అనంతపురం సప్తగిరి సర్కిల్: వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో వివిధ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ఆ విభాగం హెచ్‌ఓడీ నరేష్‌యాదవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెటర్నరీ డాక్టర్లు, డ్రైవరు పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29న కర్నూలులోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, వీపీసీ క్యాంపస్, కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. వెటర్నరీ డాక్టరు పోస్టుకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసి ఉండాలి. పశు వైద్యులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన వారు కూడా అర్హులు. డ్రైవర్లకు 35 ఏళ్ల లోపు వయస్సు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల అనుభవముండాలి. మరింత సమాచారానికి 94922 22951లో సంప్రదించవచ్చు.
(చదవండి : స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు)
Comments
Please login to add a commentAdd a comment