జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని.. తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పన బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేత సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నిశికాంత్ దుబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని, సంకీర్ణాన్ని, సీఎం హేమంత్ సోరెన్‌ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
‘ఎమ్మెల్యేగా సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా కొత్త ఏడాదిలో సోరెన్ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. త్వరలో హేమంత్ సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారు.ఆయన భార్య కల్పన సీఎం పదవిని చేపడతారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ‘ఎక్స్’ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్.. న్యాయ సలహా తీసుకోవాలని బీజేపీ పేర్కొంది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2019లో కొలుదీరిన విషయం తెలిసిందే.
झारखंड के गांडेय विधायक सरफराज अहमद ने विधानसभा से इस्तीफ़ा दिया,इस्तीफ़ा स्वीकार हुआ । हेमंत सोरेन जी मुख्यमंत्री पद से इस्तीफ़ा देंगे,झारखंड की अगली मुख्यमंत्री उनकी पत्नी कल्पना सोरेन जी होंगी । नया साल सोरेन परिवार के लिए कष्टदायक @itssuniltiwari pic.twitter.com/jl06AtXurh
— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 1, 2024
జేఎంఎం ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు జరిగే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎంపీ నిశికాంత్ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారించడానికి ఇప్పటివరకు ఈడీ.. సీఎం హేమంత్ సోరెన్‌కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సీఎం హేమంత్ సోరెన్ జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాల పైకి దర్యాప్తు సంస్థలను పంపి వాటిని వాడుకుంటోందని మండిపడ్డ విషయం తెలిసిందే.
మరోవైపు అవినీతి కేసులో ఈడీ విచారణపై సీఎం హేమంత్ సోరెన్ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం సోమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం పదవిని తన భర్య కల్పనకు అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment