న్యూఢిల్లీ: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానంలో జార్ఖండ్ నూతన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఢిల్లీకి వెళ్లారు. కాగా రాజధాని రాంచీలోని సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి.
आज दिल्ली में माननीय प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से मुलाकात कर उन्हें 28 नवंबर को अबुआ सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने हेतु आमंत्रित किया। pic.twitter.com/dPgWW6l7ir
— Hemant Soren (@HemantSorenJMM) November 26, 2024
మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే భార్య కల్పనా సోరెన్‌తో కలిసి న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రధాని మోదీని కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..
Comments
Please login to add a commentAdd a comment