Nishikant Dubey
-
Jharkhand: హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం బాధ్యతలు?
జార్ఖండ్‌లో రాజకీయలు ఒక్కసారిగా వేడేక్కాయి. రాష్ట్ర సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్..ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌చేసే అవకాశం ఉన్న క్రమంలో జార్ఖండ్‌లో సీఎం మార్పు జరగనున్నట్లు తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జేఎమ్ఎమ్తోపాటు ఇతర మిత్రపక్ష ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవాలని సీఎం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై మంగళవారం మధ్యాహ్నం సీఎం నివాసంలో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? జార్ఖండ్ రాజకీయ పరిణామలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్ జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఇతర మిత్రపక్ష ఎమ్మెల్యేలను రాంచీకి పిలిచారని తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. హేమంత్ తన సతీమణి కల్పనా సోరెన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈడీ విచారణతో సీఎం భయపడుతున్నారని, తాను రోడ్డు మార్గంలో దిల్లీ నుంచి రాంచీకి వస్తానని తన పార్టీ నేతలకు సోరెన్ చెప్పినట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు దూబే ఎక్స్‌లో (ట్విటర్) పోస్ట్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన నీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్‌ను విచారించేందుకు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఢిల్లీలోని సీఎం ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన అందుబాటులో లేరు. దీంతో 13 గంటలపాటు ఆయన నివాసంలోనే ఉండి ఈడీ అధికారులు సోదాలు జరిపారు. సీఎంకు చెందిన రెండు బీఎండబ్ల్యూ కార్లు, 32 లక్షల నగదుతోపాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సోరెన్ జనవరి 27 రాత్రి తన వ్యక్తిగత పనుల నిమిత్తం రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరారని, త్వరలోనే తిరిగి వస్తారని ఆయన పార్టీ నేతలు చెబుతున్నారు. మనీలాండరింగ్ కేసులో జనవరి 29 లేదా జనవరి 31వ తేదీలలో విచారణకు హాజరవ్వాలని ఈడీ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. మరోవైపు జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని జార్ఖండ్ సీఎం ఇప్పటికే ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయనను విచారించే అవకాశాలున్నాయి. ఇక తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ పేర్కొన్నారు. -
జార్ఖండ్ తదుపరి సీఎం ఆమె? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని.. తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పన బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేత సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నిశికాంత్ దుబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని, సంకీర్ణాన్ని, సీఎం హేమంత్ సోరెన్‌ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘ఎమ్మెల్యేగా సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా కొత్త ఏడాదిలో సోరెన్ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. త్వరలో హేమంత్ సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారు.ఆయన భార్య కల్పన సీఎం పదవిని చేపడతారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్.. న్యాయ సలహా తీసుకోవాలని బీజేపీ పేర్కొంది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2019లో కొలుదీరిన విషయం తెలిసిందే. झारखंड के गांडेय विधायक सरफराज अहमद ने विधानसभा से इस्तीफ़ा दिया,इस्तीफ़ा स्वीकार हुआ । हेमंत सोरेन जी मुख्यमंत्री पद से इस्तीफ़ा देंगे,झारखंड की अगली मुख्यमंत्री उनकी पत्नी कल्पना सोरेन जी होंगी । नया साल सोरेन परिवार के लिए कष्टदायक @itssuniltiwari pic.twitter.com/jl06AtXurh — Dr Nishikant Dubey (@nishikant_dubey) January 1, 2024 జేఎంఎం ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు జరిగే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎంపీ నిశికాంత్ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారించడానికి ఇప్పటివరకు ఈడీ.. సీఎం హేమంత్ సోరెన్‌కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సీఎం హేమంత్ సోరెన్ జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాల పైకి దర్యాప్తు సంస్థలను పంపి వాటిని వాడుకుంటోందని మండిపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు అవినీతి కేసులో ఈడీ విచారణపై సీఎం హేమంత్ సోరెన్ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం సోమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం పదవిని తన భర్య కల్పనకు అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది. చదవండి: Lalan Singh: నేను హిందువునే.. వాళ్లలా కాదు.. -
‘పార్లమెంట్ భద్రత.. ప్రభుత్వ బాధ్యత కాదు’
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యంపై విపక్షాలు పార్లమెంట్లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి జవాబు చెప్పాలని పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం 13 మంది లోక్ సభ సభ్యులు, రాజ్యసభలో ఒక ఎంపీ సస్పెన్షన్‌కు గురైనారు. అయితే తాజాగా విపక్షాల ఆందోళనలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యాలు 1974, 1994లో కూడా చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పడు జరిగింది తొలిసారి కాదని అన్నారు. పార్లమెంట్ భద్రత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కాదని అన్నారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై ప్రధాని, కేంద్ర హోం మంత్రి మాట్లాడమని విపక్షాలు ఆందోళన చేయడం సరికాదని మండిపడ్డారు. పార్లమెంట్ భద్రతా వ్యవహారం మొత్తం లోక్‌సభ సెక్యూరిటీకి సంబంధించిందని అన్నారు. 1974లో అయితే ఏకంగా ఓ వ్యక్తి రెండు తుపాకులు చేతిలో పట్టుకొని పార్లమెంట్‌లోకి వచ్చాడని తెలిపారు. కానీ, ఆనాటీ ప్రతిపక్షమైన జనసంఘ్ దాన్ని ఓ పెద్ద వివాదంగా చేయలేదని అన్నారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి బాధ్యత వహించాలని నిరసనలు తెలపలేదని అన్నారు. ఎందుకుంటే పార్లమెంట్ భద్రత.. బాధ్యత లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందినదని ఆయన ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొన్నారు. कॉंग्रेसी@INCIndia डूब मरो यह है,११ अप्रैल १९७४ में पिस्तौल के साथ घुसने वाले शख़्स की कहानी,भाजपा/जनसंघ या तत्कालीन विपक्ष ने इसे राजनीतिक मुद्दा नहीं बनाया ।लोकसभा अध्यक्ष का इस्तीफ़ा नहीं मॉंगा? प्रधानमंत्री व गृहमंत्री का तो ज़िक्र तक नहीं किया,क्योंकि संसद की सुरक्षा केवल… pic.twitter.com/lOte3AOVia — Dr Nishikant Dubey (@nishikant_dubey) December 15, 2023 చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
‘మహువా మొయిత్రాపై వేటు.. అది విచారకరమైన రోజు’
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మొదటిసారి స్పందించారు. ‘అవినీతి, జాతీయ భద్రత సమస్య విషయంలో ఓ ఎంపీ బహిష్కరణకు గురికావటం తనకు బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి రోజు(శుక్రవారం) సంతోషకరమైన రోజు కాదని, అదో విచారకరమైన రోజని తెలిపారు. అయితే మొయిత్రా తన లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీకి ఇచ్చారని నిశికాంత్ దూబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. #WATCH | BJP MP Nishikant Dubey on expulsion of TMC leader Mahua Moitra from Parliament "The expulsion of a parliamentarian for corruption and on the issue of national security gives me pain. Yesterday, it was not a happy day, but a sad day." pic.twitter.com/DZoZei5AqF — ANI (@ANI) December 9, 2023 ఆయన ఫిర్యాదుతోనే స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయగా.. శుక్రవారం ఎథిక్స్ కమిటి నివేదిక ఆమెను దోషిగా తేల్చటంతో బహిష్కరణ గురయ్యారు. ఇక మొయిత్రాపై వేటుపడిన అనంతరం ఆమెపై ఫిర్యాదు చేసిన ఎంపీ నిశికాంత్ దూబే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. -
వారి తర్వాత.. కాంగ్రెస్‌లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే
సాక్షి,న్యూఢిలీ: దేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా లేదని.. కానీ వారికి ఎంతో చేసినట్లుగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే అన్నారు. ఆయన బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు వెన్నుదన్నుగా లేదని, 1990లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఓబీసీకి చెందిన సీతారం కేసరి గతంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు. ఇటీవల జరిగిన రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమితో బీపీ ముఖ్యమంత్రులుగా అశోక్ గహ్లోత్, భూపేష్ బాఘేల్ అవకాశం కోల్పోయారని తెలిపారు. వారి తర్వాత కాంగ్రెస్‌లో బీసీ సీఎం ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రుల ఎంపికలో కూడా బీసీలకు తాము సముచిత స్థానం కల్పిస్తున్నామంటూ కాంగ్రెస్ అసత్యాలు చెబుతోందని నిశికాంత్ అన్నారు. అయితే.. తాజాగా తెలంగాణలో సీఎంగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ చెందిన సుఖ్విందర్ సింగ్ సుఖు బీసీలా? అని నిశికాంత్ సూటిగా ప్రశ్నించారు. కాగా.. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుందని తెలిపారు. -
మహువాపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపనుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే తాజాగా వెల్లడించారు. తన ఫిర్యాదు ఆధారంగా లోక్‌పాల్ ఈ మేరకు ఆదేశించినట్టు వివరించారు. ఈ మేరకు బుధవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. దీనిపై మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ‘‘సీబీఐ ముందుగా అదానీ గ్రూప్ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణం తదితరాలపై విచారణ జరిపితే బాగుంటుంది. ఆ తర్వాత నా అంశానికి రావచ్చు. నాకు ఎన్ని పాదరక్షలున్నాయో లెక్కపెట్టుకోవచ్చు’’ అని ఎద్దేవా చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. ఇందుకు బదులుగా హీరానందానీ నుంచి డబ్బులతో పాటు ఇతరత్రా పలు రకాలుగా ఆమె భారీ స్థాయిలో లబ్ధి పొందారని ఆమెపై ఆరోపణ. ఎంపీ హోదాలో ఉంటూ డబ్బుల కోసం జాతీయ భద్రతనే ఆమె ప్రమాదంలో పడవేశారని లోక్‌సభ స్పీకర్‌కు దూబే గతంలో ఫిర్యాదు చేయడం తెల్సిందే. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. కమిటీ గత భేటీకి హాజరైన మొయిత్రా, చైర్మన్ తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ వాకౌట్ చేయడం విదితమే. ఈ ఉదంతంపై కమిటీ గురువారం మరోసారి భేటీ కానుంది. డబ్బులకు ప్రశ్నలడిగిన ఉదంతంలో మొయిత్రాను దోషిగా తేలుస్తూ స్పీకర్‌కు కమిటీ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. అదే జరిగితే దానితో విభేదిస్తూ కమిటీలోని విపక్ష సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (కాంగ్రెస్), కున్వర్ దానిష్ అలీ (బీఎస్పీ) నోట్ ఇస్తారని చెబుతున్నారు. -
మోదీకి ప్రశ్నలు.. ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ మహువా మోయిత్రా
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎథిక్ కమిటీ విచారణను తాను ఇప్పుడు రాలేనని ఆమె లేఖ రాశారు. ఈ మేరకు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఈ వ్యవహరం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో, ఈ విషయంలో విచారణకు రావాల్సిందిగా పార్లమెంట్ ఎథిక్ కమిటీ ఎంపీకి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఎంపీ మహువా స్పందిస్తూ ఎథిక్స్ కమిటీకి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో..‘ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ నాకు సమన్లు ఈ-మెయిల్ చేయడానికి ముందే టీవీల్లో వాటిని ప్రసారం చేశారు. నాపై నమోదైన ఫిర్యాదులు, సుమోటో అఫిడవిట్లు మీడియా సంస్థలకు అందాయి. నా నియోజకవర్గంలో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాలు నవంబరు 4న ముగిసిన వెంటనే విచారణకు హాజరవుతాను అని తెలిపారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో అక్టోబరు 30 నుంచి నవంబరు 4 వరకు ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, అందువల్ల అక్టోబరు 31న కమిటీ విచారణకు హాజరుకాలేనని మొయిత్రా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో బీజేపీ ఎంపీ రమేష్ భిధూరీ విజ్ఞప్తి మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ తేదీని మార్పు చేసిన విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తన లేఖను ట్విట్టర్లో షేర్ చేశారు. Chairman, Ethics Comm announced my 31/10 summons on live TV way before official letter emailed to me at 19:20 hrs. All complaints & suo moto affidavits also released to media. I look forward to deposing immediately after my pre- scheduled constituency programmes end on Nov 4. pic.twitter.com/ARgWeSQiHJ — Mahua Moitra (@MahuaMoitra) October 27, 2023 మరోవైపు మొయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేత నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు గురువారం కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. కమిటీ సభ్యుల ముందు నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. మొయిత్రాపై సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. లంచం తీసుకుని ప్రధాని మోదీని ఇరుకునబెట్టేందుకు వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని, ఆమె అడిగిన 60 ప్రశ్నల్లో 51 అదానీపైనే ఉన్నాయని నిషికాంత్ దూబే ఆరోపిస్తూ ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే మోయిత్రాకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ వేరే వ్యక్తుల చేతికి వెళ్లినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. అయితే మోయిత్రా చేసిన విదేశీ పర్యటన వివరాలను హోంమంత్రిత్వ శాఖను నుంచి పార్లమెంట్ ప్యానెల్ కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో టీఎంసీ.. ఎంపీ మహువా మోయిత్రాకు సపోర్టు చేయలేదు. విచారణ జరుగుతుందని ఏం జరుగుతుందో చూడాలనే ధోరణిని టీఎంసీ ప్రదర్శిస్తోంది. -
మొయిత్రా ఢిల్లీలో ఉంటే.. దుబాయ్‌లో ఆమె లాగిన్ ఐడీని వాడారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే పరోక్షంగా మరికొన్ని ఆరోపణలు చేశారు. ఎంపీ మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్‌లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని వెల్లడించారు. ఎంపీ దుబే శనివారం ‘ఎక్స్’లో‘ ..‘కొంత డబ్బు కోసం ఆమె జాతీయ భద్రతను పణంగా పెట్టారు. ఇదే ఎన్ఐసీని ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, వివిధ కేంద్ర విభాగాలు వాడుతుంటాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్షాలు ఇంకా దీనిపై రాజకీయాలు చేయాలా? దీనిపై ఇక ప్రజలే నిర్ణయం తీసుకుంటారు’ అని దూబే పేర్కొన్నారు. కానీ, దర్యాప్తు విభాగం పేరును ఆయన పేర్కొనలేదు. అంతేకాకుండా, ఆమె ఎవరి నుంచి లంచం తీసుకున్నారు? వ్యాపారవేత్త దర్శన్ హిరా నందాని తరఫున అదానీ గ్రూప్, ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్‌సభలో ఆమె ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వంటి విషయాలను దుబే వివరించలేదు. ఎంపీ దుబేకి ఎథిక్స్ కమిటీ పిలుపు అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఎంపీ దుబే ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై లోక్‌సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఈ నెల 26న తమ ముందు హాజరై మౌఖిక సాక్ష్యం ఇవ్వాలని దుబేను కోరింది. అదానీ గ్రూప్ గుజరాత్‌లోని తన కంపెనీకి బదులుగా ఒడిశాలోని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన విభాగంలో ఎల్ఎన్జీ నిల్వ చేసుకునేందుకు అనుమతి పొందిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ఎంపీ మహువా పార్లమెంటరీ ఐడీని లాగిన్ చేసినట్లు వివరిస్తూ హిరా నందాని స్వయంగా సంతకం చేసిన ఒక సీల్డు కవర్‌ను ఈ కమిటీకి అందజేశారు. ఈ వివరాలు కూడా బయటకు వెల్లడి కావడం గమనార్హం. ఎంపీ మొయిత్రాపై ఆరోపణల విషయంలో సొంత పార్టీ టీఎంసీ మౌనంగా ఉంటోంది. అయినప్పటికీ మొయిత్రా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అదానీ గ్రూప్‌పైనా, ఎంపీ దుబేపైనా ఆరోపణలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను ఎన్ఐసీ వెల్లడించాలి: మొయిత్రా తను ఢిల్లీలో ఉండగా పార్లమెంటరీ లాగిన్ ఐడీని దుబాయ్‌లో వాడారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన ఆరోపణలపై ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను కూడా ఎన్ఐసీ బహిరంగ పర్చాలని, వారు ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నారో కూడా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. తనకంటే జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరం అదానీ గ్రూపేనని ఆమె ఎదురుదాడికి దిగారు. అదానీ గ్రూప్ కంపెనీ బొగ్గు దిగుమతులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. -
ఎంపీ మహువాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ ముందుకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్‌ఖర్ లోక్‌సబ ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. కాగా మహువా మోయిత్రాపై నిషికాంత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి మాట్లాడేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఎంపీ మహువా కోట్ల రూపాయలు తీసుకున్నారని తన లేఖలో పేర్కొన్నారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 దర్శన్ హీరానందానీ కోరిక మేరకు అడిగినవేనని తెలిపారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను సుప్రీంకోర్టు లాయర్ తనకు అందించారని, తక్షణమే మహువాను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేయాలని కోరుతూ.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు లేఖ రాశారు. లోక్‌సభ వెబ్‌సైట్‌కు సంబంధించి తన లాగిన్ వివరాలను ఎవరికైనా ఇచ్చారా అనే విషయాలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఇందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే నిషికాంత్ దూబే ఆరోపణలపై తృణమూల్ ఎంపీ ఘాటుగా స్పందించారు. నిషికాంత్ దూబేపై నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తును పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానన్నారు. ఇక బీజేపీ ఎంపీ ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసం తాము ఎల్లప్పుడూ ప్రభుత్వంతోనే కలిసి నడుస్తామని తేల్చి చెప్పింది. -
ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన పేర్కొన్నారు. మొయిత్రా, వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుంటున్నట్లు ఉన్న తిరుగులేని సాక్ష్యాలను ఒక న్యాయవాది తనతో పంచుకున్నారని దూబే చెప్పారు. ‘అదానీ గ్రూప్ లక్ష్యంగా ఇప్పటి వరకు ఆమె లోక్‌సభలో ఇప్పటి వరకు 50 నుంచి 61 వరకు ప్రశ్నలడిగారు. 12 డిసెంబర్ 2005 నాటి ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారాన్ని గుర్తుచేసే విధంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడగడం ద్వారా వ్యాపారవేత్త శ్రీ దర్శన్ హీరానందానీ వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మహువా మోయిత్రా పన్నిన నేరపూరిత కుట్ర అనేందుకు ఎలాంటి సందేహం లేదు. విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చాలి’అని ఆయన స్పీకర్ బిర్లాను కోరారు. దీనిపై మొయిత్రా ఘాటుగా స్పందించారు. ముందుగా దుబేపై పెండింగ్‌లో ఉన్న ఆరోపణలపై స్పీకర్ చర్యలు తీసుకున్నాక తనపై చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తానని ఆమె అన్నారు. ‘నకిలీ డిగ్రీ పట్టావాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై పెండింగ్‌లో ఉన్న ఉల్లంఘనలు చాలానే ఉన్నాయి. స్పీకర్ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తే స్వాగతిస్తా’అంటూ ఆమె ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రెండు పార్టీలకు చెందిన ఈ ఎంపీల మధ్య పార్లమెంట్‌లోనూ తరచూ వాదోపవాదాలు జరుగుతుంటాయి. -
సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఈ వివాదంపై మరో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ మా ఎంపీ చేసింది తప్పే కానీ అంతకుముందు డానిష్ అలీ చేసింది కూడా తప్పేనని దానిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మతపరమైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపాయి. ఇతర పార్టీల ఎంపీల తోపాటు బీజేపీ నాయకులు కూడా రమేష్ బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తుండగా సహచర బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాత్రం బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తూనే డానిష్ అలీని కూడా విచారించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. आज भाजपा के कुछ नेता एक नैरेटिव चलाने का प्रयास कर रहे हैं कि संसद में मैंने श्री रमेश बिदूरी को भड़कया, जबकि सच्चाई यह है कि मैंने प्रधानमंत्री पद की गरिमा को बचाने का काम किया और सभापति जी को मोदी जी से संबंधित घोर आपत्तिजनक शब्दों को सदन की कार्रवाई से हटाने की माँग की थी। pic.twitter.com/s5u0Ptb0Ou — Kunwar Danish Ali (@KDanishAli) September 23, 2023 ఈ సందర్బంగా నిశికాంత్ దూబే ఏమన్నారంటే.. లోక్‌సభలో రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం ఆమోదించదగినవి కాదని, అదే సమయంలో డానిష్ అలీ ప్రధానిని కులం పేరుతో దూషించారు కాబట్టి రమేష్ ఆ విధంగా స్పందించారని.. డానిష్ అలీ వ్యాఖ్యలపై కూడా విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ నియమావళి ప్రకారం ఒక సభ్యుడు మాట్లాడుతుండగా కూర్చుని ఉన్న మరో సభ్యుడు అదేపనిగా అడ్డుపడడం కూడా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. 15 ఏళ్లుగా నేను ఎంపీగా ఉన్నాను కానీ ఇలాంటి ఒకరోజును నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదన్నారు. #WATCH | Delhi: On BJP MP Ramesh Bidhuri's remark, BJP MP Nishikant Dubey says "...The words used by him are not acceptable. I was present in the Parliament when all this took place. BSP MP Danish Ali kept calling PM Modi 'neech'. I have written a letter to Lok Sabha Speaker Om… pic.twitter.com/TIg4A9bc1a — ANI (@ANI) September 23, 2023 నిశికాంత్ దూబే వ్యాఖలపై బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పందిస్తూ.. సభలో నన్ను మొదట మాటాలతో చంపేశారు ఇప్పుడు సభ వెలుపల నన్ను శారీరకంగా చంపాలని చూస్తున్నారన్నారు. ఇక ఈ విషయంపై రమేష్ బిధూరీ స్పందించడానికి నిరాకరించారు.. మొదట డానిష్ ఆలీ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాబట్టే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఏదేమైనా ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది సభాపతి కాబట్టి దానిపై తాను మాట్లాడదలచుకోలేదని చెప్పి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! -
దమ్మూ ధైర్యముంటే నిరూపించండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీలు ఖండించారు. దమ్మూ ధైర్యముంటే కేంద్రం ఈ విషయాన్ని నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు కాదు.. ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్లు బీజేపీ నిరూపిస్తే రాజీనామాలు సహా దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారన్న బీఆర్ఎస్ ఎంపీలు, ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని వారు ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు మీడియాతో మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండానే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి లాభం లేకపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని, హోంమంత్రిని కలిసి విన్నవించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్మించిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో అడిగిన ప్రశ్నోత్తరాల్లోనే ఒప్పుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాల మంజూరు విషయంలోనూ జరిగిన నష్టాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో దేశం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేగాక కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పును మాఫీ చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా పోరాడాలే తప్ప లిక్కర్, నిక్కర్ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
లోక్‌సభలో గరంగరం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాడీవేడిగా చర్చ జరిగింది. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవ్రతాన్ని విచ్ఛిన్నం చేయ డానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు వెల్లడించాయి. ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న పేదల బిడ్డ నరేంద్ర మోదీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఆరోపించారు. శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సభలో కాసేపు హనుమాన్ చాలీసా పఠించారు. అవిశ్వాస తీర్మానంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, సీపీఎం నేత ఎ.ఎం.అరీఫ్, బీజేపీ సభ్యుడు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తదితరులు మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో తొలగించారు. తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు బుధవారం మాట్లాడనున్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించండి మణిపూర్‌లో హింస, సరిహద్దుల్లో చైనా సైనికుల చొరబాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ నిలదీశారు. ప్రధాని మౌనం వీడేలా చేయడానికే కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. మంగళవారం సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. ‘‘ప్రధాని మోదీ మణిపూర్‌ను ఇప్పటిదాకా ఎందుకు సందర్శించలేదు? రాష్ట్రంలో హింసాకాండపై కేవలం 30 సెకండ్లపాటు స్పందించడానికి 80 రోజులదాకా ఎందుకు వేచిచూశారు? మణిపూర్ ముఖ్యమంత్రిని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు?’’అంటూ మూడు ప్రశ్నలు సంధించారు. మోదీ తక్షణమే మణిపూర్‌లో పర్యటించాలని, అఖిలపక్ష బృందాన్ని వెంట తీసుకెళ్లాలని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలతో చర్చించి, శాంతిని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గౌరవ్ గొగోయ్ ఇంకా ఏం మాట్లాడారంటే... తప్పులను అంగీకరించడం మోదీకి ఇష్టం లేదు ‘‘మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణను, హింసను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ, జాతీయ భద్రతా సలహాదారు ఘోరంగా విఫలమయ్యారు. చేసిన పొరపాట్లను అంగీకరించడానికి ప్రధాని మోదీ ఇష్టపడడం లేదు. మణిపూర్ ప్రభుత్వం విఫలమైందని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. తప్పులను అంగీకరించడం కంటే మౌనం ఉండడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు, కేవలం మణిపూర్‌కు న్యాయం చేకూర్చాలన్న ఆశయంతోనే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మణిపూర్‌లో విభజన జరిగితే దేశంలో విభజన జరిగినట్లే. అందుకే ఈ అంశంపై ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఆయన మౌనవ్రతం కొనసాగిస్తున్నారు. ప్రధాని మౌనం వీడాలన్నదే అవిశ్వాస తీర్మానం అసలు ఉద్దేశం. మణిపూర్‌లో పర్యటించడానికి అభ్యంతరం ఏమిటో మోదీ చెప్పాలి. మణిపూర్ అంశంపై కేంద్ర మంత్రులు మాట్లాడితే సరిపోదు, ప్రధానమంత్రి మాట్లాడాలి. మంత్రుల అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు సరిసమానం కాదుకదా! మణిపూర్‌లో శాంతి కోసం మోదీ కనీసం పిలుపు కూడా ఇవ్వకపోడం విచారకరం. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు మోదీ అధికారం కోసం ఓట్ల వేట సాగించారు. దేశం కంటే అధికారమే ముఖ్యమనుకున్నారు. ఇదేనా జాతీయవాదం? ఒకే దేశం(వన్ ఇండియా) అని చెబుతున్న మోదీ ప్రభుత్వం రెండు మణిపూర్‌లను సృష్టిస్తోంది. 2002లో గుజరాత్లో మత కలహాలు చెలరేగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అక్కడ పర్యటించారు. ఇప్పటి ప్రధాని మోదీ మాత్రం కల్లోల మణిపూర్‌కు దూరంగా ఉంటున్నారు. సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా మోదీ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మణిపూర్‌లో శాంతి కోసం చొరవ తీసుకోవాల్సిన ప్రధానమంత్రి విపక్ష కూటమిపై విమర్శలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి విద్వేషం ఒక ఆయుధంగా మారడం దురదృష్టకరం. మీ ‘విద్వేష దుకాణం’ముందు మా ‘ప్రేమ దుకాణాన్ని’తెరుస్తాం. దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని మీరు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు, అదే మాట ఒక నిరుపేద కూరగాయల విక్రేత ఎదుట చెప్పగలరా?’’అని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. రాజధర్మం పాటించడం లేదు ‘‘దివంగత ప్రధాని వాజ్‌పేయి ‘రాజధర్మానికి’మద్దతుగా నిలిచారు. కానీ, ఇప్పుడు మహిళలను నగ్నంగా ఊరేగించినా మనం రాజధర్మం పాటించడం లేదు. మణిపూర్‌లో జరిగిన అకృత్యాలను ప్రపంచమంతా ఖండించింది. దీనిపై యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. ప్రధాని మోదీ వైఖరిని బ్రిటిష్ పార్లమెంట్ సైతం తప్పుపట్టింది. చెడును సంహరించాలన్నదే మా లక్ష్యం. అందుకే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నాం’’ – టి.ఆర్.బాలు, డీఎంకే సభ్యుడు అవిశ్వాసానికి ఇది సమయం కాదు ‘‘ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతగా ఎదిగారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారబోతోంది. అందుకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇప్పుడు అవసరం లేదు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి తీర్మానాలను పక్కనపెట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొనాలి. తప్పుడు సమయంలో అవిశ్వాసం పెట్టినందుకు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు చింతించడం తథ్యం. బీజేపీని, మోదీని ఇష్టపడకపోయినా సరే దేశానికి మాత్రం మద్దతు ఇవ్వండి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఈశాన్యం గ్రోత్ ఇంజిన్‌గా మారాలని ఆశిస్తోంది. వాస్తవానికి మణిపూర్‌లో ఇప్పటి సమస్యలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకాలే కారణం. మణిపూర్‌ను సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాతోపాటు వస్తారా?’’ – కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి విపక్షాలు ఇక ఇంటికే.. ‘‘ఇండియా అని పేరుపెట్టుకున్న విపక్ష కూటమిలో జగడాలు ముదురుతున్నాయి. విపక్ష నేతలు తమలో తాము కలహించుకుంటున్నారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జైలు శిక్షపై సుప్రీంకోర్టు కేవలం స్టే ఇచ్చింది. ఆయనను నిర్దోషిగా తేల్చలేదు. క్షమాపణ చెప్పడానికి సావర్కార్‌ను కాదని రాహుల్ దురుసుగా మాట్లాడారు. నిజానికి ఆయన ఎప్పటికీ సావర్కార్ కాలేరు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో నిస్సిగ్గుగా చేతులు కలిపాయి. పేదలకు మంచి చేసిన నాయకుడికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానమిది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాలు మళ్లీ సభలో అడుగుపెట్టవు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కు పైగా సీట్లు లభించడం ఖాయం’’ – నిషికాంత్ దూబే, బీజేపీ ఎంపీ -
బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై కేసు
రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీలపై కేసు నమోదైంది. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ విమానాశ్రయంలో సూర్యాస్తమయం తర్వాత వీరి చార్టెడ్ ఫ్లైట్‌ను టేకాఫ్ చేయమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలతో ఈ ఇద్దరితో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు పోలీసులు. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో ఉన్న జార్ఖండ్‌లో తాజా పరిణామం చర్చనీయాంశమైంది. దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది జులైలోనే ప్రారంభించారు. అయితే ఈ ఎయిర్‌పోర్టులో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదు. కానీ అవేమీ పట్టించుకోకుండా బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గదిలోకి వెళ్లి తమ చార్టెట్ ఫ్లైట్ క్లియరెన్స్‌కు అనుమతి ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆగస్టు 31న సూర్యాస్తమయం తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిశికాంత్ దూబె, దేవ్‌ఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ నిశికాంత్ మంజునాథ్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్తగా యూపీఏ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని రిసార్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు జార్ఖండ్‌లో పర్యటించడం, వారిపై కేసు నమోదు కావడం రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది. చదవండి: నితీశ్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు -
అభ్యర్ధి క్రిమినల్ అయినా సరే! మద్దతివ్వాలి
-
అభ్యర్ధి క్రిమినల్ అయినా సరే! మద్దతివ్వాలి..
రాంచీ : జార్ఖండ్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్ధి క్రిమినల్, దొంగ, దివ్యాంగుడైనా అతనికి అన్ని విధాలా మద్దతివ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి రఘువర్ దాస్లపై నమ్మకముంచి వారి నిర్ణయాలను గౌరవించాలి. బీజేపీ అవినీతి పార్టీ కాదు. డబ్బులు తీసుకుని టిక్కెట్ ఇచ్చే సంస్కృతి పార్టీలో లేదన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి’ అని పార్టీ శ్రేణులకు ఉద్భోదించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేత చిదంబరం లాంటి వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఇంకొద్ది రోజుల్లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఎన్నికలకు సంసిద్ధులను చేయడానికి నిర్వహించిన సమావేశంలో దూబే పైవిధంగా స్పందించారు. -
‘మోదీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లు తాగు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే కాళ్లను కడిగి ఆ నీటిని పవన్ అనే కార్యకర్త తాగిన విషయం తెలిసిందే. అ వీడియోను దుబే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంపీ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లని కడిగి.. ఆ మురికి నీళ్లను నువ్వు తాగు. దాని ద్వారా నువ్వు కూడా మోదీపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయ్యవచ్చు’’ అని ట్వీట్లో చేశారు. జార్ఖండ్‌లోని గొడ్డా నియోజకర్గంలో ఆదివారం ఓ కార్యక్రమంలో నిశికాంత్ దుబే పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్త పవన్ ఓ ప్లేట్లో ఎంపీ కాళ్లు కడిగి ఆ నీటిని తాగాడు. తనపై ఉన్న ప్రేమను పవన్ ఆ విధంగా వ్యక్తపరిచాడని దుబే సమర్ధించుకున్నాడు. ప్రజా ప్రతినిధివై ఉండి కార్యకర్తతో కాళ్లు కడిగించుకుంటావా అంటూ అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. Supporter of Nishikant Dubey washes his feet and then drinks the dirty water Dubey says it is an expression of the supporter’s love for him Will Dubeyji wash Modiji’s feet and drink the dirty water ? If not , does it mean he does not love Modi — Kapil Sibal (@KapilSibal) September 17, 2018 ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీటినే తాగి.. -
బీజేపీ ఎంపీపై నెటిజన్లు పైర్
-
ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీటినే తాగి..
జార్ఖండ్(గొడ్డా) : జార్ఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్ దుబే ఆదివారం ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్త పవన్ ఓ ప్లేట్ తీసుకొచ్చి అందులో నిశికాంత్ కాళ్లను కడిగి ఓ క్లాత్‌తో శుభ్రంగా తుడిచారు. అనంతరం ప్లేట్లో ఉన్న మట్టినీళ్లను పవన్ తాగారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు ఈ తతంగాన్నంతా చూసి పవన్ భాయ్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించి వీడియోను నిశికాంత్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ఎంపీ అయ్యి ఉండి ఓ కార్యకర్తతో అలా చేపించడమేంటని ధ్వజమెత్తారు. కాళ్లు కడిగిన నీళ్లు తాగుతుంటే ఏం చేస్తున్నావంటూ నిప్పులు చెరిగారు. ఓ కార్యకర్త తెలిసో తెలియకో అలా చేస్తే, సర్ధి చెప్పాల్సింది పోయి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆ వీడియోను నిశికాంత్ తొలగించారు. ఇది జార్ఖండ్‌లో సర్వసాధారణమని, మహాభారతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సుదామ కాళ్లు కడిగారని గుర్తు చేస్తూ ఈ సంఘటనను నిశికాంత్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు కూడా జార్ఖండ్‌లో ఇద్దరు ముస్లింలను కొట్టిచంపిన కేసులో నిందితులకు న్యాయపరంగా సాయమందిస్తానని నిషికాంత్ ప్రకటించడంతో విమర్శలపాలయ్యారు. గొడ్డా జిల్లాలో పశువుల దొంగతనం నెపంతో ఇద్దరు ముస్లిం వ్యక్తులను దాదాపు 100 మంది మూక కొట్టిచంపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. నిందితుల కుటుంబీకులు తనను కలిసి, న్యాయపరంగా సాయం కోరారని, కేసు విచారణలో భాగంగా నిందితుల లీగల్ వ్యవహారాల ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ నిందితులకు అండగా నిలుస్తానని చెప్పడం ఏంటని తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి.