రాంచీ: ప్రధాని మోదీ మొదలు బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంచేసినా మెజారిటీకి సరిపడా ఓట్లు రాలకపోవడంతో బీజేపీ అధిష్టానంలో అంతర్మథనం మొదలైంది. స్థానిక అంశాలను పట్టించుకోకుండా జాతీయ అంశాలపై దృష్టిపెట్టిన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. బీజేపీ కూటమి ఓటమికి కారణాలుగా చెబుతున్న వాటిల్లో కొన్ని...
⇒ జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తరఫున బలమైన హేమంత్ సోరెన్‌కు పోటీగా బీజేపీ కూటమి గిరిజన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు.
⇒ కేవలం సోరెన్ సర్కార్ అవినీతిపై, బంగ్లాదేశ్ చొరబాట్ల చుట్టూతా బీజేపీ ప్రచారం సాగింది.
⇒ సొంత రాష్ట్రంలోని నేతలను ముందుపెట్టి ప్రచారంచేయాల్సిందిపోయి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అగ్రనేతలతోనే ప్రచారపర్వాన్ని పూర్తిచేసింది.
⇒ రాష్ట్ర సీనియర్ నేతలకు తగు ప్రాధాన్యత ఇవ్వలేదు. చాన్నాళ్లుగా పార్టీనే అంటిపెట్టుకున్న వాళ్లను కాదని కాంగ్రెస్, జేఎంఎం నుంచి వలసవచి్చన నేతలకే పార్టీ టికెట్లు ఇచ్చారన్న విమర్శలొచ్చినా బీజేపీ కేంద్రనాయకత్వం పట్టించుకోలేదు. దీంతో కొందరు బీజేపీ నేతలు పార్టీని వీడారు.
⇒ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేదార్ హజ్రా, మాజీ మంత్రి లూయిస్ మరాండీలు జేఎంఎం తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఆ మేరకు ఓట్లు జేఎంఎం వైపునకు మళ్లాయి
⇒ రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి కేవలం జాతీయ అంశాలనే ప్రచారా్రస్తాలుగా చేసుకుని ముందుకెళ్లిన బీజేపీకి ఒరిగిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ బగీశ్ చంద్ర వర్మ చెప్పారు.
⇒ దశాబ్దాలుగా ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు జేఎంఎంకే ఓటేశారు. ఈసారి మహిళలు వాళ్లకు తోడయ్యారు
⇒ మైయాయ్‌న్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే రూ.1,000 ఆర్థికసాయాన్ని రూ.2,500కు పెంచుతానన్న జేఎంఎం హామీ బాగా పనిచేసింది. మహిళలను ఆకట్టుకునే హామీని బీజేపీ ఇవ్వలేదని తెలుస్తోంది.
⇒ నియోజకవర్గాలవారీగా చూస్తే 81 నియోజకవర్గాలకుగాను 68 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అధిక మహిళల ఓట్లతోనే జేఎంఎం అధికారాన్ని కాపాడుకోగల్గిందని వర్మ విశ్లేషించారు
⇒ కొన్ని చోట్ల లోక్‌తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా, ఏజేఎస్‌యూ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాయి. దీంతో బీజేపీకి నష్టం చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment