Ranchi
-
జార్ఖండ్ పోలింగ్: 65 శాతం ఓటింగ్ నమోదు
Updatesజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 64.86 శాతం పోలింగ్ నమోదు64.86 pc voters exercise franchise in first phase Jharkhand polls till 5 pmRead @ANI Story | https://t.co/tFstV6aCDt#Jharkhandelections #SeraikellaKharsawan #Ranchi #voterturnout pic.twitter.com/EbdTX3lkW8— ANI Digital (@ani_digital) November 13, 2024 మధ్యా హ్నం 3 గంటల వరకు 59.28 శాతం పోలింగ్ నమోదుభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రాంచీలోని పోలింగ్ బూత్‌లో సతీమణి సాక్షితో కలిసి ఓటు వేశారు.మధ్యాహ్నం 1 గంట వరకు 46% పోలింగ్ నమోదైంది.सराइकेला खरसावाँ जिलांतर्गत कुचाई प्रखंड के नक्सल प्रभावित क्षेत्र जैसे जाम्बरो, रेगाबेड़ा,कोमाय, गिलुआ,सियाडीह,तरंबा मतदान केंद्रों पर कड़ी सुरक्षा के बीच भयमुक्त और शांतिपूर्ण वातावरण में मतदान।@ECISVEEP @SpokespersonECI #VoteDeneChalo pic.twitter.com/xM3z1eYJqV— Chief Electoral Officer, Jharkhand (@ceojharkhand) November 13, 2024 బీజేపీ నేత జయంత్ సిన్హా హజారీబాగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | BJP leader Jayant Sinha casts his vote in Hazaribag as polling in the first phase of Jharkhand Assembly elections is underway pic.twitter.com/3JNGBaGveV— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి సోనాపిలోని ప్రాథమిక విద్యాలయం వద్ద ఓటర్లు నక్సల్స్ బెదిరింపులను ధిక్కరించి భారీ సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చారు. నక్సలైట్లు.. పోస్టర్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. భద్రతా బలగాలు పోస్టర్లు, అడ్డంకులను విజయవంతంగా తొలగించాయి. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి, జగన్నాథ్‌పూర్ పోలింగ్ బూత్ నంబర్ 25లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.Voters at Prathmik Vidyala Sonapi defied naxals threat and came out in huge numbers to vote. Naxalite put up posters and tried obstructing the way. Security forces successfully removed the posters and obstacles and by 11 AM, 60% voting turnout was recorded at polling booth number… pic.twitter.com/ugpccrm3D5— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 29.31 శాతం ఓటింగ్ నమోదైంది#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Hemant Soren, his wife Kalpana Soren cast their votes at a polling station in Ranchi for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/QCOCNn57p8— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.04 శాతం ఓటింగ్ నమోదు#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు అర్జున్ ముండా, ఆయన భార్య మీరా ముండా ఓటు శారు.సెరైకెలా ఖర్సావాన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.పొత్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మీరాముండా బరిలో ఉన్నారు.#WATCH | Former Union Minister and BJP leader Arjun Munda, his wife Meera Munda show their inked fingers after casting vote at a polling station in Seraikela KharsawanMeera Munda is BJP's candidate from Potka Assembly constituency. #JharkhandAssemblyPolls2024 https://t.co/Xu8vO30qAR pic.twitter.com/mvKTxUy56H— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.ఒడిశా గవర్నర్ , జార్ఖండ్ మాజీ సిఎం రఘుబర్ దాస్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటువేశారు.#WATCH | #JharkhandAssemblyElections: Odisha Governor and former Jharkhand CM Raghubar Das along with his family show their inked finger after casting their votes at a polling station in Jamshedpur. He says "It is the responsibility of the people to come out and use their… pic.twitter.com/QwUeRj0S3a— ANI (@ANI) November 13, 2024 కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు హకక్కు వినియోగించుకున్నారు.కోడెర్మాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.#WATCH | Koderma, Jharkhand: Union Minister Annapurna Devi shows her inked finger after casting vote at a polling station in Koderma#JharkhandElections2024 pic.twitter.com/qpuLt4hEO9— ANI (@ANI) November 13, 2024 రాంచీలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.పోలీసులు డ్రోన్లను ఉపయోగించి నిఘా పెట్టారు.#WATCH | Ranchi, Jharkhand: Police use drones for surveillance in Ranchi as voting is underway for the first phase of #JharkhandAssemblyElections2024 pic.twitter.com/cjZow4klOn— ANI (@ANI) November 13, 2024 హజారీబాగ్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మున్నా సింగ్ ఓటు వేశారు.హజారీబాగ్‌లో అభివృద్ధి, శ్రేయస్సు తీసుకురావడానికి ఓటు వేయాలని హజారీబాగ్ ఓటర్లందరినీ అభ్యర్థించారు.#WATCH | Hazaribagh, Jharkhand: After casting his vote, Congress candidate from Hazaribagh Assembly seat Munna Singh says, "I request all voters of Hazaribagh to vote to bring development and prosperity in Hazaribagh."#JharkhandAssemblyPolls2024 pic.twitter.com/ljbEs0xlAP— ANI (@ANI) November 13, 2024 పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండి: ప్రధాని మోదీజార్ఖండ్ తొలి దశ పోలింగ్‌లో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓరట్లను కోరారు. తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు క్యూలైన్లలో ఉన్నారు. PM Modi urges citizens to vote with full enthusiasm in Jharkhand pollingRead @ANI Story | https://t.co/DlZb7WiwWK#PMModi #Jharkhandpolls #Assemblyelections pic.twitter.com/ogsyZoxYqU— ANI Digital (@ani_digital) November 13, 2024 జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. జంషెడ్పూర్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అజోయ్ కుమార్ ఓటు వేశారు. జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | East Singhbhum, Jharkhand: Congress candidate from Jamshedpur East, Dr Ajoy Kumar casts his vote at a polling station in Jamshedpur. pic.twitter.com/2Hen7AFJd1— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ ఓటు వేశారు.#WATCH | #JharkhandAssemblyElection: Union Minister Sanjay Seth casts his vote at a polling station in Ranchi. pic.twitter.com/DFMWrKKrlK— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.జంషెడ్పూర్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ నేత ఓటు హక్కు వినియోగించుకున్నారు.సరయూ రాయ్ జంషెడ్పూర్ వెస్ట్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బన్నా గుప్తా పోటీ చేస్తున్నారు. #WATCH | Jharkhand: NDA candidate from Jamshedpur West Assembly seat and JDU leader Saryu Roy casts his vote at a polling booth in Jamshedpur West Congress's Banna Gupta is contesting against him. pic.twitter.com/KIK8I2yJUD— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Santosh Kumar Gangwar, Governor of Jharkhand casts his vote at a polling booth in Ranchi, Jharkhand #JharkhandAssemblyElections2024 pic.twitter.com/bwRe4JFlzB— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోలింగ్ కొనసాగుతోంది.రాంచీలోని జవహర్ నగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ప్రజలు పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలైన్లో ఉన్నారు.#WATCH | People queue up at a polling station in Ranchi to vote in the first phase of Jharkhand Assembly electionsVisuals from a polling station in Jawahar Nagar pic.twitter.com/MVWrj3OnuU— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. రాంచీలోని పోలింగ్ బూత్ నంబర్లు 50,60, 61 పోలింగ్ జరుగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లతో నిల్చున్నారు.ఈ సందర్భంగా ఓ మహిళ సంప్రదాయ డోలు వాయిస్తూ ప్రజలను ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు.#WATCH | Ranchi: A woman plays a traditional drum and appeals to people to vote during the first phase of Jharkhand assembly elections.(Visuals from polling booth numbers 50,60 and 61 in Ranchi) pic.twitter.com/bjE5uDHQVp— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది.ఈ దశలో 81 స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటుర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. #WATCH | Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Visuals from a polling centre in Jamshedpur pic.twitter.com/cqSwJqSV6c— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు.తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. #WATCH | Preparations underway at St Columbus College polling booth in Hazaribagh, ahead of the first phase of voting to be held today.#JharkhandAssemblyPolls2024 pic.twitter.com/EY6WBe9YiT— ANI (@ANI) November 13, 2024 తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ ఇవాళే పోలింగ్ జరునుంది.కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారుఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది. తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి!బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి.11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. -
PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు. మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. మాఫియాల భరతం పడతాం జార్ఖండ్‌లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్‌కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు. రాంచీలో రోడ్ షో జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. #WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB— ANI (@ANI) November 10, 2024చదవండి: 10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే -
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్‌పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
Jharkhand Elections: నేడు రాహుల్ జార్ఖండ్ రాక.. 20న అభ్యర్థుల ఎంపికపై చర్చ
రాంచీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు (శనివారం) జార్ఖండ్ రానున్నారు. రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొని, 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన సంభాషించనున్నారు.రాహుల్ గాంధీ తన జార్ఖండ్ పర్యటనలో పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లాక అక్టోబర్ 20న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అదే రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. అభ్యర్థుల పేర్లపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కొనసాగుతుందన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించామని, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో కూడా చర్చలు జరిగాయన్నారు.ఇది కూడా చదవండి: మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’ -
తేనెటీగలదాడి.. తల్లీ ముగ్గురు కూతుళ్లు మృతి
రాంచీ:తేనేటీగల దాడిలో తల్లి ముగ్గురు కుమార్తెలు మృతిచెందిన విషాద ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది.జ్యోతిగడి అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని వీకెండ్ సరదాగా గడిపేందుకు తన పుట్టింటికి వెళ్లింది. వీరంతా కలిసి శనివారం(సెప్టెంబర్21)అకడున్న ఒక బావిలో స్నానం చేసేందుకు దిగారు.ఇంతలో ఎక్కడినుంచో వచ్చిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది.దీంతో తల్లీకూతుళ్లు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు తేనెటీగల దాడికి తట్టుకోలేక నలుగురూ బావిలోనే ప్రాణాలు విడిచారు.పోలీసులు నలుగురి మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టమార్టంకు పంపారు. ఇదీ చదవండి: కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు -
మహిళా జూనియర్ డాక్టర్‌కు వేధింపులు
రాంచీ: కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారంపై ఆందోళనలు కొనసాగుతుండగానే అలాంటి తరహా ఘటన మరొకటి జార్ఖండ్‌లో జరిగింది. రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) మెడికల్ కాలేజీ ఆస్పత్రి లిఫ్టులో మహిళా జూనియర్ డాక్టర్ లైంగిక వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వేధింపులకు గురైన డాక్టర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.జూనియర్ డాక్టర్‌కు వేధింపుల ఘటనను నిరసిస్తూ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. డాక్టర్లకు భద్రత పెంచుతామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రతి లిఫ్టులో లిఫ్ట్ ఆపరేటర్‌ను నియమించడంతో పాటు ఆస్పత్రి క్యాంపస్లోఎ 100 మంది సాయుధులైన భద్రతా సిబ్బందిని మోహరించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. ఇదీ చదవండి.. మమత అబద్దం చెబుతున్నారు: కోల్‌కతా వైద్యురాలి తల్లి -
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 49వ పుట్టినరోజు ఈరోజు (ఆగస్టు 10). ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా హేమంత్ సోరెన్ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక చిత్రాన్ని షేర్ చేశారు. దానిలో పాటు హేమంత్ సోరెన్ ఇలా రాశారు.. ‘నా పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది నాటి ఒక జ్ఞాపకం నా మదిలో మెదిలింది. అదే ఈ ఖైదీ గుర్తు.. ఇది జైలు నుండి విడుదలైనప్పుడు నాపై ముద్రించారు. ఈ గుర్తు నాది మాత్రమే కాదు.ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజులు జైలులో ఉంచారు. అందుకే ఈ గుర్తు సామాన్య గిరిజనులకు, అణగారిన వారికి చెందినది. దోపిడీకి గురవుతున్నవారి విషయంలో ఏమేమి జరుగుతుంటాయో ఎవరికీ చెప్పనవసరం లేదు. అందుకే ఈ రోజు నేను మరింత దృఢంగా నిశ్చయించుకున్నాను.. దోపిడీకి గురవుతున్న అణగారిన, దళిత, వెనుకబడిన, గిరిజన, ఆదివాసీలకు మద్దతుగా పోరాడాలనే నా సంకల్పాన్ని బలపరుచుకుంటున్నాను.హింసకు గురవుతూ, న్యాయం అందని ప్రతి వ్యక్తికి, సమాజానికి మద్దతుగా నేను నా గొంతును విప్పుతాను. చట్టం అందరికీ సమానమే. అధికార దుర్వినియోగం లేని సమాజాన్ని మనం నిర్మించాలి. అయితే ఈ మార్గం అంత సులభం కాదు. ఇందుకోసం మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మనమంతా కలిస్తే ఈ సవాళ్లను అధిగమించగలమనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మన దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వమే మన బలం’ అని అన్నారు. आज अपने जन्मदिन के मौक़े पर बीते एक साल की स्मृति मेरे मन में अंकित है - वह है यह कैदी का निशान - जो जेल से रिहा होते वक्त मुझे लगाया गया। यह निशान केवल मेरा नहीं, बल्कि हमारे लोकतंत्र की वर्तमान चुनौतियों का प्रतीक है।जब एक चुने हुए मुख्यमंत्री को बिना किसी सबूत, बिना कोई… pic.twitter.com/TsKovjS1HY— Hemant Soren (@HemantSorenJMM) August 10, 2024 -
జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సొరేన్!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం హేమంత్ సొరేన్ మరోసారి ముఖ్యమంత్రి చేపట్టబోతున్నట్లు సమాచారం. తమ నేతగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకుంటూ జార్ఖండ్ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. జార్ఖండ్‌లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లారు. అనంతరం, జూన్ 28వ తేదీన రాంచీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో సొరేన్ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంపై సొరేన్ స్థానంలో హేమంత్ సొరేన్ మళ్లీ బాధత్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంపై సొరేన్ అధికారిక కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. -
నీట్ పేపర్ లీక్: జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
రాంచీ: నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలే దేశంవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని విక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ప్రశ్న లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సీబీఐ తాజాగా శనివారం ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధాలు ఉన్నాయని జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసింది. ఓ హింది న్యూస్ పేపర్లో పనిచేసే.. జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు సాయం చేసినట్లు అభియోగాలతో సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలంకు శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది.అదేవిధంగా గుజరాత్‌లోని 7 వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గోద్రా, ఖేడా, అహ్మాదాబాద్, అనంద్ సోదాలు నిర్వహించింది. ఈకేసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా గోద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలిసారిగా ఇద్దరు నిందితులను పట్నాలో అరెస్టు చేసింది. నిందితులను మనీశ్ కుమార్, ఆశుతోష్‌గా గుర్తించారు. -
మనీలాండరింగ్ కేసు: జైలులో ఉన్న జార్ఖండ్ మంత్రి రాజీనామా
రాంచి: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న అలంగీర్ ఆలం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలంగీర్ ఆలం మంత్రి పదవికి, కాంగ్రెస్ పక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు ఆయన కుమారుడు తన్వీర్ ఆలం వెల్లడించారు. జూన్ 8 (శనివారం) ఆయన రాజీనామా చేసి.. రిజైన్ లెటర్‌ను అదే రోజు సీఎం కార్యాలయానికి పంపించారు. అయితే ఆయన రాజీనామా లేఖ జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఆఫీసుకు సోమవారం చేరినట్లు తన్వీర్ తెలిపారు. అలంగీర్ ఆలం రాజీనామా చేసినట్లు జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ నిర్ధారించారు. మనీలాండరింగ్ కేసులో అలంగీర్‌ను దర్యాప్తు చేయటం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే15న అరెస్ట్ చేసింది. మే 6 అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలం ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సుమారు రూ. 37 కోట్ల భారీ నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. భారీగా నగదు పట్టుబడటం జార్ఖండ్‌లో సంచలనం రేపింది. అలంగీర్ ఆలంతోపాటు సంజీవ్ లాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈడీ జహంగీర్ ఆలం ఇంటిపై సోదాలు చేసింది. వీరేంద్ర కె రామ్ గతేడాది అరెస్ట్ అయ్యారు. రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన పలు స్కీముల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.చదవండి: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు -
పాయింట్ బ్లాంక్‌లో డీజేపై కాల్పులు
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం(మే27) తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఓ బార్లో పనిచేస్తున్న డీజే సందీప్‌ను దుండగులు పాయింట్‌బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు. తొలుత ఆదివారం రాత్రి నలుగురు దుండగుల బ్యాచ్ బార్లోకి ప్రవేశించింది. బార్లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తుండటంపై వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై డీజే సందీప్‌తో పాటు బార్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారు వెళ్లిపోయారు. గొడవ సద్దుమణిగిందనుకునేలోపు మళ్లీ సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో డీజే సందీప్‌ను తుపాకీతో ఛాతిపై కాల్చారు. వెంటనే సందీప్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సందీప్‌ను ఛాతిపై తుపాకీతో కాల్చే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
MS Dhoni: ఓటేసిన ధోని.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్వస్థలం రాంచిలో శనివారం ఓటు వేశాడు. కాగా లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఆరో విడత పోలింగ్ జరుగుతోంది.ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్మూ-కశ్మీర్లో ఒకటి, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్‌లో పద్నాలుగు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 889 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.భారీ భద్రత నడుమ ఓటేసిన ధోనిఈ నేపథ్యంలో ధోని కుటుంబంతో సహా రాంచిలోని సమీప పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. ఈ క్రమంలో మిగతా ఓటర్లు అతడిని చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే, భారీ భద్రత నడుమ ధోని ఓటేసి వచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. భారత ఎన్నికల సంఘం సైతం.. ‘‘తలా ఫర్ రీజన్’’ అంటూ ప్రజాస్వామ్యంలో ధోని సిక్సర్ బాదాడంటూ ఫొటోను షేర్ చేసింది.ఇదిలా ఉంటే.. మరో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, గౌతం గంభీర్, రెజ్లర్ బబితా ఫొగట్ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానేఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఆ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. తాను మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగాడు.వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడంతో పాటు మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 161 పరుగులు సాధించాడు.అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే జార్ఖండ్ చేరుకున్న ధోని కుటుంబానికి సమయం కేటాయించాడు.#WATCH | Jharkhand: Former Indian Captain MS Dhoni arrives at a polling station in Ranchi, to cast his vote for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/W5QQsIu90C— ANI (@ANI) May 25, 2024 -
గుట్టలుగా... అవినీతి కట్టలు
ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్‌లోని ఆ చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్‌లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్‌లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది. సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్‌లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం. జార్ఖండ్‌లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ. గత డిసెంబర్లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు. అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం. ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు. -
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ.. ఆరోగ్యశాఖ అప్రమత్తం!
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్‌లోని ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లో కేసులు నిర్ధారణ అయిన దరిమిలా పలు కోళ్లతో సహా నాలుగు వేల వివిధ రకాల పక్షులను అంతమొందించారు. వందలాది గుడ్లను ధ్వంసం చేశారు. ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కనిపించిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో చికెన్, కోళ్లు, గుడ్లు అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా తొలగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోళ్లు, ఇతర పక్షులు, గుడ్లు కొనుగోళ్లు, అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా వైద్యశాఖ అధికారులు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతూ అక్కడివారిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కూడా చనిపోయిన పక్షులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. -
మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసులో కీలకం కానున్న టీవీ, రిఫ్రిజిరేటర్
రాంచీ : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ మనీ ల్యాండరింగ్ కేసులో టీవీ, రిఫ్రిజిరేటర్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. రూ.31 కోట్ల కంటే ఎక్కువ విలువైన 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన వాదనను సమర్ధించేందుకు కీలకమైన సాక్ష్యాలలో రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ ఇన్వాయిస్లను స్వీకరించింది. ఈడీ రాంచీకి చెందిన ఇద్దరు డీలర్ల నుండి ఈ రశీదులను పొందింది. సోరెన్‌తో పాటు మరో నలుగురిపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో వాటిని జత చేసింది. సంతోష్ ముండా పేరుమీద ఈడీ వర్గాల సమాచారం మేరకు..హేమంత్ సోరెన్ ఈడీ సేకరించిన టీవీ, రిఫ్రిజిరేటర్లను తన కుటుంబసభ్యుడు సంతోష్ ముండా పేరుమీద తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంతోష్ ముండానే సోరెన్ కొనుగోలు చేసిన 8.86 ఎకరాల ల్యాండ్ వ్యవహరాలను గత 14 నుంచి 16 ఏళ్ల నుంచి చూసుకుంటున్నట్లు ఈడీ గుర్తించింది. సోరెన్‌కు ఈడీ సమన్లు.. రంగంలోకి పహాన్ మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఆ 8.86 ఎకరాల ల్యాండ్‌కు తనకు సంబంధం లేదని ఈడీ అధికారులతో వాదించారు. అందుకు కౌంటర్‌గా ఈడీ అధికారులు సంతోష్ ముండా నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అంతేకాదు, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తొలిసారి గతేడాది ఆగస్టులో హేమంత్ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు జారీ చేసిన వెంటనే రాజ్‌కుమార్ పహాన్ అనే వ్యక్తి ఆ 8.86 ఎకరాల భూమి తనతోపాటు మరికొందరి ఆధీనంలో ఉందని, ఇతర యజమానుల పేరిట ఉన్న మ్యుటేషన్ రద్దు చేయాలని రాంచీ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. తద్వారా తన ఆస్తిని కాపాడుకోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. ఖండించిన ఈడీ రాజ్‌కుమార్ పహాన్ లేఖను ఈడీ ఖండించింది. సోరెన్ తన ఆస్తుల్ని సంరక్షించుకునేందుకు బినామీల పేరిట రాశారని ఆరోపిస్తోంది. సోరెన్ ఆదేశానుసారం సంతోష్ ముండాకు ఆస్తి సంరక్షకుని బాధ్యతను అప్పగించారని ఈడీ చెబుతోంది. కేసులో మరొక నిందితుడు హిలారియాస్ కచాప్ అక్కడ విద్యుత్ మీటర్‌ను అమర్చారని వెల్లడించింది. ఇక సోరెన్ సంతోష్ ముండా పేరుమీద ఫిబ్రవరి 2017లో రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయగా, నవంబర్ 2022లో అతని కుమార్తె పేరు మీద స్మార్ట్ టీవీని రాంచీలో భూమి ఉన్న చిరునామాలో కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆధారాల్ని తారుమారు చేసే ప్రయత్నం సంతోష్ ముండాతో పాటు, రాజ్‌కుమార్ పహాన్‌లు హేమంత్ సోరెన్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ఆస్తి పహాన్ అతని కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నట్లు చూపించి సోరెన్‌ను రక్షించేలా సాక్ష్యాలు తారుమారు చేయడం, అతని ఆస్తులు బయట పడకుండా దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందంటూ ఈడీ చెబుతోంది. జ్యుడీషియల్ కస్టడీలో హేమంత్ సోరెన్ కాగా, సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం సోరెన్ రాంచీలోని హోత్వార్‌లోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
భారత్‌లో ‘మినీ లండన్’? వేసవి విడిది ఎందుకయ్యింది?
‘మెక్‌క్లస్కీగంజ్’.. భారత్‌లోని ‘మినీ లండన్’గా పేరుగాంచింది. పచ్చని చెట్లు, అందమైన పర్వతాల నడుమ ఈ ప్రాంతం ఉంది. వేసవిలో పర్యాటకులు సేదతీరేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది? దీనికి ‘మినీ లండన్’ అనే పేరు ఎందుకు వచ్చిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జార్ఖండ్ రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో పర్వతాలపై ‘లండన్ గ్రామం’గా పేరొందిన మెక్‌క్లస్కీగంజ్ ఉంది. దీనిని ‘ఇంగ్లీష్ గ్రామం’ అని కూడా పిలుస్తారు. పచ్చదనంతో పాటు ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. వేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరినప్పుడు దేశంలోని పలువురు పర్యాటకులు మెక్‌క్లస్కీగంజ్ వచ్చి సేదతీరుతుంటారు. ఇక్కడి సహజ వాతావరణం పర్యాటకులకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడకు చేరుకోవడానికి వంకరగా ఉండే రోడ్లు దూరం నుంచి అద్భుతంగా కనిపిస్తాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మరో లోకానికి తీసుకువెళుతుంది. ఇక్కడ డేగా డేగి నది ఉంది. ఈ నది ఒడ్డున పర్యాటకులు యోగాను అభ్యసిస్తుంటారు. మెక్‌క్లస్కీగంజ్ నాడు బ్రిటిష్ వారి వేసవి విడిది. బ్రిటీష్ పాలకులు ఇక్కడ బంగ్లాలు నిర్మించారు. ఇప్పుడివి శిథిలావస్థలో ఉన్నాయి. పర్వతాలతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాక మళ్లీమళ్లీ ఇక్కడకు రావాలని అనిపిస్తుందని పలువురు పర్యాటకులు చెబుతుంటారు. నేటికీ కొందరు ఆంగ్లో-ఇండియన్లు మెక్‌క్లస్కీగంజ్‌లో నివసిస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులతో తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ‘లిటిల్ ఇంగ్లాండ్ ఆఫ్ ఇండియా’ పర్యాటకులు మెచ్చిన ప్రాంతంగా పేరొందింది. -
Joe Root: రూట్ సరికొత్త చరిత్ర! ఇప్పటికి ఒకే ఒక్కడు..
‘‘రూట్ నుంచి ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అనూహ్య రీతిలో బంతితో రాణిస్తున్నాడే తప్ప బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు’’.. టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌పై వచ్చిన విమర్శలు. అయితే, వాటన్నింటికీ నాలుగో టెస్టు సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు రూట్. రాంచి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న రూట్.. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించకుండా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఏకాగ్రత చెదరనీయక.. పట్టుదలగా నిలబడి 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్లో 139 టెస్టు ఆడుతున్న రూట్.. 31వ శతకం నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా రూట్‌కు ఇది 31వ టెస్టు సెంచరీ కాగా.. టీమిండియాపై పదవది. తద్వారా భారత్‌పై అత్యధిక టెస్టు శతకాలు బాదిన క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు ►10- జో రూట్(ఇంగ్లండ్- 52 ఇన్నింగ్స్*) ►9- స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా- 37) ►8- గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్- 30) ►8- వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్- 41) ►8- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా- 51) -
అందుకే ధోని అలా చేస్తున్నాడు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మైదానంలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్-2024లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ఈ మిస్టర్ కూల్. ఇందులో భాగంగా 42 ఏళ్ల మహి.. నెట్ సెషన్స్‌లో పాల్గొంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సమయంలో ధోని ఉపయోగించిన బ్యాట్‌పై అభిమానుల దృష్టి పడింది. ముఖ్యంగా.. ఆ బ్యాట్ మీద ప్రైమ్ స్పోర్ట్స్ పేరిట ఉన్న స్టిక్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధోని స్వస్థలం రాంచికి చెందిన పరమ్‌జిత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన షాపు పేరు అది. క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో తనకు సాయం అందించిన పరమ్‌జిత్ షాపును ప్రమోట్ చేస్తూ ధోని తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల మనసు దోచుకుంది. ఈ విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఎంఎస్ ధోని నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం చూశాను. అతడి బ్యాట్‌పై కొత్త స్టిక్కర్ కనిపించింది. MS Dhoni with the 'Prime Sports' sticker bat. It is owned by his friend. MS thanking him for all his help during the early stage of his career. pic.twitter.com/sYtcGE6Qal — Mufaddal Vohra (@mufaddal_vohra) February 7, 2024 తన స్కూల్‌మేట్‌కు చెందిన స్థానిక స్పోర్ట్స్ స్టోర్ పేరు అది. తన స్నేహితుడి షాపులో అమ్మకాలు పెంచడం కోసం ధోని ఇలా తన బ్యాట్‌పై ఆ స్టిక్కర్ వేయించుకున్నాడు’’ అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 సందర్భంగా కామెంట్రీ చేస్తున్న సందర్భంలో గిల్‌క్రిస్ట్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోని సొంతం. అయితే, వయసు పైబడుతున్న దృష్ట్యా తాజా సీజన్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దాల నడుమ.. తలా బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేయడం అభిమనుల్లో జోష్ నింపింది. ధోని ఈసారి కూడా కెప్టెన్‌గా బరిలోకి దిగడం ఖాయమంటూ నెట్టింట సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. Michael Hussey, Adam Gilchrist and Mark Howard talking about MS Dhoni - Unreal Influence 🐐🔥pic.twitter.com/S8q3xSmfQ5 — MN 👾 (@CaptainnRogerrs) February 11, 2024 -
Jharkhand Crisis: హైదరాబాద్‌లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్
రాంచీ: రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో 12 మంది సీఎంలు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంతటి అనిశ్చితిని ఎదుర్కొంటూ వస్తున్న జార్ఖండ్‌లో ఇప్పుడు రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయ్ సోరెన్‌ను జేఎంఎం ప్రకటించినప్పటి గంటలు గడుస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ మొదలైంది. అదే సమయంలో జార్ఖండ్‌లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. జార్ఖండ్‌లో అధికారం కోల్పోతామనే భయం జేఎంఎం-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో నెలకొంది. చంపయ్‌కు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం పంపకపోవడంతో.. ఈ గ్యాప్‌లో బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు జేజారిపోకుండా ఉండేందుకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం మద్ధతుగా ఉన్న 47 మంది ఎమ్మెల్యేలను చేజారిపోనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఎల్లా హోటల్‌కు.. హైదరాబాద్‌లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ ఖరారైంది. సాయంత్రం నాలుగు గంటలకు రాంచీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు ఇండియా కూటమి ఎమ్మేల్యేలు. అందుబాబులో ఉన్న సుమారు 35 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. వాళ్లను బేగంపేట నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంపయ్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటోంది. తగినంత మద్ధతు లేకపోవడమే అందుకు కారణమని చెబుతోంది. ఇదిలా ఉంటే.. జేఎంఎం మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ గిరిజన ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ హింసిస్తోందని.. వాళ్ల కుట్రలు ఎక్కువ కాలం కొనసాగవని అన్నారాయన. హేమంత్‌కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారాయన. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు బలం 41 స్థానాలు. ఇదిలా ఉంటే ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రేపు(శుక్రవారం) ఆ పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించబోతున్నారు. -
అజ్ఞాతం వీడిన సోరెన్.. అరెస్టుకు రంగం సిద్ధం?
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అజ్ఞాతం వీడారు. మంగళవారం మధ్యాహ్నాం రాంచీలో ఆయన ప్రత్యక్షం అయ్యారు. తన అధికార నివాసంలో ఆయన మంత్రులు, జేఎంఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆయన సతీమణి కల్పన కూడా హాజరయ్యారు. దీంతో తాజా ఊహాగానాలే నిజం కానున్నాయా? అనే అనే చర్చ మొదలైంది. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో అరెస్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిన సోరెన్.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే ఆయన కోసం అక్కడికి వెళ్లిన ఈడీకి ఎదురు చూపులే మిగిలాయి. ఈ సాయంత్రంలోపు ఆయన అరెస్టు ఉంటుందా? ఉండదా? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. #WATCH | Jharkhand CM Hemant Soren holds a meeting of the state's ministers and ruling side's MLAs at CM's residence in Ranchi. His wife Kalpana Soren is also present at the meeting. pic.twitter.com/oo2GJhZ0gi — ANI (@ANI) January 30, 2024 ఇదీ చదవండి: 18 గంటలుగా మిస్సింగ్.. జరిగింది ఇదే..! ఇదిలా ఉండగా.. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
‘పారిస్’ బెర్త్ లక్ష్యంగా...
రాంచీ: ఆసియా క్రీడల ద్వారా నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు... అందుబాటులో ఉన్న రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. రాంచీలో నేటి నుంచి జరిగే మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సవితా పూనియా సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘ఎ’లో చిలీ, చెక్ రిపబ్లిక్, జర్మనీ, జపాన్... గ్రూప్ ‘బి’లో భారత్, అమెరికా, న్యూజిలాండ్, ఇటలీ జట్లున్నాయి. నేడు జరిగే తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో అమెరికాతో భారత్; న్యూజిలాండ్‌తో ఇటలీ; చిలీతో జర్మనీ; చెక్ రిపబ్లిక్‌తో జపాన్ తలపడతాయి. భారత్, అమెరికా మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు సుమిత్ అర్హత టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. మెల్బోర్న్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–4, 6–4తో ప్రపంచ 118వ ర్యాంకర్ అలెక్స్ మోల్కన్ (స్లొవేకియా)పై నెగ్గాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడం సుమిత్కిది రెండోసారి. 2021లోనూ అతను అర్హత సాధించాడు. అలెక్స్‌తో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సుమిత్ ఐదు ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 22 విన్నర్స్ కొట్టిన సుమిత్ నెట్ వద్ద 12 సార్లు పాయింట్లు గెలిచాడు. ఆదివారం మొదలయ్యే ప్రధాన టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 31వ ర్యాంకర్ బుబ్లిక్ (కజకిస్తాన్)తో సుమిత్ తలపడతాడు. -
బాజా భజంత్రీలతో విడాకుల ఊరేగింపు గుర్తుందా? ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్
భార్యభర్తల మధ్య, లేదా ఇరు వర్గాల మధ్య ఏదైనా విభేదాలు వచ్చిన పుడు ఇరుపక్షాల వాదనలు వినడం రివాజు. అపుడు మాత్రమే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే అసలు విషయం పక్కకుపోయి.. ఉల్టా పల్టా అవుతుంది. విడాకుల ఊరేగింపు స్టోరీ గుర్తుందా. అత్తింట్లో బాధపడుతున్న కన్నకూతుర్ని గౌరవంగా మేళతాళాలతో ఇంటికి తెచ్చుకున్న తండ్రి అంటూ ఒక స్టోరీ వైరల్ అయింది. ఈ స్టోరీలో తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా భార్తభర్తల విషయంలో నాణానికి రెండో వైపు విషయాలను తెలుసుకోవడం ఎంత అవసరమో ఈ వైరల్ స్టోరీ మరోసారి గుర్తు చేసింది. ఈ స్టోరీలో సాక్షి భర్త సచిన్ వాస్తవాలు వేరే ఉన్నాయి అంటూ కొత్త వాదనను వినిపించారు. ఆయన మాటల ప్రకారం ఇందులోని మరోకోణం పూర్తి భిన్నంగా ఉంది. సాక్షి తనను చాలా వేధించిందని, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని వీడియాతో చెప్పాడు. తన తల్లి తండ్రులను ఏమాత్రం భరించేది కాదని సాక్షి భర్త సచిన్ వాపోయాడు. తల్లి దండ్రులను, ఆసుపత్రిలో ఉన్న చుట్టాలను కూడా తనను కలవనిచ్చేది చూడనిచ్చే ది కాదని ఆరోపించారు. సాక్షి గుప్తపై తానే తొలుత విడాకుల కేసు నమోదు చేశాననీ, ఈ సందర్భంగా కోటి, 15 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో వన్ టైం సెటిల్మెంట్ కూడా చేసుకున్నామని వెల్లడించారు. అయితే తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని ఆక్రమించుకుని మొత్తం డబ్బు చెల్లించే దాకా బెదిరించిందని ఆరోపించారు. ఇంత చేసింతరువాత కూడా తనపై లేనిపోని ఆరోపణలుతో బ్యాండ్ బాజా అంటూ ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన సాక్షి గుప్తాని ప్రశ్నించారు. కాగా అత్తింటి వేధింపులతో ఇబ్బంది పడుతున్న తన కుమార్తెను బాజా భజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తీసుకొచ్చి విడాకులను కూడా పెళ్లి వేడుకలా ఘనంగా జరిపించి వార్తల్లో నిలిచాడు సాక్షి తండ్రి. ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈఘటన ఈ చోటుచేసుకుంది. కైలాశ్‌నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు ఎదురు కావడం, దీనికి తోడు అంతకు ముందే అల్లుడికి రెండు సార్లు వివాహమైందని తమ దృష్టికి రావడంతో కన్నకూతురిని సగౌరవంగా ఇంటికి తెచ్చుకున్నామంటూ సోషల్‌మీడియాలో తండ్రి పేర్కొన్నాడు. అంతేకాదు ఆడపిల్లలకి వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదురైనపుడు వారిని గౌరవంగా ఇంటికి తిరిగి తెచ్చుకోవాలి, వాళ్లు చాలా విలువైన వాళ్లు అంటూ సందేశం ఇచ్చాడు. దీంతో నాన్న అంటే ఇలా ఉండాలీ అంటూ ఈ కథనం గత నెలలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. The story behind the Viral Band Baja Divorce Bride..... Glad that @aajtak @sudhirchaudhary decided to show it finally pic.twitter.com/vhL2B590jv — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 17, 2023 -
అత్తింట్లో చిత్రహింసలు: మేళతాళాలతో కుమార్తెకు తండ్రి ఘన స్వాగతం
మేళ తాళాలతో ఘనంగా పెళ్లిచేసి కూతురిని బ్యాండ్-బాజా-బారాత్‌తో సాగనంపడం మన అందరమూ చూసి ఉంటాం కానీ పెళ్లయిన కూతురిని అదే ఆనందంతో శాశ్వతంగా ఇంటికి తిరిగి తీసుకురావడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును ఇది నిజంగా జరిగింది. అరుదైన ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. మూడు ముళ్లూ పడిన తరువాత చచ్చిన బతికినా మెట్టినింట్లోనే మన సమాజంలో ఎక్కువ మంది ఆడ పిల్లలని వేధించే మాటలివి. ఏ కష్టం వచ్చినా.. కాంప్రమైజ్ అయ్యి బతకాల్సిందే. తరాలు మారుతున్నా అమ్మాయిల జీవితాల్ని శాసిస్తున్న ఇలాంటి కట్టుబాట్లను తోసి రాజన్నారొక తండ్రి. తండ్రి అంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా ప్రవర్తించి ఈ ప్రపంచంలోని అమ్మాయిలందరి మనసు దోచుకున్నారు. రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా తన కుమార్తె సాక్షి గుప్తాకు గతేడాది ఏప్రిల్‌లో సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా పెళ్లి జరిపించారు. భర్తతో నిండు నూరేళ్లు హాయిగా జీవించమంటూ ఆశీర్వదించి అత్తారింటి సాగనంపారు. అయితే వేయి కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. భర్తకు ఇంతకుముందే పెళ్లి అయింది. ఒకసారి కాదు, రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి తర్వాత కూడా సాక్షితో కలిసి సవ్యంగా జీవించలేదు. అయినా సర్దుకు పోదాం అనుకుంది. అతడే మార తాడులే అనుకుని బంధం కొనసాగించాలని సాక్షి నిర్ణయించుకుంది. దీనికి తోడు అత్తింటి వేధింపులు కూడా ఎక్కువ కావడంతో, తల్లిదండ్రులతో తన గోడును వెళ్ల బోసుకుంది. కూతురి కష్టాలు చూసిన తండ్రి చలించిపోయాడు. సాక్షికి అండగాఉండాలనే నిర్ణయం తీసుకోవడంమాత్రమేకాదు. భాజాభజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తన కుమార్తెను తిరిగి పుట్టింటికి స్వాగతం పలికారు తండ్రి. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలోషేర్ చేశారు. ఆడపిల్లలు చాలా విలువైన వాళ్లు.. వాళ్లను గౌరవించాలి..అంటూ సమాజానికి మంచి సందేశ మిచ్చారు. దీంతో నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు. -
గాల్లోనే ఊపిరి పోశారు!
న్యూఢిల్లీ: అది శనివారం ఉదయం వేళ. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం. బయల్దేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న ఒక ఆర్నెల్ల చిన్నారి. తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు హుటాహుటిన రంగంలో దిగారు. తనకు తక్షణం సాయం అందించారు. విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్ కిట్ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్ హోస్టెస్ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపూ ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ 15 నిమిషాలు... ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్ అధికారి కావడం విశేషం! ఆయన పేరు డాక్టర్ నితిన్ కులకరి్ణ. జార్ఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరొకరు డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్. రాంచీలోని సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే పేటెంట్ డక్టస్ అర్టరియోసిస్ అనే హృద్రోగంతో బాధ పడుతోందని వారు చెప్పారు. ‘మేం వెంటనే రంగంలో దిగి పాపకు ఆక్సిజన్ అందివ్వడంతో పాటు థియోఫైలిన్ ఇంజక్షన్ ఇచ్చాం. అలాగే తల్లిదండ్రులు తమ వెంట తెచి్చన డెక్సోనా ఇంజక్షన్ కూడా బాగా పని చేసింది. హార్ట్ బీట్ ను స్టెతస్కోప్ తో చెక్ చేస్తూ వచ్చాం. తొలి 15 నుంచి 20 నిమిషాలు చాలా భారంగా గడిచింది. పెద్ధగా ఏమీ పాలుపోలేదు. కాసేపటికి పాప స్థితి క్రమ క్రమంగా మెరుగైంది‘ అని వారు తమ అనుభవాన్ని వివరించారు. సహా ప్రయాణికుల్లో పలువురు వారి అమూల్య సేవను మెచ్చుకుంటూ ఎక్స్‌లో మేసేజ్‌లు చేశారు. -
కలలో కూడా ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ధోని! తప్పుపట్టిన నెటిజన్లు..
MS Dhoni- Bike Riding- Viral Video: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఓ యువ క్రికెటర్‌కు కలలో కూడా ఊహించని బహుమతి ఇచ్చాడు. తన బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి.. సదరు ప్లేయర్‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. స్వయంగా బైక్ నడుపుతూ అతడిని రాంచి వీధుల్లో తిప్పాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మిస్టర్ కూల్ కెప్టెన్‌గా ఘనత వహించిన ధోని.. తనను అభిమానించే వారిని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడన్న విషయం తెలిసిందే. నీ బుద్ధి ఏమైంది? తాజాగా ఓ యువకుడికి ఆ అవకాశం దక్కింది. రాంచిలో ట్రెయినింగ్ సెషన్ పూర్తి చేసుకున్న ధోని.. యంగ్ ఫ్యాన్ కోరిక మేరకు అతడిని తన బైక్ ఎక్కించుకున్నాడు. Yamaha RD350ని ధోని డ్రైవ్ చేస్తుండగా.. వెనక కూర్చున్న ఆ అబ్బాయి సెల్ఫీ వీడియో తీసుకుంటూ మురిసిపోయాడు. అయితే, నెటిజన్లు మాత్రం అతడి చర్యను తప్పుబడుతున్నారు. ధోని ఎంచక్కా హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా బండి నడుపుతుంటే నువ్వు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు. రహదారి చిన్నదే కావొచ్చు.. కానీ.. సెల్ఫీ వీడియో పిచ్చిలో మునిగిపోయి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చురకలు అంటిస్తున్నారు. కనీసం ధోని అయినా అతడిని వారించాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఐదోసారి చాంపియన్‌గా నిలిపి కాగా భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అభిమానులకు వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న తలా.. ఈసారి జట్టును చాంపియన్‌గా నిలిపాడు. తద్వారా ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డు సమం చేశాడు. 41 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించి పలు రికార్డులు సృష్టించిన ధోని.. ప్రస్తుతం స్వస్థలం జార్ఖండ్‌లో ఉన్నాడు. రాంచిలోని నివాసంలో కుటుంబంతో సమయం గడుపుతున్న తలా.. మోకాలి నొప్పి నుంచి కోలుకుని ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Nothing to see here. Just #MSDhoni living his best semi retired life and a very lucky young cricketer who got a lift on his #YAMAHA RD350. 🏍️ #Jharkhand #Dhoni #msd #mahi #ranchi pic.twitter.com/EipYkBptsU — Jharkhand Jatra (@JharkhandJatraa) September 15, 2023