కృష్ణా పుష్కరాల్లో విధులకు వెళుతూ.. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కల్పన ప్రమాదవశాత్తు మృతి చెందింది.
కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తూ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కల్పన ద్విచక్రవాహనం చక్రంలో చున్నీ ఇరుక్కుపోయి కిందపడి మృతిచెందింది. ఈ సంఘటవ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మువ్వ ఘాట్ వద్ద విధులు నిర్వహించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆమె చున్నీ బండి చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో చున్నీ మెడకు బిగుసుకుని కల్పన అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.