Karnataka Election Result
-
అప్పుడే సీఎంని డిసైడ్ చేస్తాం
-
పోరాడినా గెలవలేకపోయాం ఓటమిని విశ్లేషించుకుంటాం..
-
కర్ణాటకలో మా పొరపాట్లు కొన్ని ఉన్నాయి అందుకే ఇలా జరిగింది
-
గెలుపు తర్వాత సిద్ధరామయ్య ఎమోషనల్ స్పీచ్
-
మీ అందరికి సాష్టాంగ నమస్కారం
-
కేఆర్పీపీతోనే రాష్ట్రంలో బీజేపీ ఓటమి
గంగావతి రూరల్: రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ కారణమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి అన్నారు, ఆదివారం ఆయన నగరంలోని కేఆర్పీపీ కార్యాలయంలో బళ్లారి విధానసభ క్షేత్రం బూత్‌స్థాయి పదాధికారులు, పార్టీ నాయకులతో ఆత్మావలోకన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పార్టీ ఏర్పాటుకు ముందు తనను తిరిగి బీజేపీలోకి తీసుకోవాలని చూశారని, తాను మాత్రం ఏ బీజేపీ నేత ఇంటికి కూడా వెళ్లలేదని, అమిత్, నరేంద్ర మోదీల వద్ద అసలు వెళ్లలేదని బీజేపీ నేతల గురించి వ్యంగ్యంగా అన్నారు. అమిత్‌షా పలుమార్లు తనను కలవాలని చూశారని, అయితే తానే వారిని దూరంగా ఉంచానని, రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కేఆర్పీపీ కారణమన్నారు. బళ్లారి విధానసభ క్షేత్రం ఎన్నికలో కేఆర్పీపీ పరాజిత అభ్యర్థి లక్ష్మీ అరుణ రెండో స్థానంలో నిలిచారని, ప్రజల మనసు గెలుచుకున్నారని అన్నారు. ఇప్పటి బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్రంలో నేను పెంచి పెద్ద చేసిన పిరికిపందలు, అన్నదమ్ములతో సహా అందరూ ఇళ్లల్లో ఉండే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను ఒంటరిగానే విధాన సౌధకు వెళ్తున్నానని, తన మంచితనం కొంత మంది ఉపయోగించుకున్నారని అలాంటి వ్యక్తులకు రాబోవు రోజులో కాలమే శిక్షిస్తుందన్నారు. బళ్లారిలో పాలికెలో సత్తా చాటుతాం బళ్లారి మునిసిపల్ కార్పొషన్ ఎన్నికలతో పాటు వచ్చే జిల్లా పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో కేఆర్పీపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలందరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. బళ్లారి మహాపాలికె ఈసారి అన్ని వార్డుల్లో కేఆర్పీపీ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు. పరాజిత అభ్యర్థి లక్ష్మీ అరుణ మాట్లాడుతూ...ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉంటామని, నా ఓటమికి కాంగ్రెస్ హామీలే కారణమని అన్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ కొప్పళ జిల్లా అధ్యక్షుడు మనోహర గౌడ హేరూరు, బళ్లారి జిల్లా అధ్యక్షుడు గోనాళ రాజశేఖర గౌడతోపాటు ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా కల్యాణ రాజ్యా ప్రగతి పార్టీ యువ ఘటక అధ్యక్షుడు భీమశంకర పాటిల్, మహిళా ఘటక అధ్యక్షురాలు హేమలత, శ్రీనివాస్ రెడ్డి, హంపి రమణ పాల్గొన్నారు. -
పెద్ద నోటు రద్దు... ఏ కట్టడికి?! అసలు కారణం ఇదేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఇంతకీ 2 వేల నోటు ఉపసంహరణ లేదా రద్దు ఎవరి కోసం? నల్లధనం కట్టడికా! రాజకీయ ప్రత్యర్థుల కట్టడికా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితం కంటిమీద కునుకు లేకుండా చేసినట్టుంది. డిసెంబరులో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా ఈ నోటు రద్దును ఎందుకు భావించకూడదు? ఎన్నికల్లో ధనప్రవాహం అభిలషణీయం కాదు కానీ, దాన్ని ఆపడం ఇప్పటివరకు ఎవరి వల్లా కాలేదు. ఇకపై కాదు కూడా! మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ సోదాల్లో 375 కోట్లకు పైగా (డబ్బు, మందు, కానుకలు) దొరికింది. దొరకనిది ఇంకెన్ని రెట్లుంటుందో! ఓటర్లకు ఎర వేయడం తప్పనప్పుడు, ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం యుద్ధనీతిలో భాగమే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. 2016లో నోట్ల రద్దును గొప్ప ప్రయోగంగా, ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప మలుపుగా ప్రధానమంత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రకటించినప్పుడు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ చర్య బడా బాబులతో పాటు సగటు జీవులకూ కొన్ని నెలల పాటు కునుకు లేకుండా చేసింది. చివరికి దానివల్ల ఏం ఒరిగింది? నల్లధనంగా భావించిన మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా మళ్లీ బ్యాంకుల్లోకి చేరిపోయింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ (ఆపరేషన్ విజయవంతం, కానీ రోగి దక్కలేదు)’ చందంగా తయారైంది. నోట్ల రద్దును అప్పుడు మోదీ ప్రకటిస్తే, శుక్రవారం నాడు మాత్రం 2 వేల నోటు రద్దును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బహుశా నోటు రద్దుకు రాజకీయ రంగు అంటకుండా కేంద్రం తీసుకున్న జాగ్రత్త ఇది. దేశ ఆర్థిక రంగాన్ని చిన్నదో పెద్దదో ఏదో ఒక కుదుపుకు లోను చేసే ఇలాంటి నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించడంలోనే అసలు అంతరార్థం అవగతమవుతుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ (యుద్ధంలోనూ ప్రేమలోనూ సర్వం సబబే)’ అన్న నానుడి తెలుసు కదా! ఇదే సూత్రాన్ని రాజకీయాలకు అన్వయిస్తే సరిపోతుందేమో! బీజం పడిందక్కడే...! రాజకీయ అవసరాలను పక్కన పెడితే ఈ పెద్ద నోటు రద్దు ఎవరికి నష్టం? రెండు వేల నోటు ముద్రణ నిలిపివేసి చాలా ఏళ్లవుతోంది. బ్యాంకులు కస్టమర్లకు వాటిని జారీ చేయడం నిలిపివేసి కూడా చాలా రోజులవుతోంది. చలామణిలో లేకపోవడంతో సగటు జీవులు ఈ నోటును కళ్లజూసి కొన్ని నెలలవుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో, సినిమా రంగంలో చలామణిలో ఉన్న మాట వాస్తవం. ఆర్బీఐ లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు మార్కెట్లో ఉన్నాయి. ఇందులో అధిక శాతం బడా బాబుల చేతుల్లోనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు 2 వేల రూపాయల నోట్లే పంచారన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది కాబట్టి ఆ నోటుపై వేటు వేస్తే ప్రతిపక్షాలను దెబ్బ తీయొచ్చనేది అసలు వ్యూహం. ప్రతిపక్షాల కూటమికి తనను సారథిని చేస్తే ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తానని ఓ నేత అన్నట్టు ఓ ప్రముఖ ఇంగ్లిష్ చానల్లో ఆ చానల్ తాలూకు ప్రముఖ జర్నలిస్టు బాహాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా రెండు వేల నోటుపై వేటుకు అక్కడే బీజం పడి ఉంటుంది. కాదంటారా!? -
కన్నీటి పర్యంతమైన కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి
-
కుమారస్వామికి భంగపాటు...
-
కర్ణాటకలో మోదీ ప్రచారం ఎందుకు ప్రభావం చూపలేదు ?
-
తెలం‘గానా’నికి కర్ణాటక సంగీతం!
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది.’ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో ఎవరి చావు కొచ్చినట్టు? ఎవరి మేలు కొచ్చినట్టు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన తాజా చర్చ. అసలు ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం పక్క రాష్ట్రం మీద ఉంటుందా? ఉంటే ఏ మేరకు ఉంటుంది? ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు ఆ రాష్ట్రానికే పరిమితం కదా! అటువంటప్పుడు కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ఎలా ప్రభావం చూపిస్తాయన్న మీమాంస కూడా ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రధాన రాజకీయ పక్షం. దానితో తలపడబోయే నెంబర్ టూ పార్టీ ఏదీ అన్న ప్రశ్నకు గత కొంతకాలంగా అస్పష్టమైన సమాధానాలు లభిస్తున్నాయి. అటువంటి అస్పష్టతకూ, సందిగ్ధతకూ కర్ణాటక ఫలితాలు తెరదించనున్నాయా? రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణా ఇచ్చిన పార్టీగా పేరున్నప్పటికీ కాంగ్రెస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఇందుకు కారణం ప్రజల్లో ఆదరణ లేకపోవడం కాదు. నాయకత్వ వైఫల్యం ప్రధాన కారణం. మొదటి ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ సారథిగా సహజంగానే కేసీఆర్‌కు కొంత సానుకూలత ఉన్నది. కానీ దాన్ని అధిగమించగలిగే సంస్థాగత బలం, కేంద్ర–రాష్ట్రాల్లో అధికారం, తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే ఖ్యాతి కాంగ్రెస్‌కు ఉన్నాయి. కానీ కేసీఆర్ జనాకర్షణతో పోల్చినప్పుడు అందుకు దీటైన నాయకుడు కాంగ్రెస్‌లో లేకపోవడం ఎన్నికల ఫలితాలను శాసించింది. రెండోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతున్నదని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా చారిత్రక తప్పిదానికి ఒడిగట్టి తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకొని భారీమూల్యం చెల్లించింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మూడొంతులమంది అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఫిరాయింపుల పర్వం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలుచన చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణలో బీజేపీ వేట మొదలైంది. కాంగ్రెస్ బలహీనపడుతున్న క్షణాలను తనకు అను కూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లు గెలిస్తే, బీజేపీ నాలుగు చోట్ల గెలవడం ఆ పార్టీకి అనుకోకుండా ఊపు తెచ్చింది. బీఆర్ఎస్ నాయకత్వం చేసిన పొరపాట్ల వల్ల హుజూరాబాద్, దుబ్బాక నియోజక వర్గాల్లో గెలిచి, బీజేపీ ఒక సంచలనానికి కారణమైంది. మునుగోడులో విజయతీరాల దాకా చేరుకున్నా బీఆర్ఎస్ అప్రమత్తత వల్ల కొద్ది తేడాలో ఓడిపోయింది. తెలంగాణలో తాను బలపడ్డాననే అభిప్రాయం కలిగించడం కోసం బీజేపీ ఉప ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసింది. అదే సమయంలో ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో తాను ఆశించినంత కాకపోయినా ఎంతో కొంత మేరకు బీజేపీ విజయం సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ‘బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెసా... కాషాయ పార్టీనా’ అనే సందిగ్ధత జనంలో ఏర్పడింది. కర్ణాటక ఫలితాలు సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్నీ, బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహాన్నీ నింపుతాయి. ఈ ప్రభావం ఎలా ఉండ బోతున్నది? బీఆర్ఎస్కు లాభమా–నష్టమా? కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికార పార్టీని సవాల్ చేయగలగుతుందా? కర్ణా టక గాయాన్ని మరచిపోవడానికి బీజేపీ తెలంగాణలో విజృంభి స్తుందా? ఈ విషయాల మీద స్పష్టత రావాలంటే క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల బలాబలాలను పరిశీలించాలి. ఓట్ల చీలిక కారణంగా మూడోవంతు ఓట్లతోనే బీఆర్ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ‘చారిత్రక’ తప్పిదం వల్ల రెండోసారి ఆ పార్టీ ఓట్ల శాతం 47కు పెరిగింది. నాలుగు మాసాల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో 41 శాతానికి దాని మద్దతు పడిపోయింది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి ఎంతోకొంత వ్యతిరేకత సహజం. బీఆర్ఎస్ విషయంలో ఈ వ్యతిరేకత కొంత ఎక్కువగానే కనిపిస్తున్నది. ముఖ్యంగా నలభయ్యేళ్లలోపు యువతలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా బీఆర్ఎస్కే ఓటువేసే వారి సంఖ్య కూడా తక్కువ లేదు. ఇటువంటి ఓటర్లు సుమారు 35 శాతం ఉంటారని అంచనా ఉన్నది. ఇంకో ఐదారు శాతం మందికి బీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకతగానీ, వల్లమాలిన అభిమానం గానీ ఉండకపోవచ్చు. పరిస్థితులను బట్టి వారు ఆ పార్టీకి అనుకూలంగానో, ప్రతికూలంగానో స్పందించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్కు ఓటు వేయని వారు 60 శాతం వరకు ఉండొచ్చని కొన్ని క్షేత్రస్థాయి పరిశీలనలు సూచిస్తున్నాయి. ఇందులో నాలుగైదు శాతం ఓట్లు చిన్న పార్టీలకు పడొచ్చు. నికరంగా 55 శాతం బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు. కాంగ్రెస్ బీజేపీలు ఈ ఓట్లను పంచుకోవాలి. ఇందులో కాంగ్రెస్ నికర ఓటు ఎంత? బీజేపీ నికర ఓటు ఎంత? అనే పరిశీలన అవసరం. గడచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దాదాపుగా 30 శాతం ఓట్లు పడ్డాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 25 శాతం పైచిలుకు ఓట్లు పడ్డాయి. కనుక కాంగ్రెస్ నికర ఓటును 25 శాతంగా పరిగణించవచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు మాత్రమే సంపాదించిన బీజేపీ 4 నెలల్లోనే లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 20 శాతం ఓట్లు సంపాదించింది. లోక్‌సభ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు సంపాదించడం బీజేపీకి మొదటిసారి కాదు. 1998 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి, దాదాపు ఇదే శాతం ఓట్లను ఆ పార్టీ పొంద గలిగింది. తర్వాత కాలంలో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ చిక్కి శల్యమైంది. ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ డబుల్ డిజిట్‌ను తాకలేక పోయింది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతాన్నీ, ఈ మధ్యకాలంలో పెరిగిన విస్తరణనూ పరిగణనలోకి తీసుకుంటే 15 శాతం వరకు బీజేపీ నికర ఓటు ఉంటుందని భావించవచ్చు. సీట్లవారీగా క్షేత్ర స్థాయి పరిశీలన సైతం ఇదే స్థాయి నికర ఓటును నిర్ధారిస్తున్నాయి. దాదాపు వంద సీట్లలో బీఆర్ఎస్ ప్రధాన పోటీదారుగా ఉంటుంది. అంటే గెలవడమో, లేదా రెండో స్థానంలో నిలవడమో అన్నమాట. కాంగ్రెస్‌కు అటువంటి నియోజక వర్గాలు అరవైకి పైనే కనిపిస్తున్నాయి. బీజేపీకి సుమారు ముప్ఫయ్ నియోజక వర్గాలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండి, అర్ధబలం... అంగబలం దండిగా ఉన్న బీజేపీ తెలంగాణలో వేట మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా రెండో స్థానానికి చేరుకోలేకపోవడానికి కారణాలేమిటి? అనుకున్న స్థాయిలో చేరికలు ఎందుకు ఉండడం లేదు? అనైక్యతతో, క్రమశిక్షణా రాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడంలో బీజేపీ నేతలు ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు? బీజేపీ వ్యూహమే దాని ఎదుగుదలకు గుదిబండగా మారుతున్నదన్న అభిప్రాయం కూడా ఉన్నది. తెలంగాణలో ఎకాయెకిని హార్డ్‌కోర్ హిందూత్వ ఎజెండాను తలకెత్తుకున్నట్టు కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో హార్డ్‌కోర్ హిందూత్వ ఎజెండాతో అడ్వాణీ రథయాత్రలు చేయడం వల్ల పార్టీ విస్తరణ జరిగిందే కానీ, అధికారం సిద్ధించలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి సాఫ్ట్ హిందూత్వ ముఖాన్ని ముందుపెట్టిన తర్వాతే తొలిసారి బీజేపీకి కేంద్ర పీఠం దక్కింది. ఆ పునాదుల మీదనే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిలబడింది. హార్డ్‌కోర్ హిందూత్వ ఎజెండానే బీజేపీ బలంగా ముందుకు తోస్తే... ఇరవై శాతం ఓట్ల మార్కును దాటడం కష్టమే! ఆ వైతరణీ నదిని దాటాలంటే కచ్చితంగా సెక్యులర్, లేదా సాఫ్ట్ హిందూత్వ ఎజెండాయే శరణ్యం. ఇక కాంగ్రెస్ పార్టీ గణాంకాలు చూస్తే బాగానే ఉన్నా, ఎక్స్‌రే మాత్రం బలహీనతలను ఎత్తిచూపుతున్నది. నాయక శ్రేణుల్లో ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ఆ పార్టీలో ఐక్యత ఓ మరీచిక. అగ్రనాయకత్వంపై అందరికీ విశ్వాసం లేదు. ఒకరినొకరు ఓడించుకునే అవకాశాలను తోసిపుచ్చలేము. ఎన్నికలకు ముందే ఆ పార్టీ అభ్యర్థులందరూ పార్టీ ఫిరాయించబోమని బహిరంగంగా ప్రమాణాలు చేస్తే తప్ప ప్రజలు నమ్మలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో ఈ బలహీనతలన్నింటినీ అధిగమించగలిగితే గట్టి పోటీదారుగా నిలబడగలిగే అవకాశం ఇప్పటికీ కాంగ్రెస్‌కు ఉన్నది. అదే సందర్భంలో కర్ణాటకను కోల్పోయిన బీజేపీ దక్షిణాదిన మరో స్థావరం కోసం గాయపడ్డ పులిలా విరుచుకుపడడం ఖాయం. ఇతర పార్టీల్లో ప్రజాదరణ గల నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకొని ఒక ప్రభంజనం సృష్టించే ప్రయత్నం తప్పక చేస్తుంది. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తే... జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామమే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రిగా 19 నెలల 17 రోజులు పనిచేసిన 'బసవరాజు బొమ్మై' ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇందులో భాగంగానే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు. ఈ రోజు విడుదలైన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ 136 సీట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. కేవలం 65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ప్రస్తుతం కర్ణాటకలో అధికారం కోల్పోయింది. కన్నడ నాట ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. అయితే ఎవరు కర్ణాటక కొత్త ముఖ్యమత్రి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. -
కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలు
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. కొన్ని సంస్థలు అంచనా వేసిన విధంగానే కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో, బీజేపీ 64 స్థానాల్లో, జేడీఎస్ 20 లీడింగ్‌లో ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాల్లో పోలిస్తే జేడీఎస్ దాదాపు 17 స్థానాలు కోల్పోయింది. 2018లో జేడీఎస్ 37 స్థానాల్లో గెలిచింది. వరుస ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే క్రమంగా జేడీఎస్‌కి ఆదరణ తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఎగ్జిట్ పోల్స్‌లో 'యాక్సిస్ మై ఇండియా' కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 140 సీట్లు, బీజేపీకి 62 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనా ఇప్పుడు నిజమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఎగ్జిట్ అంచనాల కంటే మించి ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ అంచనాల కంటే మించి ఫలితాలు కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేసిన సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా అంచనాలు Follow https://t.co/Fg8UHp55I6 for #KarnatakaElection#KarnatakaElectionResults#KarnatakaElections2023 latest updates pic.twitter.com/yWe36EbKaS — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 -
కర్ణాటక ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా వచ్చాయి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత వల్లే ఓటమిపాలైందని భావిస్తున్నట్లు తెలిపారాయన. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ వ్యతిరేకతకు బహుశా అక్కడి ఎమ్మెల్యేల పని తీరు కూడా కొంత కారణం కావొచ్చు. నరేంద్ర మోదీపై అక్కడి ప్రజలకు అభిమానం ఉన్నప్పటికీ.. ఫలితాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా వచ్చాయి. కానీ, పార్లమెంట ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుస్తామని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కర్ణాటకలో మాదిరే తెలంగాణలోనూ ఇక్కడి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంది. ఇక్కడ ప్రతిపక్షంగా మేం ప్రభుత్వ నిరంకుశ పాలనను, పనితీరును ఎండగడుతున్నాం. కాబట్టి, తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాం అని తెలిపారాయన. ఇదీ చదవండి: కాంగ్రెస్ విక్టరీ.. సంక్షేమ హామీలు పని చేశాయి -
కుమారస్వామి ప్రమాణం.. విచిత్ర దృశ్యాలు
బెంగళూరు: సైద్ధాంతిక విబేధాలను పక్కనపెట్టిమరీ బద్ధశత్రువులు కరచాలనం చేశారు.. ఉమ్మడి శత్రువును ఎలా ఢీకొట్టాలో గుసగుసలాడుతూ వ్యూహాలు పంచుకున్నారు. వారిలో కొందరు అవకాశవాదులూ ఉన్నారు.. ఏదైదేనేం.. మొత్తానికి ఒక్కటిగా చేతులు పైకిలేపారు.. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ ప్రాంగణం నుంచి ఉమ్మడిగా సమర శంఖారావం పూరించారు.. మరి ఆ శబ్ధం ఢిల్లీలోని రాయిసీనా హిల్స్ ఆఫీసులో కొలువుదీరిన నరేంద్ర మోదీకి.. దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూర్చున్న అమిత్ షాకి ఎలా వినపడి ఉంటుంది? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగానీ, శాశ్వత శత్రువులుగానీ ఉండరన్న నానుడి తెలిసిందే. అయితే కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మిత్రులుకాని వారంతా ఒక్కటికావడం.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో కనిపించిన విచిత్ర దృశ్యం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో చేయికలిపారు. ఐక్యంగా ఉంటే శత్రువును ఓడించొచ్చని ఇప్పటికే గ్రహించిన మాయావతి-అఖిలేశ్‌లు పక్కపక్కనే నిల్చొని నవ్వులు చిందించారు. గంభీరవదనంతో శరద్ పవార్ వేదికకు నిండుదనం తెచ్చారు. ఆర్ఎల్డీ నేత అజిత్‌సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌లు అదనపు వెలుగులు చిందించారు. ఇక ఎన్నికలకో పార్టీతో జతకడుతూ రంగులు మార్చే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కరచాలనం చేసి ముచ్చటించారు. చాలా రోజుల తర్వాత అంతమంది మనుషుల మధ్యలో, అతిదగ్గరగా నిలబడ్డ సోనియా గాంధీ.. మీడియా కెమెరాల వైపునకు సవాలు విసురుతున్నట్లు ఓ చూపు చూశారు.. భారత్‌లో గతంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ.. ఎన్నికలకు ముందు ఇన్ని విభిన్న పార్టీలు ఒకే వేదికపైకి రావడం, తద్వారా ఉమ్మడి శత్రువుకు హెచ్చరిక సంకేతాలు పంపడం మాత్రం ఇదే ప్రధమం. కాంగ్రెసేతర-బీజేపీయేతర కూటమి కావాలన్న కేసీఆర్, తమిళానాడులో ఆందోళనల కారణంగా స్టాలిన్, తెలియని కారణంతో నవీన్ పట్నాయక్‌లు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. -
మహిళా ప్రొఫెసర్‌కు ఎన్ఆర్ఐ వేధింపులు
హైదరాబాద్ : సోషల్ మీడియా వేదికగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించినందుకు ఓ మహిళా ప్రొఫెసర్ వేధింపులకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన దీప నాయర్ మర్రిచెన్నారెడ్డి హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైరల్ అయిన ప్రధాని నరేంద్రమోదీ ప్రచార వీడియోకు ఆమె ఈనెల 18న కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ఆర్ఐ విజయ్ శేఖర్ అనే వ్యక్తి అసభ్యకర పదజాలంతో కామెంట్ చేశాడని దీప నాయర్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ప్రొఫెసర్ దీప ఫిర్యాదుతో జుబ్లీహిల్స్ పోలీసులు ఎన్ఆర్ఐ విజయ్‌పై కేసు నమోదు చేశారు. ఓ కామన్ ఫ్రెండ్ షేర్ చేసిన వీడియోకు తాను కామెంట్ చేశానని, ఈ కామెంట్‌కు ఎన్ఆర్ఐ విజయ్ శేఖర్ మాటల్లో చెప్పలేని పదజాలంతో వేధించాడని ఆమె సాక్షికి తెలిపారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినా అతను వెనక్కు తగ్గకుండా తనకు సవాల్ విసిరాడన్నారు. భావప్రకటన స్వేచ్చ లేని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కామెంట్ల పట్ల ఫేస్‌బుక్‌కు సైతం ఫిర్యాదు చేశానని, వారు ఆ కామెంట్స్‌ను తొలిగించారని చెప్పారు. ఈ విషయంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, అమెరికా ఎంబసీలకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మహిళా ప్రొఫెసర్‌కు అసభ్యపదజాలంతో ఎన్ఆర్ఐ కామెంట్స్
-
‘సంకీర్ణాన్ని’ కాపాడేందుకే కాంగ్రెస్ మొగ్గు..!
కర్ణాటకలో జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఈ సర్కార్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమో తక్షణ అవసరంగా ముందుకు సాగుతోంది. ఆ రాష్ట్రంలో బీజేపీని అధికారానికి దూరంగా పెట్టడంతో పాటు, లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో వివిధ రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ భాగస్వామ్యపక్షాలకు చేరువయ్యేలా మంచి ఇమేజీ సాధనకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో 78 సీట్లు సాధించినా , కేవలం 38 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌కు ప్రభుత్వ ఏర్పాటులో బేషరతు మద్ధతునివ్వడంతోనే కాంగ్రెస్ దీర్ఘకాల వ్యూహం స్పష్టమవుతోంది. దీని ద్వారా జేడీఎస్‌కు జూనియర్ భాగస్వామిగా కొనసాగేందుకు మానసికంగా సిద్ధమైంది. కేబినేట్ కూర్పు, ఇతర కీలకాంశాల విషయంలో పట్టు విడుపులు ప్రదర్శించనున్నట్లు వెల్లడవుతోంది. 2006లో జేడీఎస్, బీజేపీల మధ్య చెరి 20 నెలలు సీఎం సీటును పంచుకోవాలనే ఒప్పందం బెడిసికొట్టిన దరిమిలా ఈసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కోరుకోవడం లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బీజేపీ వ్యతిరేక, సెక్యులర్, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు సొంత రాజకీయ ప్రయోజనాలు సైతం వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో సంకీర్ణాన్ని సజావుగా కొనసాగించడం ద్వారా బీఎస్పీ, ఎస్పీ, తృణముల్ కాంగ్రెస్, ఎస్సీపీ, తదితర పార్టీల మద్ధతు కూడగట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ ఎన్నికల్లో అధికార బీజేపీకి చెక్ పెట్టడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు సానుకూల ధృక్పథంతో ముందుకు సాగాలని ఆశిస్తోంది. జేడీఎస్ లక్ష్యం లోక్‌సభ ఎన్నికలే జేడీఎస్ కురువృద్ధుడు హెడీ దేవెగౌడ కూడా తమ రాజకీయ ప్రాధాన్యాలను స్పష్టం చేశారు. తాము రాబోయే పెద్దయుద్ధానికి సిద్ధమవుతున్నట్లు(లోక్‌సభ ఎన్నికలకు) ప్రకటించారు. కర్ణాటకలో సెక్యులర్ విలువలున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో బీజేపీతో చేతులు కలపడం వల్ల ఏర్పడిన మచ్చను తన కుమారుడు కుమారస్వామి ఇప్పుడు చెరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. బీజేపీని అధికారానికి రాకుండా చేయాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమన్నారు. 2004-06 మధ్యకాలంలో చేసిన పొరపాట్లను కాంగ్రెస్-జేడీఎస్ గ్రహించాయని, ప్రస్తుత సంకీర్ణ సర్కార్ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తుందన్నవిశ్వాసం వ్యక్తం చేశారు. తమ తదుపరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికలేనని, బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో అన్ని సెక్యులర్ పార్టీలు ఒకే వేదికపైకి రావడం తక్షణ అవసరమని పేర్కొన్నారు. గతఅనుభవాలు పునరావృతం కాకుండా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మాదిరిగానే 2004లోనూ బీజేపీకి 80 సీట్లు, కాంగ్రెస్‌కు 65 సీట్లు, జేడీఎస్‌కు 58 సీట్లు రావడంతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. వొక్కలిగల నాయకుడు డీకే శివకుమార్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వొద్దంటూ జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ విధించిన షరతులతో మొదటి నుంచిఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పుడు జేడీఎస్‌లో ఉన్న డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టిన‘ అహిందా ర్యాలీ’ లను దేవెగౌడ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని లేదా అహిందాలలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలంటూ సిద్ధూపై తెచ్చిన ఒత్తిడి ఫలించకపోవడంతో ఆయనను బహిష్కరించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న హెచ్డీ కుమారస్వామి ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకుని, పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలను కూడగట్టారు.జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ తన 40 మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీతో దోస్తీకట్టారు. దీంతో ఆ సంకీర్ణ సర్కార్ పతనమైంది. దేవెగౌడ తన కొడుకు కుమారస్వామిని జేడీఎస్ నుంచి బహిష్కరించారు. 2006లో బీజేపీ-జేడీఎస్‌ల మధ్య చెరి 20 నెలలు అధికారాన్ని పంచుకోవాలనే ఒప్పందంతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట కుమారస్వామి సీఎం పదవిని చేపట్టి 20 నెలల పదవీకాలం పూర్తయ్యాక బీజేపీకి అధికార మార్పిడి సందర్భంలో సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత సీఎంగా ప్రమాణం చేసినా బలనిరూపణకు జేడీఎస్ ఎమ్మెల్యేలు మద్ధతివ్వకపోవడంతో ఏడు రోజుల్లోనే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. కర్ణాటకలో ఈ పరిణామాలు పునరావృతం కాకూడదనే ఇప్పుడు కాంగ్రెస్ మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్