Exit Polls Failed To Predict Karnataka Assembly Elections 2023 - Sakshi
Sakshi News home page

కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలు

Published Sat, May 13 2023 4:00 PM | Last Updated on Sat, May 13 2023 4:22 PM

Exit Polls Failed to predict Karnataka Assembly Elections 2023 - Sakshi

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. కొన్ని సంస్థలు అంచనా వేసిన విధంగానే కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో, బీజేపీ 64 స్థానాల్లో, జేడీఎస్ 20 లీడింగ్‌లో ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాల్లో పోలిస్తే జేడీఎస్ దాదాపు 17 స్థానాలు కోల్పోయింది. 2018లో జేడీఎస్ 37 స్థానాల్లో గెలిచింది. వరుస ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే క్రమంగా జేడీఎస్కి ఆదరణ తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఎగ్జిట్‌ పోల్స్‌లో 'యాక్సిస్ మై ఇండియా' కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 140 సీట్లు, బీజేపీకి 62 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనా ఇప్పుడు నిజమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఎగ్జిట్ అంచనాల కంటే మించి ఫలితాలు వచ్చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement