
అమ్మ అనిత పోస్టు
బనశంకరి: నా కుమారుడు ఎన్నికల్లో మూడోసారి ఓడిపోయాడు. అతను ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, మానవత్వం, సహృదయమున్న మనిషిగా ఓడిపోలేదని నిఖిల్ తల్లి అనితా కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణ ఉప ఎన్నికలో నిఖిల్ పరాజయం తరువాత ఆమె ఎక్స్‌లో సోమవారం పోస్ట్ చేశారు. నా కొడుకు ఓటమిని ఒప్పుకుంటున్నా. ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోవాలి, కానీ ఓటమికి అనేక కారణాలు ఉంటాయి.
రాజకీయాల్లో నా భర్త, మామగార్లకు ఇటువంటివి కొత్త కాదు. ఓటమితో కుంగిపోలేదు. నా కుమారునికీ ఇదే వర్తిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. నిఖిల్ మనిషిగా ఓటమి చెందలేదన్నారు. చెన్నపట్టణ ప్రజల, ప్రేమ, విశ్వాసం నిఖిల్ వెంటే ఉన్నాయని, ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు.