Jharkhand assembly
-
ఎగ్జిట్ పోల్స్ డిబేట్లపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్ నమోదు కాగా.. అటు ఝార్ఖండ్‌లో 61.47శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సామాన్యులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛాఆనళ్ల చర్చల్లో పాల్గొనకూడదని హస్తం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం,గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో బీజేపీ విమర్శలు గుప్పించింది.కాగా మహారాష్ట్రలో ఒకేవిడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీలు బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది. -
‘ఓటు వేశాక పెళ్లికి రండి’.. ఆకట్టుకుంటున్న శుభలేఖ
గొడ్డా: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఈ నేపధ్యంలో ఒక పెళ్లి కార్డు వైరల్‌గా మారింది. ఈ వివాహ శుభలేఖకు ఓటింగ్‌కు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. స్థానికులు ఈ పెళ్లి కార్డు గురించి తెగ చర్చించుకుంటున్నారు.జార్ఖండ్‌లోని గొడ్డాలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ నెల 29న ఈ ప్రాంతానికి చెందిన ఒక లోకోపైలెట్ వివాహం చేసుకోబోతున్నాడు. అతిథులను ఆహ్వానించేందుకు ప్రత్యేక రీతిలో పెళ్లికార్డు ముద్రించాడు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేసేందుకు ఆ లోకోపైలెట్ ముందుకొచ్చాడు.తన పెళ్లి కార్డులో ‘పెళ్లికి హాజరయ్యే ముందు అతిథులంతా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలి. మొదట ఓటు వేయండి. తరువాత పెళ్లికి రండి’ అని ముద్రింపజేశాడు. ఈ కార్డును చూసిన వారంతా ఆ లోక్‌పైలెట్ పెళ్లి కొడుకు రాజ్ కుమార్ సింగ్‌ను మెచ్చుకుంటున్నారు.గొడ్డాలో నివసించే శివ కుమార్ సింగ్ కుమారుడు రాజ్‌కుమార్ సింగ్‌కు నవంబర్ 29న వివాహం జరగనుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ నెల 20వ తేదీలోగానే పెళ్లి కార్డులన్నింటీ పంపిణీ చేస్తున్నామని వరుని సోదరుడు అభినవ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 400 కార్డులు పంపిణీ చేశామని, 20వ తేదీ ఉదయాన్నికల్లో మరో 200 కార్డులు పంపిణీ చేస్తామన్నారు. మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అని అభినవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం -
ఎన్నికల వేళ.. తగ్గింపు ధరల జోరు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు (నవంబర్ 13) మొదటి దశ ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కోడెర్మా జిల్లాలోని వివిధ సంస్థలు పలు వస్తువులపై విరివిగా ఆఫర్లు ప్రకటించాయి. ఫర్నిచర్ నుండి దుస్తుల వరకూ, అలాగే రెస్టారెంట్లలోని వంటకాలను రుచి చూసేందుకు తగ్గింపు ధరలను ప్రకటించారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును చూపించిన ఈ తగ్గింపు ధరల ఆఫర్‌ను సొంతం చోసుకోవచ్చు. స్థానిక పిజ్జా సిటీ రెస్టారెంట్ ఆపరేటర్ ఆదిత్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఓటుకున్న ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదని చెప్పారు. కోడెర్మా జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి, మరింత మందిని ఓటు వేసేలా చైతన్యపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయన్నారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును చూపితే, తన రెస్టారెంట్లో భారతీయ, చైనీస్, సౌత్ ఇండియన్ సహా అన్ని రకాల రుచికరమైన వంటకాలపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
Jharkhand Polls: ఐదుగురు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ఒక బ్లాక్ ఓటర్లు
హజారీబాగ్: జార్ఖండ్‌లోని దారు బ్లాక్‌లోని ఓటర్లు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేస్తుంటారు. 2008లో బ్లాక్ ఏర్పడినప్పటి నుంచి ఈ అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఈ బ్లాక్‌లో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు హజారీబాగ్, బర్కతా, మండు గ్రామాలున్నాయి. దీంతో దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లు ఐదుగురు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు.హజారీబాగ్ జిల్లాలోని దారు బ్లాక్‌లో తొమ్మిది పంచాయతీలు, 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ బ్లాక్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. ఈ కారణంగా ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఎన్నికల పరిస్థితి ఏర్పడింది. దారూలోని ఓటర్లు హజారీబాగ్, బర్కథా, మండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఇంతేకాదు వీరు హజారీబాగ్, కోడెర్మా లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలను కూడా ఎన్నుకుంటారు.దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లలో 21,398 మంది పురుషులు, 20,888 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 1,272 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది పంచాయతీలను కలిసి దారు బ్లాక్‌ను రూపొందించినప్పటి నుంచి ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. నవంబరు 13న జరిగే పోలింగ్‌కు దారు బ్లాక్‌లోని అన్ని పోలింగ్ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.ఇది కూడా చదవండి: Jharkhand Polls: మెదటి దశలో జేఎంఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బరిలో 53 పార్టీలు! -
ఫోన్‌తో ఎన్నికల ర్యాలీలో ప్రచారం.. ఈసీపై సీఎం సతీమణి ఆగ్రహం
రాంచీ: జార్ఖండ్‌లోని 43 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న(రేపు) తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముగించేశాయి. తాజాగా.. సీఎం హేమంత్ సోరెన్ సతీమణి, జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు ఆరోపణలు చేశారు. తన ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిందని, దీంతో ఫోన్లోనే తాను సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు.పశ్చిమ సింగ్భూమ్ జిల్లా జగన్నాథ్‌పూర్ నియోజకవర్గంలోని మౌలానగర్ మైదానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫోన్ ద్వారా ఆమె ప్రసంగిస్తూ.. జార్ఖండ్‌లో జేఎంఎం మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లను వినియోగించకుండా ఎన్నికల సంఘం అడ్డుకున్నదని ఆమె ఆరోపించారు. బీజేపీని టార్గెట్ చేసిన ఆమె ఆడపిల్లలు చదువుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనేది బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో పాఠశాలలను మూసేయడానికి ఇదే కారణమని ఆరోపించారు.బీజేపీ పార్టీ ధనవంతులు, వ్యాపారుల పార్టీ అని కల్పన కల్పనా సోరెన్ అభివర్ణించారు. గిరిజనం అనే పదాన్ని బీజేపీ ద్వేషిస్తుందని, వారి సంస్కృతిని, గుర్తింపును నాశనం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆమె ఆరోపించారు. ఆదివాసీ తెగ 'సర్నా కోడ్'ను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని ఆమె ప్రశ్నించారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి సోనారామ్ సింకుకు ఓటు వేయాలని కల్పనా సోరెన్ విజ్ఞప్తి చేశారు. అయితే కల్పనా సోరెన్ చేసిన ఆరోపణలపై జార్ఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ స్పందిస్తూ ఒడిశా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాల కదలిక కారణంగా కల్పనా సోరెన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గంటపాటు ఘట్సిలా వద్ద నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఉదంతంలో ఓ అధికారిని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో -
ఇకపై పరీక్షల్లో కాపీకొట్టి పట్టుబడితే జైలుకే..
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ గురువారం రోజున సంచలనాత్మక బిల్లును ఆమోదించింది. ఇకపై పరీక్షల్లో కాపీ కొట్టి పట్టుబడితే 10 కోట్లు జరిమానాతో పాటు జీవిత కాలం జైలు శిక్ష కూడా విధించేలా చట్టాన్ని రూపొందించి అమలు చేయనుంది. ఏమిటీ బిల్లు.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలాంగిర్ అలాం ఈ బిల్లును ప్రవేశపెట్టగా దీనిపై సుదీర్ఘంగా చర్చ కూడా సాగింది. ఇకపై ఎవరైనా పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే వారికి 10 కోట్లు జరిమానా తోపాటు జీవితకాలం ఖైదు చేసే విధంగా చట్టాన్ని రూపొందించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేయడాన్ని క్షమించరాని నేరంగా పరిగణిస్తూ నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. అనర్హులకు చెక్.. ఆయా నియామకాలకు సంబంధించి జరిగే కాంపిటీటివ్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం ద్వారా పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేసేవారికి కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్టయ్యింది. ఇంతకాలం పరీక్షల నిర్వహణలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లొసుగులను సద్వినియోగం చేసుకుంటూ గతంలో కొందరు అభ్యర్థులు పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారని, అందుకే ఈ తరహా కఠిన చట్టాలను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. మరోపక్క బీజేపీ పార్టీ ఎప్పటిలాగే దీన్నొక క్రూరమైన చట్టంగా వర్ణించింది. సీఎం కామెంట్.. దీనిపై స్వయంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను ఎలా తయారు చేస్తోందో అందరూ చూస్తున్నారని.. ఇలాంటి చట్టం చేయడం ఇదే మొదటిసారి కాదని, మరికొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే జైలు శిక్షను కూడా కుదిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాదిపాటు.. రెండోసారి పట్టుబడితే మూడేళ్లపాటు ఉండేలా సవరణలు చేశారు. ఇది కూడా చదవండి: విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. -
హేమంత్ కాకపోతే మరో ‘సోరెన్’.. సీఎం పదవిలోకి మరొకరికి నో ఛాన్స్?
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై నెలకొన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారు? అనే చర్చ మొదలైంది. అయితే.. మరో సోరెన్ ముఖ్యమంత్రి అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. సోరెన్ కుటుంబం నుంచి సీఎం పీఠం మరొకరికి వెళ్లదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టే అర్హత కలిగిన మరో సోరెన్ ఎవరు? ఓసారి పరిశీలిద్దాం. సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే.. ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతారు. దీంతో ముఖ్యమంత్రి పదవి ఎవరికనే అంశం కీలకంగా మారింది. సోరెన్స్ కుటుంబం సైతం ఇతర ప్రాంతీయ పార్టీలకు అతీతం కాదు. రాజకీయ సంక్షోభం తెలత్తినప్పుడు అదే కుటుంబం నుంచి మరొకరు ఆ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారు. కుటుంబ నేపథ్యం.. బిహార్ నుంచి జార్ఖండ్ ఏర్పాటు కోసం జార్ఖండ్ ముక్తి మోర్చాను ఏర్పాటు చేశారు శిబు సోరెన్. ఆయన రెండో కుమారుడే హేమంత్ సోరెన్. సీనియర్ సోరెన్.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీఎంకు రాజకీయ గురువుగా ముందుండి దారిచూపుతున్నారు. అయితే.. జేఎంఎం స్థాపించిన తర్వాత శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ ఆయన వారసుడిగా ఎదిగారు. మరోవైపు.. పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న హేమంత్ సోరెన్ దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయితే.. 2009లో దుర్గా సోరెన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. ఆయన తర్వాత శిబు సోరెన్ వారసురాలిగా కుమార్తె అంజలీ పేరు తెరపైకి వచ్చినా ఆమె అంతగా ఆసక్తి చూపలేదు. ఒడిశాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయారు. దీంతో హేమంత్ సోరెన్ కీలకంగా మారారు. ఆయనే.. పార్టీని చేపట్టారు. 38 ఏళ్లకే 2013లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ, ఏడాది కాలంలోనే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చారు సోరెన్. తాజాగా వచ్చిన ఆరోపణలతో మరోమారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జేఎంఎం-కాంగ్రెస్ కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సోరెన్ కుటుంబంలోని కొన్ని పేర్లు పరిశీలిద్దాం. ఇదీ చదవండి: రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు..జార్ఖండ్ సీఎం అనర్హతపై అదే సస్పెన్స్ ► శిబు సోరెన్: 78 ఏళ్ల శిబు సోరెన్.. ప్రస్తుతం జేఎంఎం అధ్యక్షుడిగా, ఎంపీగా క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఆయనపై కోర్టుల్లో చాలా కేసులు ఉండటం సహా.. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం వల్ల సీఎం పదవి చేపట్టేందుకు విముఖత చూపించే అవకాశాలు ఉన్నాయి. ► రూపి సోరెన్: పార్టీ అధినేత శిబు సోరెన్ భార్య రూపి సోరెన్. ఆమెకు రాజకీయాల్లో అంతగా అనుభవం లేనప్పటికీ ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తితే ఆమె పేరు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేశారు. ► కల్పనా సోరెన్: హేమంత్ సోరెన్ తన భార్య కల్పనా సోరెన్‌ను ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనిశ్చితి నెలకొంటే ఆమెను తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, ఆమె ఒడిశాకు చెందిన వ్యక్తి కావటం అడ్డంకిగా మారనుంది. ► సీతా సోరెన్: దుర్గా సోరెన్ మరణం తర్వాత శిబు సోరెన్.. తన కోడలు సీతా సోరెన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జామా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, ఆమె సైతం ఒడిశా నుంచి రావటం అడ్డంకిగానే మారనుంది. ► బసంత్ సోరెన్: శిబు సోరెన్ చిన్న కుమారుడు, హేమంత్ సోరెన్ తమ్ముడు, దుమ్కా ఎమ్మెల్యే బసంత్ సోరెన్ పేరు వినిపిస్తోంది. అయితే.. ఆయన కూడా హేమంత్ లాగే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. అనర్హత వేటు ఎదుర్కునే అవకాశం ఉంది. ► అంజలీ సోరెన్: శిబు సోరెన్ కుమార్తె అంజలీ సోరెన్ వివాహం తర్వాత ఒడిశా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో సీఎం పదవి రేసు నుంచి ఆమె లేనట్లే. మరోవైపు.. జేఎంఎం, హేమంత్ సోరెన్.. కుటుంబేతర వ్యక్తివైపు చూస్తే.. అప్పుడు పార్టీ సీనియర్ లీడర్, సెరైకేలా ఎమ్మెల్యే చంపాయ్ సోరెన్ ముందంజలో ఉంటారు. ఇంటిపేరు ఒకే విధంగా ఉండటమే కాకుండా.. పార్టీకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇదీ చదవండి: చిక్కుల్లో జార్ఖండ్ సీఎం సోరెన్ -
జార్ఖండ్ ఎమ్మెల్యేల వింత కోరిక
రాంచీ: ప్రజాసమస్యలపై చర్చించే అసెంబ్లీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటున్నారు.. జార్ఖండ్ ఎమ్మెల్యేలు. బయట మద్యం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, క్యూలలో జనాలు భారీగా ఉండటంతో ఇబ్బందిగా ఉంటోందని, అసెంబ్లీ ప్రాంగణంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. చలి కాలం కావడంతో మద్యం ప్రియులు ఎక్కువయ్యారని, దీంతో ఎమ్మెల్యేల సాయంత్రం పెగ్ అలవాటుకు సమస్యగా మారుతోందని ఓ ఎమ్మేల్యే వాపోయాడు. ఇక జార్ఖండ్ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేసి స్వయంగా లిక్కర్ షాపులను నిర్వహిస్తోంది. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎప్పుడు చూసిన రద్దీగా ఉంటున్నాయి. దుకాణాల ముందు గొడవలు జరుగుతున్నాయి. దుకాణాలు కేవలం సీటీ శివారులో ఉండటం.. రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉండటంతో మందుబాబులకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనేత్తాలనుకుంటున్నారు. ఈ విషయంలో స్పీకర్ దినేష్ సాయంతో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను ఒప్పిస్తామని ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) నేత హేమంత్ సోరేన్ కూడా మద్దతు తెలుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని తమ ఎమ్మెల్యేలకు సూచించారు. -
‘మత మార్పిడి బిల్లు’ వెనక మర్మమేమిటీ?
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఆవు మాంసాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే ఆదివాసీలకు దాన్ని దూరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2005లో ఆవు మాంసం నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మత మార్పిడుల నిషేధ చట్టం బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇంకా దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడం వల్ల బిల్లును ఆమోదించడం అంత కష్టమేమి కాదు. మత మార్పిడుల నిషేధ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లోలాగానే ‘మత స్వేచ్ఛ బిల్లు–2017’ అని దీనికి పేరు పెట్టారు. ఇతర రాష్ట్రాల చట్టాల్లోలాగానే ‘ఎల్యూర్మెంట్’కు పాల్పడితే శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు. ఎల్యూర్మెంట్ అంటే వివరణ ఇవ్వలేదు. స్థూలార్థం తీసుకుంటే ప్రలోభ పెట్టడమైనా, బలవంతం చేయడమైనా ఎల్యూర్మెంట్ కిందకు వస్తుంది. జార్ఖండ్‌లో ఎక్కువ మంది ఆదివాసీలు విద్యావకాశాలు చూసి క్రైస్తవం వైపు వెళుతున్నారు. అంటే ఇక్కడ విద్యావకాశాలను పరిగణలోకి తీసుకున్నా ప్రలోభానికి గురిచేయడమే అవుతుంది. ఈ బిల్లులో ‘త్రెట్ ఆఫ్ డివైన్ డిస్ప్లెజర్’ అనే పదంను విశ్వసించినా చట్టం కింద శిక్షార్హులే అవుతారు. క్రైస్తవ మతం ప్రకారం ఈ పదానికి అర్థం క్రీస్తును నమ్మకపోతే దూషణకు గురవుతావని, అందుకు నరకంలో శిక్ష అనుభవిస్తారని అర్థం. ఈ లెక్కన క్రైస్తవంలో చేరడమే శిక్షార్హమైన నేరం అవుతుంది. మాయమాటలు చెప్పి మతం మార్పిడికి ప్రయత్నించరాదు అనే పదాన్ని కూడా బిల్లులో చేర్చారు. హేతువాదుల ప్రకారం ప్రతీ మతం మాయమాటలు చెబుతుంది. ఈ లెక్కన క్రైస్తవం, ఇస్లాం ఏమతం పుచ్చుకున్నా నేరమే అవుతుంది. దేశంలో మత మార్పిడులను నిషేధిస్తూ చట్టం తీసుకరావడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వమే రెండుసార్లు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. 1955లో ఓ బిల్లుపై లోక్‌సభలో జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ దేశ పౌరులకు ఎవరికైనా తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఏ మతమైన ప్రజలను ప్రలోభ పెట్టి తమ మతాల్లో చేర్చుకోరాదని అన్నారు. ఇక్కడ ప్రలోభ పెట్టేవారికి శిక్ష విధించాలంటే అంది సాధ్యమయ్యే పనికాదని, ముందుగా ప్రలోభాలకు సరైన నిర్వచనం ఇవ్వలేమని అన్నారు. మత మార్పిడిలను నిరోధించే చట్టాలను తీసుకరావడం వల్ల అనవసరంగా మెజారిటీ ప్రజలు చిత్ర హింసలకు, శిక్షలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పైగా అనసరంగా పోలీసులకు అదనపు అధికారాలు ఇచ్చినట్లవుతుందని చెప్పారు. ప్రలోభపూరిత మత మార్పిడులను అరికట్టేందుకు ఇప్పుడున్న సాధారణ చట్టాలు సరిపోతాయని నెహ్రూ వాదించారు. అప్పుడు మెజారిటీ సభ్యులు ఆయనతో ఏకీభవించడం వల్ల జాతీయ స్థాయిలో మత మార్పిడి నిరోధక చట్టాలు రాలేదు. 1967లో, తొలిసారిగా ఒడిశాలో అప్పటి స్వతంత్య్ర పార్టీ ప్రభుత్వం మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ చట్టాలు ఇలాంటి చట్టాలను తీసుకొచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఎప్పుడో చట్టం తెచ్చినప్పటికీ దానికి సంబంధించిన నియమ నిబంధనలను ఖరారు చేయకపోవడం వల్ల అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. పదేళ్ల క్రితమే రాజస్థాన్ ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చినా ఇంతవరకు అది పార్లమెంట్ ఆమోదం పొందలేదు. మత స్వేచ్ఛా చట్టం అన్నప్పటికీ ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం కూడా మతమార్పిడుల నిషేధ చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో హిందూ మతస్థులే ఎక్కువగా ఉన్నప్పటికీ ‘సర్న’ అనే ఆదివాసీ మతస్థులు కూడా గణనీయంగానే ఉన్నారు. ఆ తర్వాత మూడవ స్థానంలో క్రైస్తవులు, నాలుగవ స్థానంలో ముస్లింలు ఉన్నారు. సర్న మతాన్ని ఆచరించే ఆదివాసీల్లో ఎక్కువ మంది కాలక్రమంలో హిందూ మతాచారాలకు మారారు. కొంత మంది విద్యావకాశాల కోసం క్రైసవంలోకి మారారు. ప్రస్తుతం క్రైస్తవంలోనే ఎక్కువ చదువుకున్నవారు ఉన్నారు. మిగిలిన సర్న మతస్థులు క్రైస్తవంలోకి వెళ్లకుండా నిరోధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివాసీలను విడదీయడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వారు విమర్శిస్తున్నారు. హిందూ మతంలోకి మారితే తప్పులేదని, అది మతం కాదని, ఓ జీవన విధానమని వాదిస్తున్న బీజేపీ నేతలు ఉన్నారు. -
కశ్మీర్, జార్ఖండ్‌లో నేడే చివరి పోలింగ్
జమ్మూ/రాంచీ: జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ శాసనసభలకు ఐదు దశల ఎన్నికల్లో భాగంగా శనివారం చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. జమ్మూ కశ్మీర్లో 3 సరిహద్దు జిల్లాల్లోని 20 అసెంబ్లీ సీట్లకు జార్ఖండ్‌లో ఆరు జిల్లాల్లోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగనున్న ఐదవ దశ పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కశ్మీర్లో ఇప్పటివరకూ జరిగిన నాలుగుదశల ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనందున, ఐదవ దశలో కూడా భారీగానే పోలింగ్ జరగవచ్చని భావిస్తున్నారు. చివరిదశలో 18లక్షల మందికిపైగా తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా 2,366 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జార్ఖండ్‌లో శనివారం 16 సీట్లకు జరగనున్న పోలింగ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)నేత హేమంత్ సోరెన్, స్పీకర్ శశాంక్ శేఖర్ భోక్తా, రాష్ట్ర మంత్రి లోబిన్ హెంబ్రోమ్ తదితర ప్రముఖులు సహా 208 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.