veternary doctors
-
వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో ఉద్యోగావకాశాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో వివిధ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ఆ విభాగం హెచ్ఓడీ నరేష్‌యాదవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెటర్నరీ డాక్టర్లు, డ్రైవరు పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29న కర్నూలులోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, వీపీసీ క్యాంపస్, కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. వెటర్నరీ డాక్టరు పోస్టుకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసి ఉండాలి. పశు వైద్యులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన వారు కూడా అర్హులు. డ్రైవర్లకు 35 ఏళ్ల లోపు వయస్సు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల అనుభవముండాలి. మరింత సమాచారానికి 94922 22951లో సంప్రదించవచ్చు. (చదవండి : స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు) -
ఆవులకు అస్వస్థత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కృష్ణా: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న క్రమంలో కొండపల్లి గ్రామానికి చెందిన 70 ఆవులు బుధవారం అస్వస్థత గురయ్యాయి. శరీరంపై ఎర్రటి మచ్చలు, కళ్లనిండా రక్తం వస్తుండటంతో అక్కడి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై కొండపల్లి హక్కుల పోరాట సమితీ కన్వీనర్ చెరుకుమల్లి సురేష్ వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. (రెడ్ జోన్లో మహిళ ప్రసవం, శిశువు మృతి) దీంతో అక్కడికి చేరుకున్న వెటర్నరీ వైద్యులు గోవులను పరీక్షించి వాటికి పొంగు జబ్బు వచ్చిందని నిర్థారించారు. పొంగు దగ్గు అనేది అంటు వ్యాధి అని, ఇది ఒక గోవు నుంచి మరో గోవుకు వ్యాపిస్తుందని డాక్టర్లు వెల్లడించారు. పొంగు జబ్బు శరీరం నుంచి కడుపులోకి పాకి ఉంటే ప్రమాదమని కూడా చెప్పారు. వ్యాధి బారిన పడిన 70 గోవులకు వారం రోజుల పాటు చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇక రోడ్లపై తిరిగే గోవుల పట్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కాగా కరోనా వైరస్ దృష్ట్యా భయాందోళన చెందున్న స్థానికులకు డాక్టర్లు గోవులకు కరోనా సోకదని తేల్చి చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. -
22 మంది పశువైద్యుల నియామకం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాకు కొత్తగా 22 మంది పశువైద్యుల నియామకం జరిగిందని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ఠాగూర్ శనివారం తెలిపారు. ఈ మేరకు డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ కాగా రెండు రోజుల్లో స్థానాలు కేటాయిస్తామన్నారు. వైద్యుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉండగా అందులో పశువైద్యానికి బాగా ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కొత్త వారితో భర్తీ చేస్తామని తెలిపారు. జిల్లాలో గ్రామీణ పశువైద్య కేంద్రాలు (ఆర్‌ఎల్‌యూ) కొన్ని పశువైద్యశాలలు (వీడీ)గా, మరికొన్ని వీడీలు పట్టణ పశువైద్యశాలలు (వీహెచ్)గా అప్‌గ్రేడ్ కావడంతో త్వరలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు.