Jharakhand
-
ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ.. 16 ఫోర్లు, 6 సిక్సర్లతో
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశీవాళీ క్రికెట్లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన కిషన్.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో జార్ఖండ్‌కు సారథ్యం వహిస్తున్న కిషన్.. సోమవారం మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.255 పరుగుల లక్ష్య చేధనలో కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఈ జార్ఖండ్ డైనమెట్ ఊచకోత కోశాడు. కేవలం 78 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జార్ఖండ్ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్ల మాత్రమే కోల్పోయి 28.3 ఓవర్లలో చేధించింది. కిషన్‌తో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మణిపూర్ బ్యాటర్లలో ప్రియోజిత్ సింగ్(43), జాన్సెన్ సింగ్(69) పరుగులతో రాణించారు. జార్ఖండ్ బౌలర్లలో అనుకుల్ రాయ్, ఉత్కర్ష్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వికాస్ సింగ్,సుప్రీయో చక్రవర్తి తలా వికెట్ సాధించారు.కాగా ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు బీసీసీఐ అతడిపై వేటు వేసింది. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్లో రాణిస్తూ రీఎంట్రీ దిశగా ఇషాన్ అడుగులు వేస్తున్నాడు. -
ప్రధానిని కలిసిన హేమంత్ దంపతులు..
న్యూఢిల్లీ: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానంలో జార్ఖండ్ నూతన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఢిల్లీకి వెళ్లారు. కాగా రాజధాని రాంచీలోని సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి. आज दिल्ली में माननीय प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से मुलाकात कर उन्हें 28 नवंबर को अबुआ सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने हेतु आमंत्रित किया। pic.twitter.com/dPgWW6l7ir— Hemant Soren (@HemantSorenJMM) November 26, 2024మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే భార్య కల్పనా సోరెన్‌తో కలిసి న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రధాని మోదీని కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
Jharkhand Election: మొదటి దశ ముగిశాక బీజేపీ, జేఎంఎం వాదనలివే..
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 13 జరిగింది. తొలి విడత పోలింగ్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్‌ను అభివృద్ది దిశగా నడిపేందుకు, మనం కన్న కలలను నెరవేర్చుకునేందుకు తొలి దశ ఎన్నికల్లో అందరూ ఓటువేశారన్నారు.బీజేపీ కుట్రలను తుదముట్టించి, కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హేమంత్ సోరెన్ హామీ ఇచ్చారు. శౌర్య భూమి అయిన సంతాల్, ఉత్తర ఛోటానాగ్పూర్లలో బీజేపీ పన్నిన కుట్రలను తుదముట్టించాలని హేమంత్ పేర్కొన్నారు.ఇదేవిధంగా ఓటింగ్ ముగిసిన 43 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై విసిగి వేసారిన మహిళలు.. గూండాలు, అక్రమార్కులను పెంచి పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ఓటు వేశారన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్, పోలింగ్ సిబ్బంది, పోలీసులకు బాబులాల్ మరాండీ కృతజ్ఞతలు తెలిపారు.ఇది కూడా చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం -
Jharkhand Polls: మెదటి దశలో జేఎంఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బరిలో 53 పార్టీలు!
రాంచీ: జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నవంబర్ 13న రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బంది వివిధ బూత్‌లకు తరలివెళ్లారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఏ పార్టీలు గరిష్ట సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టాయనే విషయానికొస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జేఎల్కెఎం)కి చెందిన 35 మంది అభ్యర్థులు తొలి దశలో పోటీ చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 29 మంది, జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి 23 మంది, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) నుంచి 19 మంది, భారత్ ఆదివాసీ పార్టీ నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఈ దశలో జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాల్లో 53 పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 334 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో 1211 మంది అభ్యర్థులు పోటీ చేయగా, మొదటి దశలో 43 స్థానాల్లో 683 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న జాతీయ పార్టీలు 12 మంది మహిళలు సహా 87 మంది అభ్యర్థులను బరిలోకి దించాయి. జార్ఖండ్‌లోని గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి మహిళలు సహా 32 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఇతర రాష్ట్రాల రిజిస్టర్డ్ పార్టీలు ముగ్గురు మహిళలతో సహా 42 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. నమోదిత (గుర్తింపు లేని) రాజకీయ పార్టీలు 20 మంది మహిళలతో సహా 188 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. స్వతంత్ర అభ్యర్థులలో 299 మంది పురుషులు, 34 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఉన్నారు.ఇది కూడా చదవండి: ఫోన్‌తో ఎన్నికల ర్యాలీలో ప్రచారం.. ఈసీపై సీఎం సతీమణి ఆగ్రహం -
PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు. మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. మాఫియాల భరతం పడతాం జార్ఖండ్‌లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్‌కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు. రాంచీలో రోడ్ షో జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. #WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB— ANI (@ANI) November 10, 2024చదవండి: 10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే -
ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేడే!
ఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ( మంగళవారం) ప్రకటింనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీఐ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Election Commission of India to announce the schedule for General Election to Legislative Assemblies of Maharashtra and Jharkhand 2024.ECI to hold a press conference at 3:30 PM today. pic.twitter.com/yehIR0qUsm— ANI (@ANI) October 15, 2024288 సీట్ల ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది.అయితే, అంతకుముందే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇక. 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5వ తేదీతో ముగుస్తుంది.అదేవిధంగా దాదాపు 50 స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వాటిలో జూన్‌లో అమేథీ, వయనాడ్ రెండింటి నుండి గెలిచిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ లోక్‌సభ స్థానం కూడా ఉంది. వయనాడ్ స్థానానికి ప్రియాంక గాంధీ వాద్రా అభ్యర్థిగా పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.మహారాష్ట్రలో.. అధికార మహాయుతి కూటమి( బీజేపీ, శివసేన( షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం), ప్రతిపక్షాల కూటమి మహా వికాస్ అఘాడి( కాంగ్రెస్, ఎన్సీపీ( శరద్ పవార్ వర్గం) శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం)పోటీ చేయనున్నాయి. అదేవిధంగా జార్ఖండ్‌లో.. ఇండియా కూటమిలో భాగంగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), బీజేపీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్) పార్టీలు పోటీ చేయన్నాయి.చదవండి: చిరాగ్ పాశ్వాన్‌కు జెడ్– కేటగిరీ భద్రత -
తేనెటీగలదాడి.. తల్లీ ముగ్గురు కూతుళ్లు మృతి
రాంచీ:తేనేటీగల దాడిలో తల్లి ముగ్గురు కుమార్తెలు మృతిచెందిన విషాద ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది.జ్యోతిగడి అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని వీకెండ్ సరదాగా గడిపేందుకు తన పుట్టింటికి వెళ్లింది. వీరంతా కలిసి శనివారం(సెప్టెంబర్21)అకడున్న ఒక బావిలో స్నానం చేసేందుకు దిగారు.ఇంతలో ఎక్కడినుంచో వచ్చిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది.దీంతో తల్లీకూతుళ్లు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు తేనెటీగల దాడికి తట్టుకోలేక నలుగురూ బావిలోనే ప్రాణాలు విడిచారు.పోలీసులు నలుగురి మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టమార్టంకు పంపారు. ఇదీ చదవండి: కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు -
బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా: చంపయీ సోరెన్
ఢిల్లీ: జార్ఖండ్ ఆదివాసీ నేత, మాజీ సీఎం చంపయీ సోరెన్ తాను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ తొలుత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొందామని అనుకున్నా. ఈ నెల 18న ఢిల్లీకి వచ్చినప్పుడే నా వైఖరిని స్పష్టంగా చెప్పాను. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించా. కానీ, ప్రజల మద్దతు నాకు ఉంది. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయిం తీసుకున్నా’ అని చంపయీ స్పష్టం చేశారు.#WATCH | Delhi: Former Jharkhand CM & JMM leader Champai Soren says, "When I had come on 18th August I had made my position clear...At first, I thought that I would retire from politics but then due to the public support, I decided not to...I have decided to join the BJP..."… pic.twitter.com/i4BD0KtOSV— ANI (@ANI) August 27, 2024 ఇక.. ఆయన ఆగస్టు 30న బీజేపీలో అధికారికంగా చేరనున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. చంపయ్ కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యాక పార్టీలో చేరిక విషయంలో నిర్ణయం తీసుకున్నారని హిమంత తెలిపారు.చదవండి: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన చంపయీ సోరెన్! -
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన చంపయీ సోరెన్!
ఢిల్లీ: జార్ఖండ్ ఆదివాసీ నేత, మాజీ సీఎం చంపయీ సోరెన్.. జేఎంఎంకు ఝలక్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరునున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై చంపయీ సైతం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా ఆయన చేరికను నిర్ధారిస్తూ.. బీజేపీ నేత, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘ఎక్స్’ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మాజీ సీఎం, ఆదివాసీ నేత చంపయీ సోరెన్ ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాంచీలో చంపయీ అధికారికంగా ఆగస్టు 30 (శుక్రవారం)బీజేపీలో చేరనున్నారు’అని పేర్కొన్నారు.Former Chief Minister of Jharkhand and a distinguished Adivasi leader of our country, @ChampaiSoren Ji met Hon’ble Union Home Minister @AmitShah Ji a short while ago. He will officially join the @BJP4India on 30th August in Ranchi. pic.twitter.com/OOAhpgrvmu— Himanta Biswa Sarma (@himantabiswa) August 26, 2024ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని చంపయ సోరెన్ ఇటీవల అన్నారు. మరోవైపు.. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జేఎంఎం కార్యవర్గ నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్‌కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు.భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల గడువు జనవరి 5, 2025తో ముగియనుంది. దీంతో.. ఈ ఏడాది చివర్లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జార్ఖండ్‌కు ప్రకటన చేయొచ్చనే ప్రచారం జరిగింది. కానీ, ఈసీ అలాంటిదేం చేయలేదు. -
మనీలాండరింగ్ కేసు: జైలులో ఉన్న జార్ఖండ్ మంత్రి రాజీనామా
రాంచి: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న అలంగీర్ ఆలం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలంగీర్ ఆలం మంత్రి పదవికి, కాంగ్రెస్ పక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు ఆయన కుమారుడు తన్వీర్ ఆలం వెల్లడించారు. జూన్ 8 (శనివారం) ఆయన రాజీనామా చేసి.. రిజైన్ లెటర్‌ను అదే రోజు సీఎం కార్యాలయానికి పంపించారు. అయితే ఆయన రాజీనామా లేఖ జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఆఫీసుకు సోమవారం చేరినట్లు తన్వీర్ తెలిపారు. అలంగీర్ ఆలం రాజీనామా చేసినట్లు జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ నిర్ధారించారు. మనీలాండరింగ్ కేసులో అలంగీర్‌ను దర్యాప్తు చేయటం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే15న అరెస్ట్ చేసింది. మే 6 అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలం ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సుమారు రూ. 37 కోట్ల భారీ నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. భారీగా నగదు పట్టుబడటం జార్ఖండ్‌లో సంచలనం రేపింది. అలంగీర్ ఆలంతోపాటు సంజీవ్ లాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈడీ జహంగీర్ ఆలం ఇంటిపై సోదాలు చేసింది. వీరేంద్ర కె రామ్ గతేడాది అరెస్ట్ అయ్యారు. రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన పలు స్కీముల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.చదవండి: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు -
‘హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు’.. సుప్రీంకోర్టుకు మాజీ సీఎం సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్త పిటిషన్ దాఖలు చేశారు.తన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదంటూ తాజా పిటిషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న వాదనలు పూర్తి కాగా, హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని.. ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని లేదని తెలిపారు. ఈ మేరకు సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు ప్రస్తావించారు.చదవండి: కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పుహైకోర్టు తీర్పు నిరాకరించడం వల్ల తరువాత ఏం చేయాలనే విషయంలో సోరెన్ ప్రతిష్టంభనలో ఉన్నారని పేర్కొన్నారు. చట్టపరమైన పరిష్కారాల కోసం ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. తాము మళ్లీ హైకోర్టుకు వెళ్లి కనీసం తీర్పు ఇవ్వాలని కోరినా జడ్జి ఏం స్పందించలేదని చెప్పారు. సోరెన్ ఇక జైల్లోఏ ఉంటారా? లోక్‌సభ ఎన్నికలు కూడా ముగిసిపోతాయి. అప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం’ అని తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా .. ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ ఈ అంశాన్ని విచారించే తేదీలను ప్రకటిస్తుందని పేర్కొన్నారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్‌ను జనవరి 31న అరెస్టు చేసింది. ఈ కేసులో గతంలోనే సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఫిబ్రవరి 2న హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం తెలిపింది. సోరెన్ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
జార్ఖండ్ తదుపరి సీఎం ఆమె? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని.. తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పన బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేత సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నిశికాంత్ దుబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని, సంకీర్ణాన్ని, సీఎం హేమంత్ సోరెన్‌ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘ఎమ్మెల్యేగా సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా కొత్త ఏడాదిలో సోరెన్ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. త్వరలో హేమంత్ సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారు.ఆయన భార్య కల్పన సీఎం పదవిని చేపడతారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్.. న్యాయ సలహా తీసుకోవాలని బీజేపీ పేర్కొంది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2019లో కొలుదీరిన విషయం తెలిసిందే. झारखंड के गांडेय विधायक सरफराज अहमद ने विधानसभा से इस्तीफ़ा दिया,इस्तीफ़ा स्वीकार हुआ । हेमंत सोरेन जी मुख्यमंत्री पद से इस्तीफ़ा देंगे,झारखंड की अगली मुख्यमंत्री उनकी पत्नी कल्पना सोरेन जी होंगी । नया साल सोरेन परिवार के लिए कष्टदायक @itssuniltiwari pic.twitter.com/jl06AtXurh — Dr Nishikant Dubey (@nishikant_dubey) January 1, 2024 జేఎంఎం ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు జరిగే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎంపీ నిశికాంత్ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారించడానికి ఇప్పటివరకు ఈడీ.. సీఎం హేమంత్ సోరెన్‌కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సీఎం హేమంత్ సోరెన్ జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాల పైకి దర్యాప్తు సంస్థలను పంపి వాటిని వాడుకుంటోందని మండిపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు అవినీతి కేసులో ఈడీ విచారణపై సీఎం హేమంత్ సోరెన్ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం సోమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం పదవిని తన భర్య కల్పనకు అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది. చదవండి: Lalan Singh: నేను హిందువునే.. వాళ్లలా కాదు.. -
‘త్వరలో మరో పుల్వామా దాడి’ అంటూ పోస్ట్.. రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: ‘పుల్వామా దాడి’ మాదిరి మరో దాడి త్వరలో జరగనుందని ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఒక్కసారిగా దుమారం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లో సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జార్ఖండ్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ‘పుల్వామా దాడి... వంటి మరో దాడి తర్వలో జరగనుంది’ అని ఆ విద్యార్థి ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశాడు. మంగళవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు పుల్వామాలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద లభించిన తుపాకాలను స్వధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆర్మీ భద్రతా సిబ్బంది, పోలీసులు సంయూక్తంగా విచారణ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ స్టూడెంట్ పెట్టిన షోషల్ మీడియా పోస్ట్ వెలుగు చూడటంతో అప్రమత్తమైన షహరాన్ పూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు మృతి చెందిన విషయం తెలిసిందే. చదవండి: Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం -
జార్ఖండ్‌లో యువతిపై దారుణం.. బట్టలు విప్పి చెట్టుకి కట్టేసి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని నలుగురు తమ కుమారుడితో ప్రేమ వ్యవహారంలో 26 ఏళ్ల యువతిని అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కేంద్రానికి ఊరట.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన సుప్రీంకోర్టు -
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు
రాంచీ: జార్ఖండ్ హజారీబాగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బస్సులోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బస్సు గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో తాతిఝరియా వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి సివేనీ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వీరి సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి.. -
నా ఎమ్మెల్యే పదవిపై త్వరగా తేల్చండి: హేమంత్
రాంచీ: జార్ఖండ్‌లో గత మూడు వారాలుగా కొనసాగుతున్న అనిశ్చితిని తొలగించాలని, తన ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ఎమ్మెల్యేలను కొనేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. గనుల లీజుల వ్యవహారంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం ఈ ఏడాది ఆగస్టు 25న తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు పంపించింది. హేమంత్పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయడంపై గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. (చదవండి: లిక్కర్ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్ టెన్షన్) -
జార్ఖండ్ సీఎంకు టెన్షన్ టెన్షన్.. బ్యాగ్‌లు ప్యాక్ చేసుకున్న ఎమ్మెల్యేలు
రాంఛీ: సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్‌లో అస్థిరత నెలకొంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు లగేజీతో పాటు సీఎం ఇంటికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ కుంటీ జిల్లాలోని గెస్ట్ హౌస్‌కు తరలించారు సోరెన్. పటిష్ఠ భద్రత నడుమ రెండు బస్సుల్లో వీరిని అక్కడకు తీసుకెళ్లారు. ప్రయాణంలో వారితో పాటు బస్సులో సెల్ఫీ దిగారు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరందరినీ గెస్ట్ హౌస్‌కు తరలించడానికి ముందు మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు సోరెన్. Two buses, carrying Jharkhand MLAs, left from CM Hemant Soren's residence earlier this afternoon after a meeting of the UPA legislators. Pics from inside the buses. pic.twitter.com/nGodgPV7FY — ANI (@ANI) August 27, 2022 మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్‌కు 18, ఆర్జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు గవర్నర్ ఆయన ఎమ్మెల్యే పదవిని శుక్రవారం రద్దు చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నికకావాల్సి ఉంటుంది. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు -
జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు
రాంఛీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాంఛీలో బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఇంట్లో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సన్నిహితుడు కావడం చర్చనీయాంశమైంది. ప్రేమ్ ప్రకాశ్ ఈ ఆయుధాలు అక్రమంగా కలిగి ఉన్నారా? అనే విషయంపై మాత్రం ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. వీటిని సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రూ.100కోట్ల మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్లో 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సీఎం సన్నిహితుడు పంకజ్ మిశ్రా, బచ్చు యాదవ్‌లు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పంకజ్ మిశ్రా, అతని సన్నిహితుల నివాసాల్లో ఈడీ అధికారులు జులై 8నే దాడులు చేశారు. మొత్తం 19 చోట్ల సోదాలు చేశారు. మార్చిలోనే వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈమేరకు చర్యలు తీసుకున్నారు. మైనింగ్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. సోదాల్లో కీలకమైన పత్రాలు, బ్యాంకు బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాలు లభించాయి. అయితే ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో లభించిన ఏకే 47 తుపాకుల విషయంపై ఆయన గానీ, సీఎం సోరెన్ గానీ స్పందించలేదు. చదవండి: టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు.. -
దారుణం.. తొమ్మిదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలలపాటు..
రాంచీ: జార్ఖండ్ బోకారోలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులై 19న బాధితురాలు ఎలాగోలా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. అప్పటికే తమ బిడ్డ కన్పించట్లేదని కేసు పెట్టిన తల్లిదండ్రులు విషయం తెలిసిన వెంటనే బాధితురాల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను మనోజ్ కుమార్, విష్ణు కుమార్, మంతోష్ కుమార్‌లుగా గుర్తించారు. మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఏప్రిల్ 20న బాలిక మార్కెట్ నుంచి తిరిగివస్తుండగా.. ఆటోలో వచ్చిన మంతోష్ కుమార్ మరో ఇద్దరి సాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికను ఓ గదిలో బంధించి రోజు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను గదిలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయేవారు. జులై 19న అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ బాధితురాలి పరిస్థితిని చూసి రాయితో తాళం పగలగొట్టి విముక్తి కల్పించింది. వెంటనే బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కన్నతండ్రే కాలయముడై... కూతురిని, అల్లుడిని చంపి... -
ఒకప్పుడు నెట్ బౌలర్‌గా.. ఇప్పుడు ఏకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ మీడియం పేసర్ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో జార్ఖండ్ లెఫ్టార్మ్ పేసర్ సుశాంత్ మిశ్రాను సన్‌రైజర్స్ భర్తీ చేసింది. సుశాంత్ మిశ్రా 2020 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యడిగా ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో మిశ్రా ఏడు వికెట్లు పడగొట్టాడు. మరో వైపు దేశీవాళీ క్రికెట్లో నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుశాంత్ 13 వికెట్లు సాధించాడు. ఇక 2020 నుంచి 2021 ఐపీఎల్ సీజన్ వరకు ఆర్సీబీ నెట్ బౌలర్‌గా సుశాంత్ మిశ్రా ఉన్నాడు. కాగా రూ.20 లక్షలకు సుశాంత్ మిశ్రాతో ఎస్ఆర్హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్.. ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం(మే5) తలపడనుంది. చదవండి: Diego Maradona: మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్’ జెర్సీకి కళ్లు చెదిరే మొత్తం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పెళ్లి రోజు కానుకగా భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని
రాంఛీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అతని ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. ఇక, రిటైర్ దగ్గర నుంచి.. ఫామ్ హౌస్ లో భార్య సాక్షి, కూతురు జీవాలతో సరదాగా గడిపేస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి సింగ్‌ల వివాహ వార్షికోత్సవం నేడు. 2010లో ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి 11 ఏళ్లు నిండాయి. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి సాక్షి సింగ్ కి ధోని ఓ మధురమైన బహుమతి ఇచ్చాడు. సాక్షి కోసం స్పెషల్ గా ఓ వింటేజ్ కారును కొనుగోలు చేశాడు మహీ. లేత నీలం, వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న కారును యానివర్సరీ కానుకగా ఇచ్చాడంటూ ఇన్‌స్టా స్టోరీలో సాక్షి సింగ్ పోస్టు చేసింది. ధోనీ..సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. దీంతో సాక్షినే.. ధోనీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా ధోని ఫ్యాన్స్‌కు షేర్ చేస్తుంటోంది. వీరిద్దరికీ జీవా ధోనీ అనే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల జీవాకి ఇన్‌స్టాలో సెపరేట్ అకౌంట్ ఉండడమే కాదు, దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు. -
యాస్ తుపాను: మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్ల తక్షణ సాయం
న్యూఢిల్లీ: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్ బాలేశ్వర్ జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మెడినిపూర్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాలలో నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యల కింద రూ.1,000 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించారు. భువనేశ్వర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పునరావాస చర్యలకు సంబందించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాస్ తుపాను కారణంగా గరిష్ట నష్టం ఒడిశాలో జరిగిందని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు ప్రధానికి అధికారులు వివరించారు. ఇందులో ఒడిశాకు రూ.500 కోట్లు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కలిపి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి అవసరమయ్యే అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా బాధపడుతున్న వారందరికీ ప్రధాని తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు. తుఫాను కారణంగా తుపాను వల్ల చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సందర్శించడానికి ఒక మంత్రి బృందాన్ని నియమించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన ఆధారంగా మరింత సహాయం అందించనున్నట్లు తెలిపింది. చదవండి: యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే -
ఝార్ఖండ్ లోని రాంచీలో ఏనుగు బీభత్సం
-
అశ్లీల దృశ్యాలు, ఐటెంసాంగ్స్ వల్లే: శివానంద్
రాంచీ: జార్ఖండ్‌లో జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ స్పందించారు. సమాజంలో అత్యాచారాలు పెరగడానికి మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు లభించడమే కారణమని అన్నారు. సినిమాలలో ఐటెమ్‌సాంగ్స్, ఫోన్లలో అశ్లీల వీడియోలు లైంగిక దాడులు జరగడానికి ముఖ్య కారణమని, ఇలాంటివి ఉన్నంతకాలం చట్టాలు కూడా ఈ దారుణాలను ఆపలేవని పేర్కొన్నారు. ఎలాంటి అత్యాచారాలు, నేరాలు జరగని గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరగడం అక్కడ సంస్కృతిని నాశనం చేస్తున్నాయన్నారు. ‘‘గిరిజన ప్రాంతంలో మహిళలపై అత్యాచారం జరుగుతుందని ఎవరూ ఊహించరు. గిరిజన సంస్కృతిలో అత్యాచారాలు అనేవి ఇంతవరకు జరగలేదు. కాని ఆధునిక యుగం మొదలయ్యాక ప్రస్తుత మహిళలను ఆట బొమ్మలాగా చూస్తున్నారు’’ అని తివారీ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌లోని డుమ్కాలో 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణలు రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా సంచలనం సృష్టించిన విషయం విధితమే. మంగళవారం సాయంత్రం డుమ్కా జిల్లాలోని ముఫాసిల్ ప్రాంతంలో మహిళపై 17 మంది సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితురాలి భర్తను కట్టేసి అత్యాచారం చేశారు. అనంతరం మహిళ ఫిర్యాదు చేయగా, నిందితుల్లో ఒకరిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి జార్ఖండ్ ప్రభుత్వాన్ని నిందించారు. ఇది జార్ఖండ్ ప్రభుత్వం తప్పు అని, అత్యాచారాల నిషేదానికి చట్టాలు తీసుకొచ్చి వాటిని అమలు చేయాలన్నారు. నిందితులను కఠినంగా శికక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించి ఈ అత్యాచారాన్ని సుమోటోగా గుర్తించింది. లైంగిక వేధింపుల కేసుల్లో 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఎంహెచ్ఏ మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ జార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో చర్య తీసుకున్న సమగ్ర నివేదికను కూడా కోరింది. బాధితురాలు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఘటన జరిగిందని, దర్యాప్తు పప్రారంభించినట్లు డీజీపీ సుదర్శన్ మండల్ తెలిపారు. వైద్య పరీక్ష నిమిత్తం బాధితురాలిని హాస్పటల్‌కి పంపామని పేర్కొన్నారు. -
భార్య కోసం.. బైక్‌పై 1000 కిమీ
రాంచీ: భార్య తనకంటే విద్యాధికురాలు అయితే చాలా మంది మగవారికి నచ్చదు. ఇక పెళ్లాయ్యాక ఆడవారికి చదువుకునే వెసులుబాటు కల్పించే భర్తలు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో పదో తరగతితోనే చదువు ఆపేసి.. వంట మనిషిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. టీచర్ కావాలన్న తన భార్య కలను నెరవేర్చడం కోసం సుమారు 1000 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేసిన అరుదైన ఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివారాలు.. జార్ఖండ్ గొడ్డా ప్రాంతానికి చెందిన ధనంజయ్ కుమార్ పదవ తరగతి పాస్ అవుట్. తర్వాత వంట మనిషిగా పని చేస్తున్నాడు. ధనంజయ్ భార్య సోని హెంబ్రామ్‌కు టీచర్ కావాలని ఆశ. ఇందుకు గాను మధ్యప్రదేశ్ బోర్డు అందించే ప్రాథమిక విద్య డిప్లోమా కోర్సులో చేరింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతోంది. పరీక్షలు జరగుతున్నాయి. ఎగ్జామ్ సెంటర్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. గొడ్డా నుంచి పరీక్ష కేంద్రానికి మధ్య దూరం 1100 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్, కొన్ని షార్ట్‌కట్ మార్గాల వల్ల దూరం 1000 కిలోమీటర్లకు తగ్గింది. (చదవండి: క్లాస్ టీచర్) దాంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కోసం మూడు రోజుల పాటు బైక్ మీద 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు ఈ దంపతులు. ఈ సందర్భంగా ధనంజయ్ మాట్లాడుతూ.. ‘నా భార్య 2019లో మధ్యప్రదేశ్‌లో టీచర్ కోర్సులో చేరింది. జార్ఖండ్‌లో ఫీజు చాలా ఎక్కువగా ఉండటంతో ఇలా చేసింది. దాంతో తనకు గ్వాలియర్‌లో ఎగ్జామ్ సెంటర్ పడింది. అక్కడికి చేరుకోవడానికి ప్రస్తుతం రైళ్లు అందుబాటులో లేవు. సోని టీచర్ ఒకరు విద్యార్థులను గొడ్డా నుంచి గ్వాలియర్ తీసుకెళ్లడానికి కారు మాట్లాడారు. కానీ 30 వేల రూపాయలు చెల్లించాలని చెప్పారు. గత నాలుగు నెలలుగా నాకు ఉద్యోగం లేదు. దాంతో బైక్ మీద వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం నా భార్య ఆరోనెల గర్భవతి. ఆగస్టు 27 రాత్రి మా ప్రయాణం ప్రారంభమయ్యింది. బిహార్, లక్నోలోని ముజఫర్‌పూర్ మీదుగా ప్రయాణించి ఆగస్టు 30 సాయంత్రం గ్వాలియర్ చేరుకున్నాం. బంధువుల దగ్గర నుంచి 10 వేలు బదులు తీసుకుని పరీక్షకు వెళ్లడానికి బయలుదేరాం’ అని తెలిపాడు ధనంజయ్. (చదవండి: పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్) గ్వాలియర్‌లోని డీడీ నగర్ ప్రాంతంలో ఉండటానికి వారు 1,500 రూపాయలతో గది అద్దెకు తీసుకున్నారు. ధనంజయ్ మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికే 7,000 రూపాయలు ఖర్చు చేసాము. ఇప్పుడు 3 వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆరు నెలల గర్భవతి అయిన నా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నంది. ఇప్పుడు, నేను తిరిగి వెళ్ళడానికి అవసరమయిన డబ్బు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపాడు.