Dalit Woman Assaulted, Stripped And Tied To Tree Over Love Affair In Jharkhands Giridih - Sakshi
Sakshi News home page

Jharkhand Woman Assaulted Incident: జార్ఖండ్‌లో యువతిపై దారుణం.. బట్టలు విప్పి చెట్టుకి కట్టేసి  

Published Fri, Jul 28 2023 9:14 AM | Last Updated on Fri, Jul 28 2023 10:01 AM

Woman Stripped Tied To Tree Over Love Affair In Jharkhands Giridh - Sakshi

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని నలుగురు తమ కుమారుడితో ప్రేమ వ్యవహారంలో 26 ఏళ్ల యువతిని అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. 

బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు.

అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: కేంద్రానికి ఊరట.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన సుప్రీంకోర్టు

  
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement