కొండపల్లి ఆయిల్ డిపో వద్ద ఆందోళన
Published Tue, Apr 4 2017 11:32 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
విజయవాడ: కొండపల్లి డిపోవద్ద మంగళవారం ఉదయం ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేశారు. ఇంధన డిపోగేట్ల వద్ద డ్రైవర్లు, యజమానులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీమా ప్రీమియం డీజిల్‌పై అదనపు పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. లారీ యజమానుల సమ్మె ఆరోరోజులో భాగంగా ఈ ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళనకు పెట్రోల్ ట్యాంకర్ల సంఘం మద్దతు తెలిపింది. దీనిలో భాగంగా నేడు పాక్షికంగా ట్యాంకర్లను నిలిపివేసినట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. డిమాండ్లను పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో ఇంధన సరఫరాను అడ్డుకుంటామని ప్రకటించారు.
Advertisement
Advertisement