సాక్షి, కృష్ణా: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న క్రమంలో కొండపల్లి గ్రామానికి చెందిన 70 ఆవులు బుధవారం అస్వస్థత గురయ్యాయి. శరీరంపై ఎర్రటి మచ్చలు, కళ్లనిండా రక్తం వస్తుండటంతో అక్కడి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై కొండపల్లి హక్కుల పోరాట సమితీ కన్వీనర్ చెరుకుమల్లి సురేష్ వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. (రెడ్ జోన్‌లో మహిళ ప్రసవం, శిశువు మృతి)
దీంతో అక్కడికి చేరుకున్న వెటర్నరీ వైద్యులు గోవులను పరీక్షించి వాటికి పొంగు జబ్బు వచ్చిందని నిర్థారించారు. పొంగు దగ్గు అనేది అంటు వ్యాధి అని, ఇది ఒక గోవు నుంచి మరో గోవుకు వ్యాపిస్తుందని డాక్టర్లు వెల్లడించారు. పొంగు జబ్బు శరీరం నుంచి కడుపులోకి పాకి ఉంటే ప్రమాదమని కూడా చెప్పారు. వ్యాధి బారిన పడిన 70 గోవులకు వారం రోజుల పాటు చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇక రోడ్లపై తిరిగే గోవుల పట్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కాగా కరోనా వైరస్ దృష్ట్యా భయాందోళన చెందున్న స్థానికులకు డాక్టర్లు గోవులకు కరోనా సోకదని తేల్చి చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment