ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Published Sat, Sep 3 2016 2:18 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మున్సబ్‌పేట్ పరిధిలోని గురజాడ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కల్పన(17) అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపునొప్పి భరించలేకే హాస్టల్ రూంలో ఉరి వేసుకుని ఉంటుందని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తుంది. కల్పన స్వగ్రామం టెక్కలి మండలం తాళవలస. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement