రాంచీ: జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు(శనివారం) విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో ప్రధాన పోటీ హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏల మధ్యే ఉంది. ఎన్నికల ఫలితాలకు ముందు హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.
కౌంటింగ్ కేంద్రాలకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో జేఎంఎం పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రానిక్ నిపుణులను ఇక్కడ మోహరిస్తోందని జార్ఖండ్ ముక్తి మోర్చా ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రంలోని 24 కౌంటింగ్ కేంద్రాలలో జరగనుంది. జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో బీజేపీ కౌంటింగ్ కేంద్రాల వెలుపల ఇతర రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రానిక్ నిపుణులను నియమించినట్లు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు
Comments
Please login to add a commentAdd a comment