జార్ఖండ్ జడ్జి హత్య కేసు విచారణ: రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన సీబీఐ | Jharkhand Judge Assassination Case: CBI Announces 5 Lakh Reward For Credible Information | Sakshi
Sakshi News home page

జార్ఖండ్ జడ్జి హత్య కేసు విచారణ: రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన సీబీఐ

Published Sun, Aug 15 2021 4:21 PM | Last Updated on Sun, Aug 15 2021 4:23 PM

Jharkhand Judge Assassination Case: CBI Announces 5 Lakh Reward For Credible Information - Sakshi

రాంచీ:  సంచలనంగా మారిన జార్ఖండ్‌ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ కేసు విచారణను వేగవంతం చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హత్య కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారన్ని అందించిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ అధికారులు ఆదివారం ప్రకటించారు. హత్య, కుట్ర వివరాలు ఎవరికైనా తెలిస్తే.. ఆ సమాచారాన్ని తెలియజేసిన వారికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని సీబీఐ పేర్కొంది.

గత నెల 28న ఉదయం 5గంటల సమయంలో రోడ్డు పక్కన జాగింగ్‌ చేస్తున్న జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను ఓ టెంపో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాపు చేసి.. ఆ టెంపో వాహనాన్ని నడిపిన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుమోటో తీసుకున్న సూప్రీం కోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement