
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యంపై విపక్షాలు పార్లమెంట్‌లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి జవాబు చెప్పాలని పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం 13 మంది లోక్ సభ సభ్యులు, రాజ్యసభలో ఒక ఎంపీ సస్పెన్షన్‌కు గురైనారు. అయితే తాజాగా విపక్షాల ఆందోళనలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యాలు 1974, 1994లో కూడా చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పడు జరిగింది తొలిసారి కాదని అన్నారు. పార్లమెంట్ భద్రత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కాదని అన్నారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై ప్రధాని, కేంద్ర హోం మంత్రి మాట్లాడమని విపక్షాలు ఆందోళన చేయడం సరికాదని మండిపడ్డారు. పార్లమెంట్ భద్రతా వ్యవహారం మొత్తం లోక్‌సభ సెక్యూరిటీకి సంబంధించిందని అన్నారు.
1974లో అయితే ఏకంగా ఓ వ్యక్తి రెండు తుపాకులు చేతిలో పట్టుకొని పార్లమెంట్‌లోకి వచ్చాడని తెలిపారు. కానీ, ఆనాటీ ప్రతిపక్షమైన జనసంఘ్ దాన్ని ఓ పెద్ద వివాదంగా చేయలేదని అన్నారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి బాధ్యత వహించాలని నిరసనలు తెలపలేదని అన్నారు. ఎందుకుంటే పార్లమెంట్ భద్రత.. బాధ్యత లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందినదని ఆయన ‘ఎక్స్’ ట్విటర్‌లో పేర్కొన్నారు.
कॉंग्रेसी@INCIndia डूब मरो यह है,११ अप्रैल १९७४ में पिस्तौल के साथ घुसने वाले शख़्स की कहानी,भाजपा/जनसंघ या तत्कालीन विपक्ष ने इसे राजनीतिक मुद्दा नहीं बनाया ।लोकसभा अध्यक्ष का इस्तीफ़ा नहीं मॉंगा? प्रधानमंत्री व गृहमंत्री का तो ज़िक्र तक नहीं किया,क्योंकि संसद की सुरक्षा केवल… pic.twitter.com/lOte3AOVia
— Dr Nishikant Dubey (@nishikant_dubey) December 15, 2023
చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్
Comments
Please login to add a commentAdd a comment