jarkhand
-
హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు
గిరిడీహ్: శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(Holi celebrations) జరిగాయి. అయితే పండుగ నేపధ్యంలో కొన్ని చోట్ల అల్లర్లు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలో హోలీ వేళ ఇరు వర్గాల మధ్య ఘర్ణణలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా అల్లరి మూకలు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. #WATCH | Jharkhand: Vehicles torched after a scuffle broke out between two communities during Holi celebration in the Ghorthamba area (14/03) pic.twitter.com/Ao1Sn2WBGh— ANI (@ANI) March 14, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం గిరిడీహ్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో మూడు దుకాణాలతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) తమ బలగాలను సంఘటనా స్థలంలో మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన ఘోడతంబాలో జరిగిందని, ఒక వర్గంవారు హోలీ రంగులు జల్లుకుంటూ ఇటు రాగానే, స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలై, పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. #WATCH | Giridih, Jharkhand: Dr Bimal, SP, says, " In Ghorthamba OP constituency, an incident of clash between two communities has come to light. During Holi celebration, this incident took place...we are identifying the two communities, we are also identifying the people...once… https://t.co/Jqs1sKyNjU pic.twitter.com/DatUYzWnir— ANI (@ANI) March 14, 2025ఇది కూడా చదవండి: మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా.. -
నీట్లో 720/720.. ధోనీతో లింక్.. ‘మానవ్’ సక్సెస్ స్టోరీ
నీట్ సక్సెస్ స్టోరీస్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మానవ్ ప్రియదర్శి నీట్లో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. జార్ఖండ్‌కు చెందిన మానవ్ ప్రియదర్శి(Manav Priyadarshi) కుటుంబాన్ని డాక్టర్ల ఫ్యామిలీ అని అంటారు. ఇప్పటికే ముగ్గురు డాక్టర్లున్న ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మానవ్ ప్రియదర్శి తన ఎంబీబీఎస్ పూర్తిచేశాక నాల్గవ డాక్టర్ కానున్నాడు.చిన్నప్పటి చదువులో ఎంతో చురుకైన మానవ్ ప్రియదర్శి నీట్(NEET) యూజీలో మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకోవడం విశేషం. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటున్న మానవ్ 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్షలో జార్ఖండ్‌లో టాపర్‌గా నిలిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 57 తెచ్చుకుని, టాప్ 100 నీట్ టాపర్స్‌లో ఒకనిగా నిలిచాడు. నాడు మీడియాతో మానవ్ ప్రియదర్శి మాట్లాడుతూ తనకు టాపర్‌గా నిలుస్తాననే నమ్మకం ఉందని, కానీ స్టేట్ నంబర్ వన్‌గా నిలుస్తానని అనుకోలేదన్నారు.మానవ్ ప్రియదర్శికి ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి(Dhoni) మధ్య ఒక సంబంధం ఉంది. రాంచీలో జేవీఎం శ్యామలీ స్కూలుకు మంచి పేరు ఉంది. ఇదే స్కూలులో ఎంఎస్ ధోనీ చదువుకున్నాడు. ఇప్పుడు ఇదే స్కూలు నుంచి మానవ్ 12వ తరగతి పూర్తి చేశాడు. తాను సాధించిన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని మానవ్ చెప్పుకొచ్చాడు. మానవ్ ప్రియదర్శి నీట్ యూజీ పరీక్షలో 99.9946856 పర్సంటేజీ తెచ్చుకున్నాడు.మానవ్ ప్రియదర్శి తండ్రి సుధీర్ కుమార్ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్(Physics professor). మానవ్ పెద్దక్క డాక్టర్ నిమిషా ప్రియ భాగల్పూర్ మెడికల్ కాలేజీలో డాక్టర్. మానవ్ చిన్నాన్న డాక్టర్ ప్రిన్స్ చంద్రశేఖర్ సహరసాలో మెడికల్ ఆఫీసర్. మానస్ మామ డాక్టర్ రాజీవ్ రంజన్ రాంచీ ప్రభుత ఆస్పత్రి వైద్యులు. మానవ్ మీడియాతో మాట్లాడుతూ విజయానికి దగ్గరి దారులుండవని, లక్ష్యాన్ని నిర్థారించుకుని, పట్టుదలతో చదివితే ఓటమి ఎదురు కాదన్నాడు. ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్?
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో పరిణామం చోటుచేసుకోబోతోంది. బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ తిరిగి జెఎంఎంలోకి రానున్నారననే చర్చ మరోసారి ఊపందుకుంది. ఆమె 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అలాగే బీజేపీ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె తిరిగి జేఎంఎంలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.ఫిబ్రవరి 2న దుమ్కాలో జేఎంఎం వ్యవస్థాపక దినోత్సవం(JMM Foundation Day) జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీతాసోరెన్ జేఎంఎంలో చేరనున్నారనే వార్తల నడుమ విలేకరులు ఆమెను ఇదే విషయమై అడుగగా, తాను ఫిబ్రవరి ఒకటిన దుమ్కా చేరుకుంటానని, కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుందని, చర్చించే వాళ్లను చర్చించనివ్వండంటూ, తాను సరస్వతి పూజ కోసం దుమ్మా వెళుతున్నట్లు తెలిపారు.సీతా సోరెన్(Sita Soren) బీజేపీలోకి తిరిగి రావడంపై జెఎంఎం ఎమ్మెల్యే, సీతా సోరెన్ బావమరిది బసంత్ సోరెన్ మాట్లాడుతూ దీనిపై చర్చ జరుగుతున్నట్లు తనకు తెలియదన్నారు. వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఈ వేడుకల నిర్వహణపై కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం ఉందని అన్నారు. గత సంవత్సరం కార్యనిర్వాహక అధ్యక్షుడు లేరని, ఈ కారణంగానే తాము గత సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవాన్ని సరిగా జరుపుకోలేకపోయామన్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. దుమ్కా అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె జెఎంఎం అభ్యర్థి నళిన్ సోరెన్ చేతిలో ఓడిపోయారు. దీని తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమెకు జంతారా టిక్కెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లోనూ సీతకు నిరాశ ఎదురయ్యింది. ఇది కూడా చదవండి: Iran: ముగ్గురు భారతీయులు అదృశ్యం -
జార్ఖండ్ మ్యాజిక్ చేసిన JMM
-
జార్ఖండ్ పోలింగ్: 65 శాతం ఓటింగ్ నమోదు
Updatesజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 64.86 శాతం పోలింగ్ నమోదు64.86 pc voters exercise franchise in first phase Jharkhand polls till 5 pmRead @ANI Story | https://t.co/tFstV6aCDt#Jharkhandelections #SeraikellaKharsawan #Ranchi #voterturnout pic.twitter.com/EbdTX3lkW8— ANI Digital (@ani_digital) November 13, 2024 మధ్యా హ్నం 3 గంటల వరకు 59.28 శాతం పోలింగ్ నమోదుభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రాంచీలోని పోలింగ్ బూత్‌లో సతీమణి సాక్షితో కలిసి ఓటు వేశారు.మధ్యాహ్నం 1 గంట వరకు 46% పోలింగ్ నమోదైంది.सराइकेला खरसावाँ जिलांतर्गत कुचाई प्रखंड के नक्सल प्रभावित क्षेत्र जैसे जाम्बरो, रेगाबेड़ा,कोमाय, गिलुआ,सियाडीह,तरंबा मतदान केंद्रों पर कड़ी सुरक्षा के बीच भयमुक्त और शांतिपूर्ण वातावरण में मतदान।@ECISVEEP @SpokespersonECI #VoteDeneChalo pic.twitter.com/xM3z1eYJqV— Chief Electoral Officer, Jharkhand (@ceojharkhand) November 13, 2024 బీజేపీ నేత జయంత్ సిన్హా హజారీబాగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | BJP leader Jayant Sinha casts his vote in Hazaribag as polling in the first phase of Jharkhand Assembly elections is underway pic.twitter.com/3JNGBaGveV— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి సోనాపిలోని ప్రాథమిక విద్యాలయం వద్ద ఓటర్లు నక్సల్స్ బెదిరింపులను ధిక్కరించి భారీ సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చారు. నక్సలైట్లు.. పోస్టర్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. భద్రతా బలగాలు పోస్టర్లు, అడ్డంకులను విజయవంతంగా తొలగించాయి. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి, జగన్నాథ్‌పూర్ పోలింగ్ బూత్ నంబర్ 25లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.Voters at Prathmik Vidyala Sonapi defied naxals threat and came out in huge numbers to vote. Naxalite put up posters and tried obstructing the way. Security forces successfully removed the posters and obstacles and by 11 AM, 60% voting turnout was recorded at polling booth number… pic.twitter.com/ugpccrm3D5— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 29.31 శాతం ఓటింగ్ నమోదైంది#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Hemant Soren, his wife Kalpana Soren cast their votes at a polling station in Ranchi for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/QCOCNn57p8— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.04 శాతం ఓటింగ్ నమోదు#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు అర్జున్ ముండా, ఆయన భార్య మీరా ముండా ఓటు శారు.సెరైకెలా ఖర్సావాన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.పొత్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మీరాముండా బరిలో ఉన్నారు.#WATCH | Former Union Minister and BJP leader Arjun Munda, his wife Meera Munda show their inked fingers after casting vote at a polling station in Seraikela KharsawanMeera Munda is BJP's candidate from Potka Assembly constituency. #JharkhandAssemblyPolls2024 https://t.co/Xu8vO30qAR pic.twitter.com/mvKTxUy56H— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.ఒడిశా గవర్నర్ , జార్ఖండ్ మాజీ సిఎం రఘుబర్ దాస్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటువేశారు.#WATCH | #JharkhandAssemblyElections: Odisha Governor and former Jharkhand CM Raghubar Das along with his family show their inked finger after casting their votes at a polling station in Jamshedpur. He says "It is the responsibility of the people to come out and use their… pic.twitter.com/QwUeRj0S3a— ANI (@ANI) November 13, 2024 కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు హకక్కు వినియోగించుకున్నారు.కోడెర్మాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.#WATCH | Koderma, Jharkhand: Union Minister Annapurna Devi shows her inked finger after casting vote at a polling station in Koderma#JharkhandElections2024 pic.twitter.com/qpuLt4hEO9— ANI (@ANI) November 13, 2024 రాంచీలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.పోలీసులు డ్రోన్లను ఉపయోగించి నిఘా పెట్టారు.#WATCH | Ranchi, Jharkhand: Police use drones for surveillance in Ranchi as voting is underway for the first phase of #JharkhandAssemblyElections2024 pic.twitter.com/cjZow4klOn— ANI (@ANI) November 13, 2024 హజారీబాగ్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మున్నా సింగ్ ఓటు వేశారు.హజారీబాగ్‌లో అభివృద్ధి, శ్రేయస్సు తీసుకురావడానికి ఓటు వేయాలని హజారీబాగ్ ఓటర్లందరినీ అభ్యర్థించారు.#WATCH | Hazaribagh, Jharkhand: After casting his vote, Congress candidate from Hazaribagh Assembly seat Munna Singh says, "I request all voters of Hazaribagh to vote to bring development and prosperity in Hazaribagh."#JharkhandAssemblyPolls2024 pic.twitter.com/ljbEs0xlAP— ANI (@ANI) November 13, 2024 పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండి: ప్రధాని మోదీజార్ఖండ్ తొలి దశ పోలింగ్‌లో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓరట్లను కోరారు. తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు క్యూలైన్లలో ఉన్నారు. PM Modi urges citizens to vote with full enthusiasm in Jharkhand pollingRead @ANI Story | https://t.co/DlZb7WiwWK#PMModi #Jharkhandpolls #Assemblyelections pic.twitter.com/ogsyZoxYqU— ANI Digital (@ani_digital) November 13, 2024 జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. జంషెడ్పూర్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అజోయ్ కుమార్ ఓటు వేశారు. జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | East Singhbhum, Jharkhand: Congress candidate from Jamshedpur East, Dr Ajoy Kumar casts his vote at a polling station in Jamshedpur. pic.twitter.com/2Hen7AFJd1— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ ఓటు వేశారు.#WATCH | #JharkhandAssemblyElection: Union Minister Sanjay Seth casts his vote at a polling station in Ranchi. pic.twitter.com/DFMWrKKrlK— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.జంషెడ్పూర్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ నేత ఓటు హక్కు వినియోగించుకున్నారు.సరయూ రాయ్ జంషెడ్పూర్ వెస్ట్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బన్నా గుప్తా పోటీ చేస్తున్నారు. #WATCH | Jharkhand: NDA candidate from Jamshedpur West Assembly seat and JDU leader Saryu Roy casts his vote at a polling booth in Jamshedpur West Congress's Banna Gupta is contesting against him. pic.twitter.com/KIK8I2yJUD— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Santosh Kumar Gangwar, Governor of Jharkhand casts his vote at a polling booth in Ranchi, Jharkhand #JharkhandAssemblyElections2024 pic.twitter.com/bwRe4JFlzB— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోలింగ్ కొనసాగుతోంది.రాంచీలోని జవహర్ నగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ప్రజలు పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలైన్లో ఉన్నారు.#WATCH | People queue up at a polling station in Ranchi to vote in the first phase of Jharkhand Assembly electionsVisuals from a polling station in Jawahar Nagar pic.twitter.com/MVWrj3OnuU— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. రాంచీలోని పోలింగ్ బూత్ నంబర్లు 50,60, 61 పోలింగ్ జరుగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లతో నిల్చున్నారు.ఈ సందర్భంగా ఓ మహిళ సంప్రదాయ డోలు వాయిస్తూ ప్రజలను ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు.#WATCH | Ranchi: A woman plays a traditional drum and appeals to people to vote during the first phase of Jharkhand assembly elections.(Visuals from polling booth numbers 50,60 and 61 in Ranchi) pic.twitter.com/bjE5uDHQVp— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది.ఈ దశలో 81 స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటుర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. #WATCH | Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Visuals from a polling centre in Jamshedpur pic.twitter.com/cqSwJqSV6c— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు.తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. #WATCH | Preparations underway at St Columbus College polling booth in Hazaribagh, ahead of the first phase of voting to be held today.#JharkhandAssemblyPolls2024 pic.twitter.com/EY6WBe9YiT— ANI (@ANI) November 13, 2024 తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ ఇవాళే పోలింగ్ జరునుంది.కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారుఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది. తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి!బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి.11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. -
PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు. మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. మాఫియాల భరతం పడతాం జార్ఖండ్‌లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్‌కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు. రాంచీలో రోడ్ షో జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. #WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB— ANI (@ANI) November 10, 2024చదవండి: 10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే -
జార్ఖండ్‌లో భూకంపం.. వణికిన రాంచీ, జంషెడ్పూర్
రాంచీ: జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది. రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల పలు జిల్లాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.జార్ఖండ్‌లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 9:20 గంటలకు భూకంపం వచ్చింది. వెంటనే జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి.. -
జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్ ధోనీ ఫోటోను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ వెల్లడించారు. ‘‘తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అంగీకారం తెలిపారు. ఇతర వివరాల కోసం మేము ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు’’ అని జార్ఖండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.కుమార్ అన్నారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. ముఖ్యంగా ఓటర్లకు.. ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలనే ఉత్సాహాన్ని పెంచేందుకు ధోనీ విజ్ఞప్తిని, ప్రజాదరణను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది: కల్పనా సోరెన్
రాంచీ: బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’ మారిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ విమర్శలు చేశారు. జార్ఖండ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ చర్యలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు.సోమవారం ‘మైయాన్ సమ్మాన్ యాత్ర'లో భాగంగా గుమ్లా జిల్లాలో జరిగిన ర్యాలీలో కల్పనా సోరెన్ మాట్లాడారు.‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన (జేఎంఎంఎస్‌వై)కి వ్యతిరేకంగా బీజేపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రజలకు మంచి చేసే ఏ పాలసీని ప్రవేశపెట్టినా.. బీజేపీ పిల్ వేస్తుంది. జార్ఖండ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచచ్చే పథకాలకు అడ్డంకులు సృష్టించేందుకు ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది’’ అని అన్నారు.గిరిజన వర్గాల డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ విస్మరిస్తోందని కల్పనా సోరెన్ మండిపడ్డారు. ఆదివాసీల గుర్తింపు వారి సంస్కృతి, సర్నా మత నియమావళిలో ఉందని తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలో మేము ఈ కోడ్ కోసం తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు. కానీ మన సంస్కృతిని రక్షించడానికి, ప్రత్యేక సర్నా కోడ్‌ను అందించటం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. జార్ఖండ్, గిరిజనుల గుర్తింపు సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే కాపాడగలదని అన్నారామె.చదవడి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’.. దిగ్విజయ్ చౌతాలా ఆసక్తికర వ్యాఖ్యలు -
అమ్మవారికి కష్టాలు చెప్పుకుంటూ.. ట్రాన్స్జండర్ల పూజలు
జంషెడ్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే నేపధ్యంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ట్రాన్స్‌జంటర్లు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వీరు నవరాత్రులలో దుర్గామాతను ఘనంగా పూజిస్తున్నారు.ఈ ట్రాన్స్‌జండర్లు దుర్గామాత విగ్రహం తయారీకి పశ్చిమ బెంగాల్ నుండి గంగానది మట్టిని తీసుకువచ్చి తమ చేతులతో విగ్రహాన్ని తయారు చేస్తారు. తాము చేసే ఆరాధన మిగిలినవారి ఆరాధనకు భిన్నంగా ఉంటుందని ఈ కమ్యూనిటీకి చెందిన అమర్జీత్ సింగ్ గిల్ తెలిపారు. తమ కమ్యూనిటీకి చెందినవారు ఈ తొమ్మిది రోజులు దుర్గా అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, తాము తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలను చెప్పుకుంటారు. అలాగే ప్రపంచశాంతి కోసం ప్రార్థిస్తారు.ప్రతి సంవత్సరం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ట్రాన్స్‌జండర్లు ఇక్కడికి తరలివచ్చి, దుర్గమ్మవారి పూజల్లో పాల్గొంటారు. ఇక్కడ జరిగే పూజల్లో మతపరమైన నియమాలను అనుసరించడంతో పాటు ట్రాన్స్‌జండర్లు తమ భావోద్వేగాలను అమ్మవారితో పంచుకుంటారు. ఇది కూడా చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు! -
‘చంపయీ నీవు పులివి.. ఎన్డీయేలోకి స్వాగతం’
ఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపయీ సోరెన్ బీబీజేలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆదివారం పలువులు ఎమ్మెల్యేలు వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లిన చంపాయీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ చేరిపోతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’’ అని అన్నారు.चंपाई दा आप टाईगर थें,टाईगर हैं और टाईगर ही रहेंगें।NDA परिवार में आपका स्वागत है।जोहार टाईगर…@ChampaiSoren— Jitan Ram Manjhi (@jitanrmanjhi) August 18, 2024బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపాయీ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది. ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కల్పించారని చంపయీ అన్నారు. -
జార్ఖండ్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీలోకి చంపై సోరెన్?
రాంచీ: మరికొన్ని రోజుల్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజకీయ సంక్షోభం దిశగా జార్ఖండ్‌లో పరిణామాలు వేగంగా కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ఎమ్మెల్యేలతో చంపై ఢిల్లీ చేరుకున్నట్లు జాతీయ మీడియా వార్తలు వెల్లడిస్తోంది. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీకి చేరుకున్న చంపై సోరెన్‌ను బీజేపీ నేత సువేందు అధికారిని కలిశారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఎవరినీ కలవలేదు. వ్యక్తిగత పని కోసం ఇక్కడకు వచ్చాను’ అని అన్నారు.#WATCH | Delhi: When asked if he met West Bengal LoP Suvendu Adhikari in Kolkata, former Jharkhand CM and JMM leader Champai Soren says, "I have not met anyone. I have come here for personal work..." pic.twitter.com/c2mg33FvLi— ANI (@ANI) August 18, 2024 ప్రస్తుతం సీఎం హేమంత్ సోరెన్ కేబినెట్లో చంపై మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్టు చేయగా.. అనంతరం చంపై సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంపై సోరెన్ జూలై 3న ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఇక.. హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంపై సోరెన్ సంతోషంగా లేరని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. జార్ఖండ్ మొత్తం 81 స్థానాలకు గాను అధికార జేఎంఎంకు 45 సీట్లు, ప్రతికక్షాలకు 30 సీట్లు ఉన్నాయి. -
ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక?
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్లో జార్ఖండ్ జట్టుకు కిషన్ సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది. ఈ బుచ్చిబాబు టోర్నీ చెన్నై వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జార్ఖండ్ జట్టు ఇప్పటికే చెన్నైకు చేరుకుంది. కాగా తొలుత కిషన్ ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావించాండంట. ఈ క్రమంలోనే మొదట ప్రకటించిన జార్ఖండ్ జట్టులో కిషన్‌కు జెఎస్సీఎ సెలక్టర్లు చోటివ్వలేదు.అయితే తర్వాత ఇషాన్ తన నిర్ణయాన్ని మార్చకుని, ఈ బుచ్చిబాబు టోర్నీకి అందుబాటులో ఉంటానని జెఎస్సీఎకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే తమ జట్టు పగ్గాలను అతడికి జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అప్పగించింది. కిషన్ బుధవారం(ఆగస్టు 14) చెన్నైలో ఉన్న తన జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టోర్నీలో కిషన్ అద్భుతంగా రాణిస్తే భారత క్రికెట్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశముంటుంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను దిక్కరించడంతో కిషన్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఈ జార్ఖండ్ డైనమెట్ కోల్పోయాడు.అసలేంటి ఈ బుచ్చి బాబు టోర్నీ..?దక్షిణాది భారత క్రికెట్ పితామహుడు ఎం. బుచ్చి బాబు నాయుడు(మోతవరపు వెంకట మహిపతి నాయుడు) పేరు మీద ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగనుంది. చివరగా 2017లో జరిగింది. ఈ ఏడాది టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గోనున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభిజించారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరు, సేలం, నాథమ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయిజట్లు ఇవేగ్రూప్ ఎ: మధ్యప్రదేశ్(డిఫెండింగ్ ఛాంపియన్ ), జార్ఖండ్, హైదరాబాద్గ్రూప్ బి: రైల్వేస్, గుజరాత్, TNCA ప్రెసిడెంట్స్ XIగ్రూప్ సి: ముంబై, హర్యానా, TNCA XIగ్రూప్ డి: జమ్మూ & కాశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్ -
వెనక్కి తగ్గిన ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడనున్న జార్ఖండ్ డైనమేట్
బీసీసీఐ అగ్రహానికి గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఇషాన్ కిషన్ రాబోయే దేశీవాళీ క్రికెట్ సీజన్లో జార్ఖండ్ తరపున ఆడనున్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో జార్ఖండ్ కెప్టెన్‌గా కిషన్ వ్యవహరించే అవకాశముందని క్రిక్‌బజ్ తెలిపింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్‌కు సంబంధించి 25 మంది సభ్యులతో కూడిన జార్ఖండ్ జట్టులో కిషన్ పేరును ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్.. వ్యక్తిత కారణాలతో సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే జనవరిలో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు సెలక్టర్లు ఇషాన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీలు ఆడాలని కోరారు.కానీ సెలక్టర్ల ఆదేశాలను కిషన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడి స్ధానంలో ఆసీస్ సిరీస్‌కు ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా కిషన్ దేశీవాళీ క్రికెట్ ఆడలేదు. దేశీ వాళీ క్రికెట్ కాకుండా ఐపీఎల్-2024 కోసం ప్రాక్టీస్ చేసుకోవడం వంటి ఆంశాలు బీసీసీఐ అగ్రహాం తెప్పించాయి. దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పటి నుంచి జాతీయ జట్టు ఎంపికలో కిషన్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కిషన్ చివరగా భారత్ తరపున 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. ఇప్పుడు మళ్లీ భారత తరపున రీ ఎంట్రీ ఇవ్వాలంటే దేశీవాళీ క్రికెట్లో ఆడటమే కిషన్ ముందున్న ఏకైక ఆప్షన్. ఈ క్రమంలోనే కిషన్ రంజీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దులీప్ ట్రోఫీకి మాత్రం కిషన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడంట. -
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కల్పనా సోరెన్‌కు కీలక బాధ్యతలు?
ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్డీఏ తన ప్రణాళికను జూలై నుంచి అమలుచేయనుంది. ఇండియా అలయన్స్ కూడా తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది.జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) స్టార్ క్యాంపెయినర్‌గా కల్పనా సోరెన్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆమెకు జేఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన అనంతరం కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో జేఎంఎం ర్యాలీల్లో కల్పన చురుగ్గా పాల్గొన్నారు. గాండే ఉప ఎన్నికలో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. హేమంత్ సోరెన్ అరెస్టు దరిమిలా కల్పన తన భర్తను తప్పుడు ఆరోపణలతో జైలులో పెట్టారని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.త్వరలోనే హేమంత్ సోరెన్ నిర్దోషిగా విడుదలవుతారని, ఇండియా అలయన్స్ నుంచి ముఖ్యమంత్రి అవుతారని కల్పన చెబుతున్నారు. మరోవైపు మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైలు నుండి బయటకు రానిపక్షంలో పార్టీ కల్పనా సోరెన్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. -
రైలులో వదంతులు.. కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన నలుగురు
వదంతులు.. ఎంతటివారినైనా ఒకింత ఆలోచింపజేస్తాయి. అదే ప్రమాదానికి సంబంధించిన వదంతులైతే దాని పరిణాలమాలు ఊహించని విధంగా ఉంటాయి. జార్ఖండ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారుజార్ఖండ్లోని లాతేహార్‌లో రాంచీ-ససారం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నదంటూ వదంతులు వ్యాపించడంతో ఆ రైలులోని పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో ప్రయాణికులు అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్‌లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ససారం-రాంచీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కుమాండిహ్ స్టేషన్ సమీపానికి వచ్చిన సమయంలో ఒక ప్రయాణీకుడు రైలుకు నిప్పుంటుకున్నదంటూ నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందుకు దూకేశారు. ఈ సమయంలో ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తోంది. దానిని ఢీకొన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో స్టేషన్లో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోదీ మూడోసారి ప్రధాని కాగానే..
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది జరిగిన వెంటనే జార్ఖండ్‌లోని గుమ్లాకు చెందిన వ్యక్తి తన అవతారాన్ని మార్చుకున్నాడు. అంతవరకూ అతనికి ఉన్న పొడవాటి, జుట్టు గడ్డంను కత్తిరించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..జార్ఖండ్‌లోని గుమ్లాలో గల సిసాయి బ్లాక్‌లో నివసిస్తున్న ముఖేష్ శ్రీవాస్తవ డేవిడ్ ప్రధాని మోదీకి వీరాభిమాని. దీంతో ఆయన పలు సందర్భాల్లో మోదీ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. దీనిలో భాగంగానే నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాకనే తన జుట్టు, గడ్డం కత్తిరించుకుంటానని ప్రకటించాడు. మోదీ మూడోమారు ప్రధానిగా ఎంపికకాని పక్షంలో తన జీవితాంతం ఇలా గడ్డంతోనే ఉంటానని చెప్పాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల ముందు ప్రమాణం కూడా చేశాడు.నాటి సందర్భం గురించి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఒక రోజు తాను మార్కెట్లో ఉన్నప్పుడు, 2024లో నరేంద్ర మోదీ మరోమారు ప్రధాని కాలేరని ప్రతిపక్షానికి చెందిన కొందరు స్నేహితులు అన్నారని, అప్పుడు తాను వారితో మోదీ మూడోసారి ప్రధాని కాకపోతే తాను జీవితాంతం షేవింగ్ చేసుకోనని ప్రమాణం చేశానని తెలిపారు. అయితే ఇప్పుడు తన కల నెరవేరిందని, మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు ఎంతో సంతోషిస్తున్నానని, ఇప్పుడు తాను క్షవరం చేయించుకుంటానని డేవిడ్ తెలిపాడు. -
MS Dhoni: ఓటేసిన ధోని.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్వస్థలం రాంచిలో శనివారం ఓటు వేశాడు. కాగా లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఆరో విడత పోలింగ్ జరుగుతోంది.ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్మూ-కశ్మీర్లో ఒకటి, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్‌లో పద్నాలుగు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 889 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.భారీ భద్రత నడుమ ఓటేసిన ధోనిఈ నేపథ్యంలో ధోని కుటుంబంతో సహా రాంచిలోని సమీప పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. ఈ క్రమంలో మిగతా ఓటర్లు అతడిని చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే, భారీ భద్రత నడుమ ధోని ఓటేసి వచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. భారత ఎన్నికల సంఘం సైతం.. ‘‘తలా ఫర్ రీజన్’’ అంటూ ప్రజాస్వామ్యంలో ధోని సిక్సర్ బాదాడంటూ ఫొటోను షేర్ చేసింది.ఇదిలా ఉంటే.. మరో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, గౌతం గంభీర్, రెజ్లర్ బబితా ఫొగట్ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానేఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఆ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. తాను మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగాడు.వింటేజ్ ధోనిని గుర్తుచేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకోవడంతో పాటు మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 161 పరుగులు సాధించాడు.అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే జార్ఖండ్ చేరుకున్న ధోని కుటుంబానికి సమయం కేటాయించాడు.#WATCH | Jharkhand: Former Indian Captain MS Dhoni arrives at a polling station in Ranchi, to cast his vote for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/W5QQsIu90C— ANI (@ANI) May 25, 2024 -
‘ప్రచారానికెళ్లను.. నేరుగా ఫలితాల్లోకి దూకుడే’
జార్ఖండ్‌లోని గొడ్డ లోక్‌సభ నియోజకవర్గంలో విచిత్ర ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఎంపీ, బీజేపీ అభ్యర్థి నిషికాంత్ దూబే ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసిరారు. నిషికాంత్ దూబే మీడియాతో మాట్లాడుతూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తనకు పోటీనిచ్చే బలమైన నేత జేఎంఎంలో లేరని ఆరోపించారు. ఒకవేళ జేఎంఎం ఎవరినైనా తనకు ప్రత్యర్థిగా నిలబెడితే, తాను ప్రచారం చేయనని అన్నారు. అలాగే ప్రదీప్ యాదవ్‌ను కాంగ్రెస్ నిలబెట్టినా తాను ప్రచారానికి వెళ్లనని, నేరుగా ఫలితాల అందుకునేందుకే వెళతానని అన్నారు. నామినేషన్ దాఖలు చేశాక, ఫలితాల కోసం ఎదురు చూస్తానని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నికల ప్రచార సమయంలో తాను టైమ్‌పాస్ చేయడానికి ఎక్కడో ఒకచోట టీ తాగుతూనో, క్రికెట్ ఆడుతూనో కాలం గడుపుతానని అన్నారు. ఇక్కడి నుంచి జేఎంఎం తమ అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నదన్నారు. తన గెలుపుపై తనకు అపార నమ్మకం ఉందని, బహుశా ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరమే ఉండదన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చాలో తనతో పోరాడే అభ్యర్థి లేడని, ఆ పార్టీ నేతలు స్టీఫెన్ మరాండీ, నలిన్ సోరెన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌లో ‘మినీ లండన్’? వేసవి విడిది ఎందుకయ్యింది?
‘మెక్‌క్లస్కీగంజ్’.. భారత్‌లోని ‘మినీ లండన్’గా పేరుగాంచింది. పచ్చని చెట్లు, అందమైన పర్వతాల నడుమ ఈ ప్రాంతం ఉంది. వేసవిలో పర్యాటకులు సేదతీరేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది? దీనికి ‘మినీ లండన్’ అనే పేరు ఎందుకు వచ్చిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జార్ఖండ్ రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో పర్వతాలపై ‘లండన్ గ్రామం’గా పేరొందిన మెక్‌క్లస్కీగంజ్ ఉంది. దీనిని ‘ఇంగ్లీష్ గ్రామం’ అని కూడా పిలుస్తారు. పచ్చదనంతో పాటు ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. వేసవిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరినప్పుడు దేశంలోని పలువురు పర్యాటకులు మెక్‌క్లస్కీగంజ్ వచ్చి సేదతీరుతుంటారు. ఇక్కడి సహజ వాతావరణం పర్యాటకులకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడకు చేరుకోవడానికి వంకరగా ఉండే రోడ్లు దూరం నుంచి అద్భుతంగా కనిపిస్తాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మరో లోకానికి తీసుకువెళుతుంది. ఇక్కడ డేగా డేగి నది ఉంది. ఈ నది ఒడ్డున పర్యాటకులు యోగాను అభ్యసిస్తుంటారు. మెక్‌క్లస్కీగంజ్ నాడు బ్రిటిష్ వారి వేసవి విడిది. బ్రిటీష్ పాలకులు ఇక్కడ బంగ్లాలు నిర్మించారు. ఇప్పుడివి శిథిలావస్థలో ఉన్నాయి. పర్వతాలతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాక మళ్లీమళ్లీ ఇక్కడకు రావాలని అనిపిస్తుందని పలువురు పర్యాటకులు చెబుతుంటారు. నేటికీ కొందరు ఆంగ్లో-ఇండియన్లు మెక్‌క్లస్కీగంజ్‌లో నివసిస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులతో తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ‘లిటిల్ ఇంగ్లాండ్ ఆఫ్ ఇండియా’ పర్యాటకులు మెచ్చిన ప్రాంతంగా పేరొందింది. -
ఎన్నికలకు చేరిన సోరెస్ ఇంటి పోరు!
జార్ఖండ్ రాజకీయాలను శాసించిన శిబూ సోరెన్ కుటుంబం ఇప్పుడు ఇంటి పోరును ఎదుర్కొంటోంది. శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ సొంత పార్టీ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు. దుమ్కా స్థానం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగుతున్నారు. 1980 తర్వాత ఒకటి రెండు ఎన్నికలు మినహా దుమ్కా సీటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆధీనంలో ఉంది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్.. శిబు సోరెన్‌పై విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, సీతా సోరెన్ పార్టీలో చేరిన తర్వాత అభ్యర్థిని మార్చింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన దరిమిలా జేఎంఎం ఇక్కడి నుంచి హేమంత్ భార్య కల్పనా సోరెన్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గండే అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆమెను అభ్యర్థిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దుమ్కాలో జేఎంఎం అభ్యర్థి హేమంత్ లేదా కల్పన ఎవరైనా సరే, వారి కుటుంబానికి చెందిన సీతా సోరెన్‌తో పోటీ పడవలసి ఉంటుంది. సీతా సోరెన్ బీజేపీ అభ్యర్థిగానే కాకుండా బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోరెన్ కుటుంబ పోరు ఆసక్తికరంగా మారింది. -
కుదిరిన సీట్ల ఒప్పందం.. కాంగ్రెస్‌కు ఏడు!
జార్ఖండ్‌లో విపక్ష కూటమి ‘ఇండియా’తో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, జేఎంఎం ఐదు స్థానాల్లో పోటీ చేయనుంది. మరికొన్నింటిలో ఎమ్మెల్యేలతో పాటు ఐఎంఎల్ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ బీహార్‌లో కూడా పొత్తు విషయపై చర్చలు జరిగాయని, అవి సఫలం అయ్యాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కాగా ఆర్జేడీకి జార్ఖండ్‌లోని చత్రా సీటు కేటాయించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా దుమ్కా లోక్‌సభ స్థానంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ఈ స్థానానికి చెందిన సోరెన్ కోడలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. మరోవైపు బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు సంబంధించి రబ్రీ దేవి నివాసంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఆర్జేడీ 25 నుంచి 28 స్థానాల్లో పోటీ చేయనుందని, కాంగ్రెస్‌కు 8 నుంచి 9 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కి రెండు సీట్లు, సీపీఐకి ఒక సీటు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్థానాలలో 12 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఇందులో ఒక సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతా కోడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే ఇప్పుడు ఆమె కూడా బీజేపీలో చేరారు ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారేలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
గంభీర్ బాటలో.. ఎన్నికలకు దూరంగా కేంద్ర మాజీ మంత్రి
ఢిల్లీ: బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని.. రాజకీయాల నుంచి వైదొలగానుకుంటున్నట్లు గౌతం గంభీర్ ప్రకటించిన వేళ.. మరోనేత అదే రీతిన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సీనియర్.. ఎంపీ జయంత్ సిన్హా వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. జయంత్ సిన్హా.. గతంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.‘నన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతున్నా. నేను ప్రపంచ పర్యావరణ మార్పుల విషయంలో భారత్‌పై పూర్తి దృష్టి సారించాలనుకుంటున్నా. నేను ఆర్థిక, ప్రభుత్వపరమైన విషయాల్లో బీజేపీ పార్టీకి అన్ని రకాలుగా సేవలందిస్తా. .. గత పదేళ్లుగా హజారీబాగ్‌కు సేవలు అందించినందుకు గర్వపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకత్వం ఆశీస్సులతో చాలా మంచి అవకాశాలు పొందాను. వారందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్’ అని జయంత్ సిన్హా ఎక్స్( ట్విటర్) వేదికగా ప్రకటించారు. I have requested Hon’ble Party President Shri @JPNadda ji to relieve me of my direct electoral duties so that I can focus my efforts on combating global climate change in Bharat and around the world. Of course, I will continue to work with the party on economic and governance… — Jayant Sinha (@jayantsinha) March 2, 2024 ఐఏఎస్ మాజీ అధికారి.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే జయంత్ సిన్హా అని తెలిసిందే. సుదీర్ఘకాలం బీజేపీతో రాజకీయాల్లో ఉన్న యశ్వంత్ సిన్హా.. తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2022లో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షల తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇలా ఇద్దరూ సిట్టింగ్ ఎంపీలు తాము వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయమని.. రాజకీయాలకు దూరం ఉంటామని ప్రకటించటం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే మరోవైపు బీజేపీ ప్రకటించే ఎంపీ అభ్యర్థుల జాబితాలో వీరికి టికెట్ లభించకపోవచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకేవారు రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక..బీజేపీ మొదటి జాబితాలోనే సుమారు వంద మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయ. ఆ దిశగా బీజేపీ రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
జార్ఖండ్‌లో బీహార్ ఫార్ములా? ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
జార్ఖండ్‌లో చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి 16న జరగనుంది. కొత్త కేబినెట్లో నాలుగైదు కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా దక్కనుందని సమాచారం. కాంగ్రెస్ కోటా నుంచి వచ్చిన నలుగురు మంత్రుల్లో బాదల్ పాత్రలేఖ్, బన్నా గుప్తా, రామేశ్వర్ ఓరాన్ సహా మరో ముగ్గురు మంత్రులను మార్చనున్నారు. జార్ఖండ్‌లో బీహార్ ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే భూషణ్ బడా, దీపికా పాండే, రామచంద్ర సింగ్‌లకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నారని సమాచారం. మంత్రి పదవికి భూషణ్ బడా, దీపికా పాండే పేర్లు దాదాపు ఖాయమని, రామచంద్ర సింగ్ లేదా ప్రదీప్ యాదవ్ పేర్లపై చర్చ జరగుతోంది. బసంత్ సోరెన్ 2020లో జరిగిన దుమ్కా ఉపఎన్నికల్లో విజయం సాధించి, మొదటిసారి అసెంబ్లీకి చేరుకోగా, అతని పెద్ద కోడలు సీతా సోరెన్ జామా నుండి మూడవసారి ఎన్నికయ్యారు. జేఎంఎంలో హేమంత్ సోరెన్ తమ్ముడు బసంత్ సోరెన్, కోడలు సీతా సోరెన్లలో ఒకరికి మాత్రమే చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మహిళా కమిషన్ లేదా మరేదైనా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా సోరెన్‌కు మంత్రి హోదా ఇవ్వవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. -
రూ. 90 వేలకు పసికందు విక్రయం.. కన్నతల్లిని మభ్యపెట్టి..
ఎనిమిది నెలల బాలికను రూ.90 వేలకు విక్రయించిన కేసులో జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ పోలీసులు ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసులు ఆ బాలికను స్వాధీనం చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్లో ఆ బాలిక తండ్రి రాహుల్ సాహ్ని ఇచ్చిన ఫిర్యాదులో తాను ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు. నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగిందని, అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నానని పేర్కొన్నాడు. 2023, డిసెంబర్లో తన భార్య తమ ఎనిమిది నెలల కుమార్తె అనన్యతో కలిసి హజారీబాగ్‌లోని పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నాడు. అయితే 2024, ఫిబ్రవరి 11న తన భార్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తమ కుమార్తె అనన్య కుమారి ఆమెతో లేదని తెలిపాడు. బాలిక తండ్రి రాహుల్ సాహ్ని తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం అతని భార్య పుట్టింటి నుండి తిరిగి వచ్చిన తరువాత.. ఆమెను కుమార్తె గురించి అడిగినప్పుడు.. కొన్ని రోజుల క్రితం రాహుల్ కుమార్ రామ్, రీటా దంపతులు తనను సంప్రదించారని.. వారు నీ భర్త కాలు విరిగిందని, మీ పరిస్థితి బాగోలేదని చెబుతూ , తమ కుమార్తెను వారికిస్తే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారని, భర్త ఆరోగ్యం కుదుటపడ్డాక, కుమార్తెను తిరిగి తీసుకువెళ్లవచ్చని చెప్పడంతో ఆమె కుమార్తెను వారికి అప్పగించిందని తెలిపాడు. తన భార్య తమ కుమార్తె అనన్య కుమారిని రామ్‌ఘర్ టేకర్ స్టాండ్ దగ్గర ఆ దంపతులకు అప్పగించినట్లు రాహుల్ సాహ్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత భర్త.. భార్యను మందలించి, రాహుల్ కుమార్, రీటాదేవిలను సంప్రదించగా, వారు తాము ఆ చిన్నారిని రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్ దంపతులకు రూ.90 వేలకు విక్రయించినట్లు తెలిపారు. రాహుల్ కుమార్, రీటా దేవిలు తన భార్యను ప్రలోభపెట్టి, ఆమె వద్ద నుంచి తమ కుమార్తెను తీసుకుని.. రీనా కుమారి, గౌతమ్ కుమార్‌లకు అమ్మేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్‌లు రాహుల్ కుమార్ రామ్‌కు బంధువులు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలికను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలికను తండ్రికి అప్పగించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. అయితే ఆ బాలికను ఆమె తల్లే విక్రయించిందా? లేక ఇతరులు బాలిక పెంపకం సాకు చూపి, ప్రలోభాలకు గురిచేసి విక్రయించారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఒక నిందితుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. -
విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు
రాంచీ: జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపయ్ సొరెన్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. హేమంత్ సొరెన్ అరెస్టు అనంతరం జార్ఖండ్‌లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయ్ సొరెన్ ప్రభుత్వానికి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him 29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak — ANI (@ANI) February 5, 2024 జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుతం కూటమి బలపరీక్షలో విజయం సాధించింది. ఇదీ చదవండి: రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష -
నా అరెస్టులో రాజ్‌భవన్ ప్రమేయం ఉంది: హేమంత్ సొరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ తనను అరెస్టు చేయడంలో గవర్నర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. చంపయ్ సొరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొనడానికి హేమంత్ సొరెన్‌కు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన అరెస్టును భారత ప్రజాస్వామ్యంలో నల్ల అధ్యాయం అని అన్నారు. భూ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని నిరూపించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు హేమంత్ సొరెన్ సవాలు విసిరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎలాగో వారి నుండి నేర్చుకోవాలని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నేరం రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తన అరెస్టుకు 2022 నుంచి కుట్ర చేస్తున్నారని చెప్పారు. "మేము ఇంకా ఓటమిని అంగీకరించలేదు. నన్ను కటకటాల వెనక్కి నెట్టి విజయం సాధించగలమని భావిస్తే, జార్ఖండ్‌లో ప్రతి మూలలో గిరిజనులు, దళితులు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు." అని హేమంత్ సోరెన్ అన్నారు. 'కేంద్రం 2019 తర్వాత స్కామ్‌లను మాత్రమే చూస్తోంది. 2000లలో జరిగిన స్కామ్‌లను చూడలేరు. గిరిజనులు రాష్ట్రాలకు చీఫ్లుగా, IAS లేదా IPS కావాలని కేంద్రం కోరుకోవడం లేదు. గిరిజన నాయకుల ప్రభుత్వాల కాలవ్యవధిని శాంతియుతంగా పూర్తి చేయనివ్వరు. నాకు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది' అని హేమంత్ సొరెన్ అన్నారు. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ కూటమి తరుపున హేమంత్ సొరెన్ సన్నిహితుడు చంపయ్ సొరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఉందని నేడు అసెంబ్లీలో బలప్రదర్శన జరుగుతోంది. ఇదీ చదవండి:రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష -
హేమంత్ సొరెన్‌పై సొంత ఎమ్మెల్యే విమర్శలు
రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో నూతనంగా సీఎం పదవి చేపట్టిన చంపయ్ సొరెన్ రేపు బలప్రదర్శన నిరూపించుకోవాల్సి ఉంది. ఈ కీలక సమయాల్లో జేఎంఎంకు చెందిన ఓ ఎమ్మెల్యే మాజీ సీఎం హేమంత్ సొరెన్‌పై విమర్శలు చేయడం, ప్రస్తుతం సీఎం చంపయ్ సొరెన్ మద్దతుకు మరో ఎమ్మెల్యే దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రేపు జరగబోయే ఫ్లోర్ టెస్టుకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఈ పరిణామాలు జార్ఖండ్‌లో నాయకత్వ మార్పుల ముప్పు తొలగిపోలేదని గుర్తుచేస్తున్నాయి. సాహిబ్‌గంజ్ జిల్లాలోని బోరియో స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోబిన్ హెంబ్రోమ్ ఒక రాజకీయేతర సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 రాష్ట్ర ఎన్నికలకు ముందు జేఎంఎం మేనిఫెస్టోలో చోటా నాగ్‌పూర్ అద్దె చట్టం, సంతాల్ పరగణాల అద్దె చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ నెరవేర్చలేదు. 1996 కేంద్ర పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయలేదు. చోటానాగ్పూర్ అద్దె చట్టం, సంతాల్ పరగణాల చట్టాలు గిరిజనుల భూమి హక్కులను పరిరక్షించే లక్ష్యంతో ఉండగా.. కేంద్ర గ్రామ పంచాయతీ చట్టం గిరిజనులను దోపిడీ నుండి రక్షించడానికి గ్రామసభకు అధికారం ఇస్తుంది. ఈ చట్టాలు అమలైతే గిరిజనుల భూములకు రక్షణ ఉంటుంది. చెప్పినా పట్టించుకోలేదు.. గిరిజన సంక్షేమం విషయంలో జేఎంఎం నుండి అన్ని సంబంధాలను తెంచుకుంటానని లోబిన్ హెంబ్రోమ్ హెచ్చరించారు. శిబు సోరెన్ ఆధ్వర్యంలో ఎంతో పోరాటం చేస్తే జార్ఖండ్ ఏర్పడింది, కానీ నేటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. ఈ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు. విమానాశ్రయం, ఆనకట్టలు, పరిశ్రమల పేరుతో గిరిజనుల భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుందని హెంబ్రోమ్ ఆరోపించారు. జార్ఖండ్‌లో గిరిజనేతరుల పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రతీ విషయంలో బిహారీలు కల్పించుకుంటారు.. హేమంత్ సొరెన్‌కు తాను చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. బిషున్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే చమ్ర లిండా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెజారిటీ పరీక్షకు ముందు జరిగిన పార్టీ సమావేశాలకు లిండా గైర్హాజరయ్యారు. జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య ఈ అంశాలపై స్పందించారు. హెంబ్రోమ్‌తో మాట్లాడామని తెలిపారు. రేపు జరగబోయే ఫ్లోర్ టెస్ట్ కి ఆయన కూడా వస్తారని చెప్పారు. చమ్ర లిండా అనారోగ్యంతో ఉన్నారని వివరించారు. ఇదీ చదవండి: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు -
'హేమంత్ సొరెన్‌కు అండగా నేనున్నా'
కోల్‌కతా: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అరెస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. హేమంత్ సొరెన్ శక్తివంతమైన గిరిజన నాయకుడని అన్నారు. సొరెన్ తన సన్నిహిత మిత్రుడని చెప్పారు. సొరెన్‌కు మద్దతుగా నిలుస్తానని ట్వీట్ చేశారు. "శక్తివంతమైన ఆదివాసీ నాయకుడైన హేమంత్ సొరెన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. బీజేపీ మద్దతు ఉన్న కేంద్ర ఏజెన్సీల ప్రతీకార చర్య. ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కుట్ర జరుగుతోంది. ఈ క్లిష్ట సమయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సొరెన్ పక్షాన నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఈ యుద్ధంలో ప్రజలు అద్భుతమైన స్పందన అందజేస్తారు. విజయం సాధిస్తారు." అని మమతా బెనర్జీ ట్వీట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. హేమంత్ సొరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు పార్లమెంట్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి నిరసన వ్యక్తం చేసింది. సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. టీఎంసీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ రెండు సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ -
హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ
రాంచీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ విధించారు. హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. కాగా.. సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. హేమంత్ సోరెన్ మొదట జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సోరెన్ తరపు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరు న్యాయవాదులు గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరై తమ పిటిషన్‌పై అత్యవసర జాబితా కింద విచారించాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం -
జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో రానున్నారు. మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంపయ్ సోరెన్ 1956 నవంబర్‌లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. హేమంత్ సొరెన్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. చంపయ్‌ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. #WATCH | JMM vice president Champai Soren takes oath as the Chief Minister of Jharkhand, at the Raj Bhavan in Ranchi. This comes two days after Hemant Soren's resignation as the CM and his arrest by the ED. pic.twitter.com/WEECELBegr — ANI (@ANI) February 2, 2024 రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ -
Jharkhand: ‘గవర్నర్‌గారూ.. మా మెజార్టీ ఇది!’
రాంచీ: హేమంత్ సొరెన్ అరెస్ట్ వెంటనే జార్ఖండ్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆలస్యం చేయకుండా జేఎంఎం సీనియర్ నేత చంపయ్ రాయ్‌ను లెజిస్టేటివ్ లీడర్‌గా ప్రకటించారు. కానీ, గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర సస్పెన్స్ తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను చంపయ్ సొరెన్ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మెజారిటీ ఉందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలిపారు. అంతేకాదు.. అప్పటికే తీసిన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోను గవర్నర్‌కు చూపించడం గమనార్హం. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్జేడీ)ల అధికార కూటమి చంపయ్ సొరెన్‌కు మద్దతు తెలుపుతున్న 43 మంది ఎమ్మెల్యేల వీడియోను విడుదల చేసింది. గవర్నర్‌ను చంపయ్ సొరెన్ కలవడానికి వెళ్లే ముందు ఎమ్మెల్యేలు వీడియో రికార్డింగ్ ద్వారా మద్దతు చెప్పించారు. महामहिम राज्यपाल जी बहुमत यंहा साफ-साफ बिना चश्मा को देखा जा सकता है। फिर भी नया सरकार का गठन में देरी किस बात का? जब विद्यायकों का समर्थन का लेटर आपके पास पहुंचा हुआ है, तो किस शुभ घड़ी का इंतज़ार कर रहे है आप? जनता को जवाब दे महामहिम @jhar_governor जी।#JharkhandCM pic.twitter.com/BNuc8jaHu2 — Md Furkan Ahmad (@Furkanjmm) February 1, 2024 ఆ వీడియోలో చంపయ్ సొరెన్‌తో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా, సీపీఐ (ఎంఎల్) ఎల్ ఎమ్మెల్యే వినోద్ సింగ్, ప్రదీప్ యాదవ్‌లు ఉన్నారు. సమావేశానంతరం చంపయ్ సొరెన్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సాధించి 22 గంటలైంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.' అని అన్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో హేమంత్ సొరెన్ అరెస్టు కావడంతో చంపయ్ సొరెన్ వెంటనే సీఎంగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ, రాజ్‌భవన్ వద్ద నాటకీయ పరిణామాల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఇదీ చదవండి: Jarkhand Crisis: కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే? -
కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే?
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా చేయడంతో రాష్ట్రానికి నూతన సీఎంగా చంపయ్ సొరెన్‌ను ప్రకటించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సొరెన్ అధికార మహాఘటబంధన్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రాసిన లేఖలో చంపయ్ సొరెన్‌ను జేఎంఎం శాసనసభా పక్షానికి అధిపతిగా ప్రకటించారు. చంపయ్ సొరెన్‌ను ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. హేమంత్ సొరెన్ తన వారసుడిగా చంపయ్‌ను ఎన్నుకునే ముందు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు? హేమంత్ సొరెన్ తండ్రి శిబు సొరెన్‌తో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపక సభ్యులలో చంపయ్ సొరెన్ ఒకరు. అయితే హేమంత్ సొరెన్‌కు అతనిపై నమ్మకం ఉండటానికి ఇది మాత్రమే కారణం కాదు. చంపయ్ సొరెన్.. హేమంత్ సొరెన్‌కు విధేయుడు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి తండ్రి శిబు సోరెన్‌కు సన్నిహితుడు. అదీగాక చంపయ్ సొరెన్ కొల్హాన్ ప్రాంతానికి చెందినవారు. కొల్హాన్ బీజేపీకి కంచుకోటగా ఉంది. జార్ఖండ్‌కు ఇప్పటి వరకు కొల్హాన్ నుండి ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరు బీజేపీ నుండి అర్జున్ ముండా (2010 నుండి 2013 వరకు), రఘువర్ దాస్ (2014 నుండి 2019 వరకు). జార్ఖండ్ రెండవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌కు చెందిన మధు కోడా.. 2006 నుండి 2008 వరకు సీఎంగా పనిచేశారు. జార్ఖండ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాన్‌లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేలవంగా ఉంది. అయినప్పటికీ సీఎం హేమంత్ సొరేన్‌కు ఈ ప్రాంతంపై సరైన ఆధరణ లేదు. చంపై సోరెన్‌ను తన వారసుడిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీకి ఎదురుదెబ్బ ఇచ్చినట్లవుతుందని సొరెన్ భావించారు. 'టైగర్ ఆఫ్ కొల్హన్' గా పేరున్న చంపయ్ సొరెన్ జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించడానికి సులభమవుతుందని భావించినట్లు సమాచారం. ఇదీ చదవండి: రసకందాయంలో జార్ఖండ్ రాజకీయం.. హైదరాబాద్ హోటల్‌కు ఎమ్మెల్యేలు -
అరెస్టులను ఎదుర్కొన్న ముగ్గురు జార్ఖండ్ సీఎంలు!
జార్ఖండ్ ప్రస్తుతం పెను రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూ కుంభకోణం కేసులో రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపధ్యంలోనే హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి గవర్నర్‌కు తన రాజీనామా పత్రం సమర్పించారు. హేమంత్ రాజీనామా తర్వాత చంపై సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. జార్ఖండ్ సీఎం పదవిలో ఉన్న నేత అరెస్ట్ కావడం ఇదేమీ తొలిసారి కాదు. జార్ఖండ్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు సీఎంలు రాష్ట్రాన్ని పాలించారు. వీరిలో ముగ్గురు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. దీంతోపాటు రాష్ట్రంలో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ 2005లో 10 రోజులు, 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. 1994లో ప్రైవేట్ సెక్రటరీ శశినాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో 2006లో ఢిల్లీ కోర్టు శిబు సోరెన్‌కు జీవిత ఖైదు విధించింది. అయితే 2007లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 2018లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. 2004లో జమ్తారా సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శిబూ సోరెన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఆయన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే 2008 మార్చి లో సాక్ష్యాలు లేవని పేర్కొంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోరెన్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. మధు కోడా 2006 నుంచి 2008 మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడం వంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మైనింగ్ కుంభకోణానికి పాల్పడి రూ.4,000 కోట్లకు పైగా సంపాదించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కోడాను 2009లో అరెస్టు చేసి 2013లో విడుదల చేశారు. 2017లో కోడా దోషిగా తేలారు. దీంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష. రూ. 25 లక్షల జరిమానా విధించారు. జార్ఖండ్ రాష్ట్రం 2000, నవంబరు 15న ఏర్పడింది. నేటి వరకు ఆరుగురు నేతలు సీఎంలుగా వ్యవహరించారు. వీరిలో రఘువర్ దాస్ మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. బాబులాల్ మరాండీ, అర్జున్ ముండా, రఘువర్ దాస్ జార్ఖండ్ సీఎంలుగా పనిచేశారు. -
జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సొరెన్
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. నూతన సీఎంగా చంపై సొరెన్ నియమితులు కానున్నారు. చంపై సొరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిశారు చంపై సొరెన్. హేమంత్ సొరెన్‌పై ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ ప్రారంభించినప్పటి నుండి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి పనిచేసిన సీనియర్ నాయకుడు చంపై సోరెన్. చంపై సొరేన్ జార్ఖండ్ రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా కూడా ఉన్నారు. సరైకేలా-ఖర్సావాన్ జిల్లాకు చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు చంపై సొరెన్. హేమంత్ సొరెన్ కుటుంబానికి బాగా సన్నిహితుడు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కూడా చంపై సొరెన్ కృషి చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అంతకుముందే సీఎం పదవికి హేమంత్ సొరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. నూతన సీఎంగా చంపై సొరెన్‌ను ఎన్నుకున్న జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లారు. ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సొరెన్ మొదట్లో ఆయన భార్య కల్పనా సోరెన్ నూతన సీఎంగా ఎన్నికవుతారని అందరూ భావించారు. కానీ కల్పనా సొరెన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అటు ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కల్పనా సొరెన్‌కు సీఎం పదవి ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. ఇదీ చదవండి: ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం సొరెన్ -
జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం?
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం (జనవరి 29) ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లింది. అయితే అక్కడ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో, ఈడీ స్క్వాడ్ 13 గంటలకు పైగా అక్కడే మకాంవేసి, సీఎం నివాసంలో సోదాలు జరిపింది. దర్యాప్తు సంస్థ జార్ఖండ్ సీఎం నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారు (హర్యానా నంబర్‌తో నమోదైంది)ను స్వాధీనం చేసుకుంది. అలాగే కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఈడీ చర్యను హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు చేసిన ప్రణాళికాబద్ధమైన కుట్రగా అభివర్ణించింది. మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ ఆరోపించింది. సోమవారం నాడు ఢిల్లీ పోలీసులతో కలిసి ఈడీ బృందం దక్షిణ ఢిల్లీలోని ఆయన నివాసమైన శాంతి నికేతన్ భవన్‌కు ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకుంది. రాత్రి 10:30 గంటల వరకు ఈడీ బృందం అక్కడే ఉంది. సోరెన్ నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారును, కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం సోరెన్ జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఆయన పార్టీ జేఎంఎం తెలిపింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యకు భయపడి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత 18 గంటలుగా పరారీలో ఉన్నారని బీజేపీ జార్ఖండ్ యూనిట్ పేర్కొంది. భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్‌ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ సమన్లు జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఏజెన్సీకి లేఖ పంపారని, అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆదివారం (జనవరి 28) ఈడీకి పంపిన ఈ మెయిల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోరెన్ ఆరోపించారు. -
బీహార్‌లో ‘ఆట ముగిసింది’.. జార్ఖండ్‌లో మొదలైంది?
బీహార్‌లో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీహార్‌లో గత 15 రోజులుగా కొనసాగిన పొలిటికల్ గేమ్‌కు తెరపడింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. బీహార్‌లో రాజకీయ మార్పులు చోటుచేసుకున్న నేపధ్యంలో పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ నుండి కూడా ఇటువంటి వార్తలు వెలువడుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరి 31న మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇందుకోసం హేమంత్ సోరెన్ తన నివాసం లేదా ఈడీ కార్యాలయానికి వెళ్లవలసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ఇది రాజకీయవర్గాల్లో పలు చర్చలకు దారితీస్తోంది. వాస్తవానికి జనవరి 20న సీఎం హేమంత్ సోరెన్‌ను ఏడున్నర గంటల పాటు విచారించిన ఈడీ.. తదుపరి విచారణకు జనవరి 27 నుంచి 31 మధ్య ఏదో ఒక రోజు చెప్పాలంటూ హేమంత్ సోరెన్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది. వీటిని అందుకున్న సీఎం హేమంత్ సోరెన్ నుంచి ఈడీకి సమాధానం అందిందని సమాచారం. ఈ నేపధ్యంలో ఈడీ జనవరి 29 లేదా 31వ తేదీల్లో విచారణకు ఒక తేదీని కోరుతూ ప్రత్యుత్తర లేఖ రాసింది. దీనికి స్పందించకపోతే అధికారులే సీఎం ఇంటికి వస్తారని ఈడీ స్పష్టం చేసింది. ఈడీ అందించిన లేఖలోని స్పష్టతను గమనిస్తే, జార్ఖండ్‌లో అతి త్వరలో రాజకీయ పెనుమార్పులు సంభవించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
Ayodhya Ram Mandir: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం!
నాడు శబరిలోని విశ్వాసం.. శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం.. రామాలయం కల సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకుని, తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని విరమించనుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పరిధిలోని కరమ్‌తాండ్‌లో ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టింది. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె శపథం చేసింది. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన రోజున ఆమె 'రామ్, సీతారాం' అంటూ మౌన దీక్ష విరమించనుంది. శ్రీరాముని స్మరణకే తన జీవితాన్ని అంకితం చేసిన సరస్వతి అగర్వాల్ ఇకపై అయోధ్యలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ‘నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాలరాముడు నన్ను ఆహ్వానించాడు. నా ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది. 30 ఏళ్ల తర్వాత నా మౌనం వీడనుంది. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండాలనుకుంటున్నాను’ అని ఆమె మీడియాకు తెలిపింది. సరస్వతి అగర్వాల్‌కు అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో సరస్వతీ దేవి సోదరులు ఆమెను ఇప్పటికే అయోధ్యకు తీసుకువచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ సరస్వతి తదితరులు ఆమెను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో స్వాగతించారు. ఆమె 4 నెలల పాటు స్వామీజీ ఆశ్రమంలో ఉండనున్నారు. సరస్వతి అగర్వాల్ 1992 మేలో అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఆమె రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన ఆశీర్వాదంతో ఆమె కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశాక చిత్రకూట్‌లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. రోజూ 14 కిలోమీటర్ల కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశారు. 1992, డిసెంబర్ 6న ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన స్ఫూర్తితో మౌన వ్రతం మొదలుపెట్టారు. రామాలయ నిర్మాణం పూర్తయ్యాక మౌన వ్రతం వీడాలని ఆమె నిశ్చయించుకున్నారు. సరస్వతీదేవి ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. ఆమె భర్త ఆమెకు అక్షర జ్ఞానం అందించారు. ఆమె రామ చరిత మానసతో పాటు ఇతర గ్రంథాలను రోజూ చదువుతారు. రోజుకు ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటారు. ఆమె భర్త 35 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఆమె మౌన దీక్ష చేపట్టినప్పుడు వారంతా ఆమెకు సహకరించారు. -
కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!
జార్ఖండ్‌లో నూతన సంవత్సరం 2024 తొలిరోజునే విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అదుపుతప్పిన ఒక కారు డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. #WATCH जमशेदपुर, झारखंड: प्रभारी पदाधिकारी, जमशेदपुर अंजनी तिवारी ने बताया, "प्रात: 5:15 पर ये दुर्घटना हुई... गाड़ी में 8 लोग सवार थे। 5 की मौके पर ही मृत्यु हो गई। पुलिस द्वारा 3 घायलों को अस्पताल में भर्ती करवाया गया। जानकारी के अनुसार सभी लोग आदित्यपुर के रहने वाले हैं..." https://t.co/EhcyZIZD0V pic.twitter.com/EZWs1i7z8G — ANI_HindiNews (@AHindinews) January 1, 2024 ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరొకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆయా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. -
టెన్త్ క్లాస్‌తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్?
ఐపీఎల్-2024 వేలంలో చాలా మంది భారత యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆన్క్యాప్డ్ ప్లేయర్స్ కోట్లు కుమ్మరించారు. ఈ జాబితాలో జార్ఖండ్ యువ సంచలనం రాబిన్ మింజ్ కూడా ఉన్నాడు. రాబిన్ మింజ్‌ను రూ. 3.6 కోట్ల భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. రూ.20లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్, గుజరాత్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి గుజరాత్ దక్కించుకుంది. కాగా ఈ డీల్‌తో ఐపీఎల్ వేలం చరిత్రలో అమ్ముడుపోయిన మొట్టమొదటి గిరిజన క్రికెటర్‌గా మింజ్ నిలిచాడు. ఈ క్రమంలో రాబిన్ మింజ్ కోసం ఆసక్తిర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ రాబిన్ మింజ్? 21 ఏళ్ల రాబిన్ మింజ్ జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని ఓ మధ్యతరగతి కుటుబంలో జన్మించాడు. అతడి తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో పనిచేస్తున్నాడు. మింజ్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఇష్టం ఎక్కువ. ఈ క్రమంలో చదువును మింజ్ పక్కన పెట్టేశాడు. మింజ్ కేవలం పదివ తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత క్లబ్ క్రికెట్, అండర్-19, అండర్-25 టోర్నీల్లో జార్ఖండ్ తరపున మింజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. క్లబ్ క్రికెట్లో మింజ్‌కు ఏకంగా 140 పైగా స్ట్రైక్ రేట్ ఉంది. దీంతో మింజ్ ఈ ఏడాది ఆగస్టులో యూకే వేదికగా ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంప్‌కు సెలక్ట్ అయ్యాడు. అదే విధంగా దేశీవాళీ టీ20 అరంగేట్రంలో కూడా మింజ్ సత్తాచాటాడు. ఒడిశా వేదిగా జరిగిన ఓ టీ20 టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో మింజ్ కేవలం 35 బంతుల్లో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా మింజ్ టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా మింజ్‌కు బౌలింగ్ చేసే సత్తా ఉంది. గుజరాత్ జట్టులో వృద్దిమన్ సాహాతో పాటు వికెట్ కీపర్ల జాబితాలో మింజ్ చేరాడు. -
రైలే కళ్యాణ వేదిక!
కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు...అంటారు. కళ్యాణ ఘడియ ముంచుకొచ్చింది...అనుకున్నారేమో ఒక ప్రేమ జంట బెంగాల్–జార్ఖండ్ మూవింగ్ ట్రైన్లోనే దండలు మార్చుకున్నారు. ఆ తరువాత వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. వధువు భావోద్వేగానికి గురై ఏడ్చింది. ఈ ‘రైలు పెళ్లి’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బోగీలో ఉన్న ప్రయాణికులు ఈ పెళ్లి తంతు చూసి మొదట షాక్ తిన్నా ఆ తరువాత మాత్రం ఆశీర్వదించారు. ‘మల్టీ పర్సస్ ఇండియన్ రైల్వేస్’ ‘విమానంలో జరిగే పెళ్లి కంటే ఇది నయం. తక్కువ ఖర్చు కదా’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. ఇక మరో పెళ్లి విషయానికి వస్తే... దిల్లీకి చెందిన 27 సంవత్సరాల అవినాష్ కుమార్ డెంగ్యూ బారిన పడ్డాడు. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి. ఈలోపు పెళ్లిరోజు రానే వచ్చింది. దీంతో హాస్పిటల్లోనే వధువు మెడలో తాళి కట్టించి పెళ్లి చేశారు. -
‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం(ఈరోజు) భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం దేశప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా భారత్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో భారత జట్టు అభిమానులు ముక్తేశ్వర్ ధామ్‌లోని గంగా ఘాట్ వద్ద భారీగా పూజలు నిర్వహించి ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ అని వేడుకున్నారు. గంగామాత ఆశీర్వాదాలు భారత టీమ్‌కు ఉంటాయని వారు అంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ ఒకే స్వరంతో ‘ఆల్ ది బెస్ట్ ఇండియా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి సారధ్యం వహించిన జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు చందేశ్వర్ ప్రసాద్ సిన్హా అలియాస్ బోడి సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దేశం విజయం సాధించేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, మన టీమ్ విజయం కోసం ప్రార్థనలు చేశామన్నారు. క్రికెట్ అభిమాని రంజిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ఈసారి ప్రపంచకప్ క్రికెట్లో భారత జట్టు తప్పకుండా మన జెండాను ఎగురవేస్తుందని’ అన్నారు. ప్రపంచకప్ 2023లో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఇరు జట్లకు ఆదివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఇది కూడా చదవండి: మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో.. -
బాజా భజంత్రీలతో విడాకుల ఊరేగింపు గుర్తుందా? ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్
భార్యభర్తల మధ్య, లేదా ఇరు వర్గాల మధ్య ఏదైనా విభేదాలు వచ్చిన పుడు ఇరుపక్షాల వాదనలు వినడం రివాజు. అపుడు మాత్రమే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే అసలు విషయం పక్కకుపోయి.. ఉల్టా పల్టా అవుతుంది. విడాకుల ఊరేగింపు స్టోరీ గుర్తుందా. అత్తింట్లో బాధపడుతున్న కన్నకూతుర్ని గౌరవంగా మేళతాళాలతో ఇంటికి తెచ్చుకున్న తండ్రి అంటూ ఒక స్టోరీ వైరల్ అయింది. ఈ స్టోరీలో తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా భార్తభర్తల విషయంలో నాణానికి రెండో వైపు విషయాలను తెలుసుకోవడం ఎంత అవసరమో ఈ వైరల్ స్టోరీ మరోసారి గుర్తు చేసింది. ఈ స్టోరీలో సాక్షి భర్త సచిన్ వాస్తవాలు వేరే ఉన్నాయి అంటూ కొత్త వాదనను వినిపించారు. ఆయన మాటల ప్రకారం ఇందులోని మరోకోణం పూర్తి భిన్నంగా ఉంది. సాక్షి తనను చాలా వేధించిందని, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని వీడియాతో చెప్పాడు. తన తల్లి తండ్రులను ఏమాత్రం భరించేది కాదని సాక్షి భర్త సచిన్ వాపోయాడు. తల్లి దండ్రులను, ఆసుపత్రిలో ఉన్న చుట్టాలను కూడా తనను కలవనిచ్చేది చూడనిచ్చే ది కాదని ఆరోపించారు. సాక్షి గుప్తపై తానే తొలుత విడాకుల కేసు నమోదు చేశాననీ, ఈ సందర్భంగా కోటి, 15 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో వన్ టైం సెటిల్మెంట్ కూడా చేసుకున్నామని వెల్లడించారు. అయితే తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని ఆక్రమించుకుని మొత్తం డబ్బు చెల్లించే దాకా బెదిరించిందని ఆరోపించారు. ఇంత చేసింతరువాత కూడా తనపై లేనిపోని ఆరోపణలుతో బ్యాండ్ బాజా అంటూ ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన సాక్షి గుప్తాని ప్రశ్నించారు. కాగా అత్తింటి వేధింపులతో ఇబ్బంది పడుతున్న తన కుమార్తెను బాజా భజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తీసుకొచ్చి విడాకులను కూడా పెళ్లి వేడుకలా ఘనంగా జరిపించి వార్తల్లో నిలిచాడు సాక్షి తండ్రి. ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈఘటన ఈ చోటుచేసుకుంది. కైలాశ్‌నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు ఎదురు కావడం, దీనికి తోడు అంతకు ముందే అల్లుడికి రెండు సార్లు వివాహమైందని తమ దృష్టికి రావడంతో కన్నకూతురిని సగౌరవంగా ఇంటికి తెచ్చుకున్నామంటూ సోషల్‌మీడియాలో తండ్రి పేర్కొన్నాడు. అంతేకాదు ఆడపిల్లలకి వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదురైనపుడు వారిని గౌరవంగా ఇంటికి తిరిగి తెచ్చుకోవాలి, వాళ్లు చాలా విలువైన వాళ్లు అంటూ సందేశం ఇచ్చాడు. దీంతో నాన్న అంటే ఇలా ఉండాలీ అంటూ ఈ కథనం గత నెలలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. The story behind the Viral Band Baja Divorce Bride..... Glad that @aajtak @sudhirchaudhary decided to show it finally pic.twitter.com/vhL2B590jv — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 17, 2023 -
బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు?
నేడు అమర వీరుడు బిర్సా ముండా జయంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (బుధవారం) జార్ఖండ్‌లోని బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతుకు వెళ్తున్నారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గల ఉలిహతును దేశ ప్రధాని సందర్శించడం ఇదే మొదటిసారి. ఉలిహతులో బిర్సా ముండాకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా రూ. 24 వేల కోట్ల విలువైన ట్రైబల్ మిషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ నేడు ముందుగా రాంచీలోని లార్డ్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని సందర్శించనున్నారు. అనంతరం బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతు గ్రామానికి చేరుకుని, అక్కడ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరోగా నిలిచారు. గిరిజనులు అతనిని దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలాగే గిరిజన సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రచారాన్ని చేపట్టారు. భూస్వాముల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. 1894లో బిర్సా ముండా ఆదాయ మాఫీ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అని పిలుస్తారు. 1895లో బ్రిటీష్ వారు బిర్సా ముండాను అరెస్టు చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బిర్సా ముండా బ్రిటిష్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకీకృతం చేశారు. 1899, డిసెంబరు 24న బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ నేపధ్యంలో బ్రిటీష్ వారు 1900, మార్చి 3న అతనిని అరెస్టు చేశారు. బిర్సాముండా 1900, జూన్ 9న రాంచీ జైలులో మరణించారు. ఆ సమయానికి బిర్సా ముండా వయసు కేవలం 25 సంవత్సరాలు. ఇది కూడా చదవండి: ఏడు దాటినా వీడని పొగమంచు.. దిక్కుతోచని ఢిల్లీ జనం! -
జార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి!
జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక దుకాణంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటన ధన్‌బాద్‌లోని కెందువాడీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెవార్ పట్టిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేవర్ పట్టిలోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ దుకాణంపైన ఒక ఇల్లు ఉంది. కొద్దిసేపటికే మంటలు ఆ ఇల్లంతా వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆరుగురు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నిచ్చెన సాయంతో ఆ ఇంట్లోకి చేరుకుని, ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. కాగా దుకాణంపైనున్న ఇంటిలో షాపు యజమాని సుభాష్ గుప్తా, అతని తల్లి తల్లి ఉమా దేవి, భార్య సుమన్ గుప్తా, నాలుగేళ్ల కుమార్తె మౌళి, ఏడాదిన్నర కుమారుడు శివాన్స్, సోదరి ప్రియాంక గుప్తా, సోదరుడు సుమిత్ ఉంటున్నారు. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన సుభాష్ తల్లి, కూతురు, సోదరి చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమన్, సుమిత్, శివాన్స్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుభాష్, అతని తండ్రి అశోక్ ఇంట్లో లేరు. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో వృద్ధనేతలు.. మాట తప్పిన పార్టీలు? -
సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!
సాక్షి న్యూస్: "ఉన్నది పుష్టి మానవులకో యదు భూషణ.. ఆలజాతికిన్ తిన్నది పుష్టి.." అన్నారు తిరుపతి వెంకటకవులు ఓ పద్యనాటకంలో. మానవుడికి చేతిలో, వంట్లో, ఇంట్లో ఉన్నదే పుష్టికిందకు వస్తుంది. జంతువులకు అప్పటికప్పుడు తిన్నదే పుష్టి. కాబట్టి మానవుడు పుష్టిని సుష్టుగా సంపాయించుకొని ఉండాలన్నది సారాంశం. "ధాతు పుష్టి - వీర్యవృద్ధి సమృద్ధిగా ఉండాలి" అని చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి పదే పదే చెబుతుండేవాడు. తగ్గిపోతున్న సంతాన ఉత్పత్తిని చూస్తుంటే.. ఇవన్నీ గుర్తుకు రాక మానవు. అసలు విషయానికి వద్దాం. జనాభాలో ఒకటవ స్థానంలో ఉన్న చైనాకు మనం దాదాపుగా సమానంగా వచ్చేశాం. త్వరలో ఆ దేశాన్ని కూడా అధిగమించి, మొదటి స్థానానికి భారత్ చేరుకుంటుందని కొన్నాళ్ళుగా సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా, జనాభా తగ్గుముఖం పడుతోందనే వార్తలు కొత్త ఆలోచనలను రేకేత్తిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ పరంగా, భారతదేశం అతి పెద్దది. అందుకనే అమెరికా, చైనా వంటి అగ్రదేశాల కళ్ళన్నీ మన పైనే ఉన్నాయి. మానవవనరుల సేవా రంగంలో భారతీయుల స్థానం విశిష్టమైనది. సమాచార సాంకేతిక రంగాల్లోనూ మనదే పై చేయి. The top 5 most populous nations and their fertility rates in 2023 1. 🇮🇳India 2.0 2. 🇨🇳China 1.76 3. 🇺🇸USA 1.76 4. 🇮🇩Indonesia 2.34 5. 🇵🇰Pakistan 3.03#fertility #population pic.twitter.com/HRpdNgrdyf — FacTrendStats (@factrendstats) September 13, 2023 ప్రగతి ప్రయాణంలో చైనాతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి వున్నాం. జనాభాతో పాటు ఆర్ధికంగానూ బలమైనదిగా ఎదిగి,ఉత్పాదకత, పనిసంస్కృతిలోనూ చైనా ముందంజలో ఉంది. జాతి ఎదుగుదలలో,దేశ ప్రగతిలో మనిషి పాత్ర చాలా గొప్పది. అష్ట ఐశ్వర్యాలలో సంతానం కూడా ఒకటిగా భారతీయులు విశ్వసిస్తారు. అందుకే ఒకప్పుడు ఎక్కువమందికి జన్మనివ్వడంపై మక్కువ చూపించేవారు. క్రమంగా ఈ అభిప్రాయం మారుతూ వచ్చింది. ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యం దృష్ట్యా సంతానోత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్నారు. ముగ్గురు లేదా ఇద్దరు,ఇద్దరు లేదా ఒక్కరూ అని మొదలై, చివరికి ఒక్కరే ముద్దు అనే ప్రచారాన్ని ప్రభుత్వమే చేపట్టింది. 'చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం'.. అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. ఈ క్రమంలో, 2019-2021లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకూ నమోదైన అత్యల్ప స్థాయి ఇదే. 2015-16లో 2.2శాతంగా ఉండేది. 1998-99లో ఈ రేటు 3.2గా ఉండేది. అంటే? భారతీయ మహిళ సగటున ముగ్గురికి జన్మనిచ్చేది. బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ తప్ప మిగిలిన రాష్ట్రాలన్నింటిలో సంతానోత్పత్తి సగటు కంటే కూడా తక్కువగా నమోదవుతోంది. TN doesn't have an exodus problem but Kerala does. https://t.co/JPshe2qmyT pic.twitter.com/UNPKl7ecD9 — Rishi 🗽🌐🔰🏙🥥 (@RishiJoeSanu) September 11, 2023 కుటుంబ నియంత్రణ సాధనాల వాడకం కూడా పెరుగుతూ వస్తోంది. గతంలో 54 శాతం ఉండేది. ప్రస్తుతం 67 శాతాన్ని దాటిపోయింది. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితులు,శారీరక దృఢత్వం తగ్గుతూ రావడం, లేటు వయస్సు పెళ్లిళ్లు, సౌందర్యం /గ్లామర్ తగ్గుతుందనే భయం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగై పోవడం మొదలైనవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ మన సంఘ సంస్కర్తలు ఎందరో ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ఆ దురాచారాన్ని దూరం చేయడానికి ఎంతో కృషి చేశారు.కానీ అది పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశంలో ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి 18 ఏళ్ళు నిండకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. వివాహ బంధాలు,ప్రేమ పెళ్లిళ్లు కూడా కలకాలం నిలవడం లేదు. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి ఇవన్నీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 1950 ప్రాంతంలో, భారతీయ మహిళ సగటున ఆరుగురికి (5.9) జన్మనిచ్చేది. జనాభా పెరుగుదల వల్ల పోటీ పెరగడం, సదుపాయాలు తగ్గిపోవడం,వనరుల కొరత, అధిక ధరలు, డిమాండ్ - సప్లై మధ్య భారీ వ్యత్యాసం మొదలైన దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి. #India may have edged out China as the world’s most populous country earlier this year, but it is facing a declining #fertility rate. India’s fertility rate faces sharp decline amid rising concern over lifestyle factors, infertility pic.twitter.com/w5iXXnf76s — Hans Solo (@thandojo) September 7, 2023 మహిళలలో అక్షరాస్యత పెరగడం తద్వారా ఉద్యోగాలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడంలో ఈ అంశాలు కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మానవ వనరుల సద్వినియోగం జరగకుండా, కేవలం జనాభా పెరగడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. పేదరికాన్ని తగ్గించాలన్నా, అభివృద్ధిని సాధించాలన్నా, జనాభా ఉత్పత్తిలో సమతుల్యతను సాధించడమే శ్రేయస్కరం. శారీరక,మానసిక పటుత్వం సాధన దిశగా దృష్టి సారించడం అంతకుమించి అవసరం. మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
ఇండియా కూటమికి తొలి సవాల్
లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరగనున్న ఉప ఎన్నికలు ప్రతిపక్ష ఇండియా కూటమికి తొలి పరీక్షగా నిలిచాయి. ఇండియా కూటమి కొన్ని చోట్ల ఉమ్మడిగా పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల పరస్పరం పోటీపడుతున్నాయి. యూపీలోని ఘోసి, జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురంలోని ధన్పూర్, బొక్సానగర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను బరిలోకి దించింది. పశి్చమబెంగాల్‌లోని ధుప్గురి, కేరళలోని పుత్తుపల్లిల్లో ఇవే కూటమి పారీ్టలు పరస్పరం తలపడుతుండటం గమనార్హం. ధుప్‌గురిలో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 8న ఉటుంది. -
2012లో ఇంజినీరింగ్ .. 2023లో ఎంబీబీఎస్.. తీరని కల నెరవేరుతోందిలా..
ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఒక విద్యార్థి మెడికల్ కోర్సు చేసేందుకు జార్ఖండ్‌లోని ధన్బాద్లో గల షహీద్ నిర్మల మెహతో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. విద్యార్థి చందన్ కుమార్ ఎడ్మిషన్ ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఎంబీబీఎస్‌లో చేరడమనేది ఈ కాలేజీలో ఇదే మెదటిసారి. చందన్ ఎంబీబీఎస్ చేసేందుకు రూ.18 లక్షల శాలరీ ప్యాకేజీని కూడా వదులుకోవడం విశేషం. ఎన్ఐసీ వరంగల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చందన్ కుమార్ తల్లి ఐఐటీ ఐఎస్‌ఎంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ తీసుకునేందుకు వచ్చిన చందన్ మాట్లాడుతూ వైద్యుడు కావాలన్నది తన చిరకాల స్వప్నం అని అన్నారు. ఐఎస్ఎం ఎనెక్సీ నుంచి 2008లో ప్లస్ టూ పూర్తి చేసిన అనంతరం చందన్ అటు మెడికల్, ఇటు ఇంజినీరింగ్ రెండింటిలో ఎడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. అయితే మెడికల్‌లో అతనికి సీటు లభ్యం కాలేదు. దీంతో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. ఎన్ఐసీ వరంగల్(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో బయోటెక్నాలజీలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తరువాత ఉద్యోగంలో చేరాడు. ప్రత్యేక శిక్షణ లేకుండానే.. అయితే ఎంబీబీఎస్ చేయాలన్న కల అతన్ని నిద్రపోనివ్వలేదు. దీంతో 2015లో మెడికల్ ఎంట్రన్స్ రాసి విజయం సాధించాడు. అయితే తగిన ర్యాంకు రాకపోవడంతో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ దొరకలేదు. అయితే ఈసారి మెడికల్ ఎంట్రన్స్‌లో 2,650వ ర్యాంకు దక్కించుకున్నాడు. దీంతో ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్‌లో సీటు కోసం తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, తాను గతంలో 12వ తరగతిలో చదుకున్న దానినే తిరిగి అధ్యయనం చేశానన్నారు. భార్య ఎస్బీఐలో మేనేజర్ ఏఎన్‌ఎంఎంసీహెచ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేశాక డాక్టర్ కావాలనుకోవడం గొప్ప విషయం అని అన్నారు. తమ కాలేజీలో ఈ విధమైన అడ్మిషన్లలో ఇది మొదటిదని అన్నారు. చందన్ కుమార్ భార్య అపర్ణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే చందన్ సోదరి గౌరి కుమారి బీహార్ విద్యాశాఖలో పనిచేస్తున్నారు. మరో సోదరి ఎంఏ చేస్తున్నారు. ఆమెకు కూడా వివాహం అయ్యింది. ఇది కూడా చదవండి: ‘ఇండియా జేమ్స్ బాండ్’ సౌదీలో ఏం చేస్తున్నారు? -
తండ్రి ఆశయాలతో..పేద పిల్లల కోసం ఫ్రీ బోర్డింగ్ స్కూల్
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే పిల్లల్లో ఒకరిగా మారి ఆనందించేవాడు.పేదపిల్లల కోసం ఏదైనా చేయాలనేది ఆయన కల. ఆ కల సాకారం కాకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.తండ్రి కలను నెరవేర్చడానికి సేవాపథంలోకి వచ్చింది పోర్షియా పుటతుండ... ఝార్ఖండ్‌లోని రాంచీలో పుట్టిన పోర్షియా పుటతుండ కోల్‌కతా, దిల్లీ, నోయిడా, ముంబైలలో పెరిగింది. పోర్షియా తండ్రికి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలతో కలిసి నర్సరీ రైమ్స్ పాడడం ఇష్టం. ఆటలు ఆడుతూ పాఠాలు చెప్పడం ఇష్టం. గ్రామీణ ప్రాంతాలలోని పేదపిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంచేవాడు.పేద పిల్లల కోసం తనవంతుగా ఏదైనా చేయాలని నిరంతరం తపించేవాడు. తన కలలు సాకారం కాకుండానే ఆయన చనిపోయారు. తండ్రి జ్ఞాపకాల స్ఫూర్తితో ఆయన ఆశయాలను నెరవేర్చే క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కోమిక్ అనే గ్రామంలో అక్కడి అట్టడుగు వర్గాల పిల్లల కోసం ఫ్రీబోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది పోర్షియా. ‘హైయెస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా’గా పేరున్న కోమిక్లోని ఎంతోమంది పేద పిల్లలకు పోర్షియా ఇప్పుడు తల్లి, గురువు, సంరక్షకురాలు. జర్నలిజంలో డిగ్రీ చేసిన పోర్షియా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో పనిచేసింది. ఆ తరువాత ‘సీఎన్ఎన్’లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహించింది. కొంతకాలం తరువాత జర్నలిజాన్ని వదులుకొని సేవాదారిలోకి వచ్చింది. పోర్షియా ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం? ఆమెకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. తొలిసారిగా హిమాచల్‌ద్రేశ్‌లోని స్పితి లోయకు వచ్చినప్పుడు తనకు ఎంతో మనశ్శాంతిగా అనుభూతి చెందింది. ఆ ప్రాంతంతో ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించింది. తండ్రి చనిపోయిన తరువాత పోర్షియాపై కుంగుబాటు నీడలు కమ్ముకున్నాయి. చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి తనకు ఇష్టమైన ప్రదేశం గురించి పోర్షియా ఆలోచిస్తున్నప్పుడు స్పితి గుర్తుకు వచ్చింది. అక్కడి పేదపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా తండ్రితో మాట్లాడినట్లే అనిపించింది. వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. స్కూల్ ప్రారంభానికి ముందు కజా ప్రాంతంలోని ఒక స్థానిక కుటుంబంతో నెలరోజులు గడిపింది. ఆ కుటుంబంలోని పిల్లలకు పాఠాలు చెప్పింది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం కోసం ఊళ్ల వెంట తిరుగుతున్నప్పుడు చదువుకు దూరమైన, సరైన చదువు లేని ఎంతోమంది పేదపిల్లలు కనిపించారు. వారిని విద్యావంతులను చేయాల్సిన అవసరం కనిపించింది. ‘ఉద్యోగాన్ని, ముంబైని విడిచి ఇక్కడకు రావడం అనేది సాహసంతో కూడుకున్న పని. కాని నేను ఇష్టంతో ఇక్కడకు వచ్చాను. ముంబైని విడిచి రావాలనే ఆలోచన నా స్నేహితులు, సన్నిహితులు ఎవరికీ నచ్చలేదు. తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నావు అని ముఖం మీదే చెప్పారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తావు అని కూడా అన్నారు. అయితే అవేమీ నా నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఇక్కడికి వచ్చిన తరువాత నా జీవితానికి ఒక పరమార్థం దొరికినట్లు అనిపించింది’ అంటుంది పోర్షియా. తొలి అడుగులో భాగంగా.... పిల్లలు ఆడుకునే చోటుకు వెళ్లేది. ‘మీకు బొమ్మలు ఎలా వేయాలో నేర్పిస్తాను’ ‘కొత్త ఆటలు నేర్పిస్తాను’ ‘ఇంగ్లీష్‌లో మాట్లాడడం నేర్పిస్తాను’ అంటూ వారితో స్నేహం చేసేది. చెట్టు కింద కూర్చొని బొమ్మలు గీయడం, రైమ్స్ పాడడం నేర్పేది. ఒక్కరొక్కరుగా నలభై మంది పిల్లల వరకు ఆమెకు దగ్గరయ్యారు. ఆ సమయంలో తనకు ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ఆలోచన వచ్చింది. కోమిక్‌లో ఒక ప్రదేశాన్ని అద్దెకు తీసుకొని ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు పెద్ద సమస్య వచ్చింది. ‘ఇప్పుడు మా పిల్లలు చదువుకొని ఏం చేయాలి? చిన్నాచితకా పనులు చేసుకుంటే ఏదో విధంగా బతుకుతారు’ అంటూ పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించేవారు. వారి ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడానికి పోర్షియా చాలా కష్టపడాల్సి వచ్చింది.పాఠాలతో పాటు తోటపని నుంచి నృత్యం వరకు పిల్లలకు ఎన్నో నేర్పుతోంది పోర్షియా. ‘నా కల సాకారం అవుతుందా, లేదా అనుకునేదాన్ని. స్కూల్ ప్రారంభించిన తరువాత నా మీద నాకు, నా పై పిల్లల పేరెంట్స్‌కు నమ్మకం వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే’ అంటుంది పోర్షియా పుటతుండ. -
దారుణం: సగం గుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండలు వేసి..
రాంచీ: జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి.. ఓ బురద గుంటలో నిల్చోబెట్టారు. ఈ దారుణ ఘటన రాజ్‌మహల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు యువకులు ఓ మహిళ ఇంట్లో రూ.4300 దొంగతనం చేశారు. ఇందులో ఓ బాలుడు దొరికిపోయాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు మరో బాలున్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. ఊర్లో అందరి సమక్షంలోనే సగం గుండు కొట్టించారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి, ఊరేగించారు. ఈ ఘటనను కొందరు యువకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇవి కాస్త వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. పిల్లలను ఆరు గంటల పాటు బురదలోనే నిల్చొబెట్టారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. రూ.3000 విధించిన జరిమానా చెల్లించిన తర్వాతనే పిల్లలను వదిలిపెట్టారని పోలీసులకు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. దోషులపై కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు. ఇదీ చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే! -
అత్యంత విచిత్రంగా తృటిలో తప్పిన రైలు ప్రమాదం
జార్ఖండ్‌లోని బొకారోలో డ్రైవర్ సమయస్ఫూర్తి కారణగా రైలు ప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే మంగళవారం సాయంత్రం బొకారోలోని సంథాల్‌డీహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక ట్రాక్టర్ పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. అదే సమయంలో అటువైపుగా న్యూఢిల్లీ- భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది. అయితే రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. డీఆర్ఎస్ మనీష్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బొకారో జిల్లాలోని భోజూడీహ్ రైల్వే స్టేషన్ పరిధిలోని సంథాల్‌డీహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు మూసుకుపోవడంతో ఒక ట్రాక్టర్ మధ్యలో చిక్కుకుపోయింది. అదేసమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్(22812) అటుగా వస్తోంది. ఆ ట్రాక్టర్‌ను గమనించిన రాజధాని ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రైలు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది. ఈ ఘటన కారణంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 45 నిముషాలు ఆగిపోయింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడంతోపాటు గేట్ మ్యాన్‌ను విధుల నుంచి తొలగించారు. కాగా జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. చదవండి: రైలు నుండి పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు -
కేంద్ర ఆర్డినెన్స్‌పై ఆప్‌కు జేఎంఎం మద్దతు
రాంచీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పాలనా యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆప్‌కు మద్దతిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ శుక్రవారం రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేజ్రీవాల్, మాన్, సోరెన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును తప్పకుండా ఓడించాలన్నారు. కేంద్ర ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌కు జేఎంఎం మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ చీఫ్, సీఎం సోరెన్ చెప్పారు. ఆర్డినెన్స్‌పై మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. -
ధోని సంవత్సరానికి కట్టే టాక్స్ ఎంతంటే ..?
-
అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎంకు భారీ ఊరట
ఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన జార్ఖండ్ హైకోర్టు పిల్ ఆదేశాలను సోమవారం సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మైనింగ్ కుంభకోణం కేసులో సోరెన్‌పై విచారణ కోసం హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని సమర్థించింది జార్ఖండ్ హైకోర్టు. అయితే.. సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మాత్రం ఇవాళ.. ఆ ఆదేశం చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. హేమంత్ సోరెన్ సత్యమేవ జయతే అంటూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq — Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022 దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2021లో మైనింగ్ లీజుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్.. బీజేపీ ఫిర్యాదు ద్వారా అనర్హత వేటు అంచున ఉన్నారు కూడా. మరోవైపు ఎన్నికల సంఘం సైతం.. అనర్హత వేటు వ్యవహారంలో గవర్నర్ రమేష్ అభిప్రాయం కోరింది. ఇదీ చదవండి: తప్పు చేస్తే అరెస్ట్ చెయ్యండి అంతే! -
NV Ramana: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
రాంచీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా తమ టీవీ డిబెట్లతో కంగారు కోర్టులుగా(సరైన ఆధారాలు.. వాదప్రతివాదనలు లేని అనధికార న్యాయస్థానాలు) వ్యవహరిస్తున్నాయని, సోషల్ మీడియా కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ప్రవర్తన పక్షపాతం, అవగాహనలేమితో కూడిన సమాచారం, ప్రత్యేకించి ఒక ఎజెండా-ఆధారితంగా ఉంటోంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా.. ► సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. జడ్జిలు వాటికి అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు. దయచేసి దీనిని బలహీనతనో లేదంటే నిస్సహాయత అని పొరబడకండి అని న్యాయమూర్తులకు జస్టిస్ రమణ సూచించారు. ► ఈరోజుల్లో మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ, వాస్తవం ఏదో, ఏది మంచో, ఏది సరైందో నిర్ధారించలేకపోతున్నాయి. మీడియా విచారణలు.. కేసుల్లో మార్గనిర్దేశం చేయలేవు. అలాగే మీడియా ఛానెళ్లు ‘కంగారు కోర్టు’లను నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటోంది. ► న్యాయం పంపిణీకి సంబంధించిన సమస్యలపై.. అవగాహన లేని, అజెండాతో కూడిన నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం. ► మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో.. న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ► మీ బాధ్యతను(మీడియాను ఉద్దేశించి..) అతిక్రమించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారు ► ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత స్థాయిలో జవాబుదారీతనం పని చేస్తోంది. ► ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రం జవాబుదారీతనం శూన్యంగా ఉంటోంది. ఇక సోషల్ మీడియా చాలా అధ్వాన్నంగా ఉంటోంది. ► దీనికి పరిష్కారం.. మీడియా స్వీయ నియంత్రణ పాటించడమే. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా. ప్రజలకు అవగాహన కల్పించడానికి, దేశాన్ని ఉత్తేజపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తమ గొంతుకను ఉపయోగించాలి ► జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్మెంట్ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదు. ► కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. న్యాయమూర్తి అంటే కోర్టుల ముందు పార్టీల మధ్య వివాదాల పరిష్కారానికి మాత్రమే పరిమితం అనే అంచనాలు జనాలకు ఉండేవి. ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారు. ► న్యాయం అమలు చేయడానికి, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల గురించి తెలుసుకోవాలి. సామాజిక ఏకాంతంగా పరిమితం కాకూడదు. నిష్పాక్షికత మరియు స్వతంత్రత అనేది మానసిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ► న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్లు వాళ్ల వాళ్ల జీవితాల్లో కంఫర్ట్‌గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదు. ► ఈరోజుల్లో.. న్యాయం అందించడం అంత తేలికైన బాధ్యత కాదు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోంది. కొన్నిసార్లు, మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏకీకృత ప్రచారాలు కూడా జరుగుతాయి ► సామాజిక వాస్తవాల విషయంలో న్యాయమూర్తులు.. చూసిచూడనట్లుగా, గుడ్డిగా వ్యవహరించకూడదు. వ్యవస్థను కాపాడటానికి నొక్కి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ► ఈ క్రమంలో.. రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చేరాలనుకున్నా. విధి వేరే దారి చూపించింది. న్యాయమూర్తి అయినందుకు బాధపడడం లేదని సీజే ఎన్వీ రమణ పేర్కొన్నారు. -
సివిల్స్ ర్యాంకర్‌కు సన్మానం.. అంతలోనే ఆవిరైన ఆనందం
ఒక క్రేన్ ఆపరేటర్ కూతురు.. రోజుకు 18 గంటలపాటు కష్టపడింది. స్మార్ట్‌ఫోన్ ప్రిపరేషన్, అరకోర పుస్తకాలతో.. అందునా తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ కొట్టింది. పైగా ఆల్ ఇండియాలో 323వ ర్యాంక్ సాధించింది. ఈ కథ స్ఫూర్తిని ఇచ్చేదే. కానీ, ఇక్కడో ట్విస్ట్ ఆ అమ్మాయి ఆనందాన్ని ఆవిరి చేసింది. జార్ఖండ్ రామ్‌గడ్‌కు చెందిన దివ్య పాండే(24).. 2017లో రాంచీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించడంతో ఆమెను మెచ్చుకోని వాళ్లంటూ లేరు. ఆమె తండ్రి సెంట్రల్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. కోచింగ్ లేకుండానే ఆమె ఈ ఘనత సాధించడంతో.. మీడియా కూడా జోరుగా కథనాలు వచ్చాయి. అయితే.. ఆమె ఆనందం ఇప్పుడు ఆవిరైంది. ర్యాంక్ వచ్చింది ఆమెకు కాదని స్పష్టత వచ్చింది. దివ్య పాండే అక్క ప్రియదర్శిని పాండేకు యూపీకి చెందిన ఓ స్నేహితురాలు.. ఫోన్ చేసి ఫలానా దివ్య పాండేకు సివిల్స్ ర్యాంక్ వచ్చిందని చెప్పిందట. దీంతో ఆ దివ్య తన సోదరే అనుకుంది ఆమె. ఈ క్రమంలో ఇంటర్నెట్లో ఫలితాల కోసం సెర్చ్చేయగా.. ఆ టైంకి ఇంటర్నెట్ పని చేయలేదని చెబుతోంది ఆ కుటుంబం. అయినా ఆలోచించకుండా ర్యాంక్ వచ్చింది తమ బిడ్డకే అనుకుని ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. స్థానికులకు స్వీట్లు పంచుకుంది. ఈ విషయం మీడియాకు సైతం చేరింది. దివ్య పాండే తండ్రి జగదీశ్ ప్రసాద్ పాండే 2016లో సెంట్రల్ కోలార్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) నుంచి క్రేన్ ఆపరేటర్‌గా రిటైర్ అయ్యాడు. దీంతో ఆ తండ్రి కష్టం ఫలించిందని అంతా అనుకున్నారు. విషయం తెలిసిన సీసీఎల్ అధికారులు, జిల్లా పాలనా సిబ్బంది దివ్య పాండేను పిలిపించుకుని ఘనంగా సత్కారం చేశారు. అయితే ర్యాంకు వచ్చిన ఆనందంలో ఢిల్లీకి చేరిన ఆ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాంక్ వచ్చింది జార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లా చిట్టాపూర్‌లోని రాజ్రప్ప కాలనీకి చెందిన దివ్య పాండేకి కాదని అధికారులు చెప్పారు. ఆ ర్యాంక్ దక్షిణ భారత్‌కు చెందిన దివ్య పీ అనే అమ్మాయిది అని చెప్పడంతో ఆ కుటుంబం నిరాశగా వెనుదిగింది. అంతేకాదు ఈ పొరపాటుకు అందరికీ క్షమాపణలు చెబుతోంది. మరోవైపు ఈ తప్పిదం ఆధారంగా ఆ కుటుంబంపై ఎలాంటి చర్యలు ఉండబోవని అధికారులు చెప్తున్నారు. -
ఐరన్ మైన్‌లో చరిత్ర సృష్టించనున్న మహిళలు..
Allwomen team to take over operations of iron mine in Jharkhand: బహుశా,అంత ఖరీదైన కార్యాలయాన్ని వారిలో చాలామంది తొలిసారిగా చూసి ఉండవచ్చు. కాస్త భయం కూడా వేసి ఉండవచ్చు. ఖరీదైన దుస్తుల్లో, గంభీరంగా తమ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద అధికారులను చూస్తూ కాస్తో కూస్తో బెరుకుగా మాట్లాడి ఉండవచ్చు. కొన్ని సమయాల్లో మాటల కోసం వెదుక్కొని ఉండవచ్చు. అయితే వారి కళ్లు మాత్రం నిండు ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతున్నాయి. అప్పుడప్పుడు కళ్లు మాట్లాడకుండానే మాట్లాడతాయి....ఇది కవిత్వం కాదు. యథార్థ జీవిత దృశ్యం! టాటా స్టీల్స్ నౌముండి (ఝార్ఖండ్) ఐరన్ మైన్‌లో తొలిసారిగా 30 మందితో కూడిన ‘ఆల్వుమెన్ టీమ్’ డ్రిల్లింగ్, డంపింగ్, షవెల్ ఆపరేషన్...మొదలైన పనుల్లో విధులు చేపట్టడానికి రెడీ అవుతుంది. మొత్తం 350 మంది అభ్యర్థుల నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియల ద్వారా 30 మంది మహిళలను ఎంపిక చేశారు. ఇందులో చుట్టుప్రక్కల గిరిజన గ్రామాల నుంచి వచ్చిన పేదమహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇలా ఎంపికైన వారిలో ఒకరు...రేబుతి పర్టీ. ఇద్దరు పిల్లల తల్లి రేవతి. ‘ఏదో ఉత్సాహంతో వచ్చానుగానీ నేను చేయగలనా!’ అని మొదట్లో చాలా భయపడింది రేవతి. పైగా చుట్టాలు, పక్కాలు భయపెట్టేలా మాట్లాడిన మాటలు కూడా పదేపదే గుర్తుకు వస్తున్నాయి. ‘మైనింగ్ పని చేయడానికి మగాళ్లే భయపడతారు. నీలాంటి వాళ్లు చేయడం చాలా కష్టం. ఎలా వెళ్లావో అలా తిరిగొస్తావు చూడు’ ‘ఏ పెళ్లికో పేరంటానికో పక్క ఊరుకు వెళ్లడం తప్ప...పెద్దగా ఎక్కడికి వెళ్లింది లేదు. ఇప్పుడు ఊరు కాని ఊరు వచ్చాను. ఎవరూ తెలిసిన వాళ్లు లేరు. బెంగతో జ్వరం వచ్చినట్లు కూడా అయింది’ అని ఆరోజును గుర్తు చేసుకుంది నౌముండి బ్లాక్‌లోని జంపని అనే గ్రామానికి చెందిన రేవతి. మరో గిరిజన గ్రామం నుంచి వచ్చిన తార పరిస్థితి కూడా అంతే. ‘ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోతున్నావేమో, పనిచేయించడానికి అక్కడ నానా కష్టాలు పెడతారు. ఎంతోమంది మధ్యలోనే పారిపోతుంటారట...’ ఎదురింటి చుట్టం భయపెట్టిన మాటలు పదేపదే గుర్తుకు వచ్చాయి తారకు. ఒక దశలో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోవడానికి రెడీ అయింది. రేవతి, తార మాత్రమే కాదు...ఇంకా చాలామంది, ఒక్కరు కూడా వెనక్కి పోలేదు! ‘యస్...ఈ పని మేము తప్పకుండా చేయగలం’ అని గట్టి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి కారణం... ఉద్యోగానికి ఎంపికైన మహిళలకు మొదట సాంకేతిక శిక్షణ ఇవ్వలేదు. కొన్నిరోజుల పాటు వారిలో ధైర్యం నింపే తరగతులు నిర్వహించారు. ఇవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ‘ట్రైనింగ్ కోర్సు పూర్తయిన తరువాత బాగా ధైర్యం వచ్చింది. ఏ షిప్ట్‌లో పనిచేయడానికైనా రెడీగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరుతానా అని ఉత్సాహంగా ఉంది’ అంటుంది రేవతి. రేవతి మాత్రమే కాదు..ఎప్పుడూ చిన్న స్కూటర్ నడపని మహిళలు కూడా ఇప్పుడు...భారీ విదేశి యంత్రాలను సులభంగా ఆపరేట్ చేస్తున్నారు. ఐరన్మైన్లో తొలిసారిగా ‘ఆల్వుమెన్ టీమ్’ ను తీసుకోవడం యాదృచ్ఛికం కాదు. ‘2025లోపు ఐరన్మైన్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలి’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది టాటా స్టీల్స్. దీనికి ‘తేజస్విని 2.0’ అనే నామకరణం కూడా చేసింది. వారి లక్ష్యం సంపూర్ణంగా సిద్ధించాలని ఆశిద్దాం. చదవండి: Health Tips In Telugu: జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ రోజూ తింటే -
శెబ్బాష్ ఆకాంక్ష.. అండర్మైన్ తొలి మహిళా ఇంజనీర్‌గా!
బొగ్గు గనుల్లో ఒక వజ్రం మెరిసింది. చీకటి గుయ్యారం వంటి లోలోపలి గనుల్లో ఇక మీద ఒక మహిళ శిరస్సున ఉన్న లైట్ దిశను చూపించనుంది. ఇది మొదటిసారి జరగడం. ఇది చరిత్ర లిఖించడం. కోల్ ఇండియా మొట్టమొదటిసారిగా అండర్మైన్ ఇంజనీర్‌గా ఒక యువతిని నియమించింది. ఆడవాళ్లు కొన్ని పనులకు పనికి రారు అనేది గతం. ‘మేము ఏమైనా చేయగలం’ అని ఆకాంక్ష కుమారి దేశానికి సందేశం పంపింది. అత్యంత శ్రమ, ప్రమాదం ఉన్న ఈ పనిలో సాహసంతో అడుగుపెట్టిన ఆ ఆకాంక్ష ఎవరు? గనులు మగవారి కార్యక్షేత్రాలు. గనులు తవ్వడం, ఆక్సిజన్ అందనంత లోతుకు వెళ్లి ఖనిజాన్ని బయటకు తేవడం, దానిని రవాణా చేయడం... ఇవన్నీ శ్రమ, బలంతో కూడుకున్న పనులు కనుక అవి మగవాడి కార్యక్షేత్రాలు అయ్యాయి. అందుకే కాదు... గనుల్లో 24 గంటలు పని జరుగుతుంది. రాత్రింబవళ్లు చేయాలి. భద్రత గురించి జాగ్రత్తలు ఎలా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని కూడా స్త్రీలకు ఆ ప్రాంతాలు నిరోధించబడ్డాయి. గని కార్మికుడు అంటే మగవాడే. ఆ కార్మికుడు గనికి బయలుదేరితే స్త్రీ క్యారేజీ కట్టి ఇచ్చి ఇల్లు కనిపెట్టుకుని ఉండటం ఇప్పటి వరకూ సాగిన ధోరణి. అయితే గత దశాబ్ద కాలంలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివేందుకు యువతులు ముందుకు వచ్చారు. మైనింగ్ చదివితే ఉపాధి గనులలోనే దొరుకుతుంది కనుక తల్లిదండ్రులు ఆ చదువును నిరుత్సాహపరుస్తూ వచ్చినా ఈ కాలపు యువతులు మేము ఆ చదువు చదవగలం... భూమి గర్భం నుంచి ఖనిజాన్ని బయటకు తీయగలం అని ముందుకొచ్చారు. దేశంలో ఆ విధంగా ఫస్ట్‌క్లాస్ మైనింగ్ ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన మొదటి మహిళలు సంధ్య రసకట్ల... మన తెలంగాణ అమ్మాయి, మరొకరు యోగేశ్వరి రాణె (గోవా). వీళ్లిద్దరూ హిందూస్తాన్ జింక్‌లో ఉపరితల మేనేజర్ స్థాయిలో పని చేసి ఇప్పుడు వేదాంత రిసోర్స్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే వీరి తర్వాత నేరుగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ మాత్రం ఆకాంక్ష కుమారి. 50 ఏళ్లలో తొలిసారి కేంద్ర బొగ్గుగని శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న ‘కోల్ ఇండియా లిమిటెడ్’కు అనుబంధ సంస్థ అయిన ‘సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్’ సెప్టెంబర్ 1న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆకాంక్ష కుమారి నియామకాన్ని వెల్లడి చేసింది. ‘చురి మైన్స్’ లో ఆమెను అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించి మైనింగ్ చరిత్రలో కొత్త పుటకు చోటు కల్పించామని చెప్పింది. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆకాంక్ష పని చేయాల్సి ఉంటుంది. ఆమె తన ట్రయినింగ్‌ను ముగించుకుని విధులు మొదలెట్టింది కూడా. అంత సులభం కాలేదు భారత గనుల చట్టం 1952లోని సెక్షన్ 46 ప్రకారం బొగ్గు గనుల్లో స్త్రీలకు అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలు నిరోధించబడ్డాయి. 2017 వరకూ ఈ చట్టం ఇలా సాగినా అదే సంవత్సరం జరిగిన చట్ట సవరణ వల్ల స్త్రీలకు భూగర్భ కార్యకలాపాలలో ఉద్యోగం పొందే హక్కు ఏర్పడింది. కాని ఆ తర్వాత కూడా కోల్ ఇండియాలో స్త్రీలు ఉపరితల కార్యకలాపాలలో ఉద్యోగాలు పొందుతూ ఇప్పటికి తమ శాతాన్ని కేవలం 7.5కు మాత్రమే పెంచగలిగారు. కాని వారికే కాదు, దేశంలోని ఇతర యువతులకు, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా మొదటిసారి ఆకాంక్ష భూగర్భ విధులను స్వీకరించింది. భిన్న విద్యార్థి జార్ఘండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆకాంక్ష చిన్నప్పటి నుంచి చురుకైన భిన్న విద్యార్థి. ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో హైస్కూల్ వరకూ చదివి సింద్రి (జార్ఖండ్) బిట్స్‌లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివింది. ఆ వెంటనే ఆమెకు హిందూస్థాన్ జింక్ రాజస్థాన్ శాఖలో ఉద్యోగం దొరికింది. మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసి కోల్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం పొంది తాజాగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ ఇంజనీరుగా డిజిగ్నేషన్ పొందింది. అయినా జాగ్రత్తలే ఆకాంక్ష కుమారి అండర్‌గ్రౌండ్ మైనింగ్ డ్యూటీని స్వీకరించినా గనుల చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు సంబంధించిన షరతులు ఆమెకు వర్తిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆకాంక్ష ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు ఉండే షిఫ్టుల్లో మాత్రమే పని చేయాలి. ఏ ఫిష్ట్ చేసినా ఆమెకు 11 గంటల రెగ్యులర్ విశ్రాంతి ఇవ్వాలి. రాత్రి ఆమె పని చేయడానికి వీల్లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 5 మధ్య ఒక్కోసారి ఎమర్జన్సీ డ్యూటీ పడవచ్చు. అయినా సరే ఆమెకు డ్యూటీ వేయకూడదు. ఇవన్నీ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ఆమె వొత్తిడిని తగ్గిస్తాయి. కాని సాహసం యథాతథమే. హెడ్‌లైట్ ధరించి ఆమె గనుల్లోకి దిగే సన్నివేశం, అజమాయిషీ చేసే సన్నివేశం ఇప్పటికిప్పుడు ఒక పెద్ద ధైర్యం, తేజం... నల్ల బొగ్గు మధ్యలో ఏర్పడిన వెలుగు దారి. ఆమెకు శుభాకాంక్షలు. -
జార్ఖండ్ జడ్జి హత్య కేసు విచారణ: రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన సీబీఐ
రాంచీ: సంచలనంగా మారిన జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ కేసు విచారణను వేగవంతం చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హత్య కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారన్ని అందించిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ అధికారులు ఆదివారం ప్రకటించారు. హత్య, కుట్ర వివరాలు ఎవరికైనా తెలిస్తే.. ఆ సమాచారాన్ని తెలియజేసిన వారికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని సీబీఐ పేర్కొంది. గత నెల 28న ఉదయం 5గంటల సమయంలో రోడ్డు పక్కన జాగింగ్ చేస్తున్న జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను ఓ టెంపో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాపు చేసి.. ఆ టెంపో వాహనాన్ని నడిపిన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుమోటో తీసుకున్న సూప్రీం కోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదు: సీజేఐ రమణ
-
జార్ఖండ్ జడ్జి హత్య కేసు: సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో సుమోటో విచారణను అత్యున్నత ధర్మాసనం శుక్రవారం చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరిచే ట్రెండ్ దురదృష్టకరమన్నారు. న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జడ్జిలు ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించడంలేదని, పట్టించుకోవడం లేదని చీఫ్ జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ జడ్జి హత్య వ్యవహారమే ఒక ఉదాహరణ అని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. అంతేకాదు పూర్తి బాధ్యతతోనే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందన్నారు. న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయనీ, మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఎన్వీ రమణ ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేశారు. కాగా ధన్‌బాద్‌కు చెందిన జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ది అనుమానాస్పద మృతిగా, తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగానే భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు పుట్టించింది. దీంతో ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు బార్ అసోసిసేషన్(ఎస్సీబీఏ) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేసింది. న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఈ వ్యవహరాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీం జార్ఖండ్ డీజీపీనుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే. -
17 మంది అరెస్టు..243 మంది నిర్బంధం
ధన్‌బాద్/రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసుకు సంబంధించి పోలీసులు 243 అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు, 17 మందిని అరెస్టు చేశాయి. మరో 250 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ ఎస్పీ సంజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. జడ్జి మృతి ఘటన దృశ్యాలున్న సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయడం తదితర కారణాలతో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై ఏర్పాటైన సిట్ బృందం..వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం దాడులు నిర్వహించి 243 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతోందన్నారు. జిల్లాలోని 53 హోటళ్లలో సోదాలు జరిపి, జడ్జి మృతికి సంబంధమున్న 17 మందిని అరెస్టు చేసి, కేసులు పెట్టామన్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో జడ్జిని ఢీకొట్టిన ఆటోను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామంటూ ఆయన..ప్రత్యేకంగా చేపట్టిన డ్రైవ్‌లో ఎటువంటి పత్రాలు లేని 250 ఆటోలను పట్టుకున్నట్లు వివరించారు. మృతి ఘటన సీసీ టీవీ ఫుటేజీని బహిర్గత పరిచినందుకు పోలీస్ సబ్ ఎన్స్పెక్టర్ ఆదర్శ్ కుమార్‌ను, ఆటో చోరీ ఫిర్యాదుపై రెండు రోజుల తర్వాత కేసు నమోదు చేసినందుకు గాను పథర్ది పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఉమేశ్ మాంఝిని సస్పెండ్ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు గురువారం ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతని సహాయకుడు రాహుల్ వర్మను అరెస్ట్ చేశారు. కాగా, జడ్జి మృతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
జడ్జి హత్య కేసు సీబీఐకి
రాంచీ: ధన్‌బాద్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను దుండగులు సెవెన్ సీటర్ ఆటోతో ఢీకొట్టి చంపిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని శనివారం సిఫారసు చేశారు. జూలై 28న మార్నింగ్ వాక్కు వెళ్లిన 50 ఏళ్ల ఉత్తమ్ ఆనంద్‌ను ఉద్దేశపూర్వకంగా వెనకనుంచి ఆటోతో ఢీకొట్టిన వీడియో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. -
తన చెల్లికి వచ్చిన దుస్థితి మరోకరికి రాకూడదని..
అసలే పేదరికం, దానికి తోడు పదహారేళ్ల చెల్లికి మానసిక ఆరోగ్యం అంతంత మాత్రం. డాక్టర్ల సలహామేరకు ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ సభ్యుల ఆదరణ అంతగా లేకపోవడంతో చెల్లి నిరాశా నిస్పృహలకు లోనై రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ పరిణామాలన్నింటిని దగ్గర నుంచి గమనించిన 31 సంవత్సరాల అక్క సుమిత్ర గాగ్రై మనసు చలించి పోయింది. వైద్యం చేయించినప్పటికీ అవగాహన లేమి, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా చెల్లి ప్రాణాలు కోల్పోవడంతో మానసిక ఆరోగ్యంపై ఎలాగైనా అందరిలో చైతన్యం తీసుకురావాలనుకుంది. మారుమూల గ్రామాల్లో గూడుకట్టుకున్న మూఢనమ్మకాలను దూరం చేసి వారిలో అవగాహన కల్పించాలనుకుంది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లోని పల్లెటూళ్లు, గ్రామాలు, గిరిజన తండాలను సందర్శించి వీధినాటకాలు, కథలు, చెప్పడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ద్వారా మూఢనమ్మకాలు, మానసిక ఆరోగ్యంపై అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తోంది. ‘హో’తెగకు చెందిన సుమిత్ర స్థానిక ఎజెక్ట్ ఎన్జీవో కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ...సెల్ఫ్‌హె ల్ప్ గ్రూపులకు, మహిళలకు మధ్య వారధిగా పనిచేస్తూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె కూడా గిరిజన మహిళ కావడంతో ఆయా గ్రామాల్లోని మహిళలతో సులభంగా కలిసిపోయి వారికి అర్థమయ్యేలా చెప్పేవారు. గత పన్నెండేళ్లుగా 24 మారుమూల గ్రామాలను సందర్శించి 36 వేల మందికిపైగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. మానసిక ఆరోగ్యంతోపాటు, మహిళలు పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం, శిశు మరణాల రేటు తగ్గించడానికి కృషి చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రసవం అయిన తరువాత బొడ్డు తాడు కత్తిరించడం నుంచి శిశువును పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలన్న అవగాహన లేమితో చాలామంది పురిటి శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో శిశు మరణాల రేటు అధికంగా ఉంటుంది. సుమిత్ర, తన ఎన్జీవో సభ్యులతో కలిసి అవగాహన కల్పించి మరణాల రేటును 45 శాతం తగ్గించారు. మానసిక ఆరోగ్యంపై సుమిత్ర చేసిన సేవను గుర్తించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతేడాది ‘ఉమన్ ఎగ్జంప్లర్’ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ‘దలాన్సెట్’ మెడికల్ జర్నల్‌లో సుమిత్రా సేవా కార్యక్రమాలను ప్రస్తావించడం విశేషం. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, నీతి ఆయోగ్ ప్రకారం జార్ఖండ్ రాష్ట్రంలో మూఢనమ్మకాలు దయ్యం పిశాచి వంటి కారణాలతో మహిళలపై అనేక దారుణాలు అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. సుమిత్ర వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పించడం ద్వారా ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు, పోషకాహారంపై మంచి అవగాహన కల్పించడంతో ఇప్పుడు వారంతా మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నారు. -
Covid Vaccine: శభాష్ అన్నా.. చేతులు లేకపోతేనేం!
రాంచీ: ప్రస్తుత పరిస్థితిలో కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని కేంద్రం భావిస్తోంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కానీ కొంతమంది ఈ వ్యాక్సిన్ మంచిది కాదు, ఆ వ్యాక్సిన్ పనిచేయదు.. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ఎఫెక్ట్స్ అనే భయంతో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారికి ఆతీతంగా రెండు చేతులను కోల్పోయిన ఓ వ్యక్తి ఆదర్శంగా నిలిచాడు. జార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్ జిల్లా మనోహర్పూర్ బ్లాక్‌కు చెందిన మారుమూల గ్రామ నివాసి గుల్షన్ లోహ్రా బాధ్యతాయుతమైన పౌరుడుగా వ్యవహరించాడు. రెండు చేతులను కోల్పోయిన గుల్షన్ లోహ్రా తన తొడపై వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆరోగ్యకరమైన వ్యక్తికి ఎడమ చేతికి వ్యాక్సినేషన్ చేయాలి కాని ఇతడు రెండు చేతులను కోల్పోవడం వల్ల ఎడమ తొడకు ఇవ్వవలసి వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఏదేమైనా కరోనాను దూరంగా ఉంచేందుకు, వైరస్ నుంచి తనను తాను రక్షించుకునేందుకు వ్యాక్సిన్ తీసుకున్నట్లు గుల్షన్ తెలిపాడు. వ్యాక్సినేషన్ అనంతరం తనకు ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదని.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరాడు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మరణం సంభవించడం, జ్వరం, నపుంసకత్వం వంటి భయాలతో గుమ్లా, ఖుంటి, సిమ్దేగా, వెస్ట్ సింఘ్భుం, ఇతర గిరిజన జిల్లాల ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకునేందుకు భయపడుతున్నారు. గుల్షన్ ఆదర్శంగా తీసుకుని అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని అధికారులు కోరారు. చదవండి:కోట్లు విలువ చేసే పదార్థం అమ్మే ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్ -
కోవిడ్ టీకా డోస్‌లను అత్యధికంగా వృథా చేసిన రాష్ట్రం ఇదే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చూస్తే జార్ఖండ్ రాష్ట్రంలోనే అత్యధికంగా కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు వృథా అయినట్లు వెల్లడైంది. కోవిడ్ టీకా డోస్‌లను సమర్థవంతంగా వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో నిలిచింది. టీకా డోస్‌ల సరఫరా, పంపిణీ సమయాల్లో కొన్ని డోస్‌లు ధ్వంసమవడం తదితరాల కారణాలతో వృథా అవుతాయి. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా అమలుచేయడంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మే నెలలో ఏకంగా 1.61 లక్షల డోస్‌లను ఆదా చేయగలిగింది. కేరళ సైతం టీకాల డోస్‌ల వృథాను అరికట్టడంలో ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కేరళ కూడా 1.10 లక్షల కోవిడ్ టీకాలను ఆదా చేసింది. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో 15.79 శాతం టీకాలు, మధ్యప్రదేశ్‌లో 7.35 శాతం టీకాలు వృథా అయ్యాయి. పంజాబ్‌లో 7.08 శాతం, ఢిల్లీలో 3.95 శాతం, రాజస్తాన్‌లో 3.91 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 3.78 శాతం, గుజరాత్లో 3.63 శాతం, మహారాష్ట్రలో 3.59 శాతం టీకాలు వృథా అయ్యాయి. మే నెలలో మొత్తంగా కేంద్రప్రభుత్వం 7.9 కోట్ల డోస్‌లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. మేలో వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 2.1 కోట్ల డోస్‌లు అందుబాటులో ఉన్నాయి. చదవండి: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై బీజేపీ చెక్! -
చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు
రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఓ ఐదుగురు పోలీసులను సస్పెండ్‌కు గురయ్యారు. ఓ డ్రైవర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు సిమ్దేగా పోలీస్ సూపరింటెండెంట్ షామ్స్ తబ్రేజ్ ఆదివారం తెలిపారు. పోలీస్ శాఖ పరువు తీసే ఇటువంటి సంఘటనలను సహించమని ఎస్పీ అన్నారు. మే 22న సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ వీడియోలో ఉన్నది ఈశ్వర్ మారండి, అనుజ్ కుమార్, ముఖేష్ కుమార్ మహతో, శివ్ ఒరాన్, అఖిలేష్ తిర్కీగా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిపై శాఖ పరమైన చర్యలు తీసుకోన్నట్టు వెల్లడించారు. (చదవండి: వైరల్: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్!) -
బ్రిడ్జిపై వింత ఆకారం: పోలీసులు ఏమన్నారంటే..
రాత్రిపూట బ్రిడ్జ్‌పై వింత ఆకారం తిరుగుతున్నట్లు వీడియో ఒకటి ఇంటర్నెట్లో, మీడియా చానెల్స్‌లో కథనాలు ప్రసారం అవుతోంది. ఆ టైంలో కొందరు బైకర్స్ వీడియో తీసి వైరల్ చేయడంతో అది అంతటా పాకింది. అది ఏలియన్ అని కొందరు, కాదు బ్రిడ్జ్ దగ్గర్లో శ్మశానం ఉండడంతో దెయ్యం అని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. రాంచీ: బ్రిడ్జ్ మీద వింత ఆకారం పేరుతో వీడియో ఒకటి విపరీతంగా షేర్ అవుతున్న విషయం తెలిసిందే. హజారిబాఘ్ సమీపంలోని ఓ బ్రిడ్జ్ మీద ఇది జరిగిందని ప్రచారం నడుస్తోంది. మే 28న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు ఆ వింత ఆకారాన్ని గుర్తించారని, వీడియో తీసి వైరల్ చేశారని అక్కడి లోకల్ మీడియా ఛానెల్స్ కథనాల్ని ప్రచురించాయి. దీంతో పంజాబ్ కేసరి ఫేస్బుక్ ఛానెల్ ఆ వీడియోను అప్లోడ్ చేసి.. వింత ఆకారం సంచరించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారంటూ పోస్టులు పెట్టడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విషయం చేరింది. అయితే వైరల్ వీడియో తమ దృష్టిలోకి వచ్చిందని హజారిబాగ్‌లోని పెలావాల్ స్టేషన్ ఇన్‌ఛార్జి వికర్ణ కుమార్ తెలిపారు. ‘‘సోషల్ మీడియా ద్వారా వీడియో మా దృష్టికి వచ్చింది. ఛాద్వా డ్యామ్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆరోజు వాతావారణం బాగోలేదు. పైగా బ్రిడ్జ్ దగ్గర్లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తిరుగుతుంటాడు. బహుశా ఆ వ్యక్తే నగ్నంగా తిరిగి ఉంటాడని అనుమానిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఇక ఫ్రాంక్ వీడియోలు తీసే ఆకతాయిల మీదా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామమని వెల్లడించారు. కాగా, గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదురు కాలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఆ బ్రిడ్జ్‌కి వంద మీటర్ల దూరంలో ఓ వ్యక్తి బట్టలు లేకుండా తిరిగే విషయాన్ని మాత్రం నిర్ధారించారు. బహుశా అతని వీడియోను మార్ఫింగ్ చేసి ఎవరైనా ఉత్త ప్రచారానికి తెరలేపి ఉండొచ్చని కొందరు యువకులు అనుమానిస్తున్నారు. ఈరోజుల్లో టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి వీడియోను అయినా క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా అలాంటిదేమోనని.. ఈ వీడియోపై త్వరలోనే పూర్తి నిజాలు తేలుస్తాం వికర్ణ తెలిపారు. జోకులు రాత్రి పూట బ్రిడ్జ్‌పై వెళ్తున్న కొందరు ఆ ఆకారం దగ్గరకు వెళ్లగానే ‘‘దెయ్యం దెయ్యం’’ అంటూ అరుస్తూ వీడియో షూట్ చేశారు. ఇక జార్ఖండ్ వైరల్ వీడియోపై సోషల్ మీడియా సరదా కామెంట్లతో నిండిపోయింది. ఇది ఫ్రాంక్స్టర్ల పని కావొచ్చని, క్యాస్టూమ్.. లైటింగ్ ఎఫెక్ట్ మాయాజాలం అయ్యి కూడా ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఏలియన్లు వ్యాక్సినేషన్ కోసం వచ్చి ఉంటాయని, అయినా ఏలియన్లు అమెరికాలో తప్ప ఈ భూమ్మీద ఇంకెక్కడ కనిపించవని జోకులు వేస్తే.. ఇంకొందరేమో ఈ వీడియో సంగతేంటో చూడండంటూ నాసాకి, ఎలన్ మస్క్‌కి ట్యాగులు చేస్తున్నారు. చదవండి: మోదీసార్.. మాకెందుకీ కష్టాలు -
ధోని కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా.. వైరల్ వీడియో
రాంచీ: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు తెలియని వారుండరు. ఆయన మన భారత్ టీంకు గతంలో కెప్టెన్‌గా ఉన్నారు. అతని వికెట్ కీపింగ్ స్టెయిల్స్, హెయిర్ స్టెయిల్ను ఎంతో మంది కుర్రకారు కాపీ కొడుతూ ఉంటారు. అయితే, ఆయనకు పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఏ మాత్రం తీరిక దొరికినా వాటితోనే సమయం గడపటానికి ఇష్టపడతారు. అయితే, తాజాగా, ఆయన భార్య సాక్షి సింగ్ ఇన్‌స్టాలో పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆయన ఒక కొత్త గుర్రాన్ని ఇంట్లో తెచ్చుకున్నారు. దాన్ని కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. దానికి ‘చేతక్’ అని పేరుకూడా పెట్టారు. అయితే, గుర్రం ధోని ఇంట్లో పార్క్‌లో పడుకుని ఉంది. దాన్ని మచ్చిక చేసుకునే క్రమంలో చెతక్ను ప్రేమగా నిమురుతూ, పాంపరింగ్ చేయటం మొదలు పేట్టాడు. చెతక్ కూడా ధోని చేస్తున్న మసాజ్‌కు ఏమాత్రం కదలకుండా హాయిగా పడుకుంది. అయితే , ఈ గుర్రంతో పాటు , ఇప్పటికే మరికొన్ని కుక్కలు కూడా ధోని ఇంట్లో ఉన్నాయి. కాగా, సాక్షిసింగ్ తనింట్లో ఏ కొత్త జంతువును తీసుకొచ్చినా దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే, ఈ వీడియోను బాలీవుడ్ నటి బిపాషా బసు, మాజీ మిన్ ఇండియా అలంక్రిత సహయ్ కూడా వీక్షించారు. అయితే, దీన్నిచూసిన నెటిజన్లు ‘వీకెండ్లో కొత్త అతిథితో సరదాగా గడుపుతున్నారు’ , ‘ ‘మూగజీవాల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఆ మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్లు
భువనేశ్వర్/కోల్‌కతా: యాస్ తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన ఒరిస్సా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లకు కలిపి ప్రధాని మోదీ రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. ఇందులో, తక్షణ సాయం కింద ఒడిశాకు రూ.500 కోట్లు, బెంగాల్, జార్ఖండ్‌లకు కలిపి రూ.500 కోట్లు సాయంగా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతోపాటు, తుపాను వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇస్తారని పీఎంవో తెలిపింది. అంతకుముందు, ఒడిశాలో యాస్ తుపాను మిగిల్చిన విషాదం, వాటిల్లిన నష్టంపై ప్రధాని మోదీ స్వయంగా సమీక్ష నిర్వహించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ గణేష్ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగి పాల్గొన్నారు. తుపాన్ల సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా ఒడిశా సర్కారు డిమాండ్ చేసింది. సమావేశం అనంతరం ప్రధాని బాలాసోర్, భద్రక్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి బెంగాల్‌కు వెళ్లారు. రూ.20 వేల కోట్ల ప్యాకేజీ కోరిన మమత తుపానుతో రాష్ట్రంలో సంభవించిన నష్టం వివరాలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. బెంగాల్లో తుపాను పరిస్థితిని సమీక్షించేందుకు మోదీ కోల్‌కతాకు వచ్చారు. దిఘాలో సీఎం మమతా బెనర్జీతో 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు.తుపానుతో రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు మమత చెప్పారు. -
Cyclone Yaas: ప్రకృతి విలయం.. విధ్వంసం
రాంచీ(జార్ఖండ్): యాస్ తుపాను బుధవారం బీభత్సం సృష్టించింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోలేనంత నష్టాన్ని మిగిల్చింది. పట్టపగలే చీకట్లు అలుముకోవడంతో పాటు ప్రచండ గాలులు వీచాయి. అయితే బుధవారం అర్ధరాత్రి రాత్రి తర్వాత తుపాన్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాయవ్య దిశగా పయనిస్తూ మరో పన్నెండు గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ గురువారం ఉదయం ప్రకటించింది. ఇవి చూడండి.. యాస్ విధ్వంసం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంట తీరం యాస్ తుపాన్ దాటేటప్పుడు పరిస్థితి భయంకరంగా ఉంది. బీభత్సానికి కోటిమందికి పైగా నష్టపోయారు. అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గంటకు 150 కిలోమీటర్లతో వీచిన పెనుగాలులు ఒడిశాలోని భద్రక్ జిల్లాను అతలాకుతలం చేశాయి. ప్రచండ గాలుల ధాటికి కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్ తీరంలో సముద్రం బాగా ముందుకొచ్చింది. వందల గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకున్నాయి. తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒడిశా, బెంగాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వారంపాటు సహాయక చర్యలు ఒడిశాలో యాస్ తుపాన్ వల్ల 130కి పైగా గ్రామాలు దెబ్బతిన్నాయి. దీంతో వారం పాటు సహాయక చర్యల కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. తుపాన్‌తో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈరోజు ఆయన ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఇక ఎటు చూసినా అడుగుల మేర నీరు, బురదతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోంది. తుపాను ధాటికి పలుచోట్ల ఇళ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో 113 టీంలను ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసింది. రెండురాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపు 20లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ ధాటికి నలుగురు చనిపోయినట్లు సమాచారం. జార్ఖండ్ అలర్ట్ రానున్న 24 గంటల్లో జార్ఖండ్‌లో పిడుగులు ఉరుములతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో జార్ఖండ్‌లో హై అలర్ట్ ప్రకటించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం ఉదయం తర్వాత యాస్ తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశాల మధ్య తీరం దాటిన విషయం తెలిసిందే. కాగా, రెండు వారాల్లోనే రెండు తుఫాన్లు అరేబియా సముద్రం, బంగాళాఖాతంతో ఇరు తీరాలకు వణుకుపుట్టించాయి. యాస్ తుపాన్‌కి తోడు సంపూర్ణ పౌర్ణమి రావడంతో ఆటుపోట్ల వల్ల తీవ్రత ఇంకా ఎక్కువైంది. అగాథం వల్లే.. బంగాళాఖాతం ఈ భూమ్మీద సముద్రాల్లో 0.6శాతం ఆక్రమించి ఉంది. కానీ, ఈ భూమ్మీద తుపాన్లతో మరణించే ప్రతీ ఐదుగురిలో నలుగురు బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ల వల్లే మరణిస్తున్నారని తెలుసా!. -
కరోనా కాటు: ఇటుకల బట్టీలో ఫుట్‌బాల్ కెప్టెన్
వెబ్‌డెస్క్: పైన ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు సంగీతా సోరెన్. ఊరు జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా బాసమూది. వయసు ఇరవై ఏళ్లు. లాక్డౌన్ ప్రభావంతో ఇలా ఇటుకల బట్టీలో పనిచేస్తుంది. లేకుంటే ఆపాటికి ఫుట్‌బాల్ స్టార్‌గా వెలిగిపోయేదేమో! అవును.. సంగీత మంచి ఫుట్ బాల్ ప్లేయర్. 2018–19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్17,అండర్18 పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించింది. మంచి పర్ఫార్మెన్స్తో సీనియర్ టీమ్‌కు సెలక్ట్ అయ్యింది. టీంలో చేరుతుందనుకున్న టైంకి కరోనా మహమ్మారి వచ్చిపడింది. కుటుంబం ఆర్థిక స్థితి బాగోలేదు. పైగా ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకు.. లాక్డౌన్ ప్రభావంతో పని దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తోంది సంగీత. ప్రాక్టీస్ ఆపలేదు తల్లితో కలిసి బట్టీలో ఇటుకలు మోసే పనిచేస్తోంది సంగీత. ఫుట్‌బాల్ కెప్టెన్‌గా రాణించిన సంగీతకు ప్రోత్సాహం అందిస్తామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గతంలో ప్రకటించాడు. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా తమను సంప్రదించలేదని ఆమె తండ్రి దూబా వాపోయాడు. జార్ఖండ్‌లో మంచి ప్లేయర్స్ ఉన్నారని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని సంగీత అంటోంది. అయినప్పటికీ తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఫుట్ బాల్‌ను వదిలేది లేదని చెబుతోంది. పనికి పోయే ముందు రోజూ ఉదయం పొలాల్లో సంగీత తన ఆటకు మెరుగులు దిద్దుకుంటోంది. -
ఫేస్ బుక్ కలిపింది ఇద్దరినీ
ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, టిక్‌టాక్... టెక్నాలజీలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు... అందరూ అందులోనే మునిగిపోతున్నారు. అందుకే టెక్నాలజీ వచ్చి అందరినీ పాడు చేసేస్తోంది, ఎంతసేపూ సోషల్ మీడియాలో కూర్చుని సమయాన్ని వృథా చేస్తున్నారు అంటూ అందరూ టెక్నాలజీని తిడుతూనే ఉంటారు. అందులో వాస్తవం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, టెక్నాలజీ వల్ల మంచి కూడా జరుగుతుంది అని నిరూపించారు ఒక జంట. ఒడిషా సంబల్‌పూర్‌కి చెందిన లక్ష్మీరాణి (43), ఝార్ఖండ్కి చెందిన మహాబీర్ ప్రసాద్ శుక్లా (48)లు మార్చి 21, 2021 ఆదివారం శంకరమఠంలో ఒక్కటయ్యారు. వీరిద్దరినీ ఫేస్బుక్ కలిపింది. ఇద్దరూ పుట్టుకతో బధిరులు. పుట్టుక నుంచి ఇద్దరికీ వినపడదు, మాట్లాడలేరు. లక్ష్మీరాణి మెట్రిక్యులేషన్ చదివారు. కుట్లు, బ్యుటీషియన్ కోర్సు పూర్తి చేశారు. మహావీర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఆరు నెలల క్రితం లక్ష్మీరాణికి మహావీర్ ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ఇద్దరూ ఫోన్ ద్వారా మాట్లాడుకోలేరు కనుక, సోషల్ మీడియాలో మెసేజెస్ ద్వారా భావాలను పంచుకున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే ... వీరిద్దరూ వాట్సాప్ వీడియో కాల్లో వారి చేతుల మాటలలో మాట్లాడుకున్నారు. చూపులు కలిశాయి. చూపులతో పాటు ఇద్దరి భావాలూ కలిశాయి. ఇంకేం... ఒక్కటవ్వాలనుకున్నారు. టెక్నాలజీకి ఇద్దరూ చేతులెత్తి నమస్కరించారు. ఇద్దరూ ఒకరితో ఒకరు చేతులతో మాట్లాడుకుని, ఒకరి భావాలను ఒకరితో పంచుకుని, ఇద్దరూ మనసులు ఏకమై, ఇద్దరూ ఒక్కటవ్వడానికి సాంకేతిక పరిజ్ఞానమే ఉపయోగపడిందంటున్నారు ఈ నూతన జంట. ‘‘మా ఆంటీకి మహాబీర్ మామ ఫేస్బుక్లో కనిపించాడు. వీరిద్దరూ సోషల్ మీడియాలోని అన్ని వేదికలను ఉపయోగించుకున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు బాగా సన్నిహితంగా మాట్లాడుకున్న తరవాత, మా ఆంటీ మహాబీర్ మామను వివాహం చేసుకుంటానని తన నిర్ణయాన్ని తెలిపింది, మామ కుటుంబీకులు కూడా అంగీకరించారు’ అంటాడు ఇరవై ఒక్క సంవత్సరాల లక్ష్మీరాణి మేనల్లుడు అర్ణవ బాబు. ఆమెకు ఇలా వివాహం కుదురుతుందని ఎన్నడూ అనుకోలేదు అంటున్నారు అర్ణవ్ తల్లిదండ్రులు. ‘లక్ష్మీరాణికి తగిన సంబంధం దొరికినందుకు మాకు చాలా ఆనందం కలిగింది. ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్లే జరిగింది. ఇద్దరూ సంతోషంగా, ప్రశాంత జీవితాన్ని గడపాలని మనసారా ఆశీర్వదిస్తున్నాం’’ అంటున్నారు పెద్దలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య సంబల్పూర్లోని శంకరమఠంలో వీరిరువురి వివాహం నిరాడంబరంగా జరిగింది. ‘శతమానం భవతి’ అని పలికిన దీవెనలు, వారి జీవితాల్లో సంతోషాలను పల్లవించాలని ఆశిస్తున్నారు. లక్ష్మీరాణి, మహాబీర్ ప్రసాద్ శుక్లా -
ఇషాన్ కిషన్ విశ్వరూపం
ఇండోర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలన ప్రదర్శన నమోదైంది. కెప్టెన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (94 బంతుల్లో 173; 19 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగడంతో జార్ఖండ్ 324 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను చిత్తుగా ఓడించింది. హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 422 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనుకూల్ రాయ్ (39 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), విరాట్ సింగ్ (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సుమీత్ కుమార్ (58 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో కిషన్‌కు అండగా నిలిచారు. ఐపీఎల్లో ఈ ఏడాది ముంబై తరఫున సత్తా చాటిన కిషన్ సొంత రాష్ట్రం తరఫున వన్డేల్లో తన మెరుపులు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 142 పరుగు లు బౌండరీల ద్వారానే రావడం విశేషం. తన అర్ధ సెంచరీని 42 బంతుల్లో అందుకున్న కిషన్, 74 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై 150 పరుగుల మార్క్‌ను దాటేందుకు మరో 12 బంతులు సరిపోయాయి. శతకం మైలురాయిని చేరిన తర్వాత వచ్చిన 71 పరుగులను అతను 20 బంతుల్లోనే సాధించడం అతని బ్యాటింగ్ జోరును చూపిస్తోంది. అనంతరం మధ్యప్రదేశ్ 18.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ భండారి (42) టాప్ స్కోరర్‌గా నిలవగా, పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ (6/37) ప్రత్యర్థిని పడగొట్టాడు. కీపర్‌గానూ సత్తా చాటిన కిషన్ మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 క్యాచ్‌లు అందుకోవడం మరో విశేషం. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ♦ఛత్తీస్‌గఢ్ 231 (శశాంక్ 92, అర్జన్ 6/54)పై 3 వికెట్లతో గుజరాత్ 232/7 (ధ్రువ్ రావల్ 38) విజయం. ♦గోవా 263 (స్నేహల్ 81, కృనాల్ పాండ్యా 3/10)పై 5 వికెట్లతో బరోడా 264/5 (విష్ణు సోలంకి 108, కృనాల్ పాండ్యా 71, స్మిత్ పటేల్ 58) విజయం. ♦పంజాబ్ 288/4 (గుర్కీరత్ మన్ 139 నాటౌట్, ప్రభ్‌సిమ్రన్ 71, సన్వీర్ 58)పై 6 వికెట్లతో తమిళనాడు 289/4 (జగదీశన్ 101, బాబా అపరాజిత్ 88, షారుఖ్ ఖాన్ 55 నాటౌట్) విజయం. ♦కర్ణాటక 246/8 (అనిరుధ 68, దేవదత్ పడిక్కల్ 52)పై 9 పరుగులతో (వీజేడీ పద్ధతి) ఉత్తరప్రదేశ్ 215/4 (రింకూ సింగ్ 62, అభిషేక్ 54) విజయం. ♦ఒడిషా 258/8 (సందీప్ 66, గౌరవ్ 57)పై 34 పరుగులతో (వీజేడీ పద్ధతి) కేరళ 233/4 (రాబిన్ ఉతప్ప 107) విజయం. ♦బిహార్ 189 (అనూజ్ రాజ్ 72)పై 10 వికెట్లతో రైల్వేస్ (మృనాల్ దేవధర్ 105 నాటౌట్, ప్రథమ్ సింగ్ 72 నాటౌట్) విజయం. చదవండి: 'అనుకున్నది సాధించాం.. సంతోషంగా ఉన్నా' -
కామాంధుల అకృత్యం: 50 ఏళ్ల మహిళపై
రాంచీ: దేశంలో వరుస నిర్భయ ఉదంతాలు మహిళ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో బధువా ఘటనను తలపించేలా 50 ఏళ్ళ మహిళపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. జార్ఖండ్ రాష్ట్రం చత్రాలోని హంటర్‌గంజ్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగుచూసింది. గురువారం రాత్రి బహిర్భూమి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆమె ప్రైవేట్ భాగాలలో స్టీల్ టంబ్లర్‌ను చొప్పించి మరీ మాటల్లో చెప్పలేని విధంగా దారుణంగా హింసించారు. అంతేనా ఈ విషయాన్ని బయటకు చెబితే భయంకరమైన పరిణామాలుంటాయని, చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. (ఆ దుర్మార్గుడు దొరికాడు) అయితే బయటకు వెళ్లిన బాధితురాలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో, వెతకడానికి బయలుదేరిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను గుర్తించారు. వెంటనే ఆమెను హంటర్‌గంజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి బీహార్‌లోని గయాలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో చికిత్స తీసుకుంటోందని వైద్యులు తెలిపారు. (ఎన్సీడబ్ల్యు సభ్యురాలి అనుచిత వ్యాఖ్యలు : తాప్సీ ఫైర్) కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సత్వరమే విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని ఎస్పీ రిషబ్ ఝా తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారిలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. (కామాంధుల క్రూరత్వానికి పరాకాష్ట.. మహిళ మృతి) -
అధికార పార్టీ దంపతులు దారుణ హత్య
రాంచీ : జార్ఖండ్‌లో అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, అతని భార్య హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ధన్‌బాద్‌కు చెందిన జార్ఖండ్ ముక్తీమోర్చా (జేఎంఎం) నేత శంకర్ రావాణీ, అతని భార్య బాలికదేవీని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆదివారం తెల్లవారుజామున వారి ఇంటి పెద్ద శబ్ధాలు రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమీప వ్యక్తులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక ఎస్పీ ఎస్క సిన్హా.. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఓ తుఫాకితో పాటు పదునైనా కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ, లేదా వ్యాపార ప్రత్యర్థులే ఈ హత్యలకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేత హత్యపై స్థానిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసకోకుండా శంకర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బంధోబస్తును ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధన్‌బాద్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
బకెట్లో మనిషి చేయి లభ్యం
రాంచీ : మనిషి చేయి ఒకటి బకెట్లో లభించడం కలకలం రేపింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని బారియాటు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బకెట్లో తెగిన చేయి ఒకటి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని రాంచీ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి బకెట్లో లభించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేతి ఒక క్యాన్సర్ పేషంట్దని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. పరీక్షకు సంబంధించి ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు సదరు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది. కాగా తెగిన చేయి ఆసుపత్రి నుంచి బకెట్లోకి ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు. చదవండి : అస్సాంలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు -
రైడింగ్‌కు వెళ్లిన 42 మంది పోలీసులకు క్వారంటైన్
రాంచీ : అక్రమ మద్యం సరఫరా జరుగుతుందని సమాచారం అందుకొని రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు అనుకోకుండా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జూలై 4(శనివారం) అక్రమ మద్యం సరఫరా జరుగుతుందని కోడెర్మా పోలీస్ స్టేషన్‌కు సమాచారమందింది. దీంతో డీఎప్సీ ఆధ్వర్యంలో జయ్ నగర్, చాంద్వారా పోలీస్ స్టేషన్‌కు చెందిన మొత్తం 42 మంది పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి అక్రమ మద్యం సరఫరా జరుగుతున్న ప్రదేశంలో రైడింగ్ నిర్వహించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా జైలుకు తరలించే ముందు పోలీసులు ఇద్దరు నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం వచ్చిన రిపోర్టులో తేలింది. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన) దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ పాజిటివ్ వచ్చిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా రైడింగ్‌కు వెళ్లిన డీఎస్పీ సహా 42 మంది పోలీసులను, మరొక నిందితుడిని దోమచాంచ్ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కాగా ఈ విషయమై కోడెర్మా డిప్యూటీ కమిషనర్ రమేశ్ గోలప్ స్పందిస్తూ.. 'రైడింగ్‌కు రెండు బృందాలుగా మొత్తం 42 మంది పోలీసులు వెళ్లారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ముందస్తుగా వారందరిని మేము ఏర్పాటు చేసుకున్న క్వారంటైన్ సెంటర్‌కు తరలించాం. ప్రస్తుతం వారంతా బాగానే ఉన్నారు. అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాం. కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నా వైరస్ ఉదృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం'అంటూ తెలిపారు. మరోవైపు ఇప్పటికే జయనగర్, చాంద్‌వారో పోలీస్ స్టేషన్లకు సాధారణ ప్రజలు రాకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే గత నాలుగు రోజులగా ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఇప్పటికే అధికారిక ప్రకటన జారీ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌లో ఇప్పటివరకు 2,781 కరోనా కేసులు నమోదవ్వగా.. 19 మంది మృతి చెందారు -
పేరెంట్స్ మీటింగ్‌కు వచ్చి..
బొబ్బిలి: బొబ్బిలి సమీపంలోని ఏసియన్ ఎ యిడెడ్ బ్లైండ్ స్కూల్లో చదువుతున్న తమ అంధ పిల్లల బాగోగుల కోసం స్కూల్లో ఏ ర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశానికి వ చ్చిన వారంతా విద్యార్థులతో పాటు లాక్ డౌన్ వల్ల ఇక్కడ చిక్కుకు పోయారు. మార్చి 23న నిర్వహించిన సమావేశానికి వచ్చిన సుమారు 17 మంది విద్యార్థుల తల్లిదండ్రులు లాక్ డౌన్ వల్ల ఇక్కడే ఉండిపోయారు.ఇప్పటి వరకూ వా రు ఇక్కడ ఉండిపోయిన విషయం బయట కు తెలియలేదు. వారికి మాస్క్‌లు, శానిటైజర్లు కూడా లేవు. విషయం తెలిసిన కారుణ్య ఫౌండేషన్ అధ్యక్షుడు జె.సి.రాజు, ఎంఈఓ చల్ల లక్ష్మణరావు ప్రిన్సిపాల్ ప్రభుదాస్‌తో కలసి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు. సరిగ్గా అదే సమయానికి కలెక్టరే ట్ నుంచి విద్యార్థులను, తల్లిదండ్రులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. ప్రభుత్వం వీరిని తరలించే చ ర్యలు తీసుకోవడాన్ని పలువురు అభినందించారు. -
యువకుడిని కొట్టి, మూత్రం తాగించి..
రాంచీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుండగా, అక్కడక్కడా పోలీసుల ఓవరాక్షన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో బయటకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టి మూత్రం తాగించిన ఘటన కలకలం రేపింది. రాంచీలోని హింద్పిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చిరువ్యాపారిగా భావిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. యువకుడిని చుట్టుముట్టిన పోలీసులు అతడిని కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను కొట్టవద్దని యువకుడు ప్రాధేయపడుతున్నా వినిపించుకోని ఖాకీలు అతడిని కర్కశంగా కొడుతున్నట్టు వీడియోలో కనిపించింది. యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై హింద్పిరి పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓను సస్పెండ్ చేసిన డీఎస్పీ దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని రాంచీ ఎస్పీ తెలిపారు. కాగా రాంచీలో మంగళవారం కరోనా వైరస్ పాజిటివ్ తొలికేసు నమోదైంది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన మలేషియన్ మహిళను ఐసోలేషన్‌కు తరలించామని అధికారులు వెల్లడించారు. జార్ఖండ్‌లో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు కావడం గమనార్హం. చదవండి: కరోనా: తప్పిన పెనుముప్పు! -
బాలికపై అత్యాచారం : ముగ్గురికి మరణశిక్ష
రాంచీ : ఆరేళ్ల బాలికపై అత్యంత కిరాతంగా అత్యాచారం జరిపి ఆపై పెట్రోల్‌తో కాల్చి హత్య చేసిన కేసులో జార్ఖండ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ మేరకు ఈ రాష్ట్రంలోని దుమ్కా జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తుఫిక్ ఉల్ హుస్సేన్ మంగళవారం తీర్పును వెలువరించారు. కేసులో దోషులగా తేలిన ముగ్గురికి తలా రూ.50 వేల జరిమానా కూడా విధించారు. కాగా శిక్షపడిని ముగ్గురు దోషులూ 19 నుంచి 25 ఏళ్ల మధ్యవారు కావడం గమనార్హం. ఘటన జరిగిన 25 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్షను ఖరారు చేయడం విశేషం. మితూరాయ్, పంకజ్ మొహలీ, అశోక్ రాయ్ అనే ముగ్గురు యువకులు ఈ ఏడాది ఫిబ్రవరి 8న అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం హత్య నుంచి తప్పించుకోవాలని బాలికపై పెట్రోల్‌పోసి దారుణంగా కాల్చి హత్య చేశారు. కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు ఫోక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. కాగా దోషుల్లో ఒకరైన పంకజ్ బాధితురాలికి సమీప బంధువు కావడం విచారం. -
అంబులెన్స్ ఆలస్యం.. మహిళ మృతి
రాంచీ: సమయానికి అంబులెన్స్ రాక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన జార్ఖండ్‌లో జరిగింది. గుమ్లా జిల్లాలోని సదర్ ఆస్పత్రిలో సదాన్ దేవి(48) గత నెల 29న చేరారు. అయితే ఆమె పరిస్థితి ఉన్నట్టుండి విషమంగా మారడంతో వైద్యులు రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తీస్కెళ్లాల్సిందిగా శుక్రవారం మధ్యాహ్నం సూచించారు. బాధితురాలి బంధువులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఆమెను రిమ్స్‌కు తరలించినా ఆలస్యం కావడంతో మరణించింది. అంబులెన్స్ డ్రైవర్ ఆలస్యం చేయడమే దీనికి కారణమని వైద్యులు తెలిపారు. -
సోరెన్ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు
రాంచీ : దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ, సీఏఏపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో విపక్ష నేతలంతా ఒకే వేదికను పంచుకోనున్నారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ఈనెల 29న రాంచీలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఎన్డీయేతర), పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలను స్వయంగా కలిసిన హేమంత్.. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. (29న సీఎంగా హేమంత్ ప్రమాణం) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే సోనియా గాంధీ రాకపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలంతా పెద్ద ఎత్తు హాజరైన విషయం తెలిసిందే. -
ప్రమాణ స్వీకారానికి రండి
న్యూఢిల్లీ: జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ నెల 29వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. అనంతరం ఆయన రాహుల్ గాంధీతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోనూ సమావేశమై, వారినీ ఆహ్వానించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆర్పీఎన్ సింగ్ కూడా ఉన్నారు. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని సోనియాతో సమావేశానికి ముందు హేమంత్ సోరెన్ మీడియాతో అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఐదేళ్లూ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్‌ను ఆహ్వానించారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బుధవారం తెలిపింది. మంగళవారం హేమంత్, ఇతర కూటమి నేతలతో గవర్నర్‌తో సమావేశమై తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ అందజేశారన్నారు. -
కమల దళంలో కలవరం!
‘బీజేపీ హఠావో– భారత్ బచావో‘ నినాదం రోజురోజుకు బలపడుతోంది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో కలవరం మొదలైంది. జార్ఖండ్ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పునిచ్చారు. బీజేపీ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్–జే.ఎన్.ఏం కూటమిని గెలి పించారు. జార్ఖండ్ శాసనసభలో మొత్తం 81 స్థానాలుండగా, కాంగ్రెస్–జె.ఎన్.ఎం (యూపీఏ) కూటమి 48 స్థానాలలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అధికార బీజేపీ 25 స్థానాలకు పరిమితం అయింది. మోదీ 9 ఎన్నికల సభల్లో ప్రసంగించగా కేవలం 3 చోట్ల మాత్రమే బీజేపీ గట్టెక్కింది. దీంతో ఏడాది కాలంలో వరుసగా 5 రాష్ట్రలలో బీజేపీ అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లలో ప్రజలు బీజేపీని ఇంటికి పంపించారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను, బీజేపీ దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలనే దురుద్దేశంతో తీసుకున్న ఎన్.ఆర్.సి. నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన రెఫరెండంగా చూడాలి. భారత రాజ్యాంగ పునాదులను, విలువలను పెకలించేలా, దేశ ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, మోదీ–షా ద్వయం పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి.) అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేస్తా మని కలలు కన్న బీజేపీ అధిష్టానానికి, ప్రజలు తమ పార్టీనే వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సాగనంపుతుంటే తల బొప్పి కడుతోంది. 2019లో దేశ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, మెజారిటీ ఉన్నది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో బీజేపీ అనేక ప్రజావ్యతిరేక చట్టాలు తెస్తోంది. కానీ తాము తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, సరైన సమ యంలో, సరైన నిర్ణయం తీసుకుంటారనే ఆలోచనే బీజేపీకి లేదు. దేశ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా వివాదాస్పద నిర్ణయాలతో మోదీ–షాలు కాలం వెళ్లదీస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం, లోపభూయిష్ట జీఎస్టీ విధానం, కశ్మీర్ నిర్బంధం, సమాచార హక్కు చట్టానికి కోరలు పీకే సవరణలు లాంటి నిర్ణయాలు బీజేపీ అప్రజాస్వామిక పోకడలకు తార్కాణాలు. ఇపుడు, మైనార్టీ వర్గాలను ప్రత్యేకంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి.) పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది. ఈ చట్టం అమలు విషయమై మోదీ–అమిత్ షా ఇద్దరూ పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టా లని చూస్తున్నారు. ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాలరాసే ఈ పౌర చట్టం అమలును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్‌ఘాట్ వేదికగా సత్యాగ్రహం చేపట్టింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. మోదీ–అమిత్ షా ధ్వయానికి అసలు సవాల్ ముందుంది. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కమల దళంలో కలవరపాటు పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మినహా చెప్పుకోదగ్గ పెద్ద రాష్ట్రంలో ఎక్కడా అధికారంలో లేని బీజేపీకి ఈ ఎన్నికలు కత్తిమీద సాము లాంటివి. జార్ఖండ్ ఎన్నికల్లో లెక్కచేయని బీజే పీతో, బీహార్ ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేసే విషయమై జేడీయూపార్టీ పునరాలోచనలో పడింది. బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయటానికి బీజేపీ ఎన్ని అల్లర్లు సృష్టించినా అక్కడి ప్రజలు తిప్పికొడుతున్నారు. దీనికి తోడు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగ సమస్య, ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ ఇదే ఒంటెద్దు పోకడలు కొనసాగిస్తే, 2020 నాటికి ‘బీజేపీ ముక్త్ భారత్‘ ఖాయంగా కనిపిస్తోంది. కొనగాల మహేష్ వ్యాసకర్త జాతీయ సభ్యులు, ఏఐసీసీ మొబైల్ : 98667 76999 -
బీజేపీ ప్రాభవం తగ్గుతోంది!
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా నుంచి తాజాగా జార్ఖండ్ కూడా జారిపోయింది. 2017లో దేశ భూభాగంలోని 71%లో బీజేపీ ఆధికారంలో ఉంది. ఇప్పుడు 2019 డిసెంబర్ నాటికి అది 35 శాతానికి తగ్గిపోయింది. జనాభా విషయానికి వస్తే నాడు 69% జనాభా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండగా, అదిప్పుడు 43 శాతానికి తగ్గింది. ఈ సంవత్సరం ఏప్రిల్– మే నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన అనంతరం జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. త్వరలో ఢిల్లీ, బిహార్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పరంపర 2018 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో ఓటమి నుంచి ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో పట్టున్న సామాజిక వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నేతలను ప్రోత్సహించే విధానాన్ని బీజేపీ వదలాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హరియాణాలో జాట్, మహారాష్ట్రలో మరాఠా, జార్ఖండ్‌లో గిరిజనులు బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హరియాణా, మహారాష్ట్రల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పోలిస్తే.. తక్కువ సీట్లనే గెలుచుకుంది. హరియాణాలో జననాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. మహారాష్ట్రలో మిత్ర పక్షం శివసేనతో విభేదాల కారణంగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. తాజాగా, జార్ఖండ్‌లో అధికారాన్ని కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం కూడా.. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతంతో పోలిస్తే బాగా తగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ఓటు శాతం 55 కాగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అది 33 శాతానికి తగ్గింది. హరియాణాలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటుశాతం 58 కాగా, అది శాసనసభ ఎన్నికల నాటికి 36 శాతానికి తగ్గింది. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్, అయోధ్యలో రామ మందిరం.. తదితర సైద్ధాంతిక హామీలను నెరవేర్చినప్పటికీ.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకపోవడం గమనార్హం. -
జార్ఖండ్ ఫలితాలు నేడే
రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. రెండు పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి హోరాహోరీగా తలపడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఒక్కొక్కరు తొమ్మిదేసి ర్యాలీల్లో పాల్గొంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయిదు, ప్రియాంక గాంధీ ఒక్క ర్యాలీలో పాల్గొన్నారు. జేఎంఎం నేత ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ సోరెన్ కీలకంగా మారారు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పోటీ చేసిన జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గంపైనే అందరి దృష్టీ ఉంది. 1995 నుంచి ఆయన ఈ స్థానం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే రఘుబర్ దాస్ సహచరుడు, మాజీ మంత్రి సరయూ రాయ్ బీజేపీ రెబెల్ అభ్యర్థిగా ఈ స్థానంలో నిలబడడంతో పోటీ రసవత్తరంగా మారింది. మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేస్తుంటే, బీజేపీ తామే తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ధీమాతో ఉంది. ఎవరి అంచనాలు నిజం కానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
నేడు జార్ఖండ్‌లో 4వ విడత పోలింగ్
-
రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై లోక్‌సభ దద్దరిల్లింది. యావత్ భారతదేశాన్ని, ఆర్థిక ప్రగతిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యానించారంటూ సభలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపిస్తే, పార్లమెంటులో కొనసాగే నైతిక హక్కు రాహుల్‌కి లేదని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారరాహుల్ గాంధీ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే భారత్ ‘రేప్ ఇన్ ఇండియా’గా మారుతోందని అన్నారు. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఓం బిర్లా రెండు సార్లు సభని వాయిదా వేసినా పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఆయన సభని నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభలో రాహుల్‌ని గట్టిగా నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలు చూస్తే దేశంలో మహిళలపై అత్యాచారం చేయాలని పిలుపునిస్తున్నట్టుగా ఉందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్మృతి ఇరానీకి మద్దతు నిలిచారు. రాహుల్‌కు మద్దతుగా కనిమొళి.. బీజేపీ సభ్యులు సభలో తీవ్రంగా దాడి చేయడంతో రాహుల్‌కు ఎంపీ కనిమొళి మద్దతు పలికారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడడానికి స్పీకర్ అనుమతించకపోవడంతో ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. బీజేపీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని తాను క్షమాపణ చెప్పనని అన్నారు. ఈసీకి బీజేపీ ఫిర్యాదు రాహుల్ అత్యాచార వ్యాఖ్యల్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలు కేంద్ర ఎన్నిక సంఘాన్ని సంప్రదించారు. రాహుల్ అత్యాచారాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. వీలైనంత మేర ఆయనకు కఠిన శిక్ష విధించాలని ఈసీని కోరారు. చట్టబద్ధమైన పక్రియలన్నీ పూర్తయ్యాక తాము తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చినట్టు ఇరానీ వెల్లడించారు. -
జార్ఖండ్ మూడో దశలో 62 శాతం పోలింగ్
రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది జిల్లాల్లో 17 సీట్లకు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 56 లక్షల మంది (62.6 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే వెల్లడించారు. వీరిలో 26 లక్షల మంది మహిళలు, 86 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాంచి, హటియా, కాంకే, బర్ఖాతా, రామ్‌గర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. -
జార్ఖండ్‌లో నేడే మూడో విడత పోలింగ్
రాంచీ : జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ గురువారం జరుగుతోంది. మొత్తం 17 స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా, అందులో రాజధాని నగరమైన రాంచీ కూడా ఉంది. రాంచీ, హతియా, కాంకె, బర్కత, రామ్‌గడ్ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణయించారు. ఈ విడత పోలింగ్‌లో ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలున్నాయి. అంతేకాక, మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మాతోలు కూడా మూడో విడతలో పోటీ పడుతున్నారు. -
పై అధికారులను కాల్చి చంపిన సీఆర్పీఎఫ్ జవాన్
రాంచీ : మద్యం మత్తులో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ తన పై అధికారులను సోమవారం కాల్చి చంపాడు. చత్తీస్‌గఢ్‌కు చెందిన జవాన్ జార్ఖండ్‌లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సంఘటనలో అసిస్టెంట్ కమాండెంట్, అసిస్టెంట్ ఎస్ఐ చనిపోయారని, కాల్చిన జవాను గాయపడ్డాడని సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఘటనకు గల కారణాలు తెలియదని, విచారణ చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, భద్రతా దళాల్లో ఇలాంటి సంఘటలు వరుసగా చోటుచేసుకుంటుండడంతో జవాన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు: మోదీ
బర్హి/బొకారొ: ఉప ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు అద్భుత తీర్పునిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో తామిచ్చిన తీర్పును అపహాస్యం చేసి, వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికల్లో మంచి గుణపాఠం చెప్పారన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బర్హి, బొకారొల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు. ‘కర్ణాటక ఉప ఎన్నికలు మూడు విషయాలు చెబుతున్నాయి. ఒకటి, ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. రెండు, తమ తీర్పును అవమానించినవారికి గుణపాఠం చెప్పారు. మూడు, బీజేపీ ప్రజల కోసం పనిచేస్తుందని నమ్మారు’ అని అన్నారు. -
జార్ఖండ్‌లో 63.36% పోలింగ్
రాంచీ: ఉద్రిక్తత నడుమ జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్ ముగిసింది. 63.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సిసాయ్ నియోజకవర్గంలోని 36వ పోలింగ్ బూత్ వద్ద పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించగా, మరి కొందరు గాయపడ్డారని ఏడీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నామని జార్ఖండ్ ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు. పోలీసుల కాల్పుల అనంతరం కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్లు విసరడంతో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. రెండో దశలో మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా, అందులో 18 స్థానాల్లో మధ్యాహ్నం 3 వరకూ మరో రెండు స్థానాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. దాదాపు ఏడు జిల్లాల వ్యాప్తంగా 42 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. -
జార్ఖండ్‌లో 64 శాతం పోలింగ్
రాంచీ: జార్ఖండ్‌లో మొదటి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం జరిగిన ఈ పోలింగ్‌లో 64.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుమ్లా జిల్లాలో ఓ కల్వర్టు వద్ద నక్సలైట్లు బాంబు పేల్చారని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని అదనపు డీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. దల్తన్గంజ్ నియోజకవర్గంలోని కోసియారాలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ త్రిపాఠి ఆయుధాలతో పోలింగ్ బూత్‌లో ప్రవేశించాలని చూడగా పోలీసులు అడ్డుకొని అతని నుంచి ఓ పిస్టల్, మూడు కాట్రిడ్జ్‌లను సీజ్ చేశామని పలమౌ డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ శాంతను అగ్రహారి తెలిపారు. నక్సల్స్ ప్రభావితం, చలికాలంలో త్వరగా చీకటి పడుతున్నందున ఉదయం 7కు ప్రారంభించి, మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగించినట్లు చెప్పారు. 13 ప్రాంతాల్లోనూ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖులు ఆరోగ్య శాఖ మంత్రి రామ్ చంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రామేశ్వర్ ఓరాన్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆ పార్టీ చీఫ్ విప్ రాధాక్రిష్ణ కిషోర్‌లు ఉన్నారు. -
జార్ఖండ్ ప్రచారం : తెరపైకి అయోధ్య..
రాంచీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ అంశాన్ని ప్రస్తావించింది. జార్ఖండ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తూ అయోధ్య, కశ్మీర్ అంశాలను హైలైట్ చేశారు. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. అయోధ్యపై సుప్రీం కోర్టులో కేసు విచారణ నిరంతరాయంగా జరగకుండా ఉండేలా కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు. అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించేందుకు మార్గం సుగమం చేస్తూ సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును వెల్లడించిందని చెప్పుకొచ్చారు. అయోధ్యలో వివాదాస్పద భూమిపై ఆరు దశాబ్ధాలుగా న్యాయస్ధానంలో పెండింగ్‌లో ఉన్న కేసుపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ 40 రోజుల పాటు నిర్విరామంగా విచారణ చేపట్టి చారిత్రక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, జార్ఖండ్‌లో ఈనెల 30 నుంచి డిసెంబర్ 20 వరకూ ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. -
జార్ఖండ్‌లో బీజేపీకి ఎదురుగాలి?
రాంచీ : ముఖ్యమంత్రి పీఠంపై వివాదంతో మహారాష్ట్రలో అధికారం దక్కించుకోలేకపోయిన బీజేపీకి త్వరలో రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం నరేంద్ర మోదీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టాక జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గతంలో కంటే ఆపార్టీకి సీట్లు, ఓట్లు తగ్గాయి. హర్యానాలో ఒంటరిగా పోటీకి దిగిన బీజేపీ ఫలితాల అనంతరం కింగ్ మేకర్‌గా నిలిచిన జననాయక జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాతో పొత్తు కుదుర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటు మహారాష్ట్రలో ఎన్డీఏ చిరకాల భాగస్వామి శివసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగినా, ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నమైంది. హర్యానాలో గతంలో కంటే సీట్లు, ఓట్లు తగ్గినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మహారాష్ట్రలో మాత్రం ఆ పని చేయలేకపోయింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది. రానున్న జార్ఖండ్ ఎన్నికలను చూస్తే ఇన్నాళ్లూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీతో ఎన్నికలకు ముందే విడిపోయినట్టు కనిపిస్తోంది. జార్ఖండ్‌లో ఐదు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 20కి ముగుస్తాయి. ఇంకో పదిహేను రోజుల్లో మొదటి విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఇంకా సీట్లు ఖరారు కాకపోవడం, బీజేపీ తన అభ్యర్థులను ప్రకటిస్తుండడం చూస్తుంటే పొత్తు లేనట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకవేళ పొత్తు కుదరకపోతే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇది కాక, ఎన్డీఏలో మరో భాగస్వామి పార్టీ అయిన ఎల్జేపీ ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో అధికారం పంచుకుంటున్నా, జార్ఖండ్‌లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. 2014 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 81 స్థానాలకు గాను, 43 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇంకా పొత్తు కుదరకపోవడంతో 2014 పరిస్థితి పునరావృతం కాకపోవచ్చని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కుదరకపోవడానికి మహారాష్ట్ర పరిస్థితిని ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు. శివసేన ప్రభావం? ముందే పొత్తు కుదుర్చుకుంటే ఆ తర్వాత ఏపార్టీకి మెజారిటీ వచ్చినా బేరమాడే అవకాశాన్ని కోల్పోతామనే అంచనాలో ఎవరికి వారు ఉన్నారని తెలుస్తోంది. తమది చిన్న పార్టీ అయినా ఎన్నికల ఫలితాలనంతరం కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశాలున్నాయని స్టూడెండ్ యూనియన్ పార్టీ భావిస్తోంది. అదృష్టం కలిసివస్తే శివసేనలా తమకూ సీఎం పీఠం దక్కే అవకాశాన్ని కొట్టిపారేయలేమని వారు అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు సీట్లు ఖరారు చేసుకొని ఎన్నికల ప్రచారంలో బలంగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లో అధికార బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ 61 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నా అందులో సగం సీట్లు గెలవడం కూడా కష్టమనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదికాక, బీజేపీ చీఫ్ విప్ రాధాకృష్ణ కిషోర్‌తో పాటు మరికొందరు నాయకులు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీలో చేరడం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ జార్ఖండ్‌లో అధికారం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమను గట్టెక్కిస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య తీర్పు ఎంతవరకు ఓట్లను రాల్చగలదనే అంశం ఈ ఎన్నికల్లో తేలిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లలో అధికారం కోల్పోవడం బీజేపీ హవా తగ్గుతోందనడానికి నిదర్శనమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందీ బెల్ట్ ఏరియాలో బలంగా ఉండే బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ హవా పని చేయడం లేదా? ఇదిలా ఉండగా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విఫలమవుతున్నా, లోక్‌సభలో మాత్రం ఆ పార్టీకి గతంలో కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. వీటికి కారణాలు పరిశీలించగా, కేంద్రంలో నరేంద్ర మోదీ హవా బలంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల ఎన్నికలు అంటే ఓటర్లు స్థానిక సమస్యలు, స్థానిక నాయకత్వ పనితీరు వంటివి పరిగణనలోకి తీసుకుంటారని, అదే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ సమస్యల గురించి ఆలోచిస్తారని చెప్తున్నారు. ఆయా ఎన్నికలకు ఓటర్ల ప్రాధామ్యాలు మారిపోతుంటాయని బలంగా వాదిస్తున్నారు. ఇదే నరేంద్రమోదీ, అమిత్ షాలు ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసినా, లోక్‌సభలో వచ్చిన ఫలితాలు రాలేదని గుర్తు చేస్తున్నారు. స్థూలంగా చూస్తే 2018 నవంబర్‌లో 16 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉండగా, ఒక్క ఏడాదిలోనే ఆ సంఖ్య 12కి తగ్గింది. అంటే లోక్‌సభ ఎన్నికలు ప్రధాని కేంద్రంగా జరుగుతాయి కాబట్టి ఓటర్లు మోదీ వైపు మొగ్గుచూపుతున్నారని స్పష్టమవుతోంది. తెలంగాణ ఫలితాలే ఉదాహరణ! దీనికి కొందరు గత డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికలను ఉదాహరణగా చెప్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందగా, ఒకేఒక్క ఎమ్మెల్యే సీటు నెగ్గిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అందులోని మూడు స్థానాలు టీఆర్ఎస్ చాలా బలంగా ఉంటుందని నమ్మే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో గెలుపొందింది. కనీసం కార్యకర్తలు కూడా లేని ఆదిలాబాద్ లాంటి చోట బీజేపీ గెలవడం చూస్తే మోదీ హవానే కారణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓటర్ల నాడి ఏంటనేది అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేరుగా మోదీపై ప్రభావం చూపకపోవడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రాల ఎన్నికలకు ప్రధానికి ప్రత్యక్ష సంబంధం లేదని ఓటర్లు భావిస్తున్నారు. -
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిం చనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా వెల్లడించారు. డిసెంబర్ 23న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. 2020 జనవరి 5వ తేదీతో ప్రస్తుత రాష్ట్ర శాసనసభ గడువు ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న రెండో దశ, డిసెంబర్ 12, 16, 20వ తేదీల్లో మిగిలిన మూడు దశల్లో పోలింగ్ జరుపుతారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో 2014లో మాదిరిగానే ఐదు దశలుగా ఎన్నికలు నిర్వహించనునట్టు సునీల్ అరోరా వెల్లడించారు. రఘుబర్ దాస్ సీఎంగా 2014, డిసెంబర్ 28న జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది. -
మోగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా
-
అభ్యర్ధి క్రిమినల్ అయినా సరే! మద్దతివ్వాలి
-
అభ్యర్ధి క్రిమినల్ అయినా సరే! మద్దతివ్వాలి..
రాంచీ : జార్ఖండ్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్ధి క్రిమినల్, దొంగ, దివ్యాంగుడైనా అతనికి అన్ని విధాలా మద్దతివ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి రఘువర్ దాస్లపై నమ్మకముంచి వారి నిర్ణయాలను గౌరవించాలి. బీజేపీ అవినీతి పార్టీ కాదు. డబ్బులు తీసుకుని టిక్కెట్ ఇచ్చే సంస్కృతి పార్టీలో లేదన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి’ అని పార్టీ శ్రేణులకు ఉద్భోదించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేత చిదంబరం లాంటి వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఇంకొద్ది రోజుల్లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఎన్నికలకు సంసిద్ధులను చేయడానికి నిర్వహించిన సమావేశంలో దూబే పైవిధంగా స్పందించారు. -
ఇది ట్రైలర్ మాత్రమే..
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా రావాల్సి ఉంది. అభివృద్ధితోపాటు టెర్రరిజాన్ని సమూలంగా అంతం చేయడం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికలకు ముందు ఏంచెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నాం. ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ. మాది అవినీతి వ్యతిరేక ప్రభుత్వం. చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్లారు (చిదంబరాన్ని ఉద్దేశించి).. – రాంచీ సభలో ప్రధాని మోదీ రాంచీ: బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, సినిమా రావాల్సి ఉందని రాంచీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నామనీ, ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ అన్నారు. జార్ఖండ్ కొత్త అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాంచీలో మాట్లాడారు. తమ ప్రభుత్వ 100 రోజుల పాలన ఒక మచ్చుతునక మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ప్రభుత్వమనీ, తాము చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్ళారనీ చిదంబరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూడు జాతీయ పథకాలను మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించారు. దేశంలోని గడపగడపకీ రక్షిత మంచి నీరు తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యత అనీ, అందుకే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చామనీ తెలిపారు. కశ్మీర్, లడక్‌ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామనీ, అందులో భాగంగానే కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేశామనీ స్పష్టం చేశారు. ఇవన్నీ ఎన్డీఏ–2 వంద రోజుల పాలనలో ఆవిష్కృతమైనవేనని ఆయన గుర్తుచేశారు. రాంచీలో నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతు పెన్షన్ స్కీంని మోదీ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థులకోసం 462 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు నూతన సెక్రటేరియట్ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ► ‘జాతీయ స్థాయి పథకాల ప్రారంభోత్సవానికి జార్ఖండ్ వేదికగా నిలుస్తోంది. గత సెప్టెంబర్ లో సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ కూడా జార్ఖండ్‌లోని ప్రభాత్ తారా గ్రౌండ్ నుంచే ప్రారంభించాం. ఈ రోజు మూడు జాతీయస్థాయి సంక్షేమ పథకాలను సైతం ఇక్కడి నుంచి ప్రారంభించాం’ అని అన్నారు. ► ‘ఆదివాసీలతో సహా ప్రజలందరికీ సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఆయుష్మాన్ భారత్, పీఎం జీవన్ జ్యోతి యోజన, జన్ ధన్ ఎకౌంట్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం ఆరంభించింది’ అని వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని పూర్తిగా నిర్మూలించడంలో జార్ఖండ్ ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. ► ‘మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని ఒక చోటికి సమీకరించి, దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడండి’ అంటూ మోదీ ప్రజలకు సూచించారు. కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రధాని ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 1,16,183 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ తెలిపారు. స్వరోజ్‌గార్ పెన్షన్ ఇక్కడ నుంచి ప్రారంభించిన మరో రెండు పథకాలు ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మన్ధన్ యోజన, స్వరోజ్‌గార్ పెన్షన్ స్కీంలు. వీటి ప్రకారం సైతం 60 ఏళ్ల తరువాత లబ్దిదారులకు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ కొత్త భవనం -
ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల): ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారింది. దాదాపు పదినెలలుగా జంటకోసం వారు పడరాని పాట్లు పడ్డారు. మసీదులో ముస్లిం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఓ గురువు.. సమీపంలోని యువతిని ప్రేమించాడు. వివాహం చేసుకునేందుకు మూడు రాష్ట్రాలు దాటించి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాపురం పెట్టాడు. ‘సెల్‌ఫోన్’ ఆధారంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సాజీద్ ఉత్తరప్రదేశ్‌లోని ఆస్రాత్ జిల్లా కేంద్రంలోని మసీదులో పిల్లలకు ఖురాన్ పఠించడం, ఉర్దూ బోధించడం చేస్తున్నాడు. ఈక్రమంలో మసీదు సమీపంలో ఉండే యువతి రబియాను ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో గతేడాది డిసెంబర్ 21న రబీయాను తీసుకుని సాజీద్ పరారయ్యాడు. తర్వాత రబీయాను వివాహం చేసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మజీద్‌కు వచ్చాడు. ఇక్కడ ఎనిమిది నెలలుగా ఖురాన్, ఉర్దూ బోధిస్తున్నాడు. తన కూతురును కిడ్నాప్ చేశాడని సాజీద్‌పై రబియా తండ్రి ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అస్రాత్‌శాకసాని పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శాంతిచరణ్ యాదవ్.. సాజీద్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పదినెలలుగా గాలిస్తున్నారు. గత ఫిబ్రవరి నుంచి సాజిద్ నామాపూర్‌లోనే ఇక్కడే ఉంటున్నాడు. సాజీద్, రబియా ఆచూకీ కోసం తీవ్రం గా శ్రమిస్తున్న అక్కడి పోలీసులకు రబియా వినియోగిస్తున్న సెల్‌ఫోన్ ఆధారంగా ఆచూకీ లభించింది. తల్లిదండ్రులతో రబియా ఫోన్లో మాట్లాడుతుండగా.. ఎస్సై శాంతిచరణ్‌యాదవ్ ట్రాప్ చేశారు. దీనిద్వారా రబియా, సాజీద్ తెలంగాణలోని నామాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ముస్తాబాద్ ఎస్సై రాజశేఖర్ సహకారంతో శుక్రవారం నామాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో రబియా, సాజీద్ ముస్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నారు. ఫోన్ ద్వారా ఆ సమాచారం తెలుసుకున్న ఎస్సైలు.. అక్కడికి చేరుకున్నారు. అక్కడే రబి యా, సాజీద్‌కు కౌన్సెలింగ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శాంతిచరణ్, రబియా తండ్రి ఆ జంటను తమ వెంట ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లారు. -
నలభైయేళ్లుగా నిర్మాణం, ఒక్క రోజులోనే..
రాంచీ : నలభై రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న సాగునీటి కాలువ, సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఇరవై నాలుగ్గంటల్లోనే కొట్టుకుపోయింది. దీనికి అధికారులు చెప్పిన కారణం ఏంటో తెలుసా? ఎలుకలు పెట్టిన బొరియలు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. వివరాలు.. నలభై రెండేళ్ల క్రితం ఉమ్మడి బిహార్‌లో హజారిబాగ్ జిల్లాలోని కోనార్ నదిపై ఈ కాలువ నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నిర్మాణ అంచనా వ్యయం రూ. 12 కోట్లు. కాలువ పూర్తయ్యేసరికి నాలుగు దశాబ్దాల సమయంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగి రూ. 2176 కోట్లకు చేరింది. ఎట్టకేలకు పూర్తైన కాలువను బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ బుధవారం ప్రారంభించి, అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు కూడా. అయితే గురువారం వచ్చిన వరదలకు కాలువ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. వరదల వల్ల 35 గ్రామాలతో పాటు పంటపొలాలు మునిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి 24 గంటల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ సంఘటనపై అధికారులను వివరణ అడగ్గా నివ్వెరపోయే సమాధానం వచ్చింది. కాలువ గట్లలో ఎలుకలు బొరియలు తవ్వడం వల్ల వరద నీరు లీకై కాలువ గట్టు కొట్టుకుపోయిందని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని వివరించారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
కూతురు ఫోన్లో అశ్లీల వీడియో.. తండ్రిపై లైంగిక కేసు
రాంచీ : ‘తప్పుడు పని’ చేసినందుకు మందలించిన తండ్రిపై లైంగిక కేసు పెట్టింది ఓ కూతురు. తన స్వేచ్ఛకు అడ్డువస్తున్నాడని, తనను బయటకు వెళ్లనివ్వడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటగా మానసికంగా హింసిస్తున్నాడని చెప్పిన యువతి.. మరుసటి రోజు వచ్చి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీలో నివాసముంటున్న ఓ వ్యక్తి తన కూతురు ఫోన్ పాడవడంతో బాగు చేయించడానికి ఓ రిపేర్ షాప్‌కి తీసుకెళ్లాడు. అక్కడ ఫోన్ లాక్ తీసి చూడగా కుమార్తే అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో ఆగ్రహించిన తండ్రి.. ఇంటికెళ్లి కూతురిపై చేయి చేసుకున్నాడు. ఇకపై బయటకు వెళ్లేది లేదంటూ ఆంక్షలు విధించాడు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తల్లిని తోడుగా తీసుకెళ్లాలని షరతులు విధించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న యువతి.. తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. అయితే తండ్రిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయమని పోలీసులు సూచించగా.. అందుకు ఆమె నిరాకరించి వెళ్లిపోయింది. మరుసటి రోజు మేనమామతో కలిసి వచ్చి తన తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ‘ యువతి ఫిర్యాదుపై అనుమానం ఉంది. మొదటగా మానసికంగా వేధిస్తున్నారని చెప్పిన యువతి.. మరుసటి రోజు వచ్చి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తండ్రితో కలిసి ఉండనని, మేనమామతో ఉంటానని చెప్పింది. ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టాం. యువతి ఆరోపణలు నిజమైతే తండ్రిపై చర్యలు తీసుకుంటాం’ అని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. -
‘జార్ఖండ్ మూక దాడి’ వ్యక్తి మృతి
సెరైకేలా–ఖర్సావన్(జార్ఖండ్): మోటార్ సైకిల్ దొంగతనం చేశాడన్న అనుమానంతో జార్ఖండ్‌లో జనసమూహం చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న యువకుడు మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తబ్రేజ్ అన్సారీ (24) నాలుగు రోజుల తర్వాత మృతి చెందాడని పోలీసులు తెలిపారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ ఆస్పత్రిలో ఈనెల 22న తబ్రేజ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారని, అతని మృతిపై దర్యాప్తుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ‘ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేశాం’అని ఎస్పీ కార్తీక్ పేర్కొన్నారు. తబ్రేజ్‌ను జై శ్రీరామ్ అని మతపరమైన నినాదాన్ని ఇవ్వమనడంపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పప్పు మండల్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి తబ్రేజ్ భార్య షాయిస్తా పర్వీన్ పలువురి పేర్లతో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. గత మంగళవారం జంషెడ్పూర్ నుంచి ఇక్కడి గ్రామానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వస్తున్న తబ్రేజ్ అన్సారీ అనే ముస్లిం యువకుడిని సెరైకేలా–ఖర్సావన్ జిల్లా ధట్కిడీ గ్రామస్తులు మోటార్ సైకిల్ దొంగతనం చేశారంటూ అడ్డుకున్నారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరు తప్పించుకోగా, తబ్రేజ్ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. అనంతరం తబ్రేజ్‌ను స్తంభానికి కట్టేసి కర్రలతో ఆ రాత్రంతా కొట్టారు. అలాగే జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలివ్వాలని బలవంతం చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని బుధవారం గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు తబ్రేజ్‌పై దొంగతనం అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది. -
గుడిలో మద్యం వద్దన్నందుకు పూజారికి కత్తిపోట్లు
రాంచీ : ఆలయంలో మద్యం సేవించరాదని వారించినందుకు 55 ఏళ్ల పూజారి రాం సుందర్ భుయాను కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన జార్ఖండ్‌లో వెలుగుచూసింది. విష్ణుపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని ఆలయంలో కొందరు వ్యక్తులు మద్యం, మాంసాహారం తీసుకోవడాన్ని పూజారి రాం సుందర్ అడ్డుకున్నారు. పూజారిపై ఆగ్రహించిన నిందితులు ఆయనపై కత్తితో దాడిచేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన పూజారిని చెట్ల పొదల్లో పడవేశారు. ప్రాణాపాయ స్థితిలో పూజారిని గుర్తించిన స్దానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కాగా తనపై అదే గ్రామానికి చెందిన జితు భుయా దాడి చేశాడని రాం సుందర్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బాధితుడి స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జార్ఖండ్‌లో మావోల పంజా
సిరాయికెలా–ఖర్సవాన్: జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులను కాల్చి చంపారు. శుక్రవారం జార్ఖండ్‌లోని తిరుల్దిహ్ పోలీస్ స్టేషన్ పరిధి (జార్ఖండ్–బెంగాల్ సరిహద్దు)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అవినాశ్‡ తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మావోయిస్టులు పోలీసు అధికారులను చంపారని అడిషనల్ డీజీపీ మురారి లాల్ మీనా తెలిపారు. అమరుల కుటుంబాలకు రాష్ట్రమంతా అండగా ఉంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తడోకి ఠాణా పరిధిలోని ముర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ముర్నార్ అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్ బలగాలపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారని డీజీపీ గిర్దార్ తెలిపారు. -
‘బెంగాల్‌ను పాక్‌లో కలిపేందుకు దీదీ ప్రయత్నం’
కోల్కత్తా: ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా మమతపై జార్ఖండ్ సీఎం రఘువర దాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌ను పాకిస్తాన్లో విలీనం చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే జై శ్రీరాం అనే వారందరిని అరెస్ట్ చేసి రాష్ట్రంలో నిర్బంధం విధిస్తున్నారని విమర్శించారు. జైశ్రీ రాం అంటే తప్పేంటని.. మనం భారతదేశంలో కాదా నివసించేదని దాస్ ప్రశ్నించారు. ఆమె వింత ప్రవర్తనతో ప్రజలు విసిగిపోయారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మోదీ నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలంతా విశ్వసిస్తున్నారని.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమన్నారు. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు జై శ్రీరాం నినాదాలతో కూడిన పది లక్షల పోస్టు కార్డులను పంపాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మమతా బెనర్జీ కాన్వాయ్ ఎదుట బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించడం పట్ల దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యంతో జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. కాగా అజయ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఆమోదించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్ధానాల్లో బీజేపీ, ఏజేఎస్‌యూ కూటమి 12 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్-జేఎంఎం కూటమి చెరో స్ధానానికి పరిమితమయ్యాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో పలు రాష్ట్రాల చీఫ్‌లు రాజీనామాలతో ముందుకు రాగా దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓటమి షాక్ నుంచి తేరుకున్న తర్వాత పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. -
ఝార్ఖండ్ ఆదివాసిల్లో జేఎంఎం పట్టు!
మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఝార్ఖండ్‌లో ఆదివాసీల జనాభా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉంది. ఝార్ఖండ్‌లో మొత్తం 14 పార్లమెంటు స్థానాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మెల్లిమెల్లిగా బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, ఝార్ఖండ్ వికాస్ మోర్చా, ఆర్జేడీ, జనతాదళ్(యూ) ఝార్ఖండ్ ఏర్పడినప్పటినుంచీ ప్రజలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ఈ ప్రాంతంలో భారతీయ జనతాపార్టీ బలం అనూహ్యంగా పుంజుకుంది. 2004లో 14 లోక్‌సభ స్థానాలకు గాను యూపీఏ (కాంగ్రెస్, జెఎంఎం, ఆర్జేడీ, సీపీఐ)కి 13 సీట్లు వస్తే, బీజేపీ ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. 2009లో బీజేపీ 8 స్థానాల్లో విజయఢంకా మోగిస్తే, కాంగ్రెస్ 1, జేవీఎం 1, ఇండిపెండెంట్లు 2 గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 12 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 2 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఝార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్ జెవీఎం), ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నాయి. గత ప్రాభవాన్ని పునర్నిర్మించుకోవాలని కాంగ్రెస్ కూటమి భావిస్తోంటే, తమ బలాన్ని సుస్థిరం చేసుకుంటామన్న ఆశాభావంతో బీజేపీ ఉంది. జనాభాలో 25 శాతంగా ఉన్న ఆదివాసీలు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఆదివాసీలు ఆధారపడి బతుకుతోన్న అడవినుంచి అత్యధిక మంది ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు తెచ్చిన చట్టాలు వారి ఆగ్రహానికి కారణమయ్యాయి. అలాగే రైతాంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శ పాలకులను వెంటాడుతోంది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ ముగిసింది చివరి దశలో జరిగే రాజ్ మహల్, దుమ్కా, గొడ్డా నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా? లేక ఈసారి కూడా బీజేపీకే పాలనావకాశం దక్కుతుందా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ్‌మహల్ ... ఎస్టీ రిజర్వుడు సీటైన రాజ్‌మహల్ లోక్‌సభ స్థానాన్ని 2014లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై జేఎంఎం అభ్యర్థి విజయ్‌కుమార్ హన్స్‌డాక్ విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్, జేఎంఎం కూటమి తరఫున సీపీఎం అభ్యర్థి గోపీన్ సోరెన్ పోటీ చేస్తున్నారు. గోపీన్ సోరెన్ పై గతంలో పోటీ చేసి ఓడిపోయిన హేమ్లాల్ ముర్ముని బీజేపీ తిరిగి పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ, జేఎంఎంలు గెలుపుగుర్రమెక్కడానికి హోరాహోరీ పోరాడుతున్నాయి. 2014 గణాంకాలను బట్టి ఈ పార్లమెంటు స్థానంలో మొత్తం 13,53,467 మంది ఓటర్లున్నారు. ఈ స్థానంలో 2009లో బీజేపీ తరఫున దేవిధన్ బెస్రా విజయాన్ని సాధించారు. దుమ్కా ... ఎస్టీ రిజర్వుడు స్థానమైన దుమ్కా ఝార్ఖండ్ ముక్తి మోర్చాకి బలమైన పునాదులున్న ప్రాంతం. 2014 ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేసేందుకు జెఎంఎం శిబూ సోరెన్‌ని బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థి సునీల్‌సోరెన్‌ఫై 3,35, 815 ఓట్లతో శిబూసోరెన్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్‌కి 2,96,785 ఓట్లు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ వరసగా ఈ స్థానాన్ని జేఎంఎం కైవసం చేసుకుంటూ వచ్చింది. 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ఈ స్థానంలో జేఎంఎం గెలుపొందింది. గొడ్డా.... ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న గొడ్డా పార్లమెంటు స్థానంలో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. 2014లో గొడ్డా స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఫరూక్ అన్సారీపై బీజేపీ అభ్యర్థి నిశీకాంత్‌దూబే గత ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో నిశీకాంత్ దూబే 36.25 శాతం ఓట్లతో(3,80,500) ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫరూక్ అన్సారీకి కూడా 3,19,818 (30.47శాతం) ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ నిశీకాంత్ దూబేని బరిలోకి దింపింది. జార్ఖండ్ వికాస్ మోర్చా అభ్యర్థి ప్రదీప్ యాదవ్ ఈ స్థానంలో కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. -
ఇది పోలింగ్ బూతే
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్‌లోని హజారీబాగ్. హజారీబాగ్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు. కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని ఆదివాసీలు రైలు బూత్‌ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్‌నంబర్ 140 జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం పరిధిలోని రామ్‌గఢ్ బ్లాక్లోనిది. -
అతిరథుల పోరుగడ్డ
ఐదో దశలో మే 6న పోలింగ్ జరిగే బిహార్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలు, జార్ఖండ్‌లోని నాలుగు సీట్లకు రెండు రాజకీయ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బిహార్‌లోని మొత్తం 40 సీట్లకు ఏడు దశల్లో, జార్ఖండ్‌లోని 14 స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్‌లోని మిథిలా, చంపారణ్ ప్రాంతాలకు చెందిన సీతామఢీ, మధుబనీ, ముజఫ్ఫర్‌పూర్, సారణ్, హాజీపూర్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ, ఆర్జేడీ, కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్పార్టీ(వీఐపీ), హిందుస్తాన్ ఆవామ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) భాగస్వామ్యపక్షాలుగా ఉన్న మహాకూటమి మధ్య ప్రత్యక్ష పోరుకు రంగం సిద్ధమైంది. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ వియ్యంకుడు చంద్రికా రాయ్ లాలూ పాత స్థానం సారణ్ నుంచి పోటీ చేస్తుండగా, లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జీపీ) నేత రామ్‌విలాస్ పాశ్వాన్ తమ్ముడు పశుపతి కుమార్ పారస్ అన్న నియోజకవర్గం హాజీపూర్ నుంచి పోటీకి దిగారు. ఆర్జేడీ కూటమిలోని వీఐపీ ముజఫ్ఫర్‌పూర్, మధుబని నుంచి పోటీచేస్తోంది. బిహార్ బిహార్ మ్యాప్ లాలూ వియ్యంకుడితో రాజీవ్ రూడీ పోటీ లాలూ ‘కుటుంబ నియోజకవర్గం’ సారణ్‌లో ప్రతిష్టాకరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ సభ్యుడు రాజీవ్‌ప్రతాప్ రూడీతో లాలూ వియ్యంకుడు(పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ మామ) చంద్రికా రాయ్ ఆర్జేడీ తరఫున తలపడుతున్నారు. 2014లో లాలూ భార్య, మాజీ సీఎం రబ్రీదేవిని రూడీ 40 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ అనే స్వతంత్ర అభ్యర్థి వేల సంఖ్యలో ఓట్లు చీల్చుకున్నారు. ఆయన వల్లే రబ్రీ ఓడిపోయారని ఆర్జేడీ భావించింది. ఈ స్వతంత్ర అభ్యర్థి మళ్లీ ఈసారి కూడా పోటీలో ఉన్నారు. 2004కు ముందు ఛప్రా పేరుతో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి లాలూ మూడుసార్లు, రాజీవ్ రూడీ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చంద్రికా రాయ్, రాజీవ్ ప్రతాప్ రూడీ 2009లో సారణ్‌గా అవతరించాక లాలూ ప్రసాద్ విజయం సాధించారు. కిందటి ఎన్నికల్లో ఆయన భార్య తొలిసారి లోక్‌సభకు ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తన మామ చంద్రికా రాయ్‌కి ఆర్జేడీ టికెట్ ఇవ్వడాన్ని లాలూ కొడుకు తేజ్‌ప్రతాప్ మొదట తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన రాజీవ్ రూడీ బీజేపీ తరఫున మరోసారి రంగంలోకి దిగి ఆర్జేడీ అభ్యర్థి చంద్రికా రాయ్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో మాదిరిగా మోదీ గాలి లేకున్నా ఆయనకు ఈసారి జేడీయూ మద్దతు ఇస్తున్నందున మెరుగైన స్థితిలో ఉన్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అయిన లాలూ వియ్యంకుడి గెలుపునకు మహా కూటమి గట్టి ప్రయత్నమే చేస్తోంది. సీతామఢీలో ఆర్జేడీతో జేడీయూ పోటీ పూర్వ మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూల మధ్య ప్రత్యక్ష పోరు సాగుతున్న స్థానం సీతామఢీ బీజేపీ–జేడీయూ కూటమి అభ్యర్థిగా మొదట ప్రకటించిన డా.వరుణ్‌కుమార్ పోటీకి విముఖత ప్రదర్శించడంతో రాష్ట్ర మంత్రి, బీజేపీ మాజీ నేత సునీల్ కుమార్ పింటూ జేడీయూ తరఫున పోటీకి దిగారు. ఆర్జేడీ అభ్యర్థిగా అర్జున్‌రాయ్ పోటీచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉన్న ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థి రాంకుమార్ శర్మ కుష్వాహా తన సమీప ఆర్జేడీ ప్రత్యర్థి సీతారాం యాదవ్‌ను లక్షా 47 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. అర్జున్ రాయ్, సునీల్ కుమార్ పింటూ అప్పుడు జేడీయూ అభ్యర్థిగా పోటీచేసిన అర్జున్‌రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఈసారి ఎన్డీయే నుంచి ఆర్ఎల్ఎస్పీ వైదొలిగి ఆర్జేడీ కూటమిలో చేరింది. అయితే, ఈ సీటును ఆ పార్టీకి కేటాయించలేదు. బీజేపీకి రాజీనామా చేసిన మంత్రి పింటూ బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. అయితే, సీతామఢీ ఆర్జేడీకి గతంలో కంచుకోట. 2004లో ఈ పార్టీ తరఫున సీతారాం యాదవ్, 2009లో అర్జున్‌రాయ్ విజయం సాధించారు. ఆర్జేడీ, జేడీయూ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. మధుబనిలో హుకుందేవ్ కుమారుడు ఆర్జేడీ కూటమి భాగస్వామ్యపక్షమైన వీఐపీకి కేటాయించిన స్థానం ఇది. గతంలో మధుబని నుంచి నాలుగుసార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ సభ్యుడు హుకుందేవ్ నారాయణ్ యాదవ్ ఈసారి పోటీచేయడం లేదు. బీజేపీ టికెట్ ఆయన కొడుకు అశోక్‌కుమార్ యాదవ్‌కు ఇచ్చారు. మాజీ సోషలిస్ట్ అయిన హుకుందేవ్ 1990ల చివర్లో బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున కూడా సీతామఢీ నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన కొడుకు అశోక్ లోక్‌సభకు పోటీచేయడం ఇదే మొదటిసారి. బద్రీకుమార్ పూర్బే, అశోక్‌కుమార్ యాదవ్ బాలీవుడ్ మాజీ సెట్ డిజైనర్, నిషాద్(మత్స్యకారులు) వర్గానికి ముకేష్ సహనీ స్థాపించిన వీఐపీ పార్టీకి మహా కూటమి ఈ సీటు కేటాయించింది. ఈ పార్టీ తరఫున బద్రీకుమార్ పూర్బే పోటీకి దిగారు. కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన హుకుందేవ్ తన సమీప ఆర్జేడీ అభ్యర్థి అబ్దుల్ బారీ సిద్దిఖీని 20 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఈసారి బీసీలు, ముస్లింల ఓట్లు భారీగా కూటమి అభ్యర్థి పూర్బేకు పడితే బీజేపీ గెలుపు కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్జేడీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎంఏఏ ఫాత్మీ మొదట బీఎస్పీ తరఫున నామినేషన్ వేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. 2004లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన కాంగ్రెస్, ముస్లిం ఓట్లు చీల్చుకుంటే వీఐపీ పార్టీ అభ్యర్థికి పడే ఓట్లు తగ్గే ప్రమాదముంది. జార్ఖండ్‌లో హోరాహోరీ జార్ఖండ్ మ్యాప్ ఐదో దశలో పోలింగ్ జరిగే జార్ఖండ్‌లోని నాలుగు సీట్లు–కోడర్మా, రాంచీ, ఖూంటీ(ఎస్టీ), హజారీబాగ్ సీట్లలో బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూటమిలో జేఎంఎం, జేవీఎం(ప్రగతిశీల్), ఆర్జేడీ ఉన్నాయి. రాజధాని రాంచీ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌కాంత్ సహాయ్(కాంగ్రెస్) పోటీ చేస్తుండగా, హజారీబాగ్ నుంచి కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా(బీజేపీ) మళ్లీ బరిలోకి దిగారు. కోడర్మా నియోజకవర్గం నుంచి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ(జేవీఎం–పీ) కాంగ్రెస్ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన ఖూంటీ స్థానం నుంచి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 2014 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూటమి మెజారిటీ సాధించింది. బీజేపీ నేత రఘువర్ దాస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉంది. రాంచీలో సహాయ్దే పైచేయి! 1989 నుంచీ ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి సుబోధ్‌కాంత్ సహాయ్, బీజేపీ సిట్టింగ్ సభ్యుడు రామ్‌తహల్ చౌధరీ ఇప్పటి వరకూ రాంచీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి చౌధరీ రాంచీ నుంచి ఐదుసార్లు బీజేపీ తరఫున విజయం సాధించారు. అయితే, ఈసారి ఆయనకు పార్టీ టికెట్ లభించపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచారు. వరుసగా రెండుసార్లు గెలిచిన సహాయ్ కిందటి ఎన్నికల్లో ఓడిపోయారు. 1989లో జనతాదళ్ తరఫున గెలిచిన సహాయ్ మళ్లీ కాంగ్రెస్ టికెట్ సంపాదించి పోటీలో ఉన్నారు. సుబోధ్ సహాయ్, సంజయ్ సేఠ్ బీజేపీ తరఫున ఖాదీ గ్రామోద్యోగ్ మాజీ చైర్మన్ సంజయ్ సేuŠ‡ పోటీచేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీకి దిగడం ఇదే తొలిసారి. బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ వర్గీయుడని, 85 ఏళ్లు దాటాయనే కారణాలతో తహల్కు టికెట్ నిరాకరించడం వల్ల ఆయన వర్గమైన కుర్మీ కులస్తుల ఓట్లు గతంలో మాదిరిగా బీజేపీకి పడవని చెబుతున్నారు. మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ నేత సహాయ్ గతంలో వీపీసింగ్, చంద్రశేఖర్, మన్మోహన్సింగ్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. రాంచీ నుంచి తనను నాలుగోసారి లోక్‌సభకు పంపితే నాలుగో ప్రధాని కేబినెట్లో మంత్రినవుతానని సహాయ్ ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీలో కీచులాటలు, కుల సమీకరణల్లో మార్పుల వల్ల సహాయ్‌కు అనుకూల వాతావరణం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. హజారీబాగ్‌లో జయంత్ సిన్హా వర్సెస్ గోపాల్ సాహూ గతంలో కేంద్ర మాజీ యశ్వంత్ సిన్హా మూడుసార్లు గెలిచిన హజారీబాగ్ నుంచి ఆయన కొడుకు, బీజేపీ సిట్టింగ్ సభ్యుడైన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా రెండోసారి పోటీచేస్తున్నారు. తండ్రి బీజేపీకి రాజీనామా చేసినా ఆయన మోదీ కేబినెట్లో కొనసాగుతున్నారు. జయంత్ సిన్హా, గోపాల్ సాహూ కాంగ్రెస్ తరఫున కొత్త అభ్యర్థి గోపాల్ సాహూ రంగంలోకి దిగారు. తండ్రికి బదులు తొలిసారి రాంచీ నుంచి పోటీచేసిన జయంత్ కిందటిసారి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సౌరభ్ నారాయణ్‌సింగ్‌ను భారీ ఆధిక్యంతో ఓడించారు. 1991, 2004లో సీపీఐ తరఫున విజయంసాధించిన భువనేశ్వర్ ప్రసాద్ మెహతా మళ్లీ సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2004లో ఆయన యశ్వంత్ సిన్హాను ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థికి జేఎంఎం, జేవీఎం(పీ) వంటి మిత్రపక్షాల మద్దతు ఉంది. తండ్రి యశ్వంత్ ఆశీస్సులున్నాయని చెబుతున్న జయంత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కోడర్మా పోటీలో బాబూలాల్ మరాండీ జార్ఖండ్‌లో మరో కీలక స్థానమైన కోడర్మాలో బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణాదేవి యాదవ్, కాంగ్రెస్–జేఎంఎం కూటమి అభ్యర్థి బాబూలాల్ మరాండీ(జేవీఎం–పీ) మధ్య గట్టి పోటీ జరుగుతోంది. రాష్ట్ర ఆర్జేడీ అధ్యక్షురాలిగా పనిచేసి ఎన్నికల ముందు పార్టీలో చేరిన అన్నపూర్ణాదేవి యాదవ్‌కు బీజేపీ టికెట్ లభించింది. బీజేపీ తరఫున జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన మరాండీ గతంలో బీజేపీలో ఉండగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జేఎంఎం నేత, మాజీ సీఎం శిబు సొరేన్‌ను ఓడించారు. బీజేపీ తరఫున 2014లో ఇక్కడ నుంచి గెలిచిన రవీంద్రరాయ్కు ఈసారి టికెట్ ఇవ్వకపోయినా అన్నపూర్ణ తరఫున ప్రచారం చేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఆయన తన సమీప సీపీఐ(ఎంఎల్–లిబరేషన్) ప్రత్యర్థి రాజ్‌కుమార్ యాదవ్‌ను దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో ఓడించారు. మళ్లీ రాజ్‌కుమార్ పోటీచేస్తున్నారు. బాబూలాల్ మరాండీ, అన్నపూర్ణాదేవి బిహార్ సమస్తీపూర్‌లో ఓటు వేసిన ఆనందంలో ఓ మహిళ సోమవారం లోక్‌సభ ఎన్నికల 4 విడత పోలింగ్ ముగిసింది. దేశంలోని 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మహిళలు, వృద్ధులు, ఆదివాసీలు, ఉద్యోగులు, వివిధ వర్గాల వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రాజాస్తాన్లోని బ్యావర్ ప్రాంతంలో వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసిన ఓ పెద్దాయన ఓటు వేసి సిరా చుక్కను చూపిస్తున్న పశ్చిమ బెంగాల్‌లోని ఇల్లంబజార్ ఆదివాసీ మహిళలు జమ్మూ శివారు ప్రాంతమైన కుల్గాం నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రవాసి కశ్మీరి పండిట్ మహిళ శ్రీనగర్‌లో ఓటు వెయ్యడానికి వచ్చిన వృద్ధుడికి సాయం చేస్తున్న భారత పారామిలిటరీ జవాను ముంబైలోని ఒక పోలింగ్ స్టేషన్లో క్యూలో నిలబడి ఓటర్ ఐడీ కార్డులు చూపిస్తున్న ఓటర్లు రాజస్తాన్ అజ్మేర్ శివార్లలో పోలింగ్ క్యూలో నిల్చున్న మహిళలు ఓటు వేశానంటూ ఇంకు వేసిన వేలు చూపిస్తున్న వృద్ధుడు. -
‘ఓటమి షాక్‌తో సాకులు వెతుకుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన విపక్షాలు ఈవీఎంల్లో లోపాలు అంటూ సాకులు వెతుకుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటమి అంగీకరించడం మినహా మరో మార్గం లేదని అన్నారు. మూడు దశల పోలింగ్ అనంతరం మాయాకూటమి పార్టీలు ఓటమిని గ్రహించి సాకులు వెతుకుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌లోని లోహర్ధాగాలో బుధవారం జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ సైనికుల మనోస్ధైర్యాన్ని దెబ్బతీసేలా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, కులాలకు అతీతంగా దేశ ప్రజలందరి బాగోగులను చూడటమే కాపలాదారుగా తన కర్తవ్యమని చెప్పుకొచ్చారు. ఇరాక్‌లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న 46 మంది నర్సులను విడిపించేందుకు కృషిచేశామని, ఆప్ఘనిస్తాన్‌లో కోల్‌కతాకు చెందిన జుదిత్ డిసౌజా అపహరణకు గురైతే ఆమెను కాపాడామని గుర్తుచేశారు. బీజేపీ హయాంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించగలిగామని, యువత ప్రధాన జీవన స్రవంతిలో కలిసేందుకు హింసను విడనాడుతున్నారని అన్నారు. -
జార్ఖండ్‌లో ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లోనూ రైతుబంధు పథకాన్ని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారుల బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సం గతి తెలిసిందే. కొన్ని జిల్లాల్లోనూ ఆ బృందం పథ కంపై అధ్యయనం చేసింది. తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్, రబీలకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఇచ్చారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి ఏడాదిలో రూ.10 వేలు ఇవ్వనున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలంగాణ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అంటే ఒక సీజన్‌కు ఎకరానికి రూ.2,500 చొప్పున ఇచ్చే అవకాశముంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ పథకం తీరు తెన్నులను పరిశీలించనుందని అధికారులు చెబుతున్నారు. జార్ఖండ్‌లోనూ మన సాఫ్ట్వేర్! జార్ఖండ్ ప్రభుత్వం అక్కడ రైతుబంధును అమలు చేస్తే తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ను తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు తెలంగాణ అధికారులను వారు కోరినట్లు తెలిసింది. రైతుబంధు పథకాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడంలో వ్యవసాయశాఖ భారీ కసరత్తే చేసింది. రైతుల వివరాలు, వారికి ఉన్న భూమి వివరాలను పక్కాగా రూపొందించింది. ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరిచింది. దీంతో పొరపాట్లు తలెత్తకుండా పథకం అమలు జరిగింది. ఈ నేపథ్యంలో మన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాలని జార్ఖండ్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఆ రాష్ట్ర అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం : కేటీఆర్ తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. ఒడిశా, జార్ఖండ్ తర్వాత తాజాగా పశ్చిమ బెంగాల్లోనూ రైతుబంధు, రైతుబీమా లను ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమత ప్రకటిం చారని, ఈ మేరకు ఆమె ప్రకటనను జోడిస్తూ కేటీఆర్ ట్విట్టర్లో సోమవారం పోస్టు చేశారు. -
33 కేసుల్లో 24 మంది అరెస్ట్
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): నగరంలో వివిధ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్ప డిన జార్ఖండ్ ముఠాతో కలిపి 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 33 కేసుల్లో వీరంతా నిందితులు. వీరి నుంచి 541 గ్రాముల బంగారం, 417 గ్రాముల వెండితో పాటు పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాం, ఆటోలు, మోటార్ బైక్‌లు, కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం విలువ రూ.35,11,800 ఉంటుంది. కమిషనరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఈ కేసుల వివరాలను వెల్లడించారు. బావ, బావమరిది అరెస్ట్ అల్లిపురం హరిజనవీధిలోని ఓ అద్దె ఇంట్లో తల్లితో పాటుగా కరాయ సురేష్ నివాసం ఉంటున్నాడు. ఇతను పెయింటర్. ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి రైల్వే న్యూ కాలనీ చెందిన స్వర్ణపూడి రోజా ఇంట్లో పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. నవంబర్ 16న అదే ఇంట్లో డ్రెసింగ్ రూంలో ఉన్న బ్యాగ్‌లోని 10.5 తులాల బంగారం దొంగలించాడు. ఆ బంగారాన్ని తన బావమరిది నెల్లిరాజుకు ఇచ్చాడు. అతను జ్ఞానాపురంలోని ఓ గది అద్దెకు తీసుకుని.. ఈ బంగారాన్ని దాచి పెట్టారు. ఈ సమాచారం అందుకున్న క్రైం సీఐ కృష్ణారావు.. ఎస్ఐ వెంకటరావు సిబ్బందితో సురేష్, నెల్లిరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 126 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జువైనల్ హోంకు ముగ్గురు తరలింపు గాజువాక పోలీస్‌స్టేషన్(క్రైం) పరిధిలో నేరం ఆపాదించబడిన బాలలు చెడు వ్యసనాలకు అలవాటు పడి గాజువాక, న్యూపోర్టు, అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిని క్రైం సీఐ పైడపనాయుడు తన సిబ్బందితో పట్టుకుని జువైనల్ హోంకు తరలించారు. గతంలో జువైనల్ హోంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీపావళి రోజున గాజువాకలోని అశోక్‌నగర్‌లో ఓ ఇంటి తాళం పగులకొట్టి.. బీరువాలో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి పట్టీలు దొంగలించారు. ఎస్ఐలు జి.తేజేశ్వరరావు, దామోదర్‌లు వీరిని పట్టుకుని జువైనల్ హోంకు తరలించారు. కానిస్టేబుల్ కుమారుడు అరెస్ట్ రూరల్ ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ కుమారుడు గొర్లె సంతోష్‌కుమార్‌ది జీకే వీధి మండలం, జేర్ల గ్రామం. డాబాగార్డెన్స్‌లోని ఒకేషనల్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదివే సమయంలో చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. స్నేహితుడు ములపర్తి వెంకటేష్‌తో కలసి ద్వారకాజోన్, ఎంవీపీ జోన్, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. సంతోష్‌కుమార్ మొత్తం 10 కేసుల్లో నేరాలు చేశాడు. 2014–15లో ఎంవీపీజోన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు చోట్ల ల్యాప్‌టాప్ దొంగతనాలు చేశాడు. అతనిపై ఎంవీపీజోన్లో 7 కేసులు, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ 2, ద్వారకా జోన్లో ఒక కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి10 గ్రాముల బంగారం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కేసులో 8 మంది అరెస్ట్ ఆరిలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కేసులో గొలగాని ఏసుకుమార్ ఫిర్యాదు మేరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చినముషిడివాడ, సుజాతనగర్‌కు చెందిన ఆర్.కన్నబాబు అనే రౌడీ షీటర్ ఉన్నాడు. ఏసుకుమార్, అడపా ప్రసాద్‌లు స్నేహితులు. ప్రసాద్.. నారాయణరావు వద్ద కార్లు అద్దెకు తీసుకున్నాడు. ఇందుకు రూ.13 లక్షలు బాకీ పడ్డాడు. ఆ మొత్తం ప్రసాద్ ఎంతకీ ఇవ్వకపోవడంతో నారాయణరావు రౌడీషీటర్లు ఆకుల సురేష్, ఆర్.కన్నబాబును ఆశ్రయించాడు. రూ.13 లక్షలు రికవరీ చేస్తే రూ.3 లక్షలు ఇస్తానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 20 తేదీన రాత్రి అడపా ప్రసాద్‌ను రెండు కార్లలో 10 మంది కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో కన్నబాబు మద్యం మత్తులో పడిపోవడంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో జీపీఎస్ ద్వారా ఆ కార్లు ఆనందపురం వైపు వెళ్తున్నాయని గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తమై ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో నిందితులు ఎటూ వెళ్లలేక పట్టుబడ్డారు. ఈ క్రమంలో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్, నాలుగు సెల్ ఫోన్లు, 10 కిలోల గంజాయి, రూ. 38 వేలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలు ఇలా.. ♦ ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కేసులో నక్లెస్, నల్ల పూసలు, కడియాలు, చెవిదుద్దులు, రింగ్‌తో కలిపి 123 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ♦ ద్వారకా జోన్, ఎంవీపీ జోన్, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పది కేసులకు సంబంధించి 10 గ్రాముల బంగారం, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. ♦ గాజువాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 47 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ♦ కంచరపాలెం, దువ్వాడ, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో 3 కేసులో 8 మందిని అరెస్ట్ చేసి 186 గ్రాములు బంగారం, 300 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ♦ గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో రెం డు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి, 41 గ్రాముల బంగారం, పోలీస్ కానిస్టేబుల్ యూని ఫారం, ఐడీకార్డు స్వాధీనం చేసుకున్నారు. ♦ దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసుల్లో ఒకరిని అరెస్ట్ చేసి 134 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో 15 కేసుల్లో 7 గురిని అరెస్ట్ చేసి 10 మోటార్ బైక్‌లు, 5 ఆటోలు స్వాధీనం ♦ చేసుకున్నారు. మొత్తం 33 కేసుల్లో 24 మందిని అరెస్ట్ చేసి, రూ.35,11,800 సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ చోరీలు కంచరపాలెం, దువ్వాడ, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు జార్ఖండ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఒకే కుటుంబ సభ్యులు. ఆనంద్ సోబార్, భార్య జ్యోతి సోబార్, వీరి పెద్ద కుమారుడు భార్య రూభి, ఆమె కుమార్తె సరిత, రెండో కుమారుడు భిఖాస్ సోబార్, భార్య కిరణ్, మూడో కుమారుడు సరోజ్ సోబార్ భార్య నేహాలు పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ సమాచారంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వేలి ముద్రల ద్వారా మిగతా వారిని అరెస్ట్ చేశారు. వీరంతా ప్లాస్టిక్ సామాన్లు, బెలూన్లు, గాజులు అమ్ముతూ.. తలుపులు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. అనంతరం రిక్కీ నిర్వహించి చోరీలు చేస్తారు. వీరంతా జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉండి నేరాలకు పాల్పడ్డారు. వీరి వద్ద నుంచి 186 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5.70 లక్షలు. నిందితులను వెస్ట్ సబ్ డివిజన్ క్రైం సీఐ డి.నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆర్.హెచ్.ఎన్.వి.కుమార్, సిబ్బంది అరెస్ట్ చేశారు. -
‘కిస్ ఫెస్టివల్ మా ఆచారం’
రాంచీ: ముద్దు ద్వారా ప్రేమను వ్యక్తపరచడం తమ ఆచారమని జార్ఖండ్‌లోని గిరిజనులు అంటున్నారు. ప్రతి ఏడాది చివరి మాసం (డిసెంబర్)లో గ్రామస్తులందరూ తమ సహచరులతో కలిసి కిస్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. పాకూర్ జిల్లాలోని సీద్దో-కన్హు గ్రామస్తులు ఎంతో కాలంగా ఈవింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం)కు చెందిన స్థానిక ఎమ్మెల్యే సీయో మారండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ముద్దు ద్వారా ప్రేమను వ్యక్తం పరచడం గిరిజనుల ఆచారమని ఆయన అంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం కిస్ ఫెస్టివల్ నిర్వహణకు అధికార బీజేపీ అనుమతులను నిరాకరించింది. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవడం భారతీయ గిరిజన సంస్కృతికి కాదని, అది సమాజానికి చెడు సందేశాన్ని ఇస్తోందని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ ఏడాది కిస్ ఫెస్టివల్ నిర్వహించేది లేదని స్థానిక జిల్లా ఎస్డీఓ జితేంద్ర కుమార్ అదేశాలు జారీచేశారు. గత ఏడాది 18 జంటలు పబ్లిక్‌గా ముద్దుపోటీలో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కిస్ ఫెస్టివల్‌పై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ముద్దుల పోటీలు గిరిజనుల ఆచారంలో భాగమని, వారు స్వచ్ఛంగా ప్రేమను వ్యక్త పరుచుకోవడం కోసమే ఈ పోటీలో పాల్గొంటారని అన్నారు. -
అడ్డంగా గీకేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ‘కార్డు క్రైమే’ అత్యధికంగా ఉంటోంది. ఈ ఆర్థిక నేరం బారినపడుతున్న బాధితులు నిలువునా మునుగుతున్నారు. సైబర్ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. మొదటి వాటి బాధితులకు మాత్రమే ఆర్థిక నష్టం ఉంటుంది. ఈ కేసుల్లో అపరచితులే ఎక్కువగా నిందితులుగా ఉంటారు. రెండో తరహావి వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్ఫోన్లను వినియోగించి ఈ తరహా నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులే ఉంటున్నారు. కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం ఈ తరహా కేసుల్లో అరెస్టయ్యారు. సైబర్ నేరాల్లో ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రా ష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో స్థిరపడిననైజీరియన్లేకీలకంగా దందా నడిపిస్తున్నారు. ‘ఓటీపీ క్రైమ్’ అంటే జార్ఖండే... బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... డెబిడ్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి... అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పని చేసిన వచ్చిన జమ్‌తార యువత తామే సొంతంగా ‘కాల్ సెంటర్లను’ ఏర్పాటు చేసుకుని ఈ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వాటి కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా ఈ సైబర్ నేరగాళ్లకు చేరుతున్నట్లు సమాచారం. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెబుతుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న త రవాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడంతో టోకరా వేస్తున్నారు. క్రైమ్‌కో సిమ్.. ఈ జమ్‌తార నేరగాళ్లు ఒక్కో నేరానికి ప్రత్యేకంగా ఒక్కో సిమ్‌కార్డు, సెల్‌ఫోన్ వాడుతున్నారు. ‘పని’ పూర్తి కాగానే వాటిని ధ్వంసం చేస్తూ కేసుల దర్యాప్తులో పోలీసులకు ముప్పతిప్పలు పెడుతున్నారు. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకునే జమ్‌తార యువకులు వీటిని వినియోగించడానికి బేసిక్ మోడల్, తక్కువ ఖరీదున్న సెల్ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటాలోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్‌కార్డులను వినియోగిస్తున్న వీరు ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలిగి తేలిగ్గా బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు ధ్వంసం చేస్తున్నారు. బ్యాంకులు ఫోన్లు చేయవు ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసులను కొలిక్కి తీసుకురావడం, రికవరీలు చేయడం అంత కష్టం. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చు. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఓ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు. సైబర్ నేరాలను కొలిక్కి తీసుకురావడానికి, నేరగాళ్లను కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి.– సైబర్ క్రైమ్ పోలీసులు -
ఆరోగ్య బీమా నేడు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోని 10.74 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)ను ప్రధాని మోదీ నేడు జార్ఖండ్‌లో ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లోని 2.33 కోట్ల కుటుంబాలు వెరసి దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. తొలుత ఈ పథకానికి ఆయుష్మాన్ భారత్–జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్(ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం)గా నామకరణం చేసినప్పటికీ, ఆ తర్వాత పీఎంజేఏవైగా పేరు మార్చారు. ఈ పథకానికి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకరించాయనీ, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు పీఎంజేఏవై అమలుకు ముందుకు రాలేదన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు గుర్తింపు పత్రంగా ఆధార్ లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. ఈ పథకంలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు mera.pmjay.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చనీ, లేదంటే టోల్‌ఫ్రీ నంబర్ 14555కు కాల్ చేయవచ్చని వెల్లడించారు. -
‘మోదీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లు తాగు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే కాళ్లను కడిగి ఆ నీటిని పవన్ అనే కార్యకర్త తాగిన విషయం తెలిసిందే. అ వీడియోను దుబే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంపీ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లని కడిగి.. ఆ మురికి నీళ్లను నువ్వు తాగు. దాని ద్వారా నువ్వు కూడా మోదీపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయ్యవచ్చు’’ అని ట్వీట్లో చేశారు. జార్ఖండ్‌లోని గొడ్డా నియోజకర్గంలో ఆదివారం ఓ కార్యక్రమంలో నిశికాంత్ దుబే పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్త పవన్ ఓ ప్లేట్లో ఎంపీ కాళ్లు కడిగి ఆ నీటిని తాగాడు. తనపై ఉన్న ప్రేమను పవన్ ఆ విధంగా వ్యక్తపరిచాడని దుబే సమర్ధించుకున్నాడు. ప్రజా ప్రతినిధివై ఉండి కార్యకర్తతో కాళ్లు కడిగించుకుంటావా అంటూ అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. Supporter of Nishikant Dubey washes his feet and then drinks the dirty water Dubey says it is an expression of the supporter’s love for him Will Dubeyji wash Modiji’s feet and drink the dirty water ? If not , does it mean he does not love Modi — Kapil Sibal (@KapilSibal) September 17, 2018 ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీటినే తాగి.. -
బీజేపీ ఎంపీకి పాదపూజ
రాంచీ : జార్ఖండ్‌కు చెందిన గొడ్డా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు పార్టీ కార్యకర్త ఓ కార్యక్రమంలో పాదపూజ చేయడం వివాదాస్పదమైంది. వేలాదిమంది చూస్తుండగా పవన్ సింగ్ అనే కార్యకర్త ఎంపీ దూబే కాళ్లు కడిగి, ఆ నీటిని పవిత్ర జలంగా భావిస్తూ తాగడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటనను సదరు ఎంపీ ఘనకార్యంలా తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వైఖరిని ఎంపీ సమర్ధించుకున్నారు. దీనికి రాజకీయ రంగు ఎందుకు పులుముతారని ప్రశ్నించారు. అతిధుల పాదాలను కడగటంలో తప్పేముందని అంటూ మహాభారతంలోని కథలను వినిపించారు. చవకబారు ఆలోచనలు చేయడం తగదని విమర్శకులకు చురకలు అంటించారు. కాళ్లు కడిగిన నీటిని తాగడంలోనూ తప్పులేదని ఇది చరణామృతమని వ్యాఖ్యానించారు. -
30న సీబీఐ కోర్టులో లొంగిపోండి
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్‌ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 30వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లాలూను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడం తెల్సిందే. జైలులో లాలూ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్సకోసం బెయిలివ్వాలంటూ హైకోర్టును కోరారు. దీంతో మే 11న ఆయనకు 6 వారాల తాత్కాలిక బెయిలిచ్చింది. తర్వాత ఆ బెయిల్‌ను పొడిగించింది. తాజాగా మరో 3 నెలలపాటు బెయిల్‌ను పొడిగించాలంటూ లాలూ కోరారు. అందుకు హైకోర్టు జడ్జి నిరాకరించారు. అవసరమైనప్పుడు వైద్యం అందించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు, ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవిలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. -
స్వామి అగ్నివేష్‌పై సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్(78)పై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. పాపులారిటీ కోసమే అగ్నివేష్.. తనపై తానే దాడి చేయించుకున్నారని జార్ఖండ్ మంత్రి సీపీ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘దాడికి స్పాన్సర్ ఆయనే. పేరు కోసమే స్వయం ప్రేరేపిత దాడి చేయించున్నారు. ఆయన ఓ మోసగాడు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు. కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మద్దతిస్తుంటారు. అలాంటి వ్యక్తిని పట్టించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు’ అని తెలిపారు. ‘ఆయన ట్రాక్ రికార్డు ఓసారి పరిశీలించండి. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరి ఆయనకు కొత్తేం కాదు. బహుశా అది మనసులో పెట్టుకునే ఎవరైనా ఆ పని చేసి ఉండొచ్చు’ అని మరో బీజేపీ నేత చెబుతున్నారు. (బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకిలా...?) అయితే సీపీ సింగ్ 'వింత భాష్యం'పై ప్రతిపక్షాలు, అగ్నివేష్ మద్ధతుదారులు మండిపడుతున్నారు. జార్ఖండ్‌లోని పకూర్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి అగ్నివేశ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన బయటకు వస్తుండగా.. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ అల్లరిమూక అగ్నివేష్‌పై పిడిగుద్దులు గుప్పించింది. తనను హత్య చేసేందుకే ప్రణాళిక ప్రకారం ఈ దాడి జరిగిందని అగ్నివేష్ చెబుతున్నారు. ఈ ఘటనపై రాంచీ హైకోర్టు రిటైర్జ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎం కార్యకర్తలు తనపై దాడి చేసినట్టు రాంచీ పోలీస్ స్టేషన్లో.. ఈ స్వయం ప్రకటిత ఆధ్యాత్మికవేత్త స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీసహా పలువురు అగ్నివేష్‌కు సంఘీభావం తెలిపారు. మరోవైపు ఘటన అనంతరం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. -
అగ్నివేష్ పై దాడి చేసింది ఎవరోకాదు...
-
లూటీ సొమ్మును రాబట్టారు..
సాక్షి, రాంచీ : పలము జిల్లాలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో సిబ్బందిని బెదిరించి చోరీకి పాల్పడిన దుండగుల నుంచి జార్ఖండ్ పోలీసులు చోరీ సొత్తును రాబట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలోని ఓ ఇంటిపై దాడి చేసిన జార్ఖండ్ పోలీసులు బ్యాంకులో లూటీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15న పలము జిల్లాలోని ఓ ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వెళుతుండగా దుండగులు దాడి చేసి రూ 54 లక్షలు దోచుకెళ్లారు. జల్పాయిగురి పోలీసుల సహకారంతో ఫతపుకూర్ ప్రాంతంలోని ఓ గృహంపై జార్ఖండ్ పోలీసులు దాడి చేసి రూ 35 లక్షలను రాబట్టారు. పోలీసులు దాడి చేసే ముందు గృహంలో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. -
దారుణాతి దారుణం.. గ్యాంగ్ రేప్
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు చోచాంగ్ గ్రామానికి వచ్చిన ఓ ఎన్జీఓ బృందానికి చెందిన ఐదుగురు మహిళలపై దుండగులు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. వలసలు, మానవ అక్రమ రవాణాలపై అవగాహన కల్పించేందుకు 11 మంది సభ్యులతో కూడిన ఎన్జీఓ బృందం గ్రామానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దుండగులు బృందంలోని పురుషులను చితకబాది ఐదుగురు మహిళలను సమీప అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి తుపాకీ గురిపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నిందితులను గుర్తించిన పోలీసులు ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని డీఐజీ అమోల్ వీ హోంకర్ తెలిపారు. లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఘటనపై అధికారులకు తెలియపరచలేదని, తమకు అందిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. -
మూడు రోజలుగా ఆహారం లేక..
సాక్షి, రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజులుగా ఆహారం లేక 58 సంవత్సరాల మహిళ మరణించిన ఘటన గిరిధ్ జిల్లా దుమ్రీ బ్లాక్‌లోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. మంగరగాడి గ్రామానికి చెందిన సావిత్రి దేవి అనే మహిళ శనివారం ఆకలిచావుకు గురైందని, ఆమె చిన్న కుమారుడు ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాతే ఘటనపై సమాచారం అందించారని అధికారులు తెలిపారు. బాధిత మహిళ కుటుంబానికి రేషన్ కార్డు లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. సావిత్రి దేవి మృతిపై విచారణ చేపట్టారు. ఆదివారం సాయంత్రం తాము బాధితురాలి ఇంటిని సందర్శించామని, ఈ ఘటనపై అధికార యంత్రాంగం సకాలంలో తమకు సమాచారం అందించలేదని ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్ రాహుల్ దేవ్ తెలిపారు. ఆమె ఇంటిలో కొద్దిరోజులుగా ఆహారం లేదని, ఆ కుటుంబానికి రేషన్ కార్డు కూడా లేదని వెల్లడైందన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా అనే దానిపై విచారిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు ఎందుకు మంజూరు కాలేదో ఆరా తీస్తామన్నారు. బాధిత మహిళ సహా కుటుంబ సభ్యులెవరూ ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎందుకు లబ్ధి పొందలేదో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. సావిత్రి దేవి పెద్ద కోడలు రెండు నెలల కిందట తన రేషన్ కార్డు దరఖాస్తు వెరిఫికేషన్ కోసం తమ వద్దకు వచ్చిందని, మరి దాన్ని బ్లాక్ ఆఫీస్‌లో అందచేశారో లేదో తనకు తెలియదని గ్రామ సర్పంచ్ రామ్ ప్రసాద్ మహతో పేర్కొన్నారు. ఎనిమిది రోజుల కిందట సావిత్రి దేవి కోడలు తమ ఇంట్లో ఆహార ధాన్యాలు లేవని చెప్పడంతో తాము సర్ధుబాటు చేశామని స్వయం సహాయక బృంద సభ్యురాలు సునీతా తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మరికొంత ఆహార ధాన్యాలు ఇవ్వాలని భావిస్తుండగా ఈ లోగానే సావిత్రిదేవి మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు తాము సమకూర్చిన ఆహార ధాన్యాలు సరిపోలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు సావిత్రి మృతిపై జార్ఖండ్ ఆహార, పౌరసరఫరాల మంత్రి సరయూ రాయ్ సవివర నివేదిక సమర్పించాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. -
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు
రాంచీ: ఉత్తర దేశాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పలు చోట్ల పిడుగులు పడి 33 మంది మృతి చెందారు. జార్ఖండ్ రాష్ట్రంలో 17 మంది మృతిచెందారు. మరో 28 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో గత రాత్రి పిడుగులు పడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. కాన్పూర్‌లో ఇద్దరు, రాయ్‌బరేలీలో మరో ఇద్దరు కూడా పిడుగుపాటుకు మృతిచెందారు. నేడు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా సోమవారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ తెలిపింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయని స్కైమెట్ పేర్కొనగా మే 29న రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. అయితే నేడు నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. -
రేప్ కేసు.. గుంజీలు తియ్యమంటే తగలబెట్టేశాడు
రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఓ యువతి(18)కి నిప్పటించిన ఘటన కలకలం రేపింది. పంచాయితీ పెద్దల తీర్పును జీర్ణించుకోలేని నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఛాత్రా జిల్లా రాజకెందువా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తల్లిదండ్రులు బంధువుల వివాహానికి వెళ్లగా యువతి(18) ఇంట్లో యువతి ఒంటరిగా ఉంది. అది గమనించిన నలుగురు యువకులు గురువారం రాత్రి ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. మరుసటి ఉదయం విషయం తెలిసిన యువతి తండ్రి పంచాయితీలో ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడికి 30 వేల రూపాయల జరిమానా.. వంద గుంజీలు తీయాలని పంచాయితీ పెద్దలు హేయమైన తీర్పు ఇచ్చారు. దీంతో యువకుడు ఆగ్రహంతో యువతి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రులను చితక్కొట్టి ఆపై యువతికి నిప్పటించాడు. ఘటన తర్వాత యువకుడు పారిపోగా.. కాలిన గాయాలతో యువతి ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతి బంధువుల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతికి ప్రధాన నిందితుడికి పాత పరిచయాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్థానిక ఎస్సై వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. -
జార్ఖండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్
సాక్షి, రాంచీ : జార్ఖండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఐదు మేయర్ స్ధానాలనూ గెలుచుకుంది. హజారిబాగ్, గిరిధ్, ఆదిత్యాపూర్, రాంచీ, మేదినీనగర్ కార్పొరేషన్లలో మేయర్ పదవులను బీజేపీ దక్కించుకుంది. ఈనెల 16న ఐదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎంలు హోరాహోరీగా తలపడ్డాయి. గెలుపుపై మూడు పార్టీలూ ధీమా వ్యక్తం చేశాయి. పలు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులనూ బీజేపీ గెలుచుకుంది. ఐదు కార్పొరేషన్లలోనూ పార్టీ ఘనవిజయం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. మేయర్ ఎన్నికల్లో త్రిముఖ పోరు బీజేపీకి లాభించిందని పరిశీలకులు విశ్లేషించారు. -
సీఎం కేసీఆర్ కల నెరవేర బోతోంది
కాళేశ్వరం(మంథని) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ కల సాకారం అవుతుం దని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. శుక్రవారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారంలో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీ పనులను మంత్రి హరీష్‌రావుతో కలసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నిరుపేద రైతుల పంటపొలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నిరుపేదలకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. బీడు భూములన్ని సస్యశామలంగా మారుతాయని ఆశాభావ ం వ్యక్తం చేశారు.ఆయన వెంట కాళేశ్వరం బ్యారేజీ చీప్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, అఫ్కాన్ కంపెనీ డైరెక్టర్ మల్లికార్జున్‌రావు, ఈఈ మల్లికార్జున్‌ప్రసాద్, డీఈఈ యాదగిరి, అప్కాన్ హెచ్ఆర్ మేనేజర్ గోవర్ధన బార్గవలు ఉన్నారు. -
మావోయిస్టులకు గట్టి షాక్
రాంచీ : రెడ్ కారిడార్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టాప్ నక్సల్ కమాండర్ దేవ్‌కుమార్ సింగ్ అలియాస్ అరవింద్‌జీ మృతితో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలకు భారీ ఊరటగా భావిస్తున్నారు. ఏ కేటగిరీ నక్సల్ నేతగా ప్రభుత్వం గాలిస్తున్న అరవింద్ జార్ఖండ్‌లో గుండె పోటుతో మరణించారు. ఆయన తలపై ప్రభుత్వం రూ 1.5 కోట్ల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న అరవింద్ అంతర్ జిల్లా తీవ్రవాద కార్యకలాపాల్లో ఆరితేరినట్టు చెబుతారు. జార్ఖండ్ పోలీసు రికార్డుల ప్రకారం అరవింద్ ఏళ్ల తరబడి జార్ఖండ్‌లో నకల్స్ కార్యకలాపాలకు వ్యూహకర్త, మాస్టర్‌మైండ్. బుదపహార్ ప్రాంతంతో పాటు పలు అటవీ ప్రాంతాల్లో అరవింద్ కదలికలను పలు సందర్భాల్లో పసిగట్టినట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. భద్రతా దళాల కన్నుగప్పి ఆయన ఎన్నో సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 50 ఏళ్లు పైబడిన అరవింద్ ఛత్తీస్గడ్ సరిహద్దులోని జార్ఖండ్ బుధ పహద్ అడవుల్లో గుండెపోటుతో మరణించారు. నిషాంత్గా కూడా పేరొందిన అరవింద్ ఉన్నత విద్యను అభ్యసించి టెక్నాలజీ నిపుణుడిగా కూడా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్ర సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు భద్రతా దళ సిబ్బందిని హతమార్చడం, దాడులకు పాల్పడటం వంటి పలు కేసుల్లో అరవింద్ ప్రమేయం ఉంది. బీహార్‌లోని జెహనాబాద్‌కు చెందిన అరవింద్‌జీ జార్ఖండ్‌లోని మావో ప్రభావిత పలము, గర్హ్వ, ఛత్ర జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారు. -
గుళ్లోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి దుర్మరణం
రాంచీ : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి దూసుకెళ్లటంతో ఏడుగురు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. జంషెడ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో చియాబస పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి చియాబాసా-ఛాకర్దార్ హైవేపై బరోడా బ్రిడ్జి వద్ద ఉన్న ఓ గుడిలో రెండు గిరిజన కుటుంబాలు వివాహ వేడుకల కోసం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ట్రాన్స్పోర్ట్ అండ్ బస్ అసోషియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ అగర్వాల్ కొడుకు అని దర్యాప్తులో తేలింది. దీంతో ప్రతిపక్షాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే శశి భూషణ్ క్షతగాత్రులను పరామర్శించి.. ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. కాగా, కొద్దిరోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో బీజేపీ నేత మనోజ్ బైతా ర్యాష్ డ్రైవింగ్‌తో స్కూల్లోకి దూసుకెళ్లగా.. 9 మంది చిన్నారులను మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
దారుణం: తల్లీ, కూతుళ్లతో మలం తినిపించారు!
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ తల్లీ, కూతురితో బలవంతంగా మానవ మలాన్ని తినిపించారు. గత బుధవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్లితే.. సోనాహుత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసించే ఒక కుటుంబంలోని మహిళ తీవ్ర అనారోగ్యంతో మరణించింది. కొద్దిరోజులకు అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎవరైనా చేతబడి చేశారన్న అనుమానంతో ఆ కుటుంబ సభ్యులు ఓ భూత వైద్యుడిని సంప్రదించారు. ఆ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలు చేతబడి చేశారని ఆ భూత వైద్యుడు చెప్పటంతో ఆగ్రహానికి లోనయ్యారు. 65 ఏళ్ల కరో, ఆమె కూతురు బసంతి దేవి(35)లను ఇంటి నుంచి లాక్కొచ్చి చితకబాదారు. అలా కొట్టుకుంటూ ఊరి చివరి చెరువు వరకు తీసుకెళ్లారు. ఆపై అక్కడ వారితో మలం తినిపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భూత వైద్యుడితో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రగాడి మాటలు విని తాము ఆ పని చేశామని నిందితులు చెప్పారు. మూఢ నమ్మకాలతో మూర్ఖపు పనులకు పాల్పడకండని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. -
భార్య కోసం 65 గ్రామాల్లో..
సాక్షి, రాంచీ : మతిస్థిమితం లేని భార్య తప్పిపోవడంతో ఆ భర్త తల్లడిల్లాడు. ఆమె కోసం సైకిల్‌పై ఏకంగా 65 గ్రామాలను చుట్టేశాడు. జార్ఖండ్‌కు చెందిన వ్యవసాయ కూలీ మనోహర్ 16 ఏళ్ల కిందట అనితను వివాహం చేసుకున్నాడు. వీరికి 14 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. జనవరి 11న అనిత తన కుమారుడితో కలిసి పశ్చిమ మెదినిపూర్ జిల్లాలోని కుమ్రాసోల్ గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. ప్రయాణంలో దారితప్పడంతో అప్పటినుంచి ఆమె జాడ తెలియరాలేదు. ఆ సమయంలో ఒడిషాలో పనిచేస్తున్న మనోహర్ తన ఉద్యోగాన్ని వదిలి భార్యను వెతుకుతున్నాడు. కుమ్రసోల్ గ్రామానికి సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. పోలీసు చర్యల కోసం ఎదురుచూడకుండా మనోహర్ తనే సొంతంగా భార్యను గాలించేందుకు తన పాత సైకిల్‌పై ప్రయాణం చేపట్టాడు. అనిత ఫోటోతో పాటు ఆమె తప్పిపోయిన వార్త ప్రచురితమైన వార్తాపత్రికలను తన వెంట తీసుకెళ్లాడు. అయితే వార్తాపత్రికల్లో ఆమె ఫోటోను చూసిన కొందరు అనితను గుర్తుపట్టి ఖరగ్‌పూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీంతో వారు ముసబని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడంతో ఆమె ఆచూకీని మనోహర్‌కు తెలియచేశారు. ఆ సమయంలో భార్య కోసం తూర్పు సింగ్భుమ్లో గాలిస్తున్న మనోహర్ సైకిల్‌పైనే నేరుగా ఖరగ్‌పూర్ పీఎస్‌కు వెళ్లి అనితను కలిశారు. తన భర్త సైకిల్‌పై జాతీయ రహదారిలో 120 కిమీ ప్రయాణించి కోల్‌కతా చేరుకోవడం పట్ల అనితతో పాటు పోలీసులూ ఆశ్చర్యపోయారు. -
రవాణ అధికారిపై బీజేపీ నేత దాడి
-
దారుణం : ఓటు వేయలేదని గ్యాంగ్‌రేప్.. హత్య
రాంచీ : జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో తన భార్యకు మద్ధతు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఒక కుటుంబంపై పగ పెంచుకుని దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే... పాకూరు జిల్లా లిట్టిపారా గ్రామ పంచాయితీలో ‘ముఖియా’ పదవి కోసం కొన్నాళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. ప్రేమ్‌లాల్ హంసద అనే వ్యక్తి భార్య ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఓటు వేయలేదు. దీంతో వారి మూలంగానే తన భార్య ఓడిపోయిందన్న కోపంతో ప్రేమ్‌లాల్ రగిలిపోయాడు. జనవరి 8న బహిర్భూమికని వెళ్లిన బాలికను తన సోదరుల సహకారంతో అపహరించాడు. ఆపై వారంతా కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ప్రాణాలు తీశారు. చివరకు బాలిక మృత దేహాన్ని సమీపంలోని బ్లెవాన్ అటవీ ప్రాంతంలో పడేశారు. బాలిక కనిపించకుండా పోయే సరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచ్చిన సమాచారం మేరకు బాలిక శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆపై నిందితులపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయటంతో వారిని అరెస్ట్ చేశారు. తీవ్ర విమర్శలు... నిందితులు రాజకీయంగా కాస్త పలుకుబడి ఉన్నవారు కావటంతో తొలుత కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు తటపటాయించారు. అయితే ప్రతిపక్షాల ఆందోళన, తల్లిదండ్రుల నిరసన ప్రదర్శనతో పోలీసులపై విమర్శలు గుప్పించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి.. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఎలాంటి తమపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని.. సాక్ష్యాలు సేకరించటంలో జాప్యం మూలంగానే అరెస్ట్ ఆలస్యం అయ్యిందని పాకూరు జిల్లా ఎస్పీ శైలేంద్ర బర్న్వాల్ వెల్లడించటం విశేషం. నిందితులు ప్రేమ్‌లాల్, శ్యామూల్, కథి, శిశు హందలు నేరాన్ని ఒప్పుకోవటంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు వారు వివరించారు. -
వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
-
వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
రాంచీ : పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవటం అనేది భారతీయ సంస్కృతిలో భాగం కాదనేది కొందరి అభిప్రాయం. అయితే ఆధునికత పేరిట ఈ మధ్య యువత పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ, జార్ఖండ్‌లో ఈ మధ్య ఓ గ్రామంలో నిర్వహించిన ముద్దుల పోటీలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్ జిల్లా డుమారియా గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంత ఎమెల్యే సిమన్ మరాండి(జేఎంఎం) నేతృత్వంలోనే ఈ పోటీలు జరుగుతుండటం విశేషం. పెళ్లయిన గిరిజన దంపతులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎవరు ఎంత ఎక్కువ సేపు ముద్దు పెట్టుకుంటే.. వారి మధ్య అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. చివరకు మిగిలిన జంటకు బహుమతులను అందిస్తారు. ‘‘ఆదివాసీయులు అమాయకులు.. పైగా నిరక్షరాస్యులు. అందుకే వారి కుటుంబాలలో బంధాలు అంత బలంగా ఉండవు. భార్యభర్తల మధ్య ప్రేమను పెంచేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నా. ఆధునికత నేర్పించి వారిని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తా’’ అని సిమన్ చెబుతున్నారు. కాగా, ఇలా బహిరంగ ముద్దులు సభ్యత కాదని ఆరోపిస్తూ మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాయి. ఇక డుమారియాలో ఈ మేళాను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. గత 37 ఏళ్లుగా సిమన్ కుటుంబ సభ్యులే ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. విలు విద్య, గిరిజన నృత్యాలు, పరుగు పందాలు తదితర పోటీలు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాదే ప్రయోగాత్మకంగా ముద్దుల పోటీని ఆయన ప్రవేశపెట్టారు. శుక్ర, శని వారాల్లో ఈ పోటీలు నిర్వహించగా.. 18 మంది దంపతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. -
మమల్ని చంపుతారంట!
రాంచీ : జార్ఖండ్ లో ఈ మధ్యే 11 ఏళ్ల చిన్నారి సంతోష్ కుమారి ఆధార్ అనుసంధానం మూలంగా ప్రాణాలు కోల్పోయిందన్న విమర్శలు తెలెత్తటం తెలిసిందే. నిరక్షరాస్యులైన పేద ప్రజల ఆకలి చావుకు దర్పణం పట్టిన ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే అది ఆధార్ మరణం కాదంటూ యూఐడీఏ చెప్పటం.. మలేరియాతో చిన్నారి చనిపోయిందంటూ ఆరోగ్య శాఖ ప్రకటించటంతో... జార్ఖండ్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ కుటుంబం ఉంటున్న సిమ్‌డేగలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత బాలిక కుటుంబాన్ని చంపుతామంటూ గ్రామస్తులు బెదిరించారని సమాచారం. ఈ మేరకు సంతోషి కుమారి తల్లి కొయిలా దేవి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘మా కుటుంబం భయంతో బతుకుతున్నాం. వెంటనే ఊరు వదిలి వెళ్లాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు’’ అని కోయిలా దేవి ఆరోపించారు. దీంతో ఆదివారం పెద్ద ఎత్తున్న పోలీస్ బలగాలు గ్రామంలో మోహరించి పహరా కాస్తున్నాయి. మరోవైపు ఆమెపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి సరయు రాయ్ ప్రకటించారు. ఆమెకు ఇకపై ఎలాంటి సమస్య తలెత్తబోదని ఆయన హామీ ఇస్తున్నారు. -
సీఎం అండ్ కో, రూల్స్ బ్రేక్!
రాంచీ : ఓవైపు రోడ్డు భద్రత విషయంలో ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహక కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. అధికారులు మాత్రం అవేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా ఇలాంటి పనే ఒకటి చేసిన విమర్శలు ఎదుర్కుంటున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపి వార్తల్లోకి ఎక్కారు. మొన్న దీపావళి రోజు జార్ఖండ్ సీఎం రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపారు. జంషెడ్ పూర్లోని తన నివాసంలో వేడుకలు జరుపుకున్న అనంతరం ఆయన ఇలా ఓ స్కూటీపై నగరం మొత్తం చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఇలా నిబంధనలను ఉల్లంఘించడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అదే సమయంలో ఆయన సెక్యూరిటీ గార్డులు లేకుండా.. అనుచరులతో రోడ్డెక్కగా, వారికి హెల్మెట్లు లేకపోవటం విశేషం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేమో ట్రాఫిక్ నియమాలని నీతులు చెబుతుంటే.. అదే పార్టీకి చెందిన సీఎం మాత్రం ఇలా వ్యవహరించటం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఇండియాలో ప్రతీ గంటకు 16 మంది చొప్పున రోడ్డు ప్రమాదానికి గురవుతుంటే.. ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు ప్రాణాలు విడుస్తున్నారని జాతీయ నేర పరిశోధన సంస్థ నివేదికలు చెబుతున్నాయి. హెల్మెట్ లేకుండా బండి నడిపిన సీఎం -
ఆ చిన్నారి ఆధార్ వల్ల చనిపోలేదు
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డుతో అనుసంధానం కాకపోవటంతో రేషన్ కార్డు రద్దు కావటం..11 ఏళ్ల సంతోషి కుమారి ఆకలిచావు జార్ఖండ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డ్ నిర్వహణ చేపడుతున్న యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిటీ-ఆధార్ టూ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా) స్పందించింది. ఆ చిన్నారి మరణానికి.. ఆధార్ కార్డు లింకుకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ మేరకు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పని సరే అయినా.. ప్రయోజనాలను నిలుపుదల చేసినట్లు ఇప్పటిదాకా ఎక్కడా ఫిర్యాదులు నమోదు కాలేదు అని చెప్పారు. 2013 నుంచి సంతోషి కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆధార్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం.. అనుసంధానం నిబంధన ఉన్నప్పటికీ.. లబ్ధిదారులకు ఇబ్బంది చేకూర్చేలా వ్యవహరించకూడదని, ప్రత్యామ్నాయల ద్వారా అయినా వారికి అందించాల్సిందేనని పేర్కొని ఉందన్న విషయాన్ని ఆయన ఉటంకించారు. అయితే ఒకవేళ రేషన్ అధికారి గనుక నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించి ఉంటే మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని.. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉండవని భూషణ్ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై జార్ఖండ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి కుటుంబానికి రేషన్ అందకపోవటం.. 8 రోజులుగా ఆ కుటుంబం పస్తులుండటంతో సంతోషి సెప్టెంబర్ 28న చనిపోగా, ఆ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే విమర్శల నేపథ్యంలో ఆమె మలేరియాతో మృతి చెందిందని వైద్యాధికారులు వెల్లడించటం గమనార్హం. అయినా ఆధార్ ఉండాల్సిందే : ఎంపీ మంత్రి భోపాల్ : సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలంటే తప్పనిసరిగా ఆధార్ అవసరమని మధ్యప్రదేశ్ ఆహరశాఖ మంత్రి ఓం ప్రకాశ్ ధ్రువే ఖరాకండిగా చెబుతున్నారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జార్ఖండ్ ఘటన భాధాకరం. మా రాష్ట్రంలో (మధ్యప్రదేశ్) లో ఇలాంటి ఘటనలు జరగటానికి వీల్లేదు. అందుకే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందే. అని తేల్చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమౌతోందని ఆయన అన్నారు. అంతేకాదు ఆధార్ లేని వారికి వాటిని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. కాగా, సుమారు ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 15 గ్రామాల ప్రజలు ఆధార్ కార్డులు లేకుండా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. ఏజెంట్ల తప్పిదాల వల్ల... మరోవైపు యూఐడీఐఏ నియమించే ఏజెంట్లు తప్పిదాల వల్ల కూడా ఆధార్ కార్డులు మంజూరు కాకుండా పోతున్నాయి. పీటీఐ కథనం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం జిల్లా దుంబ్రిగూడ మండలంలో 11 ఏళ్ల బాలుడు తనకు ఆధార్ కార్డు జారీ కాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కాలర్‌షిప్‌తోపాటు సంక్షేమ పథకాల అనుసంధానంకు అంతరాయం కలగటంతోనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ఎన్ఐఏ విచారణ.. సంచలన నిజాలు
సాక్షి : మావోయిస్ట్ కొమాండర్ కుందన్ పహన్ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులో ఉన్న విషయం తెలిసిందే. జనతా దళ్ యునైటెడ్ నేత, జార్ఖండ్ మాజీ మంత్రి రమేష్ సింగ్ ముండా హత్య కేసులో కుందన్ అరెస్టై జైల్లో ఉన్నాడు. ఈ మేరకు ఎన్ఐఏ చేపట్టిన విచారణలో సంచలన వాస్తవాలను వెల్లడించాడు. రమేష్ సింగ్ హత్య కోసం మాజీ మంత్రి రాజా పీటర్ వద్ద నుంచి రూ.5 కోట్లకు సుపారీ తీసుకున్నట్లు కుందన్ వెల్లడించాడు. ఈ హత్యకు గాను పీటర్ తొలుత రూ.3 కోట్లు కుందన్‌కు అడ్వాన్స్‌గా చెల్లించాడు. మిగతా రూ. రెండు కోట్లను హత్య అనంతరం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆ డబ్బు మావోయిస్ట్ పొలిట్‌బ్యూరోకు చేరకముందే.. మావోయిస్ట్ కమాండర్ బలరామ్ సాహు వాటిని తీసుకుని పరారయ్యాడు. చివరకు బలరామ్ పోలీసులకు చిక్కటంతో వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. మరో మాజీ అయిన గోపాల కృష్ణ పటార్ అలియాస్ రాజా పీటర్‌ను నాలుగు రోజుల క్రితం ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాజా పీటర్‌కు అంత పెద్దమొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు సమకూర్చారు? అన్న విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు జైల్లో ఉన్న మాజీ మావోయిస్టులను కూడా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2008 జూలై లో రాంచిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా.. మావోయిస్ట్ గెరిల్లా దళం దాడి చేసి రమేష్ ను కాల్చి చంపింది. బాడీ గార్డు శేష్‌నాథ్ సింగే మావోలకు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు కూడా. ఇక ప్రస్తుతం ఎన్ఐఏ రిమాండ్ లో ఉన్న రాజా పీటర్ అలియాస్ గోపాల కృష్ణ పటార్ 2009 తమర్ నియోజవర్గ ఉప ఎన్నికలో సంచలనం సృష్టించారు. అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌ను రాజా పీటర్ ఓడించి చరిత్ర సృష్టించాడు. సీఎం ఓడిపోవటంతోనే అప్పుడు జార్ఖండ్‌లో రాష్టపతి పాలన విధించాల్సి వచ్చింది కూడా. -
టేకాఫ్ సమయంలో పక్షి ఢీ కొట్టడంతో..
రాంచీ: టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో పక్షి ఢీకొనడంతో ఎయిర్ ఏసియా ఇండియా విమానం వెనక్కు వచ్చింది. జార్ఖండ్‌లోని రాంచీ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఈ విమానం ఎయిర్‌పోర్టు(బిర్సామండా)లో టేకాఫ్ తీసుకుంటున్న క్రమంలో పక్షి ఢీకొంది. దీంతో విమానం సిబ్బంది వెంటనే ప్రయాణాన్ని రద్దు చేసి ప్రయాణికులను రన్‌వే మీదకు దింపారు. ఈ సమాచారాన్ని విమాన సంస్థ ఎండీ, సీఈఓ అమర్ అబ్రాల్ తెలిపారు. అయితే ఈ సంఘటన కారణంగా ప్రయాణికులెవరికీ ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదన్నారు. వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. అక్కడ అత్యవసర ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో విమానం ఇంకా రాంచీ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయింది. పక్షి ఢీకొనడంతో విమానం రెక్కలు బాగా దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన సమయంలో విమానంలోనుంచి పొగలు వచ్చాయని, దాంతో ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు తెచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
పాతాళానికి చేరిన ఉల్లి ధరలు
-
రేపిస్టును మహిళలు కొట్టి చంపేశారు
-
అగ్రకులస్తులపై హోలీ రంగులు చల్లాడని..
అగ్ర కులానికి చెందిన వారిపై హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లిన వ్యక్తిని పోలీసులు కొట్టి చంపారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొదెర్మ జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ చౌదరి, మరికొంత మంది గ్రామస్తులు హోలీ సందర్భంగా రంగులు చల్లుకుంటున్నట్లు ఆమె భార్య తెలిపారు. ఈ సమయంలో అటువైపుగా వచ్చిన చౌకీదార్ రాజేంద్ర యాదవ్‌పై కూడా వీరందరూ రంగులు చల్లారని వెల్లడించారు. దీంతో కోపగించుకున్న రాజేంద్ర.. రంగులు చల్లిన దళితలపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో గ్రామానికి వచ్చిన పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని స్పృహతప్పి పడిపోయే వరకూ చితకబాదారని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రదీప్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తను కలుసుకునేందుకు ఆయన సోదరుడితో కలిసి స్టేషన్‌కు వెళ్లగా చూడటానికి అనుమతించలేదని తెలిపారు. అంతేకాకుండా కులం పేరిట తమను దూషించారని ఆరోపించారు. మరుసటి ప్రదీప్‌ను పోలీసులు ఇంటి వద్ద వదిలేశారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని.. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారని తెలిపారు. -
ఎంఎస్ ధోని ఇలా..
నాగ్‌పూర్: గత కొంతకాలం నుంచి క్రికెట్ దూరంగా ఉంటున్న టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు తన రాష్ట్ర జట్టు జార్ఖండ్‌తో బిజిబిజీగా ఉన్నాడు. రంజీ సెమీ ఫైనల్లో భాగంగా ఆదివారం గుజరాత్‌తో ఏసీఏ స్టేడియంలో ఆరంభమైన మ్యాచ్‌కు హాజరైన ధోని.. జార్ఖండ్ జట్టులో అనధికార మెంటర్ పాత్ర పోషించాడు. తన రంజీ జట్టుకు కొన్ని విలువైన సూచనలు చేస్తూ ఆటగాళ్లతో భాగస్వామ్యం అయ్యాడు. త్వరలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో ధోని ఇలా ఆటగాళ్లతో కలిసి తన అనుభవాన్ని పంచుకున్నాడు. తన టెస్టు కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత ఎటువంటి లాంగర్ ఫార్మాట్లో ధోని పాల్గొనడం లేదు. గత అక్టోబర్ 29న విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తను చివరిసారిగా ఆడాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో ముందుగా జార్ఖండ్ జట్టు సభ్యుల ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు. -
'ఆ పొరపాట్లను బీహార్ లో పునరావృతం కానివ్వం'
పాట్నా:జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన పొరపాట్లను బీహార్ లో పునరావృతం కానివ్వమని సీఎం జితిన్ రామ్ మాంజీ స్పష్టం చేశారు.జార్ఖండ్ లో 81 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 42 సీట్లు కైవశం చేసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీనిపై మీడియాతో మాట్లాడిన రామ్ మాంజీ.. అక్కడ జరిగిన పొరపాట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ బీహార్ లో పునరావృతం కానివ్వమన్నారు.