Kondapalli
-
కొండపల్లి బొమ్మ.. కోటకట్టి కూచుందమ్మా!
కొండపల్లి కొయ్య బొమ్మ ఒక్కసారి మన ఇంట్లోని షోకేస్‌లో చేరిందంటే.. ఎన్ని తరాలైనా అక్కడే కోటకట్టుకుని కూచుండిపోతుంది. అమ్మకు చిన్నప్పుడు జాతరలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి.. అబ్బాయి’ బొమ్మ నుంచి మొదలై.. అన్నయ్య ముచ్చటపడి కొనిపించుకున్న ఎడ్లబండి బొమ్మ.. అక్క కొనుక్కున్న తలాడించే బుట్ట»ొమ్మ.. నాన్నమ్మ భక్తిభావంతో కొనుక్కొచ్చిన దశావతారాల బొమ్మ ఒకదాని పక్కన మరొకటి చేరిపోతుంటాయి. ఎంతకాలమైనా చెక్కుచెదరకుండా తమ అందాలతో అలరిస్తుంటాయి. సాక్షి, అమరావతి: కొండపల్లి కొయ్య బొమ్మలు పురాణాల నేపథ్యం.. గ్రామీణ జీవితం.. జంతువుల రూపంలో సంతోషకరమైన వాస్తవిక వ్యక్తీకరణలను ప్రదర్శిస్తాయి. మెత్తటి కలప.. గింజలు.. పండ్ల తొక్కల నుంచి తీసిన రంగులతో ఆ బొమ్మలు అందాలను అద్దుకుంటాయి. పిల్లలు ఆడుకుంటూ ఆ బొమ్మల్ని ఒకరిపై ఒకరు విసురుకున్నా దెబ్బలు తగలవు. చంటి పిల్లలు ఆ బొమ్మల్ని నోట్లో పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగదు. వీటినే కొండపల్లి కొయ్య బొమ్మలంటారు.ఇప్పుడు ఈ బొమ్మలు కూడా ఆన్లైన్ మెట్లెక్కి అదుర్స్ అనిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఏటా రూ.3 కోట్ల విలువైన కొండపల్లి బొమ్మల విక్రయాలు జరుగుతుండగా.. ఆన్లైన్ మార్కెట్లోనూ అమ్మకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఈ–కామర్స్ సంస్థలు ఏటా రూ.15 లక్షల విలువైన బొమ్మల్ని ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నాయి. వీటి ధర కనిష్టంగా రూ.70 నుంచి గరిష్టంగా రూ.5 వేల వరకు పలుకుతున్నాయి. భౌగోళిక గుర్తింపు(జీఐ)ను పొందిన కొండపల్లి బొమ్మల ఖ్యాతి దేశవ్యాప్తమైంది. విజయవాడ సమీపంలోని కొండపల్లిలో ఇప్పటికీ దాదాపు 200 మంది హస్తకళాకారులకు ఇదే జీవనాధారం. రాజస్థాన్ నుంచి వలస వచ్చి.. రాజస్థాన్ నుంచి 400 ఏళ్ల క్రితం సంప్రదాయ హస్త కళాకారులు కొండపల్లికి వలస వచ్చారు. అక్కడే స్థిరపడిన వారిని ఆర్యకుల క్షత్రియులుగా పిలుస్తారు. వీరు మొదట్లో అనేక ఆలయాల్లో గరుడ, నంది, సింహ వాహనాల వంటి విగ్రహాలను చెక్కినట్టు చెప్తారు. కాలక్రమంలో కొయ్య బొమ్మలు, ఆట బొమ్మలు, అలంకరణ బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టారని చెబుతారు. అతి తేలికైన తెల్ల పొణికి చెక్కలను సేకరించి వివిధ ఆకృతుల్లో బొమ్మల తయారీని వారు జీవనోపాధిగా ఎంచుకున్నారు. తెల్ల పొణికి కర్రను చెక్కి దానికి ప్రత్యేకంగా తయారు చేసిన నిమ్మ జిగురు పూతతో చింతపండు గింజలు, ఇతర చిన్నపాటి వస్తువులను అతికి బొమ్మల్ని రూపుదిద్దుతారు. వాటికి కూరగాయల నుంచి సేకరించిన సహజ సిద్ధౖమెన రంగులు, పొడి రంగులు, ఆయిల్ పెయింట్లు అద్దుతారు. ఆ బొమ్మల జుట్టుగా మేక వెంట్రుకలను అతికించి తీర్చిదిద్దుతారు.గ్రామీణ వాతావరణం.. స్పష్టమైన వ్యక్తీకరణం కొండపల్లిలో తయారు చేసే బొమ్మలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు గ్రామీణ వాతావరణానికి అద్దం పడతాయి. జంతువుల నుంచి మనుషుల బొమ్మల వరకు ప్రతీ దాని మొహంలోనూ స్పష్టమైన వ్యక్తీకరణ తొణికిసలాడుతుంది. జంతువులు, వృత్తులు, రోజువారీ మనిషి జీవితం నుంచి పౌరాణిక పాత్రలు సైతం వీరి చేతిలో ఆకృతి దాల్చుతాయి. దశావతారాలకు ప్రాచుర్యం కళాత్మకమైన పనితనానికి కొండపల్లి కొయ్య బొమ్మలు గుర్తింపు పొందాయి. తాడిచెట్టు, ఎడ్లబండి, అంబారీ ఏనుగు, గ్రామీణ నేపథ్యంలోని బొమ్మలు, బృందావనం బొమ్మలకు భలే క్రేజ్ ఉంటుంది. వీరు తయారు చేసిన బొమ్మల్లో దశావతారాల బొమ్మలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. గీతోపదేశం, పెళ్లికూతురు–పెళ్లికొడుకును మోస్తూ వెళ్తున్న పల్లకీ–బోయీలు, గ్రామాల్లోని చేతివృత్తుల వాళ్ళ సెట్, జంతువుల బొమ్మలకు డిమాండ్ ఉంది. తల ఊపుతూండే అమ్మాయి, అబ్బాయి, బ్రాహ్మణుడు వంటివి చాలామందికి ఇష్టమైన కొండపల్లి బొమ్మలు. -
కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం
‘కొండపల్లి కొయ్యబొమ్మ... కోటగట్టి కూచుందమ్మ...’ అని పాడుకోవడానికే కాదు.. కొండపల్లి బొమ్మ పాటకు తగ్గట్టే తరతరాలకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది కూడా. అమ్మకు చిన్నప్పుడు తిరునాళ్లలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి– అబ్బాయి’ బొమ్మ ఉంటుంది. అన్నయ్య కొనిపించుకున్న ఎడ్లబండి అదే షెల్ఫ్‌లో చోటు చేసుకుంటుంది. నానమ్మ ముచ్చటపడి తెచ్చుకున్న దశావతారాల బొమ్మ ఉండనే ఉంటుంది. కొండపల్లి బొమ్మ ఒకసారి ఇంట్లో షోకేస్‌లోకి వచ్చిందంటే ఇక తరాలు మారినా ఆ బొమ్మ చెక్కు చెదరదు. బొమ్మ చెక్కు చెదరదు... కానీ ఇటీవల బొమ్మలు చేసే వాళ్లు కనుమరుగైపోతున్నారు. వందలాది కుటుంబాలు ఈ కళను కొనసాగించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయాయి. ఈ దశలో కళను బతికించుకోవడానికి, కళతోనే తమ బతుకును నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు మహిళలు. బావుదరి పట్టారు! నలభై ఏళ్ల కిందట కొండపల్లి కళాకారుల చేతిలో 84 రకాల కళాఖండాలు రూపుదిద్దుకునేవి. ఇప్పుడా సంఖ్య ఐదారుకు మించడం లేదు. ఈ కళ మీద ఆధారపడి ఉపాధి పొందే పరిస్థితులు సన్నగిల్లడంతో ఈ తరం యువకులు ఎవరూ ముందుకు రావడం లేదు. కళ అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదనే పరిస్థితి పదేళ్ల కిందటే మొదలైంది. ఈ దశలో మహిళలు ముందుకు వచ్చారు. ఇంతవరకు మగవాళ్లు బొమ్మలు చేస్తుంటే, మహిళలు ఆ బొమ్మలకు రంగులు వేయడం, ప్యాకింగ్ వంటి సహాయక బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మహిళలే కలప కొట్టడం, రంపంతో కోసి చిన్న దిమ్మలు చేయడం, ఆ దిమ్మలను కుంపటి మీద ఆరబెట్టడం నుంచి బొమ్మను చెక్కి రంగులు వేయడం వరకు అన్ని పనులూ చేస్తున్నారు. ‘ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే మెటీరియల్ మొత్తం సహజమైనదే. చెట్ల బెరళ్లు, కాయల పై తొక్కలు, గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. ఈ కలప మెత్తగా ఉంటుంది. కాబట్టి పిల్లలు నోట్లో పెట్టుకున్నా, ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. కాబట్టి స్కూల్ కిట్ల కోసం ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ రావచ్చ’ని ఆశాభావం వ్యక్తం చేశారు అభిహార స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు సుధారాణి. అంతర్జాతీయ వేదికల మీద మన కొండపల్లి బొమ్మలు కనిపించాలనేది ఆమె ఆకాంక్ష. ఇన్నాళ్లూ బావుదరికి దూరంగా ఉన్న మహిళలు ఇప్పుడు తమ కెరీర్‌ని స్వయంగా చెక్కుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి కార్లలో వేళ్లాడే నారింజ రంగు హనుమాన్ బొమ్మ మీద పడింది. కొండపల్లి హనుమాన్ రూపకల్పనలో మునిగిపోయారు. కార్లలో షోపీస్‌లుగా కొండపల్లి బొమ్మలు కనిపించే రోజు ఎంతో దూరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మేమే చెక్కుతున్నాం! నేను ముప్పై ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పనులూ నేర్చుకున్నాను. కలపను ముక్కలు చేయడం, ఆరబెట్టడం వంటివి పది బొమ్మలకు సరిపడిన మెటీరియల్ ఒకేసారి సిద్ధం చేసుకుంటాం. ఆకారాలు చెక్కడం రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఈ బొమ్మల్లో మనిషి దేహం చెక్కేటప్పుడు పాదాల నుంచి తల వరకు ఒకే ముక్కలో చెక్కుతాం. చేతులను విడిగా చెక్కి అతికిస్తాం. ఆ తర్వాత తల మీద కిరీటం వంటి అలంకరణ చేసి రంగులు వేస్తాం. అడుగు ఎత్తున్న బొమ్మల జత ధర నాలుగు నుంచి ఆరువేలవుతుంది. మొదట్లో మేము లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్‌కి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అభిహార సంస్థ వాళ్లు మాకు మరికొన్ని కొత్త వస్తువులు చేయడంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. మేము చేసిన బొమ్మలను మార్కెట్ చేయడానికి వాళ్లకే ఇస్తున్నాం. ఇప్పుడు రోజూ పని ఉంటోంది. కొండపల్లి బొమ్మ చేయడానికి తెల్ల పొణికి చెక్క వాడతాం. ఎన్నేళ్లయినా ఈ చెక్కలో పగుళ్లు రావు. అందుకే బొమ్మలు కలకాలం అంత అందంగా ఉంటాయి. – చందూరి స్వరాజ్యం, కొండపల్లి బొమ్మల కళాకారిణి ‘చెక్క’ని విప్లవం కొండపల్లి బొమ్మల తయారీలో మహిళల శ్రమ చిన్నది కాదు. కానీ ఆ శ్రమ ప్రధాన బొమ్మ తయారీ కాకపోవడంతో వాళ్లకు ఆర్టిజాన్ గుర్తింపు కార్డు వచ్చేది కాదు. నాలుగు నెలల శిక్షణలో ఇప్పుడు మహిళలు ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా బొమ్మ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళలు కూడా హక్కుగా ఆర్టిజాన్ కార్డు పొందవచ్చు. ఇప్పటి వరకు మహిళలకు కళాకారులుగా గుర్తింపు లేకపోవడంతో కళాఖండాల ప్రదర్శన, కళాకారుల అవార్డుల విషయంలో మహిళలు కనిపించేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ మహిళలు ఆ పరిధిని చెరిపివేశారు. – సుధారాణి, అభిహార సంస్థ నిర్వహకురాలు బొమ్మల బడి! కొండపల్లి బొమ్మలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ కళాకారుల చేతిలో చెక్క చక్కని బొమ్మగా ఎంత లాలిత్యంగా రూపుదిద్దుకుంటుందో వర్ణించడం సాధ్యం కాదు. ఇంత గొప్ప కళ అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ కళ తరతరాలకు అందాలి, ఈ కళాకారులు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అందుకే మాకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాం. స్కూల్ కిట్‌కు ఐడియా ఇచ్చాం. ఆ కిట్‌లో తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాల ఉంటాయి. అలాగే పిల్లలు లాయర్, టీచర్, డాక్టర్, రైతు, జాలరి వంటి వృత్తులను తెలుసుకోవడానికి వీలుగా ఆ బొమ్మలు చేయించాం. ఆఫీస్‌లో ఉపయోగించే ట్రే, పెన్ స్టాండ్, ఇళ్లలో ఉపయోగించే వస్తువులను కూడా ఈ మెటీరియల్‌తో చేయవచ్చు. ఇలాంటి మార్పును స్వాగతిస్తే కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఈ కళాకారుల కోసం బీటూబీ మీటింగ్ వంటి మార్కెట్ వేదికల గురించి ఆలోచిస్తున్నాం. – విజయశారదారెడ్డి, వైస్ చైర్పర్సన్, ఏపీఎస్‌ఈఆర్‌ఎమ్‌సీ కొండపల్లి కృష్ణుడు నేను చేసిన తొలి బొమ్మ గోపికల మధ్య కృష్ణుడు. బావుదరి మీద పట్టు రావడానికి నెల రోజులు పట్టింది. అది వస్తే ఇక బొమ్మలు చేయడం ఏ మాత్రం కష్టం కాదు. మా బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి కావస్తోంది. తర్వాత బ్యాచ్‌కి మరో పది మంది సిద్ధంగా ఉన్నారు. – పద్మావతి వెన్నవల్లి, శిక్షణలో ఉన్న విద్యార్థి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎ. బాబు, సాక్షి, ఇబ్రహీంపట్నం -
‘కొండపల్లి’ ఎన్నిక కేసులో నాటకీయ పరిణామాలు
సాక్షి, అమరావతి: కొండపల్లి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై విచారణ సందర్భంగా హైకోర్టులో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌తోపాటు ఎక్స్–అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు కోసం దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ తప్పుకొన్నారు. ఈ వ్యాజ్యాల్లో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన కొందరు కౌన్సిలర్ల తరఫు న్యాయవాది చాపర్ల సీతారాం.. విచారణకు అవాంతరం కలిగిస్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తుండటంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈ వ్యాజ్యాలను తాను విచారించబోనని, వాటిని మరో బెంచ్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ వ్యాజ్యాల రికార్డులన్నింటినీ సీజే ముందు ఉంచాలంటూ ఉత్తర్వులిచ్చారు. మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను ఎన్నికల అధికారి పదేపదే వాయిదా వేస్తున్నారని, ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీడీపీ కౌన్సిలర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికిముందు ఎక్స్– అఫీషి యో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తనకు అనుమతివ్వాలంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని పిటిషన్ వేశారు. ఇవి పెండింగ్‌లో ఉండగానే, ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలంటూ కొందరు కౌన్సిలర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. వీటి విచారణార్హతపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ వ్యాజ్యాలకు విచారణార్హత ఉందంటూ టీడీపీ నేతల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారు. న్యాయవాది తీరుపై జస్టిస్ అసహనం పిటిషన్ల విచారణార్హతపై జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ పలు సందేహాలు లేవనెత్తారు. దీనిపై టీడీపీ నేతల తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వివరణ ఇస్తుండగానే, ఇంప్లీడ్ అయిన కౌన్సిలర్ల తరఫు న్యాయవాది చాపర్ల సీతారాం కూడా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఆయనను వారించగా.. సీతారాం మాత్రం వాదనలు కొనసాగించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో న్యాయమూర్తి మరోసారి ఆయనను వారించినా సీతారాం వాదనలు వినిపించేందుకు ప్రయత్నించడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
కొండపల్లిలో దేవినేని ఉమా ఓవరాక్షన్..
Updates ►కొండపల్లిలో చైర్మన్, ఇద్దరి వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యింది. సీల్డ్ కవర్లో ఎన్నిక వివరాలను ప్రిసైడింగ్ అధికారి హైకోర్టుకి నివేదించనున్నారు. ఎన్నికలపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ ఎంపీ కేశినేని ఓటుపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలిపింది. అన్నీ పరిశీలించి ఫలితాన్ని ప్రకటిస్తామని హైకోర్టు పేర్కొంది. ►కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. కొండపల్లిలో దేవినేని ఉమా ఓవరాక్షన్ చేశారు. ఓటు హక్కులేకపోయినా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అసిస్టెంట్ ఎన్నికల అధికారికి అనుమతినివ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ఆదేశించింది. అయితే ఎన్నిక ఫలితాన్ని మాత్రం వెల్లడించవద్దని న్యాయస్థానం నిర్దేశించింది. ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో విజయవాడ ఎంపీ వినియోగించుకునే ఓటు ఈ వ్యవహారంలో కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేసి పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. టీడీపీ వార్డు సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసు కమిషనర్ (ఇన్చార్జ్) జి.పాలరాజుకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నిక నిర్వహణకు ఆదేశాలు ఇవ్వండి... కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి తదుపరి ఎలాంటి వాయిదాలకు ఆస్కారం లేకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీ వార్డు సభ్యులు, ఎంపీ కేశినేని నాని, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కె.శ్రీలక్ష్మి అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ ‘కోరం’ ఉన్నప్పటికీ దురుద్దేశపూర్వకంగా ఎన్నికను వాయిదా వేస్తున్నారని నివేదించారు. సభ్యులందరికీ ముందస్తు నోటీసు తప్పనిసరి విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించరా? అంటూ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుంటే పోలీసుల సాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు విజయవాడ ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ పాలరాజు, అసిస్టెంట్ ఎన్నికల అధికారి శివనారాయణరెడ్డి మధ్యాహ్నం స్వయంగా కోర్టు ఎదుట హాజరయ్యారు. ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేనందున వాయిదా వేసినట్లు శివనారాయణరెడ్డి తెలిపారు. సమస్యను స్థానిక పోలీసుల దృష్టికి తెచ్చామన్నారు. ‘ఇలా ఎంత కాలం? రేపు కూడా అడ్డుకుంటే మళ్లీ వాయిదా వేస్తారా? అడ్డుకున్న వారిపై ఏ చర్యలు తీసుకున్నారు?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీ కేశినేని నానికి అనుమతినిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఉండేందుకే ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘పోలీసుల సాయంతో ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4.30 గంటలకు ఎన్నిక నిర్వహించండి. అడ్డొచ్చిన వారిని అరెస్ట్ చేయండి. బుధవారం ఉదయం కల్లా పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి’ అని తొలుత న్యాయమూర్తి మౌఖికంగా స్పష్టం చేశారు. ఈ సమయంలో అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ సభ్యులందరికీ ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరని, ఇందుకు కొంత సమయం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో బుధవారం ఎన్నిక నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీ కేశినేని నాని వినియోగించుకునే ఓటు హక్కు ఈ వ్యాజ్యాల్లో కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని సుధాకర్‌రెడ్డి పట్టుబట్టడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ విషయాన్ని ఆదేశాల్లో ప్రస్తావించారు. ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం కొండపల్లి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
కొండపల్లి మైనింగ్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: కొండపల్లి మైనింగ్, మేజర్ కాల్వలు పూడికపై దాఖలైన పిటిషన్లపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు. ఇబ్రహీంపట్నంలోని మేజర్ కెనాల్ 19 నుంచి 24 కిలోమీటర్ల వరకు స్టోన్ క్రషర్ కంపెనీలు రోడ్డు వేసుకున్నాయి.. 17 చోట్ల కెనాల్‌ని పూడ్చేశాయి అని తెలిపారు. కెనాల్ పక్కన కొన్ని చోట్ల అక్రమంగా ఇల్లు ఏర్పాటు చేసుకున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. (చదవండి: బెంజ్ సర్కిల్ ‘ఫ్లై ఓవర్ల’ వివాదానికి తెర) స్టోన్ క్రషర్ కంపెనీ పూడ్చేసిన 17 చోట్ల కెనాల్ పూడిక తీశాం. రిజర్వు ఫారెస్ట్‌కి 10 మీటర్లు లోపలే మైనింగ్ జరుగుతుంది. మైనింగ్‌కు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఫొటోలు కూడా ఉన్నాయని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. -
కొండపల్లి అటవీ ప్రాంతం.. శాటిలైట్ చిత్రాలను మా ముందుంచండి
సాక్షి, అమరావతి : కృష్ణాజిల్లా కొండపల్లి అటవీ భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రధాన కాలువను పూడ్చేసి, ఏకంగా దానిపై నుంచి రోడ్డువేసి, స్టోన్ క్రషర్ల నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులు.. అటవీ భూములను ఆక్రమించి అక్రమ మైనింగ్‌కు పాల్పడలేదంటే నమ్మాలా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాలువను ఆక్రమించిన మాట వాస్తవమేనని చెబుతున్న అధికారులు, అటవీ భూమి మాత్రం ఆక్రమణకు గురికాలేదని చెబుతున్న మాటలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని హైకోర్టు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకోవాలని భావిస్తున్నామని స్పష్టంచేసింది. ఇందులో భాగంగా కొండపల్లి అటవీ ప్రాంతం జియో కోఆర్డినేట్స్ సాయంతో శాటిలైట్ చిత్రాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కాలుష్య నియంత్రణ మండలికి, అటవీ భూమిలో విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది స్టోన్ క్రషర్ల యజమానులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్రమణలపై మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి పిల్... కృష్ణాజిల్లా పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కొండపల్లి రిజర్వ్ అటవీ భూములను ధ్వంసం చేస్తూ మైనింగ్ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కూడా ఆయన తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాలువ పూడ్చేసి రోడ్డేసేశారు ఈ సందర్భంగా పిటిషనర్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ స్పందిస్తూ.. ఈ కేసులో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వం గడువు కోరిందని తెలిపారు. ఈ సమయంలో అధికారుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, ప్రధాన పంట కాలువను పూడ్చేసిన మాట వాస్తవమేనని.. అక్కడ స్టోన్ క్రషర్లను నిర్మించుకుని రోడ్డు కూడా వేసుకున్నారని వివరించారు. 2018లోనే నోటీసులు జారీచేశామని, దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకుని చెబుతానని సుమన్ తెలిపారు. అధికారులు చెబుతున్న దాన్నిబట్టి అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాలేదన్నారు. మరోసారి ఆక్రమణలను పరిశీలించండి.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రధాన కాలువనే పూడ్చేసి దానిపై రోడ్డేసి నిర్మాణాలు చేసిన వాళ్లు అటవీ ప్రాంతాన్ని ఆక్రమించలేదంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించింది. ఆక్రమణలను మరోమారు పరిశీలించాలని.. జియో కోఆర్డినేట్ సాయంతో అటవీ ప్రాంతం శాటిలైట్ చిత్రాలను తీసి తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. -
Butterfly Park: కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌కు మణిమకుటం
వర్షాకాలం వచ్చిందంటే వాన జల్లులు, పిల్లకాలువల పరవళ్లతో పాటు పచ్చదనం వెల్లివిరుస్తుంది. అలాగే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఎగిరే పూలు.. అదేనండీ సీతాకోక చిలుకలు వర్ణాల మేళవింపుతో కనువిందు చేస్తాయి. వీటిని చూసి ఆనందపడని హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక సీతాకోక చిలుకను కనిపిస్తేనే తదేకంగా చూస్తూ ఉండిపోతాం.. అలాంటిది వందల సంఖ్యలో పలు రకాల సీతాకోక చిలుకలు రెక్కలు విప్పుతూ మన చుట్టూ తిరుగుతుంటే.. ఆ అనుభవం వర్ణనాతీతం. ఈ అద్భుతం కృష్ణా జిల్లాలో త్వరలోనే ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో సీతాకోకచిలుకల పార్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందిగామ: కృష్ణా జిల్లాలో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ దాదాపు 24 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో పలు రకాల వన్య ప్రాణులు జీవిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని మూలపాడు వద్ద 63 రకాల సీతాకోక చిలుక జాతులున్నట్లు గుర్తించిన అటవీ శాఖాధికారులు వీటి పరిరక్షణ, పునరుత్పత్తిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ ప్రాంతానికే మణిహారంగా నిలిచేలా సీతాకోక చిలుకల పార్క్ అభివృద్ధికి సర్కారు పూనుకుంది. కేవలం సీతాకోక చిలుకల జాతిని పరిరక్షించడమే కాకుండా పెద్ద పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అడుగడుగునా ఆకట్టుకునేలా...! 65వ నంబరు జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామం వద్ద నుంచి మూడు కిలోమీటర్లు లోపలకు వెళ్తే.. ఈ పార్క్‌ను చేరుకోవచ్చు. పార్క్‌కు వెళ్లే దారి ప్రారంభం నుంచి పార్క్ గేట్ వరకు సీతాకోక చిలుకల్లోని రకాలు, వాటి ప్రాముఖ్యతలు, ప్రకృతికి అవి చేసే మేలు, వాటి జాతులు... ఇలా అన్ని వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ ద్వారాన్ని తీర్చి దిద్దిన తీరు అమోఘం అని చెప్పక తప్పదు. అదేవిధంగా చిన్నారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సీతాకోక చిలుకల ఆకారంలోనే ఏర్పాటుచేసిన బల్లలు కూడా ఎంతో అందంగా కన్పిస్తాయి. చివరకు గార్డెనింగ్ కూడా సీతాకోక చిలుక ఆకారంలోనే ఏర్పాటుచేయడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సీతాకోక చిలుకల పరిరక్షణే ధ్యేయం.. ఈ ప్రాంతంలో ఉన్న 63 రకాల సీతాకోక చిలుకలను పరిరక్షించడమే ధ్యేయంగా అటవీ శాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా అవి ఎక్కువగా ఇష్టపడి మకరందాన్ని గ్రోలే పుష్ప జాతులను పెంచుతున్నారు. జూలై నుంచి అక్టోబర్ మాసాల్లో వర్షా కాలం సీజన్లో వీటి పునరుత్పత్తి జరుగుతుంది. అప్పటికి పార్క్‌ను సిద్ధం చేయాలని అటవీ శాఖాధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అతి పెద్ద సీతాకోక చిలుకల పార్క్‌గా ఇది నిలుస్తుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అదనపు ఆకర్షణగా ట్రెకింగ్.. ప్రస్తుతం ట్రెకింగ్‌కు మంచి క్రేజ్ ఉంది. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు చాలా మంది దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. సీతాకోక చిలుక పార్క్‌కు సమీపంలోనే ట్రెకింగ్ కూడా ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. మొత్తానికి అతి త్వరలోనే జిల్లా వాసులకు ఓ మంచి ఆహ్లాదకరమైన, రమణీయమైన పార్క్ అందుబాటులోకి రానుంది. జూ పార్క్ ఏర్పాటుకు సైతం ప్రయత్నాలు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ ఎంతో అందమైన ప్రాంతం. అందులో సీతాకోక చిలుకల పార్క్ ఏర్పాటుచేయడం ద్వారా మరింత శోభ సమకూరనుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో సీతాకోక చిలుకలు ప్రధాన భూమిక పోషిస్తాయి. అటువంటి వాటిని పరిరక్షించుకోవడంతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం ఈ పార్క్ ఉపయోగపడుతుంది. దీనికి అదనంగా మినీ జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు సైతం ప్రయత్నిస్తున్నాం. – బి.లెనిన్కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, కొండపల్లి సెక్షన్ -
అటవీ భూములు ధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఉన్న రక్షిత అటవీ భూముల్లో మైనింగ్ చేస్తూ, అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కృష్ణా జిల్లా, పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు కొండపల్లి అటవీ భూముల్లో మైనింగ్ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. -
కొండపల్లి ‘పోడుభూమి’ రణరంగం
సాక్షి, పెంచికల్పేట్: కొండపల్లి ‘పోడుభూమి’రణరంగమైంది. గిరిజనులకు, పోలీసులకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసులపైకి గిరిజన రైతులు, మహిళలు రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అటవీ భూముల్లో ప్లాంటేషన్ నిలిపివేయాలని, పోడు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత పాల్వాయి హరీశ్‌బాబు రెండురోజులుగా నిరవధిక దీక్ష చేపట్టారు. అర్ధరాత్రి దీక్షా శిబిరం వద్దకు జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.హరీశ్‌బాబుతోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి కొంగ సత్యనారాయణను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించడంతో మహిళలు, రైతులు తిరగబడి రాళ్ల దాడికి దిగారు. దీంతో కాగజ్‌నగర్ రూరల్ సీఐ, పెంచికల్పేట్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు హరీశ్‌బాబును రెబ్బెన వైపు వాహనంలో తరలించగా.. మరో పోలీసు అధికారుల బృందం కొండపల్లి మీదుగా పెంచికల్పేట్ చేరుకోవటానికి బయలుదేరింది. దీంతో కొండపల్లి పొలిమేర్లలో పోలీసుల వాహనాలను మహిళలు అడ్డుకున్నారు. హరీశ్‌బాబును విడిచిపెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం వేకువజాము 4 గంటల వరకూ పోలీసులను ఘెరావ్ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ అచ్చేశ్వర్రావు అదనపు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన మహిళా కానిస్టేబుల్స్ తిరుపతిబాయి, కోమలి రెబ్బెనలో పోలీసు వాహనాల అడ్డగింపు బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామం మీదుగా పోలీసులు హరీశ్‌బాబును తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు అదే రాత్రి 12 గంటల సమయంలో పెద్దసంఖ్యలో రోడ్డుకు అడ్డుగా నిలిచారు. పోలీసు వాహనాలను ఆపేసి టైర్లలో గాలిని తీసేశారు. వాహనంలో ఉన్న హరీశ్‌బాబును తీసుకునివెళ్లారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారని, మహిళల కళ్లలో కారం చల్లి ఇష్టారీతిన వ్యవహరించారని హరీశ్‌బాబు విమర్శించారు. పలువురిపై కేసు నమోదు కొండపల్లిలో పోలీసులపై దాడికి పాల్పడి, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పెంచికల్‌పేట ఎస్సై రమేశ్ తెలి పారు. బీజేపీ నేతలు పోలీసుల కళ్లలో కారంకొట్టి దాడి చేశారని, కాగజ్‌నగర్ రూరల్ సీఐ, ఎస్సై, ఇద్దరు మహిళాకానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఆరు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని, దాడులకు పాల్పడిన వారిపై కేసు నమెదు చేశామని వివరించారు. -
కృష్ణా: కొండపల్లిలో అగ్నిప్రమాదం
-
బెజవాడ పరిసరాల్లో అరుదైన వన్యప్రాణులు
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు కొత్త వన్యప్రాణుల ఉనికి పర్యావరణవేత్తల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వాతావరణ మార్పులు, కరువవుతున్న పచ్చదనంతో జీవవైవిధ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ కృష్ణా జిల్లాలో కొండపల్లి అటవీ ప్రాంతం, మరికొన్నిచోట్ల అరుదైన వన్యప్రాణుల్ని గుర్తించారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడని కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ), ఐదు చారల తాటి ఉడత, పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్)ను ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కనుగొంది. కొన్నేళ్ల నుంచి కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని మూలపాడు అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఉన్న చెట్లు, వాతావరణం వల్ల అటవీ ప్రాంతం అభివృద్ధి చెందడంతో వన్యప్రాణుల మనుగడ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కొత్త వన్యప్రాణుల ఉనికి బయటపడినట్లు ఐఐఎస్ఈఆర్ అంచనా వేస్తోంది. పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్) శీతాకాలంలో భారత ఉపఖండంలో అరుదుగా కనిపించే అతిపెద్ద గద్ద ఇది. మధ్య ఆసియా, మంగోలియా నుంచి చలికాలంలో ఈ పెద్ద రెక్కల గద్దలు మనదేశానికి వస్తాయి. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది ఈ గద్ద. ఇటీవల విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ఒక వ్యక్తి పొలంలో దీన్ని ఫొటో తీయడంతో వీటి ఉనికి బయటపడింది. ఇవికాకుండా శీతాకాలంలో పలు వలస పక్షులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. వాటిలో అరుదుగా ఉండే కోకిల, పలు రకాల గద్దలు కూడా ఉన్నాయి. కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ) కృష్ణా జిల్లా మూలపాడు సీతాకోక చిలుకల పార్కులో సెప్టెంబర్ 10న దీన్ని గుర్తించారు. కీటకాలు, విత్తనాలు తిని జీవించే ఈ చుంచు జాతి ప్రాణులు రాతి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఉడతల మాదిరిగా ఉండే ఇవి నడుస్తున్నప్పుడు తోకపైకి వంగి ఉంటుంది. 1850లో నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల మధ్య కొండల్లో మొదటిసారిగా వీటిని కనుగొన్నారు. అంతకుముందు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ సంచరించినట్లు గుర్తించారు. ఐదు చారల తాటి ఉడుత మన ఇళ్ల వద్ద కనిపించే సాధారణ ఉడుత శరీరంపై మూడు చారలు మాత్రమే ఉంటాయి. ఐదు చారల తాటి ఉడుతలున్నా అవి అంతరించిపోయినట్లు భావించారు. కానీ సెప్టెంబర్ 10న మూలపాడు అడవిలో, 11న విజయవాడ రూరల్ మండలం నున్న సమీపంలో వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త జాతులు చాలా ఉన్నాయి మూలపాడు ప్రాంతంలో జీవవైవిధ్యం బాగుండటంతో కొత్త వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తున్నాయి. విజయవాడ పరిసరాల్లో ఇప్పటివరకు 630 జాతుల (పక్షులు, కీటకాలు, సాలె పురుగులు, క్షీరదాలు మొదలైనవి)ను రికార్డు చేశాం. 260కి పైగా పక్షి జాతుల సమాచారం మా వద్ద ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ జీవజాతులు ఉన్నాయని భావిస్తున్నాం. ఐఐఎస్ఈఆర్ బయాలజీ విభాగం, దులీప్ మాథై నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ సహకారంతో తిరుపతి, విజయవాడలో సర్వే చేస్తున్నాం. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
ఆవులకు అస్వస్థత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కృష్ణా: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న క్రమంలో కొండపల్లి గ్రామానికి చెందిన 70 ఆవులు బుధవారం అస్వస్థత గురయ్యాయి. శరీరంపై ఎర్రటి మచ్చలు, కళ్లనిండా రక్తం వస్తుండటంతో అక్కడి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై కొండపల్లి హక్కుల పోరాట సమితీ కన్వీనర్ చెరుకుమల్లి సురేష్ వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. (రెడ్ జోన్లో మహిళ ప్రసవం, శిశువు మృతి) దీంతో అక్కడికి చేరుకున్న వెటర్నరీ వైద్యులు గోవులను పరీక్షించి వాటికి పొంగు జబ్బు వచ్చిందని నిర్థారించారు. పొంగు దగ్గు అనేది అంటు వ్యాధి అని, ఇది ఒక గోవు నుంచి మరో గోవుకు వ్యాపిస్తుందని డాక్టర్లు వెల్లడించారు. పొంగు జబ్బు శరీరం నుంచి కడుపులోకి పాకి ఉంటే ప్రమాదమని కూడా చెప్పారు. వ్యాధి బారిన పడిన 70 గోవులకు వారం రోజుల పాటు చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇక రోడ్లపై తిరిగే గోవుల పట్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కాగా కరోనా వైరస్ దృష్ట్యా భయాందోళన చెందున్న స్థానికులకు డాక్టర్లు గోవులకు కరోనా సోకదని తేల్చి చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. -
హద్దులు దాటి.. అక్రమ తవ్వకాలు!
సాక్షి, అమరావతి : ఇన్నాళ్లూ అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలు సాగించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దందా కొనసాగిస్తున్నారు. అనుమతి లేని చోట కొండలను అక్రమంగా తవ్వేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ రెవెన్యూ పరిధి దొనబండ సర్వే నంబర్ 801లోని 1,204 ఎకరాల్లో 94 క్వారీలకు స్థానిక టీడీపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కోచోట 5 నుంచి 10 హెక్టార్లలోపు మాత్రమే క్వారీయింగ్‌కు అనుమతులు లభించాయి. క్వారీయింగ్‌కు అనుమతించిన ప్రాంతంలో మూడేళ్ల కిందటే తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ తరువాత టీడీపీ నేతల కన్ను అక్కడికి సమీపంలోనే ఉన్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌పై పడింది. క్వారీయింగ్ పూర్తి చేసిన ప్రాంతానికి చెందిన అనుమతులనే చూపిస్తూ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయారు. అటవీ ప్రాంతంలో కొండలను నిత్యం బ్లాస్టింగ్లతో పిండి చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమీప బంధువులే ఇక్కడ అక్రమ క్వారీలు నిర్వహిస్తుండడం గమనార్హం. అక్రమ మైనింగ్‌కు సహకరించినందుకు ఎన్నికల సమయంలో టీడీపీకి కొందరు వ్యక్తులు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి. అంతరించిపోతున్న వన్యప్రాణులు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ అపార ఖనిజ సంపదతోపాటు వన్యప్రాణులు జీవిస్తున్నాయి. 32 రకాల జంతువులున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 48 రకాల అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ 100 హెక్టార్లలో కొండలు విస్తరించి ఉండగా ఇప్పటికే దాదాపు 80 హెక్టార్ల పరిధిలో కొండలను మైనింగ్ మాఫియా తవ్వేసింది. ఈ క్రమంలో అరుదైన వృక్ష జాతులు నాశనమయ్యాయి. జిలెటిన్ స్టిక్స్‌తో బ్లాస్టింగ్లు చేస్తుండడంతో వన్యప్రాణులు కన్ను మూస్తున్నాయి. హద్దులను చెరిపి క్వారీయింగ్‌కు మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చేటప్పుడు సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలి. అయితే, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో పరిటాల క్వారీలకు నిర్వాహకులు హద్దులే లేకుండా చేశారు. 94 క్వారీలకు హద్దులు ఏమిటో ఎవరికి తెలియవు. హద్దులు చెరిపేసి... సరిహద్దులు దాటి రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లోకి మైనింగ్ మాఫియా చొచ్చుకుపోయింది. నెల రోజులపాటు విరామం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో తమ అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడకుండా నిర్వాహకులు నెల రోజుల పాటు తవ్వకాలు నిలిపేశారు. అయితే, తాజాగా మళ్లీ బ్లాస్టింగ్లు ప్రారంభించారు. ఇక్కడి నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల తమ పంటలకు నష్టం వాటిల్లుతోందని సమీప ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నా మైనింగ్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హద్దులు నిర్ధారించి, అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం రిగ్ బ్లాస్టింగ్ల వల్ల వచ్చే భారీ శబ్దాలను భరించలేక వణ్యప్రాణులు ఈ ప్రాంతం నుంచి పారిపోతున్నాయి. పర్యావరణం పరంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అక్రమంగా అటవీ భూముల్లో మైనింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం – బూరుగు లెనిన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కంచికచర్ల -
ఎన్టీపీఎస్ పరిసరాల్లో చిరుత సంచారం
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఉన్న నార్ల తాతారావు థర్మల్ కోల్ ప్లాంట్ సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి సమయంలో కార్మికులు ఇళ్ళకు వెళుతున్న సమయంలో పొదల్లో తిరుగుతున్న చిరుత కనిపించింది. పక్కనే ఉన్న కొండపల్లి ఖిల్లా పరిసర అడవుల నుంచి చిరుత కిందకు వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు ప్రారంభించారు. మరోవైపు చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిరుత సంచారం కలకలం
-
కొండపల్లి నిఫ్టీ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
కొండపల్లి ఆయిల్ డిపో వద్ద ఆందోళన
విజయవాడ: కొండపల్లి డిపోవద్ద మంగళవారం ఉదయం ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేశారు. ఇంధన డిపోగేట్ల వద్ద డ్రైవర్లు, యజమానులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీమా ప్రీమియం డీజిల్‌పై అదనపు పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. లారీ యజమానుల సమ్మె ఆరోరోజులో భాగంగా ఈ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు పెట్రోల్ ట్యాంకర్ల సంఘం మద్దతు తెలిపింది. దీనిలో భాగంగా నేడు పాక్షికంగా ట్యాంకర్లను నిలిపివేసినట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. డిమాండ్లను పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో ఇంధన సరఫరాను అడ్డుకుంటామని ప్రకటించారు. -
పర్యాటకులతో ఖిల్లా కిటకిట!
ఇబ్రహీంపట్నం : ప్రపం^è పర్యాటకుల దినోత్సవం సందర్భంగా కొండపల్లి ఖిల్లా మంగళవారం కిటకిటలాడింది. సాధారణ పర్యాటకులతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వివిధ పాఠశాలలకు చెందిన మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు ఖిల్లాను సందర్శించారు. దీంతో ఖిల్లాపై సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు రాణిమహాల్‌లో ఉన్న ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పురాతన కట్టడాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. పురాతన సంపద వివరాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర పురావస్తు శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ పురాతన కాలం నాటి శిల్ప సంపద విశేషాలను మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు తెలుసుకునేందుకు ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం నూతన శోభను సంతరించుకోనుందని చెప్పారు. ఈ పర్యటనలో మడోన్నా హైస్కూల్, మానసిక వికాస కేంద్రం, చేయూత పాఠశాల, విజయమేరి ఇంటిగ్రేటెడ్ బ్లైండ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సృజన, పురావస్తు శాఖ డీఈ కోటేశ్వరరావు, ఈఈ ఉమామహేశ్వరరావు, ఏడీ దీపక్, మానసిక వికాస కేంద్రం అధ్యక్షురాలు పాలడుగు పార్వతీదేవి, సూపర్వైజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కొండపల్లి బొమ్మకు కొత్తందం
బొమ్మల తయారీ పరిశ్రమకు నిధుల విడుదల మూలనపడిన పరిశ్రమకు ఊతం కొండపల్లి కొయ్యబొమ్మ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రోత్సాహానికి నోచుకోక నిండా మునిగిన బొమ్మల పరిశ్రమకు ఊతం లభించింది. ఢిల్లీకి చెందిన ఎంపవర్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం కలిసి కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరు చేశాయి. ఈ డబ్బును సక్రమంగా వినియోగించుకుంటే వందల ఏళ్ల కళకు పునరుజ్జీవం కలుగుతుందని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి (ఇబ్రహీంపట్నం) : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఢిల్లీకి చెందిన ఎంపవర్ సంస్థ నేతృత్వంలో కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమ నుంచి కొండపల్లి పరిశ్రమకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరయ్యాయిఈ పరిశ్రమ ఇప్పటికే జాతీయస్థాయి జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందింది. సుమారు 350 కుటుంబాల జీవన మనుగడగా, సమస్యల వలయంలో నెట్టుకొస్తున్న బొమ్మల తయారీ పరిశ్రమకు ఈ పరిణామం ఊరట కలిగిస్తుందంటున్నారు. రాజస్థాన్ హస్తకళ స్ఫూర్తితో.. 400ఏళ్ల క్రితం కొండపల్లిలో రాచరిక పాలన కొనసాగేది. రాజుల కాలం నాటి భవనాలకు డిజైన్ చేసేందుకు రాజస్థాన్ నుంచి హస్తకళాకారులు వలస వచ్చారు. రాజులు అంతరించాక బొమ్మల తయారీ పరిశ్రమను జీవనోపాధిగా ఎంచుకుని వారంతా ఇక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి అడవుల్లో లభించే తెల్ల పొనుగు చెట్ల నుంచి లభించే చెక్కతో బొమ్మలు తయారుచేసి.. క్రమంగా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. అందని ప్రభుత్వ సాయం వందల ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమే. 2002లో నాబార్డు నుంచి ఒక్కొక్కరికి రూ.2,500 మాత్రమే రుణంగా ఇచ్చారు. అనంతరం లగడపాటి రాజగోపాల్ ఎంపీగా రూ.5 లక్షలు, ట్రస్ట్ ద్వారా రూ.11.5 లక్షలు మంజూరు చేశారు. పుర పథకంలో బొమ్మల పరిశ్రమ, కాలనీ అభివృద్ధికి రూ.4కోట్లు కేటాయించినా అమలుకు నోచుకోలేదు. గతంలో ఇక్కడ తయారైన బొమ్మలను లేపాక్షి సంస్థ 80 శాతం కొనుగోలు చేసింది. అప్పట్లో వ్యాపారం బాగుండేది. ప్రస్తుతం లేపాక్షి కొనుగోళ్లు నిలిపేసింది. వ్యాపారం మందగించింది. అసోసియేషన్ భవనం శిథిలావస్థకు చేరింది. కొండపల్లి అడవిలో పొనుగు చెట్లు అంతరించాయి. ఖమ్మంజిల్లా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో బొమ్మల తయారీదారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రూ.1.75 కోట్లతో చేపట్టనున్న పనులు బొమ్మల పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు లేపాక్షి సంస్థతో కలిసి పరిశ్రమ అభివృద్ధికి రూ.1.75 కోట్లు వినియోగించనున్నారు. ఇందులో రూ.1.45 కోట్లు కేంద్ర గ్రాంటు కాగా, రూ.30లక్షలు డీఆర్డీఏ ఇంప్లిమెంట్ ఏజెన్సీ గ్రాంటు. బొమ్మల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు వినియోగిస్తారు. ఇందుకు హస్త కళాకారుల భాగస్వామ్యం 25 శాతం, ప్రభుత్వ గ్రాంటు 75 శాతం. ముందుగా బొమ్మల తయారీదారులతో అసోసియేషన్ ఏర్పాటు, శిథిలావస్థకు చేరిన సంఘ భవనాన్ని పునఃనిర్మించడం, బొమ్మల తయారీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్రాల వినియోగం, అందుకు అవసరమైనlనైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ æకేంద్రం ఏర్పాటుచేస్తారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిబిటర్‌ను ఏర్పాటుచేస్తారు. నేటితరానికి అనుగుణంగా బొమ్మలు మలిచేందుకు డిజైన్ సెంటర్, ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. 20ఏళ్ల పాటు పొనుగు చెట్లు పెంచేందుకు ప్లాంటేషన్ ఏర్పాటు, వనసంరక్షణ సమితి సభ్యులకు చేయూత ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇవన్నీ మూడేళ్ల కాలవ్యవధిలో నిర్వహించాలి. అలాగే, ఏపీహెచ్డీసీ సంస్థ కొండపల్లి బొమ్మల అభివృద్ధికి రూ.70లక్షలు అదనంగా మంజూరు చేసింది. వీటితో కార్మికులకు పవర్ టూల్స్, కమ్యూనిటీ హాల్‌కు కాంపౌండ్ వాల్, కాలనీకి ప్రధాన గేటు, ఈడీపీ ప్రోగ్రామ్, నైపుణ్యంతో కూడిన శిక్షణ, ఈడీపీ శిక్షణ ఇస్తారు. -
600 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం
కొండపల్లి (విజయవాడ) : ఆటోలో అనధికారికంగా తరలిస్తున్న మద్యం సోమవారం మధ్యాహ్నం పోలీసులకు చిక్కింది. విజయవాడ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు ఆటోలో తరలిస్తున్న 12 కేసుల్లో ఉన్న 600 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆటోతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. -
కొండపల్లిలో రెండు బస్సులు ఢీ
మహిళ మృతి 16 మందికి గాయాలు చెత్త తగులబెట్టిన పొగ వల్లే ప్రమాదం మృతురాలి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటనలో 16మంది గాయపడగా ఒక మహిళ మృతి చెందారు. కొండపల్లి జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈఘటన జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం తిరువూరు ఆర్టీసీ డిపోకు చెందిన అద్దెబస్సు విజయవాడ నుంచి తిరువూరు వెళ్తుంది. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన 350 సర్వీసు నంబరు బస్సు మైలవరం నుంచి విజయవాడ వస్తుండగా కొండపల్లి వద్దకు వచ్చేసరికి రెండుబస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈసంఘటనలో 350 సర్వీసు బస్సు ఎదురుభాగం నుంచి 10అడుగుల దూరం పూర్తిగా ధ్వంసమైంది. రెండు బస్సుల్లో సుమారు 80 మంది ప్రయాణిస్తుండగా 16మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన డ్రైవర్ ప్రకాష్‌కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.పోలీసులు, స్థానికులు ఆప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను 108వాహనంలో విజయవాడకు తరలించారు. మార్గం మధ్యలో 350బస్సులో ప్రయాణిస్తున్న ఉండవల్లికి చెందిన వై.లక్ష్మి(38) మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. స్వల్ప గాయాలైన ప్రయాణికులను స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు పంపారు. ఈప్రమాదానికి రహదారి పక్కన ఉన్న పంచాయతీ డంపింగ్ యార్డు నుంచి దట్టంగా వెలువడుతున్న పొగే కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది డంపింగ్ యార్డులో మండుతున్న మంటలను ఆర్పేశారు. క్రేన్ల సహాయంతో ఢీకొన్న వాహనాలను వేరుచేశారు. సహాయక చర్యల్లో ఎస్ఐలు కృష్ణ, గణేష్, యువకుమార్ పాల్గొన్నారు. 16మందికి వైద్య సేవలు కొండపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటనలో గాయపడిన 16మందికి వైద్యసహాయం అందిస్తున్నామని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వై.సురేష్‌బాబు తెలిపారు. గాయపడిన పాతపాడుకు చెందిన లక్ష్మీ(26), తేజ(7), రాణి(36), నర్శమ్మ(70), యశ్వంత్(5), ప్రకాష్(డ్రైవర్), రాజారావు(డ్రైవర్) మరో ఇద్దరితో కలిపి 9మంది ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారిని తెలిపారు. కొండపల్లి ప్రైవేట్ వైద్యశాలలో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఉండవల్లి గ్రామానికి చెందిన వై.లక్ష్మి మృతి చెందారని, ఆమె కుటుంబ సభ్యులకు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తామన్నారు. ఆర్టీసీ ఎండీ ఉత్తర్వుల మేరకు ఈ సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు.