
యశవంతపుర: రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా సినిమా రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి తెలిపారు. మండ్యలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... సినిమాలకు గుడ్‌బై చెప్పాను. 2019లో మండ్యలో తనను ఓడించారు. అనేక తప్పులు వల్ల వెనకడుగు వేశా. ఇప్పుడు మండ్య ప్రజలు స్థానం ఇచ్చినట్లు చెప్పారు. తన తండ్రి కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో మండ్యలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. త్వరలో చెన్నపట్టణలో ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు.