్మేట కొండల్లో 13 ఖనిజ నిక్షేపాలు, వాటిల్లో 32.60 కోట్ల టన్నుల ప్రథమ శ్రేణి ఇనప ఖనిజాలు ఉన్నాయి. వాటిల్లో నుంచి కోటి టన్నుల ఇనప ఖనిజాలను వెలికి తీసే హక్కులను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ హయాంలోని జాతీయ ఖనిత అభివద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కి అప్పగించింది. కాని పనులేమి జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం హయాంలోని చత్తీస్‌గఢ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీకి 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మైనింగ్ హక్కులను కేటాయించింది. ఆ జాయింట్ వెంచర్ సంస్థ ఆ హక్కులను తీసుకెళ్లి ‘అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’కు 2018, సెప్టెంబర్‌లో కేటాయించింది. ఆ తర్వాత రెండు నెలలోపే అంటే, 2018, డిసెంబర్ నెలలో క్షేత్రస్థాయి పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పనులు ఎందుకు ఆగిపోయాయి ? అప్పటి నుంచి చకా చకా మైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. లక్షలాది చెట్లను కొట్టివేశారు. మట్టి రోడ్లు వేసి చదును చేశారు. ఖనిజాలను తరలించేందుకు కన్వేయర్ బెల్ట్ పనులు కూడా చేపట్టారు. అప్పటికి ఐక్యమైన ఆదివాసీలు మైనింగ్ పనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ‘మా భూములపై మీకు హక్కు ఎవరిచ్చారు ?’ అంటూ నిలదీశారు. రాస్తో, రోకోలు, ధర్నాలు చేశారు. ఫలితంగా చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఈ జూలై ఆరవ తేదీన మైనింగ్ పనులను నిలిపివేశారు. ఆదివాసీల గ్రామ సభ ప్రాజెక్ట్‌కు అనుమతిస్తూ తీర్మానం చేసినట్లు హిరోలి గ్రామ సర్పంచ్, 106 మంది గ్రామస్థులు సంతకాలు చేసి వేలి ముద్రలు వేశారంటూ అధికారులు చూపిస్తున్న డాక్యుమెంట్ నకిలీదని, అలాంటి గ్రామ సభనే తాము నిర్వహించలేదని, తాము ప్రాణాలైనా అర్పిస్తాంగానీ, అలాంటి తీర్మానం చేయమని సర్పంచ్‌తో సహ హిరోలి గ్రామస్థులంతా స్పష్టం చేయడంతో ఆ డాక్యుమెంట్‌పై చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దంతేవాడ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించారు. 2014, జూలై 4వ తేదీతో డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతంలో చేపట్టే మైనింగ్ ప్రాజెక్ట్‌కు అనుమతిస్తూ హిరోలి గ్రామం జూలై 4, 2014న గ్రామ సభ ఏర్పాటు చేసి తీర్మానించినట్లు ఆ డాక్యుమెంట్లో ఉంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పారిశ్రామిక, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ‘పంచాయత్స్ (ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్) యాక్ట్’ కింద గ్రామ సభ అనుమతి తప్పనిసరి. తాము సంతకాలు చేసినట్లు అధికారులు చూపిన కాగితంపై ఉన్నవి తమ సంతకాలు, వేలి ముద్రలు కావని హిరోలి సర్పంచ్, బుధ్రి, ఆమె భర్త భీమారామ్ కుంజం, మాజీ సర్పంచ్ జోగా కుంజం, గ్రామస్థులు మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తాము జనవరి 9వ తేదీనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. అదంతా దంతెవాడ జిల్లా కలెక్టర్ పని గ్రామ సభ అనుమతి ఉన్నట్లు అప్పుడు సంతకాలు, వేలి ముద్రల డాక్యుమెంట్ రూపొంచినప్పుడు దంతెవాడ జిల్లా కలెక్టర్‌గా కేసీ దేవ్సేనాపతి ఉన్నారు. ఆయన ప్రస్తుతం ‘స్టేట్ డైరెక్టర్ ఆఫ్ జియాలోజి అండ్ మైనింగ్’తోపాటు ‘మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ చత్తీస్‌గఢ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. డాక్యుమెంట్ వివాదం గురించి మీడియా ఆయన వివరణ కోరగా, విషయం కోర్టులో ఉన్నందున తానేమీ మాట్లాడనని చెప్పారు. రాజ్యాంగంలోని 244 అధికరణ ఉల్లంఘన ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న 244వ అధికరణను అధికారులు ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది. ఆదివాసీల స్థలాలను ఇతరులకు అమ్మరాదు, కొనరాదు. ప్రభుత్వ పథకాలకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. గ్రామ సభల అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు చేపట్టే భూములకు సామాజిక, సాంస్కతిక, మతపరమైన ప్రాముఖ్యతలు ఉండరాదు. ఇవేమీ లేవంటూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవుల శాఖ ప్రాంతీయ కార్యాలయం ‘ఫారెస్ట్ అడ్వజరీ కమిటీ’కి 2016, జూలై 8న సమర్పించిన ‘సైట్ ఇన్స్పెక్షన్’ నివేదికలో పేర్కొంది. కానీ ఆదివాసీలు పంట కోతకు వచ్చినప్పుడే కాకుండా దేవుళ్ల పేరిట పలు వేడుకలు స్థానికంగా నిర్వహిస్తుంటారు. -
కొండలు పిండి చేస్తున్న ‘నితిన్ సాయి’
టీడీపీ నేతలు.. అక్రమార్జనకు అలవాటుపడ్డారు. ఇన్నాళ్లూ అధికార అండతో సహజ సంపదను దోచుకున్నారు. కొండలపై కన్నేసి వాటిని పిండి చేశారు. అక్రమంగా క్వారీ, క్రషర్లు నిర్వహిస్తూ రూ.కోట్లకు పడగలెత్తారు. కంకర కోసం నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ నేతలు సాగిస్తున్న క్వారీల దందాతో నిరుపేదల ఇళ్లు బీటలువారగా.. సమీపంలోని పచ్చని పొలాలన్నీ దుమ్ముకొట్టుకుపోయాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. – రాయదుర్గం/ రాయదుర్గం రూరల్ క్వారీ, క్రషర్ నిర్వహించాలంటే రెవెన్యూ, మైనింగ్, పర్యావరణ శాఖ అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి. అనుమతులన్నీ వచ్చినా.. క్రషర్, క్వారీ ఏర్పాటు చేయకముందుగానే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కానీ టీడీపీ నేతలు ఇవేమీ పాటించలేదు. అధికారం అండతో అధికారులను మచ్చికచేసుకుని రాయదుర్గం నియోజకవర్గంలో ఇష్టానుసారం క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. అయితే సమీపంలోనే ఓ టీడీపీ నాయకుడు క్వారీ ఏర్పాటు చేసి ఇష్టానుసారం బ్లాస్టింగ్లు చేస్తున్నారు. దీంతో కాలనీలోని ఇళ్లు బీటలు వారాయి. క్రషర్, క్వారీ నుంచి వస్తున్న దుమ్ము, ధూళి ఇళ్లలోకి రావడం.. బ్లాస్టింగ్ జరిగిన ప్రతిసారీ భూమి కంపిస్తుండడంతో భయాందోళన చెందిన నిరుపేదలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇక క్వారీ దుమ్ము సమీపంలోని పొలాలపై దుమ్ముధూళి పడటంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ధాటికి బీటలు వారిన ఇందిరమ్మ ఇల్లు నిబంధనలకు నీళ్లు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య మాత్రమే బ్లాస్టింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో పేలుళ్లు జరుపుతున్నారు. ఇక క్వారీ సమీపంలో చెట్లును పెంచి వాటిని సంరక్షించే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఎక్కడా ఒక్క మొక్కను కూడా నాటలేదు. బ్లాస్టింగ్ కోసం ఉపయోగించే మందుసామగ్రిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. లైసెన్స్ ఉన్న వారితో మెటీరియల్‌ను కొనుగోలు చేయాలి. ఇందులో ఏ ఒక్కటీ పాటించడం లేదు. ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్ క్వారీ, క్రషర్ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై మల్లాపురం వాసులు మూకుమ్మడిగా రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్వాహకులిచ్చే మామూళ్లు తీసుకుని వారికే వంతుపాడారు. పైగా మంత్రి కాలవ జోక్యం చేసుకోవడంతో క్వారీలపై ఫిర్యాదు చేసిన గ్రామస్తులపైనే కేసులు పెట్టించారు. కాలవ అండదండలతోనే... క్వారీల నిర్వాహకులకు అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని మరింత రెచ్చిపోయారు. కొందరైతే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే క్రషర్లు నిర్వహిస్తున్నారు. దీనిపై మల్లాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గతంలో విజిలెన్స్, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి సుమారు రూ. కోటి వరకు జరిమానా విధించారు. క్రషర్‌ను సీజ్ చేయాలని ప్రయత్నించగా... అప్పటి మంత్రి కాలవ శ్రీనివాసులు అధికారులకు ఫోన్ చేసి క్రషర్ సీజ్ చేయకుండా చూశారు. ఇక జరిమానా కూడా సగానికి పైగా తగ్గించేలా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. పెద్దఎత్తున కంకరను నిల్వచేసిన క్వారీ, క్రషర్ నిర్వాహకులు ఖజానాకు భారీ గండి క్వారీ, క్రషర్ల నిర్వాహకులు రాయల్టీ సైతం చెల్లించకుండా ఖజానాకు భారీ గండి కొట్టారు. ఒకటి, రెండు పర్మిట్లు తెచ్చుకుని వాటిపై తేదీలు వేయకుండా వాటితోనే వందల ట్రిప్పులు కంకరను తరలిస్తున్నారు. ఇక రాత్రిపగలు తేడా లేకుండా మిషన్లు నడిపిస్తూ అనుమతులకు మించి బ్లాస్టింగ్లు చేస్తూ సంవత్సరంలో తరలించే కంకరను మూడు నెలల్లోనే రవాణా చేసుకుంటున్నారు. అంతేకాకుండా రెండు మొబైల్క్రషర్ యూనిట్ల సాయంతో కంకరను తీసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోనట్లు తెలుస్తోంది. ‘నితిన్ సాయి’ నిర్వాకం అనంతపురం నుంచి 56 కిలోమీటర్ నుంచి 106 కిలోమీటర్ మొళకాల్మూరు రోడ్డు వరకు 46 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి, టీడీపీ నాయకులు పురుషోత్తంనాయుడుకు చెందిన లేఖాన్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకున్నాయి. ఈ రోడ్డుకు కావాల్సిన కంకర కోసం ఈ రెండు కంపెనీలు రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో సర్వేనంబర్ 132లోని 11.70 ఎకరాల విస్తీర్ణంలో (దొణగుడ్డం)డోలగుట్ట కొండను లీజుకివ్వాలని దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అధికారులు అనుమతులు ఇవ్వకుండానే కొండను పిండి చేస్తూ కంకరను తరలిస్తున్నాయి. ఇక వేపరాల క్రాస్ సమీపం సర్వేనంబర్ 270జీ, ఎఫ్లలో ఇద్దరు నిరుపేద రైతులకు చెందిన డీ పట్టాభూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంసీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి డీ పట్టాభూములను వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సి ఉన్నప్పటికీ, కార్యాలయం కోసం గది ఏర్పాటు చేసుకుని కార్మికులకు కూడా ఇక్కడే తాత్కాలిక ఇళ్లను నిర్మించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు మేల్కొని కంకర క్వారీ, క్రషర్ యూనిట్లో అక్రమాల నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం క్వారీ, క్రషర్‌పై దాడులు నిర్వహిస్తాం. అనుతులు ఉన్నాయో లేదో చూస్తాం. త్వరలోనే విచారణాధికారిని నియమించి నిబంధలను పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నుడుతుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకటరమేష్‌బాబు, తహసీల్దార్, రాయదుర్గం -
కూతురు.. అల్లుడు.. ఓ సవిత!
సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్: ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలు పిండి చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ మార్గంలో కోట్లాది రూపాయలు దోచుకున్నారు. సోమందేపల్లి మండలం గూడిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 64లో నాలుగు హెక్టార్ల స్థలంలో క్వారీకి పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి కుమార్తె బీకే రోజా పేరిట 2015 జూలై 4న లీజుకు తీసుకున్నారు. అయితే ఇక్కడ క్వారీకి పర్యావరణ అనుమతుల్లేవు. అయినప్పటికీ నాలుగేళ్లుగా అక్రమ తవ్వకం కొనసాగుతోంది. బీకే పార్థసారధి అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ క్వారీకి సంబంధించి 20వేల క్యూబిక్ మీటర్లకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సుమారు 2లక్షల క్యూబిక్ మీటర్లకు పైనే తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. రొద్దం మండలం కొగిరి గ్రామంలోని 454, 456–2 సర్వే నెంబర్లలో బీకే సాయి కన్స్ట్రక్షన్స్ పేరిట ఐదు హెక్టార్ల రోడ్డు మెటల్ క్వారీ నిర్వహణకు బీకే పార్థసారధి అల్లుడు పి.శశిభూషణ్ అనుమతి తీసుకున్నారు. ఈ క్వారీకి నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉన్నాయి. అయితే దీనికి తోడు అదే గ్రామ సర్వే నంబర్ 456లో 2017లో వెయ్యి క్యూబిక్ మీటర్లకు మాత్రమే తాత్కాలిక పర్మిట్ పొంది తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ సైతం తాత్కాలిక పర్మిట్ పొందేందుకు భూగర్భ గనుల శాఖ అధికారులపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముసుగులో కొన్ని వేల క్యూబిక్ మీటర్లను అక్రమంగా తవ్వేశారు. కియా పరిశ్రమ పక్కన తాత్కాలిక పర్మిట్లతో ఎస్.సవిత పేరిట నిర్వహిస్తున్న క్వారీ పెనుకొండ మండలం మునిమడుగు సర్వేనంబర్ 152లో నిర్వహిస్తున్న ఈ రోడ్డు మెటల్ క్వారీ కియా పరిశ్రమ పక్కనే ఉంది. నిబంధనల మేరకు పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికే అనుమతి ఇవ్వాలి.అయితే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి అండదండలతో కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.సవిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మూడు తాత్కాలిక పర్మిట్లు పొందారు. పర్మిట్లను మించి ఇప్పటికే 80వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రతీ క్వారీకి తాత్కాలిక పర్మిట్లను పొందారు. పార్థసారధి కూతురు రోజా పేరిట నిర్వహిస్తున్న క్వారీకి అసలు అనుమతులే లేకపోవడం గమనార్హం. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.సవితమ్మ పేరిట ఓ క్వారీ లీజుకు తీసుకోగా.. కియా పరిశ్రమ సమీపంలో మూడు తాత్కాలిక పర్మిట్లతో పెద్ద ఎత్తున కొండలను పిండి చేస్తున్నారు. నిబంధనల మేరకు లీజు ఒక చోట తీసుకోవడం, తవ్వకాలు మరో చోట చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రభుత్వం మారినా ఆ ప్రాంతంలో ఇప్పటికీ దందా కొనసాగుతోంది. గనుల శాఖ నిబంధనల మేరకు క్వారీలకు ఎలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక పర్మిట్లను ఇవ్వరాదు. క్వారీలకు లీజు ఇవ్వాలంటే పర్యావరణ అనుమతులతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కావడంతో బీకే పార్థసారధి నాకేంటి అడ్డు అన్నట్లుగా వ్యవహరించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తాత్కాలిక పర్మిట్ల ముసుగులో దోపిడీ అత్యవసర ప్రభుత్వ పనులకు మాత్రమే తాత్కాలిక పర్మిట్లను జారీ చేస్తారు. ఈ ముసుగులో బీకే కుటుంబ సభ్యులు దోరికినంతా దోచేశారు. ఎస్.సవితమ్మ 80వేల క్యూబిక్ మీటర్లకు తాత్కాలిక పర్మిట్లు తీసుకొని దాదాపు రూ.20కోట్లకు పైగా విలువ చేసే రోడ్డు మెటల్‌ను తవ్వేశారు. 2015నుంచి నేటి వరకు ప్రతి క్వారీలోను అక్రమంగా తవ్వాలు చేపట్టినా గనులశాఖ అధికారులు చుట్టపు చూపుగా కూడా పరిశీలించలేదంటే ఏస్థాయిలో బీకే పార్థసారధి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థమవుతోంది. వీరి కనుసన్నల్లో నడుస్తున్న ఏ ఒక్క క్వారీని కనీసం తనిఖీ చేసే సాహసం కూడా అధికారులు చేయలేకపోయారు. వారు చెల్లించిందే రాయల్టీ అనే రీతిన క్వారీలను నిర్వహిస్తున్నారు. బీకే పార్థసారధి కుటుంబ సభ్యుల కనుసన్నల్లో నిర్వహిస్తున్న క్వారీలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. -
ఇథియోపియాలో నగరవాసి మృతి!
హైదరాబాద్: తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు. ఈ ఘటనలో నగరవాసి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు ముషీరాబాద్‌లోని అశోక్‌నగర్ వాసి టీవీ శశిధర్‌గా అక్కడి పోలీసులు తేల్చారు. సన్‌రైజ్ మైనింగ్ పీఎల్టీ పేరిట ఇథియోపియాలో మైనింగ్ వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు రెండేళ్లుగా శశిధర్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తరచూ అక్కడికి వెళ్లి వస్తున్నారు. ఈనెల 9న మళ్లీ అక్కడకు వెళ్లిన శశిధర్ ముగ్గురు ఇథియోపియా దేశస్తులతో పాటుగా జపాన్‌కు చెందిన మరో వ్యక్తితో కలసి మంగళవారం రెండు కార్లలో బయటకు బయల్దేరారు. శశిధర్ రెండో కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కొందరు దుండగులు అడ్డగించి కారును దహనం చేసేశారు. అయితే ముందు బయల్దేరిన మొదటి కారులోని వ్యక్తులు శశిధర్ కారు ఇంకా రావటం లేదని గమనించి వెనుదిరిగి చూసేసరికి కారు తగలబడిపోతున్నట్లు కన్పించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో శశిధర్ మృతి చెంది ఉండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శశిధర్ నివాసం వద్ద విషాద ఛాయలు శశిధర్ మృతితో అశోక్‌నగర్‌లోని స్ట్రీట్ నంబర్ 2లోని జీహెచ్ఎంసీ–56 ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శశిధర్‌కు భార్య, కూతురు తేజస్విని, కొడుకు అభిషేక్ ఉన్నారు. శశిధర్ మరణ వార్తను తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, ఆయన మృతికి సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. తరచూ తమతో మాట్లాడే శశిధర్ నుంచి గత రెండ్రోజులుగా ఎటువంటి సమాచారం లేదని, ఆయన ఫోన్ కూడా కలవలేదని శశిధర్ వ్యాపార భాగస్వామి రామకృష్ణ, శశిధర్‌కు చెందిన ఎగ్జిమ్ కంపెనీ మేనేజర్ సంతోష్ తెలిపారు. ఈ ఘటనలో శశిధర్ తప్పించుకుని ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. -
500 మీటర్లలోపు మైనింగ్ జరపవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భూపాలపల్లి జిల్లా కాకతీయ గని–2లో పర్యావరణ నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు 500 మీటర్లలోపు బ్లాస్టింగ్ ద్వారా ఓపెన్‌కాస్ట్ మైనింగ్ నిర్వహించ వద్దంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన కేసును జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌లో బ్లాస్టింగ్ వల్ల వెలువడే వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, పర్యావరణానికి హాని కలుగుతోందని, పేలుళ్ల శబ్దానికి నివాసాలు ధ్వంసం అవుతున్నాయని పిటిషనర్ రాజలింగమూర్తి తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ 500 మీటర్లలోపు మైనింగ్ నిర్వహించుకోవచ్చంటూ గతంలో కేంద్ర పర్యావరణ శాఖ సవరించిన పర్యావరణ నిబంధనలను తోసిపుచ్చింది. ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ కార్యకలాపాల వల్ల జరిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్ర మండలి సంయుక్తంగా తనిఖీ చేసి ఒక నెల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ కూడా తనిఖీ చేపట్టాలని ఆదేశించింది. నివేదిక అందిన అనంతరం తదుపరి విచారణ జరుపుతామన్న బెంచ్ పర్యావరణ నిబంధనలు అమలు చేసేవరకు 500 మీటర్ల పరిధిలో పేలుళ్ల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. సవరించిన పర్యావరణ నిబంధనల అమలుకు కేంద్ర పర్యావరణ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని బెంచ్ అభిప్రాయపడింది. -
జీడీకే–10 గని మూత!
రామగిరి(పెద్దపల్లి జిల్లా): సింగరేణి సంస్థలో మరో భూగర్భ గని మూతపడనుంది. సంస్థలో మొట్టమొదటి బీజీ(బ్లాస్టింగ్ గ్యాలరీ)ప్యానల్ ఏర్పాటు చేసిన 10వ గనిని మూసివేసేందుకు యాజమాన్యం ముహూర్తం ఖరారు చేసింది. ఈయేడాది డిసెంబర్లో 10వ గని మూసి వేసేం దుకు సంబంధిత అధికారులు సన్నహాలు చేస్తు న్నారు. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు 520 మంది కార్మికులను బదిలీ చేయనున్నారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశా రు. 157 మంది కార్మికులు ఆర్జీ–3 పరిధి ఓసీపీ–1, 2గనులకు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోగా మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. మరో 180 మంది కార్మికులను ఇక్కడే ఉంచనున్నారు. 1976లో ప్రారంభం 1976లో ఏర్పాటు చేసిన జీడీకే–10 ఇంక్లైన్ గని ఎంతో మందికి ఉపాధి కల్పించింది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లోని కింది రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం కోసం 1989లో సింగరేణి మొత్తానికి మొట్టమొదటి సారి ఈగనిలో బీజీ ప్యానల్ ఏర్పా టు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని నిర్దశించిన ఉత్తత్పి సాదించి ఈగనిలో వర్క్స్పాట్(పని స్థలం)దూరం పెరిగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్ వైడింగ్ షాఫ్టును ఎర్పాటు చేశారు. పనిస్థలం దూరం పెరిగిపోవడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రాకపోవడంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో యాజమా న్యం ఈ గనిని మూసి వేసి ఆర్జీ–3 పరిధి ఓపీసీ–1కు అప్పగించాలని నిర్ణయించింది. ఈమేరకు డిసెంబర్లో ఉత్పత్తి నిలిపివేసి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఓసీపీ–1 జీవితకాలం జీడీకే–10వ గనిని మూసి వేసి ఆర్జీ–3 పరిధి లోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్సరాలు పెరుగుతుంది. 2019 డిసెంబర్లో ఓసీపీ–1 ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. మూడేళ్లక్రితం 10ఏ మూసివేత సింగరేణ సంస్థలో మొట్టమొదటిసారి లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని మూడు సంవత్సరాల క్రితం 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే–10ఏ గనిని 1985లో ఏర్పాటు చేశారు. భూగర్భంలో నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పైరెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏగనిలో లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడీకే–10, జీడీకే–10ఏ ఇంక్లైన్ గనుల్లో సుమారు 336 మిలియన్ టన్నుల బొగ్గు ఉండగా, రెండు గనుల ద్వారా 34 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్ టన్నుల బొగ్గును ఓసీపీ–1 ద్వారా వెలికితీయాలని సింగరేణి భావిస్తోంది. 34మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జీడీకే–10వ గనిని డిసెంబర్లో మూసి వేయాలని యాజమాన్యం నిర్ణయించింది. జీడీకే–10, జీడీకే–10ఏ గనుల ద్వారా సుమారు 34 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పతి జరిగింది. మిగిలిన బొగ్గు నిక్షేపాలను ఓసీపీ–1 ద్వారా వెలికితీయనున్నాం. ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏపీఏకు ఎలాంటి ముప్పు వాటిళ్ళకుండా రెండు డ్యాంలను నిర్మిస్తున్నాం. బి.వీరారెడ్డి, ఏపీఏ జీఎం -
ఆరావళిలో 31 కొండలు మాయం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ఆరావళి పర్వత శ్రేణిలో 31 కొండలు అదృశ్యం కావడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం, ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న అక్కడి మైనింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఆరావళి పర్వత శ్రేణిలో కొనసాగుతున్న గనుల తవ్వకంపై రాజస్తాన్ ప్రభుత్వం అందజేసిన స్టేటస్ రిపోర్ట్‌ను పరిశీలించిన జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పరిశీలన ప్రకారం దాదాపు 31 కొండలు మాయమైనట్లు తేలింది. మైనింగ్‌తో ఏడాదికి రూ.5వేల కోట్ల రాబడి వస్తున్నందున ఢిల్లీలోని లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడం సరికాదని వ్యాఖ్యానించింది. కొండలను తవ్విపోస్తుండటంతో దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యం పెరిగిపోయిందని పేర్కొంది. ఇందుకు కారణమైన 115.34 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను 48 గంటల్లోగా నిలిపివేయాలని ఆదేశించింది. ఆరావళి పర్వత శ్రేణి పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ‘దాదాపు 31 కొండలు మాయమయ్యాయి. దేశంలో కొండలు ఇలా మాయమైతే ఏమవుతుంది? హనుమాన్ మాదిరిగా ప్రజలు కొండలను ఎత్తుకుపోతున్నారా? రాష్ట్రంలోని 15 నుంచి 20 శాతం కొండలు కనిపించకుండా పోయాయి. ఇది కాదనలేని వాస్తవం. దీనికి బాధ్యత ఎవరిది?’ అని ధర్మాసనం రాజస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. -
అదృష్టం అంటే ఇతనిదే..!
భోపాల్ : అదృష్టం అంటే ఈ పేద రైతుదే. నిన్నటి వరకూ ‘ఈ రోజు ఎలా గడుస్తుందిరా దేవుడా..!’ అనుకున్న అతడు ఒక్క రాత్రిలోనే అపర కుబేరుడు అయ్యాడు. తాతల కాలం నుంచి చేస్తోన్న మైనింగ్ వ్యాపారం కలిసి వచ్చి అదృష్టం ‘వజ్రం’ రూపంలో తలుపు తట్టింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన మోతీలాల్ ప్రజాపతి కుటుంబం తరతరాలుగా భూమిని లీజుకు తీసుకుని మైనింగ్ జరుపుతుండే వారు. మోతీలాల్ కూడా ఇదే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల సెప్టెంబర్‌లో క్రిష్ణ కల్యాణ్‌పూర్ ప్రాంతంలో 25 గజాల భూమిని లీజుకు తీసుకుని మైనింగ్ చేస్తున్నారు. నెల తిరిగిలోపే అదృష్టం మోతీలాల్ తలుపు తట్టింది. మైనింగ్ చేస్తుండగా 42.59 క్యారెట్ బరువున్న వజ్రం దొరికింది. దీని విలువ సుమారు 1.5 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేశారు. ఈ విషయం గురించి మోతీలాల్.. ‘మూడు తరాల నుంచి మా కుటుంబం మైనింగ్‌లోనే ఉంది. కానీ ఎప్పుడు లాభాలు రాలేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు అదృష్టం నా ఇంటి తలుపు తట్టింది. ఈ వజ్రాన్ని అమ్మడం వల్ల వచ్చిన సొమ్ముతో నా పిల్లలని బాగా చదివించుకుంటాను. ఇల్లు కట్టుకుంటాను.. నా సోదరుని కూతుళ్లకు వివాహం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. నవంబర్‌లో ఎన్నికలు ముగిసిన తరువాత ఈ వజ్రాన్ని వేలం వేస్తాము. వచ్చిన సొమ్ములో 11 శాతం సొమ్మును ట్యాక్స్ కింద కట్ చేసి మిగతా డబ్బును మోతీలాల్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. -
ట్రైమెక్స్ మైనింగ్ కేసుపై సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఇసుక తవ్వకాల పేరుతో మోనోజైట్ ను వెలికి తీశారని. దాని లీజును రద్దు చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఏ ఖనిజాలు వెలికితీశారో తెలుసుకోవడానికి రెండు అధ్యయనాలు జరగాల్సి ఉందని కేంద్ర అణు ఇంధన పరిశోధన సంస్థ కోర్టుకు నివేదించింది. మైనింగ్ లైసెన్స్ రద్దుపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని రెండు వారాల్లో నివేదిక వస్తుందని ఏపీ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. కాగా,హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని దీన్ని కూడా అక్కడికే బదిలీ చేయాలని ట్రైమెక్స్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీం కోర్టును కోరారు. ఇసుక తవ్వకాల పేరుతో11 వేల టన్నుల మోనోజైట్ ఖనిజాన్ని అక్రమంగా వెలికితీశారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు . ఈ మైనింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రికవర్ చేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. అక్రమాలకు పాల్పడిన ట్రైమెక్స్ మైనింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. కేంద్ర అణు పరిశోధన సంస్థ నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ చేపడతామని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
తోడల్లుడు తోడేశాడు...
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిరండూల్ గనులనుంచి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చే ఐరన్ఓర్రేక్స్ను అన్లోడ్ చేసేందుకు ప్లాంట్ఆవిర్భావం నుంచి టిప్లార్ (మిషన్)నేవినియోగిస్తున్నారు. కానీ ఇటీవలతొలిసారిగా ఓ మంత్రి తోడల్లుడికి చెందినఏజెన్సీకి ఎటువంటి టెండర్లు లేకుండా 70వేల టన్నుల రేక్స్ అన్లోడ్ కాంట్రాక్టునుఅప్పజెప్పారు. స్టీల్‌ప్లాంట్ సొంత సామర్ధ్యంతోఅయ్యే ఆ పనిని.. మంత్రి బంధువుకుకాంట్రాక్టు అప్పజెప్పిన వివాదాస్పద వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ పనివిలువ అక్షరాలా రూ.కోటి పాతిక లక్షలు.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్‌ప్లాంట్)లో గత 30 ఏళ్లుగా ఇతర రాష్ట్రాల్లోని గనుల నుంచి వచ్చే ఐరన్ ఓర్ రేక్స్‌ను అన్లోడ్ చేసేందుకు టిప్లార్నే వినియోగిస్తూ వస్తున్నారు. 56 వ్యాగన్లను ఒక రేక్‌గా పరిగణిస్తుంటారు. రోజుకు సగటున 15 నుంచి 20 రేక్‌ల వరకు వస్తుంటాయి. టిప్లార్ ద్వారా రేక్‌లోని ప్రతి వ్యాగన్‌ను కట్ చేసి మెకానికల్‌గా బంకర్లో వేస్తారు. ఐరన్ ఓర్ ఫైన్స్ (పౌడర్)తో కూడిన రేక్‌లను కూడా ఇదే మాదిరి అన్లోడ్ చేస్తుంటారు. ప్లాంట్ ఆవిర్భావం నుంచి ఐరన్ ఓర్ రేక్స్‌ను అన్లోడ్ చేసే విధానం ఇదే. కానీ స్టీల్‌ప్లాంట్‌లోని రా మెటీరియల్ డిపార్ట్మెంట్ (ఆర్ఎండీ) అధికారులు ఇటీవల ఓ మంత్రి బంధువుతో కుమ్మక్కై తొలిసారిగా మ్యాన్యువల్ అన్లోడ్ కాంట్రాక్టు ఇచ్చేశారు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా, ప్లాంట్ యాజమాన్యం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఏకపక్షంగా మంత్రి తోడల్లుడికి చెందిన ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లర్స్కు అన్లోడ్ పనులు కట్టబెట్టేశారు. టన్నుకు రూ.157, జీఎస్టీకి రూ.18 చొప్పున సుమారు రూ.కోటి పాతిక లక్షల విలువైన కాంట్రాక్టును ఇచ్చేశారు. తీరా కాంట్రాక్టు పని పూర్తయిన తర్వాత బిల్లులు మంజూరు చేయమని పత్రాలు ఉన్నతాధికారులకు పంపిస్తే.. స్టీల్‌ప్లాంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొర్రీ పెట్టింది. కనీసంగా టెండర్లు లేకుండా ఏకపక్షంగా ఓ కాంట్రాక్టు సంస్థతో ఎందుకు చేయించారంటూ వెనక్కి పంపించింది. ఆ సెటిల్మెంట్కు కృతజ్ఞతగానేనా..? కనీసం టెండర్ కూడా లేకుండా అడ్డగోలుగా ఐరన్ ఓర్ రేక్స్ మ్యాన్యువల్ అన్లోడ్ చేయించిన వ్యవహారంలో రా మెటీరియల్డిపార్ట్మెంట్ (ఆర్ఎండీ)లో ముడి పదార్ధాల సరఫరాను పర్యవేక్షించే అధికారే సూత్రధారిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. సదరు అధికారి ఆ మధ్యన అగనంపూడిలో నిబంధనలకు విరుద్ధంగా ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టగా కార్పొరేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆ విషయమై ఆ అధికారి మంత్రిని సంప్రదించగా... ఆ అక్రమ నిర్మాణం జోలికి పోవొద్దంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అందుకు కృతజ్ఞతగానే సదరు అధికారి మంత్రి తోడల్లుడికి చెందిన ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లర్స్కు అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. -
కూలీలను కేసులో ఇరికిస్తున్నారు : కాసు
సాక్షి, గుంటూరు : మైనింగ్ విచారణను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసు మహేష్ ఆరోపించారు. దోషులను వదిలి కూలీలను కేసులో ఇరికించే యత్నం చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని హస్తం దీని వెనుక ఉందని అన్నారు. ఇందుకు యరపతినేనికి మంత్రి నారా లోకేష్ సాయం చేస్తున్నారని, ఇద్దరూ కలసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. -
అధికార పార్టీ నేతలే గనుల దొంగలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమార్జనే పరమార్థంగా భావిస్తున్నారు. అధికారం అండతో రెచ్చిపోతున్నారు. నిబంధనలు మాకొక లెక్కకా దంటూ అత్యంత విలువైన గనులను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో అమాయక కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వారి మనసు కరగడం లేదు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం పుష్కలంగా ఉండడంతో గనుల మాఫియాకు ఎదురే లేకుండా పోతోంది. రాష్ట్రంలో గనులు, క్వారీల్లో అక్రమాలపై స్వయంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు. గనులు, క్వారీలు చాలావరకు తెలుగుదేశం పార్టీ నాయకులవే కావడంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రతిఏటా రూ.వేల కోట్ల విలువైన ప్రకృతి సహజ సంపద పరాధీనమైపోతోంది. లీజు ఒప్పందాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. లీజు పొందిన దానికంటే అధిక విస్తీర్ణంలో గనులను తవ్వేస్తున్నా ఇదేమిటని అడిగేవారే లేరు. 80 శాతం క్వారీల్లో అక్రమాలు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో క్వారీ అంచులు కూలిపోయి ముగ్గురు మరణించిన ఘటన మరువక ముందే శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరికి చెందిన క్వారీలో పేలుళ్లు జరిగి 12 మంది వలస కూలీలు విగత జీవులయ్యారు. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు జరుపుతున్నా, ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా ఉండటం లేదు. భారీ ప్రమాదాలు జరిగినప్పుడు తనిఖీలు, కఠిన చర్యలంటూ నాలుగు రోజులు హడావుడి చేయడం, తర్వాత వదిలేయడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో 80 శాతానికి పైగా గనులు, క్వారీల్లో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఇవన్నీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వారి బినామీలవే కావడం గమనార్హం. యజమానులపై కేసులుండవ్! రాష్ట్రంలో కంకర క్వారీల యజమానులు ఎలాంటి లైసెన్స్‌లు లేకుండానే భారీ ఎత్తున జిలెటెన్ స్టిక్స్, డిటోనేటర్లు నిల్వచేస్తూ బ్లాస్టింగులు జరుపుతున్నారు. ఈ అక్రమ పేలుళ్ల వల్ల కూలీలు చనిపోతే యజమానులు వెంటనే ప్రభుత్వ పెద్దలను ఆశ్రయిస్తున్నారు. వెంటనే మంత్రులే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. బాధితుల కుటుంబాలతో రాజీ చేస్తున్నారు. యాజమానులపై కేసులు లేకుండా చూస్తున్నారు. గనుల భద్రత విభాగం ఏది? గుంటూరు జిల్లాలో ఇటీవలి కాలంలో రెండు ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సమీక్షల పేరుతో హడావుడి చేశారు. గనుల్లో భద్రతా చర్యలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేకంగా గనుల భద్రతా విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరు నెలలు గడిచినా అది అతీగతీ లేదు. గనులు, క్వారీల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా చట్టంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ అవి అమలవుతున్నాయో లేదో చూసే నాథుడే లేడు. ఫిర్యాదులు చేసినా ఫలితం సున్నా.. భారీ పేలుడు సంభవించిన కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలోని కంకర క్వారీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాస్ చౌదరికి చెందిన శ్రీవిఘ్నేశ్వర క్రషర్స్ పేరుతో పొందిన ఈ క్వారీ లీజు వెనుక ముఖ్యనేత సోదరుడు, యువనేత ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే నాలుగేళ్లుగా చుట్టుపక్కల గ్రామస్తులు పదేపదే ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీలో పేలుళ్లతో తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని జిల్లా కలెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. విచారణ కోసమంటూ వచ్చిన ప్రభుత్వ అధికారులు శ్రీనివాస్ చౌదరి కారులోనే దర్జాగా చక్కర్లు కొట్టడం గమనార్హం. ఈ క్వారీలో అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడికి సైతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లలో రూ.292 కోట్లు హత్తిబెళగల్‌లో పేలుళ్లు జరిగిన క్వారీ యజమాని శ్రీనివాస్ చౌదరి తండ్రి పేరు వీఎల్ చౌదరి. ఈయనను గుంతకల్లు బ్రాంచ్, ఆలూరు సబ్ బ్రాంచ్ కెనాల్‌కు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మీనాక్షి నాయుడి ద్వారా యువనేతతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ క్వారీ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ 500 టన్నుల కంకరను కర్ణాటకకు తరలిస్తున్నారు. అన్ని ఖర్చులు పోగా రోజుకు సగటున రూ.లక్ష మిగుతోంది. అంటే ఏడాదికి రూ.36.5 కోట్లు. ఎనిమిదేళ్లుగా క్వారీ నడుపుతున్నారు. అంటే ఇప్పటిదాకా రూ.292 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యనేత సోదరుడు, యువనేత తమ జేబుల్లో వేసుకుంది ఎంత అనేదానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. కనీస అనుమతులు లేకుండానే... హత్తిబెళగల్ గ్రామ సర్వే నంబరు 969లో మొత్తం 150 ఎకరాల్లో క్వారీ ఉంది. ఇందులో 2009లో 6.07 హెక్టార్లలో రోడ్డు మెటల్, క్వారŠట్జ్ తవ్వకాల కోసం శ్రీనివాస్ చౌదరి లీజు తీసుకున్నారు. శ్రీనివాస్ చౌదరి సోదరుడు సుహాన్ చౌదరి కూడా ఇదే సర్వే నంబరులో 3 హెక్టార్లలో 2012 జూన్ 12న క్వారీ లీజు పొందారు. ఇద్దరూ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే. అనుమతులు, లైసెన్స్‌లు లేకుండానే క్వారీల్లో బ్లాస్టింగ్లు చేస్తున్నారు. లీజుకు తీసుకున్న విస్తీర్ణం కంటే మించి పేలుళ్లు జరుపుతున్నా మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. అగ్నిమాపక శాఖ అనుమతులేవీ? వాస్తవానికి డిటోనేటర్లను పేల్చాలంటే అగ్నిమాపక శాఖ అనుమతి అవసరం. శ్రీనివాస్ చౌదరి, సుహాన్ చౌదరి ప్రొవిజనల్ అనుమతి కోసం 2010లో అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తేనే ఆక్యుపెన్సీ ఎన్వోసీ (నిరంభ్యతర పత్రం) ఇస్తామని అగ్నిమాపక శాఖ స్పష్టం చేసింది. అయితే, 2010 నుంచి ఇప్పటివరకు ఎనిమిదేళ్లుగా ఎన్వోసీ తీసుకోకుండానే క్వారీలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను(ఈడీ) పేలుస్తున్నారు. క్వారీలో కూలీల మరణానికి కారణమైన ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను అనంతపురం జిల్లా నుంచి అక్రమంగా తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నట్లు సమాచారం. -
హద్దులు చెరిపి.. అటవీ ధ్వంసం
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి అండదండలతో చెలరేగు తున్న మైనింగ్ మాఫియా అటవీ భూముల్లోనూ చొరబడి కొండలను కొల్లగొడుతోంది. కంచికచర్ల మండలం పరిటాల రెవెన్యూ పరిధిలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో హద్దులు చెరిపేసి రాత్రిపగలు తేడా లేకుండా సాగిస్తున్న పేలుళ్లు, అక్రమ మైనింగ్‌తో వన్యప్రాణులు గజగజలాడుతున్నాయి. విలువైన వృక్ష సంపద నేలరాలుతోంది. మంత్రి అనుచరుల అక్రమ క్వారీయింగ్ కంచికచర్ల మండలం పరిటాల రెవెన్యూ పరిధి దొనబండ సర్వే నెంబర్ 801లోని 1,204 ఎకరాల్లో 94 క్వారీలకు స్థానిక టీడీపీ నేతలు అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కోచోట 5 నుంచి 10 హెక్టార్ల లోపు మాత్రమే క్వారీయింగ్‌కు అనుమతించారు. హెక్టార్‌కు రూ.50 వేల చొప్పున రాయల్టీ చెల్లిస్తున్నారు. అయితే క్వారీయింగ్‌కు అనుమతించిన ప్రాంతంలో మూడేళ్ల క్రితమే తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ తరువాత వీరి కన్ను రెవెన్యూ భూములను ఆనుకుని వెనుకవైపు ఉన్న కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌పై పడింది. అప్పటికే క్వారీయింగ్ చేసిన ప్రాంతం అనుమతులు చూపిస్తూ కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయారు. అటవీ ప్రాంతంలో కొండలను నిత్యం రిగ్గు బ్లాస్టింగ్లతో పిండిచేస్తూ ఖనిజాలను కొల్లగొడుతున్నారు. అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రతినిధులు శుక్రవారం అక్కడకు చేరుకోవడంతో భారీ యంత్రాలను హడావుడిగా ఫారెస్ట్ నుంచి బయటకు తరలించడం గమనార్హం. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సమీప బంధువులైన చల్లగుండ్ల చిన నాగేశ్వరరావు, చింతల రామ్మోహన్రావులతోపాటు మంత్రికి ప్రధాన అనుచరుడైన మోడరన్ క్రష్షర్స్ యజమాని తోటకూర పూర్ణ ఇక్కడ అక్రమ క్వారీయింగ్ నిర్వహిస్తున్నారు. మైనింగ్ మాఫియాకు సహకరించినందుకు ఎన్నికల సమయంలో టీడీపీకి ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వణుకుతున్న వన్యప్రాణులు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినట్లు 1990లో నిర్వహించిన జియలాజికల్ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ అపార ఖనిజ సంపదతోపాటు వన్యప్రాణులు కూడా ఉన్నాయి. జింకలు, దుప్పిలు, కణితలు, చిరుతలతో పాటు 32 రకాల జంతువులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 48 రకాల అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ 100 హెక్టార్లలో కొండలు విస్తరించి ఉండగా ఇప్పటికే దాదాపు 80 హెక్టార్ల పరిధిలో కొండలను మైనింగ్ మాఫియా పిండి చేసినట్లు తెలుస్తోంది. క్వారీయింగ్ కోసం అరుదైన వృక్ష జాతులను నాశనం చేస్తున్నారు. జిలెటిన్‌స్టిక్స్ లాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో రిగ్గు బ్లాస్టింగ్లు చేస్తుండడంతో వన్యప్రాణులు భీతిల్లి పరుగులు తీస్తున్నాయి. రాత్రి పగళ్లు తేడా లేకుండా పేలుళ్లు జరుపుతుండడంతో వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. హద్దులను చెరిపి.. మైనింగ్‌శాఖ అనుమతులు ఇచ్చేటప్పుడు సర్వే నిర్వహించి హద్దులు నిర్థారించాలి. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రి దేవినేని ఉమా అండదండలు ఉండడంతో పరిటాల క్వారీలకు నిర్వాహకులు హద్దులే లేకుండా చేశారు. 94 క్వారీలకు హద్దులు ఏమిటో అంతుబట్టవు. హద్దులు చెరిపేసి రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లోకి చొచ్చుకుపోతున్నారు. రెండు కొండల మధ్య రహదారి.. దొనబండలో క్వారీ నిర్వాహకులు 801 సర్వేనెంబర్‌లోని కొండ పోరంబోకు భూములతోపాటు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో కలిసే రెండు కొండలను తొలిచేశారు. రెండు కొండల మధ్య అనుమతులు లేకుండా 40 అడుగుల మేర దాదాపు రూ.3 కోట్లతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే అక్కడ లభ్యమైన 2 వేల ట్రిప్పుల గ్రావెల్‌ను కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇందులో మంత్రి అనుచరులు కీలకంగా వ్యవహరించడంతో రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు మౌనం దాల్చారు. అడవిని ఆక్రమించారు.. దొనబొండ క్వారీ నిర్వాహకులు పోరంబోకు, అటవీ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వేల టన్నుల కంకర తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయి క్వారీయింగ్ చేయడంపై అటవీశాఖకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మంత్రి అనుచరులు కావడంతో వారి ఆడిందే ఆటగా ఉంది. – మార్తా శ్రీనివాసరావు (స్థానికుడు, పరిటాల) అటవీ భూముల్లో తవ్వకాలే లేవు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరగటం లేదు. రెవెన్యూ భూముల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకవేళ అటవీ ఆక్రమణ జరిగి ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – లెనిన్ (అటవీరేంజ్ అధికారి, కంచికచర్ల) -
గురజాల టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
-
ఇసుక మాఫియా : టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై మైనింగ్ ఆరోపణల వ్యవహారంలో హైకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. -
సీఎంకు సమస్యల సవాళ్లు
పనాజి: మూడు నెలల విరామం తరువాత విధి నిర్వహణకు హాజరైన గోవా సీఎం మనోహర్ పారికర్‌కు సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి అమెరికాలో చికిత్స తీసుకున్నారు. కోలుకోవటంతో ఇటీవల రాష్ట్రానికి తిరిగి వచ్చిన విషయం విదితమే. అయితే పారికర్ స్థానంలో రాష్ట్ర పరిపాలన.. వ్యవహారాలను పర్యవేక్షించిన ముగ్గురు మంత్రుల కమిటీ అన్ని రకాలుగా విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో మైనింగ్ పరిశ్రమపై పెద్ద ఎత్తున్న ప్రభావం పడింది. 88 మైనింగ్ లీజులపై సుప్రీంకోర్టు స్టే విధించటంతో మైనింగ్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతోపాటు పలు సమస్యలు పరిష్కరించటంలో మంత్రుల కమిటీ విఫలమైంది. ఇదే అదనుగా ప్రతిపక్ష కాంగ్రెస్.. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడింది. కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌ను డిమాండ్ చేస్తోంది. మొత్తానికి మూడు నెలలపాటు అధికారానికి దూరంగా ఉన్న పారికర్‌కు, సమస్యలు స్వాగతం పలకటం.. వాటిని పరిష్కరించే పనిలో ఆయన తలమునకలయ్యారు. -
సరిహద్దుల్లో బంగారు గనులు
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో, చైనా అధీనంలో ఉన్న ప్రాంతంలో భారీగా బంగారం, వెండి, ఇతర విలువైన ఖనిజాల గనులు ఉన్నట్లు హాంకాంగ్‌కు చెందిన ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ ఖనిజాల విలువ మొత్తంగా 60 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు) ఉంటుందనీ, చైనా ఇప్పటికే ఖనిజాల తవ్వకాన్ని భారీ ఎత్తున ప్రారంభించిందని తెలిపింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో గనుల తవ్వకాలు జరుగుతున్నాయనీ, ఇటీవల తవ్వకాలను చైనా భారీగా పెంచిందని పోస్ట్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న ళుంజె కౌంటీలో ఈ గనులు ఉన్నట్లు పోస్ట్ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ తమదేననీ, దక్షిణ టిబెట్‌లో ఆ రాష్ట్రం భాగమని చైనా ఇప్పటికే వాదిస్తుండటం తెలిసిందే. ఈ ఈశాన్య రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు చైనా చూస్తోందనీ, ఆ ప్రయత్నంలో భాగంగానే ఖనిజాల తవ్వకాన్ని భారీ ఎత్తున ప్రారంభించిందని పత్రిక తన కథనంలో పేర్కొంది. దక్షిణ టిబెట్‌ను మళ్లీ చేజిక్కించుకునేందుకు చైనా వేసిన బృహత్తర ప్రణాళికలో భాగమే ఈ గనుల తవ్వకాలని కొందరు అధికారులు చెప్పినట్లు వెల్లడించింది. -
ఇసుక ప్లాంట్ల ఏర్పాటుకు తోడ్పాటు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వడ్డెర సొసైటీలకు, ఎస్సీ, ఎస్టీ యువకులతో ఏర్పడే సొసైటీలకు ఇసుక తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌ల నుంచి వస్తున్న సహజ ఇసుకకు బదులుగా తయారీ ఇసుక వినియోగం పెంచాలన్నారు. స్టోన్ క్రషర్ల వంటి వాటి ద్వారా వడ్డెరల ఉపాధి పోయిందని, ఈ ఇసుక ప్లాంట్ల ఏర్పాటుతో వారికి ఉపాధి దొరికే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ యువతకు సంబంధిత సంక్షేమ శాఖ, ఉప ప్రణాళికల ద్వారా ఆర్థిక సహాయం, శిక్షణ, రుణాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. వచ్చే ఏడాదికి జిల్లాల వారీగా అవసర ఇసుక అవసరాలు, డిమాండ్‌పై అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలీసులు, రెవిన్యూ, మైనింగ్ విభాగాలు సంయుక్తంగా ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. -
టీడీపీ నేతల అవినీతి బట్టబయలు
సాక్షి, గుంటూరు: మట్టి, ఇసుక, రేషన్ బియ్యం, అక్రమ మైనింగ్ ఇలా దేన్ని వదలకుండా టీడీపీ నాయకులు అడ్డంగా దోచేస్తున్నారు.. అడుగడుగునా అవినీతి .. ఎక్కడ చూసినా అక్రమ దందా .. ఇవి జిల్లాలో అధికార పార్టీ నేతలు చేస్తున్న అవినీతి వ్యవహారాలు.. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ ఆరోపణలు చేస్తే రాజకీయ లబ్ధి కోసం బురదజల్లుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అధికార పార్టీ నేతలు చేస్తున్న అక్రమ దందాపై సొంత పార్టీ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండటంతో టీడీపీ అధిష్టానంలో అంతర్మథనం మొదలైంది. అధికార పార్టీ నేతలు ఏ స్థాయిలో దోచేస్తున్నారో.. ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడుతున్నారో నిరూపిస్తామంటూ సొంతపార్టీ నేతలే విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ సవాల్ చేస్తున్న సంఘటనలు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో జరుగుతూనే ఉన్నాయి. పార్టీలో నెలకొన్న విభేదాలతో అధికార పార్టీ నేతల బండారాలు బయటపడుతుండటంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో ప్రజలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మొన్న ప్రత్తిపాడు, నిన్న నరసరావుపేట, నేడు తాడికొండ నియోజకవర్గాల్లో అక్కడి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలపైనే సొంత పార్టీ నేతలు బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, వారి అనుచరులు చేస్తున్న అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. అక్రమ మైనింగ్, పేకాట క్లబ్‌లు, క్రికెట్ బెట్టింగ్‌లు, స్థలాల కబ్జాలు, బార్లు, వైన్స్‌ల నుంచి డబ్బులు వసూలు, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజ్‌లు ఇలా అన్ని అంశాల్లోనూ అవినీతి తారాస్థాయికి చేరింది. అధికార పార్టీ నేతల అక్రమ దందాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రుజువులతో సహా బయటపెట్టినా కావాలనే తమపై బురద జల్లుతున్నారంటూ ప్రతి విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేస్తున్న అవినీతి వ్యవహారాలను సొంత పార్టీ నేతలే బహిర్గతం చేస్తుండటంతో ప్రజలు టీడీపీ తీరును గమనిస్తున్నారు. అవినీతిపై సవాళ్లకు సిద్ధం.. ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండల పరిధిలో అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల మట్టిని దోచేస్తున్నారంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. మట్టి దోపిడీ వ్యవహారంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెప్పినా పట్టించుకోలేదని, ఆయన నేరుగా మట్టి క్వారీ వద్దకు వెళ్లి లారీలు నిలిపివేసిన ఘటన ఆ పార్టీలో విభేదాలు బట్టబయలు చేసింది. నరసరావుపేట నియోజకవర్గంలో కోడెల శివరామ్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పులిమి వెంకట రామిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ దీక్షకు దిగడం తీవ్ర సంచలనం రేపింది. అంతేకాకుండా ఈయన దీక్షకు కోడెల వ్యతిరేక వర్గం హాజరై మద్దతు కూడా తెలిపింది. ఇది చూసి కోడెల అనుకూల వర్గీయులు సైతం దీక్షలకు దిగడంతో నరసరావుపేటలో రాజకీయాలు వేడెక్కాయి. అవినీతిని బయటపెట్టి దీక్ష చేసినందుకు తమపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారంటూ పులిమి వెంకటరామిరెడ్డి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొమ్మినేని రామచంద్రరావు వర్గీయులు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. అభివృద్ధికి అడ్డు పడుతున్నారని, గ్రామంలో నీరు – చెట్టుతో పాటు పలు కార్యక్రమాల్లో రూ.8 కోట్ల అవినీతి జరిగిందన్నారు. అవినీతి నిరూపిస్తానంటూ ఆయన సవాల్ చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేస్తున్న అవినీతి దందాను సొంత పార్టీ నేతలే బహిర్గతం చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వీరిలో కొందరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండగా, మరికొందరు మాత్రం వారి మధ్య ఉన్న విభేదాలపై బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వీళ్లా మన నాయకులంటూ అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
సింగోటం చెరువు వద్ద మైనింగ్ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలె గ్రామం సింగోటం చెరువు వద్ద ధృవ ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న మైనర్ మినరల్స్ మైనింగ్‌ను ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మంగళవారం ఆదేశించింది. చెరువుకు సమీపంలో 24 హెక్టార్లలో మైనింగ్‌కు సంబంధించి మంజూరైన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ శ్రీనివాసులు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జావేద్ రహీద్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారించింది. చెరువు జీవావరణ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా గ్రామంలోని రెండువేలకుపైగా మత్స్యకారుల కుటుంబాల ఉపాధికి గండికొట్టేలా సదరు సంస్థ మైనింగ్‌కు పాల్పడుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై గత ఐదు నెలలుగా సంస్థ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పనులు నిలిపేయాలంటూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. -
యథేచ్ఛగా అక్రమ మైనింగ్
ప్రభుత్వం మాది, ప్రభుత్వ స్థలాలు కూడా మావే అన్నట్లుంది గుంటూరు రూరల్ మండలంలో అధికార పార్టీ నేతల పరిస్థితి. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయటమో లేక ఏదోక విధంగా తవ్వుకుని సొమ్ము చేసుకోవటమో లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాదాయానికి గండికొట్టి కోట్ల రూపాయలు తమ జేబుల్లో నింపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు రూరల్: మండలం గోరంట్ల గ్రామంలో సర్వేనంబర్ 196/1లో 41.52 ఎకరాల నల్లచెరువు (రాళ్ళకుంట)ను అధికార పార్టీకి చెందిన నేతలు ఓ సంస్థకు చెందిన డైరెక్టర్, టీడీపీ మండలస్థాయి నేతలు, ఓ ప్రజాప్రతినిధి అక్రమంగా రాత్రి సమయాల్లో తవ్వకాలు సాగించి ప్రభుత్వ భూమిలో మట్టిని అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. సుమారు నెల రోజులుగా రాత్రి సమయాల్లో తవ్వకాలు చేస్తూ రోజుకు వందల సంఖ్యలో లారీలతో మట్టిని తరలించారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. లారీ మట్టిని రూ.3000 నుంచి రూ4000 వరకూ విక్రయించి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో నింపుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నామినేటెడ్ పదవిలో ఉన్న వ్యక్తులే ఈ అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న ప్రదేశానికి వెళ్ళి కూడా చూసీచూడనట్లు వెళ్ళారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సొత్తును, ప్ర«జాధనాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ అక్రమాలకు వత్తాసుపలుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్లచెరువులో సుమారు 20 ఎకరాలకు పైగా ఎటువంటి బిల్లులు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా సుమారు 6 అడుగుల లోతు వరకూ తవ్వి కోట్లాదిరూపాయల విలువ చేసే మట్టిని తరలించారు. దేవాలయ భూమి స్వాహా గోరంట్ల గ్రామ శివారుల్లోని రవినగర్నందున్న సర్వే నంబర్ 508, 513, 514, 515లలో ఉన్న 1000 గజాల స్థలంలో విఘ్నేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం శిధిలావస్తకు చేరటంతో పూజాదికార్యక్రమాలు నిర్వహించటంలేదు. దీంతో ఇదే అదనుగా భావించిన స్థానిక అధికారపార్టీ నేతలు రాత్రికి రాత్రి పొక్లెయిన్లతో వెయ్యి గజాల స్థలంను సుమారు 6 అడుగుల లోతు వరకూ తవ్వి సొమ్ముచేసుకున్నారు. దేవాలయానికి చెందిన భూమిని తవ్వుకుని జేబులు నింపుకున్నా కనీసం ఏ అధికారి పట్టించుకోలేదని స్థానిక ప్రజలు వాపోయారు. గోరంట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సర్వేనంబర్ 456, 457, 458, 55 స్మశానం ఉంది. ఈ శ్మశానం సైతం తవ్వుకుని మట్టిని విక్రయించి సొమ్ము చేసుకున్నారని స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ప్రభుత్వ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ తవ్వుకుని సొమ్ము చేసుకోవటమే విధిగా స్థానిక టీడీపీ నేతలు పనిచేస్తున్నారని వారి ఆగడాలకు హద్దేలేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామంలోని టీడీపీ నేతల అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ భూములను ప్రజాధనాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
నో చట్టం.. నో ఫారెస్ట్
ఖాకీ చిత్రం ఇటీవల విడుదలయింది. కార్తీ హీరో. ఓ సిన్సియర్ పోలీసు ఆఫీసరు కరుడుగట్టిన ముఠా ఆచూకీ తెలిసి పట్టుకోవడానికి ఓ రాష్ట్రానికి పోలీసు సిబ్బందితో జీపులో వెళతాడు. గ్రామంలో ఎదురుగా ముఠా సభ్యులు కనిపిస్తారు. అదుపులోకి తీసుకోవడానికి వెళితే ఊరంతా మూకుమ్మడిగా దాడి చేస్తుంది. దీంతో ప్రాణభయంతో అందరూ పరుగులు తీస్తారు. సేమ్ టూ సేమ్ ఇదే సన్నివేశం ఇప్పుడు కొల్లేరులో కనిపిస్తోంది. చేంజ్ ఏంటంటే పోలీసు స్థానంలో ఫారెస్టు సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కొల్లేరు ఓటు బ్యాంకు కోసం పచ్చనేతలు చట్టాలకు తూట్లు పడేలా అక్రమార్కులకు అభయమిస్తున్నారు. అభయారణ్యంలో అక్రమంగా చెరువుల తవ్వకాలు సాగిస్తున్నారు. కైకలూరు : కొల్లేరులో బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. యథేచ్ఛగా మంచినీటి చెరువుల పేరుతో అభయారణ్యాన్ని తవ్వేస్తున్నారు. టీడీపీ నాయకులు తెరవెనక ఉండి, మహిళలను ముందించి అటవీ చట్టాలకు పాతరేస్తున్నారు. సుప్రీం కోర్టు నిబంధనలు తుంగలో తొక్కుతున్నా ఫారెస్టు, రెవెన్యూ, పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కొల్లేరు ఆక్రమణల పర్వం కళ్లెదుట, కాగితాల్లో సర్వే నంబర్లతో సహా తేటతెల్లం అవుతున్నా అడ్డుకోవడంలో అటవీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. రాజకీయ చట్రంలో ఇరుసులా ఇరుక్కుని బిక్కుబిక్కుమంటూ వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఆక్రమణలు పునరావృతం ఎన్నికలు దగ్గరపడేకొద్ది కొల్లేరులో ఆక్రమణలపర్వం ఊపందుకుంది. 2016 జూలై నెలలో మండవల్లి మండలం పులపర్రు, చింతపాడు, దెయ్యంపాడు, కైకలూరు మండలం కొల్లేటికోట, కొట్టాడ గ్రామాల్లో పట్టపగలు చెరువులను తవ్వేశారు. అప్పట్లో పులపర్రులో అడ్డుకున్న ఫారెస్టు అధికారులను తరిమేశారు. జీపును సైతం పక్కకు తోసేశారు. ఇవే ఘటనలు పులపర్రులో తిరిగి పునరావృతమయ్యాయి. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నాలుగు పొక్లెయిన్లతో తాగునీటి చెరువు పేరుతో భారీ గట్లు వేశారు. యథావిధిగా మహిళలను ముందుంచి అటవీ అధికారులను అడ్డుకున్నారు. తవ్వకాల తెర వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారనే విషయం జగమెరిగిన సత్యం. పాత్రికేయులపై దాడులు పులపర్రు గ్రామంలో జరుగుతున్న ఆక్రమణను వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయులపై అక్రమార్కులు మహిళలతో దాడులు చేయిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తుంటే, తిరిగి మహిళలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్న అభయారణ్యంలో పొక్లెయిన్లతో తవ్వుతుంటే సీజ్ చేయలేని అటవీ సిబ్బంది, అంతా అయిపోయిన తర్వాత తూతూమంత్రగా కేసులు నమోదు చేసి సరిపెడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఫారెస్టు సిబ్బంది కోమటిలంక రోడ్డు నిర్మాణం అంశంలో కైకలూరు టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేసినా అది బుట్టదాఖలయ్యింది. ముందే హెచ్చరించిన ‘సాక్షి’.. కొల్లేరు గ్రామాల్లో ఆక్రమణలు జరిగే అవకాశముందని ఫిబ్రవరి 22న ‘దీపం ఉండగానే’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అటవీ సిబ్బంది ఈ కథనంపై కసరత్తు చేశారు. కలెక్టరు ఆరా తీశారు. అయినా ఆక్రమణల పర్వాన్ని అడ్డుకోవడంలో అటవీశాఖ హైడ్రామా నడిపించింది. ఇవే ఘటనలు పలు గ్రామాల్లో నెలకొని శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కేసులతో సరి పట్టపగలు పులపర్రు గ్రామంలో రెండోసారి కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు జరిగాయి. ఈ ఘటనపై యథావిధిగా అటవీ అధికారులు రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రతి ఏటా ఆక్రమణలు జరగడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారుతోంది. పులపర్రు గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘అంతా నేను చూసుకుంటాను మీరు కానిచ్చేయండి’ అంటూ ఆక్రమణదారులకు భరోసా ఇవ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు భావిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం మండవల్లి మండలం పులపర్రులో అభయారణ్యంలో చెరువు గట్లు ఏర్పాటు చేసిన ఘటన వాస్తవం. దీనిపై పూర్తి విచారణ చేయాలని సిబ్బంది ఆదేశించాను. అటవీ శాఖ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. గ్రామస్తులకు అభయారణ్య చట్టాలను వివరించి ఏర్పాటు చేసిన అక్రమ గట్లను తొలగిస్తాం. – సాయిబాబా, అటవీశాఖ, డీఎఫ్‌వో కొల్లేరు కాంటూరు కుదింపు జరగాలి కొల్లేరు అభయారణ్యాన్ని కుదింపు చేయాలని కొల్లేరు పరివాహక ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. కొల్లేరు సమస్యలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజలకు న్యాయం జరుగుతుంది. – దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, కైకలూరు అక్రమ తవ్వకాల్లో టీడీపీ నాయకుల హస్తం కొల్లేటిలో జరుగుతున్న అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉంది. కాంటూరు 5లో ధ్వంసం చేసిన చెరువుల స్థానంలో కొత్త చెరువుల తవ్వకాలకు ఊతం ఇస్తున్నారు. ఈ కారణంగా ఏదో ఒక నెపంతో కొల్లేటిలో చెరువుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. చెరువుల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. – మన్నేపల్లి ఆదాం, పీసీసీ సభ్యులు, మండవల్లి తాగునీటి చెరువులకు అవకాశం ఇవ్వాలి ప్రభుత్వాధికారులు కొల్లేరు గ్రామాల్లో తాగునీటి చెరువుల తవ్వకాలకు అవకాశం కల్పించాలి. ఆపరేషన్ కొల్లేరు కారణంగా కొల్లేరు ప్రజలకు నష్టం వాటిల్లింది. గ్రామాల్లో తాగునీటి చెరువుల విస్తీర్ణం, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా లేదు. కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. – ఘంటసాల వెంకటేశ్వరరావు, ఏపీ మత్స్యకారుల సంఘ ఉపాధ్యక్షుడు, కొవ్వాడలంక -
అంతా రహస్యం..!
మంగంపేట(ఓబులవారిపల్లె) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏపీఎండీసీ మంగంపేట గనుల్లో గురువారం రెండున్నర అడుగుల వెడల్పుతో.. పది మీటర్ల మేర సొరంగ మార్గం బయల్పడిన విషయం తెలిసిందే. అయితే మైనింగ్ కార్యకలాపాలకు అడ్డు వస్తుందనే ఉద్దేశంతో.. ఏపీఎండీసీ అధికారులు అప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా రహస్య మార్గాన్ని మూసివేశారు. మీడియా ప్రతినిధులను కూడా అనుమతించకుండా, అక్కడ ఏమీ లేదని ప్రకృతి సహజంగా ఏర్పడిందని ఏపీఎండీసీ అధికారులు దాట వేయడం వెనుక.. ఆంతర్యమేమిటనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయాన్నీ అధికారులు వెల్లడించకపోవడంతో ప్రజలకు అంతా రహస్యంగా మారింది. బ్లాస్టింగ్లను సైతం తట్టుకుని నిలిచిన రహస్య మార్గం(ఫైల్ ఫోటో) గనుల్లో బ్లాస్టింగ్ సైతం తట్టుకుని.. మంగంపేట గనుల్లో 1970లో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు 47 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి. అప్పట్లో మైనింగ్ మెన్‌వెల్ బ్లాస్టింగ్‌తో తవ్వకాలు జరిపి.. బెరైటీస్ ఖనిజాన్ని వెలికితీసేవారు. ప్రస్తుతం బ్లాస్టింగ్‌కు 10 నుంచి 20 టన్నుల పేలుడు పదార్ధాలు వినియోగిస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో పేలుళ్లకు తట్టుకుని రహస్య మార్గం చెక్కు చెదరకుండా ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో అప్పట్లో నిర్మించిన రహస్య మార్గాలు ఎంత పటిష్టమైనవో అర్థమవుతుంది. ఈ మార్గంలో ఇప్పటికీ మనిషి వెళ్లేందుకు వీలుగా గోడలు, పైకప్పు చెక్కు చెదరకుండా ఉన్నాయి. మట్లిరాజుల పాలనలో... మండలంలోని ఎర్రగుంటకోట (వైకోట)ను గతంలో మట్లిరాజులు పాలించే వారు. మట్లిరాజు అయిన వెంకటరామరాజు వంశీయులు తమ సంపదను దాచి పెట్టేందుకు, శత్రువుల బారి నుంచి కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వీలుగా అక్కడక్కడా రహస్య మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. మంగంపేట ఏపీఎండీసీ గనుల్లో బయటపడ్డ సొరంగ మార్గం కూడా వారు నిర్మించినదేనని ప్రజలు భావిస్తున్నారు. ఉపరితల భూభాగం నుంచి 30 నుంచి 40 అడుగుల లోతులో ఏర్పాటు చేశారు. వైకోట నుంచి మంగంపేట మీదుగా బుడుగుంటపల్లె వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పురావస్తు శాఖ వారు పరిశీలిస్తే.. గుప్త నిధుల సమాచారం లేక మట్లిరాజుల కాలం నాటి చరిత్రకు సంబంధించిన విషయం ఏమైనా లభిస్తుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ శాఖ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా వారు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. -
గనులకు ‘తొలి’ వేలం!
సాక్షి, హైదరాబాద్: గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ (ఎంఎండీఆర్) చట్ట సవరణ–2015 అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో తొలిసారిగా మేజర్ గనుల బ్లాకులకు వేలం నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలో 3 సున్నపురాయి గనుల బ్లాకులకు వేలం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి అన్న పద్ధతిలో గనుల కేటాయింపు జరిపేవారు. యూపీఏ ప్రభుత్వం ఈ విధానం కింద జరిపిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఈ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ–వేలం విధానంలో గనుల కేటాయింపులు జరపాలని ఎంఎండీఆర్ చట్టానికి సవరణలు చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా.. ఈ చట్ట సవరణ తర్వాత తొలిసారిగా రాష్ట్రం లో గనుల బ్లాకులకు వేలం జరగనుంది. సూర్యాపేట జిల్లా పరిధిలోని సుల్తాన్పూర్, సైదుల్మాను(జాన్‌పహాడ్), పసుపుల అటవీ ప్రాంతాల్లో 3 సున్నపురాయి గనుల బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సుల్తాన్‌పూర్‌లో 80 మిలియన్ టన్నులు, సైదుల్మాను బ్లాకులో 71 మిలియన్ టన్నులు, పసుపుల బ్లాక్‌లో 60 మిలియన్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాలున్నట్లు రాష్ట్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిపిన పరిశీలనలో తేలింది. ఈ మూడు బ్లాకులకు ఈ–వేలం నిర్వహించాలని కేంద్ర గనుల శాఖను రాష్ట్రం ఇటీవల కోరింది. ఎస్బీఐ క్యాపిటల్ సహకారంతో ఈ బ్లాకులకు కేంద్ర గనుల శాఖ వచ్చే నెలలో ఆన్లైన్ వేలం నిర్వహించనుందని రాష్ట్ర గనుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. వేలం ద్వారా రాష్ట్రానికి రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మూడు నెలల వ్యవధిలో ఈ మూడు ప్రాంతాల్లో సున్నపురాయి నిక్షేపాలున్నట్లు రాష్ట్ర గనుల శాఖ నిర్ధారించింది. సూర్యాపేట జిల్లాలో మూడు సున్నపురాయి బ్లాకులకు వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సులో కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దృష్టికి తీసుకెళ్లగా, వేలం ప్రక్రియలో రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. -
6 ఏరియాలు.. వెనుకంజ
యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి జిల్లా) : నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరో 48 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకు 55.59మిలియన్ టన్ను ల ఉత్పత్తి లక్ష్యం కాగా 50.16 మిలియన్ టన్నులు(90శాతం) మాత్రమే సాధించింది. ఉత్పత్తిలో వెనుకబడిం ది. సింగరేణి వ్యాప్తంగా ఆరు ఏరియాలు వెనకంజలో ఉన్నాయి. భూగర్భ గనులు ఎక్కువగా ఉండటానికి తోడు, ఓసీపీల్లో ఓబీ వెలికితీతలో జాప్యం జరగడం.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యా ల సాధనపై ప్రభావం చూపుతోంది. సంస్థలో అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ కేవలం 18 శాతమే బొగ్గు ఉత్పత్తి సాధించి సంస్థలోనే చివరిస్థానంలో నిలిచింది. 60శాతం ఉత్పత్తితో మందమర్రి ఏరియా చివరినుంచి రెండో స్థానంలో ఉంది. వేసవి కాలం అనుకూల ప్రభావం చూపేనా! ఓసీపీలు ఉన్న ఆర్జీ–2, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల్లో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే అవకాశం కన్పిస్తుండగా, భూగర్భగనులు అధికంగా ఉన్న మిగితా ఏరియాల్లో లక్ష్యాలను సాధించడం కొంచెం కష్టంగానే ముందుకు సాగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వేసవికాలం ఓసీపీల్లో ఉత్పత్తికి అనుకూలంగా ఉండే అవకాశం కన్పిస్తుండటంతో ఎలాగైనా వార్షిక లక్ష్యాలను సాధించాలని పట్టుదలతో అధికారులు, ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు. వందశాతం ఉత్పత్తి లక్ష్యాల్లో.. సింగరేణి వ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి ఆర్జీ–3 ఏరియా 115శాతం బొగ్గు ఉత్పత్తితో ముందంజలో నిలవగా, 105శాతం ఉత్పత్తితో రెండోస్థానంలో మణుగూరు, 103శాతం తో బెల్లంపల్లి మూడోస్థానంలో, వందశాతం ఉత్పత్తితో కొత్తగూడెం నాలుగోస్థానంలో నిలిచాయి. 97శాతంతో ఆర్జీ–1 ఐదోస్థానంలో ఉంది. -
కాలుష్య ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
సాక్షి, వికారాబాద్: జిల్లాలో మైనింగ్ కాలుష్య ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి అంచనాలు సమర్పించాలని కలెక్టర్ సయ్యద్ ఒమర్జలీల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి అనే అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనింగ్ ద్వారా కాలుష్యానికి గురవుతున్న జిల్లాలోని పలు ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటడానికి అవసరమైన నర్సరీల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీలక్ష్మిని ఆదేశించారు. మొక్కలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించచ్చని పేర్కొన్నారు. మైనింగ్ నిర్వహిస్తున్న గ్రామాల్లో భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. అటువంటి వాటిని గుర్తించి మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, అంబులెన్స్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా వైద్యాధికారి దశరథకు సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అదనపు తరగతి గదులు, తాగునీరు, క్రీడా సదుపాయాలు, ఫర్నిచర్‌తో పాటుగా సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ రేణుకాదేవిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు, వృద్ధులు, దివ్యాంగులకు కంటి ఆపరేషన్లు చేసేందుకు వీలుగా ఫర్నిచర్ సమకూర్చడంతో పాటు తాగునీరు, భవనాల కల్పనకు చర్యలు చేపట్టాలఅన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యాన, పశువైద్య, వ్యవసాయ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశించారు. టీఎస్ ఐ పాస్‌పైనా కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటివరకు వచ్చిన 242 దరఖాస్తుల్లో 197 దరఖాస్తులకు పూర్తిస్థాయి అనుమతులు పలు శాఖల ద్వారా మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఆర్డీఓ జాన్సన్, జిల్లా మైనింగ్ ఏడీ శామ్యూల్జాకబ్, వికారాబాద్ ఆర్డీఓ విశ్వనాథం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ గ్రామాల అభివృద్ధికి రూ.290 కోట్లు
కొత్తగూడెం/చుంచుపల్లి: జిల్లాలో మైనింగ్ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి రూ.290 కోట్లు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో జిల్లా మినరల్ ఫౌండేషన్ ప్రథమ సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ ప్రభావిత గ్రామాల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించి వాటి అభివృద్ది కోసం కృషి చేస్తోందని అన్నారు. ఈ నిధులను జిల్లాలోని మైనింగ్ ప్రభావిత 86 గ్రామాలలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు గ్రామసభలను నిర్వహించి తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నిధులలో 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు, ప్రజల సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించుటకు, ప్రజలకు శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు వినియోగిస్తామని, మిగితా 40 శాతం నిధులను మంచినీటి సరఫరా, వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, విద్య, స్త్రీ, శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాభివృద్ధి తదితర పనులకు కేటాయి స్తామని వివరించారు. రెండు కిలోమీటర్ల లోపు మైనింగ్ ప్రభావిత ప్రాంత గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి జాబితాను సింగరేణి అధికారులు అందజేయాలని కోరారు. జిల్లా మినరల్ ఫౌండేషన్‌లో సభ్యులుగా మైనింగ్ ప్రభావిత గ్రామంలోని ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థులు తీర్మానం చేసి పంపాలని, ఆ జాబితా ఆధారంగా జిల్లా కమిటీలో సభ్యులుగా నియమిస్తామని అన్నారు. పనులు ఆలస్యం కాకుండా తక్షణమే తీర్మానాలు చేయాలన్నారు. మంజూరు చేసిన నిధులలో ప్రతి సంవత్సరం 5 శాతం ఏదేని జాతీయ బ్యాంకులో భవిష్యత్ అవసరాల కోసం జమ చేస్తామని, 5 శాతం నిధులు జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యా లు వంటి అత్యవసర సమయాలలో వినియోగించేందు కు కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మం తు మాట్లాడుతూ జిల్లాలో ఎ క్కువ శాతం సింగరేణి సంస్థ మినరల్స్ ద్వారానే వచ్చాయ ని అన్నారు. ఈ నిధుల కేటాయింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రధాన మౌలిక వసతులను గుర్తించి, మొదట వాటికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. మైనింగ్ ప్రభావిత ప్రాంతాన్ని రెండు కిలోమీటర్లకే పరిమితం చేయడంతో పలు గ్రామాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలను ధ్వంసం చేసి ఆయా గ్రామాలకు అన్యాయం చేయటం తగదన్నారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. ఈ విషయాలను ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ పంపితే, సింగరేణి ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం జరిగేలా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, జేసీ రాంకిషన్, డీఆర్డీఓ జగత్‌కుమార్‌రెడ్డి, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ ఛైర్పర్సన్లు పులి గీత, మడత రమ తదితరులు పాల్గొన్నారు. -
అంత నిర్లక్ష్యం ఎందుకో..?
చుంచుపల్లి: ఖమ్మం జిల్లాలో మైనింగ్ నిధులు పుష్కలంగా ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభావిత గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఈనెల 9న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు శనివారం మినరల్ ఫౌండేషన్ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరై ఇప్పటి వరకు మినరల్ ద్వారా జమ అయిన నిధుల వివరాలను తెలిపారు. రూ.290 కోట్లతో జిల్లా వ్యాప్తంగా ప్రభావిత గ్రామాలలో నెలకొన్న మౌలిక వసతులను గుర్తించి వాటికి ఖర్చు వేయాలని అధికారులను ఆదేశించారు. -
కొండను మింగిన టీడీపీ నేతలు
-
పారిశ్రామిక రంగం పరుగులు
న్యూఢిల్లీ: పారిశ్రామిక వృద్ధి మళ్లీ పరుగు అందుకుంది. ఆగస్ట్‌లో 4.3 శాతం వృద్ధితో తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. మైనింగ్, విద్యుత్ రంగాల చక్కని పనితీరుతో ఇది సాధ్యపడింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది ఆగస్ట్‌లో 4 శాతంగా నమోదు కావటం గమనార్హం. 2016 నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 5.7 శాతంగా నమోదు కాగా, ఆ తర్వాత తిరిగి మళ్లీ అధిక స్థాయికి చేరడం ఇదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు చూసుకుంటే మాత్రం పారిశ్రామిక వృద్ధి నిదానించిందనే చెప్పుకోవాలి. ఈ కాలంలో వృద్ధి 2.2 శాతంగా నమోదు కాగా, 2016 ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో ఇది 5.9 శాతం వృద్ధి చెందడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది జూలై ఐఐపీ గణాంకాలను గతంలో ప్రకటించిన 1.2 శాతం నుంచి 0.94 శాతానికి కేంద్రం సవరించింది. రిటైల్ ద్రవ్యోల్బణం మారలేదు రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 3.28 శాతంగా నమోదైంది. ఆగస్ట్‌లో ఇది 3.36 శాతం ఉన్నట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తాజాగా దాన్ని 3.28 శాతానికి సవరించింది. దీంతో ఆగస్ట్ నెలలో ఉన్నట్టుగానే సెప్టెంబర్ నెలలోనూ ద్రవ్యోల్బణం రేటు కొనసాగింది. కూరగాయలు, ధాన్యం ధరలు నెమ్మదించినట్టు ప్రభుత్వం తెలిపింది. కూరగాయల ధరలు 9.97 శాతం నుంచి 3.92 శాతానికి తగ్గాయని పేర్కొంది. 2016 సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.39 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. -
మైనింగ్ పనులను అడ్డుకున్న రైతులు
డోన్ టౌన్ : కన్నపుకుంటలోని 570 /5 సర్వేనెంబర్లో రెవెన్యూ, గనులు, భూగర్భశాల అధికారుల మైనింగ్ లీజును మంజూరు చేయడం మూలంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ ప్రాంతం రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం మైనింగ్ ప్రాంతంలో జరగుతున్న బ్లాస్టింగ్ పనులను అడ్డుకుని అక్కడే ధర్నాకు దిగారు. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో లీజుదారుడు శ్రీనివాసులు పనులను ఆపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈసందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ బఫర్‌జోన్ ఏర్పాటు చేయకుండానే అధికారులు పంట పొలాలను ఆనుకొని మైనింగ్లీజును ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. తమ సమస్య పరిష్కరించే వరకూ కదలేది లేదని భీష్మించారు. ఇదిలా ఉండగా రైతులు మైనింగ్ యజమానుల మధ్య వివాదం కోర్టులో ఉన్నట్లు తహసీల్దార్ మునికృష్ణయ్య తెలిపారు. లీజు మంజూరుకు సంబంధించి ఎన్ఓసీ ఇచ్చినట్లుగా తమ వద్ద రికార్డులు లేవన్నారు. ఈ విషయంలో తామేమీ చేయలేమని స్పష్టం చేశారు. -
అక్రమ తవ్వకాల్లో హైడ్రామా
తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేతలు అనుమతి పత్రాలు లేవన్న తహసీల్దారు, నిర్వాహకులు వాహనాలను నిలిపివేసిన వైఎస్సార్ నేతలు తీవ్ర హైడ్రామా నడుమ పుట్టుకొచ్చిన అనుమతి పత్రాలు అనుమతి ఒక చోట.. తవ్వకాలు మరోచోట ఇదో రకం దోపిడీగా అంటూ మండిపడిన నియోజకవర్గ కో ఆర్డినేటర్ లీలాకృష్ణ మండపేట / కపిలేశ్వరపురం : సామాన్యులు గోదావరిలో గంపెడు ఇసుకను తీసుకుంటే సవాలక్ష అనుమతులు కోరే అధికారులు రెండు రోజులుగా లక్షలాది రూపాయలు విలువచేసే ఇసుకను తరలించుకుపోతున్నా చేష్టలుడిగి చూశారు. అక్రమ తవ్వకాలపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు నిలదీసే సరికి తెల్లమోహం వేశారు. అనుమతి ఉందంటూనే తమ వద్ద ఆ పత్రాలు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో హుటాహుటీన అనుమతి పత్రాలు తెప్పించారు. కాగా అనుమతి ఇచ్చిన చోట కాకుండా నదీ గర్భంలో తవ్వకాలు చేస్తుండటంతో ఇదో రకం దోపిడి అంటూ వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ మండిపడ్డారు. కపిలేశ్వరపురం మండలంలోని ఇసుక ర్యాంపులో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు సాగిపోతున్న విషయం విదితమే. జిరాయితీ మాటున నదీ గర్భం నుంచి లక్షలాది రూపాయలు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. రూ. కోట్లాది విలువైన ఇసుక తరలిపోతున్న తీరును నిగ్గు తేల్చేందుకు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి సోమవారం అధికారులను వివరణ కోరేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. కోరుమిల్లి ర్యాంపు బాట నుంచి ఇసుక తరలిపోతుందని అనుమతులేమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. కలెక్టర్ నుంచి అనుమతి ఉన్నట్టు నిర్వాహకులు చెప్పారని, అయితే కాపీ తన వద్ద లేదని, మైన్స్ అధికారులను కలవాలని తహసీల్దారు అన్నారు. సామాన్యుడు ర్యాంపులో బస్తా ఇసుక తీసుకెళ్తేనే నేరమని అడ్డగించే రెవెన్యూ అధికారులు భారీ స్థాయిలో ఇసుకను తరలిస్తుంటే కనీస పర్యవేక్షణ లేకపోవడం ఆశ్చర్యంగా ఉదని లీలాకృష్ణ అన్నారు. దీనిపై చర్య తీసుకోవాలని కోరుతూ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ర్యాంపును సందర్శించారు. పదికి పైగా భారీ వాహనాలను తరలిపోతుండగా నిలువరించి బైఠాయించారు. నిర్వాహకులు కూడా అనుమతి పత్రం తమ వద్ద లేదని చెప్పారు. దీంతో సాయంత్రం వరకు ర్యాంపు వద్ద బైఠాయింపు కొనసాగించారు. ఎస్సై బి.రాజేష్‌కుమార్ కూడా అనుమతి సంగతి రెవెన్యూ వారు చూసుకుంటారని సమాధానం చెప్పారు. ఆగమేఘాలపై అనుమతి పత్రం రాజు తలచుకుంటే ఏదైనా జరుగుతుందన్న చందాన లీలాకృష్ణ ఆందోళన కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో సాయంత్రం వేళ కాకినాడ నుంచి అనుమతి పత్రాన్ని నిర్వాహకులు తీసుకొచ్చి చూపించారు. దాన్ని చదవగా పలు ఆశక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏడో తేదీనే అనుమతి ఇచ్చినట్టు ఉంది. మరి మూడు రోజులుగా స్థానిక, మండల స్థాయి అధికారుల వద్ద కాపీలు లేకపోవడం, అదే విషయాన్ని వారు పలుమార్లు మీడియాకు చెప్పడం గమనార్హం. ఈ ప్రశ్నలకు బదులేది? ‘ సాంకేతిక పరిజ్ఞాణాన్ని ఎంతగానో అభివృద్ధి చేసానని చెప్పుకునే చంద్రబాబు పాలనలో జిల్లా అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని మండలానికి తెచ్చేందుకు మూడు రోజులు పట్టడం, కనీసం రెవెన్యూ, పోలీస్, మైన్స్ అధికారుల వద్ద కూడా కాపీ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ‘ ఉచిత ఇసుకను తరలించేందుకు వినియోగించిన బాటనే నిర్వాహకులు వినియోగించడంతోపాటు. అదే ర్యాంపులో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ‘ జిరాయితీ భూమిలో ఇసుక మేటల తవ్వకాలకు అనుమతి ఇవ్వగా ర్యాంపును ఆనుకుని నదీ గర్భంలో యదేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం తవ్వకాలు జరుగుతున్న చోట కనీసం మొక్క, కానీ చెట్టుకానీ లేవు అది జిరాయితీ భూమి ఎలా అవుతుందని అడుగుతుంటే అధికారులు తెల్లమోహం వేస్తున్నారు. ఇదో రకం ఇసుక దోపిడీ : లీలాకృష్ణ ఈ సందర్భంగా లీలాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రోద్భలంతో ఇసుక అక్రమ తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయనడానికి కోరుమిల్లి ర్యాంపులో జరుగుతున్న వ్యవహారమే ఉదాహరణ అని ధ్వజమెత్తారు. కర్రి పాపారాయుడుతో కలిసి లీలాకృష్ణ మాట్లాడుతూ జిరాయితీ భూమిలో ఇసుకను తవ్వడానికి రెవెన్యూ శాఖాధికారుల అనుమతి తప్పనిసరని మండల రెవెన్యూ అధికారే అనుమతి ఉన్నదీ లేనిదీ చెప్పలేదంటే అధికార పార్టీ నాయకులు ఎంతకు బరితెగిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు. రూ. కోట్లాది విలువైన ఇసుకను కాకినాడలోని అధికారపార్టీ నేతలకు చెందిన సంస్థల ప్రాజెక్టులకు ఇసుకను తరలిస్తున్నారని, రోజంతా ఉద్యమం చేస్తేనే అనుమతి కాపీని తీసుకొచ్చారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మూడు రోజులుగా అనుమతి పత్రం లేకుండా ఇసుకను తరలిస్తున్నా పోలీస్, రెవెన్యూ, మైన్స్ అధికారులు కనీసం పట్టించుకోలేదంటే అధికార పార్టీ నేతలు వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాయకులు మేడపాటి ప్రసాదరెడ్డి, గంగుమళ్ళ రాంబాబు, పొలమాల సత్తిబాబు, గుత్తుల శ్రీనివాస్, నేల సూర్యకుమార్, సవిలే జయంత్, పెయ్యల యాకోబు, మాతా నాగేశ్వరరావు, సర్రాకుల అబ్బులు, పీతల శ్రావన్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలు
జిరాయితీ భూమి పేరుతో పనులు కాకినాడకు చెందిన కంపెనీ ప్రాజెక్టుకు తరలింపు అనుమతులున్నాయంటూ వాదన పత్తాలేని అధికార గణం నటుడు బాలకృష్ణ బంధువుల పనిగా అనుమానం కపిలేశ్వరపురం (మండపేట) : కోరుమిల్లి గ్రామంలో ఏదో రూపంలో ఇసుక అక్రమాలు సాగుతూనే ఉన్నాయి...ర్యాంపులు నిర్వహణలో ఉన్నప్పుడు అధికార పార్టీ నేతల స్వయం నిర్వహణలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమ గుట్టలను అధికారులు స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ర్యాంపులు మూతపడ్డాయి. అయినా గ్రామంలో ఇసుక తరలింపు ఆగలేదు. కాకినాడకు చెందిన ఓ రెసిడెన్సీ సంస్థకు ఈ గ్రామం నుంచి శనివారం భారీ వాహనాల్లో ఇసుకను తరలించారు. ఆ సంస్థ బంధువులకు ఈ గ్రామంలో గోదావరి తీరాన జిరాయితీ భూములున్నాయి. ఆ భూముల్లో ఇసుక మేటలు వేశాయని వాటిని తొలగించుకుంటున్నామన్న వంకతో భారీ స్థాయిలో ఇసుకను కాకినాడకు తరలించేస్తున్నారు. అందుకోసం ఉచిత ఇసుక విధానం కోసం వినియోగించిన ర్యాంపు బాటనే నేరుగా వినియోగిస్తున్నారు. వారి చర్యలకు దన్నుకోసం స్థానిక అధికార పార్టీ నేతలను చేరదీశారు. ఇసుక తరలింపు విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ర్యాంపును సందర్శించగా పలు ఆశక్తిగల అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇసుకను తీసుకెళ్తున్న కాకినాడలోని సంస్థ, ఇసుకను తరలిస్తున్న కోరుమిల్లిలోని భూములు సీఎం చంద్రబాబు బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ బంధువులకు చెందినవని తెలియ వచ్చింది. కోరుమిల్లిలోని జిరాయితీ భూముల్లో ఇసుక మేటలు వేశాయని, మేటలను తొలగించుకుని పంటల సాగు చేసుకునే వీలు కల్పిస్తూ అనుమతులు కోరుతూ గతంలో దరఖాస్తు చేశారు. ర్యాంపులు మూత పడడంతో సంస్థకు ఇసుక అత్యవసరం కావడంతో ఆ అవకాశాన్ని ఇప్పుడు వాడుకుంటున్నారు. తవ్వకాలకు అనుమతి ఉన్నదీ లేనిదీ స్పష్టతలేని పరిస్థితి. అనుమతి పత్రాలు చూపాలని మీడియా ప్రతినిధులు కోరగా తమ వద్ద లేవంటూ నిర్వాహకులు సమాధానం దాటవేశారు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం ఇసుక ర్యాంపును ఆనుకుని ఉండటం, అక్కడ ఎలాంటి సాగు పంటలు లేకపోవడంతో జిరాయితీ భూములు పేరు చెప్పి ర్యాంపులో తవ్వకాలు జరుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిర్వాహకులను ప్రశ్నించగా తమకు 16.16 ఎకరాలు జిరాయితీ భూమి ఉందని గోదావరి నదిలో కలిసిపోవడంతో తవ్వకాలు నదిలో చేస్తున్నట్టుగా కనిపిస్తుందంటూ సమాధానం చెప్పుకొచ్చారు. ఇంత భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులెవరూ అటువైపు రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. తహసీల్దార్ కేపీ నరసింహులు, మైన్స్ అధికారులను వివరణ కోరగా కలెక్టరు అనుమతి ఇచ్చిందీ లేనిదీ తమకు తెలీదని సమాధానమిచ్చారు. గతంలో కోరుమిల్లిలో ఇసుక గుట్టలు పెట్టినప్పుడే అధికారులు వెంటనే స్పందించిన అధికారులు ఇప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రాకపోవడంతో తవ్వకాలు వెనుక అధికార పార్టీ రాష్ట్ర నాయకుల హస్తం ఉందన్న వాదన బలంగా ఉంది. -
‘అరణ్య’రోదన..!
- ఆక్రమణలకు గురైంది (చదరపు కిలోమీటర్లలో) 15,000 - ప్రాజెక్టులకు ఇచ్చింది (చదరపు కిలోమీటర్లలో) 14,000 పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు మొక్కలు నాటాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వాలే.. అభివృద్ధి పేరిట అటవీ భూములను ఉదారంగా కట్టబెట్టేస్తున్నాయి. సాగునీటి, రక్షణ ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లు, గనులు, పరిశ్రమలు, రైల్వే, రహదారులు ఇలా వివిధ ప్రాజెక్టుల కోసం అడవులను అడ్డంగా నరికేసేందుకు అనుమతులి స్తున్నాయి. గడిచిన 30 ఏళ్లలో 15,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఆక్రమణలకు గురికాగా.. మరో 14,000 చదరపు కిలోమీటర్ల అరణ్యం 23,716 ప్రాజెక్టుల కోసం హరించుకుపోయిందట. ఈ గణాంకాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇది ప్రభుత్వ లెక్క మాత్రమే అని, వాస్తవానికి చాలా భాగం అటవీ ప్రాంతం ఆక్రమణలకు గురయ్యాయని పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. ఏటా 250 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను రక్షణ ప్రాజెక్టులు, డ్యామ్‌లు, మైనింగ్, పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, రహదారులు వంటి వాటికోసం ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయి. ఈ మళ్లింపులో రాష్ట్రాలకు.. రాష్ట్రాలకూ మధ్య వ్యత్యాసం ఉంటోంది. 1980 నుంచి ఇప్పటి వరకూ పంజాబ్ తమ అటవీ ప్రాంతంలో సగ భాగాన్ని ఇలా మళ్లించిందట. అదే పశ్చిమబెంగాల్, తమిళనాడు తమ అటవీ ప్రాంతంలో కేవలం 1 శాతం మాత్రమే ఇలా మళ్లిం చాయి. 1980 నుంచి 14,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను ప్రాజెక్టులకు కేటాయించడంతో.. దీనికి పరిహారంగా 6,770 చదరపు కిలోమీటర్ల చెట్లను కొత్తగా నాటడం లేదా పరిహార అటవీకరణ చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. – సాక్షి, తెలంగాణ డెస్క్ మైనింగ్, రక్షణ, డ్యామ్లకే ఎక్కువ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ప్రాజెక్టులకు అప్పగించిన 14,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో మైనింగ్‌కు 4,947 చ.కి.మీ., రక్షణ ప్రాజెక్టులకు 1,549 చ.కి.మీ., హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు 1,351 చ.కి.మీ. అప్పగించారు. ఇక 15,000 చదరపు కిలోమీటర్ల అరణ్యం ఆక్రమణల బారిన పడగా.. ఇందులో ఎక్కువ శాతం మధ్యప్రదేశ్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. గత 30 ఏళ్లలో అరుణాచల్‌ప్రదేశ్ అత్యధికంగా 3,338 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని ప్రాజెక్టులకు కట్టబెట్టింది. మధ్యప్రదేశ్ 2,477 చ.కి.మీ., ఆంధ్రప్రదేశ్ 1,079 చ.కి.మీ. అప్పగించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జమ్మూకశ్మీర్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ అతి తక్కువ కేటాయింపులు జరిపాయని తేలింది. అటవీ భూముల్లో అత్యధికంగా 4,330 ప్రాజెక్టులను ఉత్తరాఖండ్ చేపట్టగా.. పంజాబ్ 3,250, హరియాణాలో 2,561 ప్రాజెక్టులను చేపట్టారు. -
సీటు వదలడు.. దందా ఆగదు
- అమాత్యుల అండ ఉందంటూ ఐదేళ్లుగా గనులశాఖలో తిష్ట - పైస్థాయి అధికారులతో సంప్రదింపులు...కిందిస్థాయి సిబ్బందికి వేధింపులు - పరిశీలించే బాధ్యతలుండటంతో లీజ్ హోల్డర్లనూ వదలని వైనం - దందా సాగిస్తూ రూ.కోట్ల కొద్ది ఆస్తులు కూడబెట్టిన వైనం అయిన వారంతా అమాత్యులంటాడు...ఉద్యోగ సంఘానికి నాయకుడని చెబుతాడు.. నిబంధనలేవీ తనకు వర్తించవంటూ ఐదేళ్లుగా గనులశాఖ కార్యాలయంలో సీటుకు పెవికాల్ వేసుకుని మరీ అతుక్కుపోయాడు. పలుకుబడి తనదైనప్పుడు..పెత్తనం కూడా తనదేనంటూ ఉన్నతాధికారులను ఘీంకరిస్తూ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న ఓ అధికారి పెత్తనం ఆ శాఖ కార్యాలయంలో చర్చనీయంశంగా మారింది. చిన్న తప్పులకే మెమోలు జారీ చేసి చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు.. ఈ అధికారిని మాత్రం ఉపేక్షిస్తున్నారు.. అయితే ఈయన చర్యలతో విసిగి వేసారిన ఎందరో పై స్థాయి అధికారులు కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): తన బంధువులు రాష్ట్ర అమాత్యులని..తనను ఎవ్వరూ ఏమి చేయలేరంటూ ఓ అధికారి ఐదేళ్లుగా తన శాఖలో దందా సాగిస్తున్నాడు. గనుల అనుమతులు..ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన పత్రాల పరిశీలన అనంతరం ప్రతిపాదించే బాధ్యతలుండడంతో ఆడిందే ఆట..పాడిందే పాటగా ఆయన హవా సాగుతోంది. ఎవ్వరైనా గనులకు సంబంధించి అనుమతి కోసం వస్తే వారి ఫైలు కదిలేందుకు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. అదే కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులు బదిలీపై వెళ్లిపోయినప్పటికీ ఈయనగారు కుర్చీని వదల్లేదు. ఈ అధికారి వ్యవహార తీరుపై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన పాపానికి ఇక్కడి అధికారులు బదిలీలకు బలైపోయారు తప్ప ఆయనమీ కాలేదంటే హవా అర్థం చేసుకోవచ్చు. ఈయన దందాను చూసి కింది స్థాయి సిబ్బంది కూడా నోరు మెదపకుండా చెప్పిన హుకుంను తూచా తప్పకుండా పాటిస్తూ బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్నతంత వరకు తనను ఎవ్వరూ బదిలీ చేయలేరని ధీమాగా చెబుతుండటంతో తోటి ఉద్యోగులు మిన్నుకుండిపోతున్నారు. వేగుల ద్వారా పిటీషన్లు..ఆ పై అమ్యామ్యాలు..: జిల్లా వ్యాప్తంగా మైనింగ్ వ్యవహారాలపై, గనుల యజమానులపై డోన్ ప్రాంతంలోని ఇద్దరు వేగుల ద్వారా పిటీషన్లను వేయిస్తాడు. వాటిని స్వీకరించిన అధికారులు విచారణకు ఆదేశిస్తారు. దీన్ని అదనుగా చేసుకుని అనుమతులకు సంబంధించి రికార్డులు సైతం సక్రమంగా ఉన్నప్పటికీ సదరు గనుల యజమానులపై తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తాడు. విచారణ సారాంశం నివేదికను ఈయనే నివేదించాల్సి రావడంతో పై అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా గనుల యజమానులు ఆ అధికారికి లక్షలాది రూపాయలు ముట్టజెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొందని పలువురు గనుల యజమానులు వాపోతున్నారు. అడ్డూ అదుపు లేని దందా.. సదరు అధికారి దందా ద్వారా కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు ఆరోపణలున్నాయి. ఉలిందకొండ సరిహద్దులో రూ.2కోట్ల విలువ చేసే పన్నెండెకరాల భూమిని ఇటీవలే బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతపురం - బెంగళూరు జాతీయ రహదారిపై కూడా రూ. కోటి విలువైన ఎకరా భూమి, సీక్యాంపు, మిలిటరీ కాలనీలో రూ. 70లక్షల విలువైన భవంతులున్నట్లు సమాచారం. టన్నుకు రూ.5 చెల్లించాల్సిందే.. వివిధ పిటీషన్లను ఆధారంగా చేసుకుని ద్వారా యజమానులను వేధిస్తున్న సదరు అధికారి వారి నుంచి రాయల్టీ రూపంలో భారీగా గుంజుతున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రానైట్ క్యూబిక్ మీటర్‌కు రూ.10, లైన్‌స్టోన్, ఇతర వాటికిటన్నుకు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా కమీషన్ కింద నెలకు లక్షలాది రూపాయలు ఖాతాలో వేసుకుంటున్నాడు. ఏడీలతో వివాదాలు..: గతంలో ఇదే కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉన్నతాధికారులు ఈయన బెడద తట్టుకోలేక సర్వోన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. జరిగిన తంతుపై అవినీతి నిరోధకశాఖ అధికారులకూ ఉప్పందించారు. ఫలితం లేకపోవడం విస్మయాన్ని కల్గిస్తోందని పలువురు గనుల యజమానులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇక్కడే కొనసాగాలని నిర్ణయం.. ఐదేళ్లుగా గనులశాఖ కార్యాలయంలో సీటుకు అతుక్కుపోయిన ఈయన గారు మరో రెండేళ్లు ఇక్కడే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. నిబంధనల మేరకు ఈయనకు స్థానచలనం తప్పదని భావించినా ఇటీవలే జరిగిన సాధారణ బదిలీల్లో పైస్థానంలో ఉన్న ఏడీలు మారిపోయారు తప్ప ఈయన సీటుకు డోకా లేకుండా పోయింది. దీంతో మరో రెండేళ్లు ఇక్కడే విధులు నిర్వర్తించి సర్వోన్నత కార్యాలయంలో స్థానం కోసం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. ఇదే భవిష్యత్తులో జరిగితే రెండు జిల్లాల గనులయజమానులు, కార్యాలయాల సిబ్బందికి ఈయన గారి వేధింపులు తప్పవన్న వాదన ఉంది. -
ఇష్టారాజ్యం
► గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా ► నెలకు రూ.25 లక్షల విలువజేసే ఇసుక తరలింపు ► సూత్రధారులు అధికార పార్టీ నాయకులే మైనింగ్ అక్రమాలకు మాంబట్టు అడ్డాగా మారింది. అధికారపార్టీ నాయకులు కొందరు తడ మండల పరిధితోపాటు చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, అటవీ భూములు, పాములకాలువలో లభించే గ్రావెల్, ఇసుక, మట్టిని ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. ఇసుక, గ్రావెల్‌ను స్థానిక పరిశ్రమలు, లేఔట్లతోపాటు తమిళనాడుకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తడ(సూళ్లూరుపేట): పరిశ్రమల సాకును చూపుతూ అధికారపార్టీ నాయకులు కొందరు గ్రావెల్, ఇసుకను చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో నిల్వ చేసి అనుకూలమైన సమయంలో తమిళనాడుకు తరలిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు తెలిసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా సమాచారం వచ్చిన వెంటనే సదరు స్మగ్లర్లకు ఉప్పందించి తరువాత దాడులకు వెళుతున్నారు. ఈ విషయం తెలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇటీవల ఇసుక నిల్వలపై దాడులు నిర్వహించి అధికారులకు అప్పగించారు. రోజుకు 30 నుంచి 50 ట్రాక్టర్ల ఇసుక తరలింపు మాంబట్టు పరిధిలో పాముల కాలువ ఇసుక, పొలాల్లో లభించే దువ్వ ఇసుకను రోజుకు సుమారు 30 నుంచి 50 ట్రాక్టర్ల వరకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక కొనుగోలుదారుల అవసరాన్ని బట్టి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు రూ.లక్ష వరకు వ్యాపారం సాగుతోంది. నెలకు ఎంత లేదన్నా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. జేసీబీల సాయంతో ఇసుకను ట్రాక్టర్లకు నింపి తరలిస్తున్నారు. గ్రావెల్‌కు సంబంధించి అవసరాన్ని బట్టి ఒక యూనిట్ రూ.400 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది. టిప్పర్ల ద్వారా నాలుగు లేదా ఐదు యూనిట్లు సరిపోయే గ్రావెల్‌ను తరలిస్తారు. ఈ లెక్కన టిప్పర్ గ్రావెల్ రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. నెలకు రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. కలిసి వస్తున్న సరిహద్దు మాంబట్టు పంచాయతీలోని మాంబట్టు, ఎన్‌ఎంకండ్రిగ గ్రామాలు నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉండటంతో ఇక్కడి స్మగ్లర్లకు వరంలా మారింది. ఈ ప్రాంతంలో నాణ్యమైన గ్రావెల్ విస్తారంగా ఉంది. అదే విధంగా గ్రామం ఎగువన ప్రవహించే పాముల కాలువలో ఇసుక పుష్కలంగా ఉంది. మాంబట్టు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నాయకులు తమ అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని వారి ట్రాక్టర్ల ద్వారానే జేసీబీ సాయంతో కాలువల్లో ఇసుక, చెరువుల్లో మట్టి, అటవీ, ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్‌ను కొల్లగొడుతున్నారు. వీరు రాత్రిళ్లు ఇసుకను పాముల కాలువ నుంచి తరలించి కొంత చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండల పరిధిలో, మరి కొంత నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉంచుతారు. సమయానుకూలంగా దానిని తమిళనాడుకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా అధికారులు దీనిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. నెల్లూరు జిల్లా అధికారులు వచ్చిన సమయంలో తమకు ముందుగానే అందుతున్న సమాచారంతో స్మగ్లర్లు జాగ్రత్త పడుతున్నారు. అలా కాకుండా వనరులు మన రాష్ట్రానికి చెందినవే కాబట్టి రెండు జిల్లాల అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తే ఫలితం వేరుగా ఉంటుందనేది స్థానికుల అభిప్రాయం. సహకరిస్తున్న పరిశ్రమల సిబ్బంది ఈ స్మగ్లింగ్‌కు అధికారపార్టీ నాయకులదే పెత్తనం కావడంతో తమ పరిశ్రమకు ఇబ్బం ది లేకుండా ఫ్యాక్టరీల నిర్వాహకులు వీరికి కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారు. పరిశ్రమల్లో కీలక స్థానాల్లో ఉండే వ్యక్తులు వీరికి టెండర్లు కట్టబెట్టి, తమ స్వార్థం చూసుకునేకన్నా ఓపెన్ టెండర్ పిలిస్తే మరింత తక్కువ ధరకు సరుకు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా చేసే ఇలాంటి స్మగ్లింగ్ వ్యాపారాన్ని పరిశ్రమల వారు ప్రోత్సహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిల్వలు ఉంటే చర్యలు తీసుకుంటాం అనుమతి పొందిన రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తరలించాలి. అలా కాకుండా ఎక్కడపడితే అక్కడ ఇసుక తీయడం, నిల్వ చేయడం, అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఉంటే నాకు లేదా పోలీసులకు గాని సమాచారం అందించాలి. –ఏడుకొండలు, తహసీల్దార్ -
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
సాక్షి, గుంటూరు: కొండపై కార్మెల్ మాత ఆలయం... కొండ పక్కనే ఎస్టీ కాలనీ... ఎదురుగా బాలయేసు కేథడ్రల్ చర్చి, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్.. ఆ పక్కనే గుంటూరు–కర్నూలు ప్రధాన రహదారి. ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో క్వారీయింగ్‌కు మైనింగ్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఫిరంగిపురంలో క్వారీయింగ్, బ్లాస్టింగ్ల వల్ల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని 2016 డిసెంబర్ 18వ తేదీన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. (ఫిరంగిపురంలో క్వారీయింగ్‌తో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని 2016 డిసెంబర్ 18వ తేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనం) అప్పట్లో ఈ కథనంపై అధికార పార్టీ నేతలు అక్కసు వెళ్లగక్కారు. ఫిరంగిపురంలో క్వారీని నిలిపివేయాలంటూ స్థానికులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇదే కొండచుట్టూ మొత్తం 12 క్వారీలకు మైనింగ్ అనుమతులు ఇచ్చారు. 24 గంటలూ యథేచ్ఛగా ఇక్కడ బ్లాస్టింగ్లు, తవ్వకాలు జరుగుతున్నాయి. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఫిరంగిపురం వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. -
పూడికతీత పేరుతో మైనింగ్
► తెలంగాణలో అనుమతుల కంటే లోతుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు ► ఎన్జీటీకి నివేదించిన సీపీసీబీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో జరుపుతున్న ఇసుక తవ్వకాలు పూర్తిగా మైనింగ్ కిందికే వస్తుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో సీపీసీబీ సమర్పించిన నివేదిక అసమగ్రంగా ఉండటంతో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం అదనపు నివేదికను సమర్పించిన సీపీసీబీ ప్రభుత్వ ఉల్లంఘనలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో ఇసుక మేటలు మూడు మీటర్ల వరకు ఉంటే.. ఇసుక తవ్వకాలకు కూడా మూడు మీటర్ల వరకు అనుమతులిచ్చారని పేర్కొంది. దిగువ మానేరు డ్యాంలో ఒక మీటరు లోతు తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా దానికి విరుద్ధంగా 3.8 మీటర్ల వరకు తవ్వకాలు చేపట్టారని పేర్కొంది. స్థిరమైన ఇసుక తవ్వకాల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాలు జరిపే ముందు... ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతపై అధ్యయనం జరిపించాలి. కానీ తెలంగాణలో ఈ నిబంధనలను పాటించకుండా ఇసుక తవ్వకాలను చేపడుతూ ఆన్లైన్లో అమ్ముకుంటున్నారని పేర్కొంది. గతంలో పూడికతీతకు, డ్రెజ్జింగ్కు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని లోక్‌సభలో కేంద్ర మంత్రి సమాధానం చెప్పారని, అయితే పూడికతీత పేరుతో ఇసుకను తవ్వేసి అమ్ముకుంటున్న నేపథ్యంలో ఇది మైనింగ్ కిందికే వస్తుందని పేర్కొంది. మీ సమాధానం చెప్పండి.. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ జావేద్ రహీమ్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ మంగళవారం విచారించింది. సీపీసీబీ ఇచ్చిన నివేదికపై సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. -
రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా
కర్నూలు(హాస్పిటల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్ఎల్ మైనింగ్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ఈ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాలలోపు వయస్సుగల వారు, ఐటీఐ(ఫిట్టర్ట్రేడ్) చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు బేతంచర్ల మండలం వీరయపల్లి గ్రామంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీరికి రూ.8,700 నుంచి రూ.9వేల వరకు జీతం ఇస్తామన్నారు. -
ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ తనిఖీలు
- ముందే లీక్ చేసిన అధికారులు విజయవాడ: కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఎన్జీటీ బృందం పర్యటనను మైనింగ్ అధికారులు ముందే ఇసుక మాఫియాకు లీక్ చేశారు. దీంతో అనధికారికంగా ఇసుక తవ్వకాలకు వాడుతున్న భారీ యంత్రాలను ఇసుక మాఫియా సూరాయపాలెం, గుంటుపల్లి రేవుల నుంచి తరలించింది. యంత్రాల తరలింపుతో అన్ని రేవుల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.