అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాకు కొత్తగా 22 మంది పశువైద్యుల నియామకం జరిగిందని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్‌ఠాగూర్ శనివారం తెలిపారు. ఈ మేరకు డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ కాగా రెండు రోజుల్లో స్థానాలు కేటాయిస్తామన్నారు. వైద్యుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉండగా అందులో పశువైద్యానికి బాగా ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కొత్త వారితో భర్తీ చేస్తామని తెలిపారు. జిల్లాలో గ్రామీణ పశువైద్య కేంద్రాలు (ఆర్‌ఎల్‌యూ) కొన్ని పశువైద్యశాలలు (వీడీ)గా, మరికొన్ని వీడీలు పట్టణ పశువైద్యశాలలు (వీహెచ్)గా అప్‌గ్రేడ్ కావడంతో త్వరలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు.