voter awareness programme
-
‘ఓటు వేశాక పెళ్లికి రండి’.. ఆకట్టుకుంటున్న శుభలేఖ
గొడ్డా: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఈ నేపధ్యంలో ఒక పెళ్లి కార్డు వైరల్‌గా మారింది. ఈ వివాహ శుభలేఖకు ఓటింగ్‌కు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. స్థానికులు ఈ పెళ్లి కార్డు గురించి తెగ చర్చించుకుంటున్నారు.జార్ఖండ్‌లోని గొడ్డాలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ నెల 29న ఈ ప్రాంతానికి చెందిన ఒక లోకోపైలెట్ వివాహం చేసుకోబోతున్నాడు. అతిథులను ఆహ్వానించేందుకు ప్రత్యేక రీతిలో పెళ్లికార్డు ముద్రించాడు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేసేందుకు ఆ లోకోపైలెట్ ముందుకొచ్చాడు.తన పెళ్లి కార్డులో ‘పెళ్లికి హాజరయ్యే ముందు అతిథులంతా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలి. మొదట ఓటు వేయండి. తరువాత పెళ్లికి రండి’ అని ముద్రింపజేశాడు. ఈ కార్డును చూసిన వారంతా ఆ లోక్‌పైలెట్ పెళ్లి కొడుకు రాజ్ కుమార్ సింగ్‌ను మెచ్చుకుంటున్నారు.గొడ్డాలో నివసించే శివ కుమార్ సింగ్ కుమారుడు రాజ్‌కుమార్ సింగ్‌కు నవంబర్ 29న వివాహం జరగనుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ నెల 20వ తేదీలోగానే పెళ్లి కార్డులన్నింటీ పంపిణీ చేస్తున్నామని వరుని సోదరుడు అభినవ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 400 కార్డులు పంపిణీ చేశామని, 20వ తేదీ ఉదయాన్నికల్లో మరో 200 కార్డులు పంపిణీ చేస్తామన్నారు. మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అని అభినవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం -
ముగిసిన ఓటరు సర్వే
మంచిర్యాలటౌన్: ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణ, మృతుల పేర్ల తొలగింపు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా, పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకంగా జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం జిల్లాలో ఇంటింటా ఓటరు సర్వే నిర్వహించింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలోని వివరాలు పరిశీలించి, పొరపాట్లను సరిదిద్దడంతోపాటు, మృతుల, బోగస్ ఓట్లను తొలగించారు. శుక్రవారంతో ఇంటింటి సర్వే పూర్తి కాగా, తొలగించిన వివరాలను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించారు. ప్రతీ ఓటరు ఇంటి నంబరును కచ్చితంగా వేయడంతోపాటు ఒకే ఇంటి నంబరు ఇస్తే వారు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా జాబితా సిద్ధం చేస్తున్నారు. ఓటర్ల సవరణలు, కొత్త పేర్ల నమోదు, మృతుల పేర్ల తొలగింపు, ఇళ్లు మారిన వారి చిరునామాలను మార్పు చేయడం వంటివి చేసి, అక్టోబర్ 5న ఓటర్ల తుది జాబితా ప్రకటించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. పూర్తి పారదర్శకంగా ఉండేలా... బోగస్, డబుల్ ఓట్ల తొలగింపునకు ఎన్నికల సంఘం పలు చర్యలు చేపడుతోంది. ఆధార్ అనుసంధానంతో డబుల్ ఓట్లను గుర్తించడం వంటి కార్యక్రమాలను చేపట్టినా, మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పులు లేని ఓటరు జాబితా రూపకలపనకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో గత కొద్ది రోజులుగా ఇంటి నంబర్ల ఆధారంగా ఓటరు జాబితాను సర్వే చేశారు. ఓటర్ల జాబితాను అనుసరించి ప్రతీ పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు మించకుండా ఉండేలా జూలై 27వరకు పోలింగ్ కేంద్రాలను క్రమబద్ధీకరించడం, జూలై 31వరకు ఓటరు జాబితాకు సంబంధించిన సప్లిమెంట్స్ ప్రక్రియ చేపట్టనున్నారు. సర్వే సమయంలోనే ఓటర్ల జాబితాలో పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఎంత మంది ఉన్నారనే వివరాలన్నీ క్రోడికరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో 152 మంది సవరణలు, 267 మంది మృతి, 62 మంది ఇతర చోటుకు వెళ్లినట్లుగా గుర్తించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 521 మంది సవరణలు, 560 మంది మృతులు, 464 మంది ఇతర చోటుకు వెళ్లిపోయిన వారిని గుర్తించారు. చెన్నూరు నియోజకవర్గంలో 152 మంది సవరణలు చేయగా, 267 మంది మృతి, 62 మంది ఇతర చోటుకు వెళ్లిపోయిన వారిని గుర్తించారు. -
సాంగ్, స్లోగన్ రాయండి.. క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు చైతన్య కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న వివిధ పోటీలకు మార్చి 15వ తేదీ వరకు గడువుందని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మై ఓట్ ఈజ్ మై ఫ్యూచర్–పవర్ ఆఫ్ వన్ ఓట్’ పేరిట జాతీయస్థాయిలో తొలిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సాంగ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, స్లోగన్, క్విజ్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. వీటిల్లో సాంగ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్ పోటీలను మూడు కేటగిరీల్లో (ఇనిస్టిట్యూషనల్, ప్రొఫెషనల్, అమెచ్యూర్) నిర్వహిస్తున్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ, ప్రత్యేక గుర్తింపుగా నగదు బహుమతులున్నాయి. ఇనిస్టిట్యూషన్ కేటగిరీలో నాలుగు ప్రత్యేక గుర్తింపు బహుమతులుండగా, మిగతా విభాగాల్లో మూడు ప్రత్యేక గుర్తింపు బహుమతులున్నాయి. రూ.2 లక్షల నుంచి 10 వేల వరకు బహుమతులు అందుకునే అవకాశం ఉంది. స్లోగన్ విభాగంలో మొదటి బహుమతి, రూ.20వేలు, రెండో బహుమతి రూ. 10వేలు, మూడో బహుమతి రూ.7,500. క్విజ్ పోటీలో విజేతలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి విలువైన బహుమతులు, బ్యాడ్జిలు అందజేయనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మూడు స్థాయిల్లో పాల్గొన్న వారందరికీ ఈ–సర్టిఫికెట్టు అందజేయనున్నట్లు తెలిపింది. పోటీలో పాల్గొనాలనుకునేవారు పూర్తి వివరాల కోసం voterawarenesscontest.in చూడవచ్చునని పేర్కొంది. (చదవండి: కరోనాకు వేవ్‌లు లేవు... వేరియంట్లే) -
రేపు ఎథిక్ ఓటింగ్‌పై కవి సమ్మేళనం
సాక్షి, విజయవాడ : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించడంతో పాటు నీతిబద్ధమైన ఓటింగ్ (ఎథిక్ ఓటింగ్)పై కవి సమ్మేళనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు భవానీపురం బెరంపార్క్ పశ్చిమ బయళ్లలో నీతిబద్ధమైన ఓటింగ్‌పై కవి సమ్మేళనానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వీప్ (సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్)లో భాగంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పటిష్టతకు, నీతివంతమైన పాలనకు శ్రీకారం చుట్టాలన్నారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, జిల్లా యంత్రాంగం సంయుక్త సహకారంతో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, జిల్లా ఎన్నికల అధికారి ఏఎండీ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, వీఎంసీ కమిషనర్ రామారావు హాజరు కానున్నారని తెలిపారు. ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఔత్సాహిక కవులు, కళాకారులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనాలని జేసీ కోరారు. సమావేశంలో డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి, డీఎస్ఓ నాగేశ్వరరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ శివజ్యోతి, సోషల్ వెల్ఫేర్ జేడీ పీఎన్వీ ప్రసాద్, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి, కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం మామా..ఓటు సూసుకున్నావా..!
సాక్షి, కడప : వెంకటయ్య : ఏరా .. సుబ్బయ్య ఈ రోజు ఇంటికాడనే ఉన్నావు. సేనికి పోలేదా.. సుబ్బయ్య : సేనికిపోయి ఏం చేయాలి మామా.. నీళ్లు లేక బోరు ఎండిపాయే. సెన్నిక్కాయ పంటంతా ఎండిపాయగా.. కాలువకేమో నీళ్లు రాలే. ఓట్లప్పుడు నాయకులు వస్తారు, నీళ్లిస్తమంటరు.. తర్వాత ఇక్కడ తొంగిచూడరు. వెంకటయ్య : అది సర్లే గానీ గోడలకు, స్తంభాలకు కట్టిన బొమ్మలన్నీ ఎట్లా పెరికేస్తున్నారో సూడు. సుబ్బయ్య : అద్యా మామా.. ఓట్లు ఉన్నాయి కదా .. రేపు నెల 11న మనము ఓట్లేయాలి. అదిగో మన మాబాషాకైతే రాజకీయాలు బాగా తెలుసు. ఓ మాబాషా ఇట్లరా.. వెంకటయ్య మామ పిల్చుతున్నాడు. మాబాషా : ఏమబ్బా... మామ, అల్లుళ్లు చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారే. వెంకటయ్య : ఏంది లేదు మాబాషా... ఈ సూరి యాయా పార్టీల మధ్య పోటీ ఉంటాది. మాబాషా : దీంట్లో చెప్పేదేముంది. మనకుండేది రెండే పార్టీలు. వెంకటయ్య : ఈ సారి జగనే ముఖ్యమంత్రి అయితాడని సెపుతున్నారంతా. రామయ్య : ఏమప్ప (టవల్ దింపుకుంటూ వచ్చి) మాబాషా నా అంతా సీనియర్ లేడని సెప్పుకొనే చంద్రబాబు జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టినాడు కదా.. ఇదెక్కడి న్యాయం! మాబాషా : నువ్వు చెప్పింది నిజమే రామయ్య. ఓటర్లను వెన్నుపోటు పొడిచేందుకు బాబు మళ్లీ ఏందో సేత్తున్నట్లుంది. ఇన్నాళ్లు మనం గుర్తుకు రాలేదు. చంద్రబాబు.. ఎలచ్చన్ల భయంతో అవీ ఇవీ సెబుతున్నాడు. గత ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అధికార పార్టీ నాయకులు సెప్పిందే సెబుతున్నారు. ఎలచ్చన్లు వచ్చే ముందు నిన్నగాక మొన్న చాన్నా శిలాఫలకాలు వేశారు. భూమిపూజలు చేశారు. రామయ్య : మాబాషా ఇంకో మాట.. జన్మభూమి కమిటీలకన్నీ అప్పసెప్పి అసలోళ్లకు ఏ పథకం ఇవ్వకుండా సేశాడు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు సూడి ఈ ప్రభుత్వమంతా మోసమే. మాబాషా : నిజమే అసలాయనే బతికుంటే రాష్ట్రమే విడిపోయేది కాదు. మనకిన్ని తిప్పలొచ్చేవి కావు. మంచోళ్లను దేవుడు ముందే తీసుకెళతారంటే ఇదేనేమో.. వెంకటయ్య : అవు మాబాషా చేతిలో కాగితాలతో ఉరికెత్తేది మన యంకట్రెడ్డే గదా.. ఇక్కడికి పిలువు ఓ సారి. మాబాషా : ఓ.. యంకట్రెడ్డి.. ఎక్కడికి అట్లా ఉరుకుతున్నావు? వెంకటరెడ్డి : (ఆయాసంతో) ఏం చెప్పాలి. ఇప్పటికి ఐదు దఫాలు ప్రతి ఎన్నికలకు వెళ్లి ఓటేసా. ఇప్పుడు లిస్టులో నా ఓటు, నా పెండ్లాం, నా కొడుకు ఓట్లు లేవంటా. ఎవడో కాగితం పెట్టి తీపిచ్చాడంటా. ఇదెక్కడి న్యాయం సూడి. సుబ్బయ్య : నీవే కాదు వెంకట్‌రెడ్డి.. చానా మంది పేర్లు తీసేసేందుకు పెద్దకుట్రే జరిగిందంట.. అందుకే అందరూ మన ఓటు ఉందో లేదోనని ఓటర్ల జాబితాలో సూసుకోవడం మంచిది. ఫారం–6తో మళ్లీ ఓటరు జాబితాలో చేర్చుకునే అవకాశం ఉంది. వెంకటరెడ్డి : గీ మధ్యనే మా యింటి కాడికి సర్వే వాళ్లు కూడా వచ్చి వెళ్లారు. వాళ్లు అన్నీ అడిగారు. ఎవరికి ఓటు వేస్తావో సెప్పమన్నారు. నేను కూడా వెళ్లి ఓటు ఉందో లేదో సూసుకుంటా. సుబ్బయ్య : అవున్లే... టయానికి గుర్తు సేసావు ఓటరు కార్డు తీసుకురా.. ఎందుకైనా మంచిది ఇప్పుడే ఎమ్మార్వో ఆఫీసుకెళ్లి సూసుకొస్తా. ఓటు లేనోళ్లు ఈరోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలంటా.. లేకుంటే ఓటేయలేమప్ప. -
వరంగల్ : మీ ఓటు ఉందా.. చెక్ చేసుకోండి..
సాక్షి, వరంంగల్ : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceotelangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. - ఓటు నమోదుకు ఈ నెల 15వ తేదీ చివరి గడువు. -
ఓటు హక్కుపై చైతన్యం పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటింగ్ శాతం పెరిగితే అది దేశానికి శుభసూచకం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచాలని పలు రంగాల ప్రముఖులకు పిలుపునిచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక, వినోద రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తూ ప్రధాని బుధవారం వరస ట్వీట్లతో పాటు ప్రత్యేక బ్లాగ్ రాశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, వ్యాపార దిగ్గజం రతన్ టాటా, బెంగాల్ సీఎం మమత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నాగార్జున, మోహన్‌లాల్ తదితరుల పేర్లు ప్రస్తావించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, ఏపీ సీఎం చంద్రబాబు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, దీపికా పదుకొణె తదితరులను ట్యాగ్ చేశారు. మీడియా రంగ ప్రముఖులు వినీత్ జైన్, సంజయ్ గుప్తా, అరుణ్ పూరీలతో పాటు సంస్థలు పీటీఐ, ఏఎన్‌ఐలను జతచేస్తూ ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకమన్నారు. ఓటేయకుంటే ఆ నొప్పి తెలియాలి ‘అధిక ఓటింగ్ శాతంతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. అది దేశానికి శుభసూచకం కూడా. పటిష్ట ప్రజాస్వామ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది. గత కొన్నేళ్లుగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు విలువను తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులను కోరుతున్నా. దేశ ప్రగతి పథంలో భాగస్వామి అయ్యేందుకు పౌరుడి ఇష్టాన్ని ఓటు సూచిస్తుంది. పోలింగ్ బూతులకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోని వారికి ఆ బాధ తెలియాలి. భవిష్యత్తులో మీరు కోరుకోని, అవాంఛనీయ పరిస్థితి రావాలని అనుకుంటున్నారా? మీరు ఆ రోజు ఓటేయనందుకే ఈ పరిస్థితి తలెత్తిందని చింతిస్తారా?’ అని మోదీ బ్లాగ్‌లో ప్రశ్నించారు. -
మన తలరాతలు మనమే రాసుకుందాం
-
ప్రకాశం: మీరూ చెక్ చేసుకోండి...
సాక్షి, ప్రకాశం: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceo.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు check your vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ‘‘నేను ఓటరు లిస్టులో నా పేరు ఉందో లేదో చెక్ చేసుకున్నాను.’’– వాడరేవు వినయ్ చంద్, జిల్లా కలెక్టర్, ప్రకాశం -
ఓటర్ లిస్టులో పేరుందా? మీరూ చెక్ చెసుకోండి
-నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. -1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. -జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ 9491602905 -జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. -మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. -గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. -సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
ఓటరు లిస్ట్‌లో మీ పేరు చెక్ చేసుకున్నారా?
-
ఓటు యెట్లెస్తరు సారు.!
సాక్షి,ఇందూరు: వీవీప్యాట్ పనితీరు, ఈవీఎం ద్వారా ఓటు ఎలా వేయాలనే దానిపై కలెక్టరే ట్లో ఏర్పాటు చేసిన అవగాహన కేంద్రానికి మంచి స్పందన లభిస్తోంది. సోమవా రం గ్రామీణ ప్రాంతానికి చెందిన కొంత మంది మహిళలు ఇక్కడకు వచ్చి ‘ఓటు యెట్లెస్తరో సూపియ్యూ సారు’ అని ఓటు వేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. నీ ఓటు విలువ తెలుసుకో! సాక్షి,కామారెడ్డి అర్బన్: శాసనసభ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఓటు హక్కుపై ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టింది. మరోవైపు, సోషల్ మీడియా లో సామాజిక కార్యక్తలు ఒకే ఒక్క ఓటు విలువ ఎంతో తెలుసా? అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఆ ఓటు విలువను ఇలా వివరిస్తున్నారు. 1999లో ఒకే ఒక్క ఓటు దేశ భవిష్యత్తునే మార్చేసింది. వాజ్‌పేయ్ కేవలం ఒక ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. లోక్‌సభలో 270 మంది సభ్యులు ఉంటే బీజేపీ ప్రభు త్వం నిలబడేది. కానీ, 269 ఓట్లు రావడంతో వాజ్‌పేయి ప్రభుత్వం 13 నెలలకే పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు థామన్ జాఫర్సన్, జాన్ ఆడమ్స్, రూథర్ ఫర్డ్ కేవలం ఒక ఓటు మెజారిటీతో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఒక్క ఓటుతో జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఒకే ఒక్క ఓటుతో మొదటి కింగ్ జేమ్స్ ఇంగ్లాండ్ రాజయ్యాడు. 2004లో కర్ణాటక ఎన్నికల్లో సంతేమారేహళ్లీ (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తి కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయారు. కృష్ణమూర్తి కారు డ్రైవర్ ఆ రోజు ఓటు వేయలేదు. రాజస్థాన్‌లో 2008 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సీపీ జోషి ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందారు. అ ఎన్నికల్లో జోషి కుటుంబ సభ్యులు తల్లి, భార్య, కారు డ్రైవర్ ఓటు వేయలేదు. వారు ముగ్గురు ఓటేసి ఉంటే జోషి గెలుపొందే వారు. -
ఇదేంది పల్లె సారూ!
– ఎమ్మెల్సీ ఓటు నమోదుపై జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు – ముఖ్య అతిథిగా హాజరై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పల్లె – తాము సూచించే అభ్యర్థికి సహకరించాలని హుకుం! ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. అభ్యర్థులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తాయి. ఇందులో పార్టీ గుర్తులేమీ ఉండవు. ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఎవరికి ఓటు వేయాలని చెప్పకూడదు. ఈ విషయాలన్నీ మన మంత్రి పల్లె రఘునాథరెడ్డికి తెలియనివి కావు. కానీ అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేస్తాం అన్న ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఆదివారం అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై నిర్వహించిన అవగాహన సదస్సు ఇందుకు వేదికైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదుపై ఉపాధ్యాయులకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ‘నవంబర్ 5 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అందరూ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా మంచి అభ్యర్థిని పెడుతుంది. సహకరించండి’ అని చెప్పడంతో బిత్తెరపోవడం ఉపాధ్యాయుల వంతైంది. ఈయన ప్రభుత్వంలోని మంత్రి హోదాలో వచ్చారా.. లేక పార్టీలో నాయకుడిగా వచ్చారా అని గుసగుసలాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం కూడా అభ్యర్థిని బరిలోకి దించవచ్చా? అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. మంత్రి అంతటితో ఆగకుండా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని, వాటన్నింటినీ దష్టిలో పెట్టుకుని తాము సూచించిన వారికి.. ప్రభుత్వానికి సహకరించాలని హుకుం జారీ చేశారు. ఎంఈఓలు కీలకంగా వ్యవహరించి ఓటరు నమోదుకు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పనితీరుపై విసుగు తెప్పించే ప్రసంగం చేశారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓటు నమోదుపై అవగాహన కోసం వస్తే ‘ఇదేంది పల్లె సారూ’ అంటూ చర్చించుకున్నారు. అంతకుముందు∙ప్రభుత్వ జూనియర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు మంత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజ్ కోసం రెండేళ్ల క్రితం సబ్ కమిటీ వేసినా ఇంత వరకు అతీగతీ లేదంటూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యర్రప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, జోనల్ అధ్యక్షుడు అల్తాఫ్ తదితరులు మంత్రిని నిలదీశారు. తక్షణం పీఆర్సీ అమలు చేయాలని, ఐదు నెలల జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ప్రసంగానికి ముందు డీఈఓ అంజయ్య, ఎస్ఎస్ఏ పీఓ దశరథనామయ్య, ఆర్ఐఓ వెంకటేశ్వర్లు, డీవీఈఓ వెంకటరమణ తదితరులు ఓటు నమోదు ప్రక్రియ ఎలా చేపట్టాలో వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు లక్ష్మీనారాయణ, సుబ్బారావు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.