యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల మిస్టరీకి సంబంధించి కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా విచారణలో తన దారుణాల గుట్టు విప్పాడు. శ్రావణి, మనీషా, కల్పన.. ఇలా ముగ్గురు విద్యార్థినులను తానే హత్య చేశానని, వారిపై కిరాతకంగా లైంగిక దాడులు జరిపి మరీ చంపేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.