రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 13 జరిగింది. తొలి విడత పోలింగ్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్‌ను అభివృద్ది దిశగా నడిపేందుకు, మనం కన్న కలలను నెరవేర్చుకునేందుకు తొలి దశ ఎన్నికల్లో అందరూ ఓటువేశారన్నారు.
బీజేపీ కుట్రలను తుదముట్టించి, కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హేమంత్ సోరెన్ హామీ ఇచ్చారు. శౌర్య భూమి అయిన సంతాల్, ఉత్తర ఛోటానాగ్‌పూర్‌లలో బీజేపీ పన్నిన కుట్రలను తుదముట్టించాలని హేమంత్ పేర్కొన్నారు.
ఇదేవిధంగా ఓటింగ్ ముగిసిన 43 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై విసిగి వేసారిన మహిళలు.. గూండాలు, అక్రమార్కులను పెంచి పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ఓటు వేశారన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్, పోలింగ్ సిబ్బంది, పోలీసులకు బాబులాల్ మరాండీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment