20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా | Actor Nikhil Siddhartha Appudo Ippudo Eppudo 2024 Movie Released In OTT, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Appudo Ippudo Eppudo In OTT: నిఖిల్ కొత్త సినిమా.. ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

Published Wed, Nov 27 2024 7:31 AM | Last Updated on Wed, Nov 27 2024 9:21 AM

Appudo Ippudo Eppudo Movie OTT Streaming Details

మరో తెలుగు సినిమా చెప్పపెట్టకుండా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలై రిలీజై 20 రోజులు కాలేదు, డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంది. అదే హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం.. అసలు ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా చాలమందికి తెలియదు. ఇప్పుడు ఏ ఓటీటీలోకి వచ్చింది? ఈ సినిమా సంగతేంటి అనేది చూద్దాం.

(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)

'కార్తికేయ 2' తర్వాత నిఖిల్.. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ దానికి తగ్గ సినిమాలు చేయట్లేదు. 'స్పై' అనే మూవీ చేశాడు. ఇది ఫ్లాప్ అయింది. రీసెంట్‌గా ఈ మూవీ కూడా అంతే. ఓటీటీ కోసమే దీన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఘోరమైన కంటెంట్ దెబ్బకు వచ్చిన థియేటర్లలోకి వచ్చిన ఒకటి రెండు రోజుల్లో మాయమైపోయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.

'అప్పుడో ఇప్పుడు ఎప్పుడో' విషయానికొస్తే.. రిషి(నిఖిల్) ఇక్కడ ఉన్నప్పుడు తార(రుక్మిణి వసంత్)ని ప్రేమిస్తాడు. తర్వాత లండన్‌కి వెళ్తాడు. అక్కడ తులసి(దివ్యాన్షి)ని ఓ ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఆమెకు దగ్గరై పెళ్లి వరకు వెళ్తాడు. సరిగ్గా పెళ్లి టైంకి ఆమె హ్యాండిస్తుంది. ఈ లోగా బద్రి (జాన్ విజయ్) అనే డాన్.. వందలాది కోట్లు ఓ అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసే డివైజ్ పోగొట్టుకుంటాడు. అది రిషి దగ్గర ఉందని అతనికి అనుమానమొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథ.

(ఇదీ చదవండి: హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement