Hemant Soren
-
హేమంత్ సోరేన్లా పట్టం కడతారు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డిది రివేంజ్ అని ప్రజలు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం(జనవరి 8) తెలంగాణభవన్‌లో జరిగిన కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యాక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.‘ఇప్పుడుఉన్న పరిస్ధితుల్లో ఇబ్బంది ఏం లేదు.పార్టీ పెట్టినప్పుడున్న ఉన్న పరిస్ధితి, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమర వీరులు చేసిన త్యాగాలతో పొల్చితే ఇప్పుడున్న పరిస్ధితి ఇబ్బందేం కాదు.ఇప్పుడున్న కేసు లొట్టపీసు కేసు. రేవంత్ రెడ్డి ఒక్క లొట్టపీసు ముఖ్యమంత్రి. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని, కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని ఈ అక్రమ కేసుకు భయపడుతామా.జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ పైన కేంద్రం కక్ష కడితే ప్రజలకోసం,రాష్ట్రం కోసం పోరాటం చేసి శిబు సోరెన్ కొడుకు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. లగచర్ల రైతులు తమ భూమి గుంజుకోవద్దనందుకు…40 రోజులు జైల్లో అక్రమంగా పెట్టిన దానితో పొల్చితే మనకున్న పరిస్ధితి పెద్ద ఇబ్బందేం కాదు. మనం ఇబ్బందిలో ఉన్నామని అనుకోవద్దు.మనం చేయాల్సింది రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలి.ప్రతి రైతుకి కాంగ్రెస్ ఎకరానికి రూ.17 వేలు బాకీ ఉందని చెప్పాలి. రైతు రుణమాఫీ,కౌలు రైతులకిచ్చిన కాంగ్రెస్ హమీలను ప్రశ్నించాలి.రానున్న సంవత్సరం మెత్తం రైతన్నలకు,తెలంగాణ ప్రజలకిచ్చిన హమీల అమలు,ప్రభుత్వ మోసంపైనే మాట్లాడుదాం.అంతేకానీ నాపై పెట్టిన అక్రమ కేసు గురించి అలోచించాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ కేసుపైన నేను చట్టప్రకారం కొట్లాడుతా.తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయ పడేది లేదు. హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలే అన్నీ.కాంగ్రెస్ పార్టీ నేతలు డీల్లీలోనూ అబద్దాలు అడుతున్నారు.తెలంగాణలో మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారు.తెలంగాణ కోసం మనం కలిసి నడుద్దాం.ఈ సంవత్సరాన్ని మెత్తంగా పోరాట నామ సంవత్సరంగా చేసి ప్రభుత్వంపైన పోరాటం చేద్దాం.ఒక్కొక్క పార్టీ కార్యకర్త ఒక్కో కేసీఆర్‌గా మారి పోరాటం చేయాలి.కాంగ్రెస్ చేస్తున్న అప్పుల తప్పులు,సాగునీటి ప్రాజెక్టులపైన చేస్తున్న దుప్ఫ్రచారంపైన మాట్లాడుదాం.రానున్న సంవత్సర కాలంలో నూతన కమీటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అద్యక్షుని ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్‌తో పాటు విచారణకు న్యాయవాది..హైకోర్టు షరతులు -
జార్ఖండ్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే
రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్‌లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్‌పూర్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్‌కు చెందిన దీపికా పాండే సింగ్‌లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx— ANI (@ANI) December 5, 2024Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh— ANI (@ANI) December 5, 2024 Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V— ANI (@ANI) December 5, 2024కాగా జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.#WATCH | Ranchi: After the Jharkhand cabinet expansion, CM Hemant Soren says, " As the time is moving forward, everything is happening quickly. Govt will get the direction now and we will move forward at a fast pace" pic.twitter.com/mGgfaDh0r2— ANI (@ANI) December 5, 2024ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించింది. -
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణపై జాప్యమెందుకు?
రాంచీ: జార్ఖండ్‌లో గత వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో..జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(49) గనవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోరెన్ ప్రమాణ స్వీకారం చేసి అయిదు రోజులు అవుతున్న కేబినెట్ విస్తరణపై మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది.ప్రస్తుతానికి జార్ఖండ్ కేబినెట్లో సోరెన్ ఒక్కరు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసిగా పోటీచేయడంతో.. మిత్రపక్షాల మధ్య బెర్త్‌ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక జార్ఖండ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 12 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి సోరెన్ మంత్రివర్గం భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్కో పార్టీ గెలిచిన నాలుగు స్థానాలకు గానూ ఒక మంత్రి పదవి లభించింది. ఈ ఫార్ములాతో కాంగ్రెస్‌కు నాలుగు బెర్త్‌లు, సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు స్థానాలు లభించాయి. తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు ఒక మంత్రి పదవి లభించింది.గతంతో పోల్చితే ఈసారి జేఎంఎం నాలుగు సీట్లు అదనంగా గెలుపొంది. దీంతో ఒక మంత్రి పదవికి ఐదు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనతో కాంగ్రెస్‌కు మంత్రి పదవులు తగ్గే అవకాశం ఉంది. జేఎంఎం గెలుచుకున్న 34 సీట్లతో పోలిస్తే ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆర్జేడీ ప్రస్తుతం నాలుగు సీట్లు గెలుచుకున్నందున ఒకటి కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ గతసారి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. -
జార్ఖండ్ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్(49) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెల్లని కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించిన హేమంత్ ముందుగా జేఎంఎం చీఫ్, తన తండ్రి శిబూ సోరెన్‌ను కలుసుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా రాంచీలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు. పంజాబ్ సీఎం మాన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. కాగా, సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.ఇది చారిత్రక దినంప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’లో..‘ఇది చారిత్రక దినం..రాష్ట్ర ప్రజలు ఐకమత్యమే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు. మా గొంతు నొక్కేందుకు వాళ్లు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింతగా తీవ్రతరమైంది. జార్ఖండ్ వాసులు ఎవరికీ తలొంచరు. తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుంది’అని బీజేపీను ద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా 56 సీట్లను సొంతం చేసుకుంది. 43 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా 34 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. #WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe— ANI (@ANI) November 28, 2024 -
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్
-
సీఎంగా నేడు హేమంత్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (49) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాబాది మైదానంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లను సోరెన్ బుధవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్‌తోపాటు భార్య కల్పన ఘన విజయం సాధించారు. ఆదివారం హేమంత్ సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమత, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం మాన్, హిమాచల్ సీఎం సుఖీ్వందర్..ఇంకా సీపీఎం జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఆప్ నేత కేజ్రీవాల్, శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్దవ్ ఠాక్రే,, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర ఇండియా కూట మి నేతలు హాజరవుతారని భావిస్తున్నారు. పూర్వీకుల గ్రామంలో హేమంత్ దంపతులు కాబోయే సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనతో కలిసి మంగళవారం బెంగాల్ సరిహద్దుల్లోని రామ్‌గఢ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వీకుల గ్రామం నెమ్రా ను సందర్శించారు. హేమంత్ తండ్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ ఈ గ్రామంలోనే జన్మించారు. శిబూ 15 ఏళ్లప్పుడు తండ్రి సోబరెన్ను స్థానిక వడ్దీ వ్యాపారులు చంపారు. తాత సోబరెన్ సోరెన్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని అక్కడికి వెళ్లిన హేమంత్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. గురువారం నుంచి మన ప్రభుత్వం పనిచేయనుందని వారికి చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన మీరంతా ప్రమాణ స్వీకారానికి రావాలని హేమంత్ వారిని ఆహ్వానించారు. సీఎంగా నాలుగోసారి.. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి 2013 జులై నుంచి 2014 డిసెంబర్ వరకు పనిచేశారు. రెండోసారి 2019 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ నేపథ్యంలో 2024 జనవరిలో రాజీనామా చేశారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి 2024 జూన్‌లో సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. గురువారం ఆయన నాలుగోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. -
రేపు జార్ఖండ్ లో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
ప్రధానిని కలిసిన హేమంత్ దంపతులు..
న్యూఢిల్లీ: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానంలో జార్ఖండ్ నూతన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఢిల్లీకి వెళ్లారు. కాగా రాజధాని రాంచీలోని సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి. आज दिल्ली में माननीय प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से मुलाकात कर उन्हें 28 नवंबर को अबुआ सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने हेतु आमंत्रित किया। pic.twitter.com/dPgWW6l7ir— Hemant Soren (@HemantSorenJMM) November 26, 2024మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే భార్య కల్పనా సోరెన్‌తో కలిసి న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రధాని మోదీని కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అరెస్ట్‌లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్ సోరెన్,కల్పనా సోరెన్ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్ సోరెన్ ఆదివారం (నవంబర్24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో భేటీ కానున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్ సోరెన్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత గామ్లియెల్ హెంబ్రోమ్‌ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.ఇక భర్త జైలు జీవితంతో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
Jharkhand: ‘బంటీ-బబ్లీ’ ఆరోపణలు తిప్పికొట్టిన హేమంత్ దంపతులు
రాంచీ: మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్‌లను బంటీ- బబ్లీ పేర్లతో అభివర్ణిస్తూ బీజేపీ వారిపై పలు విమర్శలు గుప్పించింది. బాలీవుడ్ సినిమా ‘బంటీ ఔర్ బబ్లీ’లో బంటీ, బబ్లీలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ అక్రమార్జన చేస్తుంటారు. ఈ పాత్రలను హేమంత్, కల్పనలకు ఆపాదిస్తూ బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నించింది. అయితే ఇప్పుడు హేమంత్, కల్పనలు విజయం సాధించి, తామేమిటో బీజేపీకి చూపించారు.జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్ ఇండియా అలయన్స్ మిత్రపక్షాలతో కలిసి జార్ఖండ్‌లో వరుసగా రెండవసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విజయం సాధించారు. దీంతో హేమంత్- కల్పన రాజకీయాల్లో శక్తివంతమైన జంటగా నిలిచారు. కల్పన తన భర్త హేమంత్ అరెస్ట్ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత సోరెన్ దంపతులు రాష్ట్రంలో 200 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు పార్టీ ఎదుర్కొన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న హేమంత్- కల్పన దంపతులు మరింత శక్తిని కూడదీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికలకు ముందు జేఎంఎం సీనియర్ నేతలు చంపై సోరెన్, సీతా సోరెన్, లోబిన్ హెంబ్రోమ్ బీజేపీలో చేరారు. దీనికితోడు భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత పార్టీ ఐక్యత దెబ్బతింది. ఇన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కల్పన పార్టీని ఐక్యంగా ఉంచడంలో విజయం సాధించారు. ఈ ప్రభావం వల్ల ఆ పార్టీకి గతంలో కంటే అధికంగా సీట్లు వచ్చాయి.గండేయ అసెంబ్లీ స్థానం నుంచి కల్పన విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో కల్పనను బయటి వ్యక్తిగా చిత్రీకరించడానికి ‘హెలికాప్టర్ మేడమ్’ అంటూ కల్పనా సోరెన్‌ను బీజేపీ విమర్శించింది. అయితే దీనివలన ప్రతిపక్షం ఏమీ ప్రయోజనం పొందకపోగా కల్పనకు జనం మద్దతు లభించింది. జేఎంఎం తిరిగి అధికారంలోకి రావడంలో గిరిజనులు కీలకపాత్ర పోషించారు. హేమంత్ సోరెన్ అరెస్టును భావోద్వేగ సమస్యగా మార్చి, గిరిజన సమాజాన్ని తనవైపు తిప్పుకోవడంలో జేఎంఎం విజయం సాధించింది.హేమంత్-కల్పన నాయకత్వంలో సాగిన జేఎంఎం ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అలాగే జెఎంఎం ప్రభుత్వ మయ్యా సమ్మాన్ యోజన ఓటర్లపై ప్రభావం చూపింది. ఈ పథకంలో 18-50 ఏళ్లలోపు మహిళలకు నెలనెలా రూ.1000 సాయం అందుతుందని, ఎన్నికల అనంతరం దీనిని రూ.2,500కు పెంచుతామని హేమంత్ హామీ ఇచ్చారు. 1.75 లక్షలకు పైగా రైతులకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. బకాయి ఉన్న విద్యుత్ బిల్లుల మాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా ప్రచారం సాగించినా ఇది ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపలేదు.ఇది కూడా చదవండి: ఒకే ఒక్కడు హేమంత్ -
జార్ఖండ్‌లో ఎన్డీఏ ఎందుకు ఓడింది ?
రాంచీ: ప్రధాని మోదీ మొదలు బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంచేసినా మెజారిటీకి సరిపడా ఓట్లు రాలకపోవడంతో బీజేపీ అధిష్టానంలో అంతర్మథనం మొదలైంది. స్థానిక అంశాలను పట్టించుకోకుండా జాతీయ అంశాలపై దృష్టిపెట్టిన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. బీజేపీ కూటమి ఓటమికి కారణాలుగా చెబుతున్న వాటిల్లో కొన్ని... ⇒ జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తరఫున బలమైన హేమంత్ సోరెన్‌కు పోటీగా బీజేపీ కూటమి గిరిజన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. ⇒ కేవలం సోరెన్ సర్కార్ అవినీతిపై, బంగ్లాదేశ్ చొరబాట్ల చుట్టూతా బీజేపీ ప్రచారం సాగింది. ⇒ సొంత రాష్ట్రంలోని నేతలను ముందుపెట్టి ప్రచారంచేయాల్సిందిపోయి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అగ్రనేతలతోనే ప్రచారపర్వాన్ని పూర్తిచేసింది. ⇒ రాష్ట్ర సీనియర్ నేతలకు తగు ప్రాధాన్యత ఇవ్వలేదు. చాన్నాళ్లుగా పార్టీనే అంటిపెట్టుకున్న వాళ్లను కాదని కాంగ్రెస్, జేఎంఎం నుంచి వలసవచి్చన నేతలకే పార్టీ టికెట్లు ఇచ్చారన్న విమర్శలొచ్చినా బీజేపీ కేంద్రనాయకత్వం పట్టించుకోలేదు. దీంతో కొందరు బీజేపీ నేతలు పార్టీని వీడారు. ⇒ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేదార్ హజ్రా, మాజీ మంత్రి లూయిస్ మరాండీలు జేఎంఎం తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఆ మేరకు ఓట్లు జేఎంఎం వైపునకు మళ్లాయి ⇒ రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి కేవలం జాతీయ అంశాలనే ప్రచారా్రస్తాలుగా చేసుకుని ముందుకెళ్లిన బీజేపీకి ఒరిగిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ బగీశ్ చంద్ర వర్మ చెప్పారు. ⇒ దశాబ్దాలుగా ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు జేఎంఎంకే ఓటేశారు. ఈసారి మహిళలు వాళ్లకు తోడయ్యారు ⇒ మైయాయ్న్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే రూ.1,000 ఆర్థికసాయాన్ని రూ.2,500కు పెంచుతానన్న జేఎంఎం హామీ బాగా పనిచేసింది. మహిళలను ఆకట్టుకునే హామీని బీజేపీ ఇవ్వలేదని తెలుస్తోంది. ⇒ నియోజకవర్గాలవారీగా చూస్తే 81 నియోజకవర్గాలకుగాను 68 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అధిక మహిళల ఓట్లతోనే జేఎంఎం అధికారాన్ని కాపాడుకోగల్గిందని వర్మ విశ్లేషించారు ⇒ కొన్ని చోట్ల లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా, ఏజేఎస్‌యూ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాయి. దీంతో బీజేపీకి నష్టం చేకూరింది. -
ప్రత్యర్థుల్ని మట్టికరిపించిన సోరెన్ దంపతులు
న్యూఢిల్లీ: ‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారుతాయి’ అనే సామెత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విషయంలో అక్షర సత్యమైంది. ఏడాది క్రితం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ జైలు పాలయ్యారు. ఇప్పుడే అదే హేమంత్ సోరెన్ మరోసారి సీఎం కుర్చీని అధిష్టించనున్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుంది. దీంతో హేమంత్ సోరెన్ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.అయితే ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో హేమంత్ సోరెన్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్ని ఆయన పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం జైలు పాలైన సోరెన్.. ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఏడాది క్రితం జైలు పాలైన సోరెన్ఈ ఏడాది జనవరిలో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన స్థానంలో తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. దీనిపై సోరెన్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ సోరెన్ తోటికోడలు సీతా సోరెన్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు విభేధించారు. బీజేపీలో చేరారు. దీంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ప్రతిపక్షాలతో కలిసి హేమంత్ సోరెన్ కల్పనా సోరెన్ కేంద్రంపై తిరుగుబాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన ఐదు నెలల తర్వాత ఈ ఏడాది జూన్‌లో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమికంగా విచారణలో నిర్ధోషిగా పరిగణించింది. ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు పేర్కొంది. దీంతో దాదాపు 5 నెలల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. తనను తప్పుడుగా ఇరికించారని.. రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కుతున్నారని.. జైలు నుంచి విడుదలైన అనంతరం హేమంత్ ఆరోపించారు.హేమంత్ సోరెన్ రాకతో చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ మరో మారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీన్ని జీర్ణించుకోలేని చంపై సోరెన్ జేఎంఎంకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హేమంత్ సోరెన్ కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. కల్పనా సోరెన్ ఒక్కరే 200పై చీలూకు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తించారు.ఇలా ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ పార్టీని ముందుండి నడిపించారు. తాజా, ఎన్నికల్లో అద్భత ఫలితాల్ని రాబట్టారు. దీంతో రెండో దఫా సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఎగ్జిట్‌పోల్స్ తలకిందులు: జార్ఖండ్‌లో మళ్లీ ఇండియా కూటమినే!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఫలితాల సరళి చూస్తుంటే అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మెజార్టీకి మించిన ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతుండగా.. ఇటు జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎమ్ఎల్) అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను(41) దాటి 50కి పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులు 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ బర్హైత్లో4,921 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఆయన సతీమణి గాండే అసెంబ్లీ స్థానం నుంచి 4,593 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన మునియా దేవి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.జేఎంఎం నుంచి ఇటీవల బీజేపీలో చేరిన చంపై సోరెన్ సెరైకెలా స్థానం నుంచి వెరెకంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి జేఎంఎం అభ్యర్థి గణేష్ మహాలీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో నాలుగుసార్లు జేఎంఎం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు చంపైధన్మర్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరండీ ఆధిక్యంలో ఉన్నారు.బీజేపీకి చెందిన సీతా సోరెన్ జమ్తారాలో వెనుకంజలో ఉన్నారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెఎస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎన్డీయేలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ , జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఉన్నాయి.చదవండి: ‘ఎన్డీయే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది’: మహా ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలుజార్ఖండ్లో అధికార మార్పిడి ఖాయమని వెల్లడించాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అంచనా వేశాయి. కానీ నేడు వెలువడుతున్న అధికారిక ఫలితాలతో గ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.కాగా రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 41. అధికార పక్షం.. జేఎంఎం 41, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. -
‘బుల్డోజర్ సిద్దంగా ఉంది’.. సీఎం యోగీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో నిలిచారు. సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టిందని ఆరోపించారు. కేంద్రం నిధులను రికవరీ చేయడానికి ‘బుల్డోజర్ సిద్ధంగా ఉంది’ అని హెచ్చరించారు. అయితే బుల్డోజర్ చర్య చట్టరిత్యా ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కొన్ని రోజులకే సీఎం ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో జార్ఖండ్‌లోని సహజ వనరులను, ప్రధాని నరేంద్ర మోదీ అందించిన కేంద్ర నిధులను కొల్లగొట్టింది. ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్ వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ఇది 'బేటీ, మటీ, రోటీ' (కుమార్తె, భూమి, రొట్టె)కి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇప్పుడు దోచుకున్న నిధులను తిరిగి పొందేందుకు బుల్డోజర్ సిద్ధంగా ఉంది’ అని జమ్తారాలో ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. .జార్ఖండ్‌లో ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగియగా.. రెండో విడత ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా యూపీలో వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఆస్తులను కూల్చివేస్తున్న యోగీ ఆదిత్యనాథ్ ‘బుల్డోజర్ బాబా’గా పేరొందారుఇక బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ధర్మాసనం తెలిపింది. నిందితులను దోషిగా చిత్రీకరించలేమని, దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీలను నాశనం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. బుల్డోజర్తో ఇంటిని కూల్చేసి మహిళలు, చిన్నారులు, వృద్ధులను రాత్రికి రాత్రి నిరాశ్రయులు చేసే దృశ్యం భయంకరమైనదని అభివర్ణించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తులు కూల్చడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలపై అనుసరించాల్సిన ప్రక్రియపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అధికారాలను వినియోగించి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. -
Amit Shah: 23న హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలే
దుమ్రీ: జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అండ్ కంపెనీకి ఈ నెల 23న బీజేపీ వీడ్కోలు పలకడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. జార్ఖండ్‌లోకి అక్రమ చొరబాట్లను హేమంత్ ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆరోపించారు. చొరబాటుదార్లు ఇక్కడి గిరిజనుల బిడ్డలను వివాహాలు చేసుకున్నారని, వారి భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి చొరబాటుదార్లను బయటకు తరిమికొడతామని, భూములను వెనక్కి తీసుకొని గిరిజనులకు అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఒక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గురువారం జార్ఖండ్‌లోని దుమ్రీలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను దోచుకుందని మండిపడ్డారు. జనం సొమ్మును కొట్టగొట్టిన హేమంత్ అండ్ కంపెనీకి వీడ్కోలు తప్పదని స్పష్టంచేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో హేమంత్ సోరెన్ జట్టుకట్టారని విమర్శించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా కోరారు. జమ్మూకశీ్మర్‌లో ఇండియాలో అంతర్భాగమని, ఆరి్టకల్ 370ని మళ్లీ తీసుకొచ్చేసత్తా ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు అప్పగించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని, రాహుల్ బాబా నా లుగో తరం కూడా ఆ పని చేయలేదని అన్నారు. చట్టంలో సవరణ తీసుకొస్తాం రాహుల్ గాందీని రాజకీయాల్లో ప్రవేశపెట్టేందుకు ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఇప్పటిదాకా 20 సార్లు ప్రయతి్నంచారని అమిత్ షా చెప్పారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, రాహుల్ గాంధీ విమానం ల్యాండ్ కాలేదని అన్నారు. 21వ ప్రయత్నంలో జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విమానం కుప్పకూలడం తథ్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో వక్ఫ్ బోర్డు హిందూ ప్రాచీన దేవాలయాల భూములను ఆక్రమించిందని ఆరోపించారు. వ్యవసాయ భూములను కూడా కబ్జా చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి కబ్జాలను అడ్డుకోవడానికి చట్టంలో సవరణ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరుగనుంది. -
PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు. మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. మాఫియాల భరతం పడతాం జార్ఖండ్‌లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్‌కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు. రాంచీలో రోడ్ షో జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. #WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB— ANI (@ANI) November 10, 2024చదవండి: 10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే -
జార్ఖండ్: జేఎంఎం కూటమీ మేనిఫెస్టో.. ఎన్ని హామీలంటే?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.6. ప్రతి బ్లాక్‌లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపుఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
జార్ఖండ్‌లో కూటమి పార్టీలు ఆరిపోయిన టపాసులు: కేంద్ర మంత్రి
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని అభివర్ణించారు. ఆయన రాష్ట్ర రాజధాని రాంచీలోని హతియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. దీపావళి పండుగ ఇప్పుడే ముగిసిపోయింది. జేఎంఎం, కాంగ్రెస్ , ఆర్జేడీ పార్టీలు ఇప్పుడు దీపావళి క్రాకర్స్‌తో కలిసిపోయాయి. కానీ, బీజేపీ మాత్రమే జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిమంతమైన రాకెట్. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుంది. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. జార్ఖండ్‌కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని నేను హేమంత్ సోరెన్‌ను అడుగుతున్నా. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది?. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్ నిలబెడతాం. మేం జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే కాకుండా వ్యవస్థను కూడా మారుస్తాం’’అని అన్నారు.మరోవైపు.. సోమవారం జార్ఖండ్‌లోని గర్వాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జేఎంఎం కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా ఉన్నందుకు జేఎంఎం నేతృత్వంలోని కూటమిని ‘చొరబాటుదారుల కూటమి’గా అభివర్ణించారు. ‘‘జార్ఖండ్‌లో బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడంలో బిజీగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గిరిజన సమాజానికి, దేశానికి పెనుముప్పు. ఈ సంకీర్ణ కూటమి.. చొరబాటుదారుల కూటమి’’ అని మోదీ అన్నారు. ఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
బంగ్లా చొరబాటుదారుల్ని ప్రొత్సహిస్తున్నారు: సోరెన్ సర్కార్‌పై మోదీ విమర్శలు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. మరో వారం రోజుల్లో పోలింగ్ ఉండటంతో.. ఎన్నికల్లో గెలుపోటములపై పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుజ్జగింపులే సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వ ప్రధాన ఎంజెడా అని మండిపడ్డారు.ఈ మేరకు రాష్ట్రంలోని గర్హ్వాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు పలుకుతోందని విమర్శలు గుప్పించారు. సంకీర్ణ ప్రభుత్వంలో బుజ్జగింపులు తీవ్రస్థాయికి చేరాయని, ఈ పార్టీలో రాష్ట్ర సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు.‘బంగ్లాదేశ్‌చొరబాటుదారులు జార్ఖండ్ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. వారి ఓట్లను పొందడానికి ప్రభుత్వం మద్దతుదారులుగా వ్యవహరిస్తోంది. సరస్వతీ వందనను(సరస్వతి గేయం) పాఠశాలలో ఆలపించేందుకు అనుమతించకపోడం ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోండి. పండుగల సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు, కర్ఫ్యూ విధించడం, దుర్గమ్మను ఆపడం అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు. చొరబాటు సమస్య కోర్టుకు వెళ్లినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. వారు మీ రోటీ, బేటీ, మాతాను తీసుకుంటున్నారని స్పష్టమైంది.జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల దుష్ట విధానాలు ఇలాగే కొనసాగితే జార్ఖండ్‌లో ఆదివాసీ సమాజం కుంచించుకుపోతుంది. కాబట్టి, ఈ చొరబాటు కూటమిని నిర్మూలించడానికి మీ ఓటును ఉపయోగించండి, కేంద్ర పథకాలను అమలు చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే జార్ఖండ్‌లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.హేమంత్ సోరెన్ లక్ష్యంగా చేసుకొని మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించడంతో చంపాయ్ సోరెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని జేఎంఎం నిర్ణయం తీసుకుంది. ఇది ఆయనకు జరిగిన తీవ్ర అన్యాయం. ఆదివాసీ బిడ్డను వారు అవమానించారు. కుటుంబం కంటే వారికి ఏది ముఖ్యం కానప్పుడు మిమ్మల్ని (రాష్ట్ర ప్రజలను) ఎలా చూసుకుంటారు. అలాంటి స్వార్థపూరిత పార్టీలకు గుణపాఠం చెప్పడం అవసరం, నాకు కుటుంబం లేదు. మీరే నా కుటుంబం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. -
జేఎంఎం అభ్యర్థుల జాబితాలు విడుదల
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బుధవారం 35 మంది పార్టీ అభ్యర్థుల పేర్లతో రెండు జాబితాలను విడుదలచేసింది. జేఎంఎం చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సొంత నియోజకవర్గమైన సహీబ్‌గంజ్ జిల్లాలోని బర్హేట్(ఎస్టీ) నుంచి, ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. కల్పన గతంలో గాండేయ్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ గెలవడం తెల్సిందే. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి, అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల జేఎంఎంలో చేరిన కేదర్ హజారా ఈసారి జమూనా(ఎస్సీ) నుంచి పోటీచేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు మహువా మాఝీ రాంచీ నుంచి పోటీచేయనున్నారు. జార్ఖండ్‌లో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్యులైన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్, జేఎంఎం 70 చోట్ల పోటీచేస్తాయి. 11 చోట్ల ఆర్జేడీ, వామపక్ష పార్టీలు పోటీచేస్తాయి. ఆర్జేడీ మంగళవారం ఆరుగురి పేర్లను ప్రకటించింది. విపక్ష బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగనుంది. మిత్రపక్షాలైన ఏజేఎస్‌యూ 10, జేడీ(యూ) రెండు, ఎల్జేపీ(రాంవిలాస్) ఒక స్థానంలో బరిలోకి దిగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు. -
Jharkhand: కుదిరిన పొత్తు.. 70 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎం పోటీ
రాంచీ: త్వరలో జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసికట్టుగా పోటీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఈ క్రమంలో అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగానూ 70చోట్ల కాంగ్రెస్, జేఎంఎం పార్టీల అభ్యర్థులను నిలబెడతారని హేమంత్ సోరెన్ వెల్లడించారు. సీట్ల పంపకాలపై ప్రస్తుతం మరిన్ని వివరాల్లోకి వెళ్లదల్చుకోలేదని, తమ మా కూటమి భాగస్వామి ప్రస్తుతం ఇక్కడ లేరని తెలిపారు. వారు వచ్చినప్పుడు మిత్రపక్షాల నేతల సమక్షంలోనే సీట్ల సంఖ్యను, ఇతర వివరాలను ఖరారు చేసుకుంటామని పేర్కొన్నారు. మిగతా 11 స్థానాల్లో ఇతర కూటమి భాగస్వాములు ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.కాగా జార్ఖండ్ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా.. అదే నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గత ఎన్నికల్లో జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేశాయి. జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒక సీటు గెలుచుకున్నాయి. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈసారి జేఎంఎం తమ సీట్ల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆర్జేడీ అసంతృప్తిసోరెన్ ప్రకటనపై ఆర్జేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జేఎంఎం, కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయంటూ స్పందించింది. ఎన్నికల్లో పోటీ విషయంలో తమ ముందు అన్ని అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 15- 18 స్థానాల్లో ఒంటరిగానే బీజేపీను ఓడించే సత్తా ఆర్జేడీకి ఉందని వ్యాఖ్యానించింది. డీజీపీపై వేటుఇదిలా ఉండగా ఝార్ఖండ్ తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాపై భారత ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. -
జార్ఖండ్‌లో ఎన్ఆర్సీ అమలు చేస్తాం: కేంద్ర మంత్రి
రాంచి: తాము జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం చొరబాటుదారులుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. ఈ ఎన్నికలు ఒకరిని ముఖ్యమంత్రిగా చేయటం లేదా అధికారాన్ని అప్పగించటం మాత్రమే కాదు. ఇది జార్ఖండ్‌ను రక్షించడం గురించి జరిగే ఎన్నికలు. రోటీ, మతీ, భేటీ రక్షిండానికి బీజేపీ నిశ్చయించుకుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఈ ప్రాంతం జనాభా వేగంగా మారుతోంది. దీంతో సంతాల్ ప్రాంతంలోని గిరిజన జనాభా ఇప్పుడు 28 శాతానికి తగ్గింది...ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అనుకూలంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే.. జార్ఖండ్‌లో ఎన్ఆర్సీని అమలు చేస్తాం. దీనిలో స్థానిక నివాసితులను నమోదు చేస్తారు. చొరబాటుదారులను ఎంపిక చేసి బయటకు పంపుతారు’’ అని అన్నారు.జార్ఖండ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అక్టోబరు 5న యువత, మహిళల కోసం ‘పాంచ్ ప్రాణ’ను విడుదల చేసిందని తెలిపారు. బీజేపీ.. యువ సతి, గోగో దీదీ యోజన, ఘర్ సాకార్, లక్ష్మీ జోహార్ , ఉపాధి కల్పిస్తామని హామీ వంటి ఐదు వాగ్దానాలు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక.. ప్రస్తుత ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వ పదవీకాలం 2025 జనవరిలో ముగియనుంది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్ఆర్సీ అంటే..అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. అయితే.. దీనిపైనా వివాదం కొనసాగుతోంది.చదవండి: సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’ -
హేమంత్ అవినీతి సీఎం: రాజ్‌నాథ్
ఇట్ఖోరి (జార్ఖండ్): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అత్యంత అవినీతిపరుడైన సీఎంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ఆడుకున్నారని విమర్శించారు. సోరెన్‌ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్రను ఇట్ఖోరిలో శనివారం రాజ్‌నాథ్ ప్రారంభించారు. హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి మరకలున్న వారిని భారత్ ఎప్పటికీ ఆమోదించబోదన్నారు. బీజేపీ సీఎంలు బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, రఘుబర్ దాస్‌లు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదన్నారు. అధికారిక కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలను జార్ఖండ్ ప్రగతిని అడ్డుకుంటున్న స్పీడ్‌బ్రేకర్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, రొహింగ్యా చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని రాజ్‌నాథ్ ఆరోపించారు. -
సీఎం మమత కీలక నిర్ణయం.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
కోల్‌కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.అయితే జార్ఖండ్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్‌ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు. -
దారుణంగా అవమానించారు
రాంచీ: ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచి్చందని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ నాయకుడు చంపయ్ సోరెన్ అన్నారు. బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపయ్ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది. ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కలి్పంచారని చంపయ్ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారు: హేమంత్బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్‌కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు. ‘సమాజాన్ని విభజించడం మాట అటుంచితే.. వీళ్లు కుటుంబాలకు, పారీ్టలను కూడా చీల్చుతారు. ఎమ్మెల్యేలకు ఎర వేస్తారు. డబ్బు నాయకులను పార్టీలు మారేలా చేస్తుంది’ అని హేమంత్ పరోక్షంగా చంపయ్‌ను విమర్శించారు.