kalpana
-
Jharkhand: ‘బంటీ-బబ్లీ’ ఆరోపణలు తిప్పికొట్టిన హేమంత్ దంపతులు
రాంచీ: మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్‌లను బంటీ- బబ్లీ పేర్లతో అభివర్ణిస్తూ బీజేపీ వారిపై పలు విమర్శలు గుప్పించింది. బాలీవుడ్ సినిమా ‘బంటీ ఔర్ బబ్లీ’లో బంటీ, బబ్లీలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ అక్రమార్జన చేస్తుంటారు. ఈ పాత్రలను హేమంత్, కల్పనలకు ఆపాదిస్తూ బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నించింది. అయితే ఇప్పుడు హేమంత్, కల్పనలు విజయం సాధించి, తామేమిటో బీజేపీకి చూపించారు.జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్ ఇండియా అలయన్స్ మిత్రపక్షాలతో కలిసి జార్ఖండ్‌లో వరుసగా రెండవసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విజయం సాధించారు. దీంతో హేమంత్- కల్పన రాజకీయాల్లో శక్తివంతమైన జంటగా నిలిచారు. కల్పన తన భర్త హేమంత్ అరెస్ట్ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత సోరెన్ దంపతులు రాష్ట్రంలో 200 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు పార్టీ ఎదుర్కొన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న హేమంత్- కల్పన దంపతులు మరింత శక్తిని కూడదీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికలకు ముందు జేఎంఎం సీనియర్ నేతలు చంపై సోరెన్, సీతా సోరెన్, లోబిన్ హెంబ్రోమ్ బీజేపీలో చేరారు. దీనికితోడు భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత పార్టీ ఐక్యత దెబ్బతింది. ఇన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కల్పన పార్టీని ఐక్యంగా ఉంచడంలో విజయం సాధించారు. ఈ ప్రభావం వల్ల ఆ పార్టీకి గతంలో కంటే అధికంగా సీట్లు వచ్చాయి.గండేయ అసెంబ్లీ స్థానం నుంచి కల్పన విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో కల్పనను బయటి వ్యక్తిగా చిత్రీకరించడానికి ‘హెలికాప్టర్ మేడమ్’ అంటూ కల్పనా సోరెన్‌ను బీజేపీ విమర్శించింది. అయితే దీనివలన ప్రతిపక్షం ఏమీ ప్రయోజనం పొందకపోగా కల్పనకు జనం మద్దతు లభించింది. జేఎంఎం తిరిగి అధికారంలోకి రావడంలో గిరిజనులు కీలకపాత్ర పోషించారు. హేమంత్ సోరెన్ అరెస్టును భావోద్వేగ సమస్యగా మార్చి, గిరిజన సమాజాన్ని తనవైపు తిప్పుకోవడంలో జేఎంఎం విజయం సాధించింది.హేమంత్-కల్పన నాయకత్వంలో సాగిన జేఎంఎం ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అలాగే జెఎంఎం ప్రభుత్వ మయ్యా సమ్మాన్ యోజన ఓటర్లపై ప్రభావం చూపింది. ఈ పథకంలో 18-50 ఏళ్లలోపు మహిళలకు నెలనెలా రూ.1000 సాయం అందుతుందని, ఎన్నికల అనంతరం దీనిని రూ.2,500కు పెంచుతామని హేమంత్ హామీ ఇచ్చారు. 1.75 లక్షలకు పైగా రైతులకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. బకాయి ఉన్న విద్యుత్ బిల్లుల మాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా ప్రచారం సాగించినా ఇది ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపలేదు.ఇది కూడా చదవండి: ఒకే ఒక్కడు హేమంత్ -
ఫోన్‌తో ఎన్నికల ర్యాలీలో ప్రచారం.. ఈసీపై సీఎం సతీమణి ఆగ్రహం
రాంచీ: జార్ఖండ్‌లోని 43 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న(రేపు) తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముగించేశాయి. తాజాగా.. సీఎం హేమంత్ సోరెన్ సతీమణి, జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు ఆరోపణలు చేశారు. తన ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్‌ను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిందని, దీంతో ఫోన్లోనే తాను సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు.పశ్చిమ సింగ్భూమ్ జిల్లా జగన్నాథ్‌పూర్ నియోజకవర్గంలోని మౌలానగర్ మైదానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫోన్ ద్వారా ఆమె ప్రసంగిస్తూ.. జార్ఖండ్‌లో జేఎంఎం మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లను వినియోగించకుండా ఎన్నికల సంఘం అడ్డుకున్నదని ఆమె ఆరోపించారు. బీజేపీని టార్గెట్ చేసిన ఆమె ఆడపిల్లలు చదువుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనేది బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో పాఠశాలలను మూసేయడానికి ఇదే కారణమని ఆరోపించారు.బీజేపీ పార్టీ ధనవంతులు, వ్యాపారుల పార్టీ అని కల్పన కల్పనా సోరెన్ అభివర్ణించారు. గిరిజనం అనే పదాన్ని బీజేపీ ద్వేషిస్తుందని, వారి సంస్కృతిని, గుర్తింపును నాశనం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆమె ఆరోపించారు. ఆదివాసీ తెగ 'సర్నా కోడ్'ను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని ఆమె ప్రశ్నించారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి సోనారామ్ సింకుకు ఓటు వేయాలని కల్పనా సోరెన్ విజ్ఞప్తి చేశారు. అయితే కల్పనా సోరెన్ చేసిన ఆరోపణలపై జార్ఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ స్పందిస్తూ ఒడిశా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాల కదలిక కారణంగా కల్పనా సోరెన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గంటపాటు ఘట్సిలా వద్ద నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఉదంతంలో ఓ అధికారిని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో -
జేఎంఎం అభ్యర్థుల జాబితాలు విడుదల
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బుధవారం 35 మంది పార్టీ అభ్యర్థుల పేర్లతో రెండు జాబితాలను విడుదలచేసింది. జేఎంఎం చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సొంత నియోజకవర్గమైన సహీబ్‌గంజ్ జిల్లాలోని బర్హేట్(ఎస్టీ) నుంచి, ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. కల్పన గతంలో గాండేయ్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ గెలవడం తెల్సిందే. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి, అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల జేఎంఎంలో చేరిన కేదర్ హజారా ఈసారి జమూనా(ఎస్సీ) నుంచి పోటీచేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు మహువా మాఝీ రాంచీ నుంచి పోటీచేయనున్నారు. జార్ఖండ్‌లో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్యులైన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్, జేఎంఎం 70 చోట్ల పోటీచేస్తాయి. 11 చోట్ల ఆర్జేడీ, వామపక్ష పార్టీలు పోటీచేస్తాయి. ఆర్జేడీ మంగళవారం ఆరుగురి పేర్లను ప్రకటించింది. విపక్ష బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగనుంది. మిత్రపక్షాలైన ఏజేఎస్‌యూ 10, జేడీ(యూ) రెండు, ఎల్జేపీ(రాంవిలాస్) ఒక స్థానంలో బరిలోకి దిగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు. -
బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది: కల్పనా సోరెన్
రాంచీ: బీజేపీ ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’ మారిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ విమర్శలు చేశారు. జార్ఖండ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలను బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ చర్యలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు.సోమవారం ‘మైయాన్ సమ్మాన్ యాత్ర'లో భాగంగా గుమ్లా జిల్లాలో జరిగిన ర్యాలీలో కల్పనా సోరెన్ మాట్లాడారు.‘‘జార్ఖండ్ ముఖ్యమంత్రి మైయాన్ సమ్మాన్ యోజన (జేఎంఎంఎస్‌వై)కి వ్యతిరేకంగా బీజేపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రజలకు మంచి చేసే ఏ పాలసీని ప్రవేశపెట్టినా.. బీజేపీ పిల్ వేస్తుంది. జార్ఖండ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచచ్చే పథకాలకు అడ్డంకులు సృష్టించేందుకు ‘పిల్ మాస్టర్ గ్యాంగ్’గా మారింది’’ అని అన్నారు.గిరిజన వర్గాల డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ విస్మరిస్తోందని కల్పనా సోరెన్ మండిపడ్డారు. ఆదివాసీల గుర్తింపు వారి సంస్కృతి, సర్నా మత నియమావళిలో ఉందని తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలో మేము ఈ కోడ్ కోసం తీర్మానాన్ని ఆమోదించామని అన్నారు. కానీ మన సంస్కృతిని రక్షించడానికి, ప్రత్యేక సర్నా కోడ్‌ను అందించటం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. జార్ఖండ్, గిరిజనుల గుర్తింపు సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే కాపాడగలదని అన్నారామె.చదవడి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’.. దిగ్విజయ్ చౌతాలా ఆసక్తికర వ్యాఖ్యలు -
Kalpana Shah: 'The Whole 9 Yards' దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది..
చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్కే దక్కుతుంది! ఆ లిస్ట్‌లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్‌కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్‌లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్కి .. మోడల్స్‌ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసి మరీ ఎక్స్పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్లో, ఇండస్ట్రియలిస్ట్‌ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా మార్చింది.ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్‌గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.ఆథర్‌గా.. చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్‌లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్‌లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది! -
దళితులపై దాష్టీకం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల దాషీ్టకాలు మరింత పెచ్చుమీరాయి. దళిత మహిళలను అకారణంగా చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్ బండగుంత వద్ద దళిత మహిళలు పద్మ, కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంపచెట్ల వల్ల ఇళ్లలోకి పాములు చేరుతున్నాయని, వాటిని తొలగించాలని మునిసిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మునిసిపల్ సిబ్బంది సోమవారం కంపచెట్లు తొలగించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ ముతుకూరు బీబీ.. ‘వాళ్లు వైఎస్సార్సీపీ వలంటీర్లుగా పనిచేశారు. వాళ్లు చెబితే కంపచెట్లు ఎలా తొలగిస్తార’ంటూ మునిసిపల్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. దీంతో దళిత మహిళలకు, టీడీపీ వార్డు ఇన్చార్జ్ ముతుకూరు బీబీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీబీ దళిత మహిళలపై చేయిచేసుకుంది. దీంతో వారు కూడా ఆమెను ప్రతిఘటించారు. దీన్ని అవమానంగా భావించిన బీబీ తన సోదరుడైన నాగూర్ హుస్సేన్‌కు జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతి, తలపై దాడి చేశారు. కొట్టొద్దంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. నాగూరు హుస్సేన్ గతంలో నేరచరితుడు కావడంతో మహిళల హాహాకారాలు విన్న స్థానికులు కనీసం విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు బాధిత మహిళలు ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. పట్టించుకోని పోలీసులు ఈ అమానుష దాడి సోమవారం జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న బాధిత మహిళలు పద్మ, కల్పనను బంధువులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల బంధువులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాస్పత్రిలో సైతం ఎంఎల్సీ (మెడికో లీగల్ కేస్) నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడా పట్టించుకోలేదు.‘చంపేస్తారు.. కాపాడండి’ ‘సార్.. మేం దళిత మహిళలం. ఇంటిముందు కంపచెట్లు తొలగించమని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకులు చెప్పుకోలేని రీతిలో కులం పేరుతో తిడుతూ ఇష్టానుసారం చిత్రవథ చేసి కొట్టారు. పోలీసులకు చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మేం సాధారణ మహిళలం. భవిష్యత్‌లో మమ్మల్ని బతకనిస్తారన్న నమ్మకం లేదు. కచి్చతంగా చంపేస్తారు. దయవుంచి కాపాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్‌ను, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నాగూర్‌హుస్సేన్, ముతుకూరు బీబీ, స్టాలిన్, జగ్గు, కుళ్లాయప్ప, జగదీ‹Ù, అల్లాబకాష్ తమపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ కోరేందుకు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కల్పనా సోరెన్‌కు కీలక బాధ్యతలు?
ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్డీఏ తన ప్రణాళికను జూలై నుంచి అమలుచేయనుంది. ఇండియా అలయన్స్ కూడా తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది.జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) స్టార్ క్యాంపెయినర్‌గా కల్పనా సోరెన్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆమెకు జేఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన అనంతరం కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో జేఎంఎం ర్యాలీల్లో కల్పన చురుగ్గా పాల్గొన్నారు. గాండే ఉప ఎన్నికలో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. హేమంత్ సోరెన్ అరెస్టు దరిమిలా కల్పన తన భర్తను తప్పుడు ఆరోపణలతో జైలులో పెట్టారని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.త్వరలోనే హేమంత్ సోరెన్ నిర్దోషిగా విడుదలవుతారని, ఇండియా అలయన్స్ నుంచి ముఖ్యమంత్రి అవుతారని కల్పన చెబుతున్నారు. మరోవైపు మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైలు నుండి బయటకు రానిపక్షంలో పార్టీ కల్పనా సోరెన్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్న కల్పనా సోరెన్!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్పనా సోరెన్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం జార్ఖండ్‌లో జరిగిన ఘటన మాదిరిగానే ఢిల్లీలో కూడా జరిగిందని అన్నారు. తాను సునీతను కలుసుకునేందుకు వచ్చానని, ఆమె భాధ్యతలను కూడా పంచుకుంటానని అన్నారు. తాము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశామని కల్పనా సోరెన్ చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రం అరవింద్ కేజ్రీవాల్ వెంట ఉంటుందని, తాను కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ సోనియా గాంధీని కలవబోతున్నానన్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభకు హాజరవుతానన్నారు. #WATCH दिल्ली: झारखंड मुक्ति मोर्चा(JMM) नेता और पूर्व सीएम हेमंत सोरेन की पत्नी कल्पना सोरेन ने कहा, "जैसी घटना 2 महीने पहले झारखंड में हुई थी दिल्ली में भी वैसा ही कुछ हुआ है... मैं सुनीता केजरीवाल से मिलकर उनका दुख दर्द बांटने आई थी। हमने मिलकर प्रण लिया है कि इस लड़ाई को हमें… https://t.co/YzQ1M0Mktw pic.twitter.com/9JjhaVS7fR — ANI_HindiNews (@AHindinews) March 30, 2024 కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ ఇద్దరి పరిస్థితులు ఒకేలాంటివని విశ్లేషకులు అంటారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కల్పనా సోరెన్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా, అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసే వరకు సునీతా కేజ్రీవాల్ తన ఇంటికి, కుటుంబానికే పరిమితమయ్యారు. హేమంత్ సోరెన్-అరవింద్ కేజ్రీవాల్‌ల అరెస్ట్ తర్వాత కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్‌లు తదుపరి బాధ్యతలను స్వీకరించడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వారిద్దరూ ఈడీ రిమాండ్‌లో ఉన్న తమ భర్తలను కలుసుకుని వారికి ధైర్యాన్ని అందిస్తూనే, మరో వైపు పార్టీని ఐక్యంగా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. -
సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్‌లు సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘సునీతా జీతో ఆవేదన, బాధను పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. ఆమె తన పరిస్థితిని వివరించారు. తుది వరకు పోరాడాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. యావత్తూ జార్ఖండ్ ప్రజలు కేజ్రీవాల్ వెన్నంటే ఉంటారు’అని చెప్పారు. ‘జార్ఖండ్‌లో రెండు నెలల క్రితం జరిగిందే ఢిల్లీలో పునరావృతమైంది. నా భర్త హేమంత్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. జార్ఖండ్, ఢిల్లీల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’అని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి, పరిస్థితిని వివరిస్తానన్నారు. భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కల్పనా సోరెన్, జార్ఖడ్ సీఎం చంపాయి సోరెన్‌తోపాటు ఆదివారం ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. సునీతా కేజ్రీవాల్ కూడా ర్యాలీలో పాలు పంచుకుంటారని ఆప్ నేతలు తెలిపారు. -
రాజకీయాల్లోకి హేమంత్ సోరెన్ భార్య
భూ కుంభకోణం కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు కోర్టు నుంచి ఇంకా ఉపశమనం లభించలేదు. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జేఎంఎం నేత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. ఇదిలావుండగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన సమయంలో కల్పనను జార్ఖండ్‌కు కొత్త సీఎం చేయాలనే చర్చ జరిగింది అయితే, చివరి నముషంలో చంపై సోరెన్‌ను సీఎం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గిరిడిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆమె జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే హేమంత్ సోరెన్‌ను కూడా కలిశారు. కల్పనా సోరెన్ తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయాన్ని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. ‘జార్ఖండ్ ప్రజల కోరిక మేరకు నేను ప్రజా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. హేమంత్ మన మధ్యకు వచ్చే వరకు, నేను అతని వాయిస్ వినిపిస్తాను. అతని ఆలోచనలను అందరితో పంచుకుంటాను. నేను ప్రజాసేవ సేవ చేస్తూనే ఉంటాను. మీరు హేమంత్‌కు ఎంతటి ఆప్యాయత, దీవెనలు అందించారో అతని జీవిత భాగస్వామినైన నాకు కూడా అందిస్తారని నేను నమ్ముతున్నాను’ అని రాశారు. आज अपने जन्मदिन और कल गिरिडीह में झामुमो के स्थापना दिवस कार्यक्रम में शामिल होने से पहले आज झारखण्ड राज्य के निर्माता और झामुमो के माननीय अध्यक्ष आदरणीय बाबा दिशोम गुरुजी और मां से आशीर्वाद लिया। आज ही सुबह हेमन्त जी से भी मुलाकात की। मेरे पिता भारतीय सेना में थे। वह सेना से… pic.twitter.com/IBZmBVnXr9 — Hemant Soren (@HemantSorenJMM) March 3, 2024 -
హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు?
జార్ఖండ్ రాజకీయాలు రోజరోజుకీ ఉత్కంఠగా మారాయి. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నించడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన భార్య కల్పనా సోరెన్ పేరు తెరమీదకు వచ్చింది. సోరెన్ అరెస్ట్ అయితే కల్పనా తదుపరి జార్ఖండ్ సీఎం అవుతారని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో తనను ఈడీ అరెస్ట్ చేస్తే భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని హేమంత్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేల సమావేశంలో ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హేమంత్ సోరెన్.. తన భార్య కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే వ్యాఖ్యలు చేయడం ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తున్నాయి. ఒకవేళ అవినీతి కేసుల వల్ల హేమంత్ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే.. పార్టీలో పూర్తిగా చక్రం తిప్పేది కల్పనయే. ఎవరీ కల్పనా కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కూడా కాదు. ఆమె రాజకీయంగా ఎలాంటి పదవిలో లేరు. కానీ పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. రాజకీయాల్లో హేమంత్‌కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది. కల్పనా ముఖ్యమంత్రి పదవిని చేపడితే... ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ఓ ట్విట్స్ ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం ఇంకా ఏడాది కంటే తక్కే ఉంది. ఈ సమయంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేకపోవచ్చు. మరి ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సి ఉంది. సేంద్రీయ వ్యవసాయంపై మక్కువ ఇక ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన కల్పన 1976లో రాంచీలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి గృహిణి. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యూయెట్ చేసిన కల్పనా తరువాత ఎంబీఏ చేశారు. ఫిబ్రవరి 7, 2006న హేమంత్ సోరెన్‌ను వివాహం చేసుకుంది. వీరికి నిఖిల్, అన్ష్ ఇద్దరు పిల్లలు. కల్పనా సోరెన్ ఒక పాఠశాలను నడుపుతుండటంతోపాటు సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తున్నారు. చదవండి: మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్ 2022లో వార్తల్లోకి దాదాపు రూ. 5 కోట్ల ఖరీదు చేసే మూడు వాణిజ్య భవనాలు ఆమె పేరిట ఉన్నాయి. మహిళలు, పిల్లల సాధికారతపై కార్యక్రమాలకు కూడా తరుచుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే 2022లో తన భార్యకు(కల్పనా సోరెన్) చెందిన కంపెనీకి పారిశ్రామిక ప్రాంతంలో ప్లాట్‌ను కేటాయించేందుకు సోరెన్ తన పదవిని దుర్వినియోగం చేశారని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆరోపణలు చేయడంతో కల్పనా పేరు వార్తల్లో నిలిచింది. 30 గంటల తర్వాత ప్రతక్ష్యం భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం, మంగళవారం సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆయన 27వ తేదీ రాత్రి నుంచి అందుబాటులో లేకుండా పోవడంతో ఇంట్లో తనిఖీలు చేపట్టి రూ. 36 లక్షలతోపాటు బీఎండబ్ల్యూకారు, కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 30 గంటల తర్వాత సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం సాయంత్రం రాంచికీ చేరుకొని పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా పాల్గొన్నారు. -
సుపారీ ఇచ్చి.. భర్తను హత్య చేయించి
జోగిపేట (అందోల్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి భర్తను భార్య హత్య చేయించి మృతదేహాన్ని తగలబెట్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శనివారం వెలుగుచూసింది. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్ కథనం ప్రకారం.. జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం(30)కు అందోల్ మండలం మన్ సాన్‌పల్లికి చెందిన కల్పనతో 2015లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జోగిపేట పట్టణం అందోల్‌లోని డబుల్ బెడ్రూం కాలనీల వద్ద వీరు నివాసం ఉంటున్నారు. కల్పనకు మన్సాన్పల్లికి చెందిన మస్కూరి మహేశ్‌తో పెళ్లికి మందు నుంచీ సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయమై మల్లేశం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి విషయం ప్రియుడు మస్కూరి మహేశ్‌కి వివరించింది. దీంతో మహేశ్.. రంగంపేటకు చెందిన తన మేనబావ ఉసికే అంబాజీకి చెప్పగా, అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తలారి మహేశ్‌తో పరిచయం చేయించి, రూ.50 వేలకు హత్య చేసేలా సుపారీ మాట్లాడుకున్నారు. అడ్వాన్సుగా రూ.5 వేలు ఇవ్వగా, పలుమార్లు మరో రూ.30 వేలను అందజేశారు. ఈ విషయంలో తన స్నేహితుడు, గంగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వజ్జరి మహేశ్ సహకారం తీసుకున్నారు. హత్య జరిగిందిలా.. వజ్జరి మహేశ్, మస్కూరి మహేశ్, తలారి మహేశ్.. ఈ ముగ్గురూ ఓ కారు అద్దెకు తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున కల్పన ఇంటి వద్దకు వెళ్లి కాపుకాశారు. 5:30 గంటల ప్రాంతంలో మల్లేశం బయటకు రాగానే అతని తలపై బండరాయితో మస్కూరి మహేశ్ బలంగా కొట్టడంతో స్పృహకోల్పోయాడు. వెంటనే అతడిని కారులో వేసుకుని సంగుపేట వైపు వెళ్లారు. మల్లేశం చేతులను కట్టేసి, గొంతు నొక్కడంతో అతను కారులోనే మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం కోనాపూర్ చెరువు వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మల్లేశం భార్య కల్పనను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి. నిందితులు మస్కూరి మహేశ్, కల్పన, తలారి మహేశ్, వజ్జరి మహేశ్, ఉసికే అంబాజీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా కేసును కేవలం 22గంటల వ్యవధిలో ఛేదించిన జోగిపేట పోలీసులను ఎస్పీ రూపేశ్ అభినందించారు. -
ప్రౌడ్ మూమెంట్
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించిన జాల్నా–ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో–పైలట్ అయిన కల్పన ధనవత్ సోషల్ మీడియా అట్రాక్షన్‌గా మారింది. 27 సంవత్సరాల కల్పన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత అసిస్టెంట్ లోకో–పైలట్‌గా చేరింది. ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కల్పన సెలబ్రిటీగా మారింది. సెల్ఫోన్లో ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. ‘ప్రౌడ్ మూమెంట్: గర్ల్ ఫ్రమ్ పూలంబ్రీ బికమ్స్ ది ఫస్ట్ ఉమన్ లోకో–పైలట్ ఆఫ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు ‘ఎక్స్చేంజింగ్ ఆఫ్ సిగ్నల్స్ బిట్వీన్ లోకో– పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో – పైలట్ ఆఫ్ జాల్నా–ముంబై ఎక్స్‌ప్రెస్’ కాప్షన్‌తో రైల్వేశాఖ పోస్ట్ చేసిన కదులుతున్న ట్రైన్ వీడియో కూడా ఆట్టుకుంటోంది. -
ఉన్నదంతా దానం చేసిన కమెడియన్.. చివరిరోజుల్లో తిండి లేక చనిపోయింది!
కల్పనా రాయ్.. ఈ పేరు చెప్తే చాలు చాలామంది పెదాలపై వారికి తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. తరతరాలకు సరిపడేంత నవ్వులు పంచి వెళ్లిపోయింది ఈ మహానటి. తన యాసతో డైలాగ్‌కే వన్నె తెచ్చిన ఈమె 430కు పైగా చిత్రాల్లో నటించింది. జంబలకిడి పంబ, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని గుర్తుండిపోయే సినిమాలు చేసింది. వందల సినిమాలు చేసిన ఈ నటి చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడింది. అంత పెద్ద నటికి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తన చివరి రోజుల్లో ఏం జరిగింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. తెలుగింటి ఆడపడుచు కల్పనా రాయ్ తెలుగింటి ఆడపడుచు. 1950లో కాకినాడలో జన్మించింది. ఆమె అసలు పేరు సత్యవతి. యుక్తవయసులో ఆమె ఎంతో అందంగా ఉండేది. ఒంటినిండా బంగారు నగలు వేసుకుని ఆమె నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలేవి కాదట! 'నీడలేని ఆడది' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది కల్పన. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల కొద్దీ సినిమాలు చేసింది. అందరికీ తనే స్వయంగా అన్నం వండి వడ్డించేది. కో డైరెక్టర్లు సహా ఎంతోమంది ఆమె చేతివంట తిని కడుపు నింపుకునేవాళ్లు. వెన్నలాంటి మనసు ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేది. అంతటి దయామయురాలు కల్పనా రాయ్. తన దానధర్మాల వల్ల ఉన్న బంగారం, ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు. అప్పు చేసైనా సరే అందరికీ భోజనం పెట్టేది. ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది. డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు. దిగులు వల్లో మరింకేదో కానీ కల్పన లావెక్కింది. కూతురు పారిపోవడంతో ఒంటరి ఈ నటి ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఒకమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆమె యుక్తవయసుకురాగానే ఒకరిని ప్రేమించి అతడితో పారిపోయింది. అప్పుడు కల్పన పడ్డ బాధ వర్ణణాతీతం. ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. అప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయింది. ఉన్న డబ్బు కూడా ఆవిరవడంతో పలకరించే నాధుడే కరువయ్యాడు. ఒంటరిగా మిగిలిపోయింది. చనిపోయేముందు దాదాపు పది రోజులపాటు తిండి లేక ఆకలికి అలమటించింది. తన శరీరం ఆకలికి తట్టుకోలేక హృదయ విదారక స్థితిలో ఆమె కన్నుమూసింది. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు 'కల్పనా రాయ్ చనిపోయినప్పుడు ఆమె చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని దుస్థితికి చేరుకుంది. ఆమె అతి మంచితనం వల్ల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయింది. ఇంతటి దుస్థితి ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు సాయం చేస్తే కానీ ఆమె అంత్యక్రియలు జరగలేదు' అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకుంది నటి జయశ్రీ. చదవండి: Sushmita Sen: పెళ్లి చేసుకుంటానంటే.. దేనికి? మాకైతే తండ్రి అక్కర్లేదంటున్నారు పిల్లలు.. -
టీడీపీలో ఉన్నా.. లేకున్నా ఒక్కటే
తిరుపతి మంగళం: ‘భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశాం. పార్టీ కోసం ఎనలేని సేవలందించాం. జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందినట్టుగా టీడీపీ ప్రభుత్వంలో ఏనాడు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందలేదు. ప్రజలకు మేలు చేయని టీడీపీలో ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే. జగనన్న లాంటి నాయకుడు మళ్లీ సీఎం కావాలి’ అంటూ తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా పోటీచేసిన గుర్రమ్మ చెప్పారు. తిరుపతి నెహ్రూనగర్‌లో గురువారం కార్పొరేటర్ కల్పనయాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఎస్కే ఇమ్రాన్‌బాషా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ నారాయణ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ డివిజన్ నుంచి పోటీచేసిన గుర్రమ్మ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను కూడా జగనన్న సంక్షేమ పథకాల ద్వారా రూ. 11 లక్షలు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే భూమనకు ఆమె సంతోషంగా చెప్పారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ‘సీఎం వైఎస్ జగన్ కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప నాయకుడు. చంద్రబాబు ధనవంతులకు కొమ్ముకాస్తే, జగనన్న పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. అలాంటి గొప్ప నాయకుడికి అండగా ఉండాలి’ అని చెప్పారు. -
అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా..
అనకాపల్లి: అమ్మా.. ఎలా ఉన్నారు? మీవారు ఇంటికి సక్రమంగా వస్తున్నారా.. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా.. అంటూ జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పలకరించారు. మద్యం వ్యసనం మాన్పించేందుకు జేసీ ‘విముక్తి’ అనే ప్రాజెక్టును మునగపాక మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్యం విడిచిపెట్టిన ఇద్దరు వ్యక్తులు పాటిపల్లి గ్రామంలో ఉన్నారు. భూముల రీసర్వే సమీక్ష కోసం మంగళవారం మండలానికి వచ్చిన జేసీ.. పాటిపల్లిలో ఆ ఇద్దరు వ్యక్తుల ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మద్యం మానేశాక వారి ఇంటి పెద్దలో వచ్చిన మార్పు, ఇప్పటికీ అదే పరివర్తన కొనసాగుతోందా.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారింట్లో ఫొటో ఆల్బమ్ చూస్తూ పాత జ్ఞాపకాల గురించి వారితో ముచ్చటించారు. ‘విముక్తి’ పైలట్ ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేసిన ఏఎన్ఎం సుజాతను ఈ సందర్భంగా జేసీ అభినందించారు. ఓ పెద్ద కూతురిలా తమ ఇంటికి వచ్చి అంత పెద్ద ఐఏఎస్ అధికారి తమ మంచి చెడ్డలను వాకబు చేయడంతో ఆ ఇంటివారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. -
మాటే సోపానం
ఇంటిని చక్కదిద్దుకోవడంలోనే కాదు వంటలు, ఆటలు, కళలు, రకరకాల వృత్తులు, వ్యాపారాలు .. ఇదీ అన్ని చెప్పలేనంత ప్రతిభను మహిళలు మాత్రమే కనబరుస్తారు. వీటన్నింటిలో రాణించాలంటే అవసరమైనది మంచి మాట. ‘నలుగురితో ఎలా మెలగాలో తెలుసుండటంతో పాటు ‘మంచి మాట’ కూడా తోడైతే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలరు అని వివరిస్తున్నారు డాక్టర్ డి.కల్పన. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉంటున్న ఈ పబ్లిక్ స్పీకింగ్ ట్రెయినర్ గృహిణిగా ఉన్న తన జీవితమే ‘మాట’ను ఉపాధిగా మార్చుకోవడానికి ఉపకరించిందని తెలియజేశారు. ‘‘డిగ్రీ పూర్తి చేసిన నాకు పెళ్లి తర్వాత ‘మాట’ సమస్య వచ్చింది. కొన్నాళ్లు నలుగురిలో మాట్లాడటానికి జంకడం నాకు నేనుగా గమనించాను. అది గుర్తించి ఈ సమస్య నుంచి బయటపడాలనుకున్నాను. అందుకు నా కుటుంబం మద్దతుగా నిలిచింది. సమస్య నుంచి బయట పడ్డాను. నాలాగ మొదట మాట తడబడటం అనే సమస్య చాలా మందిలో ఉండటం గమనించాను. కొందరు ‘మాట’తో ఎంతగా వృద్ధిలోకి వస్తున్నారో గమనించాను. కొందరు ప్రతిభ ఉన్నా వెనకంజలో ఉంటున్నవారినీ చూశాను. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు. అప్పుడే ‘పబ్లిక్ స్పీకింగ్’ కాన్సెప్ట్‌పై శిక్షణ అవసరం గ్రహించి, ఇంట్లోవారితో చర్చించాను. అందకు నాకు పూర్తి మద్దతు లభించింది. మీడియా జంక్షన్ పేరుతో పబ్లిక్ స్పీకింగ్పైన 18 ఏళ్లుగా శిక్షకురాలిగా ఉన్నాను. తరగతులకు వచ్చేవారిలో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్నవారు, వచ్చినవారూ పాల్గొన్నారు. వారందరికీ చెప్పిన విషయాల్లో ముఖ్యమైనవి... భయం గడప దాటాలి ప్రతి ఒక్కరిలోనూ వారి మనసు పొరల్లో ఎన్నో అంశాల దాగి ఉంటాయి. కానీ, వాటిని బయటకు సరిగ్గా వ్యక్తపరచలేరు. కొందరు వ్యక్తపరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. మరికొందరి మాటలను అస్సలు వినలేం. ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగల నేర్పుతో ‘మాట’ ఉండాలంటే సాధన అవసరం. దానికి ముందు ‘ఏం మాట్లాడితే ఏం అనుకుంటారో’ అనే భయాన్ని వదిలిపెట్టాలి. తల్లిగా పిల్లలతో కథల రూపేణా, వారి విషయాలు కనుక్కోవడంలోనూ మాట్లాడుతూ ఉండాలి. పేరెంట్ టీచర్ మీటింగ్స్‌లో పాల్గొని అక్కడి టీచర్స్‌తో మాట్లాడాలి. అలాగే, ఇంటికి ఎవరో ఒకరు అతిథులుగా వస్తారు. వారితోనూ మాట కలపచ్చు. కాలనీలు, అపార్ట్మెంట్లలో గెట్ టుగెదర్ లాంటివి ఏర్పాటు చేసుకొని, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేయాలి. వచ్చిన చిన్న అవకాశాన్నే అయినా ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటే అదే సరైన దారి చూపుతుంది. మాట్లాడటం అనే కళను ఒంటపట్టేలా చేస్తుంది. చిన్న చిన్న పార్టీలే మాటకు వేదికలు మాట మనపైన మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకు మహిళలకు తరచూ తారసపడేవి నలుగురైదుగురితో ఏర్పాటుచేసుకునే కిట్టీపార్టీ, బర్త్ డే పార్టీ, చిన్న చిన్న వేడుకలలో ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్‌ను ఏర్పాటుచేసి, అందులో పాల్గొనాలి. ఒక్కొక్క పాయింట్ మీద ఒక్క నిమిషం మాట్లాడాలి. ఉదాహరణకు.. క్యాండిల్ కేర్, పెన్ను, పుస్తకం, బెలూన్స్.. ఇలా మీ కళ్ల ముందు ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటూ దాని ప్రాముఖ్యాన్ని బయటకు వ్యక్తపరచడం అన్నమాట. మాటతో సమస్యలు దూరం డాక్టర్ మాట ద్వారానే సగం జబ్బు తగ్గిపోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే లాయర్లు కూడా మాట ద్వారానే రాణించాలి. కొన్ని సార్లు మాట కటువుగా, కొన్నిసార్లు మృదువుగా ఉండాలి. ఎక్కడ ఆపాలి, స్వరం ఎక్కడ పెంచాలి అనే విషయాల్లో మనకు పూర్తి ఆత్మవిశ్వాసం వస్తే కోరుకున్న రంగాల్లో కోరుకున్న ప్రగతి సాధించడానికి ‘మాట’ ఎంతగానో సాయపడుతుంది. ‘మాట’ సరైన విధంగా ఉపయోగించకపోతే ఆ ‘మాట’నే వారికి అథఃపాతాళానికి చేరుస్తుంది. ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుంచుకొని వృద్ధిలోకి రావడానికి ‘మాట’ను మంత్రంగా ఉపయోగించుకొని ఎదుగుదలకు సోపానంగా మలచుకోవాలి’’ అని వివరించారు ఈ ట్రెయినర్. బొమ్మలతో స్పీచ్ సాధ్యమే నలుగురైదుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒక చోట చేరినప్పుడు ఒక బాక్స్‌లో చిన్న చిన్న బొమ్మలు, వస్తువులు వేసి... ఎవరికి ఏ వస్తువు వస్తే ఆ టాపిక్ మీద నిమిషం సేపైనా మాట్లాడాలి. దినపప్రతికల్లో వచ్చిన ఏదైనా ఒక వార్త తీసుకొని మాట్లాడవచ్చు. మా దగ్గర నాలుగు రోజుల ప్రోగ్రామ్ స్పీకింగ్ కోర్స్‌లో, ఒకరోజు ఫుల్ డే కేటాయిస్తాం. అందుకు అందరికీ వీలున్న సెలవురోజున ఎంచుకుంటున్నాం. డాక్టర్ డి. కల్పన – నిర్మలారెడ్డి -
టీపీసీసీ కార్యదర్శి కల్పనాకుమారి మృతి.. రాహుల్ సంతాపం
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: టీపీసీసీ కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణానికి చెందిన తడక కల్పనాకుమారి(44) అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతురాలికి భర్త యాదగిరి(అసిస్టెంట్ ఫ్రొఫెసర్, నిజాం కళాశాల), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కల్పనాకుమారి మృతి పట్ల ఏఐసీసీ నాయకుడు రాహుల్‌గాంధీ ప్రగాఢ సంతాపం తెలిపారు. కల్పనాకుమారి దళితులు, మహిళల హక్కుల కోసం పోరాడారని గుర్తుచేసుకొన్నారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న కల్పనాకుమారి మృతి పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడి నివాళి కల్పనాకుమారి మృతికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. గాంధీభవన్‌లో కల్పనాకుమా రి చిత్రపటానికి ఏఐసీసీ సభ్యుడు అంజన్‌కుమార్ యాదవ్‌తో కలసి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అలాగే పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మె ల్యే సీతక్క, ఏఐసీసీ సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని కల్పనాకుమారి ఇంటి వద్ద ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
Kalpana Ramesh: జల కల్పనకు ఊతం!
‘‘75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని బన్సిలాల్‌పేట్ మెట్లబావిని పునరుద్ధరించేందుకు 75 మందికి పైగా స్థానిక జనం పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది’’ అంటూ ఆకాశం నుంచి రాలే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్న కల్పనా రమేష్ ఆనందంగా వివరించారు. హైదరాబాద్‌లో పాడుబడిన బావులను పునరుద్ధరిస్తూ, చెరువులు–కుంటలను సంరక్షిస్తూ, వాన నీటితో భూగర్భజలాలను పెంచడానికి కృషి చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒంగోలులో పుట్టి పెరిగిన కల్పన వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ స్టూడియో కూడా నిర్విహిస్తున్న కల్పనా రమేష్ నీటి వైపుగా వేసిన అడుగుల గురించి వివరించారు. ‘‘ఐదేళ్ల క్రితం కుటుంబంతో అమెరికా నుండి భారత్‌కు వచ్చాను. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు చుట్టూ పచ్చదనం కావాలనుకున్నాను. కానీ, అప్పటికి ట్యాంకర్లతోనే నీటిని తెప్పించుకునే పరిస్థితి. ఆ నీళ్లలో హానికారకాలున్నాయని గుర్తించాను. ఈ పరిస్థితి ని ఎలాగైనా మార్చాలనుకున్నాను. మా డాబా మీద వర్షపు నీటిని నిల్వ ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నాను. వాడిన నీళ్లు వృథాపోకుండా రీఛార్జ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిని అనుసరించాను. ఏడాదిలోనే మా ఇల్లు, మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం చల్లదనం, పచ్చదనం తో ఆహ్లాదకరంగా మారిపోయింది. బడి పిల్లలకు అవగాహన తరగతులు ఎప్పుడైతే ఈ ఆనందం మేం చవి చూస్తున్నామో, నాటి నుంచి మా కాలనీవాసులూ ఇదే పద్ధతిని అనుసరించారు. దీంతో సమాజానికి నా వంతు సాయం చేయాలని, వాటర్ రీసైక్లింగ్ పై జనాల్లో అవగాహన పెంచుతూ వస్తున్నాను. ఇందుకు స్కూళ్లు, కాలేజీల్లోనూ దాదాపు 70 వేల మంది పిల్లలకు అవగాహన క్లాసులు తీసుకున్నాను. పాఠశాలల నుంచి పిల్లలే స్వచ్ఛందంగా ఈ నీటి యజ్ఞంలో పాల్గొనేలా చేశాను. చెరువుల సంరక్షణ నగరంలో రియల్ ఎస్టేట్ కారణంగా వందల చెరువులు కాంక్రీట్ వనంలో కలిసిపోయాయి. ఇంకొన్ని ఇరుకైపోయాయి. కొన్ని మురుగు కు కేంద్రాలయ్యాయి. గోపీనగర్ చెరువు ఇందుకు ఉదాహరణ. దీనికోసం స్త్రీలనే బృందాలుగా ఏర్పాటు చేయడంతో, వారంతా చెరువు చెత్తను ఆటోల్లో డంప్‌యార్డ్ కు తరలించడం మొదలుపెట్టారు. పది రోజుల్లోనే ఆ చెరువును పరిశుభ్రంగా మార్చేశారు. పాత బావులను తిరిగి వాడుకునేలా.. గచ్చిబౌలిలో మసీద్ వద్ద ఉన్న పాత బావి కొన్నేళ్లుగా చెత్తకు డంప్‌యార్డ్‌గా మారింది. పూర్తిగా చెత్త తొలగించి, ఆ చుట్టుపక్కల ఇళ్ల రూఫ్ నుంచి వర్షపు నీళ్లు బావిలో పడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు మసీదుకు వచ్చేవారు కూడా బావి నీళ్లు వాడుతున్నామని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాగే.. కోకాపేట్, కొండాపూర్, గచ్చిబౌలి, బన్సీలాల్‌పేట్.. ప్రాంతాల్లోని ప్రాచీన బావులను వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేశాం. ఇంకుడు గుంతలు, పాత బావులు... ఇతరత్రా విధానాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే నీటి ఎద్దడి రాదు. అంతా ప్రభుత్వమే చేయాలనుకోకుండా ఎవరికి వారు ఈ పనులు చేపడితే ఎంతో మంచిది. ప్రతి ఒక్కరూ ఒక వాటర్ వారియర్ ప్రజల్లో ఉండే నిర్లక్ష్యం ఎలా ఉంటుందో, దానిని ఎలా దూరం చేయాలో ఒక ఉదాహరణ కుడికుంట చెరువు. ఆ చెరువును బాగు చేయడానికి ముందు స్థానికులతో చర్చించాను. ప్రతి ఒక్కరూ ఒక వాటర్ వారియర్ కావాలని కోరాను. అందరం కలిసి చెరువు నుంచి వంద టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాం. చెరువులను, బావులను శుభ్రం చేయాలనుకున్నప్పుడు దీని వల్ల నాకేదో ప్రయోజనం ఉందన్నారు కొందరు. అపుడు బాధేసింది. కానీ నా భర్త రమేష్ ఇచ్చిన సలహాలు, మద్దతు నన్ను బలవంతురాలిని చేశాయి. అలా ‘లివ్ ది లేక్స్ ఇనిషియేటివ్’ను ప్రారంభించా. నీరు మనిషి ప్రాథమిక హక్కు. నీటి నిల్వపై అవగాహనతో పాటు అపార్ట్మెంట్స్, ఆఫీసులకు అండగా నిలుస్తున్నా. పాడైన బోర్లను బాగు చేసేందుకు 10కె బోర్స్ కార్యక్రమాన్ని చేపట్టా. ఇంటి ఆవరణలోనే రీ చార్జ్ పిట్లు ఏర్పాటు చేస్తున్నాను. జీహెచ్ఎంసీ, కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నాను. నగరంలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన సిటీ లేక్ యాక్షన్ కమిటీ టు కన్సర్వ్ లేక్స్’లో ఉన్నాను’ అని వివరించారు ఈ వాటర్ వారియర్. కల్పన జల సంరక్షణ మంత్రం ‘రీసైకిల్, రీఛార్జ్, రీయూజ్.’ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపుతున్నారు. మొదటి అడుగు ఒంటరిదే అయినా సంకల్పం బలంగా ఉంటే వేల అడుగులు జతకలుస్తాయి అంటున్న కల్పనారమేష్ అందుకు అసలైన ఉదాహరణ. ఇది వర్షాకాలం. నీటి నిల్వలు పెంచుకోవడానికి సరైన కాలం అంటున్నారు కల్పన. -
ఇంతకీ ఎవరీ కల్పన?
కోల్‌కతాలో బస్సు నడపడం అంత తేలికైన పనికాదు. ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్, రద్దీగా ఉండే నివాస–మార్కెట్ ప్రాంతాలు.. ప్రతి ట్రిప్‌ని కష్టంగా మారుస్తాయి. అయినా సరే ఆ వీధుల్లో పీ.. పీ.. పీ.. అని హారన్ కొడుతూ ఒడుపుగా స్టీరింగ్ తిప్పుతూ బస్సు నడుపుతోంది బక్కపల్చగా ఉన్న ఓ యువతి. ఆమె పేరు కల్పనా మొండల్. వయసు 21. ఆమెను చూసిన ప్రయాణికులు ఒక మహిళ అయి ఉండి బస్సు ఎలా నడిపిస్తుంది అని ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకీ ఎవరీ కల్పన? ఆమె ఎందుకు బస్సు నడిపిస్తోంది? కల్పనా మొండల్ గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ, సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన బస్సు డ్రైవర్. కోల్‌కతా శివారులోని నోసారిలో కల్పన కుటుంబం ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను చదువుకోలేదు. కుటుంబంలో నలుగురు సభ్యులు. అక్క, తల్లి, తండ్రి, తను. అందరూ ఇంటిలాంటి ఒక గదిలో ఉంటున్నారు. కల్పన తండ్రి సుభాష్ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. చిన్నప్పుడు తండ్రికి సాయంగా ఉండటానికి తరచూ కల్పన కూడా బస్సులో వెళ్లేది. తండ్రి రోజుకు రెండు రూపాయలు ఇచ్చేవాడు. ఆ డబ్బులతో కల్పన మిఠాయి కొనుక్కొనేది. బస్సు డ్రైవింగ్ చేయగా వచ్చే తండ్రి ఆదాయంతోనే నడిచే ఆ కుటుంబం ఓ రోజు పెద్ద కుదుపుకు లోనయ్యింది. తండ్రికి ధైర్యం చెప్పి.. రెండేళ్ల క్రితం కల్పన తండ్రి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో రెండు కాళ్లకు ఆపరేషన్ అయ్యి మెటల్ ప్లేట్స్ వేశారు. కుటుంబం గడిచే పరిస్థితి లేక కల్పన తనే కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంది. ‘డ్రైవింగ్ నేర్చుకొని ముందు కాలనీలోనే ట్రక్కులు నడిపేది. గోడౌన్లకు లోడు చేర్చేది. మేజర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకొని బస్సు నడపడం నేర్చుకుంది. నాకు వెన్నుదన్నుగా నిలిచింది’ అంటూ కూతురు గురించి గొప్పగా ఉత్సాహంగా చెబుతూ ఉంటాడు సుభాష్, ‘ఆపరేషన్ అయ్యాక మేటల్ ప్లేట్స్ కారణంగా నా కాళ్లను వంచలేకపోయాను. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాను. అలాంటి సమయంలో నా కూతురు కల్పన హామీ ఇచ్చింది నేను కుటుంబాన్ని నడుపుతాను అని. అప్పటికే చుట్టుపక్కల కాలనీలలో రాత్రిపూట కొన్నాళ్లపాటు డ్రైవింగ్ నేర్చుకుంటూ ప్రయత్నించింది. బాగా నేర్చుకున్నప్పటికీ 34సి మార్గంలో (ఎస్ప్లానేడ్–బరానగర్) బస్సు యజమాని కల్పనకు బస్సు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అది చాలా రద్దీ రూటు. వాళ్లు అంగీకరించేవరకు ప్రయత్నించి సాధించింది. అప్పుడు తిరస్కరించినవాళ్ల బస్సునే ఆమె ఇప్పుడు చాకచక్యంగా నడపడం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కుటుంబ శ్రేయస్సు కోసం తన భవిష్యత్తు త్యాగం చే సింది నా తల్లి కల్పన’ అంటూ కూతురి గొప్పతనం చెబుతాడు సుభాష్. తల్లి మంగళ మాట్లాడుతూ –‘మొదట్లో తండ్రి (సుభాష్) కల్పన వెనకాల కూర్చొని సూచనలు ఇస్తూ ఉండేవాడు. కానీ, ఎప్పుడూ తన చేతిని పట్టుకొని నేర్పలేదు’ అంటారు ఆమె. పోలీసులు సెల్ఫీలు తీసుకుంటారు! ఇక కల్పన మాట్లాడుతూ ‘ట్రాఫిక్ పోలీసులు నన్ను రద్దీ దారుల్లో నడపమని ప్రోత్సహిస్తుం టారు. ఇంకొంతమంది నాతో సెల్ఫీలు దిగి ఆసక్తిగా నా గురించి అడుగుతుంటారు’ అంటుంది. అంతేకాదు, ఇప్పుడామెకు డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి కూడా అనుమతి వచ్చింది. ‘‘ప్రయాణీకులు కొందరు బస్సు ఎక్కినప్పుడు ముందు నన్ను చూడరు. కానీ, ఆ తర్వాత నేను ఓ మహిళనని గమనించి ఆసక్తిగా చూస్తూ ఉండటాన్ని నేను నా డ్రైవింగ్ సీట్ నుంచే అద్దంలో చూసి తెలుసుకుంటుంటాను’ సంబరంగా చెబుతుంది కల్పన. కనీసం పదోతరగతి కూడా పాస్‌కాని కల్పన ఇప్పుడు ప్రైవేట్‌గా చదువుకొని పదవ తరగతి పరీక్షలు రాయాలనుకుంటోంది. ‘అప్పుడైతే ప్రభుత్వంలో డ్రైవర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నా తండ్రి కలనే నేను నెరవేర్చాలనుకుంటున్నాను’ అని ఉత్సాహంగా చెబుతుండటం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కుటుంబానికి కష్టం వస్తే పెద్దవాళ్లు చూసుకుంటారులే అనుకోకుండా తానే కుటుంబానికి అండగా నిలబడ్డ కల్పన తన తోటి అమ్మాయిలకే కాదు, యువకులకూ రోల్‌మోడల్. – నిర్మలారెడ్డి చిలకమర్రి -
జల కల్పన
ఆమె ఓ ఆర్కిటెక్ట్. లక్షల రూపాయలు ఆర్జించే అవకాశం ఉన్న తన కెరీర్‌కే పరిమితమై పోకుండా భావితరాలకు విలువైన నీటి బొట్టును ఒడిసిపట్టి అందించేందుకు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తరిగిపోతున్న జలసంపదను పది కాలాల పాటు నిల్వచేసేందుకు వినూత్న డిజైన్లు రూపొందించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు పొందారు. ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమే కల్పనా రమేశ్. హైదాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు కల్పనా రమేష్. సాహె (సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్) సంస్థను స్థాపించి దశాబ్దకాలంగా వర్షపునీటి సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ప్రధాని దృష్టి నేను రూపొందించిన వర్షపు నీటి సంరక్షణ డిజైన్లు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులకు చెందినవారు దేశవ్యాప్తంగా ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ట్యాగ్‌చేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయ ‘మై గౌ’ సైట్ సీఈఓ మార్చి 6న నాకు ఫోన్‌చేసి పీఎం సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు మీరు అర్హత సాధించారని చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. నేరుగా ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సైట్లలో నేను సమాచారాన్ని పొందుపరిచే అవకాశం ఉండదు. మైగౌ సైట్ సీఈఓకు సమాచారం చేరవేస్తే వారు నేను అందించే సమాచారాన్ని పరిశీలించి నా తరఫున ఆయా సైట్లలో నేను కోరిన సమాచారాన్ని పోస్ట్చేస్తారు. ఈ విధానంలో నా ఆలోచనలు, డిజైన్లు కోట్లాదిమందికి చేరతాయని సంతోషంగా ఉంది. విస్తృత అవగాహన గత మూడేళ్లుగా వర్షపునీటి సంరక్షణపై 150కి పైగా అవగాహన కార్యక్రమాలు, 50 ప్రత్యేక చర్చాగోష్ఠులు నిర్వహించాం. తాజాగా హైదరాబాద్‌లోని సిల్వర్‌ఓక్ విద్యాసంస్థలో 6–8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాననీటి సంరక్షణపై రెండునెలలు క్లాస్‌రూమ్‌లో, మరో రెండు నెలలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. వాళ్లు వెళ్లి ఇళ్లు, కాలనీల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవలే మజీద్ బండ (కొండాపూర్) ప్రాంతంలో కొడికుంట చెరువును మా సాహె సంస్థ దత్తతకు తీసుకుంది. ఈ చెరువులోకి వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేస్తోంది. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణం, నిర్మాణ డిజైన్లను బట్టి వాననీటి సంరక్షణ పిట్స్‌ను మేము డిజైన్ చేస్తున్నాం. నా స్వస్థలం బెంగళూరు. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశాను. విద్యాభ్యాసం అక్కడే సాగింది. కానీ గత 20 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నాం. ఇప్పుడు ఇదే నా ఓన్సిటీ. ఇక్కడే వర్షపునీటి సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాను. నా భర్త రమేష్ లోకనాథన్ది సాఫ్ట్వేర్ రంగం. ఆయన సహాయ సహకారాలు కూడా నాకెంతగానో ఉన్నాయి. వర్షపు నీటి నిల్వపై క్షేత్రస్థాయిలో పిల్లలకు అవగాహన భవిష్యత్ లక్ష్యం ‘చినుకు.. చినుకు ఒడిసిపట్టు.. భావితరాలకు దాచిపెట్టు’ అన్న నినాదంతో వర్షపునీటిని ఒడిసిపట్టే కృషిలో నిర్విరామంగా పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో నా సేవలు, డిజైన్లు ప్రధాని సోషల్‌మీడియా అకౌంట్ల ద్వారా కోట్లాదిమందికి చేరనున్నాయి. ఈ జలయజ్ఞంలో ప్రతీ భారతీయుడు భాగస్వామి కావాలన్నదే నా లక్ష్యం.. నా స్వప్నం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరాల్లో వర్షపునీటిలో 80 శాతం వృథా అవుతోంది. ఇందులో 50 శాతం ఒడిసిపట్టినా నీటి కరువు ఉండదన్నదే నా నిశ్చిభిప్రాయం’’అని ముగించారు కల్పన. – ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్ నీటి బ్యాంకు! ఇళ్లు, అపార్ట్మెంట్లలో తక్కువ ఖర్చుతో వర్షపునీటిని సంరక్షించుకోవచ్చు. ఇంటి పైకప్పుపై కురిసిన వర్షపునీటిని నేరుగా కింద ఉన్న నీటి సంపులో నింపుకోవాలి. ఇలా ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 30 వేల నుంచి లక్ష లీటర్ల వరకు నిల్వచేయవచ్చు. ఇది నిండిన తరవాత ఓవర్‌ఫ్లో అయ్యే నీటిని ఎండిన బోరుబావిలోకి మళ్లిస్తే మీకు ఏడాదికి సరిపడా జలబ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ట్యాంకర్ కష్టాలు లేకుండా చూసుకోవచ్చు. ఏడాదికి సుమారు 35–45 రోజుల పాటు వర్షం తప్పక కురుస్తుంది. ఇందుకోసం ఒకసారి రూ.15–రూ.25 వేల వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఉదా.. వెయ్యి చదరపు అడుగుల భవనం రూఫ్‌టాప్‌పై పడిన వర్షపు నీటిని ఒడిసిపడితే 70 వేల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి వందరోజుల పాటు సరిపోతాయి. ఇక 2000 చదరపు అడుగుల భవనానికి 1.40 లక్షల లీటర్లు, 3000 చదరపు అడుగుల భవనంపై కురిసిన నీటి ద్వారా 2.10 లక్షల లీటర్లు, 4000 చదరపు అడుగుల భవనానికి 2.80 లక్షల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. కల్పన -
హాజీపూర్ గ్రౌండ్ రిపోర్ట్
-
మా పక్కనే మానవ మృగమా.. ఊహించలేకపోయాం!
-
మా పక్కనే మానవ మృగమా.. ఊహించలేకపోయాం!
సాక్షి, బొమ్మలరామారం : ముగ్గురు ఆడపిల్లలను హతమార్చి ఏం ఎరుగనట్టు తమ మధ్యే తిరిగిన మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని గుర్తించలేకపోయామని హజీపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి గురించి విచారణలో వెల్లడవుతున్న విషయాలతో గ్రామస్థులు అవాక్కవుతున్నారు. అసలు శ్రీనివాస్ రెడ్డి గురించి అంతగా ఎవరికీ తెలియదని, అతను ఎక్కువగా ఊరిలో ఉండేవాడు కాదని, ఎవరితో అంతగా మాట్లాడేవాడు కాదని, ఇంత దారుణానికి ఒడిగడుతాడని ఊహించలేదంటున్నారు. వరంగల్, కర్నూల్లో అతనిపై కేసులు నమోదైన విషయం కూడా తెలియదంటున్నారు. తొలుత శ్రావణి ఉదంతం బయటపడ్డప్పుడు శ్రీనివాస్ రెడ్డి అందరిలానే ప్రవర్తించాడన్నారు. శ్రావణి మృతదేహం తన బావిలో ఉందని తెలిసి అందరిలానే చుట్టూ నిలబడి చూశాడని, పైగా బావిలోకి ఎలా దిగాలో కూడా సలహాలిచ్చాడని వాపోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే నిందితుడా? శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే నిందితుడా? ఇంకెవరైన హస్తం ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యల సంఘటనలు పరిశీలిస్తే ఒక్కడి వల్ల సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒక్కడికి బావిలోకి దిగడం సాధ్యమే కాదు. ఐదేకరాల నిర్మానుష్య ప్రాంతం కావడం.. ఇక్కడ ఏం జరిగినా.. కనపడని, అరిచినా.. వినపడని నిర్మానుష్య ప్రాంతం కావడంతో శ్రీనివాస్ రెడ్డి తన నేరాలకు అనువుగా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గరు అమయాక ఆడపిల్లలను బలి తీసుకున్న అతన్ని చంపేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. -
బొమ్మలరామారం వరుస హత్యలు.. కీలక నిజాలు!
-
హజీపూర్ వరుస హత్యలు.. సంచలన నిజాలు!
సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల మిస్టరీకి సంబంధించి కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా విచారణలో తన దారుణాల గుట్టు విప్పాడు. శ్రావణి, మనీషా, కల్పన.. ఇలా ముగ్గురు విద్యార్థినులను తానే హత్య చేశానని, వారిపై కిరాతకంగా లైంగిక దాడులు జరిపి మరీ చంపేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇరవై ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లి కాకపోవడంతో శ్రీనివాస్‌రెడ్డి సైకోగా మారిపోయాడని, అతనికి తరచూ పోర్న్ వెబ్సైట్లు చూసే అలవాటు ఉందని, ఈ క్రమంలో అమాయకులైన ఆడపిల్లలపై కన్నేసిన అతను.. రాక్షసుడిగా మారి.. అమ్మాయిలపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హాజీపూర్‌లో వెలుగుచూసిన మూడు హత్యలు తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు ఒకే బావిలో లభించగా.. నెలరోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు అమ్మాయిలను శ్రీనివాస్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పన(11)పై కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు నిందితుడు తాజాగా అంగీకరించాడు. దీంతో కల్పన మృతదేహం కోసం మరో బావిలో పోలీసులు వెతుకుతున్నారు. శ్రావణి, మనీషాను హత్య చేసి.. బావిలో విసిరేసినట్టే.. కల్పనను కూడా అదేవిధంగా మరో బావిలో విసిరేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టైన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఇప్పటికే గ్రామస్తులు దాడి చేసి.. నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్‌రెడ్డి దారుణాల గురించి తెలుసుకున్న హాజీపూర్ వాసులు తీవ్ర ఆగ్రహావేశంతో అతడి ఇంటిని తగలపెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు. శ్రీనివాస్‌రెడ్డిని అత్యంత కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: వరుస హత్యలు.. హాజీపూర్‌లో టెన్షన్ శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి? -
కల్పన పునరాగమనం
ముంబై: స్వదేశంలో ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యుల భారత బృందానికి హైదరాబాద్ సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రావి కల్పన మూడేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టులో పునరాగమనం చేయనుంది. విజయవాడకు చెందిన కల్పన రెండో వికెట్ కీపర్‌గా జట్టులోకి ఎంపికైంది. 22 ఏళ్ల కల్పన... 2015 జూన్‌లో బెంగళూరులో న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరో ఆరు వన్డేలు ఆడింది. 2016 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్ తర్వాత ఆమె జట్టులో స్థానం కోల్పోయింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఫిబ్రవరి 22, 25, 28 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. అంతకుముందు ఫిబ్రవరి 18న బోర్డు ప్రెసిండెట్స్ ఎలెవన్, ఇంగ్లండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. బోర్డు ప్రెసిండెట్స్ జట్టులో రావి కల్పనతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సబ్బినేని మేఘన ఎంపికయ్యారు. భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), రావి కల్పన (వికెట్ కీపర్), మోనా మేశ్రమ్, ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, శిఖా పాండే, మాన్సి జోషి, పూనమ్ రౌత్. -
ఆ క్రెడిట్ వాళ్లదే
‘‘నేను అక్షరాల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. ఇది నా తల్లి నుంచి నేర్చుకున్నాను. నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని ఆమె చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం’’ అని ప్రముఖ గాయకులు కె.జె.ఏసుదాస్ అన్నారు. చాలా కాలం తర్వాత ఆయన హైదరాబాద్‌లో ఈరోజు లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌తోపాటు గాయకులు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అందించిన మరో ఆశీర్వాదం ఏంటంటే.. నాకు ఐదేళ్లున్నప్పుడు చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్‌గా చదువుకుంటే చాలు. కానీ, కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్‌ని ప్రాపర్‌గా నేర్చుకోమని చెప్పారు. నాకు బ్రదర్స్, సిస్టర్ ఉన్నారు. వాళ్లు కూడా బాగా పాడేవారు. కానీ, ఈ విషయంలో నాన్నగారు నన్ను మాత్రమే ప్రోత్సహించారు. గురువు లేకుండా ఎవరూ గొప్పవారు కాలేరు. మనల్ని తీర్చిదిద్దిన గురువులంతా దేవుళ్లతో సమానమని నా నమ్మకం. నేను ఇప్పటివరకు ఏం సాధించినా అదంతా నా తల్లిదండ్రులు, గురువుల వల్లే సాధ్యమైంది. అలాగే నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు. నా బ్రదర్ అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ నన్ను లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మా అబ్బాయి విజయ్ వయసు ఇప్పుడు 40. నా వయసు 79. కానీ, నేను ఇప్పటికీ విద్యార్థినే’’ అన్నారు. విజయ్ ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మొదట్లో నాన్నగారి అడుగుజాడల్లోనే వెళ్లాను. ఆ తర్వాత నా సొంతదారిలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యాను. కొన్ని విషయాల్లో ఆయన గైడెన్స్ తీసుకుంటాను. ఇళయరాజాగారితో కలిసి నాన్నగారు చాలా సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు నేను, యువన్‌శంకర్‌రాజా కలిసి పనిచేస్తున్నాం. నేను రెండు సినిమాల్లో నటించాను కూడా. నాన్నగారి బయోపిక్ చేసే ఆలోచన ఉందా? అని అడుగుతున్నారు. అయితే నాకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. కానీ, ఎవరైనా చేస్తే నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
‘విధి’ విజయం సాధించాలి
రామ్, విష్ణుప్రియ, కల్పన ముఖ్య తారాగణంగా మారుతీ క్రియేషన్స్ పతాకంపై అరుణ్‌రెడ్డి బిల్లా దర్శకత్వంలో హనుమంతరెడ్డి నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ చిత్రం పోస్టర్‌ను వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించి, ‘‘ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వై.ఎస్. జగన్‌ను శనివారం చిత్రబృందం కలిసింది. చిత్రదర్శకుడు అరుణ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగనన్న పాదయాత్ర మహోన్నతమైనది. ఆయన చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఆయనతో కలిసి నడుస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి మహిళా చూడదగ్గ చిత్రం
జ్యోతిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘ఝాన్సీ’. తమిళంలో ‘నాచ్చియార్’గా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ శుక్రవారం ‘ఝాన్సీ’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన కోనేరు కల్పన బుధవారం మీడియాతో మాట్లాడుతూ – ‘‘నాకు వ్యక్తిగతంగా జ్యోతిక గారంటే చాలా ఇష్టం. ఆమె నటన చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా తన విశ్వరూపం చూపించారామె. ‘ఝాన్సీ’ చూసిన వెంటనే మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమా లాగా అనిపించింది. అందుకే యస్వంత్ మూవీస్ బ్యానర్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు దర్శకుడు బాలా. బాలాగారికి మన తెలుగులో కూడా చాలా మంచి పేరుంది. ఆయన గత చిత్రాలు శేషు, శివపుత్రుడు, వాడు–వీడు లాగానే మా ‘ఝాన్సీ’ కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. -
ఆఫీసర్ ఝాన్సీ
దాదాపు ఆరేళ్ల తర్వాత శాండిల్‌వుడ్ నుంచి రాయ్‌లక్ష్మీకి మళ్లీ కబురొచ్చింది. 2012లో ఉపేంద్ర నటించిన ‘కల్పన’ చిత్రంతో శాండిల్‌వుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాయ్‌లక్ష్మీ. రాఘవ లారెన్స్ ‘కాంచన’ చిత్రానికి రీమేక్ ఇది. ఇప్పుడు పీఎస్వీ గురుప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ఆగస్టు 29న సెట్స్‌పైకి వెళ్తుందట. ‘‘ఇందులో సొసైటీలోని సమస్యలపై పోరాడే నిజాయతీ గల ఐపీఎస్ ఆఫీసర్ ఝాన్సీ పాత్రలో రాయ్‌లక్ష్మీ నటించనున్నారు. ఓన్లీ యాక్షన్ మాత్రమే కాదు. లవ్ అండ్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కంఫర్ట్ జోన్‌ని దాటి ఆమె ఈ సినిమాను ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘‘కన్నడ ఫిల్మ్ ‘ఝాన్సీ’లో నటించబోతున్నందుకు హ్యాపీ. తొలిసారి ఫుల్ యాక్షన్ రోల్ ట్రై చేయబోతున్నాను’’ అన్నారు రాయ్‌లక్ష్మీ. ఈ సినిమాకు రాజేష్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. -
మాట భయాన్ని పోగొడతాను
పద్నాలుగేళ్ల క్రితం నేను హౌజ్వైఫ్ని. ఇద్దరు చిన్న పిల్లల తల్లిని. వారిని వదిలి ఉద్యోగానికి వెళ్లడం కష్టంగా ఉండేది. ఏదైనా సొంతంగా స్కిల్ ప్రోగ్రామ్ కోర్సు మొదలుపెడితే బాగుంటుందని అనిపించింది. అన్ని రంగాలను గమనించాను. ఏ రంగంలోనైనా సరే ఇంట గెలిచి, రచ్చగెలవాలంటారు. అలా గెలవాలంటే ఎదుటి మనిషిని ఆకట్టుకునేలా మాట్లాడాలి. చాలా మంది ‘మాట’ నైపుణ్యం లేని కారణంగా ప్రతిభ ఉండీ వెనుకబడటం గమనించాను. సమాజంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అవసరమో గుర్తించి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. నెలలో రెండు సెషన్స్ తీసుకుంటాను. ప్రతి ఆదివారం పూర్తి క్లాస్ ఉంటుంది. ప్రతీ బ్యాచ్‌లోనూ సగం మంది మహిళలు ఉంటున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకునేవారు, ఉన్నతి సాధించాలనుకునేవారూ క్లాసులకు అటెండ్ అవుతుంటారు. సాధారణంగా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళల దగ్గర చాలా సమాచారం ఉంటుంది. కానీ, మైక్ దగ్గరకు రాగానే ఒక రకమైన భయంతో వెనక్కి వెళ్లిపోతుంటారు. వారికి ఎన్నో సూచనలు ఇస్తుంటాం. వాటిలో... ∙‘మాట’ రాజకీయ రంగంలో ఉన్నవారికి మరింత అవసరం. ఏ భాషలో మాట్లాడినా సరే ఎదుటివారికి మనం చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా చేరాలి. ∙ఇంట్లో మాట్లాడటం వేరు. నలుగురిలో ఆకట్టుకునేలా మాట్లాడటం వేరు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా మనల్ని మనం ఎలా నిరూపించుకోవచ్చో తెలుస్తుంది, ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో తెలుస్తుంది. సుష్మాస్వరాజ్, నిర్మలాసీతారామన్, స్మృతి ఇరానీ.. వంటి మహిళా నేతల ప్రసంగాలను చూపిస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని పరిశీలించమంటాను. గ్రామాలలో సర్పంచ్‌గా, పట్టణాల్లో కార్పోరేటర్‌గా ఉన్నవాళ్లూ మా దగ్గర క్లాస్‌లు తీసుకున్నవారిలో ఉన్నారు. ‘మేం ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నాం’ అని చెబుతుంటారు. వారు ‘మాట’ నైపుణ్యాలను ఎలా పెంచుకున్నారో క్లాసులో వారి చేతనే చెప్పిస్తాం. ∙కాన్ఫిడెంట్‌గా ఉండటం ముఖ్యం. దీని వల్ల బెరుకు, భయం దూరం అవుతాయి. ∙ముందుగా 5 పాయింట్స్ నోట్ చేసుకొని చెప్పమంటాం, దీంట్లో పంచ్ డైలాగ్‌తో మీటింగ్‌ని ఎండ్ చేయమంటాం. ఆ తర్వాత పాయింట్స్ సంఖ్య పెంచుతూ, మధ్య మధ్యలో డైలాగ్స్ స్థాయి పెంచుతూ మాటలో నైపుణ్యాలు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ∙కాలేజీ అమ్మాయిలకు కూడా ఈ శిక్షణా తరగతులు ఇప్పిస్తే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు వెలుగులోకి వస్తారు. తమ సత్తా చాటుతారు. – డాక్టర్ కల్పన, డైరెక్టర్, మీడియా జంక్షన్, ముషీరాబాద్, హైదరాబాద్ -
అనుష్క అంగీకరిస్తే... తెలుగులో రీమేక్
సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా నాచియార్. జ్యోతిక, జీవి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. జ్యోతిక చెప్పిన డైలాగ్స్‌తో వివాదాస్పదమైన ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు తమిళచిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన కోనేరు కల్పన, నాచియార్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే ఈసినిమాను డబ్ చేయకుండా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు బాలా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తమిళ్లో జ్యోతిక చేసిన పాత్రను తెలుగులో అనుష్క చేస్తే బాగుంటుందని బాల సూచించారు. దీంతో అనుష్క అంగీకరస్తే నాచియార్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'బిగ్ బాస్'కు ఆమె సెట్ అవ్వరు: నటుడు
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిపోయింది. రోజురోజుకు ఈ రియాల్టీ షోకు ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ షో రెండో వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా తారక్ 12 మంది సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. టాస్క్ లో పాల్గొన్న సందర్భంగా షోలో యాక్టివ్ ఉంటున్న నటుడు శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు నచ్చని వ్యక్తిని విలన్ గా ఎంచుకుని కత్తుల సింహాసనంపై కూర్చోపెట్టి కారణం వివరించడం టాస్క్ ప్రత్యేకత. సభ్యుల విషయంలో గొడవ జరిగితే సర్దిచెప్పాలని తాను చూస్తే, కల్పన మాత్రం అడ్డుపడుతున్నారని అర్చన అన్నారు. తొలివారం ఓకే అనేలా ఉన్న కల్పన రెండో వారంలో మాత్రం డబుల్ గేమ్ అడుతున్నారని నటి హరితేజ చెప్పారు. శివబాలాజీ మాత్రం మరో అడుగు ముందుకేశారు. కెప్టెన్ గా చేసిన కల్పన ఈ బిగ్ బాస్ కు సెట్ అవ్వరని, హౌస్ లో ఉండేందుకు తగిన వారు (అన్ ఫిట్) కాదని అభిప్రాయపడ్డారు. ఆమె విలన్ అని చెప్పేందుకు ఒక్క కారణం కాదు.. తన వద్ద ప్యాకేజీ కారణాలున్నాయంటూ శివబాలాజీ పేర్కొన్నారు. దీంతో హౌస్ వాతావరణం కాస్త వేడెక్కింది. టాస్క్ లో భాగంగా ఏడుగురు సభ్యులు కల్పనను విలన్ గా ఎంపిక చేసుకోగా, ఆ తర్వాతి స్థానంలో నటుడు సమీర్ నిలిచారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్ గాయని మధుప్రియ. ఎలిమినేషన్ నుంచి ఆమె పేరు ప్రకటించిన తర్వాత సభ్యులలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన రియాల్టీ షో తొలి వారం తర్వాత నటి జ్యోతి ఎలిమినేట్ అవ్వగా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. షోను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్టీఆర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
నన్ను అన్నా అని పిలవకు: ఎన్టీఆర్
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ షో సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. తొలి వారం సాదా సీదాగా సాగిన వారంతంలో ఎన్టీఆర్ రావడంతో ఈ రియాలిటీ షో జోరందుకుంది. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్‌బాస్.. నటి జ్యోతి ఎలిమెనేట్ అవ్వగా.. హీరో బర్నింగ్ స్టార్ సంపూ అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. శనివారం బిగ్‌బాస్ హౌజ్ మెంబర్స్‌తో ముచ్చటించిన ఎన్టీఆర్ మహేశ్ కత్తితో చికెన్ వడ్డించుకొని తన కోరిక తీర్చుకున్నాడు. ఎప్పుడూ కిచెన్ వైపు అడుగుపెట్టని మహేశ్ కత్తి ఎన్టీఆర్ కోరిక మేరకు గరిటే పట్టడంతో మిగతా హౌస్ మెట్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక మహేశ్ కత్తి చికెన్ వండుతుండగా హౌస్ మెట్స్‌కి ఎన్టీఆర్ ఓ టాస్క్ ఇచ్చాడు. అదేమిటంటే.. కత్తుల సింహాసనంపై హౌస్ మెట్స్ తము విలన్‌గా భావించేవారిని కూర్చో బెట్టి దానికి కారణం చెప్పాలి. ఎక్కువ సభ్యులు కెప్టెన్ కల్పనానే తమ విలన్‌గా పేర్కొన్నారు. తొలివారం ఆమె ప్రవర్తనకు కెప్టెన్ అనంతరం ఆమె ప్రవర్తనకు చాల తేడా ఉందని, వారికి తొలి వారం కల్పనానే కావాలని కోరారు. ఇక శివబాలజీ అయితే కల్పనా బిగ్‌బాస్ హౌజ్‌కు పనికి రాదని నిర్మోహమాటంగా చెప్పాడు. దీనికి వివరణ కోరిన ఎన్టీఆర్‌ను కల్పనా పదేపదే అన్నా అని పిలవడం ఎన్టీఆర్ చికాకు తెప్పిచ్చినట్లుందో లేదా వయసులో తన కన్నా పెద్దదనుకున్నాడో ఎమో కానీ ‘అమ్మా నన్ను దయచేసి అన్నా అని పిలవకు అని వేడుకున్నాడు’. దీంతో ఆమె ఇక నుంచి తారక్ గారూ అని పిలుస్తా అని తెలిపింది. దీనికి మిగతా హౌస్ మెట్స్ బయటకి కనిపించకుండా లోలోపల నవ్వుకున్నారు. ఈ టాస్క్‌లో రెండోస్థానాన్ని సమీర్ దక్కించుకున్నాడు. సమీర్ పొగడ్తలనే స్వీకరిస్తాడని కత్తి కార్తీక, జంతువుల గేమ్ టాస్క్‌లో సిగరెట్ రూం పక్కనే ఉన్న బోనులో కావాలనే వేసారని మధుప్రియ, సమీర్ ఎవ్వరినైనా లోబరుచుకోగలడు.. అందరూ తన మాట వినేలా చేసుకుంటాడని కత్తి మహేశ్‌లు కారణాలుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ వారం మధుప్రియ బిగ్ బాస్ నుంచి ఎలిమెనేట్ కాగా మరో కొత్త అతిథి రాబోతుంది. -
వే బిల్లులు లేకున్నా సరుకు రవాణా
అనంతపురం న్యూటౌన్ : జీఎస్టీపై ప్రభుత్వం నోటిఫై చేసే వరకూ వే బిల్లులు లేకున్నా ఇన్వాయిస్ ఉంటే సరుకు రవాణా చేసుకోవచ్చునని జిల్లాలోని డీలర్లకు రాష్ట్ర పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కల్పన సూచించారు. ఇన్వాయిస్లు కంప్యూటర్ ద్వారానే కాకుండా మాన్యువల్‌గా కూడా ఇవ్వొచ్చునని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పన్నుల శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కొత్త వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుందన్నారు. వ్యాట్ నుంచి జీఎస్టీ పరిధిలోకి ఇప్పటి వరకూ రానివారికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ నెల 1 నుంచి జీఎస్టీలో కొత్తగా రిజిస్ట్రేషన్ పొందినవారు పాత వ్యాట్ టిన్ నంబరుతో ఇన్వాయిస్ ఇవ్వొచ్చన్నారు. జీఎస్టీకి సంబంధించి ఏమీ సందేహాలున్నా నేరుగా తమ శాఖలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
టీవీ నటి కిరాతకం
బెంగళూరు : టీవీ సీరియళ్లకు ఏమాత్రం తీసిపోని కథ ఇది. బుల్లితెరపై నటిస్తున్న ఒక మహిళ సీరియళ్లలోని కుట్రలనే ఒంటబట్టించుకుంది. సహచరునితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తను పరలోకాలకు పంపించింది. ఆ మహిళను, ఆమె ప్రియుడిని నిన్న యశ్వంతపుర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు తుమకూరు నగరానికి చెందిన సతీష్ (36). అతని భార్య, టీవీ నటి కల్పన (27), ప్రియుడు జావేద్‌ను అరెస్టు చేశారు. సతీష నగరంలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సూపర్వైజర్. భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి యశ్వంతపురలోని సుబేదార్ పాళ్యలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కల్పన కన్నడ సీరియల్స్‌లో నటిస్తోంది. అక్కడే పరిచయమైన జావేద్‌తో అక్రమ సంబంధం కొనసాగుతోంది. దీనిపై సతీష్ ఆమెను పలుమార్లు మందలించాడు. దాంతో ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. 25వ తేదిన రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. తిన్న వెంటనే సతీష్ మత్తులో పడిపోయాడు. ప్రియుడు జావేద్‌ను పిలిపించి ఇద్దరూ కలిసి సతీష్‌ను సుత్తితో తలపైన కొట్టిచంపారు. తన భర్తను ఎవరో వచ్చి హత్య చేశారని విలపించింది. పోలీసులు అనుమానంతో కల్పనను అదుపులోకి తీసుకుని విచారించగా, సోమవారం అసలు విషయం బయట పెట్టింది. దాంతో పోలీసుల ఈ జంటకు బేడీలు తగిలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మున్సబ్పేట్ పరిధిలోని గురజాడ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కల్పన(17) అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపునొప్పి భరించలేకే హాస్టల్ రూంలో ఉరి వేసుకుని ఉంటుందని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తుంది. కల్పన స్వగ్రామం టెక్కలి మండలం తాళవలస. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కర విధులకు వెళ్తూ ఉద్యోగిని దుర్మరణం
కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తూ ఐసీడీఎస్ సూపర్వైజర్ కల్పన ద్విచక్రవాహనం చక్రంలో చున్నీ ఇరుక్కుపోయి కిందపడి మృతిచెందింది. ఈ సంఘటవ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మువ్వ ఘాట్ వద్ద విధులు నిర్వహించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆమె చున్నీ బండి చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో చున్నీ మెడకు బిగుసుకుని కల్పన అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కూతురి మూగవేదన చూడలేక...
నార్కట్‌పల్లి : పోలియో, మూగవేదనతో కన్న కూతురు పడుతున్న బాధను చూడలేక కూతురిని చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ తల్లి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. మునుగోడు మండల కేంద్రానికి చెందిన నాగరోని వెంకటేశ్వర్లు, కల్పన (అలియాస్) పారిజాత దంపతులకు కుమార్తె సుమశ్రీ (9), ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుమశ్రీ పుట్టుకతోనే పోలియో బారిన పడడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అంతే కాకుండా పుట్టు మూగ. ఐదేళ్ల క్రితమే వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కల్పననే వారి ఆలనాపాలన చూస్తోంది. కల్పన మూడేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సుమశ్రీని బాగు చేయించేందుకు ఆమె ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు. ఇటీవల తిరుపతిలో ఆయుర్వేదిక్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా నయం కాదని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి కల్పన సోమవారం సాయంత్రం కూతురిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి నార్కట్‌పల్లి మండలం వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న రైలు పట్టాల వద్దకు చేరుకుంది. రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక్క రైలు కూడా రాకపోవడంతో బ్లేడుతో కూతురు గొంతు గోసి, ఆపై తాను కూడా చేయి, గొంతు కోసుకుంది. విషయాన్ని తన మామ బక్కయ్యకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వారు 108 కు సమాచారం ఇవ్వగా వారిద్దరిని కామినేని ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న సుమశ్రీని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి కల్పన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కూతురు గొంతు కోసిన తల్లి
నార్కట్‌పల్లి మండలం గోపాలాయపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కూతురు గొంతు కోసి హతమార్చింది. వివరాలు..మునుగోడు మండలంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న నారగోని కల్పన అలియాస్ పారిజాతకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు పుట్టు మూగ ఆ తర్వాత పోలియో వచ్చింది. భర్త 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. కూతుర్ని డాక్టర్ల వద్ద చూపించినా పోలియో నయం కాలేదు. దీంతో కూతురు తనకు భారమైందని భావించిన కల్పన కూతుర్ని గోపాలాయపల్లి గ్రామంలోని శ్రీవారిజాల వేణుగోపాలస్వామి దేవాలయానికి ఒంటరిగా తీసుకువచ్చింది. అనంతరం కూతుర్ని బ్లేడుతో గొంతుకోసి తానూ గొంతుకోసుకుంది. అంతకు ముందే ఈ విషయాన్ని బంధువులకు తెలిపింది. బంధువులు 108 వాహనాన్ని తీసుకువచ్చి ఇద్దర్ని కామినేని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కూతురు సుమశ్రీ(9)ని హైదరాబాద్‌కు తరలించగా..చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
వరకట్న వేధింపులకు వివాహిత బలైంది. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తుండటంతో వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి కల్పన(26)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన దగ్గరి నుంచే శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెటర్ కల్పనకు ACA సన్మానం
-
'కల్పన'లా... గెలవాలిలా...
పదేళ్ల క్రితం... విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక పూరింట్లోకి వరద నీరు వేగంగా వచ్చి చేరుతోంది. ఓ మహిళ సామాన్లన్నీ చకచకా సర్దుతోంది. 9 ఏళ్ల చిన్న పిల్ల అక్కడే ఉంది. ‘ఇలా వచ్చి ఈ గిన్నె తీసుకోమ్మా’... అంటూ ఆ తల్లి పిలిచింది. ‘ఫర్లేదమ్మా విసిరెయ్... పట్టుకుంటా’ అని సమాధానం ఇచ్చింది ఆ పాప. ‘పడిపోతుందేమో’... తల్లి ఆందోళన చెందుతూనే విసిరింది. దూరంగా పడుతున్న ఆ గిన్నెను ఆ పాప చిరుతలా అందుకుంది. కట్ చేస్తే... ప్రస్తుతం... భారత మహిళల క్రికెట్లో ఎలాంటి బంతినైనా ఒడిసిపట్టుకునే వికెట్ కీపర్ వచ్చేసింది. ఆంధ్ర క్రికెట్ నుంచి తొలిసారి ఓ అమ్మాయి జాతీయ జట్టుకు ఎంపికైంది. 19 ఏళ్ల ఆ అమ్మాయి పేరు రావి కల్పన. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం... తండ్రి ప్రతిరోజూ కూలికి వెళితే గానీ ఐదు వేళ్లూ లోపలకి వెళ్లని నేపథ్యం... అయినా కల్పన తన క్రమశిక్షణ, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగింది. హ్యాట్సాఫ్... కల్పన..! ‘భారత జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఏడేళ్ల క్రితం వరదలు వచ్చి బస్టాండ్‌లో(పునరావాస కేంద్రంలో) తలదాచుకున్నప్పుడు... ఇలా ఓ క్రికెటర్ని అవుతాననే ఊహ కూడా లేదు. కోచ్‌లు ఈశ్వర్, శంకర్, శ్రీనివాసరెడ్డి, చిరంజీవి, బాపిరాజు అందరూ నాకు సహాయపడ్డారు. ఉమెన్ క్రికెట్ అకాడమీలో కోచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మారియా పాహే (న్యూజి లాండ్)లు ప్రత్యేక శ్రద్ధతో కోచింగ్ ఇచ్చారు. ఇక ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రోత్సాహం లేకపోతే నేను లేను. ఉచిత విద్యతో పాటు ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు ఉపకార వేతనం ఇచ్చారు. టోర్నీల్లో గెలిచినప్పుడు ప్రోత్సాహకాలు ఇచ్చారు. అప్పులు తీర్చుకున్నాం. నేను క్రికెట్ ఆడతా అంటే మా అమ్మానాన్న ఒక్కసారి కూడా ‘ఎందుకు’ అని అడ్డు చెప్పలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నాన్న నాకు కావలసినవి అన్నీ కొనిచ్చారు. ఇన్నాళ్లకి మా కష్టానికి ప్రతిఫలం లభించింది.’ - కల్పన ఏ క్రీడాకారుడికైనా దేశం తరఫున ఆడాలనేది కల. దానిని సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడతుంటారు. కొంతమందికి అన్ని సౌకర్యాలు ఉన్నా అనుకున్నది సాధించలేరు. కానీ రావి కల్పన మాత్రం 19 ఏళ్ల వయసులోనే భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. న్యూజిలాండ్‌తో బెంగళూరులో జూన్ 28 నుంచి జులై 8 వరకు జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో తొలిసారి భారత్ తరఫున ఆడబోతోంది. ప్రకాశం జిల్లా నుంచి పొట్టకూటి కోసం 16 ఏళ్ల క్రితం విజయవాడ వలస వచ్చిన ఓ కుటుంబం... వానొస్తే, వరదొస్తుందేమో అని భయపడ్డ ఓ కుటుంబం... అండగా నిలబడాల్సిన కుమారుడికి అంగవైకల్యం, కష్టాలతో కాపురం చేసిన కుటుంబం... ఇవాళ భారత జట్టుకు ఒక క్రికెటర్‌ను అందించింది. గుర్తించిన రవికాంతి, రమేశ్ 2008-09 సీజన్లో గుంటూరులో బీసీసీఐ మహిళా క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. దీనికోసం క్రీడాకారిణులను ఎంపిక చేయాలని భావించారు. అప్పుడు కల్పన... బిషప్ అజరయ్య (సీఎస్ఐ మిషనరీ చర్చి) బాలికల హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. వయసు 13 ఏళ్లు. స్కూల్ పక్కనే ఉన్న మున్సిపల్ స్టేడియంలో సెలక్షన్స్ జరుగుతోంటే కల్పన వెళ్లింది. కల్పన ఫిట్నెస్, చురుకుదనాన్ని రవికాంతి (కృష్ణాజిల్లా సంఘం మహిళా కో ఆర్డినేటర్), కోకా రమేశ్ (సెంట్రల్ జోన్ కార్యదర్శి) గుర్తించారు. ఆమెను అకాడమీలోకి తీసుకున్నారు. అంతే... కల్పన జీవితం పెద్ద మలుపు తిరిగింది. ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా తను అలసిపోయేది కాదు. దీంతో కోచ్‌లు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి శిక్షణ ఇచ్చారు. 2009లో క్రికెట్లో చేరింది. ఏడాదిలోనే ఆంధ్ర క్రికెట్ సంఘం అండర్-16 జట్టుకు ఎంపికయ్యింది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. అండర్-19, సీనియర్స్ అన్ని జట్లలోనూ ఆడింది. తను ఆడిన ఏ టోర్నీలో అయినా తనే ఉత్తమ వికెట్ కీపర్. బీసీసీఐ ప్రతి ఏటా నిర్వహించే చాలెంజర్స్ ట్రోఫీలో 2012 నుంచి 2015 వరకు ప్రతి ఏడాదీ తనే ఉత్తమ వికెట్ కీపర్. దీంతో భారత జట్టులోకి ఎంపికైంది. ప్రస్తుతం కల్పన నలంద కళాశాలలో డిగ్రీ చదువుతోంది. - ఆలూరి రాజ్‌కుమార్ - (సాక్షి స్పోర్ట్స్, విజయవాడ) నాన్నకు సలామ్ ప్రకాశం జిల్లా హెచ్.ఎం.పాడు మండలంలోని పెద్ద దాసళ్ల పల్లె గ్రామం నుంచి కల్పన కుటుంబం బతుకుదెరువు కోసం విజయవాడకు వలస వచ్చింది. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ముఠా కూలీగా పనికి చేరాడు. తల్లి బాల కోటేశ్వరి ఇంట్లోనే ఉండేది. కల్పన అన్నయ్య రవి పోలియో కారణంగా నడవలేడు. చెల్లి కావ్య మరీ చిన్నది. చాలా వలస కుటుంబాల్లాగే వెంకటేశ్వర్లు కూడా కృష్ణలంక కరకట్ట మీద కృష్ణా నది ఒడ్డున ఒక పూరిల్లు అద్దెకు తీసుకుని బతుకు బండిని ఈడ్చేవాడు. కృష్ణానదికి ఎప్పుడు వరద వచ్చినా ఇంట్లోకి నీళ్లొచ్చేవి. వెంటనే ఖాళీ చేసి మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపోవాలి. బస్టాండ్ దగ్గరో, మున్సిపల్ స్టేడియంలోనే ఆశ్రయం తీసుకోవాలి. మళ్లీ వరద తగ్గాక వచ్చి ఆ పూరింటినే బాగు చేసుకుని ఉండాలి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు. కూలికి వెళితే తప్ప పూట గడవని స్థితి. అయినా వెంకటేశ్వర్లు ఎప్పుడూ బాధ పడలేదు. తన పిల్లలే తన జీవితం అనుకున్నాడు. క్రమంగా వయసు మీద పడుతుండటంతో కూలీగా పని చేయలేనని అర్థమైంది. అప్పటి ఓనర్ల సహకారంతో ఒక ట్రాలీ ఆటో కొనుక్కున్నాడు. ఆ తర్వాత క్రమంగా దానిని పాసింజర్ ఆటోగా మార్చుకున్నాడు. వానొచ్చినా, ఎండ మండినా విజయవాడలో రోజూ ఆటోలో తిరగాల్సిందే. అయినా ఎప్పుడూ ఆయన చిరునవ్వుతోనే ఉండేవాడు. ఇప్పటికీ ఈ కుటుంబానికి ప్రధాన ఆధారం ఆ ఆటోనే. ఇలాంటి ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పిల్లల్ని చదివించడమే గొప్ప. అలాంటిది క్రికెట్ ఆడతానంటే ప్రోత్సహించాడు. ప్రాక్టీస్‌కు తన ఆటోలోనే తీసుకెళ్లి దించేవాడు. ఇవ్వాళ ఆ తండ్రి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. కూతురు భారత క్రికెట్ జట్టుకు ఎంపికైనప్పుడు ఆ తండ్రి సంతోషాన్ని మనం వర్ణించగలమా..! అందరి పిల్లల మాదిరిగా క్రికెట్ అంటే ఇష్టపడింది అనుకున్నాను. ఎప్పుడూ బాగా ఆడుతుందని తెలుసు. ఈ స్థాయికి వస్తుందని ఏనాడూ కలలో కూడా ఊహించలేదు. చిన్నతనం నుంచే నాకు చేదోడు వాదోడుగా ఉంటూ బాధ్యతగా ప్రవర్తించేది. చాలా సంతోషంగా ఉంది. -వెంకటేశ్వర్లు (కల్పన తండ్రి) కల్పన చాలా క్రమశిక్షణతో ఉంటుంది. ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా అలసిపోదు. కోచ్ చెప్పింది తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ఆట మీద ప్రేమ, సాధించాలనే తపన వల్లే భారత జట్టుకు ఎంపికైంది - బీసీసీఐ ఉమెన్ అకాడమీ కోచ్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి -
భారత జట్టులో కల్పన
న్యూజిలాండ్‌తో మహిళల సిరీస్‌కు ఆంధ్ర క్రికెటర్ సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టులో ఆంధ్ర క్రీడాకారిణి ఆర్. కల్పనకు స్థానం లభించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌వుమన్ అయిన కల్పన మొదటి సారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకుంది. ఆంధ్ర తరఫున ఒక మహిళా క్రికెటర్ భారత జట్టుకు ఎంపిక కావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్, కివీస్‌ల మధ్య ఈ నెల 28నుంచి బెంగళూరులో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. కల్పనను ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు సోమయాజులు, కార్యదర్శి గంగరాజు తదితరులు అభినందించారు. -
రాజేంద్రప్రసాద్‌కు అక్కినేని పురస్కారం
గుంటూరు: సాంస్కృతిక సంస్థ దాసరి కల్చరల్ కళాదర్బార్ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేశారు. పొత్తూరి రంగారావు ఆధ్వర్వంలో ఆదివారం రాత్రి గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళాదర్బార్ కల్చరల్ అవార్డుల ప్రదానం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారాన్ని సినీ నటుడు రాజేంద్రప్రసాద్, శోభన్ బాబు పురస్కారాన్ని శ్రీకాంత్, ఘంటసాల పురస్కారాన్ని గాయని కల్పన, సౌందర్య పురస్కారాన్ని సురేఖవాణి, బాపు పురస్కారాన్ని యలమంచలి సాయిబాబు అందుకున్నారు. వేటూరి పురస్కారాన్ని భాస్కరభట్ల, శ్రీహరి పురస్కారాన్ని అజయ్, ఏవీఎస్ పురస్కారాన్ని ఎంఎస్ నారాయణ అందుకున్నారు. వీరికి శాలువ, జ్ఞాపికలను అందజేసి వెండి కిరీటంతో ఘనంగా సన్మానించారు. -
ప్రేమ విఫలమై...
ప్రేమ విఫలమై యువకుడు.. ప్రియుడు మోసం చేయడంతో యువతి పురుగుల మందు తాగి తనువు చాలించారు.. తాను ప్రేమించిన యువతికి పెళ్లి సంబంధం కుదరడంతో తట్టుకోలేని యువకుడు.. అయినా తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు.. దీనికి ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.... కాగా, ప్రేమించిన ప్రియుడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తనకు చావే దిక్కనుకుంది.. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. నర్సంపేట : ప్రేమ విఫలమై ఓ యుువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నర్సం పేట వుండలంలోని ఇటుకాలపల్లి గ్రావుం లో శుక్రవారం జరిగిం ది. స్నేహితులు, స్థాని కులు, పోలీసులు కథనం ప్రకారం... ఇటుకాలపల్లికి చెందిన ఏదునూరి కువూర్, సుశీల దంపతుల కుమారుడు నరేష్(23) పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చ దువుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రావూనికి చెందిన ఓ యుువతితో అతడికి మూడేళ్ల క్రితం ఏర్పడిన పరిచయుం ప్రేమగా మారింది. కొద్దిరోజుల క్రితం సదరు యుువతి తల్లిదండ్రులకు విషయం తెలియుడంతో ఇరు కుటుంబాల మ ధ్య గొడవలు జరిగాయీ. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆ యుువతికి పెళ్లి సంబంధం కుదిరింది. విషయుం తెలుసుకున్న నరేష్ శుక్రవారం వుధ్యాహ్నం తమ చేను వద్దకు ఆ యుు వతిని పిలిచి తనను పెళ్లి చేసుకోవాలని కోరా డు. అందుకు ఆమె నిరాకరించడంతో సూసైడ్ నోట్ రాసి చేనులో ఉన్న పురుగుల వుందు తా గాడు. గవునించిన చుట్టుపక్కల వారు నర్సంపేట ఏరియూ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ వుృతిచెందాడు. వుృతుడి తం డ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాబులాల్ తెలిపారు. నరేష్ వుృతితో కుటుంబంలో విషాదఛాయులు అలువుుకున్నారుు. వుృతుడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురుని కంటతడి పెట్టించారుు. పరుశురాంపల్లిలో యువతి గణపురం : ప్రేమకాటుకు మరో అబల కాటికి చేరింది. ప్రియుడు మోసం చేయడంతో చావే శరణ్యమనుకున్న ఓ యువతి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గణపురం మండలంలోని ధర్మారావుపేట శివారు పరుశురాంపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం... పరుశురాంపల్లికి చెందిన రాచకొండ భాగ్యలక్ష్మి, శంకరయ్య దంపతుల రెండో కూతురు కల్పన(21) అదే గ్రామానికి చెందిన ప్రేమికుడు మోసం చేశాడని జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలు మూడు నెలల గర్భవతి అని బంధువులు తెలిపారు. సమాచారం మేరకు గణపురం పోలీసులు సదరు ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. గణపురం ఎస్సై రవికుమార్‌ను వివరణ కోరగా.. కల్పన క్రిమిసంహారక మందుతాగి మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు కల్పన తరఫు వారు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం
-
రెండు ప్రాణాలను బలిగొన్న క్షణికావేశం
*పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం *అక్కడికక్కడే భార్య.. చికిత్స పొందుతూ భర్త మృత్యువాత *చండూరు మండల కేంద్రంలో ఘటన చండూరు: క్షణికావేశంతో భార్యభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన చండూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాతాల రఘు(32) హైదరాబాద్‌కు చెందిన కల్పన(28)ను 3సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. రఘు వృత్తిరీత్యా వైద్యుడు. మండల కేంద్రంలోనే సంజీవిని వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. వీరికి 11నెలల కూతురు(చిన్ని) ఉంది. కాగా భార్యాభర్తలిద్దరూ ఇటీవల కొన్ని రోజులుగా కుటుంబ విషయాల్లో గొడవ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో కల్పన పత్తిపంటకు వాడే మోనోక్రొటోఫాస్‌ను తాగింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనను చూసిన భర్త రఘు తట్టుకోలేక మిగిలిన మందును తాగాడు. ఆపస్మారక స్థితికి చేరిన అతడిని నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రఘు కూడా మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
ఎందుకీ అఘాయిత్యం?
మైనర్ ప్రేమికుల ఆత్మహత్యాయత్నం అబ్బాయి మృతి, చావుబతుకుల్లో బాలిక రావికమతం: అంతుబట్టని కారణంతో మైనారిటీ తీరని బాలుడు, బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో బాలుడు మృతి చెందగా, బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంది. పి.పొన్నవోలు శివారు పెదకుముందానిపేట గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ ప్రేమికులు బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ప్రియుడు మృతిచెందగా, బాలిక విశాఖలోని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పెద్దలకు కనీసం తెలియని ఈ ప్రేమ వ్యవహారంపై ఎవ్వరేమన్నారో తెలియదుగానీ తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకుని వీరు కన్నవారికి కన్నీరు మిగిల్చారు. ఇంతకీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. గ్రామానికి చెందిన నరేంద్ర (17), సమీపంలోనే నివాసం ఉంటున్న కల్పన(14) కొంతకాలంగా ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. కల్పన మేడివాడ హైస్కూల్లో ఏడో తరగతి పూర్తి చేసింది. నరేంద్ర గతంలో ఎనిమిది వరకూ చదివి ఖాళీగా ఉంటున్నాడు. బధవారం రాత్రి వీరిరువురూ కొత్తకోటలోని కల్పన తాతగారింటికి వచ్చారు. వారు ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడికి సమీపంలోని హైస్కూల్ గ్రౌండ్‌కు వెళ్లారు. అప్పటికే కొని సిద్ధంగా ఉంచుకున్న గుళికలు మింగేశారు. కాసేపటికి గింజుకుంటూ వారి బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉభయుల బంధువులూ అక్కడికి చేరుకుని వెంటనే నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా నరేంద్ర మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కల్పన అపస్మారక స్థితికి చేరుకోవడంతో నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రథమ చికిత్సచేసి ఆపై విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతోంది. తహశీల్దార్ భాస్కరరావు ఆ గ్రామం వెళ్లి విచారించారు. వారిద్దరూ ఎపుడూ కలిసి ఉన్నట్లు కూడా చూడలేదని, ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని అక్కడివారు తహశీల్దార్‌కు వివరించారు. కొత్తకోట ఎస్ఐ శిరీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'అధికారమే పరమావధిగా బాబు కుట్రలు పన్నారు'
-
కాంగ్రెస్ నాయకురాలిపై రెండు కేసులు
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: చెన్నై అన్నానగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అన్నానగర్ పాడికుప్పం ప్రాంతానికి చెందిన కల్పన (45) కాంగ్రెస్ నిర్వాహకురాలు. రెండేళ్ల ముందు శ్రీపెరంబుదూరుకు చెందిన పారిశ్రామిక వేత్త సంతానం కుమారుడు నవీన్‌కుమార్ (21)కి ఇంజినీరింగ్ కళాశాలలో సీటు తీసి ఇస్తానని *4.5 లక్షలు కల్పన తీసుకుంది. కానీ సీటు తీసివ్వలేదు. నవీన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసి కల్పనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కల్పనపై మరో కేసు పాడి మన్నూర్ పేటకు చెందిన రూబి (47) బుధవారం తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో చెన్నై ఈస్టు కోస్టు రోడ్డులో ఇల్లు తీసి ఇస్తానని చెప్పడంతో రెండు విడతలుగా 23 లక్షల నగదును తన కుమార్తె మేరీతో కలిసి కల్పనకు ఇచ్చాను. కాని ఇల్లు తీసి ఇవ్వలేదు. దీంతో నగదు తిరిగి ఇవ్వాలని కోరాం. అందుకు ఆమె *23 లక్షలకు చెక్ ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో పోలీసులు కల్పనపై మరో కేసు నమోదు చేశారు. -
జగన్ విజయాన్ని అడ్డుకోలేరు
పమిడిముక్కల, న్యూస్‌లైన్ : చంద్రబాబునాయుడు వంటి కుహనా నేతలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ...దివంగత మహానేత తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత, జననేత జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. వీరంకిలాకులోని కళ్యాణమండపంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కల్పన మాట్లాడుతూ వెఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. మండలానికి చెందిన పలువురు ప్రముఖులతో సహాదాదాపు 200మందికి పైగా వెఎస్సార్సీపీలో చేరారు. వారికి కల్పన పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరావు , మండలకాంగ్రెస్ అధ్యక్షుడు దండమూడి బాపూజీ , డీసీసీ ప్రధానకార్యదర్శి పి.చంద్రపాల్, మండల కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి పి.యేషయ్యబాబు, వేల్పూరు సర్పంచి టి.బోసుబాబు, మండలకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టి.యేసుబాబు, మేడూరు ఎంపీటీసీ అభ్యర్థి డి.వెంకటదుర్గారావు , పమిడిముక్కల ఎంపీటీసీ అభ్యర్థి శొంఠి నాగేశ్వరావు, హనుమంతపురం ఎంపీటీసీ అభ్యర్థి వై.వీరవెంకటేశ్వరావు , కిష్ణాపురం ఎంపీటీసీ అభ్యర్థి వీరంకి చిరంజీవి , కాంగ్రెస్పార్టీనాయకులు బి.రమేష్, కూచిపూడి వెంకటేశ్వరావు, అబ్ధుల్నజీర్ , ఎన్.రాజ్యలక్ష్మి, తిమోతి, యేసుపాదం, సంగీతరావు, కాకాని, ఎన్.కుటుంబరావు, కె.మాధవ, పి.దశరద, పి.రామ్మెహన్, అరిగె రమేష్‌లతోపాటు పెనుమత్స, హనుమంతపురం తదితర గ్రామాలకు చెందిన వందలాదిమంది పార్టీలో చేరారు. కల్పన మాట్లాడుతూ పార్టీలో చేరినవారికి ప్రాధాన్యత కల్పిస్తామని హమీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్ ఆశయసాధనకు పాటుపడుతున్న జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆశతోనే వైఎస్సార్సీపీలో చేరామని శొంఠి వెంకటేశ్వరావు, బాపూజీ తెలిపారు. మండలంలో పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా పాటుపడతామని తెలిపారు. మండలంలోని ప్రముఖ నాయకులంతా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యేగా తననూ, ఎంపీ అభ్యర్థిగా కె. విద్యాసాగర్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కల్పన కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి బొబ్బా సురేష్‌ను మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. మాజీ ఎంపీపీ లోయరామశాస్త్రి, సర్పంచులు పి.విజయరాణి, జి.నాగమల్లేశ్వరావు, పార్టీనాయకులు అజీజ్, పి.మేరీ, మహేష్, సతీష్, నాగేంద్ర, రమేష్, బాలాజీ, రాజ్యలక్ష్మి,రజని, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి కూతురికి పువ్వుల శోభ
పుట్టినింటి బంగారుతల్లి, మెట్టినింట సిరులరాణిగా, మారే శుభతరుణాన సిరిమల్లెలదే ప్రధాన అలంకరణ. ముద్దబంతిలాంటి మోము ,ముచ్చటైన వేడుకకు మురిసేవేళ గులాబీలదే అసలైన అలంకరణ. ఇంతుల నాజూకు చేతుల్లో వరసలుగా రూపుకట్టిన చామంతులదే చూడచక్కని అలంకరణ. మల్లెలు, గులాబీలు, చామంతులు.. పూలతేరులా వధువు మేనికి సింగారంలా మారితే...‘ఎంతందంగా ఉన్నావే..’ అంటూ ఆమె నవ్వులతో పోటీపడటమే సిసలైన అలంకరణ. వివాహ వేడుకలలో పువ్వుల సుగంధాలదే పెద్దపీట. పెళ్లికి ముందు జరిపే సంగీత్, మెహిందీ సంబరాల్లో బంగార ం కన్నా వధువుకు పువ్వులనే ఆభరణాలుగా అలంకరించడం ట్రెండ్‌గా మారుతోంది. వధువుతో పాటూ వేడుకలో పాల్గొనే ప్రతి పడతీ పువ్వుల అలంకరణ పట్ల మక్కువ చూపుతోంది. ఉత్తరభారతదేశంలో మొదలైన ఈ కళ ఇప్పుడు దక్షిణభారతదేశపు తెలుగింటి లోగిళ్లలోనూ సందడి చేస్తోంది. పువ్వుల ఎంపిక: బంతి, చామంతి, లిల్లీ, మల్లెమొగ్గలు, గులాబీలు.. ఏ పువ్వులనైనా ఆభరణాల అలంకరణకు ఎంచుకోవచ్చు. మెడలో హారాలు, చెవి లోలాకులు, వేళ్లకు ఉంగరాలు, కాళ్లపట్టీలు, గాజులు.. అన్నీ పువ్వులే! అయితే ధరించిన దుస్తుల రంగుకు సూటయ్యేలా పువ్వుల ఎంపిక ఉండాలి. ఆభరణాల తయారీకి ఎంపిక... ఎంపికచేసుకున్న పువ్వులు, కుందన్స్ పొదిగిన లాకెట్స్, చమ్కీ, పూసలు, ముత్యాలు, బంగారు వర్ణపు లేసు, ఇతర ఆభరణాలు... ఇవన్నీ జతచేర్చడానికి సూది-దారం. మనిషి రూపురేఖలను బట్టి ఎంత పరిమాణంలో ఆభరణాలను తయారు చేయాలో ముందుగా కొలతలు తీసుకోవాలి. రకరకాల రూపాల్లో పువ్వుల ఆభరణాలను నచ్చిన విధంగా తయారు చేసుకున్నాక, వాటిని లేసుకు గుచ్చాలి. ఆ పైన నచ్చిన లాకెట్స్ జత చేయాలి. చిన్న చిన్న లాకెట్స్లా రూపొందించిన పువ్వులను ఇతర ఆభరణాలకూ అమర్చుకోవచ్చు. పువ్వుల ఆభరణాలకు విడిగా హుక్స్ అమర్చుకోవచ్చు. లేదా ఎలాంటి ఆభరణాలు అవసరం లేకుండా జరీ దారాలతోనూ కట్టేసుకోవచ్చు. నోట్: పువ్వుల ఆభరణాలు త్వరగా వాడిపోకుండా తయారీలో మొగ్గలు ఎక్కువ ఉపయోగించాలి. చల్లదనం ఉంటే పువ్వులు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. మాఘమాసం పెళ్లి పందిళ్లు పువ్వుల అలంకరణతో మెరిసిపోతే... అతివల నగుమోము ఇలా పువ్వుల ఆభరణాల మధ్య మురిసిపోతుంది. - నిర్మలారెడ్డి మోడల్: గ్రీష్మ, ఫొటోలు: శివమల్లాల - కల్పన పువ్వుల ఆభరణాల నిపుణురాలు www.pellipoolajada.com