భారత జట్టులో కల్పన
న్యూజిలాండ్‌తో మహిళల సిరీస్‌కు ఆంధ్ర క్రికెటర్
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టులో ఆంధ్ర క్రీడాకారిణి ఆర్. కల్పనకు స్థానం లభించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌వుమన్ అయిన కల్పన మొదటి సారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకుంది. ఆంధ్ర తరఫున ఒక మహిళా క్రికెటర్ భారత జట్టుకు ఎంపిక కావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్, కివీస్‌ల మధ్య ఈ నెల 28నుంచి బెంగళూరులో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.
కల్పనను ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు సోమయాజులు, కార్యదర్శి గంగరాజు తదితరులు అభినందించారు.