తొలి సినిమానే వంద కోట్ల బడ్జెట్‌.. ‘మెగా’, ‘అక్కినేని’ హీరోలతో సాహసం! | Akhil Akkineni, Sai Dharam Tej Latest Movies Updates | Sakshi
Sakshi News home page

తొలి సినిమానే వంద కోట్ల బడ్జెట్‌.. మెగా, అక్కినేని హీరోలతో సాహసం!

Published Fri, Dec 6 2024 6:04 PM | Last Updated on Fri, Dec 6 2024 6:16 PM

Akhil Akkineni, Sai Dharam Tej Latest Movies Updates

దర్శకుడిగా తొలి అవకాశం కోసం చాలామంది చాలా స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేస్తుంటారు. కానీ కొందరిని మాత్రం మొదటే బంపర్‌ ఆఫర్‌ వరిస్తుంది. ఏ రేంజ్‌ ఆఫర్‌ అంటే ఆ యువ దర్శకుల తొలి సినిమాలకే భారీ బడ్జెట్‌ కేటాయింపులు జరిగిపోతున్నాయి. అఖిల్‌ హీరోగా ఓ భారీ బడ్జెట్‌ మైథలాజికల్‌ మూవీ చేయనున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిల్మ్స్‌ (కేజీఎఫ్, సలార్, కాంతార’ వంటి సినిమాలను నిర్మించిన సంస్థ) ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తీయనున్నాయనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్‌ తెరకెక్కించనున్నారు. 

అలాగే సాయి దుర్గా తేజ్‌ హీరోగా ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా రూపపొందుతోంది. ఈ సినిమాతో కేపీ రోహిత్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్‌ కూడా వంద కోట్ల రూపాయలపైనే అని వినికిడి. నిఖిల్‌ హీరోగా ‘స్వయంభూ’ అనే భారీ బడ్జెట్‌ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఈ సినిమాతో భరత్‌ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే కిశోర్‌ అనే యువ దర్శకుడికి రానా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, రవి అనే ఓ కొత్త దర్శకుడితో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్‌ సినిమాలే కావడం విశేషం..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement