గొడ్డా: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఈ నేపధ్యంలో ఒక పెళ్లి కార్డు వైరల్‌గా మారింది. ఈ వివాహ శుభలేఖకు ఓటింగ్‌కు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. స్థానికులు ఈ పెళ్లి కార్డు గురించి తెగ చర్చించుకుంటున్నారు.
జార్ఖండ్‌లోని గొడ్డాలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ నెల 29న ఈ ప్రాంతానికి చెందిన ఒక లోకోపైలెట్ వివాహం చేసుకోబోతున్నాడు. అతిథులను ఆహ్వానించేందుకు ప్రత్యేక రీతిలో పెళ్లికార్డు ముద్రించాడు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేసేందుకు ఆ లోకోపైలెట్ ముందుకొచ్చాడు.
తన పెళ్లి కార్డులో ‘పెళ్లికి హాజరయ్యే ముందు అతిథులంతా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలి. మొదట ఓటు వేయండి. తరువాత పెళ్లికి రండి’ అని ముద్రింపజేశాడు. ఈ కార్డును చూసిన వారంతా ఆ లోక్‌పైలెట్ పెళ్లి కొడుకు రాజ్ కుమార్ సింగ్‌ను మెచ్చుకుంటున్నారు.
గొడ్డాలో నివసించే శివ కుమార్ సింగ్ కుమారుడు రాజ్‌కుమార్ సింగ్‌కు నవంబర్ 29న వివాహం జరగనుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ నెల 20వ తేదీలోగానే పెళ్లి కార్డులన్నింటీ పంపిణీ చేస్తున్నామని వరుని సోదరుడు అభినవ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 400 కార్డులు పంపిణీ చేశామని, 20వ తేదీ ఉదయాన్నికల్లో మరో 200 కార్డులు పంపిణీ చేస్తామన్నారు. మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అని అభినవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment