ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా? | Star Actress Sister Shares Childhood Pics Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Star Actress: ఈ ఫోటోలోని చిన్నారి రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

Mar 7 2026 5:16 AM | Updated on Mar 7 2026 12:00 PM

Star Actress Sister Shares Childhood Pics Goes Viral In Social Media

సినీ తారలు మాత్రమే కాదు.. ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులు తిరిగి వస్తే బాగుంటుందని అందరం అనుకుంటాం. కానీ అది జరగదని మనకు కూడా తెలుసు. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగుతాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్‌ తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అక్క జాన్వీ కపూర్ బర్త్‌ డే సందర్భంగా తనతో ఉన్న చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే అస్సలు జాన్వీకపూర్‌ చిన్నప్పుడు ఇలా ఉండేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చాలా క్యూట్‌ క్యూట్‌గా కనిపించారు. జాన్వీతో చిన్నప్పటి ఫోటోలు, అమ్మ శ్రీదేవితో ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది. నా సోదరి, నా ప్రాణ స్నేహితురాలు, నా సలహాదారు, నా గురువు, నా క్రైమ్ పార్ట్‌నర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండి..ఈ  రోజు ఒక వ్యక్తిగా మారడానికి నన్ను పెంచడంలో సహాయపడినందుకు ధన్యవాదాలు తెలిపింది. నువ్వు లేకుండా నేను జీరో.. నా జీవితంలో ఎల్లప్పుడు నీతోనే ఉండాలని ఆశిస్తున్నాను.. లవ్‌ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇ‍చ్చిన జాన్వీ కపూర్ మరో సినిమా చేస్తోంది. రామ్ చరణ్- బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement