రాజకీయాల్లోకి హేమంత్‌ సోరెన్‌ భార్య | Former CM Hemant Soren Wife Kalpana Will Enter Politics | Sakshi
Sakshi News home page

Jharkhand: రాజకీయాల్లోకి హేమంత్‌ సోరెన్‌ భార్య

Mar 4 2024 7:45 AM | Updated on Mar 4 2024 7:45 AM

Former CM Hemant Soren Wife Kalpana Will Enter Politics - Sakshi

భూ కుంభకోణం కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు కోర్టు నుంచి ఇంకా ఉపశమనం లభించలేదు. హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌ తర్వాత జేఎంఎం నేత చంపై సోరెన్‌ జార్ఖండ్‌ సీఎం అయ్యారు.  ఇదిలావుండగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. 

హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన సమయంలో కల్పనను జార్ఖండ్‌కు కొత్త సీఎం చేయాలనే చర్చ జరిగింది అయితే, చివరి నముషంలో చంపై సోరెన్‌ను సీఎం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గిరిడిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆమె జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే హేమంత్ సోరెన్‌ను కూడా కలిశారు.

కల్పనా సోరెన్ తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయాన్ని హేమంత్ సోరెన్ ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. ‘జార్ఖండ్ ప్రజల కోరిక మేరకు నేను ప్రజా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. హేమంత్ మన మధ్యకు వచ్చే వరకు, నేను అతని వాయిస్‌ వినిపిస్తాను. అతని ఆలోచనలను అందరితో పంచుకుంటాను. నేను ప్రజాసేవ సేవ చేస్తూనే ఉంటాను. మీరు హేమంత్‌కు ఎంతటి ఆప్యాయత, దీవెనలు అందించారో అతని జీవిత భాగస్వామినైన నాకు కూడా అందిస్తారని నేను నమ్ముతున్నాను’ అని రాశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement