ప్రేమ విఫలమై... | Love-sick failure...... | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై...

Published Sat, Dec 20 2014 2:47 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ప్రేమ విఫలమై యువకుడు.. ప్రియుడు మోసం చేయడంతో యువతి పురుగుల మందు తాగి తనువు చాలించారు.

ప్రేమ విఫలమై యువకుడు.. ప్రియుడు మోసం చేయడంతో యువతి పురుగుల మందు తాగి తనువు చాలించారు.. తాను ప్రేమించిన యువతికి పెళ్లి సంబంధం కుదరడంతో తట్టుకోలేని యువకుడు.. అయినా తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు.. దీనికి ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.... కాగా, ప్రేమించిన ప్రియుడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తనకు చావే దిక్కనుకుంది.. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
నర్సంపేట : ప్రేమ విఫలమై ఓ యుువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నర్సం పేట వుండలంలోని ఇటుకాలపల్లి గ్రావుం లో శుక్రవారం జరిగిం ది. స్నేహితులు, స్థాని కులు, పోలీసులు కథనం ప్రకారం... ఇటుకాలపల్లికి చెందిన ఏదునూరి కువూర్, సుశీల దంపతుల కుమారుడు నరేష్(23) పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్  చ దువుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రావూనికి చెందిన ఓ యుువతితో అతడికి మూడేళ్ల క్రితం ఏర్పడిన పరిచయుం ప్రేమగా మారింది. కొద్దిరోజుల క్రితం సదరు యుువతి తల్లిదండ్రులకు విషయం తెలియుడంతో ఇరు కుటుంబాల మ ధ్య గొడవలు జరిగాయీ. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆ యుువతికి పెళ్లి సంబంధం కుదిరింది. విషయుం తెలుసుకున్న నరేష్ శుక్రవారం వుధ్యాహ్నం తమ చేను వద్దకు ఆ యుు వతిని పిలిచి తనను పెళ్లి చేసుకోవాలని కోరా డు. అందుకు ఆమె నిరాకరించడంతో సూసైడ్ నోట్ రాసి చేనులో ఉన్న పురుగుల వుందు తా గాడు. గవునించిన చుట్టుపక్కల వారు నర్సంపేట ఏరియూ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ వుృతిచెందాడు. వుృతుడి తం డ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాబులాల్ తెలిపారు. నరేష్ వుృతితో కుటుంబంలో విషాదఛాయులు అలువుుకున్నారుు. వుృతుడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురుని కంటతడి పెట్టించారుు.

పరుశురాంపల్లిలో యువతి

గణపురం : ప్రేమకాటుకు మరో అబల కాటికి చేరింది. ప్రియుడు మోసం చేయడంతో చావే శరణ్యమనుకున్న ఓ యువతి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గణపురం మండలంలోని ధర్మారావుపేట శివారు పరుశురాంపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం... పరుశురాంపల్లికి చెందిన రాచకొండ భాగ్యలక్ష్మి, శంకరయ్య దంపతుల రెండో కూతురు కల్పన(21) అదే గ్రామానికి చెందిన ప్రేమికుడు మోసం చేశాడని జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలు మూడు నెలల గర్భవతి అని బంధువులు తెలిపారు. సమాచారం మేరకు గణపురం పోలీసులు సదరు ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. గణపురం ఎస్సై రవికుమార్‌ను వివరణ కోరగా.. కల్పన క్రిమిసంహారక మందుతాగి మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు కల్పన తరఫు వారు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement