మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్ నమోదు కాగా.. అటు ఝార్ఖండ్‌లో 61.47శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సామాన్యులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛాఆనళ్ల చర్చల్లో పాల్గొనకూడదని హస్తం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం,గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో బీజేపీ విమర్శలు గుప్పించింది.
కాగా మహారాష్ట్రలో ఒకేవిడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీలు బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment