సాక్షి, అమరావతి: కొండపల్లి మైనింగ్, మేజర్ కాల్వలు పూడికపై దాఖలైన పిటిషన్లపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు. ఇబ్రహీంపట్నంలోని మేజర్ కెనాల్ 19 నుంచి 24 కిలోమీటర్ల వరకు స్టోన్ క్రషర్ కంపెనీలు రోడ్డు వేసుకున్నాయి.. 17 చోట్ల కెనాల్‌ని పూడ్చేశాయి అని తెలిపారు. కెనాల్ పక్కన కొన్ని చోట్ల అక్రమంగా ఇల్లు ఏర్పాటు చేసుకున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. (చదవండి: బెంజ్ సర్కిల్ ‘ఫ్లై ఓవర్ల’ వివాదానికి తెర)
స్టోన్ క్రషర్ కంపెనీ పూడ్చేసిన 17 చోట్ల కెనాల్ పూడిక తీశాం. రిజర్వు ఫారెస్ట్‌కి 10 మీటర్లు లోపలే మైనింగ్ జరుగుతుంది. మైనింగ్‌కు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఫొటోలు కూడా ఉన్నాయని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment