‘మోదీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లు తాగు’ | Kapil Sibal Says Nishikant Dubey Will Wash Modi Feet | Sakshi
Sakshi News home page

‘మోదీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లు తాగు’

Published Mon, Sep 17 2018 7:31 PM | Last Updated on Mon, Sep 17 2018 7:41 PM

Kapil Sibal Says Nishikant Dubey Will Wash Modi Feet  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే కాళ్లను కడిగి ఆ నీటిని పవన్‌ అనే కార్యకర్త తాగిన విషయం తెలిసిందే. అ వీడియోను దుబే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఎంపీ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి కపిల్‌ సిబాల్‌ ఘాటుగా స్పందించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లని కడిగి.. ఆ మురికి నీళ్లను నువ్వు తాగు. దాని ద్వారా నువ్వు కూడా మోదీపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయ్యవచ్చు’’ అని ట్వీట్‌లో చేశారు.

జార్ఖండ్‌లోని గొడ్డా నియోజకర్గంలో ఆదివారం ఓ కార్యక్రమంలో నిశికాంత్‌ దుబే పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్త పవన్‌ ఓ ప్లేట్‌లో ఎంపీ కాళ్లు కడిగి ఆ నీటిని తాగాడు. తనపై ఉన్న ప్రేమను పవన్‌ ఆ విధంగా వ్యక్తపరిచాడని దుబే సమర్ధించుకున్నాడు. ప్రజా ప్రతినిధివై ఉండి కార్యకర్తతో కాళ్లు కడిగించుకుంటావా అంటూ అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement